breaking news
Farmers
-
పార్లమెంట్లో తెలంగాణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’(పీఎం–కిసాన్) పథ కం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలోని రైతులకు మొ త్తం రూ.14,236.18 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత నవంబర్ 19న విడుదల చేసిన 21వ విడతలో తెలంగాణలోని 29.96 లక్షల మంది రైతులకు రూ.599. 31 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తెలిపారు.ఐదేళ్లలో రూ.6.21 లక్షల కోట్ల యూరియా సబ్సిడీ దేశ వ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో (2020–21 నుంచి 2024–25 వరకు) యూరియా సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.6,21,944.29 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ కేఆర్.సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సబ్సిడీ భారం2022–23 నాటికి గరిష్టంగా రూ.1,68,676 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఇది రూ.1,24,319 కోట్లుగా ఉంది. వరంగల్‌లో 15.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ వరంగల్ జిల్లాలో 2024–25 పంట కాలానికి సంబంధించి రైతుల నుంచి 15.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 2.95 లక్షల బేళ్ల పత్తిని సేకరించినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీఎస్ఆర్ వ్యయం రూ. 34,908 కోట్లు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు వెచి్చస్తున్న నిధులు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 34,908.75 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో తెలంగాణ ఎంపీ బి.పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 48,186 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి తెలంగాణలో 48,186 సహకార సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తుండగా, వాటిలో దాదాపు కోటి మందికి (1,00,60,281) పైగా సభ్యులు ఉన్నారని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లోక్‌సభలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో (అక్టోబర్ 31 వరకు) మార్కెటింగ్, డెయిరీ, ఇతర రంగాలకు కలిపి మొత్తం రూ. 20,989.33 కోట్లు విడుదల చేసినట్టు కేంద్రం గణాంకాలను బయటపెట్టింది. 2024–25లో తెలంగాణకు చెందిన 5,639 మందికి శిక్షణ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 4.77 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి హైదరాబాద్‌లో రూ. 47 కోట్లతో భారీ హోల్‌సేల్ ఫిష్ మార్కెట్ తెలంగాణలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 4.77 లక్షల టన్నుల ఇన్లాండ్ చేపల ఉత్పత్తి జరిగిందని కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్ వెల్లడించారు. లోక్‌సభలో జహీరాబాద్ ఎంపీ సురేశ్‌కుమార్ షెటా్కర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ’ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’కింద 2020–21 నుంచి 2024–25 వరకు తెలంగాణకు రూ. 339.37 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, ఇందులో కేంద్ర వాటా రూ.108.73 కోట్లు కాగా, రూ.39.40 కోట్లు విడుదల చేశామన్నారు. మత్స్య రంగాన్ని బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌లో రూ. 47.03 కోట్లతో అత్యాధునిక హోల్‌సేల్ ఫిష్ మార్కెట్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 511 పీజీ సీట్లు తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా మొత్తం 511 పీజీ వైద్య సీట్లను ఆమోదించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ (హైదరాబాద్)లో అత్యధికంగా 145 సీట్లు (మొదటి విడతలో 113, రెండో విడతలో 32), కాకతీయ మెడికల్ కాలేజీ (వరంగల్): 92 సీట్లు (89+3), గాంధీ మెడికల్ కాలేజీ (సికింద్రాబాద్): 91 సీట్లు (77+14), సిద్దిపేట మెడికల్ కాలేజీ: 80 సీట్లు, నల్లగొండ (30), సూర్యాపేట (25), ఆదిలాబాద్ రిమ్స్ (22), నిజామాబాద్ (16), మహబూబ్‌నగర్ (10) కాలేజీల్లో కూడా సీట్లు పెరిగాయి. నకిలీ మందులపై ఉక్కుపాదం.. 700 కంపెనీల ఆడిట్ దేశంలో నకిలీ, నాసిరకం మందుల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో దగ్గు మందు (కోల్డ్ రిఫ్ సిరప్) తాగి చిన్నారులు మరణించిన ఘటనపై విచారణ జరిపామని, ఆ మందులో ప్రమాదకరమైన ’డైథలిన్ గ్లైకాల్’46.28 శాతం ఉన్నట్టు తేలిందని మంత్రి వెల్లడించారు. ఈ మందును తయారు చేసిన తమిళనాడుకు చెందిన కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 700కు పైగా దగ్గు మందు తయారీ కంపెనీల్లో ముమ్మర తనిఖీలు (ఆడిట్) నిర్వహించినట్టు కేంద్రం తెలిపింది. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్‌కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. -
‘సీమ’ అరటి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంతంలో.. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లాలో అరటి రైతులు తీవ్రసంక్షోభంలో ఉన్నారని, ధరలు భారీగా పతనం కావడంతో దిక్కుతోచనిస్థితిలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల పులివెందుల ప్రాంతంలో అరటి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారని, ఆయన సూచన మేరకు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు. కరవు ప్రాంతమైనప్పటికీ రైతులు ఆధునిక టిష్యూ కల్చర్ (జీ9/కావెండిష్ రకం) ఎకరాకు 60–70 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారన్నారు. ప్రధాన సాగుప్రాంతమైన పులివెందులలో ఇటీవల వరకు టన్ను రూ.22 వేలు పలికిన అరటి ధర నెలరోజుల్లోనే టన్ను వందల రూపాయలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడి వచ్చినా గిట్టుబాటుధర లేకపోవడంతో పంటను అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గెలలు చెట్ల మీదే పండి కుళ్లిపోతున్నాయని, కొన్నింటిని పారవేస్తున్నారని తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితులు, కరవు కారణంగా 2025 ఖరీఫ్ సీజన్లో సాగు గణనీయంగా తగ్గిపోయిందన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో సాధారణ సాగుతో పోలిస్తే 19–35 శాతం మాత్రమే సాగు జరిగిందని చెప్పారు. ధరలు పడిపోయిన నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముంబై, కోల్‌కతా వంటి ప్రాంతాలకు రైలుమార్గం ద్వారా అరటిని తరలించాలని సీఎం ఆదేశించారని, అయితే ఇంతటి తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రైతులకు ఇది ఏమాత్రం సరిపోదని తెలిపారు. కేవలం అధిక దిగుబడినిచ్చే టిష్యూ కల్చర్ పద్ధతులను ప్రోత్సహిస్తే సరిపోదని, మార్కెట్ కుప్పకూలినప్పుడు, ప్రకృతి సహకరించనప్పుడు రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర వ్యవసాయశాఖ తక్షణమే స్పందించి రాయలసీమ అరటి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కడప విమానాశ్రయానికి రూ.606.4 కోట్లువైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు వైఎస్సార్ కడప జిల్లాలోని కడప విమానాశ్రయానికి ఉడాన్ పథకం కింద 2024–25లో రూ.606.4 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈ నిధులను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేసినట్లు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. ఈ విమానాశ్రయాన్ని 2017 మార్చి 30న రూ.99.36 కోట్లతో రీజనల్ కనెక్టివిటీ స్కీం కింద గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం కడప నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు.జీపీఎస్ స్ఫూఫింగ్ నిజమేఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్ఫూఫింగ్ జరిగినమాట వాస్తవమేనని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఎస్.నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ స్ఫూఫింగ్‌కు గురైనట్లు చెప్పారు. దేశంలో 15 విమానాశ్రయాలు ఉడాన్ పథకం కింద పనిచేయడంలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ నిరంజన్‌రెడ్డి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. పరిశ్రమలకు సకాలంలో ఆర్థిక సహాయాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరన్దాల్జే చెప్పారు. దేశంలో సింగిల్ స్క్రీన్లు తగ్గుతున్నాయని, వాటి నిర్మాణం, పునరుద్ధరణ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి జీరో అవర్‌లో కోరారు. థియేటర్ ఫుడ్, బేవరేజెస్ ధరలపై నియంత్రణ తేవాలన్నారు.విశాఖ మెట్రోకు ప్రతిపాదనలురాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సమాన భాగస్వామ్య నమూన కింద 46.23 కిమీ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సవరించిన ప్రతిపాదనలను సమర్పించినట్లు కేంద్ర పట్టణాభివృది్ధశాఖ సహాయమంత్రి టోకాన్ సాహు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. మెట్రో రైలు విధానం–2017 ప్రకారం అంచనా అవసరం, సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతపై ఆమోదం ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందువల్ల మంజూరు కోసం ఎటువంటి సమయం పేర్కొనలేమని తెలిపారు. -
హలో ఇండియా... ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి.
