breaking news
medaram
-
సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)
-
‘సీతక్క పారిపోయే రకం కాదు’
మేడారం(ములుగు జిల్లా): మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో మా ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే ఆదివాసి బిడ్డనని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తాను పారిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారాల చేశాయని, సీతక్క పారిపోయే రకం కాదన్నారు. భక్తులు, ప్రజల కోసం పంతం నెగ్గించుకునే రకం తానన్నారు. మేడారంలో మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ‘తనువెల్ల ఆదివాసి అస్తిత్వాన్ని, నిలువెల్లా ఆత్మగౌరవాన్ని, తల్లుల పట్ల భక్తిని కలిగి ఉన్న వ్యక్తిని నేను. మేడారం జాతర దిగ్విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు చేసే కుట్రలకు భయపడే రకం కాదుజాతరను విజయవంతం చేసిన విధంగానే జాతర తర్వాత చేపట్టాల్సిన పనులను పూర్తి చేస్తున్నాం. ఐదువేలకు పైగా పారిశుద్ధ్య సిబ్బంది నియమించి మేడారాన్నీ పరిశుభ్రపరుస్తున్నాము. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు. విఐపిల తాకిడి వల్ల ట్రాఫిక్ జామ్ అయిందిఆ ట్రాఫిక్ జామ్ లో ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోయాయి. గట్టమ దేవాలయం వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకున్నాము. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత సమ్మక్కకు రావటం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నివారించాం. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ దఫా నివారించగలిగాము. భక్తితో బాధ్యతతో సంయమనంతో దైవ దర్శనానికి రండి అని భక్తులకు మేము చేసిన విజ్ఞప్తి పనిచేసిందిబ్రహ్మాండంగా జాతరను నిర్వహించుకున్నాము. అందరికీ అభినందనలు. సమ్మక్క సారలమ్మతో మాకు భావోద్వేగా బంధం ఉంది అందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టాము. గుడి నిర్మాణ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాము. గుడి నిర్మాణం జాతరకు ముందే పూర్తయింది. గతంలో జాతరకు ముందు రోజుకు ఒకటి రెండు లక్షల మంది భక్తులే వచ్చేవారు. కానీ కొత్త గుడి నిర్మాణం తర్వాత ఓకే రోజూ 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గతంలో తాత్కాలికంగా పనులు జరిగేవి కానీ ఈ దఫా శాశ్వత పద్ధతిలో పనులు పూర్తి చేయడం వల్ల భక్తులు విపరీతంగా తరలివచ్చారు. త్రాగునీరు టాయిలెట్స్ ముందస్తుగానే సిద్ధం చేశాం. సమ్మక్కను సకాలంలో గద్దెల మీదకు తీసుకురావడంలో పూజారులు సహకరించారు.. వారికి ధన్యవాదాలు. కొంతమంది కొత్త పోలీస్ సిబ్బంది పూజారులను గుర్తించకపోవడం వల్ల పొరపాటు జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇబ్బందులకు గురిచేయలేదు’ అని పేర్కొన్నారు. -
వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
"లక్షలాది ప్రయాణికులను సురక్షితంగా చేరుస్తున్నాం"
సాక్షి ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని తిరిగి గమ్యస్థానాలకు వెళ్తున్న భక్తులకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చడానికి ఆర్టీసీ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ నుండి అధికారులు కింది స్థాయి సిబ్బంది సైతం క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ ఆర్టీసీ బస్ స్టేషన్ లో అధిక రద్దీ కారణంగా క్యూలైన్ లలో ప్రయాణికులు ఇబ్బందులపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్క తో పాటు డీజీపీ,ఆర్టీసీ ఎండీ ,జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. ప్రస్తుతం మేడారంలో ఉన్న పరిస్తితి పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రయాణికులను మేడారం తీసుకొస్తున్న బస్సులు కొద్దిసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల మేడారం బస్ స్టేషన్ లో గమ్యస్థానాలకు వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయని ఈ సందర్భంగా మంత్రికి పోలీసులు సూచించారు. దీంతో వెంటనే వాటిని క్లియర్ చేసి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయాలని క్లియరెన్స్ చేస్తూ వాహనాల వేగాన్ని పెంచాలని ఈ సందర్భంగా మంత్రి వారికి సూచించారు. -
సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)
-
జన సంద్రంగా మారిన మేడారం.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతర నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. శుక్రవారం వేకువ జామున సమక్క, సారలమ్మలను దర్శించుకునేందుకు భక్త జనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో వేలాది వాహనాలు తరలి వస్తుండగా.. కిలోమీటర్ల మేరన ట్రాఫిక్ జామ్ అయ్యింది. మేడారం వీధులన్నీ సమక్క, సారలమ్మ నామఃస్మరణలతో మారుమోగుతోంది. తమను, తమవాళ్లను చల్లంగా చూడాలంటూ వన దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకోంటున్నారు. రేపు సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలోఈ రెండ్రోజుల్లో లక్షల మంది జాతరకు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. వీఐపీల తాకిడి..మేడారం మహాజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తులాభారం వేసి తల్లులకు నిలువెత్తు బంగారం(బెల్లం) పంచిపెడుతున్నారు. తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.పోలీసుల ఓవర్ యాక్షన్వీఐపీ భద్రత పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి స్పెషల్ గేట్ ద్వారా వందలాది పోలీసులు సమ్మక్క- సారలమ్మ గద్దెల వైపు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తల్లుల దర్శనం కావడం లేదు. గద్దెల ప్రాంగణమంతా పోలీసులే ఉండడంతో.. అడ్డు తొలగాలని స్థానిక అధికారులు పదే పదే మైకుల్లో చెప్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. వీఐపీలు అరకోరగా వస్తున్నప్పటికీ.. వాళ్ల భద్రత పేరిట పోలీసులు అతికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సమ్మక్క తల్లి నామస్మరణతో..చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్కను తీసుకువచ్చే జాతర ప్రధాన ఘట్టం గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమై.. రాత్రి 9:58గంటలకు గద్దెపై సమ్మక్క తల్లిని ప్రతిష్ఠించే వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. అడవి తల్లి రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలకలగుట్ట వైపు చూశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయత్వంతో ఒక్క ఉదుటున గుట్ట దిగారు. మిగిలిన పూజారులు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా, అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఏకే–47 తుపాకీతో 4 విడతలుగా గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క తల్లి నామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. -
మేడారం మహా సంబరం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
గద్దెపైకి సమ్మక్క తల్లి
-
మనం మురవంగా జనం కొలువంగా
మేడారం నుంచి సాక్షిప్రతినిధి, వరంగల్: కోట్లాది భక్తుల కొంగుబంగారం.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలు..సబ్బండ జనాల ఆరాధ్యదైవాలు..సమ్మక్క–సారలమ్మల మహాజాతర అంగరంగవైభవంగా ప్రారంభమైంది. అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో జయజయధ్వానాల భక్తినినాద హోరులో ఆధ్మాత్మిక ఘనసంరంభం మొదలైంది. బుధవారం సారలమ్మ ఆగమనం క్షణక్షణం అత్యంత ఉద్విగ్నభరితంగా సాగింది. భక్తుల పొర్లుదండాలు..శివసత్తుల పూనకాలు..కొమ్ము, బూర, డోలు వాయిద్యాల మధ్య సారలమ్మ తల్లి గద్దెను చేరడంతో భక్తజనం పులకించిపోయారు.కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి నుంచి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయలుదేరారు. జంపన్నవాగులో నీటితో కాళ్లు కడుక్కుని అక్కడి నుంచి సమ్మక్క గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి పూజారులు ముగ్గురి రూపాలను రాత్రి మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మ వస్తున్న వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటీపడ్డారు. కోరిన కోరికలు నెరవేర్చే వనదేవత సారలమ్మ మేడారం గద్దెపై కొలువుదీరారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది.ఆచారాల నడుమ ఆగమనం.. ఎదురేగిన భక్తజనం..ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం సారలమ్మ యేతేంచగా... అడుగడుగునా అశేషంగా తరలివచ్చిన భక్తజనం ఎదురేగారు. బుధవారం ఉదయం 11:00 నుంచి 12:00 గంటల మధ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు. గొట్టు గోత్రాల ప్రకారం, ఆదివాసీ సంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి బయలుదేరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గోవిందరాజు, పగిడిద్దరాజులు సారలమ్మతో కలిసి గుడికి వెళ్లారు. సారలమ్మ పూజారులు గుడిలో సారలమ్మ పీఠం పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు నిర్వహించారు. సమ్మక్క పూజారులు కూడా కట్టడి పూజలు చేశారు. అనంతరం మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవారు, పగిడిద్దరాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కల్యాణ మహోత్సవం నిర్వహించారు. తదనంతరం తల్లి అనుమతి తీసుకున్న సారలమ్మతో పాటు గద్దెలకు చేరిన గోవిందరాజు, పగిడిద్దరాజులను పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. ఈ సమయంలో దేవాదాయశాఖ అధికారులు పూజా కార్యక్రమాల సమయంలో విద్యుత్ దీపాలను ఆర్పివేయడంతో పూజారులు పూజా, ప్రతిష్ట క్రతువును పూర్తి చేశారు.వరంబట్టిన మహిళలు..కన్నెపల్లి నుంచి హనుమంతుడి రక్షా కవచం (నీడ)లో సారలమ్మ దేవత బయలుదేరి, రాత్రి మేడారం గద్దెలకు చేరుకున్నారు. కాగా సారలమ్మ గద్దె పైకి వస్తున్న సమయంలో ఎదురెళ్లి వరం పడితే సంతానభాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేరతాయని మహిళల నమ్మకం. ఈ సందర్భంగా సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను మొంటెలో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. కాగా, సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు వీరిపై దాటివెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాకను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ముబూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాయి ద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తిభావంతో ఉప్పొంగింది. కాగా ప్రభుత్వం తరఫున రాçష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.నృత్యం చేసిన మంత్రులురాçష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెల వరకు ఆద్యంతం ఊరేగింపులో పాల్గొన్నారు. మేడారం గద్దెల వద్ద మంత్రులు, అధికారులు కలిసి నృత్యం చేశారు. కాగా, రాత్రి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అమ్మ వారిని దర్శించుకున్నారు.నేడు సమ్మక్క తల్లి రాక..జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం సమ్మక్క అమ్మవారు మేడారం గద్దెపైకి చేరడం. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క ప్రతిమను తీసుకొచ్చే ప్రక్రియ గురువారం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల సమయంలో గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, మరికొందరు పూజారులు చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ దివాకర్ టీఎస్ ఆధ్వర్యంలో ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత సమ్మక్క కుంకుమభరిణెతో పూజారులు బయల్దేరుతారు. ఆ సమయంలో భక్తులు... అమ్మవారు వచ్చే దారిలో పోటీపడి ఘన స్వాగతం పలుకుతారు. అదే సమయంలో సమ్మక్కకు ఎదురేగి కోళ్లు, మేకలతో మొక్కి బలిస్తారు. రాత్రి సమ్మక్కను ప్రతిష్టించాక భక్తుల మొక్కులు మొదలవుతాయి. శుక్రవారం నలుగురు వనదేవతలు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి తనివితీరా మొక్కులు చెల్లించుకుంటారు. -
Medaram Jathara: నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా అమ్మవార్లపై ఎనలేని విశ్వాసాన్ని చూపుతూ రెండేళ్లకొకసారి జరిగే మహాజాతరకు కుటుంబసమేతంగా హాజరై తల్లుల చెంత నాలుగు రోజుల పాటు ఆధ్మాత్మిక సేద్యం చేస్తుంటారు. బుధవారం జాతరకు వచ్చి శనివారం సాయంత్రం దాక నాలుగు రోజులు ఇక్కడే గడుపుతారు. అవసరమైన ఆహార సామగ్రి, ఇతర వంట సరుకులు తెచ్చుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చినందుకు యాటలను, కోళ్లలను బలిచ్చి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటారు. మేడారం జాతర జరిగే నాలుగు రోజుల పాటు పౌర్ణమి వెలుగుల్లో గుడారాలు వేసుకొని సమ్మక్క తల్లిని వేడుకుంటారు. 30ఏళ్లుగా జాతరకొస్తున్నాం..అడవి బిడ్డలైన సమ్మక్క–సారలమ్మను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 1998 నుంచి ప్రతీ రెండేళ్లకొసారి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటాం. అమ్మవార్ల మహిమను, మహాత్మ్యాన్ని స్నేహితులకు కూడా తెలియజేయడంతో వారు కూడా మేడారం జాతరకు వస్తున్నారు. అమ్మవార్లను నమ్ముకుంటే అనుకున్న పని జరుగుతుందని స్నేహితులు కూడా చెప్పారు.– దామెర రాజు, సికింద్రాబాద్అమ్మవారి ఆశీస్సులతో బాబు పుట్టాడు..తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి పెళ్లి కావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించాను. దీంతో మరుసటి జాతర వచ్చేలోపు వివాహం జరగడమే కాకుండా బాబు పుట్టాడు. దీంతో కుటుంబ సమేతంగా మేడా రం చేరుకొని బాబు పుట్టువెంట్రుకలను మేడారంలోనే తీశాం. 20 ఏళ్లుగా ప్రతీ మేడారం జాతరకు వస్తూ ఎన్ని ఇబ్బందులైనా నాలుగు రోజుల పాటు మేడారంలో ఉండి అమ్మవార్లు గద్దెల పైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తున్నాం.– వెంకటగిరి కిశోర్‌బాబు, అమీర్‌పేట, హైదరాబాద్ నాలుగు రోజులు ఉంటం..16 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నాం. కష్టాలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటాం. కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం. కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవార్లకు యాటపోతులను బలిస్తాం. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారానికి కుటుంబంతో కలిసి రావడం ఆనందంగా ఉంటుంది. జాతరలో సౌకర్యాలు ఉన్నా లేకున్నా..నాలుగు రోజు పాటు ఉండి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తాం. సరిపడా వంట సరుకులు తెచ్చుకుంటాం. నాలుగు రోజులుంటేనే మనసు నిమ్మలంగా ఉంటుంది.– వరికుప్పల పుష్ప, పాలకుర్తి, జనగామఎటుచూసినా కోలాహలం..సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజు, తండ్రి పగిడిద్దరాజు ప్రతిమలను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం, కన్నెపల్లి, రెడ్డిగూడెం, జంపన్నవాగు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో సుమారు నాలుగైదు కిలోమీటర్ల పొడవునా దారులు కిక్కిరిసిపోయాయి. సారలమ్మ గద్దెపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో తోపులాట జరిగింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులుదీరుతున్నారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు దీరారు. భక్తుల తాకిడి గంట గంటకు పెరగడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. -
Medaram Jatara: మహా జాతరలో అనూహ్య ఘట్టం
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలి రోజు బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరాల్సి ఉండగా.. పూజారులు సమయపాలన పాటించినప్పటికీ అనివార్య కారణాలతో బుధవారం అర్ధరాత్రి 12:28 గంటల తర్వాత (గురువారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెలపైకి రానుంది. ఈ నేపథ్యంలో నలుగురు దేవతలను ఒకే రోజు (గురువారం) గద్దెలపై ప్రతిష్ఠించినట్లు అయ్యింది.పగిడిద్దరాజు పెళ్లికొడుకాయెనె..మేడారం(ఏటూరునాగారం): గంగారం మండలం పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై అడవిమార్గంలో కాలినడకన బయల్దేరారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో వారి ఆడబిడ్డ ఇంటి వద్దకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం పస్రా మీదుగా కాలినడకన డప్పుచప్పుళ్లతో మేడారానికి చేరుకున్నారు. మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మ వచ్చిన తర్వాత పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు కలిసి ఒకేసారి గద్దెలపై కొలువుదీరారు. నేడు వరాల తల్లి రాకఏటూరునాగారం: కోట్లాది మంది భక్తుల కొంగు బంగారమైన వరాల తల్లి సమ్మక్క గురువారం వనం వీడి జనం మధ్యలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్యతోపాటు ప్రధాన పూజారులు చిలకలగుట్టపైన ప్రత్యేకంగా రహస్య పూజలు నిర్వహించి గుట్టమీద నుంచి దిగుతారు. గుట్ట దిగే సమయంలో ఎస్పీ ఏకే 47 తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి అమ్మవారి ఆగమనానికి శ్రీకారం చుడతారు. డోలువాయిద్యాలు, కొమ్ము బూర శబ్దాలు, ధూపం, పోలీస్ బందోబస్తు, రోప్‌పార్టీ నడుమ అమ్మవారిని గుట్ట నుంచి మేడారం గద్దెల వైపు తీసుకొస్తారు. గుట్టకు గద్దెలకు మధ్యలో ఉన్న ఎదురుకోళ్ల మండపంలోకి తీసుకొచ్చి అక్కడ ఎదురుకోళ్లు నిర్వహిస్తారు. మేడారం ఆడబిడ్డలు సమ్మక్క తల్లికి ఎదురెళ్లి నీళ్లను ఆరబోసి స్వాగతం పలుకుతారు. సమ్మక్కను మేడారంలోని సమ్మక్క గుడిలోకి శక్తిపీఠం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. గుడి నుంచి గద్దెల మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో గుడిలోని విద్యుత్ దీపాలను నిలిపివేస్తారు. సమ్మక్క ఆగమనం సమయంలో వేలాది మంది భక్తులు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు మేకపోతులు, కోళ్లను బలిచ్చి స్వాగతం పలుకుతారు. అమ్మవారి నడిచే దారిలో అడుగడుగున రంగులతో ముగ్గులు వేస్తారు. చిలకలగుట్టపై పూజలు.. సమ్మక్క కొలువై ఉన్న చిలకలగుట్టపై మంగళవారం సమ్మక్క పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కోళ్లతో గుట్టపైకి వెళ్లి అక్కడ శాంతించే విధంగా పూజలు నిర్వహించారు. సమ్మక్క వచ్చే దారిని గుట్ట నుంచి ప్రధాన గేటు వరకు శుభ్రం చేశారు. సమ్మక్క ఆగమనానికి కావాలి్సన ఏర్పాట్లను సిద్ధం చేశారు. -
Medaram Jatara: గద్దెపై కొలువుదీరిన సారలమ్మ
మేడారం(ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి): రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్‌కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దెపై కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు.. కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం అర్ధరాత్రి తర్వాత మేడారం గద్దెపై కొలువుదీరింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, భుజంగరావు, అమృత, కనకమ్మతోపాటు మరికొంత మంది గుడిలో రహస్య పూజలు చేశారు. హనుమాన్ జెండా నీడలో అమ్మవారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, జాతర చైర్పర్సన్ ఇర్ప సుకన్యతోపాటు ఆదివాసీ యువకులు, మహిళలతో కలిసి సారలమ్మ యాత్ర కొనసాగింది. గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఎదురెల్లి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అమ్మవారిని తీసుకుని డోలు వాయిద్యాలతో ఆదివాసీలు, పోలీసుల రోప్ పార్టీ బందోబస్తు మధ్య అధికారంగా యాత్ర కొనసాగింది.దారి పొడవునా దండాలు..కన్నెపల్లి నుంచి సారలమ్మ బయల్దేరడంతో భక్తులు అమ్మవారి పాద స్పర్శ కోసం వరం పడుతూ నేలపై బోర్లా పడుకున్నారు. తల్లిని కనులారా చూసేందుకు మేడారం గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. అమ్మకు జేజేలు అంటూ పసుపును పైకి చల్లారు. సారలమ్మను జంపన్నవాగులో నుంచి తీసుకెళ్లారు. జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆనవాయితీగా అక్క సారలమ్మ కాళ్లను తమ్ముడు జంపన్న తాకి నమస్కరించినట్లుగా భావించి జంపన్న వాగులో నుంచి మాత్రమే సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తల్లి సమ్మక్క గుడిలోకి వెళ్లి అక్కడ పసుపు కుంకుమ్మ సమర్పించి సారలమ్మ పీఠంపై చీర, రవికను అందించారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకుగా వచ్చిన పగిడిద్దరాజుకు సమ్మక్క గుడిలో పెళ్లి క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెళ్లిని సారలమ్మ, గోవిందరాజులు తిలకించి పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరారు.కొలువుదీరే ముందు ప్రత్యేక పూజలుసారలమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పవిత్రమైన నీటిని తీసుకొని పూజారులు ఆడపడుచులు కలిసి మేడారంలోని సారలమ్మ గద్దెకు చేరుకొని అలికి ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారి ధ్వజస్తంభానికి కంకణాలు కట్టారు. భక్తులెవరూ చూడకుండా చీర చుట్టి పూజలు చేశారు. సాయంత్రం సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్క పూజారులు, ఆడపడుచులు కూడా మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమతో సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. నేడు (గురువారం) సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెపై రావడానికి ముందుగా పూజారులు సమ్మక్క గద్దెను మట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు. -
Medaram : భక్తులతో కిక్కిరిపోతున్న మేడారం గద్దె
-
వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్య
గంగారం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు చెందిన పగిడిద్ద రాజు పెళ్లి కొడుకయ్యాడు. సమ్మక్కను వివాహం చేసుకునేందుకు జిల్లాలోని ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారానికి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. ఈ మేరకు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో వడ్డెలు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి కల్తీ జగ్గారావు, పూజారులు పడిగను పట్టుకొని తరలివెళ్లారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు ఆరబోశారు. వరుడై వెళ్లి.. మరుబెల్లికి రావయ్యా అంటూ భక్తులు మొక్కులు చెల్లించారు. 70 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో రాత్రి బసచేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు మేడారంలోని గద్దెకు చేరుకుంటారు. సమ్మక్కతో వివాహం అనంతరం జాతర తర్వాత పగిడిద్దరాజు తిరిగి పూనుగొండ్లకు చేరుకుంటారు. రెండురోజుల అనంతరం మరుబెల్లి జాతరను పూనుగొండ్లలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని గిరిజనులు, గిరిజనేతరుల నమ్మకం. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయం వద్ద గిరిజన యువకులు వలంటీర్లుగా పనిచేశారు. మంత్రి ధనసరి సీతక్క ,మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్పర్సన్ సుకన్య, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి, డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు వినయ్, సూర్యప్రకాశ్, ఎస్సై రవికుమార్, రాజ్‌కుమార్, ఎండోమెంట్ ఈఓ వీరస్వామి, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ నారాయణరెడ్డి పూజలు చేశారు. -
వన మేడారానికి జనసాగరం
సాక్షి, హైదరబాద్: మహా నగరం మేడారం బాటపట్టింది. నేటినుంచి ఈ నెల 31 వరకు కొనసాగనున్న మేడారం మహా జాతరకు నగరవాసులు భారీసంఖ్యలో తరలి వెళ్లనున్నారు. అదనంగా 1,500 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్, చర్లపల్లి నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. కార్లు, మ్యాక్సీ క్యాబ్‌లు బారులు.. ఆరీ్టసీ, ప్రైవేట్ బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌లు తదితర ప్రైవేట్ వాహనాల్లోనే కాకుండా సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. దీంతో ఉప్పల్– వరంగల్ మార్గంలో రద్దీ పెరిగింది. రహదారులపై పెద్ద ఎత్తున కార్లు తదితర వాహనాలు బారులు తీరాయి. మరో నాలుగైదు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగనుంది. బస్సులు, రైళ్లు తదితర వాహనాల్లో మేడారం జాతర కోసం సుమారు 10 లక్షల మందికిపైగా నగరవాసులు తరలివెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా.ఎంజీబీఎస్‌లో చిన్నారులకు రిస్ట్ బ్యాండ్ అఫ్జల్‌గంజ్: లక్షలాది మంది భక్తులు తరలివెళ్లే మేడారం మహా జాతరలో పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేక భద్రత కోసం రిస్ట్ బ్యాండ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మహాత్మా గాంధీ బస్‌స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్ తెలిపారు. వోడాఫోన్ ఐడియా సహకారంతో రూపొందించిన రిస్ట్ బ్యాండ్‌లో క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రుల సంపూర్ణ సమాచారం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. పిల్లలు తప్పిపోయిన పక్షంలో సమీపంలోని వలంటీర్ల సహకారంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారు ఎక్కడ ఉన్నారో గుర్తించవచ్చు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని డీసీపీ సూచించారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ అదనపు డీసీపీలు కృష్ణగౌడ్, శ్యామ్‌బాబు, గోషామహల్ డివిజన్ ఏసీపీ సుదర్శన్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి, టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ జె.శ్రీలత పాల్గొన్నారు. -
జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్‌జామ్
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)
-
పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన మేడారం ప్రాంగణం
సాక్షి, ములుగు: మహా జాతరకు సమయం దగ్గర పడుతున్న వేళ.. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం మండమెలిగే పండుగ కావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ పండుగతోనే మహాజాతర పూజా కార్యక్రమాల తంతు మొదలు కానుందని తెలిసిందే.మేడారంలోని సమ్మక్క గుడిలో, కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో, ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువైన గోవిందరాజుల గుడిలో ఇవాళ మండమెలిగె పండుగను ఆదివాసీల ఆచార, సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేస్తారు. పూర్వం ప్రస్తుతం ఉన్న గుడుల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి అవి పాతపడడంతో ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. అలా గుడిమెలిగే.. జాతరకు వారం ముందు మండ మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే సమక్క-సారలమ్మ మహా జాతర.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈసారి జనవరి 28 నుండి 31 వరకు జరగనున్నాయి. ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో.. 50 శాతం అదనపు ఛార్జీలు..మహా జాతర నేపథ్యంలో.. ఈ నెల 25 నుంచి మేడారానికి స్పెషల్ బస్సులను నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు యధావిధిగా కొనసాగనున్నాయి. అయితే.. వన్‌వే బస్సులు నిండుగా వెళ్తాయి కాబట్టి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు అదనంగా వసూలు చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలియజేశారు. రాష్ట్రం నలమూలల నుంచి మేడారం వైపు మొత్తం 4 వేల బస్సులను తిప్పుతామని.. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి 51 స్పెషల్ పాయింట్స్ ఉంటాయని తెలిపారాయన. మేడారం వద్ద ఆర్టీసీ బస్సుల కోసం 50 క్యూ లైన్స్.. ఒకేసారి వెయ్యి బస్సులు పార్కింగ్ చేసేలా వసతులు కల్పించారు. మొత్తం 10 మంది సిబ్బంది మేడారం జాతర నేపథ్యంలో పని చేస్తారని అన్నారాయన. -
మేడారంలో గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి
-
మేడారం: ఆధునీకరించిన గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి రెండో రోజు పర్యటించారు. మంగళవారం వేకువ జామునే కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తొలిమొక్కును రేవంత్ దంపతులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) ఆయన సమర్పించారు. అంతకు ముందు.. ఆధునీకరించిన మేడారం గద్దెలను సీఎం ప్రారంభించారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో నిర్మించిన నూతన సాలహారం, ద్వారాలు, ఆర్చీలను సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. సీఎం, మంత్రులను పూజారులు, దేవాదాయశాఖ అధికారులు ఆదివాసీ సంప్రదాయాలు, ఆచారాలతో డోలు వాయిద్యాల నడుమ గద్దెలపైకి స్వాగతం పలికారు. ఆయా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం అమ్మవార్లను దర్శించుకుని బంగారం(బెల్లం) ప్రసాదం స్వీకరించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారి నిన్న(ఆదివారం) మేడారంలో కేబినెట్ భేటీ నిర్వహించారు. అనంతరం మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం హరిత హోటల్లో రాత్రి బస చేశారు. ఇవాళ(సోమవారం) ఉదయం సీఎం రేవంత్ సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వన దేవతలకు చీర, సారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. -
మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ములుగు జిల్లా: మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. తొలిసారిగా సచివాలయం బయట మేడారం వేదికగా సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం సాగింది. 18 అంశాల ఎజెండాగా భేటీ జరిగింది. జిల్లాల పునర్వవస్థీకరణ కోసం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పొట్లపాడు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదించింది. -
మేడారం సందడి (ఫోటోలు)
-
నేడు మేడారంలో కేబినెట్ భేటీ.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్/ఎస్ఎస్ తాడ్వాయి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అక్కడి హరిత హోటల్ కేంద్రంగా కీలకాంశాలపై నిర్ణయం తీసుకోవడానికి సమాయత్తమైంది.షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పాలేరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం పట్టణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత అక్కడే జరగనున్న సీపీఐ వందేళ్ల సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత పలువురు మంత్రులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా మేడారానికి చేరుకోనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మేడారంలోనే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సోమవారం ఉదయం 6:30 గంటలకు నూతనంగా నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను ప్రారంభించనున్నారు. వనదేవతలకు చీర, సారె, బెల్లంతో మొక్కులు సమర్పించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.భద్రత కట్టుదిట్టం..రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో మేడారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం హెలిప్యాడ్ స్థలం, హరిత హోటల్, టెంట్ సిటీ, సాంస్కృతిక కార్యక్రమాల సభా ప్రాంగణం తదితర ప్రాంతాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించగా ములుగు ఎస్పీ సు«దీర్ రాంనాథ్ కేకన్ భద్రతా ఏర్పాట్లపై మేడారంలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమీక్షించారు. బందోబస్తు విధుల కోసం 1,600 మంది పోలీసులను మోహరించినట్లు చెప్పారు.మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్! మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో కో–ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్జెండర్లను నియమించే అంశంపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలోని రామప్ప చెరువుపై రూ. 103.22 కోట్ల అంచనా వ్యయంతో పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం నిర్మించాలనే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. కేబినెట్ భేటీలో సుమారు 15 అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది. భూ కేటాయింపులు, మూడు యూనివర్సిటీల్లో కొత్తగా మూడు ప్రొఫెసర్ పోస్టుల మంజూరు, పురపాలక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు తెలియవచ్చింది. నీటిపారుదల శాఖ నుంచి చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల సవరించిన అంచనాల ఫైల్ కేబినెట్ ముందుకు రానుంది. సమ్మక్క–సారలమ్మ జాతరకు జాతీయ హోదా సాధన, నిర్వహణ కోసం నిధుల మంజూరు అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు అలాగే రైతు భరోసా చెల్లింపులు, సీఎం దావోస్ పర్యటన, ఇతర సమకాలీన రాజకీయ అంశాలపై కేబినెట్లో చర్చకు రానున్నట్లు తెలిసింది.గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు: మంత్రి సీతక్క మేడారంలో కేబినెట్ భేటీ కోసం వస్తున్న సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పపువ్వు లడ్డూ, కరక్కాయ చాయ్, ఇప్పపువ్వు టీ, జావ, జొన్న రొట్టె, గోదావరి చేపలు, రొయ్యలు, బొంగు చికెన్ తదితర వంటకాలను వడ్డించనున్నట్లు చెప్పారు. జిల్లాలో లభించే పదార్థాలతోనే ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు.ట్రాఫిక్ మళ్లింపులు.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేడారం వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ వెల్లడించారు. ఆదివారం మేడారం జాతరకు వన్‌వే అమలు చేస్తున్నట్టు తెలిపారు. వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులు. ములుగు పసర.. నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలి. తాడ్వాయి మీదుగా ప్రవేశం లేదు. ఆదివారం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. తిరుగు ప్రయాణంలో భయక్కపేట భూపాలపల్లి.. పరకాల.. గూడెపాడు మీదుగా వరంగల్ చేరుకోవాలి. మేడారంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగుర వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు
ములుగు: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర పూజా కార్యక్రమాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు(బుధవారం) మేడారం, కన్నెపల్లిలో గుడిమెలిగె పండుగను పూజారులు సంప్రదాయంగా నిర్వహించనున్నారు. పూజారులు అమ్మవార్ల ఆలయాలను శుద్ధి చేసి పసుపు, కుంకుమలతో అలంకరించనున్నారు. పూజారులు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరంచి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సమావేశమై కార్యక్రమాలకు సంబంధించిన పూజ సామగ్రిని సిద్దం చేశారు. గుడిమెలిగె పండుగ అనంతరం వారం రోజుల తర్వాత మండమెలిగె పండుగను నిర్వహించనున్నట్లు వివరించారు. గుడిమెలిగె పండుగతో అమ్మవార్లకు మహాజాతర పూజా కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. -
తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క
-
భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)
-
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)
-
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
రూ.251 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం జాతర పనులకు రూ.251 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా రూ.101 కోట్లు మంజూరు చేయగా, వీటిలో రూ.71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు.గతంలో మంజూరైన జాతర ఏర్పాట్ల నిధులు రూ.150 కోట్లు కలిపి దశలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మే డారం జాతరకు వచ్చే నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా జంపన్న వాగులో వరదలాగా జారిపోకుండా.. గిరిజనుల ఆరాధ్య దైవాల ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు ఇచ్చామన్నారు. నాపై ఎవరూ ఫిర్యాదు చేసే చాన్సే లేదు.. మేడారం పనుల విషయంలో కొండా సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయని మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ ‘నేనేంటో అందరికీ తె లుసు. రూ.70 కోట్ల కాంట్రాక్ట్ పనులకు తాపత్రయపడే అవసరం నాకు లేదు. నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు. అధిష్టానానికి ఫిర్యాదు చేసే చాన్సే లేదు. ఆ వార్తలను నేను నమ్మడం లేదు’అని బదులిచ్చారు. జాతరలోపు నెలకు రెండుమూడు సార్లు జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. తాను రాకున్నా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ పాల్గొన్నారు.అభివృద్ధి పనుల నమూనాను పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రి సీతక్క తదితరులు -
Konda Surekha: రేవంత్‌కు ఫిర్యాదు.. ఖర్గేకు లేఖ
సాక్షి, హైదరాబాద్: అడ్లూరి-పొన్నం వివాదం మరువక ముందే.. తెలంగాణలో మళ్లీ మంత్రుల మధ్య లొల్లి మొదలైంది(Telangana Ministers Clash). దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఓ మంత్రిపై సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మేడారం టెండర్ల విషయంలో ఈ ఇద్దరు మంత్రులకు వార్ మొదలైందని తెలుస్తోంది. ఇటీవల మేడారంలో పర్యటించిన సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అయితే.. తన శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనులను తన మనిషికి ఇప్పించుకునేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మంత్రి కొండా సురేఖ ఆరోపణ. ఈ క్రమంలో సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పలుకీలక అంశాలతో లేఖ రూపేణా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే.. ఆ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని ప్రచారం బలంగా వినిపిస్తోంది(Konda Surekha Complaint Ponguleti). ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్య చేశారంటూ అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో రిలీజ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. పొన్నం క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారాయన. ఈ క్రమంలో సీఎం సూచనతో.. టీపీపీసీ చీఫ్ మధ్యవర్తిత్వం వహించడంతో పొన్నం క్షమాపణలు చెప్పగా ఆ పంచాయితీ ముగిసింది.ఇదీ చదవండి: కోర్టు ఆదేశాలంటే లెక్కే లేదా? -
మేడారం సమ్మక్క–సారలమ్మ మొక్క చెల్లించుకున్న : సీఎం రేవంత్‌రెడ్డి (ఫొటోలు)
-
సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
మేడారంలో సీఎం రేవంత్.. వనదేవతలకు మొక్కుల చెల్లింపు
సాక్షి, ములుగు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనదేవతలకు నిలువెత్తు బంగారం(68 కేజీల బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం చేపట్టిన పనులను మరికాసేపట్లో ఆయన పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు, పూజారులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు.పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారంఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు మంది దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతోపాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలాచరించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయనున్నారు.మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగొద్దనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతి నిర్మాణం.. ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్‌స్టోన్‌ను వాడుతారు. ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఏర్పాట్లను సీఎం పరిశీలించడం ఇదే తొలిసారి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. మేడారం జాతర ఏర్పాట్లపై తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పర్యటించనున్నారు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్షిస్తారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి రివ్యూ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.సీఎం టూర్ షెడ్యూల్ ఇలా...సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాయి. ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 గంటల నుంచి 1.30 గంటల వరకు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకొని పూజారులతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్‌లో ఆలయ పునరుద్ధరణ పనుల ప్లాన్‌ను డిజిటల్ లాంచ్ చేస్తారు. 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మేడారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. -
ములుగు జిల్లా : మేడారం మినీ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సుడిగాలి మిస్టరీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఏటూరునాగారం/తాడ్వాయి: రాష్ట్రంలో.. ఆ మాటకొస్తే దేశంలోనే అరుదుగా జరిగే బీభత్సం ములుగు అడవుల్లో చోటుచేసుకుంది. ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు.. దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో 200 హెక్టార్ల (దాదాపు 500 ఎకరాల) విస్తీర్ణంలో 50వేలకుపైగా చెట్లు నేలకూలాయి. ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా మారింది. 4,5 రోజులు ఆగకుండా కురిసిన వర్షాలకు తోడు భారీ సుడిగాలుల (టోర్నడోల)తోనే ఈ ఘటన జరిగినట్టు అంచనా వేస్తున్నారు. లోతుగా అధ్యయనం అవసరం: టోర్నడోలు చాలా వరకు బహిరంగ ప్రదేశాల్లోనే వస్తాయని.. ఇంత పెద్ద ఎత్తున చెట్లతో నిండి ఉన్న అటవీప్రాంతంలో వచ్చే వీలు లేదని వాతావరణ, నీటి వనరుల నిపుణుడు బీవీ సుబ్బారావు తెలిపారు. ములుగు ప్రాంతంలో ఈ పరిణామం చాలా విచిత్రంగా ఉందని.. అయితే మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లాలో ఇలాంటి స్వల్పస్థాయిలో చోటుచేసుకుందని చెప్పారు. వాతావరణ మార్పులతోనే ఇలా జరిగిందని భావిస్తున్నామని.. అడవుల్లో ఇలా జరగడంపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అతివేగమైన గాలి.. తడిసిన నేలతో..: అత్యంత వేగంగా, బలంగా వీచిన గాలులతోనే ములుగు అడవిలో విధ్వంసం జరిగి ఉంటుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి (మాజీ పీసీసీఎఫ్ ర్యాంక్ అధికారి) రఘువీర్ అంచనా వేస్తున్నారు. నాలుగైదు రోజులు ఆగకుండా కురిసిన వానతో నేల తడిసి, డొల్లగా అవుతుందని.. దీనికితోడు ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొమ్మలు కొట్టేయడంతో చెట్లు బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటప్పుడు అతివేగంగా వీచే గాలులతో చెట్లు కూలిపోయే చాన్స్ ఉంటుందని వివరించారు. 1996లో మధ్యప్రదేశ్‌లోని ఓ అభయారణ్యంలో ఇలాంటి ఘటన జరిగిందని.. ములుగులో జరిగిన దానికంటే కూడా ఎక్కువ స్థాయిలో చెట్లు పడిపోయాయని నిపుణులు చెప్తున్నారని రఘువీర్ వెల్లడించారు. ములుగులో పెద్ద సంఖ్యలో చెట్లు కూలినా.. చాలా వరకు వేళ్లతో సహా పెకిలింతకు గురికాలేదన్నారు. మధ్యకు విరిగిన, కొమ్మలన్నీ పోయి కాండం మిగిలిన చెట్లు త్వరలోనే కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక టోర్నడో వృత్తాకారంలోఒకేచోట తిరుగుతుందని.. కానీ ములుగు అడవిలో అలాకాకుండా ఒకేవైపు నుంచి ప్రభావం పడిందని తెలిపారు. అందరిలోనూ విస్మయం ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో 50వేల చెట్లు నేలకూలడం అటవీశాఖ అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. దీనికి కారణమేంటన్న దానిపై పీసీసీఎఫ్ రాకేశ్ మోహన్ డోబ్రియల్, జిల్లా అధికారులు రాహుల్‌కిషన్ జాదవ్, ఇతర అధికారులు పరిశీలన జరుపుతున్నారు. డ్రోన్ కెమెరా ద్వారా కూలిన చెట్లను పరిశీలించారు. మరోవైపు పెనుగాలులతో నేలకూలిన చెట్లపై కలప స్మగ్లర్ల కన్నుపడిందని స్థానికులు అంటున్నారు. చెట్ల దుంగలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. తల్లుల దీవెనలతోనే బయటపడ్డాం: మంత్రి సీతక్క సుడిగాలి గ్రామాలపైకి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినా.. ఇలా వేలాది చెట్లు కూలిపోయాయని ఊహించలేదని మంత్రి సీతక్క చెప్పారు. డ్రోన్ కెమెరాల సాయంతో పరిశీలించినప్పుడు విధ్వంసం బయటపడిందన్నారు. బుధవారం సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓ, స్థానిక అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మళ్లలేదని.. అలా మళ్లి ఉంటే పెను విధ్వంసం జరిగి ఉండేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలను పంపి చెట్లు కూలిన ఘటనపై పరిశోధన జరిపించాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు. సుడిగాలితో నేలకొరిగి ఉంటాయి! సుడిగాలి, మేఘాలు రెండూ కలిసినపుడు ఇటువంటి వర్షాలు కురుస్తాయి. సాధారణంగా చెట్ల వేళ్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళితే గట్టి పట్టు ఉంటుంది. కానీ ఇక్కడి ఆకులు రాలుతూ అక్కడే చెట్టుకు అవసరమై ఎరువు తయారవుతూ ఉంటుంది. దీనితో వేర్లు లోతుగా కాకుండా పక్కలకు విస్తరించి పట్టులేకుండా ఉంటాయి. ఇలాంటి చెట్లు సుడిగాలితో పట్టుకోల్పోయి నేలకొరిగి ఉంటాయి. ఇలాంటి ఘటనను నా 35 ఏళ్ల సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదు. – ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ -
మేడారం జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మా ప్రభుత్వాని టచ్ కూడా చేయలేరు
-
అర్ధరాత్రి గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ
-
మేడారం జాతరపై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్
-
గద్దెపైకి సారలమ్మ..
-
జానపద గాథల్లో... సమ్మక్క
ఇంతింతై వటుడింతౖయె... ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జన జాతరగా ప్రసిద్ధిగాంచిన ‘మేడారం సమ్మక్క జాతర’కు కారకులైన గిరిజన వీరవనితలు సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మల పుట్టుపూర్వోత్తరాల గురించి అందుబాటులో గల ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు ప్రతాపరుద్రునితో జరిగిన పోరాటంలో కుట్రతో ఒక సైనికుడు దొంగ చాటుగా బల్లెంతో చేసిన దాడిలో సమ్మక్క క్షతగాత్రురాలై చిలకలగుట్ట వద్ద అదృశ్యమైనట్టు జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథల ద్వారా తెలుస్తోంది. కానీ కాకతీయ రాజ్య చరిత్రలో మేడారం పోరాటం, సమ్మక్క– పగిడిద్దరాజుల సామంత రాజ్యం గురించిన ప్రస్తావన లేదు. గిరిజనుల ఆశ్రిత కులం వారు డోలీలు. వీరు ‘పడిగె’ అనే త్రికోణాకార గుడ్డపటం సాయంతో గిరిజన పూర్వీకుల చరిత్ర, వీర గాథలను ‘డోలి’ వాయిస్తూ గానం చేస్తారు. మణుగూరు ప్రాంతంలోని గూడెంకు చెందిన డోలి కళాకారుడు ‘సకిన రామచంద్రయ్య’ చెప్పే పడిగె కథ ప్రకారం: పేరంబోయిన కోయ రాజు వంశానికి చెందిన ఆరవ గట్టు సాంబశివ రాజు– తూలు ముత్తి దంపతులకు ఐదుగురు సంతానం – సమ్మక్క పెద్దకూతురు. ఆమెకు యుక్త వయస్సు రావడంతో బస్తరు ప్రాంతానికి వెళ్లి పగిడిద్ద రాజును చూసి ఆయనతో పెళ్లి చేయ నిశ్చయించాడు తండ్రి. మేడారం దగ్గరి కామారం గ్రామానికి చెందిన గిరిజన నాయకుడు మైపతి అరుణ్ కుమార్ తన క్షేత్ర పర్య టనలు, పూర్వీకుల మౌఖిక కథల ద్వారా సేకరించిన సమా చారం ప్రకారం... కోయత్తూర్ సమాజంలోని ఐదవ గట్టు ‘రాయి బండని రాజు’ వంశానికి చెందిన ఆడబిడ్డ సమ్మక్క ‘చందా‘ ఇంటి పేరు గల రాయి బండాని రాజుకు ఇద్దరు భార్యలు. ఆ రాజుకు వెదురు పొదల వద్ద ముద్దులొలికే పసిపాప కని పిస్తుంది, ఆ పాపను ఇంటికి తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఈ రాజుకు నాగు లమ్మ అనే మరో కుమార్తె జన్మించింది. కోయ వారి సంప్రదాయం ప్రకారం తొలిసూరి బిడ్డను ఇంటి వేల్పుగా కొలుస్తారు. అందుకే సమ్మక్క చందా వారి ఇలవేల్పు అయ్యింది. ఈ రెండు కథనాల్లోనూ పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహాన్ని ఆమె తండ్రి కుదుర్చుతాడు. అయితే నాట కీయ పరిణామాల మధ్య సమ్మక్క, నాగులమ్మలను ఇద్దరినీ పగిడిద్దరాజు వివాహం చేసుకుంటాడు. స్వాతంత్య్రానికి పూర్వం నైజాం రాజ్యంలో చందా, సిద్ధబోయిన ఇంటిపేర్లున్న గిరిజన కుటుంబాలు మాత్రమే చేసుకునే చిన్న జాతర ఇది. ప్రతి ఏటా జాతర చేసే స్థోమత లేక రెండే ళ్లకోమారు అది కూడా చందాలు వేసుకునీ, అవీ చాలక వరంగల్‌లోని వర్తకులు దగ్గర వడ్డీలకు డబ్బులు తెచ్చి ఈ జాతర నిర్వహించేవారు. 1961లో నాటి రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. 1996లో ‘రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తించింది. పాలకులు, భక్తుల కృషితో నేడు ఉన్న స్థితికి ఈ జాతర చేరింది. – డా‘‘ అమ్మిన శ్రీనివాసరాజు, పరిశోధక రచయిత (నేటి నుంచి ఫిబ్రవరి 23 వరకు మేడారం జాతర) కుంకుమ భరిణ రూపంలో... సమ్మక్క ఓ కోయరాజు కుమార్తెగా జానపద కథలు చెబు తున్నాయి. ప్రతాపరుద్రునితో జరిగిన యుద్ధంలో తమ వారంతా మరణించడంతో సమ్మక్క వీరావేశంతో శత్రు మూకలను సంహరించింది. కానీ ఒక సైనికుడు ఆమెను వెన్నుపోటు పొడవడంతో రక్తపు టేరుల మధ్య అడవి వైపు వెళ్తూ అదృశ్యమయ్యింది. గిరిజనులు ఆమె కోసం వెదుకు తుండగా చిలకల గుట్టపై నెమలినార చెట్టుకింద కుంకుమ భరిణ కనిపించింది. తన శక్తియుక్తులనూ, ధైర్యసాహసాలనూ సమ్మక్క ఆ భరిణలో నిలిపిందని భావించి ఆమె ప్రతి రూపంగా భావించారు గిరిజనులు. అక్కడే గద్దెలను నిర్మించి అప్పటినుండి సమ్మక్క సారలమ్మ జాతర జరి పించ సాగారు.మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులు ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగు తుంది. మొదటిరోజు కన్నెపల్లి నుండి సారలమ్మకు ప్రతి రూప మైన పసుపు భరిణను మేళ తాళాలతో తీసుకువచ్చి వెదురు కర్రకు పట్టుదారంతో కడతారు. రెండవ రోజు సమ్మక్కకు ప్రతిరూపంగా భావించే కుంకు మభరిణను చిలకల గుట్టనుండి తీసుకువచ్చి వెదురుకర్రకు అలంకరిస్తారు. రెండు గద్దెలపై రెండు వెదురు కర్రలను సమ్మక్క, సారలమ్మలుగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఈ సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మూడవ రోజు ‘వనదేవతలు’గా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు బెల్లాన్ని బంగారంగా భావించి అమ్మవార్లకు నివేదిస్తారు. జంపన్న వాగులో స్నానం చేసి, తలనీలాలు సమర్పించుకుంటారు. కోరికలు నెరవేరాలని వేడుకుంటారు. నాలుగవ రోజు సమ్మక్క, సారలమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. – అయిత అనిత, రచయిత్రి -
మేడారం జాతరకు 30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్, కాజీపేట రూరల్: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 జన్ సాధా రణ్ ప్రత్యేక రైళ్ల సర్విస్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మేడారం జాతర చేరుకోవడానికి, తిరుగు ప్రయాణానికి అత్యంత సురక్షితమైన వేగవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు ఆయా రూట్ల నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ వెల్లడించినట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ► సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు, సిర్పూర్కాగజ్నగర్–వరంగల్, వరంగల్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 8 రైళ్లు, నిజామాబాద్–వరంగల్, వరంగల్–నిజామాబాద్ మధ్య 8 రైళ్లు, ఆదిలాబాద్–వరంగల్, వరంగల్–ఆదిలాబాద్ మధ్య 2 రైళ్లు, ఖమ్మం–వరంగల్, వరంగల్–ఖమ్మం మధ్య 2 రైళ్లు నడుపుతారు. ► 21 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్–వరంగల్ (07014), ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు వరంగల్–సికింద్రాబాద్ (07015) ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుతుంది. ► 21వ తేదీన వరంగల్–ఆదిలాబాద్ (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్ వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది. ► 22వ తేదీన ఆదిలాబాద్–వరంగల్ (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్‌లో రాత్రి 11:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12:45 గంటలకు వరంగల్ చేరుతుంది. ► 23 తేదీన ఖమ్మం–వరంగల్ (07021) వెళ్లే రైలు ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 12:20 గంటలకు చేరుతుంది. ► 24న వరంగల్–ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుంది. భక్తుల సౌకర్యార్ధం రైళ్లు: కిషన్‌రెడ్డి మేడారం సమ్మక్క, సారక్క జాతరకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక రైళ్లను వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్లకోసం రూ.3 కోట్లను కేటాయించింది’అని కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాల విషయంలో, గిరిజన సమాజం సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క, సారక్క జాతర నేపథ్యంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది’’అని ఆయన తెలిపారు. -
మేడారంలో ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క
సాక్షి, ములుగు: సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ఆర్టీసీ బేస్ క్యాంప్‌ను మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ నేతృత్వంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్‌తో కూడిన బేస్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేస్ క్యాంప్‌లో 7 కిలో మీటర్ల పొడవునా 50 క్యూ లైన్లను నిర్మించినట్లు వివరించారు. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోందని తెలిపారు. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల ఆదివారం నుంచి 25వ తేది వరకు 8 రోజుల పాటు ప్రత్యేక బస్సులను సంస్థ తిప్పుతున్నట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది ఈ జాతరకు పని చేస్తున్నారని స్పష్టం చేశారు. సిబ్బందికి సరిపడా విశ్రాంతి గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మేడారం జాతరకు అమల్లో ఉందని, మహిళలు పైసా ఖర్చు లేకుండా తల్లులను దర్శించుకోవచ్చన్నారు. గతంలో భక్తులు పెద్ద ఎత్తున కాలినడకన మేడారం జాతరకు వచ్చే వారని, ఉచిత ప్రయాణం వల్ల సురక్షింతంగా బస్సుల్లో వస్తున్నారని పేర్కొన్నారు. మేడారం జాతరకు బస్సుల్లో వచ్చే భక్తులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు నిబద్దత, క్రమ శిక్షణతో పని చేస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ రఘునాథ రావు, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్, తదితరులు పాల్గొన్నారు. -
మేడారం సమ్మక్క సారక్క జాతరకు పోటెత్తిన భక్తజనం
-
తెలంగాణ కుంభమేళాకు వేళాయె
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజునే ఈ మహా ఉత్సవం మొదలవుతుంది. దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడిమెలిగె పండుగ జరుగుతుంది. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు తలస్నానాలు అచరించి తల్లుల అలయాలను శుద్ధి చేసి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మేడారంలో సమ్మక్క పూజారి సిద్దబోయిన మనీందర్ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా, ఆడపడుచులు పసుపు, కుంకమలు, పూజారులు, వడ్డెలు పవిత్ర జలం, దూపం, యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టి గడ్డి ఉంచగా, ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా. పూజారులు అమ్మవారికి దూప, దీపాలు వెలగించి పూజలు నిర్వహించి యాటను నైవేద్యంగా సమర్పించారు. కన్నెపెల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడిమెలిగె పండగ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సారలమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు. బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం ఆనవాయితీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మండమెలిగె పండుగ జరుగుతుంది. జాతరకు మరో 13 రోజులే... పనుల పూర్తిలో ఇంకా జాప్యమే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే ఉంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. గతేడాది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో రూ.105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలా వరకు పూర్తి కాలేదు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది. కొందరు భక్తులు జాతరకు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటోంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాకు చెందిన భక్తులు 365వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు. గూడూరు, వరంగల్ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలాలేవు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 189 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. అతిపెద్ద జాతరకు ఆ కమిటీనే వేయలే.. మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2012 వరకు సజావుగానే సాగినా 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటులో ప్రతీసారి జాప్యమే అవుతోంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే జాతర నిర్వహించారు. 2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు. 2018 మహాజాతరకు కాక లింగయ్యను చైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 2020, 2022 జాతరలు పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం ప్రకారం ఆదివాసీలనే నియమించాలని కూడా కోరుతున్నారు. అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి మహాజాతరను ధరకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా? లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. -
మేడారంలో సమ్మక్క– సారలమ్మల వద్ద భక్తుల కోలాహలం (ఫొటోలు)
-
ఓటేయడానికి ‘దారి’... జంపన్నవాగుపై తాత్కాలిక రోడ్డు
ఏటూరునాగారం: ‘ఓటు వేయాలంటే వాగు దాటాలె’ శీర్షికన ఈ నెల 15వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్అండ్బీ శాఖ జంపన్నవాగుపై తాత్కాలిక బ్రిడ్జికోసం నిర్మాణ పనులు చేపట్టింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంల తరలింపు, పోలింగ్ సిబ్బంది కొండాయి ప్రాంతానికి వెళ్లి అక్కడే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం తదుపరి జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయంలో పెద్ద ఎత్తున వాహనాలు ఈ తాత్కాలిక రోడ్డుపై వెళ్లేలా నిర్మాణాలు చేపడుతున్నట్టు ఆర్అండ్బీ డీఈఈ రఘువీర్ ‘సాక్షి’కి తెలిపారు. 60 మీటర్ల పొడవున ఇసుక బస్తాలు వేసి దానిపై సిమెంటు పైపులు, తర్వాత మళ్లీ బస్తాలు వేసిన తర్వాత మట్టితో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజల సదుపాయం కోసం ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అధికారుల్లో కదలిక తీసుకొచ్చిన ‘సాక్షి’కి ముంపు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
గద్దెలను తాకిన మేడారం జంపన్నవాగు..
మహబూబాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మేడారాన్ని ముంచెత్తింది. జంపన్నవాగు రెండు వంతెనల పైనుంచి సుమారు 10 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తోంది. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ ఐలాండ్ ప్రాంత్రం, గ్రామంలోని బొడ్రాయి సమీపానికి వరద రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గద్దెలను చుట్టిన వరద మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ వరద చేరింది. జంపన్నవాగు ప్రవాహం వరద అమ్మవార్ల గద్దె చుట్టూ చేరడం ఇదే మొదటి సారి. ఎప్పుడు వర్షాకాలంలో ఐటీడీఏ కార్యాలయం వరకే వరద చేరేది. జంపన్నవాగు చిలకలగుట్ట దారి నుంచి ప్రవాహం భారీగా చేరడంతో వరద మరింత ముంచెత్తింది. రెండంతస్తుల భవనాలు సైతం నీట మునిగిపోవడం గమనార్హం. మునిగిన ఊరట్టం.. గుట్టపైకి చేరిన జనం భారీ వరదకు ఊరట్టం నీట మునిగిపోయింది. జంపన్నవాగు, తూముల వాగు వరద గ్రామంలోకి చేరడంతో డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు మొత్తం మునిగింది. బాలికల ఆశ్రమ పాఠశాలలో భవనం మొదటి అంతస్తు వరకు వరద చేరడంతో విద్యార్థులు భ యాందోళనకు గురయ్యారు. ప్రజలంతా కట్టుబట్టలతో ఇళ్లను వదిలి సమీప గుట్టపైకి చేరుకున్నారు. జలదిగ్బంధంలో గ్రామాలు.. మండలంలోని నార్లాపూర్, పడిగాపూర్, ఎల్బాక, వెంగళాపూర్, కాల్వపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంగళాపూర్‌లో ఇళ్లు నీట మునిగాయి. నార్లాపూర్‌లో బొడ్రాయి వరకు వరద కమ్మేసింది. కాల్వపల్లిలోని 40 ఇళ్లలోకి వరద చేరింది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి గ్రామాల్లో చూడలేదని వెంగళాపూర్, నార్లాపూర్ ప్రజలు తెలిపారు. వ్యాపారులకు భారీ నష్టం జంపన్నవాగు వరద మేడారంలోకి చేరడంతో చిరు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో హరిత హోటల్ నీడ చెట్టుకు వరకు మాత్రమే జంపన్నవాగు వరద వచ్చేది. బుధవారం అర్ధరాత్రి వరకే వరద ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం వరకు చేరడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. షాపుల్లోకి వరద చేరడంతో నీటిలో నుంచి సామగ్రి, సరుకులను బయటకు తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. 16 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మేడారాన్ని వరద ముంచెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాస్ ఆలం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పెషల్ పార్టీ బృందం బోట్లతో జంపన్నవాగు వద్ద వరదలో ఓ ఇంటిపై చిక్కుకున్న వారిని, మేడారానికి వచ్చిన భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బృందాలు మొత్తంగా వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరిస్థితిని పర్యవేక్షించారు. -
మేడారం అటవీ ప్రాంతంలో దారుణం..
వరంగల్: పని కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను కారులో ఎక్కించుకుని ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పని నిమిత్తం ఏప్రిల్ నెల 20వ తేదీ ఉదయం ఆరెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా.. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఎస్.రవి అనేవ్యక్తి ఎ.రమేశ్ అనే వ్యక్తితో కలసి కారులో (తెల్లరంగు బ్రెజా) వచ్చి మహిళలిద్దర్నీ ఎక్కించుకుని ములుగు వైపు బయల్దేరారు. ఓ మహిళ మార్గమధ్యంలోనే దిగిపోగా, కొంతదూరం వెళ్లాక ములుగు జిల్లాకు చెందిన డి.నాగరాజు, హన్మకొండకు చెందిన బి.లక్ష్మణ్, వర్ధన్నపేటకు చెందిన బి.సుధాకర్ అనే యువకులు కారులో ఎక్కారు. ఈ ఐదుగురు కలసి కారులో ఉన్న మహిళను బెదిరిస్తూ మేడారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు యువకులు సహకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించి ములుగు తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి వెళ్లిపోయారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత నెల 29న ఫిర్యాదు చేసిన భర్త.. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 25న ఏనుమాముల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్‌రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఇది కూడా చదవండి: నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన -
‘మేడారం గోవిందరాజుల’ పూజారి హత్య
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని గోవిందరాజుల గద్దె వద్ద పూజారిగా వ్యవహరిస్తున్న గబ్బగట్ల రవి(45)ని సోమవారంరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన దబ్బగట్ల రవి అత్తగారి గ్రామమైన మేడారంలో స్థిరపడ్డారు. వీరిది గోవిందరాజుల గద్దె పూజారుల కుటుంబం. ఈ కుటుంబీకులు వారానికి ఒకరు చొప్పున గద్దె వద్ద పూజలు నిర్వహిస్తుంటారు. తనవంతు వారంలో రవి భక్తులకు బొట్టు పెట్టి పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే రవి హత్య జరగడం మేడారంలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పస్రా సీఐ శంకర్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావులు మంగళవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా వివరాలు సేకరించారు. బైక్‌పై తిరిగిన వారే హత్య చేశారా? గోవిందరాజుల పూజారి రవి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తు లు రవిని బైక్‌పై ఎక్కించుకుని సోమవారం మేడారంలో తిరిగారని, మద్యం కూడా సేవించారని స్థానికులు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉందని అంటున్నారు. తమ పర్సు పోయిందని, దానిని వెతుకుదామంటూ రవిని బైక్‌పై తీసుకెళ్లారని, ఆ పర్సు విషయమై స్థానికంగా పలువురిని వాకబు కూ డా చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో మేడారం రోడ్డు పక్కన ఉన్న ఓ షెడ్డు వద్ద రాత్రి వంట కూడా చేసుకున్నారని, మద్యం తాగించిన అనంతరం రవి తలపై బండరాళ్లతో కొట్టి చంపి ఉంటారని, ఆయన చెప్పులు ఘటనాస్థలానికి దూరంగా పడి ఉండటంతో అంతకుముందు పెనుగులాట కూడా జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులతో పూజారి రవికి ఇంతకుముందే పరిచయముందా అనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సోమవారం రాత్రి స్థానికంగా కరెంట్ సరఫరా లేదని, ఇదే అదనుగా రవిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో క్వార్టర్ మందు సీసా, పచ్చడి ప్యాకెట్ పడి ఉన్నాయి. -
‘రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో వచ్చేది మా సర్కారే..’
సాక్షి,ములుగు: ‘రాసుకోండి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే అధికారమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గత 75 ఏళ్లలో ఏ నేత చేయనివిధంగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజల్లో జోష్ నింపారని’ పేర్కొన్నారు. అధికారం, ఆధిపత్యం చెలాయిస్తున్న సీఎం కేసీఆర్‌ను తుంగలో తొక్కడానికే మేడారం జంపన్నవాగు నీళ్లు తాగి, వీరవనితలైన సమ్మక్క–సారలమ్మల పోరాటగడ్డ నుంచి హాథ్ సే హాథ్ జోడో యాత్ర మొదలుపెట్టామని అన్నారు. సోమవారం ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకున్న అనంతరం రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రాజెక్టు నగర్ మీదుగా గోవిందరావుపేట మండలం పస్రా వరకు నాయకులు, కార్యకర్తల సందోహం మధ్య యాత్ర కొనసాగింది. ప్రాజెక్టునగర్‌లో మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ డబ్బును నమ్ముకుంటే, కాంగ్రెస్ పార్టీ జనబలాన్ని నమ్ముకుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన, పాలకుల అసహనంతో ప్రజలు రగిలి పోతున్నారని అన్నారు. సీతక్క నా కుటుంబానికి ఎంత సన్నిహితులో రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు. సీతక్క సమ్మక్క–సారలమ్మల స్ఫూర్తితో ప్రజలకు నిత్యం అండగా ఉంటుందని, ఇదే విషయాన్ని పార్టీ పెద్దలతో చర్చించి మేడారం నుంచి జోడో యాత్ర ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. పెత్తందారుల కోసమే కేసీఆర్ రాజకీయం గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.25 లక్షల కోట్ల అప్పు చేసిందని, వాటి నుంచి నియోజకవర్గానికి రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా.. మిగతా సొమ్ము ఎటు పోయిందో చెప్పాలని ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ 10 శాతం ఉన్న పెత్తందారులకు పెద్దపీట వేస్తూ, మిగతా 90 శాతం మందికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దేశంలో ఎక్కడ రాజకీయం చేయాలనుకున్నా 10 శాతం పెత్తందారుల కోసమే పనిచేస్తారని జోస్యం చెప్పారు. సీఎంకు ఎన్నో అవలక్షణాలు ఉన్నాయని, అవేవీ బయటపడటం లేదన్నారు. బడ్జెట్ విలువ, కేసీఆర్ విలువ రెండూ గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు మోదీ.. సాయంత్రం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగి పస్రా జంక్షన్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ అధినేతలు ప్రాణాలివ్వగా, మోదీ మాత్రం అధికారాన్ని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు తన సోదరి తిలకం దిద్ది సాగనంపితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నేడు నా సోదరి సీతక్క తిలకం దిద్ది రాచరిక పాలనను గద్దె దించాలని అడిగిందని అన్నారు. పేదలకు పట్టాభూములు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు రావాలంటే కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టాలన్నారు. రేవంత్ ప్రసంగం సాగుతున్న క్రమంలో సభికులు సీఎం..సీఎం.. అంటూ నినాదాలు చేశారు. సభలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాంనాయక్, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సిరిసిల్ల రాజయ్య, కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ, కూచన రవళి, పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ఇదే..
వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. 'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో వైఎస్ఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా.. సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలుదేరుతారు వరంగల్ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ములుగులో గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ వద్ద ప్రత్యేక పూజలు 12 గంటలకు పాదయాత్ర ప్రారంభం మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు పాదయాత్ర మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్లో భోజన విరామం ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి పాదయాత్ర సాయంత్రం 4:30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం పస్రా జంక్షన్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ తిరిగి సాయంత్రం 6 గంకలకు పస్రా నుంచి మళ్లీ పాదయాత్ర రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకోనున్న రేవంత్ పాదయాత్ర రాత్రికి రామప్ప గ్రామంలోనే బస రేవంత్ మొదటి విడత పాదయాత్రలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఆ తర్వాత రెండు రోజులు విరామం తీసుకుని చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 పాదయాత్ర రెండో విడత ప్రారంభమవుతుంది. 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాలను కవర్ చేసి ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేడయమే ఈ యాత్ర లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే చెప్పారు. చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..? -
Medaram : సమ్మక్క సారలమ్మ చిన్న జాతర (ఫొటోలు)
-
మేడారంలో ప్రత్యేక పూజలు
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ మినీ జాతర గురువారం రెండో రోజుకు చేరింది. బుధవారం మండమెలిగె పండుగతో జాతర ప్రారంభం కాగా.. రెండో రోజు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మేడారం, కన్నెపల్లి ఆదివాసీలు, గ్రామస్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ పూజారులు వారి ఇళ్లలో కూడా అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జంపన్నవాగు వద్ద స్నానాలు ఆచరించారు. గద్దెల ప్రాంగణంలో మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. -
మేడారం మీదుగా రైల్వే లైన్ కు మొదలైన సర్వే
-
వనదేవతలకు జన హారతి.. ఉప్పొంగిన భక్తి పారవశ్యం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో మేడారం జనసంద్రమైంది. సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మార్మోగింది. ‘మా సమ్మక్క తల్లి కో.. సారక్క తల్లి కో’అంటూ శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు వన దేవతలూ గద్దెలపై కొలువై ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు.. తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు నిండి పోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలను పూజించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 30లక్షల మందికిపైగా మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తంగా దేవతలను దర్శించుకున్న వారి సంఖ్య కోటీ 10లక్షలు దాటిందని.. ఇంకా భక్తుల తాకిడి ఉందని తెలిపారు. రోజురోజుకూ పెరిగిన రద్దీ ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఈ నెల 16న మొదలుకాగా.. అంతకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం మొదలైంది. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో మేడారం ‘క్యూ’లైన్లు కిక్కిరిసిపోయాయి. సాధారణ భక్తుల క్యూలైన్లతోపాటు వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లు కూడా కిలోమీటర్ల పొడవునా సాగాయి. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్నరోజే దర్శించుకోవాలన్న తలంపుతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మ«ధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చారు. శనివారం దేవతల వన ప్రవేశం సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. పెరిగిన వీఐపీల తాకిడి మేడారం జాతరకు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీల తాకిడి పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్ తమ కుటుంబాలతో హెలికాప్టర్ ద్వారా మేడారం వచ్చారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి స్వాగతం పలికి.. వన దేవతల దర్శనం చేయించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ రేగా కాంతారావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు దేవతలను దర్శించుకున్నారు. వీఐపీల రాకతో సాధారణ భక్తులు ఇబ్బందిపడ్డారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) నేడు దేవతలు వనంలోకి.. మేడారం జాతర శనివారం సాయంత్రం ముగియనుంది. వన దేవతలు సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుంచి వన ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జాతర చివరిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకోనున్నారు. శుక్రవారం రాత్రికే లక్షల మంది మేడారానికి చేరుకున్నారు. మొత్తంగా గత జాతర కంటే ఈసారి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగా వచ్చిన దూరప్రాంతాల వారు తిరిగి బయలుదేరుతుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు మెల్లగా ఖాళీ అవుతున్నాయి. సీఎం పర్యటన రద్దు.. శుక్రవారం సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు వన దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. మొదట ఉదయం 11.30 గంటలకు వస్తారని ప్రకటించినా.. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం సెక్యూరిటీ విభాగం, వ్యక్తిగత కార్యదర్శులు ఉదయమే మేడారం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. మేడారానికి జాతీయ హోదా ఉండదు: కిషన్‌రెడ్డి పండుగలకు ఎక్కడా జాతీయ హోదా ఉండదని, ఆ ప్రకారం మేడారం జాతరకు కూడా ఉండదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లకోసారి వైభవంగా జరిగే ప్రకృతి పండుగ ఇది. పండుగలకు జాతీయ హోదా ఎక్కడా లేదు. ఇదే క్రమంలో మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఉండదు. అయితే దేశవ్యాప్తంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.45 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. నేను పర్యాటక మంత్రి అయిన తర్వాత రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ప్రజలు కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండాలని అమ్మలను కోరుకున్నా..’’అని తెలిపారు. (చదవండి: కరగని ‘గుండె’) -
మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం
Medaram Aerial View 2022: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవోపేతంగా జరుగుతుంది. మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమన ప్రక్రియ కొనసాగుతోంది. సమ్మక్క తల్లి రాకకు వేళ అవ్వడంతో మేడారం జనసంద్రంగా మారింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీసుకురానున్నారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలిస్తారు. చదవండి: దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది.. ఈ క్రమంలో జాతర పరిసర ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జంపన్నవాగు, కన్నెపల్లి, చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 60 కేజీల తెల్లబంగారం సమర్పించారు . కేసిఆర్ ఆయురారోగ్యాలతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అమ్మవారులను వేడుకున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో కేసిఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవేనలతో రాష్ట్ర సాధన తోపాటు రెండు సార్లు కేసిఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సీఎం కేసిఆర్ రేపు మేడారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఏర్పాట్లను పరిశీలించారు. జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా లభించాలని అమ్మవారులను వేడుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై కేంద్రం కనిపించదు, వినిపించదు అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది..
మేడారంలో ఇప్పుడు కొత్త రోడ్లు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి వందల కెమెరాలతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం చేరుతోంది. కానీ మూడు దశాబ్దాల క్రితం ఇదో దట్టమైన అడవి. కనీసం కరెంటు కూడా లేదు, ఫోన్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో సమ్మక్క రాక భక్తులకు తెలిసేందుకు ఒకే ఒక కొండ గుర్తు ఉండేది. ఇప్పుడు మేడారం జాతరకు ఆర్టీసీ 3500ల బస్సులు నడిపిస్తోంది. లక్షల సంఖ్యలో ఆటోలు, జీపులు, ట్రాక్టర్లలో భక్తులు మేడారం చేరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు మేడారం వచ్చే భక్తులు ఎడ్లబండ్లలోనే ఎక్కువ వచ్చేవారు. ఆది, సోమవారాల్లో బయల్దేరి మంగళవారానికి మేడారం చేరుకునేవారు. ఇలా వచ్చే భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో అడవుల్లో బస చేసేవారు. జంపన్నవాగులో చెలమల్లో నీళ్లు తాగేవారు. అడవుల్లో కంకవనం నరికి పందిల్లు వేసుకునేవారు. వాటి కిందే బస చేసేవారు. కరెంటు వెలుగులు లేవు. సాయంత్రం ఆరు గంటల కల్లా వంటలు పూర్తి చేసి వెన్నెల వెలుగుల్లో సమ్మక్క, సారలమ్మల కోసం వేయి కళ్లతో ఎదురు చూసేవారు. బుధవారం సాయంత్రం సారలమ్మ, గురువారం సాయంత్రం సమ్మక్క వస్తుదన్న విషయం తెలిసి పొద్దుగూకే సమయంలో మొక్కులు చెల్లించేందుకు అనువుగా సిద్దమయ్యేవారు. ముఖ్యంగా జాతరలో కీలకమైన సమ్మక్క రాక ఎప్పుడెప్పుడా అని ఒకరినొకరు ఆరా తీసేవారు. గురువారం సాయంత్రం అయ్యిందంటే భక్తులందరూ చిలకలగుట్టవైపుకు చూసేవారు. రహస్య పూజల అనంతరం సమ్మక్కను తీసుకుని వడ్డేలు చిలకలగుట్ట దిగేవారు. అంతే ఒక్కసారిగా అక్కడున్న భక్తులు సమ్మక్కను అనుసరించేవారు. ఆ కోలాహాలానికి మట్టిరోడ్డుపై దుమ్ము ఆకాశాన్ని తాకేలా పైకి లేచేది. ఈ దుమ్ము మేఘాలు కదలాడుతున్న దిశగా భక్తులు సమ్మక్కకు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నలువైపుల నుంచి భక్తులు దుమ్ము మేఘాలను అనుసరిస్తూ కదిలేవారు. పసుపు కుంకుమ కలిపిన ఒడిబియ్యం సమ్మక్కపైకి జల్లుతూ,, మేకలు కోళ్లు బలిస్తూ తమ మొక్కులు చెల్లించడం చేసేవారు. ఒక్కసారిగా భక్తుల ఒత్తిడి పెరిగిపోవడంతో తొక్కిసలాట కూడా చోటుచే సుకునేది. తర్వాత కాలంలో సమ్మక్క రాకను సూచిస్తూ గాల్లోకి కాల్పులు జరిపే సంప్రదాయాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది‡. కాల్పుల శబ్దాన్ని బట్టి సమ్మక్క వస్తున్న సమాచారం జాతర ప్రాంగణంలో తెలిసేది. ఆ తర్వాత కాలంలో మేడారం చుట్ట పక్కల రోడ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్ టవర్లు వచ్చి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. -
జాతర సందడిలో పురాత్మల ఆవహయామీ.. తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
జాతర సమయంలో మేడారానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. నూటికి 99 శాతం మంది తమ కోరికలు తీర్చాలని, తమ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు. కానీ కొద్ది మంది తంత్ర సాధన కోసం మేడారం చేరుకుంటారు. మేడారంలో ప్రతీ మలుపులో కనిపించే వన మూలికలు అమ్ముకునే వారు కనిపిస్తారు. శరీరం నిండా చిత్రమైన అలంకరణ చేసుకుంటారు. వీరిని తంత్ర గాళ్లు అనుకుని చాలా మంది పొరపాటు పడతారు. వనమూలికలు, అటవీ జంతువుల శరీర అవయవాలను అమ్మేవాళ్లు విచిత్ర వేషధారణతో జాతర ప్రాంగణంలో కలియతిరుగుతూ ఉంటారు. వన మూలికలు అమ్మడమే వీరి ప్రధాన జీవనోపాధి, అయితే ప్రజలను ఆకట్టుకునేందుకు వీరు కొంచెం అతిగా అలంకరించుకుంటారు. నిజానికి వీరికి ఇటు మేడారం జాతరతోకానీ అటు తంత్ర గాళ్లతో గానీ ఎటువంటి సంబంధం ఉండదు. తంత్ర సాధన కోసం మేడారం వచ్చే వాళ్లు జాతర జరిగే సమయంలో మేడారం అడవుల్లో ప్రత్యేక సాధన చేస్తారు. భక్తుల కోలాహాలం లేని అడవుల్లోని నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో వీరి సాధన జరుగుతుంది. జాతర ఘడియల కోసం ఎంతో మంది రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు. తంత్ర సాధనకు అవసరమయ్యే వివిధ రకాల చెట్లు, జంతువులు.. ఇతరాలు బయట లభించడం చాలా కష్టం. ఒక్కో వస్తువు ఒక్కో చోట లభిస్తుంది. కానీ జాతర సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ కలుసుకుంటారు. తంత్ర సాధనలో ఉపయోగించే వస్తువులు సులువుగా లభ్యమవుతాయి. మరోవైపు జాతర సందర్భంగా మహిమాన్వితులు, వీరుల ఆత్మలు మేడారం చేరుకుంటాయని ఈ తంత్రగాళ్ల నమ్మకం. అందుకే ఆ మహిమాన్విత ఆత్మలను ఆవహయామి చేసుకునేందుకు వారు సాధన చేస్తారు. వీరిని సాధారణ భక్తులు గుర్తించడం కష్టం. అయితే ఈ తంత్ర సాధనలో వారు ఏం ప్రయోజనం పొందుతారనేది ఇప్పటికీ రహస్యమే. జాతర సందర్భంగా మేడారం అడవుల్లో తంత్ర సాధన చేసే వాళ్లలో ఎక్కువ మంది చత్తీస్గడ్, ఓడిషా, ఝార్ఖండ్, మహారాష్ట్రలకు చెందిన వారు ఉంటారు. -
సమ్మక్కను తీసుకొచ్చేది తనే.. కోటికొక్కడు
మేడారం జాతరలో ప్రధాన ఘట్టం చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురావడం. ఈ ఘట్టంలో అత్యంత ఉద్విగ్న భరిత క్షణాలు చిలకలగుట్ట కిందికి సమ్మక్క దిగిరావడం ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఎదురేగి వెళ్లి తుపాకులతో గాలిలోకి కాల్పులు జరపడం. ఈ క్షణాల్లో అందరి కళ్లు భరణి రూపంలో ఉన్న సమ్మక్కపైనే ఆ తర్వాతి స్థానం ఆ భరణి తీసుకువచ్చే ప్రధాన వడ్డే కొక్కెర కృష్ణయ్యపైనే ఉంటాయి. వేలది మంది ప్రత్యక్షంగా లక్షలాది మంది ప్రసార మాధ్యమాల్లో కోట్లాది మంది పరోక్షంగా ఉత్కంఠను అనుభవిస్తారు. అంతటి ఉత్కంఠ, ఉద్విగ్నభరిత క్షణాలను తన భూజాలపై మోసే కొక్కర కృష్ణయ్య మనోగతం సాక్షి పాఠకులకు ప్రత్యేకం. ఆరోసారి 2022 ఫిబ్రవరి 17వ తేదిన చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కొక్కెర కృష్ణయ్య తీసుకురానున్నారు. అంతకు ముందు ఆయన మొదటిసారిగా 2012 జాతరలో ఈ అదృష్టాన్ని దక్కించుకున్నారు. అంతకు ముందు జాతరలో కొక్కెర కృష్ణయ్యకు∙బాబాయ్ అయిన కొక్కెర వెంకన్న ఈ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ఆయన కొడుకు సాంబశివరావు చేశారు. వారిద్దరి తర్వాత కృష్ణయ్యకు ఈ భాగ్యం దక్కింది. కొక్కెర కృష్ణయ్య మేడారంలోనే నివాసం ఉంటారు. సాధరణ సమయంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. భార్య వినోద, ఎనిమిదో తరగతి చదివే కొడుకు, డిగ్రీ, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ వారం రోజులు నిష్టతో ఉంటాను గుడిమెలిగె పండుగతో సమ్మక్క–సారలమ్మ జాతరకు తొలి అడుగు పడుతుంది. అయితే జాతర మొదలయ్యేది మండెమెలిగే పండుగతోనే. మండెమెలిగే పండుగ నాడు మేడారంలో ఉన్న సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ రోజు నుంచి చిలకలగుట్ట పైనుంచి సమ్మక్కతల్లిని గద్దెలపైకి చేర్చే వరకు నియమనిష్టలతో ఉంటాం. పగటి వేళ కేవలం పాలు, అరటిపళ్లు ఆహారంగా తీసుకుంటారు. రాత్రి పొద్దుపోయాక పూజ చేసిన అనంతరం అన్నం తింటారు. ఆ రోజున దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తాం మేడారం సమ్మక్క గుడిలో పూజలు చేస్తాం. ఆ తర్వాత రహాస్యం అయిన పూజా సామగ్రిని తీసుకుని నాతో పాటు వడ్డెల బృందం చిలకలగుట్టకు బయల్దేరుతుంది. సమ్మక్క వడ్డేలైన దోబేపగడయ్య దూపం వేస్తుండగా మల్యాల ముత్తయ్య జలకంపట్టి వేస్తూ ముందుకు కదులుతాం. జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్య, మాదిరి నారయణలు మమ్మల్ని అనుసరిస్తారు. అయితే చిలకలగుట్ట సగం వరకే వీరికి ప్రవేశం. ఆ తర్వాత సమ్మక్క తల్లి కొలువై ఉండే రహాస్య ప్రదేశానికి నేనొక్కడినే వెళ్తాను. అక్కడ పూజాలు నిర్వహించిన తర్వాత సమ్మక్క తల్లి భరిణి రూపంలో కిందకు తీసుకువస్తాను. నేను రావడం కనిపించగానే జనికపు కొమ్ములతో సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు పొట్టయ్య), సిద్ధబోయిన సమ్మయ్య (తండ్రిపేరు దానయ్య). భజంత్రీలు మాదిరి పుల్లయ్యలు తమ వాయిద్యాలతో శబ్ధం చేస్తారు. అలా గుట్టమధ్య నుంచి సమ్మక్క తల్లి చిలకలగుట్ట పాదల వద్దకు చేరుకోగానే చేరుకోగానే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్, ఎస్పీలు గాల్లోకి కాల్పులు జరిగి ఆ తల్లికి ఘనస్వాగతం పలుకుతారు. మేము మద్యం సేవించం - కొక్కెర కృష్ణయ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు తాగుతారనే అపోహా అందరిలో ఉంది. తాగితేనే దేవత పూనుతుందని అనుకుంటారు. తాగడం అనేది పూజా విధానంలో ఓ భాగంగా అంతా భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. తాగడం అనేది వడ్డెల వ్యక్తిగత విషయం. జాతర సంబరాల్లో భాగంగా మద్యం తీసుకునే అలవాటు ఉన్న వడ్డేలు తాగువారు. మద్యం సేవించడం పూజా విధానంలో భాగం కాదు. నా వరకు నేను మండెమెలిగె పండగ నాటి నుంచే నిష్టతో ఒక్క పొద్దు ఉంటాను. గద్దెలకు చేర్చేవరకు మద్యం సేవించను. నాతో పాటు ఉండే వడ్డేలు వారి వ్యక్తిగత అలవాట్లను బట్టి మద్యం తీసుకుంటారు. అలా మద్యం సేవించడం తప్పు కాదు. అదేవిధంగా సేవించడం తప్పనిసరి కాదు. గతంలో సాయంత్రం 4 గంటలకు కల్లా గద్దెల మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు జాతరకు జనం పెరగడం వల్ల సాయంత్రం 5 అవుతోంది. అయితే ఏడుగంటలల్లోపు ఎప్పుడు వచ్చినా మంచిదే. అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని ఆ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే నాకు మరింత మేలు జరుగుతుంది అని అనుకుంటారు. అందరిలానే నేను. తీసుకురావడం అనేది బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికి మేలు చేస్తుంది. -
జాతర సందడిలో తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
-
సమక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
-
వైభవంగా మేడారం జాతర మహోత్సవం
-
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
మేడారం జాతరకు కేంద్రం రూ.2.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు రూ.2.5 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016–17 లోనే రూ.80 కోట్ల వ్యయంతో ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవి, మల్లూర్, బొగత జలపాతాల సమగ్ర అభివృద్ధి చేపట్టిందని వెల్లడించారు. ఇందులో భాగంగానే మేడారంలో అతిథిగృహం, ఓపెన్ ఆడిటోరియం, పర్యాట కుల విడిదిగృహాలు, తాగునీటి సరఫరా, సో లార్ లైట్లు తదితర సౌకర్యాలను కల్పించిం దని వివరించారు. గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర ప్రభుత్వం విశేషంగా గౌరవిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
మేడారం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, వరంగల్/తాడ్వాయి: మహాజాతరకు ముందే భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం భక్తుల తాకిడి పెరగడంతో మేడారం సందడిగా మారింది. ఈ ఒక్కరోజు దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా భక్తులు దేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈసారి జాతరకు ముందు నెల రోజుల నుంచే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. 16 నుంచి జాతర మహాజాతర ఉత్సవాలు ఈ నెల 16న బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 16న (బుధవారం) కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. 17న (గురువారం) చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. 18న (శుక్రవారం) భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 19న (శనివారం) సమ్మక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. కాగా, సమ్మక్క–సారలమ్మల పూజారులు అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. దేవాదాయ శాఖ అధ్వర్యంలో పూజారులకు కావాల్సిన పూజ సామగ్రి, దుస్తులు అందించారు. భక్తుల తాకిడి.. ట్రాఫిక్ జామ్ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు ముందస్తుగా శనివారం నుంచే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగి హన్మకొండ–మేడారంకు వెళ్లే రహదారి పస్రా, తాడ్వాయి, నార్లాపూర్ మార్గాల్లో పలుచోట్ల ట్రాఫిక్ జామైంది. తాడ్వాయి–మేడారం మధ్య గంటల తరబడి వాహనాలు నిలిచి భక్తులు ఇబ్బందిపడ్డారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మేడారం సందర్శనలో ఉండటం, మరోవైపు మేడారం బస్ డిపో ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించాల్సి వచ్చింది. పోలీసులు అప్రమత్తమై ఎక్కకికక్కడ వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి మళ్లించి నియంత్రణ చర్యలు చేపట్టారు. మేడారం రూట్‌మ్యాప్ మేడారం జాతరకు అంతా సిద్ధమైంది. 16 నుంచి ప్రజలు తరలివచ్చి సమ్మక్క, సారక్క గద్దెలను దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో అక్కడికి ఎలా వెళ్లాలి.. ఎలా రావాలి.. ట్రాఫిక్ ఆంక్షలు ఏంటి.. వాహనాల పార్కింగ్ ఎక్కడ.. లాంటి సందేహాల నివృత్తికి రూట్‌మ్యాప్ -
మేడారంలో భక్తజన సందడి
సాక్షి, ములుగు: ములుగు జిల్లా మేడారం జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వాహనాల ద్వారా చేరుకుని.. జంపన్న వాగులో స్నానాలు చేసి.. గద్దెల వద్ద సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముడుపులు కట్టారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. వాహనాలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాకపోకలను పునరుద్ధరించారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
మంత్రుల ఆదేశాలు బేఖాతర్.. కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడే
ఎస్‌ఎస్‌తాడ్వాయి (ములుగు జిల్లా): మేడారం జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోంది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నెల రోజుల ముందు నుంచే అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై కుస్తీ పడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా కోళ్లు, మేకలు, గొర్లను వధించి వ్యర్థాలను పడేయడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. వ్యర్థాల ద్వారా ఈగలు, దోమలు సైతం వ్యాపి చెందుతున్నాయి. మంత్రులు చెప్పినా.. జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధానమని, కోవిడ్ నేపద్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇటీవల మేడారంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రులు సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినా వారి ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదిలాఉండగా తల్లులను దర్శించుకునేందుకు గత నెల రోజుల నుంచి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. వారంతా చిలకలగుట్ట, శివరాంసాగర్, ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ ప్రాంతాల్లో విడిది చేస్తున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు తెచ్చిన మేకలు, కోళ్లను ఎక్కపడితే అక్కడ వధిస్తున్నారు. దీంతో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోళ్లను, మేకలను ఎక్కడపడితే అక్కడ వధించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిరుపయోగంగా మరుగుదొడ్లు మరుగుదొడ్లు నిరుపయోగం.. మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. భక్తుల సౌకర్యర్థం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నీళ్ల కోసం కుండీలను కట్టారు. అంతాబాగానే ఉన్న కుండీల్లో మాత్రం నీరు పోయడం లేదు. దీంతో జాతరకు వస్తున్న భక్తులు మల, మూత్ర విసర్జన సందర్భంగా ఇబ్బందులు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వాటర్ బాటిళ్లలో నీరు తీసుకుని మరుగుదొడ్లను వినియోగించుకోవడంతో కంపు కొడుతున్నాయి. కాగా, జాతర నాలుగు రోజులు మాత్రమే మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలనే అధికారుల ఆలోచనను భక్తులు తప్పుపడుతున్నారు. ముందస్తుగా జాతరకు వచ్చే వారికోసం సైతం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
18న మేడారానికి సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు. జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు. సీఎస్, డీజీపీ దిశానిర్దేశం సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
మేడారం జాతర ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-
‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాసమ్మేళనంగా ఖ్యాతికెక్కిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర వచ్చే ఏడాది మాఘమాసంలో నాలుగురోజులపాటు జరగనుంది. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర నిర్వహించనున్నట్లు మేడారం ఆలయపూజారులు ఇదివరకే ప్రకటించారు. ఈ జాతరకు జనవరి నుంచే భక్తుల రద్దీ పెరగనుంది. అయితే ఆ ప్రాంతంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చేవిధంగా అభివృద్ధి పనులు ఇంకా మొదలుకాలేదు. జాతరను పురస్కరించుకొని చేపట్టాల్సిన పనుల కోసం సుమారు రూ.114.95 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.75 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నెల 15 నాటికి టెండర్లు పూర్తిచేసి పనులు మొదలెట్టాల్సి ఉండగా, ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అరకొర నిధులు.. అత్తెసరు పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ మహాజాతర అభివృద్ధికి ప్రభుత్వాలు అరకొరగా నిధులు కేటాయించి తాత్కాలిక పనులు చేపట్టాయి. స్వరాష్ట్రంలో మహాజాతర అంటే ఇలా నిధుల కేటాయిం పు ఉండాలే అనేలా.. రూ.150.50 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. మేడారం జాతర చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదు. భక్తులకు కూడా తాగునీరు, శానిటేషన్, రోడ్ల సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఈ–ప్రొక్యూర్ దశలో టెండర్లు... పెండింగ్‌లో రోడ్ల పనులు మేడారం జాతర పేరుతో 2016, 2018, 2020లలో వివిధ ప్రాంతాలకు మంజూరైన రోడ్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో వన్–వే ట్రాఫిక్, వాహనాల రాకపోకల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది వన్–వే చేసిన క్రమంలో ఏటూరునాగారం, ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన ప్రైవేటు వాహనాలను కొండాయి మీదుగా మేడారం వైపు మళ్లించారు. ఈసారి ఆ రోడ్లు గుంతలమయంగా మారడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈసారి రూ.75 కోట్ల విడుదలకు ముందు, తర్వాత ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష లు నిర్వహించారు. అయినా పనులన్నీ ఇంకా టెండర్ల దశ దాటకపోవడంతో అవి ఎప్పటికీ పూర్తవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 15కల్లా మహాజాతర పనులు మేడారం జాతరకు సమయం దగ్గర పడుతున్నందున ఆయా శాఖల అధికారులు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల నియమావళి పాటిస్తూ నడుస్తున్న పనులకు టెండర్లు పిలిచి, 2022 జనవరి 15 కల్లా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్, ములుగు -
ఆ రోజు వీఐపీలకు అనుమతివ్వకండి
సాక్షి, హైదరాబాద్: ‘‘మేడారం.. శుక్రవారం.. సమ్మక్క, సారలమ్మ దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్షల్లో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ మరీ పెరిగిపోవటంతో దర్శించుకున్నవారిని వేగంగా ఆ ప్రాంతం నుంచి తరలించేందుకు అధికారుల సూచనతో ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. నిమిషానికి 20 బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు జరిగాయి. కానీ అదే సమయంలో కొందరు వీఐపీలు వస్తున్నా రన్న సమాచారంతో పోలీసులు ప్రధాన రోడ్డుపైకి బస్సులను రాకుండా ఆపేశారు. అలా 2 గంటలపాటు బస్సులు నిలిచిపోవటంతో, ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. భక్తుల్లో అసహనం పెరిగింది. క్యూలైన్లు అదుపుతప్పాయి. అంతా గందరగోళం.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిలసలాటకు దారితీస్తుండగా... అతికష్టమ్మీద అధికారులు అదుపు చేశారు’’ఇది గత జాతరలో నెలకొన్న పరిస్థితి.. ఉన్నత స్థానాల్లో ఉండీ అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించిన రాజకీయ నేతలు, వారికి దారి ఇప్పించే అత్యుత్సాహంతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. ఏమాత్రం అదుపుతప్పి తొక్కిసలాట జరిగినా... పర్యవసానం భయంకరంగా ఉండేది. రద్దీని నివారించేందుకు ముందస్తు సన్నాహాలు... ఈసారి ఆ పరిస్థితి పునరావృతం కాకూడదంటే, సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువుదీరిన రోజు వీఐపీలకు అనుమతివ్వొద్దని.. ఆర్టీసీ, పోలీసు అధికారులకు సూచించింది. వచ్చే ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న మేడారం జాతరకు మెరుగైన రవాణా వసతి కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా ఆర్టీసీ అధికారులు భేటీ అయి గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఈసారి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈసారి 4500 బస్సులను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉత్సవాలు జరిగే రెండో వారంలో గురు, శుక్ర, శనివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందులో శుక్రవారం ఇద్దరు దేవతలు గద్దెమీద ఆసీనులై సంయుక్తంగా దర్శనమిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఆ సమయంలో అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో రద్దీ పెరుగు తుంది. దర్శనం ముగిసిన వారిని వీలైనంత వేగంగా అక్కడి నుంచి తరలించటం ద్వారా, రద్దీని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పెద్దమొత్తంలో బస్సులను సిద్ధంగా ఉంచి, నిమిషానికి కనీసం వేయి మందిని తరలించాలని నిర్ణయించారు. ఇది జరగాలంటే ప్రధాన రోడ్డు క్లియర్‌గా ఉండాలి. గత జాతరలో సరిగ్గా అదే సమయంలో వీఐపీలు వచ్చారు. సాధారణ భక్తుల రాకపోకలపై రెండుగంటలపాటు పోలీసులు ఆంక్షలు విధించారు. అది సమస్యలకు కారణమైంది. ఈసారి ఆ కీలక తరుణంలో వీఐపీలు రాకుండా, వారు ముందుగానే దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. -
రామప్ప దగ్గర భూముల ధరకు రెక్కలు
హాలో సునీల్ అన్నా, బాగున్నవా ? నేను శ్రావణ్‌ని మాట్లాడుతున్న.. మన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చింది కదా.. మన తరఫున అక్కడో వెంచర్ వేద్దామని ప్లాన్ చేస్తున్నం.. నువ్వే జర మంచి జాగ చూపియ్యాలే.. పైసలెంతైనా పర్వాలేదు. కానీ మనకు ఆడ జాగ కావాలే. నువ్వేంజేస్తవో ఏమో.. నిన్ను కూడా అరుసుకుంట. ఒక్క సునీల్కే కాదు రామప్ప ఆలయం కొలువైన పాలంపేట దాని చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజల ఫోన్లు వారం రోజులగా మోగుతూనే ఉన్నాయి. భూముల కోసం ఆరాలు తీస్తునే ఉన్నారు. నిమిషాల లెక్కన అక్కడ భూముల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కడం ఆలస్యం రామప్పలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. వారం రోజుల వ్యవధిలోనే ఊహించని స్థాయికి చేరుకున్నాయి. వరంగల్, హైదరాబాద్‌ల నుంచి బడా రియల్టర్లు ఇక్కడ వాలిపోతున్నారు. ధరెంతైనా పర్వాలేదు.. ఇక్కడ మనకో వెంచర్ ఉండాలన్నట్టుగా బేరాలకు దిగుతున్నారు. యునెస్కో గుర్తింపు కాకతీయులు ఎనిమిది వందల ఏళ్ల కిందట కట్టించిన రుద్రేశ్వరాలయాలన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా ఇటీవల యునెస్కో గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ గుర్తింపు దక్కించుకున్న తొలి కట్టడంగా రికార్డులెక్కింది. యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత రామప్పగుడిని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కసారిగా ఆలయం చుట్టు పక్కల స్థలాల ధరలకు రెక్కలు వచ్చాయి. గుర్తింపుతో రెట్టింపు ఆలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంది. సాగునీటి లభ్యత ఉండటంతో ఇక్కడి భూములకు ముందు నుంచి డిమాండ్ ఎక్కువ. ఎకరం పొలం సుమారు రూ. 20 లక్షల నుంచి 25 లక్షల వరకు పలికేది. అయితే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం ఒక్కసారిగా ఎకరం భూమి ధర రూ. 40 లక్షల నుంచి 45 లక్షలకు చేరుకుంది. వారం తిరక్కుండానే యునెస్కో గుర్తింపు రావడం ఆలస్యం వరంగల్, హైదరాబాద్‌లకి చెందిన రియల్టర్లు ఇక్కడి స్థలాల కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు. తమకే స్థలాలు అమ్మాలంటూ రైతులతో సంప్రదింపులు మొదలెట్టారు. దీంతో రియల్టర్ల మధ్య నెలకొన్న పోటీతో వారం తిరిగే సరికి ఇక్కడ ఎకరం భూమి ధర రూ. 60 లక్షల నుంచి 65 లక్షలకు చేరుకుంది. ఇక్కడే డిమాండ్ రామప్ప దేవాలయం ములుగు జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్లు, వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఉంది. వరంగల్ - భూపాలపట్నం జాతీయ రహదారి 163లో జంగాలపల్లి క్రాస్‌రోడ్డు నుంచి రామప్ప ఆలయం వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలోని భూములకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా రియల్టర్లు ఆఫర్లు ఇస్తుండటంతో ఇక్కడి రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు అగ్రిమెంట్లు చేసుకునేందుకు సిద్ధమవుతుండగా మరికొందరు మరింత రేటు పెరుగుతుందేమో అని వేచి చేసే ధోరణిలో ఉన్నారు. యాదగిరిగుట్ట యాదాద్రి తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వా యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణం భువనగిరి-యాదగిరిగుట్ట-ఆలేరు రోడ్డులో భూముల ధరకు రెక్కలు వచ్చాయి. నెలల వ్యవధిలోనే వందల కొద్ది వెంచర్లు వెలిశాయి. ప్రమోటర్లను పెట్టుకుని లే అవుట్ పూర్తికాకముందే ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి రామప్ప దగ్గరా కనిపిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేందుకు రియల్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. భద్రాకాళి ఆలయం పర్యాటక కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నిలుస్తోంది. వరంగల్‌లో వేయిస్థంభాలగుడి, భద్రాకాళి, ఖిలావరంగల్ మొదలు రామప్ప ఆలయం, సమ్మక్క సారలమ్మ మేడారం, లక్నవరం, పాకాల, బొగత జలపాతం, మల్లూరు నరసింహస్వామి, కాళేశ్వరం, పాండవులగుట్ట, ఘణపురం కోటగుళ్లు, ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి ఏకో టూరిజం, ప్రాచీన కాలానికి చెందిన డోల్మన్ సమాధాలు వంటి ఆథ్యాత్మిక పర్యాటక, ప్రకృతి రమణీయ ప్రాంతాలు వరుసగా ఉన్నాయి. ఆదివారం వస్తే పర్యాటకుల వాహనాలు వరంగల్ - ఏటూరునాగారం రోడ్డులో బారులు తీరుతాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో టూరిజం సర్క్యూట్‌ని అభివృద్ధి చేస్తున్నాయి. బొగత జలపాతం ఢోకాలేదు తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాయి. ఇప్పటికే పాలంపేట ప్రాథికార సంస్థ ఏర్పాటును చేశారు. మరోవైపు త్వరలోనే వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరంల్ టూరిజం సర్క్యూట్లో అటు బొగత జలపాతం ఇటు వరంగల్ నగరానికి నట్టనడుమ రామప్ప కొలువై ఉంది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. దీంతో రామప్ప దగ్గర పెట్టుబడికి ఢోకా లేదనే నమ్మకం రియల్టర్లలో నెలకొంది. హోటళ్లు రిసార్టులు రామప్ప దగ్గర భూములు కొనేందుకు రియల్టర్లతో పాటు బడా కంపెనీలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రామప్ప సమీపంలో హోటళ్లు, రిసార్టులు కట్టేందుకు సుముఖంగా ఉన్నాయి. హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి అనువుగా ఉండే స్థలం కోసం అన్వేషణ చేస్తున్నాయి. -
మేడారం వనదేవతల దర్శనం పునఃప్రారంభం
-
21 రోజులు ‘మేడారం’ మూసివేత
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల పాటు మూసివేయనున్నారు. ఆదివారం ఇక్కడి ఎండోమెంట్ కార్యాలయంలో ఆలయ ఈఓ రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. మేడారం మినీ జాతరలో విధులు నిర్వహించిన ఇద్దరు ఎండోమెంట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 21 రోజుల పాటు అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా దృష్ట్యా భక్తులు మేడారానికి రావొద్దని కోరారు. బుధవారం తిరుగువారం పండుగ, పూజా కార్యక్రమాలను సమ్మక్క– సారలమ్మ పూజారులు అంతర్గతంగా నిర్వహించుకుంటారన్నారు. కాగా, ఆదివారం భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కు లు చెల్లించుకున్నారు. -
మేడారం ఆలయం మూసివేత
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా మేడారంలోని శ్రీసమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని మరో మూడు నెలల పాటు మూసివేయనున్నట్లు పూజారులు, మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు ప్రకటించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పలు అంశాలపై చర్చించేందుకు శుక్రవారం వారు సమావేశమయ్యారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలోని ఆలయాలను మూసివేసి, తిరిగి తెరిచినా మేడారంలో ఆలయాన్ని మాత్రం తెరవలేదు. అయితే, వైరస్ విజృంభణ తగ్గకపోవడంతో మరో మూడు నెలల పాటు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కలెక్టర్, స్థానిక అధికారులకు మేడారం సర్పంచ్ చిడ్డం బాబూరావు లేఖ అందజేశారు. -
జల దిగ్బంధంలో మేడారం
-
జల దిగ్బంధంలో మేడారం
సాక్షి, ములుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ములుగు జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జంపన్న వాగు ఉధృతంగా పొంగిపొర్లుతుంది. వర్షపు నీరు మేడారం గ్రామాన్ని పూర్తిగా చుట్టేశాయి. ఓ గ్రామాన్ని వర్షపు నీరు పూర్తిగా ఇలా గ్రామాన్ని చుట్టేయడం చరిత్రలో మొదటిసారి. ప్రస్తుతం జంపన్న వాగు నీరు మేడారం గద్దెల సమీపంలోని ఐటీడీఏ కార్యాలయానికి తాకాయి. ఇప్పటికే పూర్తిగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో పోలీసులు పస్రా నుంచి మేడారానికి రవాణా సౌకర్యాలను పూర్తిగా నిలిపివేశారు. ఊరట్టం వద్ద భారీగా జంపన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. మేడారం గ్రామం బ్రిడ్జీపై నుంచి ప్రవహిస్తూ గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతితో మేడారం అమ్మవార్ల గద్దెలను జంపన్న వాగు నీరు తాకనుంది. వర్షపు నీరు ఇప్పటికే చిలుకల గుట్టను తాకి మేడారం గద్దెల వైపు భారీగా ప్రవహిస్తోంది. -
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
-
మేడారం జాతరలో కొత్త ట్విస్ట్
సాక్షి, భూపాలపల్లి : మేడారం మహా జాతర ముగింపులో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఎప్పటిలాగా జాతర ముగియగానే సమ్మక్క-సారలమ్మను వనప్రవేశం చేస్తారు. అయితే ఈ సారి ఈ తంతు నిర్వహించాల్సిన ఆదివాసీ పూజారులు అలిగి కూర్చున్నారు. దేవతలను తీసుకుపోమంటూ భీష్మించుకుపోయారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. దీంతో అధికారులు బుజ్జగింపు చర్యలకు దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశాయి. (వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు) మరోవైపు మేడారంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడారం జాతరను ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజు 15 లక్షల మందిని దేవాలయానికి పంపించడం ఒక ఘనత. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు. జాతీయ పండుగగా ప్రకటించండి మేడారం మహా జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాకు.. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న జాతరగా మేడారంకు ఈ గుర్తింపును ఇవ్వాలని కోరారు. శనివారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన అర్జున్ ముండాకు మేడారంలో ఇంద్రకరణ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. (మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు) -
వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు
సాక్షి, మేడారం : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా గంటపాటు దర్శనాలు నిలిపివేయడంతో క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులు నిరసనకు దిగారు. ఇక మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.మరోవైపు మేడారం జాతరలో ప్రజలకు తమ వంతు సహాయం అందిస్తున్నాయి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఎల్జీ, కార్టేవాలు. కాగ్నిసెన్స్ మీడియా ద్వారా జాతరకు వచ్చే భక్తులకు మాస్కులు, తాగునీరు, ఉచితంగా బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాయి. (వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు) -
మేడారం జాతరలో సీఎం కేసీఆర్
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ మేడారం జన జాతర
-
నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
-
కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మొద లైంది. కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధ వారం రాత్రి కొలువుదీరారు. అలాగే, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నం టింది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.50 గంటలకు గుడి నుంచి వెదురు బుట్ట (పట్టె మూకుడు)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయల్దేరారు. జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకొని మేడారం గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను అర్ధరాత్రి 12.24 గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళ్తే.. సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేర తాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్ట (పట్టెమూకుడు) లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారల మ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాక ను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. తీసుకొచ్చారిలా.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. ప్రత్యేక పోలీసుల బృందం రోప్‌పార్టీ (తాడు వలయం)గా ఏర్పడి వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున డీఆర్వో రమాదేవి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఇటీవలే బదిలీపై వచ్చిన పీవో హన్మంతు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీలు దక్షిణమూర్తి, మురళీధర్, డీఎస్పీ విష్ణుమూర్తి మూడంచెలుగా 80 మందితో రోప్ పార్టీ, భారీ బందోబస్తును పర్యవేక్షించారు. భక్త జన సందోహం సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకో వడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆర్టీసీ పాయింట్ మీదుగా, రెడ్డిగూడెం, ఊరట్టం, కాల్వపల్లి, నార్లాపూర్ మీదుగా లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెతు ్తన్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారులన్నీ కిటకిటలాడాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు తీరారు. నేడు కొలువుదీరనున్న సమ్మక్క మేడారం జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి గురువారం చేరుస్తా రు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమ యంలో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ సమ్మ క్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటి ల్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలు కుతారు. లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదు రేగి.. కోళ్లు, మేక లను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి ఎస్ఎస్ తాడ్వాయి: వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండేళ్లకోసారి ఈ తంతును సాగిస్తున్నారు. పగిడిద్దరాజు పూజారులు పసుపు–కుంకుమ, చీర సారెను, సమ్మక్క పూజారులు దోవతి, కండువాలను అందించారు. ఈ తతంగానికి మేడారం గ్రామం వేదికగా నిలిచింది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ, జంపన్న. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సమ్మక్క – పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. సమ్మక్క ఆలయమే వేదిక మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మ«ంగళవారం మధ్యాహ్నం 4.30 గంటలకు మేడారానికి బయలుదేరగా మేడారానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. ప్రధాన పూజారులుగా పెనక వంశీయులు పెనక బుచ్చిరాములు, పెనక మురళీధర్ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క పూజారులు గుడికి చేరుకొని పగడిద్దరాజుతో వివాహ పూజలు చేశారు. అనంతరం సమ్మక్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క – పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు. నేడు సమ్మక్క గద్దెపైకి కంకవనం ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తీసుకురావడం కీలకమైనది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరుకోకముందే అక్కడికి కంకవనం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం సమ్మక్కతల్లిని గద్దెపై ప్రతిష్టించడానికి ముందు కంకవనాలను అక్కడ ప్రతిష్టిస్తారు. కంకవనాలను తీసుకురావడంలో పూజారులు ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు సమ్మక్క పూజారులు కుటుంబీకులు రోజంతా ఉపవాసం ఉంటారు. సమ్మక్క పూజారులు, ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కంకవనానికి పూజలు నిర్వహించారు. ఈ పూజ వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోవడమే కాకుండా ఎవరినీ దగ్గరకు రానివ్వరు. వనంలో పూజ ముగిసిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుంటారు. గురువారం తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి వెళ్తారు. అప్పటికే ఎంపిక చేసిన ఉన్న కంకను తీసుకుని మార్గమధ్యలో ఇంగ్లి ష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు చేస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు చేరుస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించి కంకను ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. పూజారుల ఆగ్రహం ములుగు: భద్రత విషయంలో పోలీసులు అతి చేస్తున్నారని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క పూజారి రమేశ్‌ను గద్దెల ప్రధాన ప్రవేశ మార్గం నుంచి అనుమతించక పోవడంతో ఆయన ఏకంగా తాళాలను పగులగొట్టి మరీ గద్దెల వద్దకు వెళ్లారు. దీంతో పాటు బుధవారం ఉదయం కన్నెపల్లి ఆడపడుచులు మేడారంలోని గద్దెను అలక (అలంకరణ)డానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 6.50కి సారలమ్మను ఆల యం నుంచి బయటికి తీసుకొచ్చారు. సమ్మక్క గుడి వరకు సాఫీగా సాగిన ప్రయాణం గుడి ప్రాంగ ణం వచ్చే సరికి గందరగోళంగా మారింది. ఒక వర్గం పూజారులు ఆలయం పక్కన ఉన్న విడిది స్థానంలో, మరో వర్గం పూజారులు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు దిగింది. మొత్తానికి పూజారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమ్మక్క – సారలమ్మ గద్దెల తాళాలను తమ వద్దే ఉంచుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
మేడారం: గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు
సాక్షి, ములుగు : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలు సమ్మక్క – సారలమ్మ జాతర అసలు ఘట్టం మొదలైంది. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారం రాత్రి గద్దెలపై ఆశీనులయ్యారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది. గురువారం (ఫిబ్రవరి 6) సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. రేపు ఉదయం పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. బుధవారం నుంచి శనివారం వరకు (నాలుగు రోజులు) తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర కొనసాగుతుంది. ఇక మేడారం మహా జాతర నేపథ్యంలో జనం పోటెత్తారు. ఎటు చూసినా ‘సమ్మక్క సారలమ్మ’సందడి నెలకొంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం తెలంగాణ వ్యాప్తంగా ఈ సారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కంటే ఈ సారి సమాచార, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగవడంతో ఎక్కువ మంది వన దేవతల దర్శనం కోసం మేడారానికి పోటెత్తుతున్నారు. మేడారంలో ప్రముఖుల పూజలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రముఖుల తాకిడి పెరిగింది. బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వైరా ఎమ్మెల్యే రాములు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ కుమార్తెలు సుస్మిత, సుమిత్ర వరాల తల్లులను దర్శించుకున్నారు. నిల్చునే తలనీలాల సమర్పణ మేడారం జాతరలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇక తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట సైతం కిక్కిరిసిపోయింది. దీంతో జంపన్న వాగు వెంట ఎక్కడపడితే అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూర్చునే స్థలం కూడా లేకపోవడంతో భక్తులను నిల్చోబెట్టే నాయీ బ్రాహ్మణులు తలనీలాలు తీయడం కనిపించింది. ట్రిప్‌కు రూ.3వేలు ఏటూరునాగారం: మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈసారి విహంగ వీక్షణం చేసేందుకు వీలు కల్పించారు. హెలికాప్టర్లో మేడారం జాతర పరిసరాల్లో ఒక ట్రిప్ వేయాలనుకునే వారు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న పలువురు భక్తులు మంగళవారం హెలికాప్టర్లో జాతరను విహంగ వీక్షణం చేసి సంబురపడ్డారు. ఇక దూర భారం, ఇతర కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులు స్థానికంగా మినీ మేడారం జాతర్లలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, వృత్తి రీత్యా వలస వెళ్లిన అనేక మంది తమ సొంత ఊళ్లకు జాతర కోసం రాకపోకలు అధికమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. -
మేడారం: నేడు గద్దెపైకి పగిడిద్దరాజు
సాక్షి, మేడారం(మహబూబాబాద్): సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా బుధవారం మేడారంలోని గద్దెలపై సమ్మక్క భర్త పగిడిద్దరాజును పూజరులు ప్రతిష్టించనున్నారు. ఈ క్రమంలో గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును తీసుకుని పెనుక వంశస్తులు కాలినడకన ప్రయణమయ్యారు. అటవీ మార్గం గుండా దాదాపు 66 కి.మీ నడుచుకుంటూ మేడారం గద్దెల వద్దకు చేరుకుని పగిడిద్దను రాజును ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా పోనుగొండ్ల గ్రామ ప్రజలంతా నేడు తమ ఇళ్లను మట్టితో పూతపూసి, రంగురంగు ముగ్గులతో అలంకరించుకుంటారు. పెనుక వంశస్థులు ఇంటి నుంచి స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో ఆలయానికి తీసుకొస్తారు. పడగ రూపంలో అలంకరించిన స్థానిక స్వామివారి ప్రతిమతో అటవీ మార్గం గుండా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం రాత్రికి సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు సమ్మక్క, సారక్క గద్దెలను ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పువ్వులతో అలంకరిస్తారు. ఇందుకోసం దాత వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి పువ్వులను తెప్పించారు. కాగా సమ్మక్క సారలమ్మ జాతరకు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్లో అక్కడి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు ఛత్తిష్‌ఘడ్ హోంమంత్రి కుటుంబంతో ఆలయాన్ని వచ్చారు. -
అడవి బిడ్డలు ధీర వనితలు
సమ్మక్క, సారలమ్మ.. తల్లీకూతుళ్లు. గిరిజనుల అవస్థలు చూసి చలించిపోయారు. వారి కోసం పోరాడి రణభూమిలోనే ప్రాణాలొదిలారు. సమ్మక్క, సారలమ్మ తమకోసం చేసిన ఆ త్యాగానికి గిరిజనులు గండెల్లోనే గుడి కట్టారు. వారినే ఆరాధ్య దైవాలుగా భావిస్తూ రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నమి) రోజుల్లో మేడారంలో అంగరంగ వైభవంగా జాతర చేస్తున్నారు. కోటి మందికిపైగా భక్తులు వచ్చే.. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ గిరిజన వనజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ధీర వనితల జీవిత విశేషాలు.. సంక్షిప్తంగా.. మీ కోసం. జన్మ వృత్తాంతం సమ్మక్క పుట్టుక వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లినçప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ పాప కనిపించిందట. అలా దొరికిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. మేడరాజు ఆలన, పాలనలో పెరిగిన సమ్మక్క యుక్తవయస్సుకు వచ్చాక ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు, కాకతీయుల సామంతరాజు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది. మేడారంలో సారలమ్మ తల్లి గద్దె జాతర స్థల పురాణం మేడారాన్ని ఆక్రమించేందుకు దండెత్తిన కాతీయుల సైన్యాన్ని తిప్పికొట్టేందుకు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి పోరాడిన సమ్మక్క.. కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని సైతం ముప్పుతిప్పలు పెడుతుంది. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విని కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతుంది. శత్రువు వర్గంలో ఒకరు వెనుక నుంచి వచ్చి ఆమెను బల్లెంతో పొడుస్తారు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని... శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే సమ్మక్క అదృశ్యమౌతుంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించినా ప్రయోజనం ఉండదు. ఓ పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న ఒక భరిణె కనిపిస్తుంది. గిరిజనులు ఈ భరిణనే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన సమ్మక్కను, ఆమె కూతురు సారలమ్మను స్మరించుకుంటూ జాతర చేసుకుంటారు. అలా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. జాతరకు వచ్చే భక్తులు అక్కడి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు. మేడారంలో సమ్మక్క తల్లి గద్దె విగ్రహాలు ఉండవు! మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలూ ఉండవు. గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని ‘సమ్మక్క, సారలమ్మల గద్దెలు’ అంటారు. రెండు గద్దెలలో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాలనే దేవతామూర్తులుగా కొలుస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్తు్త బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్ ఫొటోలు : గుర్రం సంపత్‌గౌడ్ -
మేడారం జాతర అరుదైన ఫోటోలు మీ కోసం....
-
‘మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. మేడారాన్ని అతిపెద్ద గిరిజన జాతరగా అభివర్ణించారు. సంప్రదాయ బద్ధంగా జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరను మరింతగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. -
మేడారం జాతరలో అపశ్రుతి
సాక్షి, వరంగల్ : మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు సికింద్రాబాద్‌కు చెందిన వినయ్, దుమ్ముగూడెం మండలం సుబ్బారావుపేటకు చెందిన వినోద్‌గా గుర్తించారు. వీరిద్దరు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనానికి వచ్చి స్నానాలు చేసేందుకు జంపన్నవాగులో దిగారు. ఈ క్రమంలో వారికి మూర్ఛ వచ్చి వాగులో పడి మృతిచెందారు. మరోవైపు లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి మేడారం బాటపట్టారు. పెద్ద మొత్తంలో వాహనాలు బారులు తీరడంతో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం కసరత్తు ప్రారంభించారు. -
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యక బస్సులు
-
వనంలో జనజాతర
-
మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు
సాక్షి, హైదరాబాద్ : సమ్మక్క - సారలమ్మల మహాజాతర సందర్భంగా పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సేవలను అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభించారు. టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి బేగం పేట ఎయిర్ పోర్టు వరకు హెలికాఫ్టర్ సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. (మేడారం జాతర: నిలువెత్తు దోపిడి) హైదరాబాద్ నుండి ఆరుగురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలుతో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. విమాన సర్వీసులతో పాటు సమ్మక్క, సారలమ్మ దర్శనం కల్పిస్తామని, అదేవిధంగా రూ.2999 అదనంగా చెల్లిస్తే మేడారం జాతరను హెలికాప్టర్ ద్వారా తిలకించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ అద్బుత అవకాశం కల్పించిందన్నారు. పర్యాటకులు ఈ సదుపాయన్ని ఉపయోగించుకునేందు 9400399999 నంబర్‌ను సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె) మేడారంకు ప్రత్యేక రైళ్లు మేడారం జాతర సందర్భంగా సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి వరంగల్‌కు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ శనివారం ఓ ప్రకటన చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్-వరంగల్ (07014/07015) స్పెషల్ ట్రైన్ ఈ నెల 4వ తేదీ నుంచి 8 వరకూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు సాయంత్రం 5.45కు వరంగల్ నుంచి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు సికింద్రాబాద్ వస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్-వరంగల్ (07017/07018) స్పెషల్ ట్రైన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి ఉదయం 9.30 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. తిరిగి అదేరోజు ఉదయం 11 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. -
మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు
-
చిలకలగుట్టకు రక్షకుడు
సాక్షి, మేడారం(వరంగల్) : సమ్మక్కతల్లి కొలువు దీరిన మేడారం చిలకలగుట్టకు ప్రత్యేకత ఉంది. చిలకలగుట్ట అపపవిత్రకు గురికాకుండా ఉండేందుకు మేడారం సమ్మక్క–సారలమ్మ పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తల్లిగుట్ట వద్ద ఆదివాసీ యువకుడిని రక్షకుడిగా ఏర్పాటు చేశారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే జాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున గుట్టపైన కొలువైన సమ్మక్క తల్లిని పూజారులు కుంకుమ భరిణి రూపంలో అద్భుతమైన ఘట్టం మధ్య గద్దెపైకి తీసుకువస్తారు. పూజారులు తల్లిగుట్ట పవిత్రను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డు ఇతరులు గుట్టలోపలికి వెళ్లకుండా చూస్తున్నారు. పెరిగిన రక్షణ పూజారులు నియమించుకున్న సెక్యూరిటీ గార్డుతో తల్లిగుట్టకు రక్షణ మరింత పెరిగింది. ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చింది చిలకలగుట్ట చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు గుట్ట ముందు భాగంలో కొంత వరకు మాత్రమే ప్రహారి నిర్మించారు. పూర్తి స్థాయిలో నిర్మించకపోవడంతో కొంత మంది వ్యక్తులు పక్క దారి నుంచి పాదరక్షలతో గుట్ట వద్దకు వెళ్లడంతో అపపవిత్రకు కలుగుతుందని పూజారులు భావిస్తున్నారు. చిలకలగుట్ట వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాలా ఉంటూ భక్తులను, ఇతరులను లోపలికి వెళ్లకుండా రక్షకుడు చూస్తున్నారు. భక్తులు సహకరించాలని పూజారులు కోరుతున్నారు. -
ఏకకాలంలో రెండు మోటార్ల వెట్‌రన్
ధర్మారం(ధర్మపురి): కాళేశ్వరం ప్రాజెక్టులో మరోకీలక ఘట్టం గురువారం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ–6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్‌లోని రెండవ మోటార్ వెట్‌రన్ విజయవంతమైంది. 124.7 మెగావాట్ల విద్యుత్‌తో నడిచే రెండో మోటార్ సైతం 105 మీటర్ల లోతు నుంచి నీటిని తోడి మేడారం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేసింది. వెట్‌రన్ విజయవంతం కావడంతో ఇంజనీరింగ్ అధికారుల్లో హర్షం వ్యక్తమైంది. రెండో మోటార్‌కు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తికావడంతో అధికారులు గురువారం వెట్‌రన్‌కు ఏర్పాట్లు చేశారు. సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన హాజరై మోటార్ వద్ద ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఇద్దరూ కలిసి మోటార్ స్విచ్ ఆన్‌చేసి వెట్‌రన్ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నీటిని లిఫ్ట్ చేయడంతో.. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని వారు అభినందించారు. మిగిలిన పనులు సైతం ఇదే ఉత్సాహంతో పూర్తిచేయాలని ప్రోత్సహించారు. బుధవారం మొదటి మోటార్ వెట్‌రన్ విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. 30 నిమిషాలు వెట్‌రన్ మధ్యాహ్నం 1:45 గంటలకు రెండో మోటార్‌ను స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన ప్రారంభించారు. అనంతరం వారు జేసీ వనజాదేవి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సిస్టర్న్‌ల వద్దకు వచ్చారు. తర్వాత 15 నిమిషాలకు ఇంజనీర్లు మొదటి మోటార్‌ను కూడా ఆన్ చేశారు. కొంత ఆలస్యంగా మొదటి సిస్టర్న్ నుంచి నీరు ఉబికి వచ్చింది. ఏకకాలంలో రెండు మోటార్ల వెట్‌రన్ విజయవంతమైంది. రెండు సిస్టర్న్‌ల ద్వారా వచ్చిన నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా సమీపంలోని మేడారం రిజర్వాయర్‌లోకి చేరింది. కాలువలో పారుతున్న గోదావరి నీటికి స్మితాసబర్వాల్, శ్రీ దేవసేన, వనజాదేవి, ఇంజనీరింగ్ అధికారులు పూజలు చేశారు. సుమారు 30 నిమిషాలు రెండు మోటార్లు వెట్‌రన్ కొనసాగించి తర్వాత ఆఫ్ చేశారు -
ఫిబ్రవరిలో మినీ ‘మేడారం’
ఎస్ఎస్ తాడ్వాయి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2019 సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించే సమ్మక్క– సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. స్థానిక ఎండోమెంట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు జాతర తేదీలను ప్రకటించారు. ఫిబ్రవరి 20న బుధవారం మండమెలిగే పండుగతో ప్రారంభమయ్యే మినీ జాతర 23వ తేదీ శనివారంతో ముగుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు మినీజాతర తేదీల వివరాలను దేవాదాయశాఖ అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మహాజాతర తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ జాతర నిర్వహిస్తారు. ఈ సమావేశంలో సమ్మక్క– సారలమ్మ పూజారులు సిద్దబోయిన ముణేందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, మహేశ్, చంద గోపాల్, సిద్దబోయిన అరుణ్‌కుమార్, నర్సింగరావు, వసంతరావు, మల్లెల ముత్తయ్య, సిద్దబోయిన స్వామి, ప్రధాన వడ్డె కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ ఆలయం ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించాలి.. మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు అధికారులను కోరారు. దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు సమారు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలతోపాటు మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల సేవలు చాలా అవసరమని, నాలుగు రోజుల పాటు జరిగే మినీ జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారయంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మినీ జాతరను సైతం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు కోరారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా చెత్త తొలగింపు పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. జాతరకు వచ్చిన భక్తులు పడేసిన ప్లాస్టిక్ గ్లాజులు, పేపర్లు, వ్యర్థాలు పంట పొలాల్లో పేరుకుపోయాయి. ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేసిన రాజమండ్రి కార్మికులు.. జాతర ముగిసిన తర్వాత వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అరకోర కూలీలతో చెత్తను తొలగించడం సాధ్యం కావడం లేదు. గత జాతర కంటే ఈసారి పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేస్తామనుకున్న అధికారులు అంచనాలు తలకిందులయ్యేలా ఉంది. నామమంత్రంగా పనులు చేపట్టి చివరికి చేత్తులెత్తేస్తారేమోననే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలో రైతులు పంట పొలాల్లో చెత్తాచెదారం తొలగించపోవడంతో పశు వుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. జాతర సందర్భంగా పాడి రైతులు జాగ్రత్త తీసుకోవాలని పశువైద్యులు సూచించారు. ఈ మేరకు జాతర ముందు నుంచి ఇప్పటికి 20 రోజుల పాటు ఇళ్లలోనే పశువులను కట్టేస్తున్నారు. ఎక్కువ రోజులు పశువులను కట్టేయం వల్ల అవి అనారోగ్యానికి గురియ్యే ప్రమాదం ఉందని యాజమానులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా చెత్త తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పశువులను బయటకు వదిలితే ప్లాస్టిక్ పేపర్లు తిని వ్యాధుల బారిన పడతాయని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో దుర్గంధం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చెత్తను తొలగించ లేదు. దీంతో నార్లాపూర్, వెంగ్లాపూర్ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కలుషిత వాతావరణంతో వ్యాధుల వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కూలీల సంఖ్యను పెంచి చెత్తను తొలగించాల్సిన అవసరం ఉంది. సరిపడా కూలీలు లేక.. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, నార్లాపూర్, వెంగ్లాపూర్ గ్రామాల్లోని పంట పొలాలు చెత్తాచెదారంతో పరుచుకున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేశారు. తల్లుల వనప్రవేశం అనంతరం వారిని పంపించారు. జాతర సమయంలో వీరి అవసరం ఎంత ఉందో జాతర తర్వాత కూడా అంతే ఉంటుంది. అయితే రాజమండ్రి కార్మికులు వెళ్లడంతో స్థానిక కూలీలతో చెత్తను సేకరించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుత మేడారం, రెడ్డిగూడెం గ్రామాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. మేడారం నుంచి జంపన్న వాగు, కొత్తూరు, నార్లాపూర్ వరకు పంట పొలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. సరిపడా కూలీలు లేకపోడంతో చెత్త తొలగింపు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదని అధికారులే చెబుతుండడం గమనార్హం. వాసన భరించలేకపోతున్నాం భక్తులు పడేసిన చెత్తాచెదారం కూళ్లిపోయి దుర్వాసన వస్తోంది. బయటకు వెళ్తే చాలు ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలకుండా సౌకర్యాలు కల్పించిన అధికారులు.. స్థానిక గ్రామాల్లోని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. – ఎనగంటి రాములు, మాజీ ఎంపీపీ -
వనంలోకి జనదేవత!
-
గుండె పోటుతో మహిళా కానిస్టేబుల్ మృతి
సాక్షి, మేడారం : మేడారం జాతర విధుల్లో ఉన్న మహిళా హోంగార్డు ఎండీ.అక్తర్సుల్తానా(56) గుండెపోటుతో శుక్రవారం మృతిచెందింది. సిటీ ఆర్ముడ్ రిజర్వ్‌లో పని చేస్తున్న ఆమె ఆరు రోజుల క్రితం మేడారం జాతర విధుల్లో చేరారు. శుక్రవారం రాత్రి మేడారం పోలీస్ వసతిగృహంలో ఛాతి నొప్పితో కుప్పకూలగా హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
మేడారం అభివృద్ధికి రూ.200కోట్లు
-
వనదేవతకు బంగారం సమర్పించిన కేసీఆర్
-
మేడారం చేరుకున్న వెంకయ్యనాయుడు
-
మేడారంలో మొక్కులు చెల్లించిన ఉప రాష్ట్రపతి
సాక్షి, మేడారం(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీలోని గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించారు. ఈ సందర్భంగా నిలవెత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించారు. సమ్మక్క సారలమ్మ జాతరను ఆదివాసి కుంభమేళాగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మరో వైపు వనదేవతల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మేడారం భక్తులతో జనసంద్రమైంది. -
ఇవాళ మేడారం జాతరకు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం మహాజాతర పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్లోబయలుదేరుతారు. 1.15 గంటలకు మేడారంకు చేరుకుంటారు. 1.25గంటల నుంచి 1.45గంటల వరకు జాతర ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విడిదిలో బస చేస్తారు. 1.45 గంటలకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు వెళతారు. 1.50 గంటల నుంచి 2గంటల వరకు తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. తులాభారం తూగి నిలువెత్తు బెల్లాన్ని తల్లులకు కానుకగా ఇస్తారు. 3.10గంటలకు మేడారం నుంచి తిరుగుప్రయాణం అవుతారు. సీఎం రాక సందర్భంగా జాతర ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
గద్దెనెక్కిన వరాల తల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాల మధ్య ఆదివాసీల వడ్డెలు(పూజారులు) సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెలపైకి చేర్చారు. గురువారం సాయంత్రం సరిగ్గా 6.14 గంటలకు చిలుకల గుట్ట నుంచి బయల్దేరిన సమ్మక్క.. రాత్రి 8.33 గంటలకు గద్దెపైకి చేరుకుంది. వన జాతరలో ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. చిలకలగుట్ట మొత్తం జనంతో కిటకిటలాడింది. అక్కడ్నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. ఉదయం నుంచే మొదలు.. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం 5.30 గంటలకు చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం(వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు(కొత్త కుండలు)ను తెచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం సాయంత్రం నాలుగు గంటలకు చిలకలగుట్టపైకి బయల్దేరారు. సమ్మక్క రాక సందర్భంగా గుట్ట నుంచి గద్దెల వరకు దారి మొత్తం రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నిండిపోయింది. సమ్మక్కకు స్వాగతం పలికేందుకు ఆడపడుచులు, ముత్తయిదువులు ఆటపాటలతో అలరించారు. మేకలు, కోళ్లు బలిచ్చారు. శివసత్తులు, మహిళలు పూనకాలతో ఊగిపోయారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని సమ్మక్కపై వెదజల్లారు. సమ్మక్క రాకకు సూచనగా ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. చిలుకలగుట్ట నుంచి ఫెన్సింగ్ వరకు సమ్మక్క చేరుకునేలోపు మొత్తం నాలుగు సార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క ఎదురుకోళ్ల పూజామందిరం చేరుకున్న తర్వాత అక్కడ వడ్డెలు, పూజారులు ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు చేసి గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క గద్దెలపైకి వచ్చే సమయంలో ఆవరణలో విద్యుత్ సరఫరా నిలిపివేసి, తర్వాత కొనసాగించారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్కను దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్ సీఎం మేడారం సమ్మక్క తల్లిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గురువారం దర్శించుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం రమణ్‌సింగ్‌కు ఆహ్వానం పంపింది. గురువారం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం చేరుకున్న ఆయన.. మధ్యాహ్నం 1:00 గంటలకు సమ్మక్క గద్దెకు చేరుకుని కొబ్బరికాయ కొట్టారు. తర్వాత సారలమ్మ గద్దె వద్దకు వెళ్తారని భావించినా అక్కడ్నుంచే వెనుతిరిగారు. అంతకుముందు తన ఎత్తు బంగారాన్ని(బెల్లం) తులాభారం ద్వారా వన దేవతలకు సమర్పించారు. రమణ్‌సింగ్‌తో ఆ రాష్ట్ర మంత్రులు కేదార్ కశ్యప్, మహేష్ గగ్డే ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సాయన్న, వివేకానంద, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంబీపూర్ రాజులతోపాటు ఏపీ మంత్రి మాణిక్యాలరావు, ఛత్తీస్‌గఢ్ ఐజీ వివేకానంద సింహ, బీజాపూర్ ఎస్పీ ఎంఆర్.అహురి వనదేవతలను దర్శించుకున్నారు. ఒక్కరోజే 30 లక్షల మంది నలుగురు వన దేవతలు.. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి వరకు మేడారం గద్దెల ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క గద్దెలపైకి చేరే రోజు కావడంతో గురువారం ఒక్క రోజే ఏకంగా 30 లక్షల మంది మేడారానికి తరలివచ్చారు. -
సమ్మక్క–సారక్క జాతరకు తొలిరోజే పోటెత్తిన భక్తులు
-
నేటి నుంచే మహా జాతర
-
అడవి తల్లి అందరి మాత
ఆదివాసీలు పవిత్రంగా భావించే చిలకలగుట్ట మీద సమ్మక్క కొలువై ఉండే చోటు తెలిసిన అతికొద్ది మందిలో ఒకరు సిద్ధబోయిన మునీందర్. చిలకలగుట్టపైకి పూజారులంతా కలిసి వెళ్లినా మార్గమధ్యం నుంచి రహస్య ప్రాంతానికి చేరుకునే ఐదుగురిలో ప్రధానమైన వ్యక్తి ఇతనే. గడిచిన ఇరవై ఏళ్లుగా చిలకలగుట్టపై ఉన్న సమ్మక్కను కిందకు తీసుకువచ్చే బాధ్యతను నిర్వరిస్తున్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప మునీందర్ నుంచి వివరాలు వెల్లడి కావు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సమ్మక్క పూజారిగా నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడిపే మునీందర్ ‘నేను నా దైవం’ కోసం సాక్షితో మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మలను పోరాట యోధులు అంటారు. మరి వాళ్లెప్పుడు దేవుళ్లయ్యారు? మాకు వాళ్లు పోరాట యోధులు కాదు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు – సమ్మక్క యుద్ధం అనే ప్రచారంతో ఈ దేవతలతో సంబంధం లేదు. తరతరాలుగా సమ్మక్క సారలమ్మలు మా ఇలవేల్పులు. జాతర మూడు రోజుల్లోనే కాకుండా మిగతా ఏడాది అంతా సమ్మక్క సారలమ్మలకు నిత్య పూజలు ఉంటాయా? మా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మిగిలిన రోజుల్లోనూ పూజలు చేస్తాం. అయితే బు«దవారం నాడు మాత్రం సమ్మక్క వారంగా భావించి పూజలు చేస్తాం. బుధ, గురువారాలు, పౌర్ణమీ రోజుల్లోనూ పూజలు ఎక్కువగా ఉంటాయి. దసరా పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తాం. ఈ మాఘపౌర్ణమి పూజల్లో నియమాలు ఏ విధంగా ఉంటాయి? వాటిని ఉల్లంఘిస్తే కీడు జరిగిన సందర్భాలున్నాయా? వన దేవతలను తీసుకొచ్చే బాధ్యత ఉన్నందున మాకు కట్టుబాట్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇండ్లæనుంచి వచ్చే కాలువ నీళ్లు తొక్కం. బయట ఇళ్లలో భోజనాలు చేయం. సాధ్యమైనంత వరకు ఉదయం బయటకు వెళితే సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి చేరుకుంటాం. వనం తీసుకొచ్చేప్పుడు దిష్టి తగలకుండా కోడిగుడ్డు తిప్పి పడేస్తారు. ఇలా చేయకపోతే వనం తెచ్చేవారు ముందుకు కదలకుండా ఆగిపోతారు. గద్దెలకు బయల్దేరిన సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు ప్రయాణం విషయంలో ఈ విధానం కొనసాగుతుంది. ఎదురిళ్లు (ఎదుర్కోలు)దగ్గర శాంతిపూజ చేస్తాం. లేని పక్షంలో సమ్మక్క ముందుకు కదలదు. ఎదురిళ్లు దగ్గర ఏదైనా లోపం జరిగితే ప్రాణనష్టం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి, ఇప్పటివరకు అలాంటి ప్రమాదాలు చూడలేదు. ఇక ఏడాది పొడవునా కూడా నియమాలను ఉల్లంఘించం. నేనైతే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉంటాను. ఊరు విడిచి బయటకు వెళ్లను. ఊరంతా చేసే భోజనాల దగ్గర తినను. ఒకవేళ తినాలన్నా ముందుగా భోజనాన్ని తీసి ఉంచుతారు. ఇంట్లో కూడా ఎంగిలికాని అన్నమే తింటాను. జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవిస్తారని విన్నాం? జాతర సందర్భంగా పూజారులు మద్యం సేవించడం తప్పనిసరి అని బయట ప్రచారం ఉంది. కానీ, గుడిమెలిగే పండగ నుంచి మా పూజారులందరూ ఉపవాసాలు ఉంటాం. మద్యం జోలికి అస్సలు వెళ్లం. నియమ నిష్టలు పాటించకుండా ఉంటే సమ్మక్క సహించదు. జాతర సందర్భంగా ముఖ్యమైన రోజుల్లో చిలకలగుట్ట పైకి చేరుకుని సమ్మక్కకు మా ఆదీవాసీల పద్ధతిలో పూజలు చేస్తాం. ఈ సందర్భంగా నియమ నిష్టలు పాటించకుండా చిలకలగుట్ట ఎక్కడం ప్రారంభించామే అనుకోండి దాని ప్రభావం పలు రకాలుగా ఉంటుంది. గుట్ట ఎక్కలేం. ఎవరో చేత్తో వెనక్కి నెట్టేసినట్లుగా అవుతుంది. అడుగులు ముందుకు పడవు. కొన్నిసార్లు కనిపించని శక్తి (సమ్మక్క) కొరాడాతో కొడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మధ్యలోనే మా పూజారులు ఆగిపోతారు. చేసిన తప్పులు మన్నించమని అమ్మతల్లిని వేడుకుంటాం. పరిహారం చెల్లిస్తామని మొక్కుకుంటాం. ఆ తర్వాతే ముందుకు కదులుతాం. సమ్మక్క తల్లికి ఎరుపు వర్ణం అంటే ఇష్టం. అందువల్ల చిలకలగుట్టపైకి చేరుకునే సందర్భంలో ఎరుపు రంగు గుడ్డను తలకు చుట్టుకుంటాం. అమ్మకు ఎరుపు రంగు వస్తువులనే ఇచ్చుకుంటాం. మీరు సమ్మక్క, సారలమ్మను కాకుండా ఇంకెవరినైనా పూజిస్తారా? ప్రత్యేకంగా ఇతర దేవతలను పూజించం. పండగ రోజులు, ప్రత్యేక రోజుల్లో మాత్రం వనదేవతలకు దండం పెట్టుకుంటాం. జాతర సందర్భంగా కోటి పాతిక లక్షల మంది వస్తుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు భక్తిభావన ఉంటుందా? ఉంటుంది. ఆ భావన కోసమే అందరూ వస్తారు. ధనవంతులు సైతం వచ్చి అడవుల్లో, పొలాల్లో, వాగుల వెంట రెండు మూడు రోజులు బస చేస్తారు. ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగదు. అడవిలో జరిగే జాతర అయినా సరే కనీసం పాము భయం కూడా లేకుండా భక్తులు ఇక్కడే ఉంటారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా అవాంఛనీయ సంఘటనలు జరగడం చాలా అరుదు. అంటే ఇక్కడ ఆ అమ్మతల్లుల దయ ఉండటం వల్లే ఇది సాధ్యమౌతుంది కదా! మీ కుటుంబాల్లో సమ్మక్క, సారలమ్మలు చూపిన మహిమలు ఉన్నాయా? జాతర సమయంలో, రాత్రి సమయంలో గుడి దగ్గరికి వెళ్లినప్పుడు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పౌర్ణమి రోజున గద్దెల దగ్గరకు ఓ పెద్ద నాగుపాము వస్తుంది. నాకు చాలాసార్లు కనిపించింది. దేవాదాయశాఖ సిబ్బంది కూడా ఈ విషయం నాకు చెప్పారు. సమ్మక్క దగ్గరికి పాము రూపంలో పగిడిద్దరాజు వస్తాడు. అదే మాకు గుర్తు. బెల్లం బంగారం అంటారు కదా! దీనికి కారణం ఏమైనా ఉందా? మా ఆదివాసీలకు బెల్లం ఇష్టమైన వస్తువు, విలువైన వస్తువు కూడా. నిల్వ ఉంటుంది. తీపి కోసం తేనె మీదనే ఆధారపడేటోల్లు. ఇప్పుడంటే ఆ పరిస్థితులు లేవు కానీ, మరీ వెనుకటి రోజుల్లో బెల్లం తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. కష్టమైనదాన్ని సంపాదించి, దేవతలకు మొక్కు చెల్లిస్తే మంచి జరుగుతుందని మా నమ్మకం. అలా అందరి మొక్కు అయ్యింది. పూజారులైన మీకు మిగతా రోజుల్లో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి? సమ్మక్క సారలమ్మ పూజారులం అని మేమెక్కడా బయట ఎవ్వరికీ చెప్పుకోం. దాంతో మా గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో వాళ్లకు తెలిసినప్పటికీ ఎవ్వరూ దాని గురించి ప్రస్తావించరు. అందరిలాగే మేము సాధారణ జీవితమే గడుపుతాం. జాతర ముగిస్తే వ్యవసాయం చేసుకుంటాం. లేదా అడవికి వెళ్తాం. ఇప్పుడు పేపరొళ్లు వచ్చి మమ్మల్ని పట్టుకుని ఫోటోలు తీసుకుని మాట్లాడుతున్నారు. ఆ పేపర్లు కూడా మేం చూడం. గత ఐదారేళ్ల నుంచి జాతర నిర్వాహణలో ప్రభుత్వ అధికారులు మా అభిప్రాయాలను కొంత మేరకు పరిగణలోకి తీసుకుంటున్నారు. మమ్మల్ని గుర్తుపట్టే భక్తులు.... మేము బొట్టు పెట్టాలని, బంగారం ప్రసాదం ఇవ్వాలని ఆరాటపడతారు. అంతవరకే మాకు తెలిసింది. సమ్మక్క సారలమ్మ మిమ్మల్ని పూనడం, కల్లోకి వచ్చిన సందర్భాలున్నాయా? జాతర ముందు రోజుల్లో కలలో ముసలమ్మ రూపంలో సమ్మక్క ఎక్కువగా కనిపిస్తది. ఆ సమయంలో ఉలిక్కిపడి లేవడం జరుగుతుంది. ఆ విషయాలు బయటకు చెప్పేవి కావు. ఎక్కడైనా ఉపద్రవాలు, ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందే మీకు సూచనలు ఏమైనా కన్పించాయా? అలంటివేవీ లేవు. వనదేవతలైన ఈ అమ్మవార్లను కొలుచుకోవడం, మా పనులు మేం చేసుకోవడం అంతే తప్ప వేరే విషయాలు అంతగా తెలియవు. ఎన్ని తరాలుగా ఈ పూజారి విధానాన్ని మీరు అవలంభిస్తున్నారు. మీ తదనంతరం ఎవరికి ఈ విధానాన్ని, ఎలా పరిచయం చేస్తారు? కచ్చితంగా చెప్పలేం. ఎప్పటి నుంచో వస్తుంది. మా తాతల హయాంలో మాత్రం మా పూర్వీకులు చత్తీస్గడ్ నుంచి గోదావరి దాటి ఇటు వచ్చారని తెలిసింది. అప్పటి నుంచి సమ్మక్క మా ఇలవేల్పు. వంశపార్యంపరంగా పూజలు చేస్తున్నాం. మా ఇండ్లలో మగపిల్లలకు ఒకరి నుంచి మరొకరికి పూజా బాధ్యతలు అప్పగిస్తాం. తొలుత జాతర సందర్భంగా ఇతర బాధ్యతలు అప్పగిస్తాం. ఒక్కో జాతర గడుస్తున్న కొద్ది బాధ్యతలు పెంచుతాం. సరైన సమయం వచ్చినట్లు ఆ దేవతల నుంచి పిలుపు వస్తే అప్పుడు ప్రధాన పూజారి బాధ్యతలు అప్పగిస్తాం. అందరూ శిగమూగుతారు జాతర ప్రారంభానికి ముందురోజు రాత్రి సారలమ్మ పూజారులంతా కన్నెపల్లిలో గుడికి చేరుకుంటాం. ఆవునెయ్యి, ఆవుపాలతో సారలమ్మ ఆలయంలో ఉన్న పూజా వస్తువులను శుభ్రం చేస్తాం. అనంతరం రెండు గంటల పాటు పూజలు చేసి తెల్లవారుజామున ఇంటికి వెళ్తాం. మరుసటి రోజున అమ్మవారిని తీసుకువచ్చాక మా ఆదీవాసీ పద్ధతిలో పూజలు జరుగుతాయి. ఈ సమయంలోనే నాకు సారలమ్మ పూనుతుంది. సారలమ్మ ఆవహించిన తర్వాత నాకు తెలియకుండానే పరుగుల పెడతాను. దీంతో నన్ను(సారలమ్మ తల్లిని) శాంతిప జేసేందుకు నీళ్లు జల్లుతారు. మేడారం వెళ్లే దారిలో సారలమ్మకు కొమ్ము పడతారు. దూపం వేస్తారు. మేడారం బయల్దేరి సారలమ్మకు దారిపొడవునా భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు. శివాలతో ఊగిపోతుంటారు. సంతానం లేని వారు సంతాన ప్రాప్తికి, వరాల కోసం సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. వారిపై నుండి పూజారులం దాటి వెళితే వారికి ఆ తల్లి ఆశీస్సులు వచ్చినట్లు నమ్ముతారు. – కాకసారయ్య, పూజారి అందరిలానే నేను ఎంతో మంది భక్తులు తమ కోరికలు తీరాలని, తమ కష్టాలు తొలగిపోవాలని అమ్మ తల్లిని కొలుస్తారు. వారు అనుకున్న పనిని ఆ తల్లి చేసిపెడుతుంది. అందుకే ఏ ఏడుకి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఆ తల్లిని స్వయంగా తీసుకువచ్చే మాకు మరింత మేలు జరుగుతుంది అందరూ అనుకుంటారు. కానీ, అందరిలానే నేను. అమ్మను తీసుకురావడం అనేది నా బాధ్యత అంతే. అందరికీ మేలు చేసే తల్లి నా కుటుంబానికీ మేలు చేస్తుంది. – కొక్కెర కృష్ణయ్య, పూజారి మాఘ పౌర్ణమినాడు మనువు ఆదీవాసీల విశ్వాసం ప్రకారం సమ్మక్క భర్త పగిడిద్ద రాజు. వీరి సంతానం సారలమ్మ. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో కొలువై ఉంటారు. పూర్వం రోజుల్లో ప్రతి రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమిరోజు సమ్మక్క–పగిడిద్దరాజుకు వివాహం జరిపించడం ఆదివాసీ సంప్రదాయం. దీనికోసం సమ్మక్క పూజారులు గ్రామాల్లో తిరిగేవారు. వీరికి ఇచ్చేందుకు అప్పటి ఆదివాసీలు తమ పంటలో కొంత భాగాన్ని పక్కకు పెట్టేవారు. పంటలేని వారు కోళ్లు, మేకలు వంటి వస్తువులు సమర్పించుకునే వారు. ఇలా సేకరించిన వస్తువులతో మాఘశుద్ధ పౌర్ణమి లేదా ఆ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం రోజు సమ్మక్క, సారలమ్మలకు వివాహం జరిపిస్తారు. ఆ వివాహ వేడుక కాలక్రమేణా మేడారం జాతరగా మారింది. – తాండ్ర కృష్ణగోవింద్, వరంగల్, సాక్షిప్రతినిధి -
మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
-
సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో జగన్ సీఎం కావాలి
-
ఘనంగా గుడిమెలిగె..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గుడిలో గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తలస్నానాలు ఆచరించిన పూజారులు గుడికి చేరుకున్నారు. పూజారులు గుడిని శుద్ధి చేసిన అనంతరం ఐదుగురు ఆడపడచులు సమ్మక్క గద్దెలపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అందంగా అలకరించారు. ఆరాధ్య దైవమైన సమ్మక్క తల్లికి ధూపదీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి యాటను బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూజలు జరిగాయి. పూజలు ఇలా.. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, భోజరావు, నర్సింగరావు, మల్లెల ముత్తయ్య, నాగేశ్వర్రావు, పూర్ణ, దూప వడ్డె దొబె పగడయ్య.. సమ్మక్క గుడికి చేరుకున్నారు. ప్రధాన పూజారి కృష్ణయ్య కొత్త చీపురుతో గుడి లోపల బూజును తొలగించి అమ్మవారి శక్తిపీఠాన్ని కడిగి శుద్ధి చేశారు. అలాగే, పూజ దీపాంతాలు గుడి లోపల, బయట శుభ్రపరిచారు. మరోవైపు పూజారి నాగేశ్వర్రావు అమ్మవారి దీపంతాలను శుద్ధి చేశారు. నాగేశ్వర్రావు, మరో పూజారితో కలిసి విత్ర స్థలంలోని ఎర్ర మట్టిని తీసుకొచ్చారు. కృష్ణయ్యే స్వయంగా సమ్మక్క గద్దెను మట్టితో అలికారు. అనంతరం పూజారులందరూ కలిసి పూజారి మునీందర్ ఇంటికి వెళ్లారు. ( గుడిని శుద్ధి చేస్తున్న పూజారులు ) మునీందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలు.. పూజారి మునీందర్ ఇంట్లో అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పూజ సామగ్రిని తయారు చేశారు. పూజ సామగ్రిని సిద్ధం చేసే వరకు ఇతరులను ఇంట్లోకి అనుమతించలేదు. తర్వాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య పసుపు, కుంకుమ, పూజ వస్తువులను పట్టుకోగా, నాగేశ్వర్రావు దీపాలను తీసుకొచ్చారు. మరో పూజారి మల్లెల ముత్తయ్య ఇత్తడి చెంబులో నీళ్లు, ఐదురుగు ఆడపడచుల్లో సిద్ధబోయిన భారతి మరో ఇత్తడి చెంబులో నీళ్లు పట్టుకుని డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి చేరుకున్నారు. మూడుసార్లు గుడి చూట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పటికే పూజారులు ఐదు కట్టల కొత్తగడ్డిని తీసుకొచ్చి గుడి వద్ద ఉంచారు. దానిని పూజారి కృష్ణయ్య చేతుల మీదుగా ఈశాన్యంలోని గుడిపై సంప్రదాయబద్ధంగా పేర్చారు. ఆ తర్వాత గుడిలోపలికి ప్రవేశించారు. పూజారులకు సంబంధించిన ఐదుగురు ఆడపడచులు సిద్ధబోయిన భారతి, సునీత, సుగుణ, రాణి, కొక్కెర వినోద కలిసి మట్టితో అలికిన సమ్మక్క గద్దెపై పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి అలంకరించారు. ప్రధాన ప్రవేశ ద్వారం ముందు కూడా ముగ్గులు వేశారు. తల్లులకు నైవేద్యం.. గుడి అలంకరణ పూర్తయ్యాక వడ్డెలు సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారి శక్తి పీఠాన్ని వడ్డెలు ముగ్గులు వేసిన గద్దెపై ప్రతిష్ఠించారు. ధూపదీపాలు, కల్లుసారా అరగించి తల్లికి రహస్య పూజలు నిర్వహించారు. గుడిమెలిగె పండుగ సందర్భంగా తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాటను జడత పట్టి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు. పూజలు ముగిసే వరకు గుడి తలుపులు మూసివేశారు. గుడిమెలిగె సందర్భంగా కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలోని వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వడ్డెలు రాత్రంతా దేవతల గద్దెల ప్రాంగణంలో జగారాలు చేశారు. -
మేడారంలో దారుణం
సాక్షి, మేడారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేశారు. కారులో వచ్చిన దుండగులు ధర్మసాగర్‌కు చెందిన యువకుడిపై కత్తులతో దాడి చేశారు. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడు ప్రేమించిన అమ్మాయి తరపువారే ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. తన ప్రియురాలిని తీసుకువచ్చి ప్రేమవివాహం చేసుకుంటున్నాడన్న కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టివుంటారన్న మాటలు విన్పిస్తున్నాయి. మృతుడి తరపు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సమ్మక్క–సారలమ్మ ఆత్మగౌరవానికి ప్రతీక
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మట్టిపొరల్లోంచి మొలకెత్తిన వీర గాథ మేడారం సమ్మక్క–సారలమ్మల దివ్య చరిత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత పేర్కొన్నారు. కోట్లాది భక్తుల కొంగు బంగారమై వెలసిన సమ్మక్క–సారలమ్మలు ఆత్మగౌరవానికి, పౌరుషానికి ప్రతీక అని కొనియాడారు. వారి పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ దివ్య చరిత్రను తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం పాటల రూపంలో రూపొందించిన సీడీలను ఆదివారం ఆమె ఆవిష్కరించారు. కరువుతో అల్లాడుతున్న అడవి బిడ్డలను శిస్తు కట్టాలని పీడించడమే కాకుండా చిన్న రాజ్యమైన మేడారంపై చతురంగ దళాలతో దాడి చేసిన కాకతీయ సేనను సంప్రదాయ ఆయుధాలతో నిలువరించే ప్రయత్నం చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, నాగులమ్మల త్యాగాలను స్మరించుకుందామని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మల దివ్య చరిత్రను సమాజానికి తెలియజేసేందుకు కష్టపడ్డ జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీనును ఆమె అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, యూత్, స్టూడెంట్ విభాగాల కన్వీనర్లు కోరబోయిన విజయ్ కుమార్, పసుల చరణ్ పాల్గొన్నారు. ప్రజల కోసమే ‘గులాబీ జెండా’: ఎంపీ కవిత సాక్షి, హైదరాబాద్: స్వరాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ బిడ్డ కాలర్ ఎగరేసే విధంగా చేసింది విద్యుత్ కార్మికులు, ఉద్యోగులేనని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, దేశమంతా తెలంగాణ గురించే చర్చించుకుంటోందని పేర్కొన్నారు. వివిధ కార్మిక సంఘాల నుంచి పలువురు టీఆర్ఎస్ కార్మిక విభాగానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక విభాగం (టీఆర్వీకేఎస్)లో చేరారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన చేరికల కార్యక్రమంలో ఆమె కార్మిక నాయకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గులాబీ జెండా ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. 20 వేలకుపైగా కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులను సీఎం కేసీఆర్ రెగ్యులరైజ్ చేశారని, అది ఓర్వని విపక్షాలు కోర్టులకు వెళ్తున్నాయని విమర్శించారు. కార్మికులకు పీఆర్సీ, హెల్త్ కార్డుల అంశాలను పరిశీలిస్తామన్నారు. -
చెట్లు నరికి రోడ్డుపై వేసిన ఆదివాసీలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి / నిజామాబాద్ : ఆదివాసీల ఆందోళన ఉధృతమవుతోంది. ఇప్పటికే కుమ్రంభీం విగ్రహానికి చెప్పుల దండ వేసిన సంఘటనపై ఉట్నూరు ఏజెన్సీలో అట్టుడికి పోతుండగా తాజాగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ధర్మకర్తల కమిటీ నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం పస్రా-తాడ్వాయి మధ్య రహదారిరని స్తంభింపజేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికివేసి రహదారిపై అడ్డంగా వేశారు. ఫలితంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్ళి రహదారిపై అడ్డంగా వేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. ఆదివాసీ-లంబాడీల ఘర్షణల నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఏజెన్సీలో శాంతిభద్రతలను ఐజీలు అనిల్ కుమార్, నాగిరెడ్డి, చౌహాన్, డీఐజీ రవివర్మ పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ సమీప జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిన పోలీస్ అధికారులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. రెండు రోజుల క్రితం మేడారంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశం రసాభాసాగా జరిగిన విషయం విదితమే. సమావేశానికి వచ్చిన మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక 15 వాహనాలను ఆదివాసీలు ధ్వంసం చేశారు. రోడ్డెక్కిన లంబాడీలు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రూప్లా నాయక్ తండా వాసులు రోడ్డెక్కారు. తండాలోని లంబాడీలు అందరూ శనివారం ఉదయాన్నే జాతీయ రహదారిపైకి వచ్చి బైఠాయించారు. లంబాడీలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులను ప్రభుత్వం వెంటనే ఆపివేయించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. -
మేడారానికి భక్తుల తాకిడి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందు కు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం, మంగపేట గోదావరిలో అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మేడారంలోని వనదేవతల సన్నిధికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈసందర్భంగా భక్తులు వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం సమర్పించి పూజలు నిర్వహించారు. గద్దెలకు మరమ్మతులు కాగా, మేడారంలోని అమ్మవార్ల గద్దెలకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో జాతర సందర్భంగా అమ్మవార్ల గద్దెలకు గ్రానైట్ వేశారు. జాతరకు వచ్చిన భక్తులు గద్దెలపైకి కొబ్బరి, బెల్లం విసరడంతో గ్రానైట్ రాళ్లు పగిలాయి. పగిలిన రాళ్లను తొలగించి కొత్త వాటిని గద్దెలపై అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. -
జంపన్నవాగులో మృత్యు కుహరాలు
l భక్తుల పాలిట ప్రమాదకరంగా పరిణమిస్తున్న నీటి మడుగులు l హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాటిని గుర్తించలేకపోతున్న భక్తులు l ఇటీవల ఒకరి గల్లంతు l ఇంకా తెలియని ఆచూకీ ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో పలువురు ప్రమాదవశాత్తు జంపన్నవాగులో మునిగి మృతి చెందుతున్న దుర్ఘటనలు ఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలను నివారించే దిశగా మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటివరకు జంపన్నవాగు వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా జంపన్నవాగులో వరద ఉధృతి పెరుగుతోంది. దానితాకిడికి వాగులోని ఇసుక కొట్టుకుపోయి అక్కడక్కడ నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. అవే భక్తుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఈవిషయం సంబంధిత అధికారులకు తెలిసినా..పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతేడాది ఇద్దరి మృతి.. వాగులో నీటి మడుగులు ఉన్నాయనే విష యం తెలియకపోవడంతో..స్నానం చేసేందు కు వచ్చే భక్తులు వాటిలో చిక్కుకొని మృత్యువాత పడుతున్నారు. గతేడాది ఇదే సమయంలో వన దేవతలను దర్శించుకునేందుకు వచ్చిన భూపాల్పల్లికి చెందిన చిలువేరు శ్రీధర్ మృతిచెందాడు. కొత్తూరులోని బంధువుల ఇంటికి వచ్చిన ఖిలా వరంగల్‌వాసి గోపిశెట్టి శ్రీకాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగి,నీట మునిగి దుర్మరణం పాలయ్యాడు. తాజాగా గత ఆదివారం వరంగల్ పట్టణానికి చెందిన గుంటోజు శ్రీధర్ వాగులో మునిగి గల్లంతయ్యాడు. ఎస్సై కరుణాకర్‌రావు ఆధ్వర్యంలో రెండు రోజులుగా అతడి ఆచూకీ కోసం మేడారం నుంచి మొదలుకొని ఏటూరునాగారం జంపన్నవాగు వరకు జాలర్లు, గ్రామస్తులు, గత ఈతగాళ్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినా ఇప్పటివరకు శ్రీధర్ ఆచూకీ లభించలేదు. దీంతో బాధిత కుటుంబీకులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. సంకటంగా మారుతున్న సరదా.. జంపన్నవాగులో నీటి మడుగులు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దైవ దర్శనం కోసం మేడారానికి ప్రతి బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో భక్తులు వందలాదిగా తరలి వస్తుంటారు. దేవతలను దర్శించుకునేందుకు ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వర్షాలకు వాగులోకి నీళ్లు భారీగా చేరుతుండటంతో, భక్తులు సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగుతుంటారు. ఆ సరదా వారి పాలిట సంకటంగా మారుతోంది. వాగులోని నీటి మడుగుల్లో మునిగిపోయి మృతిచెందుతున్నారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయాలి నీటిమడుగులు ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలా చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుంది. – సిద్ధబోయిన జగ్గారావు, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు -
జంపన్నవాగులో భక్తుడు గల్లంతు
మేడారం(తాడ్వాయి): మండలంలోని మేడారం జంపన్నవాగులో ఓ భక్తుడు గల్లంతయిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌కు చెందిన కార్పెంటర్ గుంటోజు శ్రీధర్ స్నేహితులతో కలి సి మేడారం దేవతలను దర్శించుకునేందుకు వచ్చాడు. జంపన్నవాగు ఊరట్టం కాజ్వే సమీపంలో ఆదివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి గల్లంతయ్యాడు. స్నేహితులు వాగులో వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం ఈతగాళ్ల సహాయంతో వాగులో వెదికిన అచూకీ దొరకలేదు. శ్రీధర్ గల్లంతయిన విష యం తెలిసి భార్య,కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీధ ర్ ఆచూకీ కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు. -
మేడారంలో లక్ష మెుక్కలు నాటుతాం
నార్లాపూర్ అటవీప్రాంతంలో హరితహారం హాజరైన మంత్రులు కడియం, జోగు రామన్న, చందూలాల్ వనదేవతలకు పూజలు.. ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మేడారం ఆలయంలో, నార్లాపూర్ చింతల క్రాస్ వద్ద అటవీ భూమిలో కడియంతో పాటు మంత్రులు జోగు రామన్న, అజ్మీరా చందూలాల్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మెుక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇచ్చేం దుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. మేడారంలో లక్షల మొక్క లు పెంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అటవీ, పర్యావరణ, బీసీ సంక్షే మ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ఇది ఆయన మానసపుత్రిక అని అన్నారు. చెట్లను పెంచితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ.. హరితహారంతో మొక్కలను పెంచి పూర్వవైభవం చూడాలన్నారు. మేడారం వంటి వనదేవతల పవ్రిత స్థలంలో మొక్కలు నాటితే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల తో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు మంత్రులు వనదేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో వన్యప్రాణి విభాగం అడిషనల్ పీసీసీఎఫ్ పృథ్వీరాజు, కన్జర్వేటర్లు అక్బర్, పీవీ రాజారావు, జేసీ ప్రశాంత్ జీవన్ పటేల్, పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, జేడ్పీటీసీ సరోజన తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో లక్ష మొక్కలు
మేడారం, నార్లాపూర్‌లో హరితహారం హాజరైన మంత్రులు కడియం, జోగు రామన్న, చందూలాల్ వనదేవతలకు పూజలు.. ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మేడారం ఆలయంలో, నార్లాపూర్ చింతల క్రాస్ వద్ద అటవీ భూమిలో కడియంతో పాటు మంత్రులు జోగు రామన్న, అజ్మీరా చందూలాల్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మెుక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. మేడారంలో లక్షల మొక్కలు పెంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ఇది ఆయన మానసపుత్రిక అని అన్నారు. చెట్లను పెంచితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ.. హరితహారంతో మొక్కలను పెంచి పూర్వవైభవం చూడాలన్నారు. మేడారం వంటి వనదేవతల పవ్రిత స్థలంలో మొక్కలు నాటితే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకుముందు మంత్రులు వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వన్యప్రాణి విభాగం అడిషనల్ పీసీసీఎఫ్ పృ«థ్విరాజు, కన్జర్వేటర్లు అక్బర్, పీవీ రాజారావు, జేసీ ప్రశాంత్ జీవన్ పటేల్, పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, జేడ్పీటీసీ సభ్యురాలు పులుసం సరోజన. డీఎఫ్ఓలు పురుషోత్తం, బీమా, మండల అధ్యక్షుడు బాపిరెడ్డి పాల్గొన్నారు. -
మేడారంలో బాలుడు మృతి
వ్యర్థాల దుర్గంధమే కారణమంటున్న పారిశుధ్య కార్మికులు ఎస్ఎస్ తాడ్వారుు: మేడారంలో భక్తులు వదిలివెళ్లిన వ్యర్థాలు వెదజల్లుతున్న దుర్గంధం పారిశుధ్య కార్మికులను తీవ్ర అస్వస్థతకు గురి చేస్తోంది. బుధవారం రాత్రి ఓ కార్మికుడి కుమారుడు మృతి చెందాడు. ఏపీలోని రాజమండ్రికి చెం దిన పారిశుధ్య కార్మికుడు మాణిక్యాల నారాయణ మేడారంలో పారిశుధ్య పనుల నిమిత్తం భార్య, కుమారుడితో కలసి వచ్చాడు. అక్కడ నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో అతడి కుమారుడు వెంకటరమణ(12) రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు అతడిని బుధవారం తాడ్వాయి పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి నిమోనియావ్యాధిగా గుర్తించి ఎంజీఎం ఆస్పత్రికి రెఫర్ చేశారు. తాడ్వాయి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన కొద్దిగంటల్లోనే బాలుడు మృతి చెందాడు. అస్వస్థతకు గురైన పారిశుధ్య కార్మికులకు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ దయానందస్వామి, తాడ్వాయి పీహెచ్సీ వైద్యాధికారి క్రాంతికుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. -
మేడారంలో ఘనంగా తిరుగువారం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయూల వద్ద తిరుగువారం పండుగను బుధవారం వైభవంగా నిర్వహించారు. దీంతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగిసింది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, పూజారుల సం ఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు సిద్దబోయిన ముణేందర్, సిద్దబోయిన లక్ష్మణ్‌రావు, మల్లెల ముత్తయ్య గుడిని శుద్ధి చేశారు. అనంతరం ఆడపడుచులు సమ్మక్క శక్తిపీఠం గద్దెను మట్టితో అలికి ముగ్గులు వేశారు. తరువాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య అమ్మవారి వస్త్రాలను, పూజా సామగ్రి శుద్ధి చేసి, ధూప, దీపాలు, యూటను బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద కూడా పూజారులు కాక సారయ్య, కాక కిరణ్ తిరుగువారం పండుగ నిర్వహించారు. పగిడిద్దరాజు ఆలయంలో తిరుగువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
వన దేవత.. జన జాతర
మేడారానికి పోటెత్తిన భక్తజనం ♦ ఒక్కరోజే 40 లక్షల మంది రాక ♦ గత రెండు నెలలుగా కోటి మంది సందర్శన ♦ నేటితో ముగియనున్న మహా జాతర సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం జనసంద్రమైంది.. వన దేవతలకు మొక్కుల కోసం వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. ‘సమ్మక్క కో.. సారక్క కో’ అంటూ భక్తుల జయజయధ్వానాలు.. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం(బెల్లం), ఎదురు కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు.. ఇలా తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ ప్రసాదం(బెల్లం) కోసం పోటీపడ్డారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ బంగారం ప్రసాదాన్ని భక్తులకు అందించలేదు. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువు దీరి ఉండడం.. పవిత్ర మాఘ శుద్ధ శుక్రవారం కావడంతో ఈ ఒక్కరోజే 40 లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. గత 2 నెలలుగా మేడారానికి ఇప్పటి వరకు కోటి మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. నేటితో జాతర ముగింపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు 1.10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ గత జాతర కంటే ఈసారి భక్తుల సంఖ్య బాగా పెరిగింది. జాతరకు 2 నెలల ముందు నుంచే మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మొదలైన 17 నుంచి భక్తుల రాక బాగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి నుంచి భక్తులు తరలివచ్చారు. గిరిజను లు సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలకు మొక్కులు చెల్లించారు. నేటి(శనివారం) సాయంత్రం జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. వీఐపీల రాక.. భక్తులకు ఇబ్బందులు! వన దేవతలకు మొక్కులు సమర్పించేందుకు భక్తులు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో నిల్చున్నారు. శుక్రవారం ఉదయం వరకు భక్తులకు ఇబ్బందులు లేకుండానే దర్శనం జరిగింది. గరిష్టంగా గంట సమయంలో దర్శనం ముగించుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వీఐపీల రాక ప్రారంభం కావడంతో భక్తులకు ఇబ్బందులు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పలువురు మం త్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మేడారం చేరుకున్నారు. అయితే ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం తెలియగానే వీరంతా మేడారం గద్దెల వద్ద దర్శనానికి క్యూ కట్టారు. పోలీసులు, అధికారులు వీరికే ప్రాధాన్యం ఇవ్వడంతో భక్తులు రెండు గంటలపాటు ఇబ్బందులు పడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులు రెండుమూడు కార్లలో అనుచరులను వెంట బెట్టుకుని గద్దెల వద్దకు వెళ్లడంతో సాధారణ భక్తుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం కార్యాలయ స్టిక్కర్‌తో వచ్చిన కారు గద్దెల ముందే గంటలపాటు ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ. చందూలాల్, పి.మహేందర్‌రెడ్డి, ఎంపీలు ఎ.సీతారాంనాయక్, పసునూరి దయాకర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కల్వకుంట విద్యాసాగర్‌రావు, పుట్టా మధు, బి.శంకర్‌నాయక్, హన్మంత్ షిండే, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే బాబూమోహన్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ అనురాగ్‌శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు శుక్రవారం మొక్కులు సమర్పిం చుకున్నారు. అమ్మల దీవెనతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తా: మేయర్ రామ్మోహన్ మేడారం సమ్మక్క-సారలమ్మల దీవెనలతో హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేస్తానని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఆయన మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం(92కిలోలు) సమర్పించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా బిడ్డనైన తాను హైదరాబాద్ నగర మేయర్‌గా ఎంపిక కావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అశీర్వాదంతో పాటు మేడారం తల్లుల దీవెనలే కారణమన్నారు. సీఎం మేడారం పర్యటన రద్దు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేడారం పర్యటన రద్దయింది. శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక హెలి కాప్టర్లో మేడారం వెళ్లి సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది. సీఎం పర్యటనకు అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మేడారం పర్యటన తర్వాత వరంగల్‌లోని ఇంక్యుబేషన్ టవర్స్‌లో ఐటీ కాంప్లెక్స్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా సీఎం ఈ పర్యటనకు వెళ్లలేకపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. తల్లుల నీడలో ప్రసవం మహాజాతరలో జన్మించిన మరో సమ్మక్క మేడారం బృందం: మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలపై కొలువుదీరిన వేళ.. తల్లుల నీడలోనే ప్రసవించాలన్న ఓ మహిళ కల నెరవేరింది. ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన కందుకూరి జ్యోతి తొమ్మిది నెలల గర్భంతో మేడారం వచ్చింది. అక్కడే ప్రసవిస్తే బాగుండు అనుకుంది. ఆమెకు శుక్రవారం పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు సమీపంలోని మెగా వైద్యశిబిరానికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు దీప్తి, కీర్తి, సిబ్బంది సుందరి, మనోహరరాణి పర్యవేక్షణలో జ్యోతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డీఎంహెచ్‌వో సాంబశివరావు, ఆర్డీ నాగేశ్వర్రావు తెలిపారు. అమ్మల దర్శనం అదృష్టం తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి: బాలకృష్ణ ములుగు: సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన మేడారానికి వచ్చారు. దేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కేసీఆర్ తరపున చందూలాల్ మొక్కులు అమ్మవారికి 56 కిలోల బంగారం సమర్పణ ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం పర్యటన రద్దవడంతో ఆయ న తరఫున గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ శుక్రవారం మొక్కు సమర్పించారు. 56 కిలోల బంగారం(బెల్లం) తులాభారం వేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు సమర్పించారు. అనంతరం అమ్మల గద్దెల నుంచి బంగారం తీసుకున్నారు. రెండు, మూడ్రోజుల్లో అమ్మవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందిస్తానని చందూలాల్ తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవతలను కోరుకున్నట్లు తెలిపారు. (ఫొటోల కోసం క్లిక్ చేయండి) -
మేడారం.. మెరిసే
-
భక్తులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్
మేడారం(తాడ్వాయి) : మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరి ఉండడంతో భక్తులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత శుక్రవారం సాయంత్రం నుంచి తిరుగుపయనమయ్యారు. దీంతో మేడారంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బస్టాండ్‌లో వివిధ జిల్లాలకు ఏర్పాటు చేసిన పాయింట్ల వద్ద ఆప్రాంతాలకు వెళ్లే బస్సులు సమయానికి లేకపోవడంతో భక్తులు గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్లలో భక్తులకు ఆర్టీసీ అధికారులు తాగునీటి వసతి కల్పించారు. బస్టాండ్ ప్రాంగణానికి భక్తులు వేల సంఖ్యలో చేరుకోవడంతో భక్తుల రద్దీతో బస్టాండ్ నిండిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో మేడారం జా తరకు వచ్చిన భక్తులు తిరుగుప్రయాణంలో ఆటోలు, ఎడ్లబండ్లను ఆశ్రయించారు. ఎండకు భక్తుల ఇక్కట్లు బస్టాండ్ ప్రాంగణంలో భక్తుల నీడ కోసం ఆర్టీసీ అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చిన భక్తులు గంటల తరబడి ఎండలోనే కూర్చోలేక నరకయాతన అనుభవించారు. భక్తులకు ఇబ్బందులు తలె త్తకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని జాతరకు ముందు చెప్పిన అధికారులు భక్తులకు నీడ కోసం చలువ పందిళ్లు ఏర్పాటు చేయలేదు. 4,717 ట్రిప్పుల ద్వారా 2,17,763 మంది భక్తులు హన్మకొండ : గురువారం వరకు ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారానికి బయల్దేరిన భక్తులు శుక్రవారం నుంచి తిరుగుముఖం పట్టారు. మేడారం బస్సుల్లో వెళ్లిన భక్తుల సంఖ్యను మించి తిరుగు ప్రయాణ భక్తుల సంఖ్య పెరిగింది. శుక్రవారం 3,480 ట్రిప్పుల ద్వారా 72,397 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారం చేరుకోగా 4,717 ట్రిప్పుల ద్వారా 2,17,763 మంది భక్తులు తిరుగుప్రయాణమయ్యారు. ఆర్టీసీ భక్తుల సంఖ్యకు మించి బస్సులు ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు జాతరకు వెళ్లి వస్తున్నారు. -
మేడారం.. మెరిసే
సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు నిండిపోయిన క్యూలైన్లు ఎండ, ఉక్కపోతతో అవస్థలు పడిన వృద్ధులు, చిన్నారులు తల్లుల చెంతకు ప్రముఖుల తాకిడి వీఐపీల బంధుగణం, వాహనాలతో సమస్యలు కొనసాగిన పోలీసుల ‘అత్యుత్సాహం’ పెద్ద సంఖ్యలో బయలుదేరిన భక్తులతో కిక్కిరిసిన బస్‌పాయింట్ నేడు దేవతల వనప్రవేశం ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం భక్తజనంతో మెరిసిపోరుుంది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఓకే చోట కొలువుదీరడం తో భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో రోజంతా రద్దీ కొనసాగింది. సమ్మక్క, సారలమ్మ నినాదాల తో జాతర ప్రాంగణం మార్మోగింది. నలుగురు దేవతలూ కొలువై ఉండడంతో శుక్రవారం క్యూై లెన్లన్నీ నిండిపోరుు భక్తులు రోడ్లపై సైతం నిల్చోవాల్సి వచ్చింది. వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ భక్తులను వరుసక్రమం లో పంపించారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన పైకప్పు ఎత్తు తక్కువ ఉండటం, ఉష్ణోగ్రత పెరగడంతో పగటి వేళ భక్తులు ఇబ్బంది పడ్డారు. తాగునీటి సౌకర్యం సరిపడా లేక దాహంతో అల్లాడిపోయారు. చివరకు ఒకటి రెండు చోట్ల డ్రమ్ములు ఏర్పాటు చేసి తాగునీరు అందించారు. శుక్రవారం రాత్రి వరకు వన దేవతలను దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు తెలిపారు. కొండంత మొక్కులు వనదేవతలు ఇష్టమైన ప్రసాదంగా భావించే బంగారం (బెల్లం) గద్దెల వద్ద కొండలుగా పేరుకుపోయింది. మొక్కుల చెల్లింపులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున బంగా రం సమర్పించారు. భక్తుల రద్దీ నిరంతరాయంగా కొనసాగడంతో గద్దెల ప్రాంగణంలో పోగైన బెల్లం తొలగించడం వీలుకాలేదు. దీంతో గద్దెపై నిల్వలు కొండలా పేరుకుపోయూరుు. భక్తుల కానుకలతో నిండిన హుండీలను ఎప్పటికప్పుడు పక్కకు తరలించారు. శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో ప్రసాదం పంపిణీని దేవాదాయశాఖ అధికారులు నిలిపేశారు. వస్తున్నారు... పోతున్నారు.. జాతరకు రెండు రోజులు ముందుగానే చేరుకున్న భక్తులు మేడారం పరిసర ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని ఉన్నా రు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, గురువారం సమ్మ క్క గద్దెలపైకి చేరుకోవడంతో గురువా రం రాత్రి నుంచి మొక్కులు ఊపందుకున్నారుు. అమ్మలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్న భక్తులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుగు ప్రయూణ మవుతున్నారు. దీంతో పొలా లు, అడవులు, వాగుల్లో వెలిసిన గుడారాలు ఖాళీ అవుతున్నారుు. భక్తులను పార్కింగ్ ఏరియాలకు, బస్స్టేషన్లకు తరలించే ఆటోలు, ఎడ్లబండ్ల హవా కనిపించింది. ఆర్టీసీ బస్‌స్టేషన్ పా యింట్ వద్ద కోలాహలం నెలకొంది. వరంగల్ బస్‌పాయింట్ వద్ద భక్తులు పెద్దసంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నా రు. జాతరకు భక్తులను తరలించేందు కు చిట్యాల, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బస్సులు నడిపించిన ఆర్టీసీ, తిరుగు ప్రయాణంలో ఆయా పాయింట్లకు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆర్టీస్ బస్‌స్టేషన్ తిరుగు ప్రయాణ భక్తులతో కిక్కిరిపోయింది. కాగా, జాతరలో వీఐపీల వాహనాలు, దర్శనాలకిచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వని పోలీసులు, ప్రభుత్వ అధికారుల తీరు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, దేవతలు నలుగురూ శనివారం వనంలోకి వెళ్లిపోనుం డడంతో జాతర ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. -
అమ్మల దర్శనం.. అదృష్టం - బాలకృష్ణ
తల్లుల కరుణతో తెలుగు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలి సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ములుగు (వరంగల్) : మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భార్య వసుంధరాదేవి, సోదరి ఉమామహేశ్వరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన మేడారానికి వచ్చారు. ఈ సందర్భంగా జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాక లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలకృష్ణ సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం(బెల్లం)తో పాటు పసుపు-కుంకుమలు, కొబ్బరికాయ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కోటి మంది హాజరయ్యే జాతరలో తాను ఓ భక్తుడిని కావడం సంతోషకరమని అన్నారు.అనంతరం ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జాతర నిర్వహణ, చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. -
అంతా తల్లుల దయ..!
సమ్మక్క, సారమ్మల సన్నిధిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ సిటీబ్యూరో: మేడారం సమ్మక్క, సారలమ్మల దీవెనలతో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం మేడారం జాతరకు హాజరైన ఆయన నిలువెత్తు బంగారాన్ని(92 కిలోల బెల్లం)అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్జిల్లా బిడ్డ అయిన తాను ముఖ్యమంత్రి కేసీఆర్, మేడారం తల్లుల దీవెనలతోనే గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యానన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో హైదరాబాద్ నగర మొదటి మేయర్‌గా ఎన్నికైన తాను నగర ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంతోపాటు నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గిరిజన సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే తమ శాఖ ప్రధానోద్దేశమన్నారు. గిరిజన సంక్షేమశాఖ అధికారిగా అమ్మవార్లను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవార్లకు సోమేశ్‌కుమార్ పూజలు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని(90కిలోలు) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రప్రభుత్వం రూ. 160 కోట్లు విడుదల చేయడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలకూ మౌలికసదుపాయాలు సమకూరాయన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తరపున.. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన జనార్దన్‌రెడ్డి తరపున జీహెచ్ఎంసీ సీపీఆర్ఓ వెంకటరమణ మొక్కులు సమర్పించారు. జనార్దన్‌రెడ్డి బరువు 72 కిలోల బంగారం(బెల్లం) అమ్మవార్లకు సమర్పించారు. -
'బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నా'
వనదేవతలను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు వరంగల్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు మేడారం సమ్మక్క-సారలమ్మను శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మను మొక్కుకోగా, ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నానని తెలిపారు. వారంలో 3 రోజులపాటూ మేడారం జాతర జరిగేలా కృషి చేస్తామన్నారు. వచ్చే మేడారం జాతర వరకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గతంలో కంటే ఇప్పటి జాతరకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. -
దూకుడు తగ్గించుకో..
ఏఎస్పీకి కలెక్టర్, ఎస్పీ క్లాస్ విశ్వజిత్ తీరుపై సీఎం కార్యాలయం ఆరా డీజీపీకి ప్రెస్ అకాడమీ చైర్మన్ ఫిర్యాదు వరంగల్ : మేడారం జాతరలో వివాదాస్పద పోలీసు అధికారిగా ముద్రపడిన ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి తీరుపై సీఎం కార్యాలయం స్పందించింది. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో అత్యవసర వైద్యసేవ లందించేందుకు వెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి... డ్రైవర్, వైద్యుడు, సీనియర్ జర్నలిస్ట్‌ను దారుణంగా కొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. బుధవారం జరిగిన ఈ ఘటన, ఏఎస్పీ విశ్వజిత్ పనితీరుపై సమాచారం పంపించాలని ఎస్బీ అధికారులను ఆదేశిం చింది. మరోవైపు డీజీపీ కార్యాలయం కూడా ఈ సంఘట నపై జిల్లా అధికారులను వివర ణ అడిగినట్లు తెలిసింది. ములుగు ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విశ్వజిత్ పనితీరు కొంత ఇబ్బందిగానే ఉందని పోలీసు వర్గాలు సమాచారం రూపొందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న మేడారం జాతర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర మంత్రులు స్వయంగా మేడారంలో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ములు గు ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి అస్వస్థతతో ఉన్న మహిళను తీసుకెళ్తున్న 108 వాహనాన్ని నిలిపివేసి.. ఇద్దరు ఉద్యోగులను దారుణంగా కొట్టడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో తదుపరి చర్యల కోసం సమగ్ర సమాచా రం సేకరిస్తోంది. మరోవైపు బుధవారం జరిగిన ఘటనపై రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జిల్లా కలెక్టర్ కరుణ విశ్వజిత్ కాంపాటిని మందలించినట్లు తెలిసింది. విధి నిర్వహణలో అంకితభావం కంటే స్వీయ నియంత్రణ ముఖ్యమని సూచించినట్లు సమాచారం. దూకుడు తగ్గించుకుని ప్రజలు మెచ్చేలా పనిచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. తొలి నుంచి వివాదాస్పదమే.. ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వైఖరి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందనే అభిప్రాయం ములుగు ప్రాంతంలో ఉంది. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఏఎస్పీ స్వయంగా తమ ను కొట్టారని మంగపేటకు చెందిన అధికార టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. భూమి విషయంలో తమను కొట్టిన ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని మంత్రి చందులాల్‌ను కోరారు. మేడారం ఘటన నేపథ్యంలో ఈ వివరాలను కూడా సేకరిస్తున్న ట్లు తెలిసింది. విశ్వజిత్ ఓసారి లక్నవ రం సరస్సుకు వెళ్లినప్పుడు బోటింగ్ ఆలస్యమైందనే కారణంతో స్థానిక పోలీ సులు బోటింగ్ నిర్వాహకులను ఒక రోజంతా పీఎస్‌లో పెట్టి కొట్టారని ఎస్ బీ అధికారులకు సమాచారం ఉంది. ఈ అన్ని అంశాలతో ఎస్బీ విశ్వజిత్‌పై నివేదిక రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాగా, వరంగల్‌లో సీనియర్ జర్నలిస్టు పాశం యా దగిరిపై ఏఎస్పీ విశ్వజిత్ దాడి చేసిన విషయమై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన డీజీపీని కలిశారు. -
అపురూప ఘడియలు
రాత్రి 8.04 గంటలకు గద్దెకు చేరిన సమ్మక్క చిలకలగుట్ట వద్ద అధికారిక స్వాగతం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు అపురూప ఘడియల్లో మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడిన భక్తులు {పారంభమైన తిరుగు ప్రయాణాలు హన్మకొండ : మేడారం అడవుల్లో రెండేళ్లకోసారి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి సమ్మక్క చేరుకునే ఉద్విగ్న, అద్భుత క్షణాలు గురువారం సాయంత్రం ఆవిష్కృతమయ్యాయి. సమ్మక్క పూజారులు చిలకలగుట్ట నుంచి కిందకు దిగగానే మేడారం అడవులు భక్తిభావంతో పులకించిపోయాయి. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకుంది. అంతకు ముందే అంటే బుధవారం రాత్రే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెల పైకి వచ్చారు. దీంతో భక్తులు ఒకేచోట నలుగురిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యూరు. ఉత్కంఠ.. ఉద్విగ్నం.. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చేందుకు పూజారులు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరారు. సమ్మక్కకు భక్తులు వివిధ పద్ధతుల్లో స్వాగతం పలికారు. మేడారం నుంచి చిలకలగుట్ట వరకు ఉన్న కిలోమీటరున్నర మార్గాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రోడ్డు శోభాయమానంగా మారింది. సమ్మక్క వచ్చే వరకు తమ ముగ్గులు చెడిపోకుండా చూసేందుకు అక్కడే ఉండిపోయూ రు. తమ ఇంటి ఇలవేలుపు సమ్మక్కకు ఎదుర్కోళ్లు పలుకుతూ భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చారు. మార్గానికి ఇరువైపులా వేలా ది మంది భక్తులు సమ్మక్క రాకకోసం గంటల తరబడి ఎదురుచూశారు. చిలకలగుట్ట దారిలో అడుగడుగునా భక్తులకు దేవుడు పూనాడు. వారు చేసే నాట్యాలతో మేడారం ప్రాంగణం హోరెత్తిపోయింది. చిలకలగుట్ట దారికి ఇరువైపులా ఉన్న చెట్టుపుట్టలపైకి ఎక్కి సమ్మక్కను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. 5:58 గంటలకు... క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడుస్తున్నా భక్తుల్లో ఒకటే కోరిక.. చిలకలగుట్ట నుంచి గద్దెలను చేరే సమ్మక్కను కనులారా చూడాలని. సాయంత్రం 5:58 గంటలకు సమ్మక్కను తీసుకుని పూజారులు సిద్ధబోయిన మునీందర్, కొక్కెర కృష్ణయ్య, మహేశ్ తదితరులు చిలకలగుట్ట దిగారు. సమ్మక్క రాకను సూచి స్తూ బూర శబ్ధం వినగానే అప్పటికే ఎదురు చూస్తున్న కలెక్టర్ కరుణ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా ఎదురెళ్లి స్వాగ తం పలికారు. సమ్మక్క రాకను సూచిస్తూ గాలిలోకి కాల్పులు జరి పారు. అనంతరం చిలకలగుట్ట నుంచి మేడారం వైపుగా సమ్మక్కను తీసుకుని వడ్డెలు బయలుదేరారు. మరోసారి సాయంత్రం 6:08 గంటలకు ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపారు. చివరగా చిల కలగుట్ట ముఖద్వారం వద్ద మూడోసారి 6:11 గంటలకు కాల్పులు జరిపి చిలకలగుట్ట రోడ్డుపైకి సమ్మక్క చేరుకుంది. అప్పటి వరకు ఆర్తిగా ఎదురు చూసిన భక్తులు సమ్మక్కపై పసుపు బియ్యం చల్లారు. దారిపొడవునా ఈ బియ్యపు జల్లులు కురిసాయి. సమ్మ క్క వచ్చిందన్న వార్త తెలియగానే ఒక్కసారిగా శివసత్తులు పూనకంతో ఊగిపోయారు. గద్దెలపైకి చేరిన సమ్మక్క.. చిలకలగుట్ట దిగిన తర్వాత ఎదురెళ్లుకాడ అరగంట పాటు వడ్డెలు పూజలు నిర్వహించారు. అనంతరం మేడారం వైపు వడివడిగా సాగారు. మధ్యలో చెలపెయ దగ్గర మరోసారి పూజలు నిర్వహిం చారు. అనంతరం మేడారం ఆడపడుచులు నీరు ఆరబోసి స్వాగ తం పలికారు. సమ్మక్కను గద్దెలపైకి చేర్చే వరకు భక్తుల దర్శనాలు ఆపేశారు. మేడారం గ్రామం చేరుకున్న సమ్మక్కను తొలుత గుడికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. వెంటనే ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేశా రు. గద్దెలపైకి చేరుకున్న వడ్డెలు అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 8:04 గంటలకు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. అంతకు ముందు సమ్మక్క గద్దెపైకి వనం తెచ్చే కార్యక్రమాన్ని బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మక్క పూజారులు నిర్వహించారు. గురువారం ఉదయం కంకవనాన్ని గద్దెలపైకి తీసుకొచ్చారు. అధికారుల ఘన స్వాగతం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమ్మక్కకు స్వాగతం పలి కారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, ప్రభుత్వ సలహాదారు బీ.వీ. పాపారావుతో పాటు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, జాతర ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు, ములుగు మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య సమ్మక్కకు స్వాగతం పలికారు. మేడారం జాతరలో కీలక ఘట్టాలైన సారల మ్మ, సమ్మక్కలకు స్వాగతం పలికే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ గైర్హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ గద్దెల వద్ద పరిస్థితి పర్యవేక్షించారు. -
నేడు జిల్లాకు సీఎం కేసీఆర్
హన్మకొండ అర్బన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొం టారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం 11-50 గంటలకు బయలుదేరనున్న కేసీఆర్ బేగంపేట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మేడారం వస్తారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండ నగర శివారు మడికొండకు చేరుకుంటారు. మడికొండలోని ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఇక్కడ జరిగే సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. -
మేడారంలో స్వల్ప అగ్ని ప్రమాదం
వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. వీఐపీ పార్కింగ్ ప్రాంతానికి సమీపంలో... శివరామసాగర్ చెరువు దగ్గరలో ఉన్న అడవికి నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆర్పివేశారు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. -
జాతరకు నాలుగు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్(వరంగల్ జిల్లా): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు. మేడారం స్పెషల్ ట్రైన్స్‌గా ఈనెల 17 నుంచి 21 వరకు నాలుగు రైళ్లను 8 ట్రిప్పులుగా తిప్పుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల వివరాలు.. 17వ తేదీన 07019 నంబర్ రైలు కాజీపేట జంక్షన్ నుంచి రాత్రి 7 గంటలకు బయలుదేరి 11 గంటలకు సిర్పూర్కాగజ్నగర్ చేరుకుంటుంది. 21న ఇదే రైలు 07020 నంబర్‌తో సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి 9 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. 18,19 తేదీలలో 07009 నంబర్ రైలు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలు దేరి 11.15 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. 17,20 తేదీలలో 07007 నంబర్ రైలు సికింద్రాబాద్‌లో 12.30 గంటలకు బయలుదేరి వరంగల్‌కు 15.40 గంటలకు చేరుకుంటుంది. ఇదే రైలు 17,20 తేదీలలో 07008 నంబర్‌తో వరంగల్‌లో 17.45 గంటలకు బయలుదేరి 21.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. 17,20 తేదీలలో 07436 నంబర్‌తో సికింద్రాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 12.45కు వరంగల్ చేరుతుంది. 17, 20 తేదీలలో 07437 నంబర్‌తో వరంగల్‌లో 13.15 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు 16.30 గంటలకు చేరుతుంది. -
జాతరకు నాలుగు వేల బస్సులు
జాతరలో ఆర్టీసీని సద్వినియోగం చేసుకోవాలి అవసరమైతే మరిన్ని బస్సుల ఏర్పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మేడారంలో బస్టాండ్ ప్రారంభం ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మహా జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్టాండ్, క్యూ రెరుులింగ్స్ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో కొద్దిదూరం ప్రయూణించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతరకు విస్తృత ఏర్పాట్లు.. మేడారంలో బస్సులు నిలిపేందుకు సుమారు 50 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నందున ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. జాతర సమయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతోపాటు బస్టాండ్ లో మరుగుదొడ్లు, విద్యుత్, ఎల్ఈడీ స్క్రీన్లు, కళాకారులతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రన్నింగ్ కండీషన్లో ఉన్న బస్సులనే జాతరకు ఎంపిక చేశామ ని, 12వేల మంది సిబ్బందిని విధుల్లో నియమించామని వివరించారు. ఇందులో 7,300 మంది డ్రైవర్లు, 2,500 మంది కండక్టర్లతో పాటు రెండు వేల మంది టెక్నికల్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఉన్నారన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ జాతరకు 20 లక్షల మంది భక్తులను మేడారానికి తరలిస్తామనే అంచనా ఉందన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా మరమ్మతుకు గురైతే సరిచేసేందుకు పలు ప్రాంతాల్లో మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా హైదరాబాద్ నుంచి జాతరకు ఏసీ బస్సులు నడుపుతున్నామన్నారు. 14 నుంచి ప్రత్యేక బస్సులు ప్రైవేట్ వాహనాల్లో రావడం కంటే ఆర్టీసీ బస్సుల్లో మేడారం వస్తే గద్దెల సమీపానికి చేరుకునే అవకాశముంటుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని, ఈ బస్సులు 21వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. వనదేవతలకు మొక్కులు మేడారంలో బస్టాండ్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకున్నా రు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబుతో పాటు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన వనదేవతలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఆర్ఎం యాదగిరి, డీఎం మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. నష్టాల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి జనగామ : తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా 500 బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ర్ట రవాణాశాఖ మంత్రి మహేందర్‌రె డ్డి తెలిపారు. మేడారం పర్యటనను పురస్కరించుకుని జనగామలో శుక్రవారం ఆయన కాసేపు ఆగారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడవని 13 గ్రామాలకు పునరుద్ధరిస్తామన్నారు. 2004లో మరమ్మతుకు వచ్చిన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారులను సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. నష్టా ల్లో నడుస్తున్న డిపోలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. తెలంగాణలోని 95 డిపోల్లో తాగునీటి సౌకర్యంతోపాటు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ఆకాశమార్గాన మేడారానికి...
నేటి నుంచి హెలికాప్టర్ ట్రిప్పుల బుకింగ్ సాక్షి, హైదరాబాద్: మేడారం ఉత్సవాన్ని గగనతల యాత్రతో జరుపుకోవాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ లో భాగంగా దీన్ని సిద్ధం చేసింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం రాత్రి కంపెనీ ప్రతినిధులతో చర్చించి గగన విహార ధరలను ఖరారు చేసింది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖతోపాటు ఆ ఏవియేషన్ సంస్థ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 18 వరకు మేడారం సందర్శనకు అవకాశముంది. పురాతన జలాశయమైన లక్నవరంను ఆకాశం నుంచి వీక్షించేందుకూ ఓ ప్యాకేజీ పెట్టింది. బేగంపేట విమానాశ్రయంతోపాటు నెక్లెస్‌రోడ్డులో హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజి మైదానం, లక్నవరం ఒడ్డున, మేడారం చేరువలో కూడా వాటిని సిద్ధం చేస్తున్నారు. సిటీ ట్రిప్ 21 తర్వాత... హైదరాబాద్ నగరాన్ని గగనతలం నుంచి వీక్షించే ప్యాకేజీలు ఈనెల 21 తర్వాత అందుబాటులోకి రానున్నాయి. దీని ధర రూ.4 వేలుగా ఉండనుంది. ప్యాకేజీ ధరలను త్వరలో ప్రకటించనున్నారు. మేడారానికి ప్యాకేజీ ధరలు * లక్నవరం చెరువును గగనతలం నుంచి వీక్షిం చేందుకు ఒక్కొక్కరికి రూ.3,330. ఒక్కో పర్యటన 8-10 నిమిషాలు. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. * లక్నవరం నుంచి మేడారం దేవాలయానికి ఒక్కొక్కరికి రూ.5,400. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. * వరంగల్ నుంచి మేడారం వరకు ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూర్(రానూపోనూ) ధర రూ.92,500 (సర్వీసుటాక్స్ అదనం) * బేగంపేట నుంచి మేడారం... ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూరు (రానూపోనూ కలిపి)... ధర రూ. 2,75,000 (సర్వీసు టాక్స్ అదనం) -
వన దేవతలకు ఒక్క ఎకరమేనా!
