మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు భారీగా తరలిరావడంతో గద్దెల ప్రాంగణం కిటకిటలాడింది. మొక్కులు సమర్పించేందుకు భక్తులు సుమారుగా అరగంటపాటు క్యూలో నిలబడ్డారు.