-
చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు. కానీ, హామీల ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్నదాత సుఖీభవ అంటూ దగా చేయడం, విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలిరోజే అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండో రోజు నుంచే మొహం చాటేశారు. కనీసం కరపత్రాలు కూడా పంచే సాహసం చేయలేకపోయారు. ప్రతి నెల సామాజిక పింఛన్ల పంపిణీలో ఫొటో షూట్‌తో నానా హంగామా చేస్తున్న సీఎం చంద్రబాబు రైతుల గడప తొక్కలేకపోయారు. రైతుల కోసం ప్రాణం ఇస్తానంటూ ఎన్నికల్లో నమ్మబలికిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే పత్తా లేరు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు చివరకు స్థానిక ప్రజా ప్రతినిధులకూ హాజరయ్యేందుకు ధైర్యం చాల్లేదు. ఫలితంగా ‘రైతన్నా మీ కోసం’ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ కార్యక్రమం కోసం పైసా కూడా విదిల్చ లేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. పంచసూత్రాల్లేవ్.. ఇంటింటికీ పోలేదు.. ‘‘నేనూ రైతు బిడ్డనే. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అంటూ ‘రైతన్నా మీ కోసం’పై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు గొప్పలు పోయారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో ఏం చేసిందో చెబుతామన్నారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు అధికారులు కూడా పాల్గొంటారని, తానూ రైతుల ఇళ్లకు వెళ్తానని సీఎం స్వయంగా ప్రకటించారు. రైతును రాజును చేసేందుకు పంచ సూత్రాల పేరిట ముద్రించిన కరపత్రాలను అందించడంతో పాటు ప్రత్యేకంగా తెచ్చిన ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణ వ్యవస్థ) యాప్‌ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, దాని నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. తొలి రోజు హడావుడి, హంగామా చేసినా రైతుల నుంచి కనీస స్పందన లేదు. సరికదా పలుచోట్ల తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచి్చంది. టీడీపీ నేతలు తప్ప కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిదులు, నేతలు మచ్చుకైనా కనిపించలేదు. ఏ పంటకూ మద్దతు ధర లేదు.. ఇదే మీ నిర్వాకం ‘‘మిరప మొదలు అరటి వరకు 18 నెలలుగా ఏ పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ధాన్యానికి సైతం తేమ శాతం వంకతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఓ వైపు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు’’ అంటూ రైతన్నా మీ కోసంలో తొలిరోజే రైతులు ప్రజాప్రతినిధులను కడిగేశారు. మరోవైపు ‘ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ప్రీమియం కట్టలేక బీమా చేయించుకోలేకపోయాం. వరుస విపత్తులతో పంటలు నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదంటూ’ నిలదీశారు. ఎక్కడొచ్చింది అన్నదాత సుఖీభవ? అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి రూ.14 వేలు జమ చేసినట్లు చెప్పి తప్పించుకుందాం అని కూటమి ప్రజాప్రతినిధులు భావించినా, ఆ సొమ్ము తమకు పడలేదంటే తమకు పడలేదని, తొలి విడతకు సంబంధించిన వినతులను కనీసం పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పలేక, రైతులను సముదాయించలేక జారుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చేసేది లేక పాల్గొనలేదని పల్నాడుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ‘‘అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టాం. రెండో ఏడాది పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో రూ.14వేలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమి లేదు’’ అని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు. భజన మీడియా గప్‌చుప్.. సీఎం చంద్రబాబు బృందం కాలుబయటపెడితే చాలు.. అహో ఒహో అంటూ భజన చేసే పచ్చ మీడియా సైతం ‘‘రైతన్నా మీకోసం’’ గురించి ప్రస్తావించలేదు. దీంతోనే ఈ కార్యక్రమం ఎలా సాగిందో స్పష్టం అవుతోంది. రైతుల ఇళ్లకు వెళ్లినట్టు, వారు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు రోజువారీ నివేదికలివ్వడం తప్ప ప్రత్యక్షంగా రైతుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు మచ్చుకైనా కని్పంచలేదు. మెజార్టీ గ్రామాల్లో రైతులనే అధికారులు పిలిపించుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడిన పరిస్థితి నెలకొంది. రైతన్నా మీ కోసం ముగింపు సందర్భంగా ఈ నెల 3న ఆర్బీకేల పరిధిలో వర్కుషాపులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మా ఊరికి వస్తే నిలదీద్దామనుకున్నా.. ఎవరూ రాలేదు ‘నా వయస్సు 60 ఏళ్లు.. గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేసామని చెబుతున్నారు. నాకు పడలేదు. ఎవరికి పడ్డాయో కూడా తెలియదు. సొంతంగా ఏడు ఎకరాలు, కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అప్పు చేసి పెట్టుబడి పెట్టి టమాట, పత్తి, కూరగాయలు పండించా. అధిక వర్షాల కారణంగా పత్తి 2–3 క్వింటాళ్ల దిగుబడే రాగా, మిగిలిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికి క్వింటా రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మా గ్రామానికి వస్తే నిలదీద్దామనుకున్నా. ఏ ఒక్కరూ మాఇంటికి వచ్చిన పాపాన పోలేదు. -కె.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా బాబు సర్కారును రైతులు నమ్మడం లేదు మాటల గారడీ తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మద్దతు ధర దక్కక ఓవైపు అరటి, ఉల్లి, మొక్కజొన్న, సజ్జ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో చంద్రబాబు అన్నదాతల గడప తొక్కలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టింది. కౌలు రైతులనైతే నిండా ముంచేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నా మీ కోసం అంటూ ఆడుతున్న దొంగ నాటకాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
YS Jagan: హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండంటూ ట్వీట్
-
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్‌కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం... రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
-
భూములు ఇవ్వకపోతే..! అమరావతి రైతులకు బాబు బెదిరింపులు
-
మూటా ముల్లె సర్దుకుని.. హైదరాబాద్‌కు వలస
కర్నూలు జిల్లా: అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు మూట కట్టుకున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారు. పత్తి, ఉల్లి, మిరప, వరి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు, రైతు కూలీలు మూటా ముల్లె సర్దుకుని వలస బాట పట్టారు. గురువారం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన రైతులు, రైతు కూలీలు పనుల కోసం తెలంగాణ రాష్ట్రం వద్ద అచ్చం పేటకు వెళ్లారు. దాదాపు 20 కుటుంబాలు పిల్లపాలపతో వలస వెళ్లారు. వలస నివారణలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం చెందిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
Ys Jagan: వెల్లువెత్తిన జనాభిమానం
సాక్షి కడప: కనుచూపు మేర కటౌట్లు.. బాణా సంచా వెలుగు జిలుగులు.. అడుగడుగునా పూల వర్షం.. బైకులకు పార్టీ జెండాలు.. జై జగన్ నినాదాలు.. వెరసి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి, కోలుకున్న వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి (రాము)ని పరామర్శించడానికి బుధవారం వైఎస్ జగన్ వేల్పుల వెళుతుండగా అభిమానులు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.కాన్వాయ్ వెంట భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ వాహనం పైనుంచి.. నలువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తుండగా, వేల్పులలో అభిమానులు మిద్దెలపై నుంచి పూల వర్షం కురిపించారు. రోడ్డంతా పూలు పరిచి స్వాగతం పలికారు. మహిళలు కరచాలనం చేస్తూ వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఆనందంలో ... అనంతరం రామలింగారెడ్డి ఇంట్లోకి వెళ్లిన వైఎస్ జగన్.. ఆయనతో చర్చించారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు జరిగిన గొడవ గురించి మాట్లాడారు. రామలింగారెడ్డి తల్లి పార్వతమ్మ.. ఆయన సతీమణి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి పులివెందులకు వచ్చే క్రమంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుకు ఇరువైపులా చేరుకుని అభివాదం చేశారు.విద్యార్థుల కోసం ఓ సెల్ఫీ పలు చోట్ల అభిమానుల తాకిడికి కాన్వాయ్ ఆపి.. వారితో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో పది కిలోమీటర్ల దూరంలోని పులివెందులకు రావడానికి పది నిమిషాలకు బదులు ఒకటిన్నర గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. సెల్ఫీలు దిగుతూ మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్ జగన్‌ను కలిశారు. చిన్నారికి సెల్ఫీ- పులివెందుల క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజలకు నమస్కరిస్తున్న వైఎస్ జగన్ వైఎస్ జగన్‌ను చూసి చిన్నారుల కేరింతలు వేల్పులలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్‌ను చూసిన ఆనందంలో విద్యార్థులు -
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజలకు, రైతులకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. క్వింటా ఉల్లి రూ.1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్‌కు రూ.50 వేలు ఇస్తా మన్నారు.అదీ లేదు. ఇదీ లేదు.. ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్ అన్నట్లు తయారైంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి కడప: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి రైతుల పరిస్థితి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా ప్రేమ లేదని.. ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినా కనీస సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, తోటల్లో అలాగే వదిలేస్తున్నామని, పశువులకు వేస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని వాపోయారు. రైతుల బాధలు ఓపికగా విన్న వైఎస్ జగన్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కరెంటు ఖర్చవుతుందని వినియోగంలోకి తీసుకు రారా? ⇒ఈ ప్రాంతంలో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్‌ను 2024 మార్చిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజ్‌ను నడపడం లేదు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? చంద్రబాబు రైతులను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో చెప్పేందుకు ఈ కోల్డ్ స్టోరేజీయే నిదర్శనం.వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, వ్యవసాయ రంగం పరిస్థితి తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది గుండు సున్నా.⇒మొన్నటి మోంథా తుపాను నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతుల హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు.⇒రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు.. వారికి అగచాట్లు రాకూడదని తపన పడిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి 84 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7,400 కోట్లు అందించాం. ఈ రోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉంది. ⇒మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. ఏ ఏడాది కూడా ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు.నాడు రూ.32 వేలు.. నేడు రూ.2 వేలుమా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈ రోజు కనీసం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు కూడా వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ⇒దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. అందుకే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా దేనికీ గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు.⇒గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను. హామీలన్నీ గాలికి.. అంతటా దోపిడీ ⇒సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.⇒ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్జ్.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులను దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు.ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.అనంతరం ఒక రైతు మాట్లాడుతూ ‘అయ్యా.. చంద్రబాబు గారూ.. మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బతుకుతున్నారు? ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా? రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పిల్లలకూ తప్పని కష్టాలుఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం. డిసెంబర్ వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటాయి. ఒక్కో క్వార్టర్‌కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదునాకున్న ఆరు ఎకరాల భూమిలో దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేశాను. ఎరువులు, మందులు వాడటంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కాయ కూడా నాణ్యంగా ఉంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం లేదు. దీంతో తోటలోనే పండ్లు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాను. పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరటి రైతులను ఆదుకోవాలి.– శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఅరటి పంటను అడిగే నాథుడే లేడు ఎంతో కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి అరటి పంట సాగు చేసి మంచి దిగుబడి వచ్చిందన్న సమయంలో కొనుగోలు చేసే నాథుడే లేడు. అరటి చెట్లకే పండ్లు మాగి కిందపడిపోతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.32 వేల వరకు టన్ను అరటి కాయల ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ.2 వేలకు అమ్ముదామన్నా కొనే వారు లేరు. ప్రభుత్వం రైతులను పట్టించుకొని అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం దారుణం.– రామతులశమ్మ, బ్రాహ్మణపల్లి, పులివెందులపంటను దున్నేయాల్సిన దుస్థితిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో అరటి పంటకు మంచి ధరలు ఉన్నాయని ఆశించి ఈ ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేశాం. తీరా పంట దిగుబడి వచ్చి మార్కెట్లో అమ్ముదామనుకున్న సమయంలో వ్యాపారులు, ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు స్పందించడం లేదు. దీంతో అరటి కాయలు చెట్లకే మాగిపోతున్నాయి. అరటి పంటను ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా అరటి రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.– రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే, తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక తల్లిడిల్లిపోతున్నాం. నేను, నా స్నేహితుడు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి, టమాట పంటలను సాగు చేశాం. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడులు పెట్టాం. కనీసం ఒక్కరూపాయి కూడా మాకు డబ్బు రాలేదు. టమాట పంటను అమ్మడానికి మార్కెట్‌కు పోతే కొనేనాథుడు లేక మార్కెట్ వద్ద పారబోశాను. ఆటో బాడుగ కూడా చేతి నుంచి పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.– బాబురెడ్డి, ఇనగలూరు, తొండూరు మండలం -
Pawan: సభలో పవన్‌కు బిగ్ షాక్.. పరువు పోతుంది.. మైక్ కట్ చేయండి..
-
YS Jagan: కరోనా సమయంలోనూ రైతులకు ఆదుకున్నాం..
-
YS Jagan: చంద్రబాబు ఉ కొట్టడం ABN, TV5 లు డప్పులు
-
అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
-
మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
సాక్షి,గుంటూరు: మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని మల్లవల్లి రైతులు ధర్నా చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆఫీస్‌కు ఇప్పటికి 27సార్లు వచ్చినా పట్టింపులేదంటూ రైతులు మండిపడ్డారు. పవన్ కల్యాణ్ తమను కలవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు.కాగా, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిన్న (నవంబర్ 24, సోమవారం) పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ప్రజలు, కార్మీకుల నుంచి నిరసనల సెగ తగిలిన సంగతి తెలిసిందే. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన తమ పట్ల డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వ్యవహరించిన తీరుపై శ్రీ సత్యసాయి గోదావరి తాగునీటి పథకం కార్మీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో పనిచేస్తున్న 52 మంది కార్మీకులకు ప్రభుత్వం 20 నెలలుగా జీతాలు, 34 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదు. మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో వారంతా పవన్‌కళ్యాణ్‌కు గోడు వెళ్లబోసుకునేందుకు విమానాశ్రయానికి వచ్చారు. కానీ, పవన్‌ను కలిసేందుకు కార్మీకులకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మండిపడిన కార్మీకులు పవన్‌కళ్యాణ్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మధురపూడి సాయిబాబా ఆలయ సమీపాన ప్లకార్డులతో నిరసన తెలిపారు. -
‘సరైన టైం చూసి కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు’
సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గం మంగళవారం జన సంద్రంగా మారింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వేలాది మంది అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. భాకరపురంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు. వైఎస్ జగన్ పర్యటనకు ఇంత భారీ స్పందన రావడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, తగిన సమయంలో ప్రజలు తమ నిర్ణయం చెబుతారని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.అరటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద టన్నుకు రూ.200 మాత్రమే ఇచ్చి కొనుగోలు చేసి.. అదే పంటను మార్కెట్లో మధ్యవర్తులు రూ40 నుంచి రూ.50 కిలోకు అమ్ముతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారనిఅన్నారు.అరటి, చీనీ, మామిడి, టమోటా, పత్తి ఏ పంట తీసుకున్నా రైతులకు ఈ ప్రభుత్వంలో ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను అర్థం చేసుకుని, సరైన సమయంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. -
పులివెందులలో జనసందోహం నడుమ వైఎస్ జగన్ (చిత్రాలు)
-
అప్పుడు.. ఇప్పుడు రైతులకు బాసటగా..
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో రైతులకు కొండంత అండగా నిలిచారు. రైతుకు భరోసా దగ్గర్నుంచీ రైతు మద్దతు ధర వరకూ అన్నింటా తోడుగా ఉన్నారు. ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు.. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే... జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.(What YS Jagan Did For Farmers)కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వమేదైనా ఉందీ అంటే... అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో... వారి పంటలను దారుణమైన పరిస్థితుల్లో కూడా తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా గత జగన్ ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్రమే. కాకుంటే చాలా పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట ఇతర పంటలకు ఉదారంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధరలుంటే రైతులు మార్కెట్లోనే విక్రయించుకుంటారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి కొన్ని ప్రత్యేక పంటలకు గనక మార్కెట్లో ధర పడిపోతే... వారిని ఆదుకోవటానికి రాష్ట్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉంటుంది.2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.3,322 కోట్లు. మరి వైఎస్ జగన్ ప్రభత్వం మూడున్నరేళ్లలోనే ప్రభుత్వం వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా ఏడువేల నూటయాభై ఏడు కోట్లు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.43,134 కోట్లయితే... మూడేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,200 కోట్లు వెచ్చించింది. విత్తనాలు, పురుగు మందులు దగ్గర నుంచి..రైతుకు విత్తనాలు, పురుగు మందులు అందించే దగ్గర నుంచి... వారి నుంచి పంట కొనుగోలు చేసేందుకు కూడా వీలుగా గ్రామ స్థాయిలో ఏకంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటయ్యాయి. పైపెచ్చు ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయటం... రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం... కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వటం... నాణ్యతకు పెద్దపీట... నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలూ నిక్కచ్చిగా అమలు చేశారు. . దీన్నిబట్టి వైఎస్ జగన్ ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో వేరుగా చెప్పాల్సిన పనిలేదు.(YS Jagan Reforms In Agriculture)అప్పుడు కనీస మద్దతు ధరకన్నా మార్కెట్ ధర భేష్..గత వైఎస్సారసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్లో ధర పలికింది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. తొలి మూడేళ్లలో ధరలు పడిపోయినపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరంగా నిలిచాయి.మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏది?వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10వేలమందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా వారి ఎల్లో మీడియాలో రాయించుకుంటున్న చంద్రబాబు సర్కార్.. అదే నోటితో కనీసం 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారన్నది ప్రధానంగా చూడాలి.ఇక ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడంలేదనేది ఆ చంద్రబాబు సర్కారుకే తెలియాలి. ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా పట్టనట్లే వ్యవహరించింది చంద్రబాబు సర్కార్.ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఏ కష్టం వచ్చినా, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందించి ఆదుకున్న సందర్భం కూడా ఎక్కడా రాలేదు.రైతులు, వారి తరఫున వైఎస్ జగన్ పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేయడం.. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేయడం తప్పితే, ఆచరణ వరకూ వచ్చేసరికి ఏమీ లేదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో చంద్రబాబు వ్యహరించిన తీరు దీనికి నిదర్శనం. నష్ట పరిహారం ఊసే లేదు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమో నిర్వీర్యం చేయడమే చంద్రబాబు సర్కారు పెట్టుకున్న పని. ఉచిత పంటల బీమా లేదు.. తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కనీసం ఊసైనా చెప్పడం లేదు. ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏంచేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడంలేదు. మంచి విషయాల కోసం చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయరన్నది ప్రస్తుతం మనకు కళ్లకు కనిపిస్తున్న వైనం.కర్షక బంధువు వైఎస్ జగన్..అప్పుడు.. ఇప్పుడు రైతులకు బాసటగా నిలవాలన్నది వైఎస్ జగన్ సంకల్పం. (How YS Jagan Helped Farmers) ప్రభుత్వంలో ఉండగా రైతులకు ఎంత మేలు చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పోరాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూనే ఉన్నారు. రైతుకు కష్టమొస్తే అక్కడకు వెళ్లి వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్. పులివెందుల వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో అరటి పంటలను నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దాన్ని అధిగమించి రైతులకు అండగా నిలుస్తూ కర్షక బంధువు అనిపించుకుంటున్నారు వైఎస్ జగన్. -
ఇస్తానన్న రూ.20 వేలు చంద్రబాబు ఇవ్వలేదు
అదునులో విత్తనాలు ఇవ్వలేదు.. సీజన్‌కు ముందు పెట్టుబడి సాయం అందించలేదు... అయినా అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే ఎరువులు కరువు.. అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించినా... పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు అన్నదాతల వెన్నువిరిచాయి. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మాయమాటలతో మోసం చేసింది. ఫలితంగా 18నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదు. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆపద వేళ అండగా నిలవని చంద్రబాబు... ఇప్పుడు ‘రైతు కోసం’ అంటూ సరికొత్త దొంగ జపానికి తెరతీశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మోసానికి... రైతుల కష్టాలకు ప్రతీక ఈ కింది దృశ్యాలు.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పల్ప్ ఫ్యాక్టరీలు, దళారీలు కలిసి ధరలు భారీగా తగ్గించేయడంతో తిరుచానూరు మండీలో రైతులు పారబోసిన మామిడి కాయలు (ఫైల్) 30 ఏళ్లలో ఏనాడూ ఇంత నష్టం చూడలేదునేను 30 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నా. ఏటా నాకు ఉన్న మూడు ఎకరాల మామిడి తోటకు రూ.70వేల వరకు పెట్టుబడి పెడతాను. ఎకరానికి 5 టన్నుల వరకు మామిడి దిగుబడి వచ్చేది. మూడు ఎకరాలకు 15 టన్నులు విక్రయిస్తే సుమారు రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చేది. గతేడాది టన్ను రూ.4వేలు కూడా పలకలేదు. మామిడి దిగుబడి పల్ప్ ఫ్యాక్టరీలకు తోలేందుకు కూడా గిట్టుబాటు కాలేదు. చేసేదేమి లేక మూడు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను పూర్తిగా కొట్టేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా క్వింటా రూ.200లకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోనే రైతులు పడేసిన ఉల్లిపాయలు (ఫైల్) చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదుఈ ఏడాది ఖరీఫ్‌లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. సాగు ఖర్చులు రూ.1.50 లక్షలు అయ్యాయి. ఉల్లి పెరికి గడ్డలు కోయడానికి ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరాకు 40 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు క్వింటా ఉల్లి రూ.200 నుంచి రూ.300కు కొంటామని చెప్పారు. క్వింటాలు రూ.300 ప్రకారం అమ్మినా వచ్చేది రూ.12,000 మాత్రమే. ఉల్లిగడ్డలు కోయడానికి, గోతాలకు రూ.40 వేలు ఖర్చవుతుంది. ఉల్లి కోసి అమ్మడం వల్ల మరో రూ.28వేలు ఖర్చవుతుంది. అందువల్లే ఉల్లి పంటను టిల్లర్‌తో భూమిలోనే కలిపేశాను. ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పినా పైసా ఇవ్వలేదు. – పులికొండ, రైతు, చిన్నహుల్తి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా అరటి ధరలు భారీగా పతనమవడంతో మార్కెట్‌కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు దండగని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామంలో మేకలు, గొర్రెలకు మేతగా వదిలేసిన అరటి గెలలు (ఫైల్) ప్రభుత్వం పట్టించుకోవడం లేదునేను ఏడు ఎకరాల్లో అరటి సాగు చేశాను. పెట్టుబడి కింద రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాను. 140 టన్నులకు వరకు దిగుబడి వచ్చింది. అందులో 20 టన్నులు మాత్రమే కొన్నారు. మిగతాది కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దిక్కుతోచక పంటను వదిలేయాల్సి వస్తోంది. కూలీ ఖర్చులు కూడా దండగే. – నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం, అనంతపురం జిల్లా పత్తికి ధర లేకపోవడంతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో పత్తిపంటను దున్నేస్తున్న రైతు మాబు(ఫైల్) భగవంతుడే కాపాడాలినా పేరు జూపూడి బాబు. వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశా. మోంథా తుపాను వల్ల పత్తి పూర్తిగా దెబ్బతింది. కేవలం మూడు క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచ్చింది. కూలీల ఖర్చులు కూడా రాలేదు. భూ యజమానికి కౌలు కొంత మాత్రమే చెల్లించా. పూర్తిగా చెల్లిద్దామంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం పత్తి పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తామంది. ఇంత వరకు ఒక్క రూపాయి రాలేదు. అధికారులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తోచటం లేదు. ఆ భగవంతుడే కాపాడాలి. – జూపూడి బాబు, కౌలు రైతు నందలూరు గ్రామం వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా పొగాకు ధరలు దిగజారిపోవడంతో ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ జూన్ 26వ తేదీన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై పొగాకును తగలబెట్టి, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్) 70 క్వింటాలకు ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారునేను గత సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేశా. 70 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో నా దగ్గర అమ్మకానికి 70 క్వింటాళ్లు ఉన్నట్లు రాయించా. నా పేరుతో 20 క్వింటాలు కొనుగోలు చేస్తామని మెసేజ్ వచ్చింది. ఎంతో ఆశతో 20 క్వింటాలు తీసుకొని కొనుగోలు కేంద్రానికి వెళితే ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారు. ఆకు బాగా లేదంటూ తిప్పి పంపారు. ఆకు మంచిది అయినా కొనలేదు. అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల దగ్గర నాసిరకం ఆకు కూడా కొన్నారు. – కాసు సుబ్బారెడ్డి, పొగాకు రైతు, పావులూరు గ్రామం, ఇంకొల్లు మండలం, పర్చూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లామార్కెట్లో 25 కిలోల బాక్సు రూ.100కు కూడా కొనుగోలు చేయడం లేదని పొలాల్లోనే పశువులకు వదిలేసిన టమాటా పంట (ఫైల్) అప్పులే మిగిలాయిరెండు ఎకరాల్లో టమాట సాగు చేశా. పెట్టుబడికి రూ.70 వేలకు పైగా ఖర్చు అయ్యింది. దిగుబడి బాగా రావడంతోపాటు కాయలు కూడా నాణ్యతతో ఉన్నాయి. మంచి ధర వస్తే అప్పులు తీరిపోతాయని, కాస్త డబ్బులు చేతికి వస్తాయని ఎంతో ఆశించా. సెపె్టంబర్ 15వ తేదీ ప్యాపిలి టమాటా మార్కెట్‌కు సరుకును తీసుళ్లగా, 25 కిలోల బాక్సు కేవలం రూ.100కి తీసుకున్నారు. రూ.70 వేలు ఖర్చు చేస్తే కేవలం రూ.10 వేలు చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టమాటా రైతులను ఏమాత్రం ఆదుకోలేదు. – రామాంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లాప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మార్కెట్లో ధర లేకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో రోడ్డు పక్కనే ఆరబెట్టిన మొక్కజొన్న పంట (ఫైల్) నాడు ఎరువులు అందక... నేడు పంటను కొనక..ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టాను. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేదు. అయినా అష్టకష్టాలు పడి పంటలు సాగు చేశా. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మోంథా తుపాను తడిసి ముద్దచేసింది. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్నకు రెండు రోజుల్లోనే మొలకలు వచ్చాయి. మార్కెట్లో కొనేవారు లేక, ప్రభుత్వం సాయం అందక అల్లాడుతున్నాం. – దూదేకుల మస్తాన్, గడివేముల, నంద్యాల జిల్లాతోటలే కొట్టేస్తున్నారు ప్రస్తుతం చీనీ(బత్తాయి) కాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో చీనీ తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం చీనీకి పెట్టుబడి పెరిగిపోయింది. కానీ మార్కెట్లో మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఒక్కసారిగా ధర తగ్గిపోతుండడం, పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఇప్పటికే చాలామంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల తోటలను కొట్టేస్తున్నారు. – సుదర్శన్‌రెడ్డి, కోమటికుంట్ల గ్రామం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లాపెట్టుబడి ఖర్చులూ రాలేదుఈ ఖరీఫ్ సీజన్లో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ 1010 రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేలు చొప్పున సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట దెబ్బతిని 27 పుట్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయినా 1010 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెప్పడంతో దళారులకు పుట్టి రూ.14,500 లెక్కన అమ్ముకోవాల్సి వచ్చింది. కౌలుకు కొంత ధాన్యం ఇవ్వగా 17 పుట్లు అమ్మాను. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. – గురించర్ల వెంకటరమణారెడ్డి, మనుబోలు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సాక్షి నెట్వర్క్ -
Chandrababu: ‘‘రైతన్న కోసం’’.. మరో మాయ వేషం!