వరంగల్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సగటున కోటి మంది భక్తులు వస్తారు. జాతర సందర్భంగా వందల ఎకరాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. జాతర జరిగే ఏడాది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఇంతటి ప్రాశస్థ్యం ఉన్న ఆలయానికి ఉన్న భూమి కేవలం ఒక ఎకరం మాత్రమే. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జాతర జరుగుతుంది. అయినా.. జాతర ఏర్పాట్లు, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భూమి కేటాయించడం లేదు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో మేడారం ఉంది. ఇక్కడ 155 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర సమయంలో 155 ఎకరాల ప్రభుత్వ భూముల్లో, దీని చుట్టూ ఉండే అటవీ శాఖకు చెందిన వందల ఎకరాల్లో భక్తులు బస చేస్తారు. జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నా వన దేవతలకు ప్రత్యేకంగా భూమి కేటాయించే దిశగా ఏ ప్రభుత్వమూ చర్యలు చేపట్టలేదు. శాశ్వత భూమిలేదు జాతర జరిగే సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం మాత్రమే వన దేవతల ఆలయం పేరిట దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న మరో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ కార్యాలయాలు, భక్తుల వసతి నిర్మాణాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సాంకేతికంగా ప్రభుత్వ భూముల్లోనే ఉన్నాయి. మేడారం జాతర జరిగే సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ భూములను వినియోగించుకుంటోంది. పలు నిర్మాణాలను ఈ భూముల్లోనే చేపట్టింది. శాశ్వతంగా మాత్రం వన దేవతలకు భూములను కేటాయించలేదు. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ప్రస్తుత జాతర మొదలయ్యే వరకైనా వన దేవతలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుందనే ఆశాభావంతో ఆదివాసీలున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో వన దేవతల ఆలయానికి ప్రభుత్వ భూములను బదలాయించేందుకు ప్రయత్నించాలని వారు కోరుతున్నారు. -
10,000 ఎడ్ల బండ్లు వస్తయ్..
మేడారంలో పది క్యాంపులు కోళ్లకు కూడా వైద్య పరీక్షలు జాతర ముగిసే వరకు మూడు షెడ్యూళ్లు పశు సంవర్థక శాఖ జాయింట్ డెరైక్టర్ వెంకయ్య నాయుడు తమ కోర్కెలు తీర్చితే మేడారం జాతరకు ఎడ్లబండ్లపై వస్తామని కొందరు అమ్మవార్లను మొక్కుతుంటారు. ఈ మేరకు మొక్కును తీర్చుకునేందుకు కుటుంబసమేతంగా ఎడ్ల బండ్లపై జాతరకు వస్తుంటారు. ప్రస్తుతం బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడంతో వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. గత జాతరకు సుమారు 15 వేల ఎడ్ల బండ్లు వచ్చాయి. ఈసారి 10 వేలు ఎడ్ల బండ్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. మేడారం పశువులకు టీకాలు తాడ్వాయి మండలంలోని 43 గ్రామాల్లో ఉన్న పశువులను ఇప్పటికే గుర్తించాం. జనవరి 30 వరకే మండల పరిధిలోని పశువుల కు వ్యాధి నిరోధక టీకాలు వేయించాం. ఆయా గ్రామాల్లోని రైతులు జాతర సమయంలో తమ పశువులను బయటకు వదల వద్దని ఇప్పటికే సూచించాం. జాతర ముగి సిన నెలరోజుల వరకు పశువులను బయట కు పంపించొద్దని సమాచారం అందించాం. రూ.9 లక్షలు మంజూరు జాతరలో పశుసంవర్థక శాఖ సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో మేడారంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, మందులను కొనుగోలు చేస్తాం. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు సేవలు అందిస్తాం. 10 క్యాంపుల ఏర్పాటు జాతరకు వచ్చే పశువులకు వైద్య సేవలందించేందుకు 10 క్యాంపులు ఏర్పాటు చేస్తాం. పస్రా, నార్లాపూర్, తాడ్వాయి, ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొం డారుు, కన్నెపల్లి, ఉరట్టం, కొత్తూరు, రెడ్డిగూడెంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంపులో ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది, ఒక అటెండర్ విధులు నిర్వర్తిసారు. అలాగే రెండో జాతరగా పేరొందిన అగ్రంపహాడ్‌లో కూడా క్యాంపును ఏర్పాటు చేస్తున్నాం. పౌల్ట్రీ ఫాంలో నిరంతర నిఘా జాతరలో ఏర్పాటు చేసే తాత్కాలిక పౌల్ట్రీఫాంలలో నిరంతర నిఘా ఉంటుంది. భక్తులకు విక్రయించే కోళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తాం. వీటిని నిర ం తరంగా తనిఖీ చేసేందుకు రెండు టీంలు ఏర్పాటు చేశాం. వీరు 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటారు. ఈ టీంలో ఒక డాక్టర్, సిబ్బంది ఉంటారు. ప్లాస్టిక్ కవర్లు తింటే చనిపోతాయి జాతరలో పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో మూడు షెడ్యూళ్లు ఏర్పాటు చేసుకుని ముం దుకు వెళ్తున్నాం. జాతరకు ముందు, జాతర సమయంలో, తర్వాత పశువులకు వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం. మేడారంలో పశువులు బెల్లం, ప్లాస్టిక్ కవర్లు తినకుండా చూడాలి. ప్లాస్టిక్ కవర్లు తినడం ద్వారా పశువులు మృతి చెందే అవకాశం ఉంది. జాతర తర్వాత మేడారం, రెడ్డిగూడెం, నార్లాపూర్, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరులో వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. -
19న మేడారానికి సీఎం
హన్మకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెల 19వ తేదీన మేడారం రానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా మేడారం చేరుకుంటారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుగుతున్న మేడారం జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు జాతర విజయవంతానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. -
నేడు మండ మెలిగె
ఏర్పాట్లు పూర్తిచేసిన పూజారులు చుట్టాలతో కళకళలాడుతున్న మేడారం ములుగు : మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు నిర్వహించే పండుగ మండ మెలిగె. బుధవారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా వన దేవతల పూజారులు మండమెలిగె పండుగను నిర్వహించనున్నారు. మండమెలిగె అనంతరం సరిగ్గా వారానికి (వచ్చే బుధవారం) సారలమ్మ తల్లి గద్దెపైకి రావడంతో మహాజాతర ప్రారంభమవుతుంది. మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించేందుకు పూజారులు సిద్ధమయ్యారు. ఉదయం మహిళలు తమ ఇళ్లను ముస్తాబుచేస్తారు. పుట్టమట్టితో అలుకుతారు. ఆ తర్వాత అడవికి వెళ్లి గడ్డిని సేకరించి తీసుకొస్తారు. గడ్డిని గుడిపై పెడతారు. అక్కడి నుంచి మేడారం ప్రారంభ ద్వారం వద్ద, ఆలయ ప్రవేశమార్గం ముందు దొరటంబాలు (దిష్టితగల కుండా ఏర్పాటు చేసే ద్వార స్తంభం) లేపుతా రు. ద్వారానికి ఆనక్కాయ, మామిడి తోరణం, కోడిపిల్లను కడతారు. అక్కడి నుంచి గ్రామ దేవతలకు మొక్కు చెల్లిస్తారు. పూజారి సిద్ధబోయిన మునీందర్ఇంట్లో నుంచి పూజా సామగ్రిని సమ్మక్క గుడికి తీసుకెళ్తారు. అనంతరం అక్కడ అమ్మకు ప్రత్యేక పూజ నిర్వహించి గద్దెల పైకి తీసుకెళ్తారు. మహిళలు రోజంతా ఉపవాసం ఉంటారు. మునీందర్ ఇంటి నుంచి సమ్మక్క ఆలయానికి తీసుకెళ్లే పూజా సామగ్రిని ఇంటిలోని కుటుంబ సభ్యులు మంగళవారం సిద్ధం చేశారు. కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలోనూ ఇదే తీరుగా మండమెలిగె పూజలు నిర్వహిస్తారు. ఊరంతా కళకళ.. మండమెలిగె పండుగకు ఇంటి ఆడపడుచులు, ఇతర చుట్టాలను ఇళ్లకు పిలవడం(కేకేయడం) ఇక్కడి ఆదివాసీల ఆనవాయితీ. ప్రస్తుతం మేడారంలో ఏ ఇళ్లు చూసినా చుట్టాలతో కళకళలాడుతోంది. ఇళ్లన్నీ నూతన శోభతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడపడుచును జాతర ముగిసిన తరువాతే తిరిగి అత్తారింటికి పంపిస్తామని గ్రామస్తులు తెలిపా రు. అత్తారింటికి పంపేటప్పుడు అల్లుడు, కూ తురు, వారి పిల్లలకు బట్టలు, అమ్మవారి ప్రసాదం(బెల్లం) ఇచ్చి సాగనంపుతారు. -
మేడారంలో బుధవారం ‘మండమెలిగె’
వరంగల్ : సమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం మేడారం సిద్ధమవుతోంది. వన దేవతల వారంగా భావించే బుధవారం రోజున... మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలలో జాతరకు శ్రీకారం చుడతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో మేడారం జాతర లాంఛనంగా మొదలవుతుంది. మేడారం మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజ కార్యక్రమాలను ‘మండ మెలిగె’ పేరుతో పిలుస్తారు. మండ మెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. మేడారం జాతర ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనుంది. మండ మెలిగె రోజు నుంచి మేడారం జాతర పూర్తయ్యే వరకు ఆదివాసీలు ప్రతి రోజు వన దేవతలకు పూజలు నిర్వహిస్తారు. మండ మెలిగె రోజు నుంచే ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. ప్రధాన పూజారి(వడ్డె) నేతత్వంలోని బందం బుధవారం ఉదయం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటుంది. గుడిని శుభ్రం చేస్తారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. మహా జాతరకు ఉపయోగించే సామగ్రిని శుద్ధి చేస్తారు. పసుపు, కుంకుమలు పెడతారు. ముగ్గులు వేసి శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. దుష్టశక్తులను నివారించేందుకు కోడిపిల్లను మామిడి తోరణాలకు కడుతారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం ఉదయం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేద్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే రకమైన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. -
సురక్షిత ప్రయాణమే లక్ష్యం
గంటకు మించి ఆలస్యం కాదు వేగ నియంత్రణతో మేలే ఎక్కువ మేడారం రూట్‌మ్యాప్ వివరాలతో యాప్ ఆర్టీసీ క్యూలైన్లపై విస్తృత ప్రచారం రూరల్ ఎస్పీ అంబర్కిశోర్ ఝా హన్మకొండ : మేడారం జాతరకు వచ్చి వెళ్లే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వన దేవతల గద్దెల వద్దకు చేరేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్రధాన క్యూ లైన్ల వద్ద రద్దీకి అనుగుణంగా భక్తులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. మేడారం దారుల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం కొత్తగా బైక్పార్టీలు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. జాతర ఏర్పాట్లపై ఎస్పీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... వేగ నియంత్రణతో మేలు వేలాదిగా వాహనాలు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు వేగ నియంత్రణ అవసరం. ఓవర్టేక్ చేసే సమయంలో ఏ ఒక్క చోట ఇబ్బంది ఏర్పడినా.. దాని ప్రభావం దారి పొడుగునా ఉంటుంది. అందువల్లే ఈ సారి కటాక్షాపూర్ - తాడ్వాయి మధ్య వేగ నియంత్రణ అమల్లోకి తెస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కటాక్షాపూర్ నుంచి గరిష్ట వేగం గంటకు 30 కిలోమీటర్లకు పరిమితం చేస్తున్నాం. దీనివల్ల మొత్తం ప్రయాణంలో గంట ఆలస్యమైనా ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఎక్కడైనా సమస్య తలెత్తినా సరిదిద్దడం తేలికవుతుంది. హోల్డింగ్ పాయింట్ల నుంచి భక్తులను తరలించేందుకు ఆర్టీసీతో సంప్రదించాం. చిన్నబోయినపల్లి దగ్గర 25 బస్సులు, తాడ్వాయి, పస్రా వద్ద 15 బస్సుల చొప్పున అందుబాటులో ఉంచుతున్నాం. చింతల్‌క్రాస్ వద్ద కూడా షటిల్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్‌ను పర్యవేక్షించేందుకు బైక్ పార్టీలను అందుబాటులో ఉంచుతున్నాం. వీరు సాధ్యమైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తారు. రామప్ప ఆలయాన్ని దర్శించుకునే వారు తిరుగు ప్రయాణంలో గాంధీనగర్ క్రాస్‌రోడ్డు మీదుగా రామప్పకు చేరుకోవచ్చు. ఈ దారిలో ఎటువంటి ఆంక్షలూ లేవు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చే మార్గాన్ని విస్తరించారు. దీంతో సగం సమస్య తీరిపోయినట్టే. భక్తులు పోలీసులకు సహకరిస్తే సమ్మక్క రాకను ఇబ్బంది లేకుండా చూడొచ్చు. తోపులాటకు పాల్పడవద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రత ఏర్పాట్లలో భాగంగా జాతర ప్రాంగణలో మొత్తం 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఐదు వాచింగ్ టవర్స్‌ను సమర్థంగా వినియోగించుకుంటాం. ట్రాఫిక్ గైడ్‌గా మొబైల్ అప్లికేషన్ ఈ సారి అమలు చేయబోతున్న వన్‌వే పద్ధతి వల్ల భక్తులకు ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో పనిచేసే విధంగా వెల్కమ్ టూ మేడారం పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాం. ట్రాఫిక్ వివరాలతో పాటు జాతర షెడ్యుల్, అత్యవసర ఫోన్నంబర్ల వివరాలు ఈ అప్లికేషన్లో పొందుపరిచాం. రాష్ట్రం నలుమూలల నుంచి మేడారం వచ్చే దారుల వివరాలు ఉన్నాయి. అదేవిధంగా మేడారం నుంచి తిరుగు ప్రయాణానికి సంబంధించిన దారుల వివరాలు అప్లికేషన్లో అందుబాటులో ఉంచాం. మొబైల్ఫోన్లో ఉండే గ్లోబర్ పోజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)తో అనుసంధానం చేస్తే దారి మొత్తాన్ని ఎప్పటికప్పుడు మొబైల్‌ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. హన్మకొండ నుంచి వెళ్లే ప్రైవేట్ వాహనాలు పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవచ్చు. తిరుగు ప్రయూణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వారుు మీదుగా మేడారం చేరుకుంటారుు. తిరుగు ప్రయూణంలోనూ అదే రూట్లో వస్తారుు. నోటిఫికేషన్‌తో మేలు ఈ అప్లికేషన్లో ఉన్న నోటిఫికేషన్ ఆప్షన్ ద్వారా మేడారం జాతర రాకపోకల్లో ట్రాఫిక్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మార్గమధ్యంలో ఎక్కడైనా ట్రాఫిక జామ్ అయితే ప్రత్యామ్నయ దారి వివరాలను, రూట్‌ను ఈ అప్లికేషన్ చూపిస్తుంది. ఫలితంగా నిరీక్షణ ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా మేడారం వచ్చే దారిలో ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. గద్దెల ప్రాంగణం చుట్టూ సగటున ఐదు కిలోమీటర్ల పరిధిలో భక్తులు విడిది చేస్తారు. జాతరకు వచ్చిన భక్తులు తమ వాహనాలను నిలిపి ఉంచిన చోటును సేవ్ లొకేషన్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల జాతర నుంచి తిరిగి వెళ్లేప్పుడు వాహనం ఎక్కడ పార్క్ చేశారనే అంశాన్ని తెలుసుకునే వెసులుబాటు ఉంది. సోషల్ మీడియాలో యానిమేషన్ మేడారం జాతర విశిష్టతతో పాటు మేడారం రాకపోకలకు సంబంధించి వరంగల్ రూరల్ పోలీసులు పది నిమిషాల నిడివిగల యానిమేషన్ మూవీని రూపొందించారు. యూట్యూబ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో ఈ యానిమేషన్ మూవీ అందుబాటులో ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా జాతర రూట్‌మ్యాప్ వివరాలు తెలుసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, నార్లాపూర్ నుంచి మేడారం వెళ్లాలి. తిరుగు ప్రయూణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపూర్ క్రాస్ నుంచి కాటారం మీదుగా వెళ్లిపోవచ్చు. ఆర్టీసీ బస్సులు కాటారం, భూపాలపల్లి, గాంధీనగర్ క్రాస్, జంగాలపల్లి క్రాస్ మీదుగా పస్రా, తాడ్వారుు నుంచి మేడారం వెళ్తారుు. తిరుగు ప్రయూణంలోనూ ఇదే రూట్లో వెళ్తారుు. -
మేడారం స్పెషల్
మేడారం జాతరకు 480 ప్రత్యేక బస్సులు నగర శివార్ల నుంచి ప్రత్యేక ఏర్పాట్లు 14 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సుల నిర్వహణ రోజూ 60 బస్సుల ఏర్పాటు సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే మేడారం జాతరకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఇందుకుగాను ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రోజుకు 60 బస్సుల చొప్పున 480 అదనపు బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ప్రణాళిక రూపొందించింది. ఈ నెల 17,18,19 తేదీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైతే బస్సులను పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ ‘సాక్షి’తో చెప్పారు. నగరంలోని అన్ని అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాల (ఏటీబీ) నుంచి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. కొందరు ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకొనే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌శుఖ్‌నగర్ బస్స్టేషన్లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి. 50 శాతం అ‘ధన’ం.... ప్రధాన పండుగలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 50 శాతం చొప్పున అదనపు చార్జీలు వసూలు చేసే ఆర్టీసీ మేడారం జాతరను కూడా సొమ్ము చేసుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నగరం నుంచి బయలుదేరే ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు నేరుగా గద్దె వరకు వెళ్తాయి. ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు అడ్వాన్స్ సీట్ల కోసం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ఆర్టీసీఆన్లైన్ డాట్ ఇన్ ’’ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నగరంలోని అన్ని ఆర్టీసీ అధీకత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మేడారం జాతర బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ : 9959226257, 99592 24910, 040-27802203,738201686 నెంబర్లకు సంప్రదించవచ్చు. -
రాజధాని నుంచి 'మేడారం'కు రోజుకు 50 బస్సులు
హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్ నుంచి వెళ్లడంతో పాటు, మేడారం నుంచి తిరిగి వచ్చేందుకు రిటర్న్ జర్నీ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి రోజు 50 బస్సుల చొప్పున నడుపనున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు. గురువారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్‌తో కలిసి మేడారం జాతర ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు. ఈ బస్సులకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉంటుంది. ఫిబ్రవరి 17,18,19 తేదీల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ మూడు రోజుల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు చెప్పారు. అలాగే కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకుంటే ప్రయాణికులు ఉన్న చోట నుంచే బయలుదేరి వెళ్లవచ్చు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లి, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపుతారు. ప్రయాణికులు తమకు నచ్చిన బస్సుల్లో బయలుదేరి వెళ్లవచ్చు. నేరుగా గద్దె వరకు బస్సులు వెళ్తాయని ఈడీ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలపైన యధావిధిగా 50 శాతం అదనంగా తీసుకుంటారు. ఆదివారాల్లో కూడా..... అలాగే, జాతరకు ముందే ప్రయాణికులు మేడారం సమ్మక్క.సారలమ్మలను దర్శించుకొనేందుకు ఆర్టీసీ ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సులు నడపనుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి మేడారంకు చార్జీల వివరాలు : బస్సు చార్జీలు - పెద్దలకు, పిల్లలకు (రూపాయలలో) ఏసీ : రూ.552, రూ.432 సూపర్ లగ్జరీ : రూ.447, రూ.247 ఎక్స్‌ప్రెస్ : రూ.337, రూ.187 -ప్రయాణికులు అడ్వాన్స్ బుకింగ్ 'www.tsrtconline.in' వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. -నగరంలోని ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. -మేడారం జాతర బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910, 040-27802203, 738201686 నెంబర్లను సంప్రదించవచ్చు. -
జాతరకు సర్వం సిద్ధం
10వ తేదీలోగా పనుల పూర్తికి నాది పూచీ భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం ట్రాఫిక్ ఇబ్బందులు రావొద్దనే ‘వన్ వే’ జాతర విధుల్లో 12వేల మంది పోలీసులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కోటికి పైగా భక్తులు వచ్చే అవకాశం : మంత్రి ఐకే.రెడ్డి ఇప్పటికే జాతర వాతావరణం : మంత్రి చందూలాల్ మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష ములుగు : తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారి జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సి ద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో కలిసి బుధవారం మేడారం వచ్చిన ఆయన తొలుత అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా పనుల వివరా లు ఆరా తీశారు. జాతర పనులను జనవరి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినా.. భక్తు ల రద్దీ కారణంగా సాధ్యం కాలేదని తెలిపారు. అరుుతే, కొన్ని శాఖల పనులు పూర్తి కాగా.. మిగిలినవి 10వ తేదీ వరకు పూర్తి చేయనున్న ట్లు వెల్లడించారు. పనులు పూర్తి చేరుుంచే పూచీ తనదని శ్రీహరి పేర్కొన్నారు. ఈసారి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామన్నారు. 10వ తేదీన నీళ్లు వదలాలి.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వీలుగా ఈ నెల 10వ తేదీన లక్నవరం నీళ్లను జంపన్న వాగులోకి వదలాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. నీళ్లు జంపన్నవాగుకు 13వ తేదీ వరకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఇక 16వ తేదీ సాయంత్రం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా కిందికి పంపించి శుభ్రమైన నీటిని మళ్లీ అందించాలని సూచించారు. స్వరాష్ట్రంలో జరుగుతున్న తొలిజాతర అరుునందున విజయవంతమయ్యేలా అధికార యంత్రాంగం కృషి చేయూలని ప్రభుత్వం తరపున కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. కాగా, సారి ప్రత్యేకంగా జాతర తర్వాత వారం పాటు జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉండి పారిశుద్ధ్యం, తదితర పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం జాతర వివరాలు తెలిపేలా జేసీ జీవన్ ప్రశాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆవిష్కరించారు. పుష్కరాల తరహాలో షటిల్ : డిప్యూటీ సీఎం శ్రీహరి ఖమ్మం, ఏటూరునాగారం నుంచి వచ్చే భక్తుల వాహనాలను తాడ్వాయి సమీపంలో నిలిపి షటిల్ బస్సుల ద్వారా పుష్కరాల మాదిరిగా మేడారం తరలిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. జాతర పనులపై అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇక హన్మకొండ-ములుగు మీదుగా వచ్చే ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా నార్లాపూర్‌కు తరలిస్తామని అన్నారు. తిరుగుప్రయాణంలో నార్లాపురం-దూదేకులపల్లి మీదుగా భూపాలపల్లికి మళ్లిస్తామని వివరించారు. దీని వల్ల కొంత దూరం పెరి గినా భక్తులు ఇబ్బంది పడొద్దన్న భావనతోనే ‘వన్ వే’ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 3,605 బస్సులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా కోసం కమలాపురం-తాడ్వాయి ఫీడర్ సిద్ధం చేశామని వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రతీ మేడారం జాతరలో పోలీ సులు, ఇతర అధికారులు.. జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నారని పలువురు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఐకే.రెడ్డి.. గత జాతరలో సమైక్యాంధ్ర పోలీసులు ఉన్నారని.. ఈసారి మన పోలీసులే అరుునందున అలా జరగదని పేర్కొన్నారు. ఇంతలో కడియం శ్రీహరి జోక్యం చేసుకుని జర్నలిస్టులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తామని తెలిపారు. ఆరు నెలల క్రితమే ప్రణాళిక : ఐకే.రెడ్డి మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మామూలు సమయాల్లో సైతం భక్తులు వస్తున్న కారణంగా మేడారంలో పర్మినెంట్‌గా ఈఓ కార్యాలయాన్ని ఏర్నాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. ఈసారి జాతరకు కోటి 25లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మంత్రి చందూలాల్ మాట్లాడుతూ ఇప్పటికే మేడారంలో జాతర వాతావరణం నెలకొందని తెలిపా రు. అలాగే, భక్తుల అవసరాలకు అన్ని సౌకర్యాల క ల్పన కూడా దాదాపుగా పూర్తరుుందన్నారు. కాగా, మేడారం జాతర పునరుద్దరణ కమిటీలో కేవలం ఒక్కరే గిరిజనుడికి అవకాశం కల్పించడంపై ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ కమిటీ ఏర్పాటుకు రిజర్వేషన్లు ఉంటాయని, నిబంధనల ప్రకారమే పునరుద్ధరణ కమిటీ నియమించామని అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణ. డీఐజీ మల్లారెడ్డి. ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, జేసీ ప్రశాంత్ పాటిల్, ఏఎస్పీ విశ్వజిత్. ఆర్డీఓ మహేందర్‌జీ, ఐటీడీఏ పీఓ అమేయ్‌కుమార్, ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అలుకు చల్లి.. ముగ్గులు వేసి
మేడారంలో ఘనంగా గుడిమెలిగె పండుగ గుళ్లను శుద్ధి చేసిన పూజారులు ధూప, దీప నైవేద్యాలతో తల్లులకు పూజలు మేడారం(తాడ్వాయి): మేడారంలో గుడిమెలిగె పండుగను పూజారులు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు మహాజాతర జరగనుంది. జాతరకు సరిగ్గా రెండు వారాల ముందుగా గుడిమెలిగె పండుగ చేస్తారు. సమ్మక్క పూజారులైన కొక్కెర కృష్ణయ్య, మల్లెల ముత్తయ్య, సిద్ధబోయిన మునేందర్, భోజరావు, సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు, బొక్కెనలు ఉదయం 9గంటలకు మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుని గుడి తలుపులు తెరిచారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య కొత్త చీపురుతో గుడిలోని బూజు దులపగా.. పూజారులే గుడిలోపల పెయింటింగ్ వేశారు. అనంతరం అమ్మవారి శక్తి పీఠం, పూజ సామగ్రిని శుద్ధి చేశారు. అలాగే మధ్యాహ్నం 2గంటల తర్వాత పూజారుల కుటుంబాల మహిళలు గుడిలోని అమ్మవారి గద్దెను పసుపు, కుంకుమలతో అలంకరించి ముగ్గులు వేశారు. అమ్మవారి శక్తి పీఠాన్ని, ధ్వజస్తంభం, ద్వారాన్ని కూడా అలంకరించారు. తర్వాత పూజారులు యాటతో గుడి చూట్టూ ప్రదక్షిణలు చేసి దూప, దీప నైవేద్యంతో రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మ క్క తల్లికి నైవేద్యంగా యాటను జడత పట్టారు. గుడిమెలిగె పండుగతో దేవతల జాతర పూజ కార్యక్రమాల తంతు మొదలైనట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు. సారలమ్మ గుడిలో.. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శుద్ధి చేశారు. సారలమ్మ పూజ సా మగ్రి, వస్తువులను శుద్ధి చేశారు. మహిళలు గుడి లోపల, ఆవరణలో ముగ్గులు వేశారు. సారలమ్మ వడ్డెరలు కుండలను అలంకరించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతోపాటు పూజారులు రహస్య పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా గుడి మెలిగె పండుగ సందర్భంగా పూజారులు తమ ఇళ్లను కూడా శుద్ధి చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేడు మేడారంలో మంత్రుల పర్యటన
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారక్క జాతర ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా.. ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి సారించింది. తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి జాతర కావడంతో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.


