వీఐ సురక్షిత కేంద్రాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాప్ వద్ద వీఐ సురక్షిత కేంద్రాన్ని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు గుర్తింపు ట్యాగ్‌లు (wristbands) వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్‌లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆయన ఆదేశించారు. జాతర కోసం ఆర్టీసీ తీసుకున్న చర్యలు పట్ల ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సురేష్ కుమార్, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ కె. భాస్కర్, పరిపాలనా సబ్ ఇన్‌స్పెక్టర్ మాధవరెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు చిరంజీవి, వినయ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