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రతి వర్గాన్ని దారుణంగా వంచించారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సూపర్ సిక్స్ లేవు.. సెవెన్లూ లేవు.. జగన్ ఇచి్చన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని పేర్కొంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో హామీలిచ్చి రెండేళ్లలో రూ.36 వేలు ఎగ్గొట్టారు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితంగా ఇస్తామని చెప్పి గతేడాది ఇచ్చింది ఒక్కటి మాత్రమే. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమని ఊరించి వారిని జిల్లా దాటనివ్వడం లేదు. అమ్మ ఒడి పేరు మార్చేసి తల్లికి వందనం అంటూ 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఆ ఇచ్చిన వారికి కూడా కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.9 వేలే ఇచ్చారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. అవ్వాతాతల పింఛన్లు ఎగరగొడుతూ దాదాపు ఐదు లక్షల పెన్షన్లు కుదించారు. కొత్తవి ఒక్కటీ ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను నిరీ్వర్యం చేసి ఎడాపెడా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. పప్పు బెల్లాల మాదిరిగా తమ సన్నిహితులకు కేటాయిస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘చంద్రబాబూ..! ఈ 18 నెలల్లో రైతులకు ఒక్కటైనా మేలు చేశారా? అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో పెట్టుబడి సాయం కింద రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే రూ.పది వేలు మాత్రమే విదిల్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు! ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. అదే ఉండి ఉంటే.. రైతులకు న్యాయం జరిగేది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు పరిహారం అందేది. విపత్తుల సమయంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారు. ఇవాళ ఏ పంటకి చూసినా గిట్టుబాటు ధర లేదు.. విపత్తు వస్తే ఆదుకునే దిక్కు లేదు.. మరి ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ చంద్రబాబూ? రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోవడం ఖాయం...!’ అంటూ అన్నదాతలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు నమ్మి నిలువునా మోసపోయామంటూ ఆక్రోశిస్తున్నారు. 18 నెలలుగా ఏ ఒక్క రైతుకూ ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు నేటి నుంచి ‘రైతన్నా మీకోసం..’(How Chandrababu Cheated AP Farmers)‘పంచ సూత్రాలు..’ అంటూ తమను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎరువులకూ కరువే.. బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మళ్లీ క్యూలలో నిలబడాల్సిన దుస్థితి కలి్పంచారని మండిపడుతున్నారు. సాగు వేళ అదునుకు విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడ్డాం. ఆర్బీకేల ద్వారా నాన్‌సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల్లో కూడా అడ్డగోలుగా కోత పెట్టారు. విత్తనాల నాణ్యతకు భరోసా లేదు. ప్రకృతి వైపరీత్యాల కంటే చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే దారుణంగా నష్టపోయామంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Farmers Struggles In Andhra Pradesh)అన్నదాతా సుఖీభవ పథకం కింద సామాజిక వర్గాలకతీతంగా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఏడాదిన్నరగా ఒక్క కౌలుదారుడికీ రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఏడాదిలో దాదాపు 16 సార్లు వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే చివరికి కరువు సాయం కూడా నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. నయ వంచనకు పాల్పడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీసేందుకు అన్నదాతలు, రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే.. రూ.30 వేలు ఎగ్గొట్టారు అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే ఇచ్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొడుతోంది! తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగానే దీనికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టారు. అర్హులైన 53,58,366 మంది రైతులకు రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించాలి. కానీ 46,85,838 మంది రైతులకు రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్లు మాత్రమే. అంటే ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా ఏకంగా రూ.16,746 కోట్లు. మరి ఆ బాకీ సంగతి ఏమిటి? మిగతా రూ.30 వేలు ఇవ్వాల్సిందే అని రైతులు నిలదీస్తున్నారు.ఒక్కరికైనా పంటల బీమా పరిహారం ఇచ్చారా? అన్నదాతలపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మంగళం పాడేసింది. జూన్ 2024లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని రబీ నుంచి పూర్తిగా ఎత్తివేశారు. ఖరీఫ్–2024 సీజన్లో కొనసాగించిన ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన రూ.838.57 కోట్ల ప్రీమియం మొత్తం చెల్లించకపోవడంతో నేటికీ ఖరీఫ్–24 సీజన్లో దెబ్బతిన్న రైతులకు పంటల బీమా పరిహారం అందకుండా చేసింది వాస్తవం కాదా? రబీ 2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో శ్రీకారం చుట్టిన ఫసల్ బీమాలో ప్రీమియం భారం భరించలేక కేవలం 6.75 లక్షల మంది రైతులు 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకే బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 12.36 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందగా 19.60 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గడిచిన ఖరీఫ్‌తో పోలిస్తే 51.57 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 73.47 లక్షల మంది రైతులు బీమా రక్షణ దక్కలేదన్నది వాస్తవం కాదా?ఏ ఒక్క పంటకైనా ‘మద్దతు’ దక్కిందా?రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ధాన్యం, మిరప, పొగాకు, కోకో, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, టమాటా, ఉల్లి, అరటి, బత్తాయి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. చివరికి పూలు, కూరగాయలకు కూడా ధర లేని దుస్థితి. మద్దతు ధర దక్కక పొగాకు, మిరప, పొగాకు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అన్నదాతలు నిప్పు పెట్టగా.. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటలను దున్నేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయేమో చంద్రబాబు చెప్పాలి. ధాన్యం రైతులకు సైతం మద్దతు ధర దక్కలేదు. గడిచిన ఖరీ‹ఫ్ సీజన్లో కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకూ రూ.1,150–1,450కి మించి దక్కలేదు. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసిన ఘటనలు ఎప్పుడైనా చూశామా? ఉల్లి, టమాటా, చివరికి అరటికి కూడా కిలో రూపాయికి మించి దక్కని పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం కాదా? అని అన్నదాతలు నిలదీస్తున్నారు.(Agriculture Crisis In AP)ఏడాదిలో 300 మంది బలవన్మరణాలు..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం మొదలుకొని మామిడి, కోకో, పొగాకు, మిరప, ఉల్లి, టమాటా, పత్తి, అరటి, మొక్కజొన్న, కంది, శనగ.. ఇలా ఏడాదిన్నరగా ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర దక్కలేదు. వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బ తినడంతో రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయారు. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన ఏడాదిలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.పరిహారం పైసా అయినా ఇచ్చారా? 2024–25 సీజన్‌కు సంబంధించి ఖరీఫ్, రబీలో 1.51 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా సాగైంది 1.24 కోట్ల ఎకరాల్లో మాత్రమే. 2025–26 ఖరీఫ్‌లో సాగైంది కేవలం 69 లక్షల ఎకరాలే. మరోవైపు వరుస వైపరీత్యాల బారిన పడి ఈ మూడు సీజన్లలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 12 లక్షల ఎకరాల్లో పంటలు కరువు బారిన పడి బీడు వారాయి. ఖరీఫ్–24లో 100 మండలాలు, రబీ 2024–25లో 80 మండలాలు, ఖరీఫ్–2025 సీజన్లో 65 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుగా ఖరీఫ్–24లో 54, రబీ 2024–25లో 51, ఖరీఫ్–2025లో 37 చొప్పున మాత్రమే కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది. ఒక్క రూపాయి కూడా కరువు సాయం అందించిన పాపాన పోలేదు. వరుస వైపరీత్యాలు, కరువు సాయంతో కలిపి దాదాపు 10 లక్షల మంది రైతులకు రూ.1,350 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (మోంథా తుపానుతో కలిపి ఇన్పుట్ సబ్సిడీ) చెల్లించాల్సి ఉండగా, కృష్ణా వరదలకు సంబంధించి కేవలం 1.85 లక్షలమందికి రూ.285 కోట్లు మాత్రమే జమ చేసింది. దాదాపు రూ.1,100 కోట్లకుపైగా పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టింది.బాధిత కుటుంబాలకు పైసా సాయం చేశారా? అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండటంతో సాగు నష్టాలు భరించలేక, భరోసా కరువై రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తుపానులు, వరదలు, వర్షాభావం.. ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో పంటను అమ్ముకునే పరిస్థితి లేక, మద్దతు ధర దక్కక దిక్కు తోచని స్థితిలో ఉన్న అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే వారు లేక, చేసిన అప్పులు తీర్చే దారిలేక ఇప్పటికే 300 మందికిపైగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం పైసా సాయం చేసిన పాపాన పోలేదని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఆక్వా, పాడి రైతులను నిండా ముంచేశారు తాము అధికారంలోకి రాగానే నాన్ ఆక్వా జోన్‌తో పాటు 10 ఎకరాలకు పైబడి సాగు చేస్తున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా హామీని నెరవేర్చలేదు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని ఒక్కరికీ ఇవ్వలేదు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు అంటూ ఊరించి ఒక్కటీ నిరి్మంచలేదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాన్ని అటకెక్కించారు. మరోవైపు అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి ప్రైవేటు డెయిరీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచారు. పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదు.ఏం ముఖం పెట్టుకొని వస్తారు..?కర్నూలు జిల్లా అస్పరి మండలం వలగొండ గ్రామానికి చెందిన కె.నాగేంద్రయ్య ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.60 వేలు చొప్పున రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలకు దెబ్బతినడంతో మూడుసార్లకు బదులు ఒకే తీతతో సరిపెట్టాల్సి వచి్చంది. తేమ శాతం 8–12 శాతం మధ్య ఉన్నప్పటికీ ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళితే రూ.37,200 వచ్చింది. రూ.2.63 లక్షల వరకు నష్టపోయాడు. ఖరీఫ్‌లో యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడ్డామని, కాంప్లెక్స్ ఎరువు బస్తా కూడా రూ.2 వేలకు బ్లాకులో కొన్నట్లు ఆయన వాపోతున్నాడు. మరి ఏం ముఖం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారు? అని నాగేంద్రయ్య మండిపడుతున్నారు.