తెలంగాణ రైతులకు శుభవార్త | Rythu Bharosa Funds: Good News for Telangana Farmers | Sakshi
Sakshi News home page

తెలంగాణ రైతులకు శుభవార్త

Mar 15 2026 7:05 PM | Updated on Mar 15 2026 7:10 PM

Rythu Bharosa Funds: Good News for Telangana Farmers

హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో  రైతు భరోసా నిధులు జమ చేయనుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం.  

ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . తొలి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు.  ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.  మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.

డైలమాకు తెర..!
గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమైంది. చెందుతున్నారు.  ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో రైతుల డైలమాకు తెరపడింది.

ప్రస్తుత యాసంగి సీజన్‌ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు.  తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement