మేడారం జనసంద్రమైంది.. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది.
సమ్మక్క కో..సారక్క కో అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. పవిత్రమైన మాఘశుద్ధ శుక్రవారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో ఎక్కువ మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం నుంచి తాడ్వాయి, పస్రాలకు వెళ్లే రెండు మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది.
మేడారం నుంచి తాడ్వాయి వెళ్లే అటవీ మార్గంలో సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.