రైతు ఆత్మహత్య చేసుకుని 8 నెలలైనా సాయం ఊసేలేదు రామాంజనేయులు.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయనకు సొంత భూమి 1.80 ఎకరాలు ఉండగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. రెండేళ్లుగా సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.12లక్షలు అప్పు తెచ్చారు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఏడాది ఏప్రిల్ 11న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజనేయులుకు భార్య వీరేశమ్మ, కూతురు మమతాంజలి (16), కుమారుడు ప్రవీణ్‌కుమార్(14) ఉన్నారు. తండ్రి చనిపోవడంతో పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. సాయం చేయాలని వీరేశమ్మ కలెక్టర్‌ను కలిసినా ప్రయోజనం లేదు. రామాంజనేయులు మృతిచెంది 8 నెలలైనా ఇప్పటికీ త్రీ మెన్ కమిటీ విచారణ పెండింగ్‌లోనే ఉంది. ఈ కుటుంబానికి అన్నదాతా సుఖీభవ సాయం కూడా దక్కలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి, ప్రభుత్వ సాయం అందక ఈ కుటుంబం అల్లాడుతోంది.ఒడిశా నుంచి ఎరువులు తెచ్చుకున్నాం..అనుకున్న సమయానికి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో పక్కనున్న ఒడిశా నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాం. నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. కేవలం ఎరువుల కోసమే సుమారు రూ.20వేలు ఖర్చయింది. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంతో అధిక ధరలకు ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేశాను. నేనే కాదు ఇచ్ఛాపురం మండలంలోని వందలాది మంది రైతులు ఒడిశా నుంచే యూరియా కొనుగోలు చేశారు. – తిప్పన కృష్ణారెడ్డి, రైతు, హరిపురం, ఇచ్ఛాపురంఅధికారులు మా వైపు కన్నెత్తి చూడలేదుఎకరం తోటలో బొబ్బాయి పంట వేశాను. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. రూ.70 వేల పెట్టుబడి పెట్టాను. బొప్పాయి మొక్కలు ఏపుగా పెరిగాయి. దిగుబడి బాగా వస్తుందనుకున్న సమయంలో తుపాను, వరదలు వచ్చి దాదాపు 850 మొక్కలు విరిగిపడి చనిపోయాయి. పెట్టుబడులు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. కనీసం ప్రభుత్వ అధికారులెవ్వరూ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. నష్టపరిహారం వివరాలు నమోదు చేయలేదు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పుల పాలైపోయాం. – వాకపల్లి వీరబాబు, బొబ్బాయి రైతు, వలసలతిప్ప శివారు కొత్తలంక, ముమ్మిడివరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారూ.40 వేలు ఇవ్వాలి.. రూ.10 వేలే ఇచ్చారుఅన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున ఆరి్థక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదు. చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు గత రెండు ఖరీఫ్‌లకు కలిపి చంద్రబాబు ప్రభుత్వం నాకు రూ.40 వేలు ఇవ్వాలి. తీరా చూస్తే గత సంవత్సరం కేంద్రం ఇచ్చినది రూ.5 వేలు, ఈ ఏడాది రూ.5 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ ప్రభుత్వం అలా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. – తుంపాల చక్రబాబు, కాండ్రేగుల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లానాడు పంటల బీమా ధీమా.. నేడు ఆ బీమా బరువునేను రెండెకరాలున్న చిన్న రైతును. పంటల బీమా ప్రీమియం భారంగా మారడంతో ఈసారి బీమా చేయించుకోలేకపోయాను. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వమే రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించడంతో ధీమాగా ఉండేవాళ్లం. విపత్తులు సంభవిస్తే దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం బీమా పరిహారం సకాలంలో అందింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని చెప్పారు. ఎలా బీమా చేసుకోవాలో అవగాహన లేకపోవడం, ఆరి్థక భారం కారణంగా ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఇటీవల తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. బీమా లేకపోవడం ఇప్పుడు పెద్ద భారంగా మారింది. – గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లాపిడుగు పడి పాడి గేదె మృతిచెందినా పరిహారం లేదుమా కుటుంబం పాడి గేదెలను పోషించుకుని జీవనం సాగిస్తోంది. సొంత పొలం కూడా లేదు. అక్టోబర్ 22న ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురై మూడు నెలల సూడి గేదె మృత్యువాత పడింది. రూ.85వేలకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఇంటి దగ్గర చెట్టుకు కట్టేసిన సూడి గేదె పిడుగుపడి చనిపోయింది. గ్రామ రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు రిపోర్టు రాసుకొని వెళ్లారు. కానీ ఇప్పటివరకు పరిహారం అందలేదు. కనీసం ఏమైందన్న సమాచారం రాలేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – లేళ్ల సత్యనారాయణ, పాడి రైతు, ఉయ్యందన గ్రామం, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లాఆధార్ లింకు కాలేదని విద్యుత్ సబ్సిడీ ఎత్తేశారునేను 15 ఏళ్లుగా చేపలు, రొయ్యల చెరువులు చేస్తున్నా. మొదట్లో డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆయిల్ ఇంజిన్లతో ఏరియేటర్ల ద్వారా రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేవాళ్లం. డీజిల్ ధరలు పెరగడంతో పదేళ్లుగా విద్యుత్ వినియోగిస్తున్నాం. 2018 నుంచి వనామీ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్ గట్ తదితర వైరస్లు సోకటంతో తీవ్ర నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాం. కరెంటు కూడా యూనిట్‌కు రూ.3చొప్పున నెలకు సుమారు రూ.40వేలు బిల్లు వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో మా ఆక్వా రైతుల కష్టాలను చూసి యూనిట్ విద్యుత్‌ను సబ్సిడీపై రూ.1.50లకే ఇచ్చారు. దీంతో నాలాంటి ఆక్వా రైతులకు చాలా మేలు కలిగింది. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక నా ఆధార్‌తో విద్యుత్ కనెక్షన్ లింకు కాలేదని సబ్సిడీ ఎత్తేశారు. ఒకవైపు యూనిట్‌కు రూ.3లు చొప్పున విద్యుత్ భారం, మరోవైపు చేపలు, రొయ్యల ధరలు, లీజులు పెరిగిపోయి మళ్లీ అప్పులే మిగులుతున్నాయి. –పెచ్చెట్టి నాగ పెంటయ్య, ఆక్వా రైతు, ఎల్వీఎఎన్ పురం, పశి్చమగోదావరి జిల్లాఆస్పత్రిలో డాక్టర్ లేరు.. మందుల్లేవు.. గొర్రెలకు నేనే నాటు వైద్యం చేస్తున్నామాది ప్రకాశం జిల్లా మర్రిపూడి. గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నా. ఇటీవల జీవాలకు జబ్బు చేయడంతో మర్రిపూడిలోనే ఉన్న పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ డాక్టర్ లేరు. సిబ్బంది మాత్రం జీవాలను చూసి మందులు లేవని చెప్పారు. అందువల్ల నేనే జీవాలకు నాటు వైద్యం చేస్తున్నా. కాళ్లకు పుండ్లు పడి నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలను ఇంటి వద్దే వదిలేసి నేను పొలం పనులకు వెళ్తున్నా. జీవాలకు జబ్బు చేయడంతో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. నాకు 80 గొర్రెలు ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. రేపు ఏమవుతుందో అని భయంతో బతుకున్నా. ఎన్నిసార్లు పశువుల ఆస్పత్రికి వెళ్లినా మందుల్లేవంటున్నారు. – దుద్దుకుంట వెంకటేశ్వరరెడ్డి, గొర్రెలకాపరి, మర్రిపూడి, ప్రకాశం జిల్లాఅమూల్ లేక నెలకు రూ.6వేలు నష్టంనాకున్న ఐదు ఆవులు పూటకు 20 లీటర్ల పాలిస్తాయి. ఉదయం, సాయంత్రం కలిపి 40 లీటర్ల పాలు అమ్ముతాను. ఎంతోకాలం హెరిటేజ్, శ్రీజ వంటిæ డెయిరీలకు అమ్మినా ఒక లీటరు పాలకు రూ.35 పైన ఎప్పుడూ ఇవ్వలేదు. అంత తక్కువ ఇస్తే ఎలాగని అడిగితే పాలలో వెన్న శాతం తక్కువగా ఉందన్నారు. అదే పాలను అమూల్ డెయిరీ డెయిరీ వాళ్లకు ఇచ్చినప్పుడు లీటరుకు రూ.38 నుంచి రూ.40 ఇచ్చారు. అమూల్ వల్ల ఒక లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు అదనంగా రావడంతో 40 లీటర్లకు రోజుకు రూ.200 వరకు అదనపు లాభం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అమూల్‌ను లేకుండా చేయడంతో రోజుకు రూ.200 లెక్కన నెలకు రూ.6 వేలు వరకు నష్టపోతున్నా. అయినా ఏమీ చేయలేక శ్రీజ డెయిరీ వాళ్లకు పాలు అమ్ముకుంటున్నా. – రాజమ్మ, మహిళా పాడిరైతు, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లాఅన్నదాతా సుఖీభవ.. రెండో ఏడాదీ మొండి చెయ్యిమా ఊళ్లో 1.40 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు గత ఏడాది అన్నదాతా సుభీభవ పథకం డబ్బులు పడలేదు. వ్యవసాయ శాఖ, సచివాలయ అధికారులను అడిగితే, నా భూమికి సంబంధించిన పత్రాలు అడిగారు. అవి అందజేసినా గత ఏడాది రావాల్సిన రూ.7 వేలు రాలేదు. ఇటీవల విడుదల చేసిన అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం సొమ్ము కూడా నాకు రాలేదు. వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాధానం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు ఏదైనా సమస్య వస్తే మా ఊరిలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం చూపేవారు. ప్రస్తుతం జిల్లా అధికారులను అడిగినా ప్రయోజనం కనిపించడం లేదు. – ఇనకొండ సత్యనారాయణ, రైతు, సిరివాడ, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లాఅప్పుల బాధ భరించలేక మా ఆయన ఉరి పోసుకున్నాడుమాకున్న 4 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన సాగు చేశాడు. సాగు ఖర్చుల కోసం రూ.10 లక్షల వరుకు అప్పులు తెచ్చారు. సాగు చేసిన మిర్చి తెగుళ్ల వల్ల దెబ్బతింది. కాస్త పంట చేతికొచి్చనా గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులవారు, అప్పులు ఇచి్చనవారు వెంటనే అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మా ఆయన ఈ ఏడాది జూలై 2వ తేదీన మా ఇంటి పక్కన షెడ్డులో ఉరిపోసుకుని చనిపోయాడు. కొనకొండ్ల గ్రామం కెనరా బ్యాంకులో రూ.4 లక్షల అప్పుతోపాటు గుంతకల్లు మణప్పరంలో గోల్డ్ లోన్‌లో బంగారు తాకెట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చారు. బయట వ్యక్తుల వద్ద రూ.4 లక్షల వరుకు అప్పులు ఉన్నాయి. నాకు ఇద్దరు కుమారులు. బాగా బతికిన మా కుటుంబం పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. – ఉప్పర శంకరమ్మ, రైతు ధనంజయ భార్య, కొనకొండ్ల గ్రామం, వజ్రకరూర్ మండలం, అనంతపురం జిల్లాజింక్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదునాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఖరీఫ్‌లో వరి పంట వేశాను. ఎరువుల కోసం పడరాని పాట్లు పడ్డాం. జింక్ సల్ఫేట్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదు. జింక్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచి్చంది. – రొంగలి సత్యం, రైతు, ఉయ్యడవలస, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా -
రైతును గాలికొదిలి.. చంద్రబాబు దొంగజపం!
