Medaram Devotees
-
100 రూపాయల నోటుపై రాసి..
హనుమకొండ కల్చరల్: మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర ముగిసినా, భక్తుల ఆరాధన మాత్రం హుండీల రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో కొనసాగుతున్న హుండీల లెక్కింపులో భక్తుల నిష్కల్మషమైన నమ్మకాలు, చిత్రవిచిత్రమైన కోరికలు లేఖల రూపంలో బయటపడుతున్నాయి.ఒక భక్తుడు రూ.1116 హుండీలో వేసి, తన కూతురికి పెళ్లి కావాలని కోరుకున్నాడు. ‘వచ్చే జాతర నాటికి మనవడు పుడితే.. భార్య, కూతురు, అల్లుడు, మనవడితో కలిసి వచ్చి మొక్కులు తీర్చుకుంటా తల్లీ’.. అని ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘మా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలి’.. అని ఒక ప్రేమజంట విన్నవించుకోగా.. రూ. 70 లక్షల విలువైన భూ వివాదం తనకే అనుకూలంగా పరిష్కారం కావాలని మరో భక్తుడు లేఖ రాశాడు. కోరిక నెరవేరితే నిలువెత్తు బంగారం (బెల్లం), కోడి, మేకతో మొక్కులు చెల్లిస్తామని మొక్కుకున్నాడు.సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తమను రెగ్యులరైజ్ చేసేలా ఆశీర్వదించాలంటూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు రాసిన లేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరికొందరు భక్తులు విదేశాల్లో అవకాశాలు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని తమ కోరికలను అమ్మవార్ల ముందు ఉంచుకున్నారు. తన కొడుకు బారి నుంచి కాపాడాలని వంద రూపాయల నోటుపై రాసి సమ్మక్క–సారలమ్మలను వేడుకున్నాడో భక్తుడు. 👉సమ్మక్క–సారలమ్మల జాతర హుండీ లెక్కింపు ఫొటోలు -
సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
మేడారం భక్తులకు నరకం..
సాక్షి, ములుగు: మేడారం జనసంద్రమైంది. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. దీంతో, జాతరకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేడారం నుండి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 గంటల నుండి భక్తులు వేచి చూస్తున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.మేడారంలో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక వేలాది మంది భక్తులు మేడారం బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.మేడారం రూట్ 163 జాతీయ రహదారి పై భారీ ట్రాఫిక్ జామ్!సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో మేడారం ప్రధాన రహదారి పై భారీ #TrafficJam ఏర్పడింది. గంటలో వెళ్లే జర్నీ నాలుగైదు గంటలు పడుతుండటంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #MedaramJathara pic.twitter.com/4UnSdWH2fr— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) January 31, 2026తల్లుల దర్శనం కోసం కలెక్టర్ మంజూరు చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్లు పొందిన భక్తులకు క్యూలైన్లను ఎత్తేయడంతో శుక్రవారం జాతరకు వచ్చిన భక్తులు పాస్లు చేత పట్టుకొని క్యూలైన్లు, దర్శనాల కౌంటర్ల కోసం మేడారం వీధుల్లో వెతుకుతూ కనిపించారు. మరికొందరు దర్శనాలు చేసుకోకుండానే మెయిన్ గేటు బయట నుంచే మొక్కులు చెల్లించుకొని తిరుగు పయనమయ్యారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఎటు చూసినా దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి.భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. శనివారం తల్లుల వన ప్రదేశంతో జాతర పరిసమాప్తం కానున్నది. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రారంభమైంది మొదలు ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు తెలిపారు. -
సందడి సందడిగా మేడారం జాతర..కిక్కిరిసిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం జాతర.. ఉప్పల్ బస్టాండ్లో పిల్లల భద్రత కోసం రిస్ట్ బ్యాండ్లు
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు గుర్తింపు ట్యాగ్లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. జాతర కోసం ఆర్టీసీ తీసుకున్న చర్యలు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సురేష్ కుమార్, ఉప్పల్ ఇన్స్పెక్టర్ కె. భాస్కర్, పరిపాలనా సబ్ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు చిరంజీవి, వినయ్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
Medaram : భక్తులతో కిక్కిరిపోతున్న మేడారం గద్దె
-
మేడారం మహాజాతర పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
జనసంద్రంగా మేడారం.. భారీగా ట్రాఫిక్జామ్
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు సాగే సంరంభంలో.. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టించడంతో అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం సమక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకే లక్షల మంది జాతరకు తరలి వస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాలు భక్త జనంతో కిక్కిరిసిపోయింది. జాతర మొదలు కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాక్టర్లు, కార్లు, ఆటోలు, బస్సులు.. ఇలా వాహనాల్లో తరలి వస్తున్నారు. దీంతో బుధవారం వేకువ జామున సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నెలకొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు జంపన్న వాగు వద్ద ఇసుకేస్తే రాలని జనం కనిపిస్తున్నారు. మేడారానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకువచ్చి బుధవారం మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠిస్తారు. గురువారం సాయంత్రం మేడారం సమీపంలోని చిలుకలగుట్ట నుంచి కుంకుమభరిణె రూపంలో సమ్మక్కను తీసుకువచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం వనదేవతలు సమ్మక్క-సారలమ్మను భక్తకోటి దర్శించుకుంటారు. శనివారం సాయంత్రం జనదేవతల వనప్రవేశంతో మహాజాతర పరిసమాప్తి అవుతుంది.నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో మేడారం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లే.. మహోత్తర ఘట్టానికి తగ్గట్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మహా జాతర నేపథ్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 13వేల మంది పోలీసులు, 42వేల మంది వివిధ శాఖల అధికారులతో జాతర నిర్వహణ జరగనుంది.రాత్రి వేళ ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల పదికిలోమిర్ల పరిధిలో తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, వీధిదీపాల ఏర్పాటు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పండుగైన మేడారం గిరిజన జాతరను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇటు వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి జాతరకు సుమారు రెండు కోట్ల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనాలు వేస్తున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)
-
భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)
-
మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)
-
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం సమ్మక్క–సారలమ్మ మొక్క చెల్లించుకున్న : సీఎం రేవంత్రెడ్డి (ఫొటోలు)
-
ములుగు జిల్లా : మేడారం మినీ జాతరకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా మినీ మేడారం జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం మినీ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
మేడారం మినీ జాతర తేదీలు ఖరారు
సాక్షి, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగావించిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారు అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ మేరకు శనివారం సమావేశమైన మేడారం పూజారులు.. మినీ జాతర తేదీలను ప్రకటించారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం కోరింది.కాగా ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలోనే వచ్చే భక్తులు ప్రస్తుతం ఏడాది పొడవునా తమకు అనుకూలమైన సమయంలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు రావడంతో అడవి అంతా జనసంద్రమవుతుంది. మహా జాతర జరిగిన మరుసటి సంవత్సరం చిన్న జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. -
నేటి నుంచే మినీ జాతర
మినీ జాతరకు ‘మేడారం’ ముస్తాబైంది.. విద్యుద్దీపాలతో సమ్మక్క-సారలమ్మ తల్లుల గద్దెలను అందంగా అలంకరించారు.. బుధవారం నుంచి శనివారం వరకు దారులన్నీ భక్తులతో కిక్కిరిసి పోనున్నారుు.. పది రోజుల ముందు నుంచే వేల సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లిస్తున్నారు.. మంగళవారం ఒక్కరోజే ఐదు వేల మంది దర్శించుకున్నారు.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఎత్తు ‘బంగారం’ సమర్పించారు.. తలనీలాలు ఇచ్చుకున్నారు.. శివసత్తులు పూనకాలతో ఊగారు.. ఈ నాలుగు రోజులు సందడి నెలకొననుంది.. - ములుగు/తాడ్వారుు మేడారం (తాడ్వాయి): మహా జాతర జరిగిన సరిగ్గా ఏడాది తర్వాత మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం మండమెలిగే పండుగతో మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర ప్రా రంభం కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచే భక్తుల రాక పెరిగింది. భక్తులతో జంపన్నవాగు పులకించిపోరుుంది. ఒక్కరోజే సుమా రు 5 వేల మంది అడవి తల్లులను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారుు. జాతర పరిసరాల్లో దుకాణాలు వెలి శారుు. భక్తులు చీరసారెలు, వనదేవతలకు ఇష్టమైన బంగారాన్ని (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేడు ఇలా... బుధవారం సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేస్తారు. ఆడపడుచులు పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి సమ్మక్క గద్దెను అలంకరిస్తారు. అనంతరం దుష్టశక్తులు ప్రభావం చూపకుండా మేడారంలోని రెండు ప్రధాన రహదారుల పొలిమేరల్లో పూజారులు ధ్వజస్తంభాలు పాతి... రోడ్డుకు అడ్డంగా నీళ్లు ఆరగించి... మామిడాకుల తోరణాలు, కోడిపిల్లను కడతారు. అనంతరం సిద్దిబోయిన మునేందర్ ఇంటి నుంచి పసుపు, కుంకుమలతో గుడికి వెళ్లి సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆర్ధరాత్రి సమయంలో గుడి నుంచి ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్య సమ్మక్కను తీసుకుని డోలివాయిద్యాల నడుమ తల్లి గద్దెపై ప్రతిష్టిస్తారు. రాత్రంతా గద్దెలపై జాగారాలతో సంబరాలు జరుపుకుంటారు. గురువారం పొద్దుపొడవక ముందే గద్దెపై నుంచి తల్లిని గుడికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో బుధవారం ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు గుడిని శుద్ధి చేస్తారు. హడారాల కుండాలను పసుపు, కుంకుమలతో అలంకరించి ధూపదీపాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పూజలు నిర్వహించిన ఆనంతరం రాత్రి సమయంలో పూజారులు సాక తీసుకుని మేడారం దేవతల గద్దెల వద్ద సమ్మక్క పూజరులకు సాకహనం ఇచ్చిపుచ్చుకుని వారితో కలిసి సంబరాల్లో పాల్గొంటారు. గురువారం ఉదయం కూడా సారలమ్మ గుడిలో పూజలు చేసి మేకపోతు బలిస్తారు. అనంతరం పూజారులు తమ ఇళ్లలో పూజలు చేయడంతో తంతు ముగుస్తుంది.