-
చంద్రబాబుకు రైతులంటే చిన్నచూపు : కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. ఇటీవల వచ్చిన మోంథా తుపాను వల్ల భారీ నష్టం జరిగినా ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు.40 బస్తాల పంట 25 బస్తాలకు పడిపోయింది. రైతులు రోడ్డున పడ్డా పట్టించుకునే వారు లేరు. చంద్రబాబుకు రైతులపై చిన్నచూపు ఉందని అనిల్ కుమార్ అన్నారు.ఇదిలా ఉంటే కౌలు రైతుల పరిస్థితి మరింత కష్టాల్లో ఉందని కోత వ్యయం రూ.15 వేల మేర పెరిగిందని చెప్పారు. ఆర్బీకేలు నిర్వీర్యం కావడంతో దళారీ వ్యవస్థ పెరిగిందని విమర్శించారు.పంట నష్టం అంచనాల్లోనూ రైతులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం ఉచిత పంట బీమా అమలు చేయాలి. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. తేమ పేరుతో మిల్లులు చేసే మోసాలను అడ్డుకోవాలని కైలే అనిల్ డిమాండ్ చేశారు. -
‘స్పెషల్ ఫ్లైట్‌లో తిరిగే చంద్రబాబుకి రైతుల కన్నీళ్లు పట్టవు’
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలు తప్పవు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడంలేదు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, ధాన్యం, కొబ్బరి... ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు ప్రతిరోజూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రైతుల కన్నీరు కనిపించడం లేదా?. అలాంటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయనేం చేస్తున్నట్లు అని శైలజానాథ్ అన్నారు. -
Gadikota Srikanth: రైతులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు గాలి కబుర్లు..
-
బాబు సీఎం.. రైతులకు ఇబ్బందులు, కష్టాలు: గడికోట
సాక్షి, అన్నమయ్య జిల్లా: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. రైతుల గురించి చంద్రబాబు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి.. కానీ, కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రైతులు రాష్ట్రంలో చాలా మేర పంటలు సాగు చేయనే లేదు. అన్నమయ్య జిల్లాలో కనీసం పది శాతం కూడా పంటల సాగు జరగలేదు. మామిడి రైతులకు చంద్రబాబు డబ్బు ఇచ్చాను అంటాడు.. కానీ ఎవరికిచ్చాడో చెప్పడు. సాగు చేసిన ఏ పంటకూ కనీస గిట్టుబాటు ధర ఎక్కడా లేదు. అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. 20వేలు ఒకే సారి ఇస్తానన్నాడు.. అదీ విడుతల వారీగా ఇస్తున్నాడు. రైతులు బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం రైతు బాగుకోసం చూడటం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సందర్భాల్లో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతవరకూ ఒక్క ఎకరాకు కూడా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోయాడు. గతంలో వైఎస్ జగన్ బీమా ప్రీమియం కూడా చెల్లించారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో ఇన్ పుట్ సబ్సిడీ, పరిహారం అందించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది.నేడు రాయచోటిలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే కబ్జా చేసేస్తున్నారు. పోలీసులు పూర్తి బాధ్యతా లోపంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల భూములను లాగేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంకా ఎంతకు దిగజారుస్తారు?. ప్రభుత్వ, ప్రైవేటు అని లేకుండా కనిపించిన ప్రతి ఒక్క భూమినీ కబ్జా చేసేస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదంటారు. మదనపల్లి మెడికల్ కాలేజీపై కూడా అదే రీతిలో కుట్రలు చేస్తున్నారు. కల్తీ మద్యం కేసు ఏమైందో ఇంతవరకూ స్పష్టత లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
అప్పుల బాధతో ఇద్దరు రైతుల బలవన్మరణం
శెట్టూరు/కొత్తపల్లి: ఎంతో కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం.. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయానికి భరోసా కరువవ్వడం.. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మానసిక వేదనకు గురైన ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ఎదురుపాడుకు చెందిన బందెపు వెంకటేశ్వర్లు(36) సొంత పొలం 3.50 ఎకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. కానీ అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది.ప్రభుత్వం నుంచి సాయం కూడా లేకపోవడం.. పెట్టిన పెట్టుబడి కూడా రాదని అర్థమవ్వడంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఈ నెల 18న పొలం వద్ద పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రామ్‌నాయక్ చెప్పారు.బోర్లు, సాగు కోసం అప్పులపాలు..అనంతపురం జిల్లా కరిడిపల్లికి చెందిన రైతు కమ్మ చౌదరి(40)కి భార్య అనిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చౌదరి తనకున్న మూడెకరాల పొలంలో బోర్లు వేయడానికి, పంటల సాగు కోసం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలోనని నిత్యం ఆవేదన చెందేవాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని గమనించి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందాడు. -
ఈ 18 నెలల కాలంలో.. రైతుల కోసం నిలిచిందెక్కడ?
సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో పంటల ధరలు అత్యంత దారుణంగా పతనమైనా సీఎం చంద్రబాబు రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరా లేక.. రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తెచ్చారు..’’ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘‘మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి, ఇప్పుడు వారు కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనివ్వకుండా, దీని మీద చర్చ జరగకుండా ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే ‘‘రైతన్నా.. మీకోసం’’ కార్యక్రమం’’ అని స్పష్టం చేశారు. ‘అసలు ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడి చేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది?..’’ అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ ఆదివారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..⇒ మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పు కొట్టే మీ ఎల్లోవీుడియా, మీ తొట్టి గ్యాంగ్‌కి.. ఇలా వీరందరికీ కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా? ⇒ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10 వేల మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకుంటున్నారు. కానీ అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు?⇒ ధరలు పతనమై దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసి రైతులకు భరోసా కల్పించే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? ⇒ ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా.. మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.⇒ ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు.⇒ రైతులు, వారి తరఫున మేం పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు. రైతులను పరామర్శించేందుకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకుంటామంటూ మీరు హడావుడి ప్రకటనలు చేస్తారు. తీరా ఆచరణలో ఏమీ చేయరు. ఏమీ ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే. ⇒ మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను.. మీ దుర్మార్గ పాలనతో పూర్తిగా తొలగించడమో, నిర్వీర్యమో చేశారు. ⇒ ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏం చేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు. ⇒ రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ⇒ ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి రూ.20 వేలు అన్నదాతా సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ రెండేళ్లకు రూ.40 వేలకు గానూ ఇచ్చింది కేవలం రూ.10 వేలే. ⇒ ఆర్బీకేలు, ఈ–క్రాప్, సీఎం యాప్, పొలం వద్దే పంట కొనుగోలు.. ఇలా అన్నీ నిర్వీర్యం. చివరకు ఎరువులు కూడా రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారు. రైతుల బతుకులు దళారీల పాలు చేశారు. ⇒ ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ల కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు చంద్రబాబు గారూ! -
రైతును గాలికొదిలి... చంద్రబాబు దొంగజపం!
అదునులో విత్తనాలు ఇవ్వలేదు.. సీజన్‌కు ముందు పెట్టుబడి సాయం అందించలేదు... అయినా అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే ఎరువులు కరువు.. అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించినా... పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు అన్నదాతల వెన్నువిరిచాయి. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మాయమాటలతో మోసం చేసింది. ఫలితంగా 18నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదు. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆపద వేళ అండగా నిలవని చంద్రబాబు... ఇప్పుడు ‘రైతు కోసం’ అంటూ సరికొత్త దొంగ జపానికి తెరతీశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మోసానికి... రైతుల కష్టాలకు ప్రతీక ఈ దృశ్యాలు.. – సాక్షి నెట్వర్క్ మామిడి... మటాష్ఎక్కడ: తిరుచానూరు మండీ, తిరుపతి జిల్లా 30 ఏళ్లలో ఏనాడూ ఇంత నష్టం చూడలేదునేను 30 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నా. ఏటా నాకు ఉన్న మూడు ఎకరాల మామిడితోటకు రూ.70వేల వరకు పెట్టుబడి పెడతాను. ఎకరానికి 5 టన్నుల వరకు మామిడి దిగుబడి వచ్చేది. మూడు ఎకరాలకు 15 టన్నులు విక్రయిస్తే సుమారు రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చేది. గతేడాది టన్ను రూ.4వేలు కూడా పలకలేదు. మామిడి దిగుబడి పల్ప్ ఫ్యాక్టరీలకు తోలేందుకు కూడా గిట్టుబాటు కాలేదు. చేసేదేమి లేక మూడు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను పూర్తిగా కొట్టేయాల్సి వచి్చంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా అరటి రైతు కష్టాలు అనంతంఎక్కడ: చందన గ్రామం, యాడికి మండలం, అనంతపురం జిల్లా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు నేను ఏడు ఎకరాల్లో అరటి సాగు చేశాను. పెట్టుబడి కింద రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాను. 140 టన్నులకు వరకు దిగుబడి వచ్చింది. అందులో 20 టన్నులు మాత్రమే కొన్నారు. మిగతాది కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దిక్కుతోచక పంటను వదిలేయాల్సి వస్తోంది. కూలీ ఖర్చులు కూడా దండగే. – నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం, అనంతపురం జిల్లా పత్తి రైతు నెత్తిన సర్కారు నిర్లక్ష్యపు కత్తి ఎక్కడ: పెదకూరపాడు, పల్నాడు జిల్లా భగవంతుడే కాపాడాలి నా పేరు జూపూడి బాబు. వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశా. మోంథా తుపాను వల్ల పత్తి పూర్తిగా దెబ్బతింది. కేవలం మూడు క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచి్చంది. కూలీల ఖర్చులు కూడా రాలేదు. భూ యజమానికి కౌలు కొంత మాత్రమే చెల్లించా. పూర్తిగా చెల్లిద్దామంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం పత్తి పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తామంది. ఇంత వరకు ఒక్క రూపాయి రాలేదు. అధికారులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తోచటం లేదు. ఆ భగవంతుడే కాపాడాలి. –జూపూడి బాబు, కౌలు రైతు నందలూరు గ్రామం వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా టమాటా.. ధర ఢమాల్ఎక్కడ: ప్యాపిలి, నంద్యాల జిల్లా అప్పులే మిగిలాయి రెండు ఎకరాల్లో టమాట సాగు చేశా. పెట్టుబడికి రూ.70 వేలకు పైగా ఖర్చు అయ్యింది. దిగుబడి బాగా రావడంతోపాటు కాయలు కూడా నాణ్యతతో ఉన్నాయి. మంచి ధర వస్తే అప్పులు తీరిపోతాయని, కాస్త డబ్బులు చేతికి వస్తాయని ఎంతో ఆశించా. సెప్టెంబర్ 15వ తేదీ ప్యాపిలి టమాటా మార్కెట్‌కు సరుకును తీసుళ్లగా, 25 కిలోల బాక్సు కేవలం రూ.100కి తీసుకున్నారు. రూ.70 వేలు ఖర్చు చేస్తే కేవలం రూ.10 వేలు చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టమాటా రైతులను ఏమాత్రం ఆదుకోలేదు. – రామాంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లామొక్కజొన్న రైతులు రోడ్డుపాలు ఎక్కడ: ఆత్మకూరు, నంద్యాల జిల్లా నాడు ఎరువులు అందక... నేడు పంటను కొనక.. ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టాను. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేదు. అయినా అష్టకష్టాలు పడి పంటలు సాగు చేశా. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మోంథా తుపాను తడిసి ముద్దచేసింది. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్నకు రెండు రోజుల్లోనే మొలకలు వచ్చాయి. మార్కెట్లో కొనేవారు లేక, ప్రభుత్వం సాయం అందక అల్లాడుతున్నాం. – దూదేకుల మస్తాన్, గడివేముల, నంద్యాల జిల్లా బత్తాయి రైతుల బాధ పట్టని చంద్రబాబు ఎక్కడ: లింగాల, వైఎస్సార్ కడప జిల్లాతోటలే కొట్టేస్తున్నారు ప్రస్తుతం చీనీ(బత్తాయి) కాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో చీనీ తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం చీనీకి పెట్టుబడి పెరిగిపోయింది. కానీ మార్కెట్లో మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఒక్కసారిగా ధర తగ్గిపోతుండడం, పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఇప్పటికే చాలామంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల తోటలను కొట్టేస్తున్నారు. – సుదర్శన్‌రెడ్డి, కోమటికుంట్ల గ్రామం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లాపొగాకు రైతులకు నిలువునా దగాప్రదేశం: వెల్లంపల్లి, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా 70 క్వింటాలకు ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారునేను గత సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేశా. 70 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో నా దగ్గర అమ్మకానికి 70 క్వింటాళ్లు ఉన్నట్లు రాయించా. నా పేరుతో 20 క్వింటాలు కొనుగోలు చేస్తామని మెసేజ్ వచ్చింది. ఎంతో ఆశతో 20 క్వింటాలు తీసుకొని కొనుగోలు కేంద్రానికి వెళితే ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారు. ఆకు బాగా లేదంటూ తిప్పి పంపారు. ఆకు మంచిది అయినా కొనలేదు. అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల దగ్గర నాసిరకం ఆకు కూడా కొన్నారు. –కాసు సుబ్బారెడ్డి, పొగాకు రైతు, పావులూరు గ్రామం, ఇంకొల్లు మండలం, పర్చూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లామొలకెత్తిన ధాన్యం...ఎక్కడ: ముస్తాపురం, అనంతసాగరం మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టుబడి ఖర్చులూ రాలేదు ఈ ఖరీఫ్ సీజన్లో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ 1010 రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేలు చొప్పున సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట దెబ్బతిని 27 పుట్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయినా 1010 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెప్పడంతో దళారులకు పుట్టి రూ.14,500 లెక్కన అమ్ముకోవాల్సి వచ్చింది. కౌలుకు కొంత ధాన్యం ఇవ్వగా 17 పుట్లు అమ్మాను. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. – గురించర్ల వెంకటరమణారెడ్డి, మనుబోలు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉల్లి రైతు కంట కన్నీరుఎక్కడ: మార్కెట్ యార్డ్, కర్నూలు చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదుఈ ఏడాది ఖరీఫ్‌లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. సాగు ఖర్చులు రూ.1.50 లక్షలు అయ్యాయి. ఉల్లి పెరికి గడ్డలు కోయడానికి ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరాకు 40 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు క్వింటా ఉల్లి రూ.200 నుంచి రూ.300కు కొంటామని చెప్పారు. క్వింటాలు రూ.300 ప్రకారం అమ్మినా వచ్చేది రూ.12,000 మాత్రమే. ఉల్లిగడ్డలు కోయడానికి, గోతాలకు రూ.40 వేలు ఖర్చవుతుంది. ఉల్లి కోసి అమ్మడం వల్ల మరో రూ.28వేలు ఖర్చవుతుంది. అందువల్లే ఉల్లి పంటను టిల్లర్‌తో భూమిలోనే కలిపేశాను. ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పినా పైసా ఇవ్వలేదు. – పులికొండ, రైతు, చిన్నహుల్తి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా -
‘రైతన్న కోసం’.. మరో మాయ వేషం!
హామీల ఎగవేత.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం అమలే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రతి వర్గాన్ని దారుణంగా వంచించారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సూపర్ సిక్స్ లేవు.. సెవెన్లూ లేవు.. జగన్ ఇచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని పేర్కొంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో హామీలిచ్చి రెండేళ్లలో రూ.36 వేలు ఎగ్గొట్టారు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితంగా ఇస్తామని చెప్పి గతేడాది ఇచ్చింది ఒక్కటి మాత్రమే.మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమని ఊరించి వారిని జిల్లా దాటనివ్వడం లేదు. అమ్మ ఒడి పేరు మార్చేసి తల్లికి వందనం అంటూ 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఆ ఇచ్చిన వారికి కూడా కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.9 వేలే ఇచ్చారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. అవ్వాతాతల పింఛన్లు ఎగరగొడుతూ దాదాపు ఐదు లక్షల పెన్షన్లు కుదించారు. కొత్తవి ఒక్కటీ ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను నిరీ్వర్యం చేసి ఎడాపెడా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. పప్పు బెల్లాల మాదిరిగా తమ సన్నిహితులకు కేటాయిస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘చంద్రబాబూ..! ఈ 18 నెలల్లో రైతులకు ఒక్కటైనా మేలు చేశారా? అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో పెట్టుబడి సాయం కింద రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే రూ.పది వేలు మాత్రమే విదిల్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు! ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. అదే ఉండి ఉంటే.. రైతులకు న్యాయం జరిగేది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు పరిహారం అందేది. విపత్తుల సమయంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారు.ఇవాళ ఏ పంటకి చూసినా గిట్టుబాటు ధర లేదు.. విపత్తు వస్తే ఆదుకునే దిక్కు లేదు.. మరి ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ చంద్రబాబూ? రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోవడం ఖాయం...!’ అంటూ అన్నదాతలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు నమ్మి నిలువునా మోసపోయామంటూ ఆక్రోశిస్తున్నారు. 18 నెలలుగా ఏ ఒక్క రైతుకూ ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు నేటి నుంచి ‘రైతన్నా మీకోసం..’ ‘పంచ సూత్రాలు..’ అంటూ తమను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడులో మోంథా తుపాను ధాటికి వర్షపు నీటిలోకి ఒరిగిపోయిన వరి పంట (ఫైల్) కనీసం ఎరువులకూ కరువే.. బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మళ్లీ క్యూలలో నిలబడాల్సిన దుస్థితి కలి్పంచారని మండిపడుతున్నారు. సాగు వేళ అదునుకు విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడ్డాం. ఆర్బీకేల ద్వారా నాన్‌సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల్లో కూడా అడ్డగోలుగా కోత పెట్టారు. విత్తనాల నాణ్యతకు భరోసా లేదు. ప్రకృతి వైపరీత్యాల కంటే చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే దారుణంగా నష్టపోయామంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అన్నదాతా సుఖీభవ పథకం కింద సామాజిక వర్గాలకతీతంగా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఏడాదిన్నరగా ఒక్క కౌలుదారుడికీ రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఏడాదిలో దాదాపు 16 సార్లు వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే చివరికి కరువు సాయం కూడా నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. నయ వంచనకు పాల్పడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీసేందుకు అన్నదాతలు, రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే.. రూ.30 వేలు ఎగ్గొట్టారు అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే ఇచ్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొడుతోంది! తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగానే దీనికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టారు. అర్హులైన 53,58,366 మంది రైతులకు రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించాలి. కానీ 46,85,838 మంది రైతులకు రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్లు మాత్రమే. అంటే ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా ఏకంగా రూ.16,746 కోట్లు. మరి ఆ బాకీ సంగతి ఏమిటి? మిగతా రూ.30 వేలు ఇవ్వాల్సిందే అని రైతులు నిలదీస్తున్నారు.ఒక్కరికైనా పంటల బీమా పరిహారం ఇచ్చారా? అన్నదాతలపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మంగళం పాడేసింది. జూన్ 2024లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని రబీ నుంచి పూర్తిగా ఎత్తివేశారు. ఖరీఫ్–2024 సీజన్లో కొనసాగించిన ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన రూ.838.57 కోట్ల ప్రీమియం మొత్తం చెల్లించకపోవడంతో నేటికీ ఖరీఫ్–24 సీజన్లో దెబ్బతిన్న రైతులకు పంటల బీమా పరిహారం అందకుండా చేసింది వాస్తవం కాదా?రబీ 2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో శ్రీకారం చుట్టిన ఫసల్ బీమాలో ప్రీమియం భారం భరించలేక కేవలం 6.75 లక్షల మంది రైతులు 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకే బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 12.36 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందగా 19.60 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గడిచిన ఖరీఫ్‌తో పోలిస్తే 51.57 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 73.47 లక్షల మంది రైతులు బీమా రక్షణ దక్కలేదన్నది వాస్తవం కాదా?ఏ ఒక్క పంటకైనా ‘మద్దతు’ దక్కిందా?రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ధాన్యం, మిరప, పొగాకు, కోకో, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, టమాటా, ఉల్లి, అరటి, బత్తాయి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. చివరికి పూలు, కూరగాయలకు కూడా ధర లేని దుస్థితి. మద్దతు ధర దక్కక పొగాకు, మిరప, పొగాకు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అన్నదాతలు నిప్పు పెట్టగా.. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటలను దున్నేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయేమో చంద్రబాబు చెప్పాలి.ధాన్యం రైతులకు సైతం మద్దతు ధర దక్కలేదు. గడిచిన ఖరీ‹ఫ్ సీజన్లో కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకూ రూ.1,150–1,450కి మించి దక్కలేదు. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసిన ఘటనలు ఎప్పుడైనా చూశామా? ఉల్లి, టమాటా, చివరికి అరటికి కూడా కిలో రూపాయికి మించి దక్కని పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం కాదా? అని అన్నదాతలు నిలదీస్తున్నారు.గతేడాది పరిహారమే అందలేదు..నేను 2.20 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. గతేడాది అక్టోబర్‌లో వర్షాలు పడి పంట దెబ్బతింది. వ్యవసాయ సిబ్బంది నష్టపరిహారం కోసం పేరు నమోదు చేసుకున్నారు. నేటి వరకు పరిహారం అందలేదు. ఈ ఏడాది తుపాను వల్ల పంట దెబ్బతింది. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. – దాసరి వీరబాబు, రైతు తూర్పు తెలుగుపాలెం, పెడన, కృష్ణా జిల్లా ఏం ముఖం పెట్టుకొని వస్తారు..?కర్నూలు జిల్లా అస్పరి మండలం వలగొండ గ్రామానికి చెందిన కె.నాగేంద్రయ్య ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.60 వేలు చొప్పున రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలకు దెబ్బతినడంతో మూడుసార్లకు బదులు ఒకే తీతతో సరిపెట్టాల్సి వచి్చంది. తేమ శాతం 8–12 శాతం మధ్య ఉన్నప్పటికీ ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళితే రూ.37,200 వచ్చింది. రూ.2.63 లక్షల వరకు నష్టపోయాడు. ఖరీఫ్‌లో యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడ్డామని, కాంప్లెక్స్ ఎరువు బస్తా కూడా రూ.2 వేలకు బ్లాకులో కొన్నట్లు ఆయన వాపోతున్నాడు. మరి ఏం ముఖం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారు? అని నాగేంద్రయ్య మండిపడుతున్నారు.ఏడాదిలో 300 మంది బలవన్మరణాలు..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం మొదలుకొని మామిడి, కోకో, పొగాకు, మిరప, ఉల్లి, టమాటా, పత్తి, అరటి, మొక్కజొన్న, కంది, శనగ.. ఇలా ఏడాదిన్నరగా ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర దక్కలేదు. వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బ తినడంతో రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయారు. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన ఏడాదిలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.పరిహారం పైసా అయినా ఇచ్చారా? 2024–25 సీజన్‌కు సంబంధించి ఖరీఫ్, రబీలో 1.51 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా సాగైంది 1.24 కోట్ల ఎకరాల్లో మాత్రమే. 2025–26 ఖరీఫ్‌లో సాగైంది కేవలం 69 లక్షల ఎకరాలే. మరోవైపు వరుస వైపరీత్యాల బారిన పడి ఈ మూడు సీజన్లలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 12 లక్షల ఎకరాల్లో పంటలు కరువు బారిన పడి బీడు వారాయి. ఖరీఫ్–24లో 100 మండలాలు, రబీ 2024–25లో 80 మండలాలు, ఖరీఫ్–2025 సీజన్లో 65 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుగా ఖరీఫ్–24లో 54, రబీ 2024–25లో 51, ఖరీఫ్–2025లో 37 చొప్పున మాత్రమే కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది.ఒక్క రూపాయి కూడా కరువు సాయం అందించిన పాపాన పోలేదు. వరుస వైపరీత్యాలు, కరువు సాయంతో కలిపి దాదాపు 10 లక్షల మంది రైతులకు రూ.1,350 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (మోంథా తుపానుతో కలిపి ఇన్పుట్ సబ్సిడీ) చెల్లించాల్సి ఉండగా, కృష్ణా వరదలకు సంబంధించి కేవలం 1.85 లక్షలమందికి రూ.285 కోట్లు మాత్రమే జమ చేసింది. దాదాపు రూ.1,100 కోట్లకుపైగా పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టింది.బాధిత కుటుంబాలకు పైసా సాయం చేశారా? అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండటంతో సాగు నష్టాలు భరించలేక, భరోసా కరువై రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తుపానులు, వరదలు, వర్షాభావం.. ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో పంటను అమ్ముకునే పరిస్థితి లేక, మద్దతు ధర దక్కక దిక్కు తోచని స్థితిలో ఉన్న అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే వారు లేక, చేసిన అప్పులు తీర్చే దారిలేక ఇప్పటికే 300 మందికిపైగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం పైసా సాయం చేసిన పాపాన పోలేదని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి.ఆక్వా, పాడి రైతులను నిండా ముంచేశారు తాము అధికారంలోకి రాగానే నాన్ ఆక్వా జోన్‌తో పాటు 10 ఎకరాలకు పైబడి సాగు చేస్తున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా హామీని నెరవేర్చలేదు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని ఒక్కరికీ ఇవ్వలేదు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు అంటూ ఊరించి ఒక్కటీ నిరి్మంచలేదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాన్ని అటకెక్కించారు. మరోవైపు అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి ప్రైవేటు డెయిరీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచారు. పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదు.రైతు ఆత్మహత్య చేసుకుని 8 నెలలైనా సాయం ఊసేలేదు ఈ ఫొటోలోని వ్యక్తి పేరు రామాంజనేయులు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయనకు సొంత భూమి 1.80 ఎకరాలు ఉండగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. రెండేళ్లుగా సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.12లక్షలు అప్పు తెచ్చారు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఏడాది ఏప్రిల్ 11న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.రామాంజనేయులుకు భార్య వీరేశమ్మ, కూతురు మమతాంజలి (16), కుమారుడు ప్రవీణ్‌కుమార్(14) ఉన్నారు. తండ్రి చనిపోవడంతో పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. సాయం చేయాలని వీరేశమ్మ కలెక్టర్‌ను కలిసినా ప్రయోజనం లేదు. రామాంజనేయులు మృతిచెంది 8 నెలలైనా ఇప్పటికీ త్రీ మెన్ కమిటీ విచారణ పెండింగ్‌లోనే ఉంది. ఈ కుటుంబానికి అన్నదాతా సుఖీభవ సాయం కూడా దక్కలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి, ప్రభుత్వ సాయం అందక ఈ కుటుంబం అల్లాడుతోంది.ఒడిశా నుంచి ఎరువులు తెచ్చుకున్నాం..అనుకున్న సమయానికి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో పక్కనున్న ఒడిశా నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాం. నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. కేవలం ఎరువుల కోసమే సుమారు రూ.20వేలు ఖర్చయింది. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంతో అధిక ధరలకు ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేశాను. నేనే కాదు ఇచ్ఛాపురం మండలంలోని వందలాది మంది రైతులు ఒడిశా నుంచే యూరియా కొనుగోలు చేశారు. – తిప్పన కృష్ణారెడ్డి, రైతు, హరిపురం, ఇచ్ఛాపురంఅధికారులు మా వైపు కన్నెత్తి చూడలేదుఎకరం తోటలో బొబ్బాయి పంట వేశాను. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. రూ.70 వేల పెట్టుబడి పెట్టాను. బొప్పాయి మొక్కలు ఏపుగా పెరిగాయి. దిగుబడి బాగా వస్తుందనుకున్న సమయంలో తుపాను, వరదలు వచ్చి దాదాపు 850 మొక్కలు విరిగిపడి చనిపోయాయి. పెట్టుబడులు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. కనీసం ప్రభుత్వ అధికారులెవ్వరూ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. నష్టపరిహారం వివరాలు నమోదు చేయలేదు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పుల పాలైపోయాం. – వాకపల్లి వీరబాబు, బొబ్బాయి రైతు, వలసలతిప్ప శివారు కొత్తలంక, ముమ్మిడివరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారూ.40 వేలు ఇవ్వాలి.. రూ.10 వేలే ఇచ్చారుఅన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున ఆరి్థక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదు. చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు గత రెండు ఖరీఫ్‌లకు కలిపి చంద్రబాబు ప్రభుత్వం నాకు రూ.40 వేలు ఇవ్వాలి. తీరా చూస్తే గత సంవత్సరం కేంద్రం ఇచ్చినది రూ.5 వేలు, ఈ ఏడాది రూ.5 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ ప్రభుత్వం అలా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. – తుంపాల చక్రబాబు, కాండ్రేగుల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లానాడు పంటల బీమా ధీమా.. నేడు ఆ బీమా బరువునేను రెండెకరాలున్న చిన్న రైతును. పంటల బీమా ప్రీమియం భారంగా మారడంతో ఈసారి బీమా చేయించుకోలేకపోయాను. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వమే రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించడంతో ధీమాగా ఉండేవాళ్లం. విపత్తులు సంభవిస్తే దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం బీమా పరిహారం సకాలంలో అందింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని చెప్పారు. ఎలా బీమా చేసుకోవాలో అవగాహన లేకపోవడం, ఆరి్థక భారం కారణంగా ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఇటీవల తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. బీమా లేకపోవడం ఇప్పుడు పెద్ద భారంగా మారింది. – గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లాపిడుగు పడి పాడి గేదె మృతిచెందినా పరిహారం లేదుమా కుటుంబం పాడి గేదెలను పోషించుకుని జీవనం సాగిస్తోంది. సొంత పొలం కూడా లేదు. అక్టోబర్ 22న ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురై మూడు నెలల సూడి గేదె మృత్యువాత పడింది. రూ.85వేలకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఇంటి దగ్గర చెట్టుకు కట్టేసిన సూడి గేదె పిడుగుపడి చనిపోయింది. గ్రామ రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు రిపోర్టు రాసుకొని వెళ్లారు. కానీ ఇప్పటివరకు పరిహారం అందలేదు. కనీసం ఏమైందన్న సమాచారం రాలేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – లేళ్ల సత్యనారాయణ, పాడి రైతు, ఉయ్యందన గ్రామం, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లాజింక్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదునాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఖరీఫ్‌లో వరి పంట వేశాను. ఎరువుల కోసం పడరాని పాట్లు పడ్డాం. జింక్ సల్ఫేట్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదు. జింక్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. – రొంగలి సత్యం, రైతు, ఉయ్యడవలస, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాఆధార్ లింకు కాలేదని విద్యుత్ సబ్సిడీ ఎత్తేశారునేను 15 ఏళ్లుగా చేపలు, రొయ్యల చెరువులు చేస్తున్నా. మొదట్లో డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆయిల్ ఇంజిన్లతో ఏరియేటర్ల ద్వారా రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేవాళ్లం. డీజిల్ ధరలు పెరగడంతో పదేళ్లుగా విద్యుత్ వినియోగిస్తున్నాం. 2018 నుంచి వనామీ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో, ఈహెచ్‌పీ, వైట్ గట్ తదితర వైరస్లు సోకటంతో తీవ్ర నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాం. కరెంటు కూడా యూనిట్‌కు రూ.3చొప్పున నెలకు సుమారు రూ.40వేలు బిల్లు వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో మా ఆక్వా రైతుల కష్టాలను చూసి యూనిట్ విద్యుత్‌ను సబ్సిడీపై రూ.1.50లకే ఇచ్చారు. దీంతో నాలాంటి ఆక్వా రైతులకు చాలా మేలు కలిగింది. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక నా ఆధార్‌తో విద్యుత్ కనెక్షన్ లింకు కాలేదని సబ్సిడీ ఎత్తేశారు. ఒకవైపు యూనిట్‌కు రూ.3లు చొప్పున విద్యుత్ భారం, మరోవైపు చేపలు, రొయ్యల ధరలు, లీజులు పెరిగిపోయి మళ్లీ అప్పులే మిగులుతున్నాయి. –పెచ్చెట్టి నాగ పెంటయ్య, ఆక్వా రైతు, ఎల్వీఎఎన్ పురం, పశ్చిమగోదావరి జిల్లాఆస్పత్రిలో డాక్టర్ లేరు.. మందుల్లేవు.. గొర్రెలకు నేనే నాటు వైద్యం చేస్తున్నా మాది ప్రకాశం జిల్లా మర్రిపూడి. గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నా. ఇటీవల జీవాలకు జబ్బు చేయడంతో మర్రిపూడిలోనే ఉన్న పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ డాక్టర్ లేరు. సిబ్బంది మాత్రం జీవాలను చూసి మందులు లేవని చెప్పారు. అందువల్ల నేనే జీవాలకు నాటు వైద్యం చేస్తున్నా. కాళ్లకు పుండ్లు పడి నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలను ఇంటి వద్దే వదిలేసి నేను పొలం పనులకు వెళ్తున్నా. జీవాలకు జబ్బు చేయడంతో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. నాకు 80 గొర్రెలు ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. రేపు ఏమవుతుందో అని భయంతో బతుకున్నా. ఎన్నిసార్లు పశువుల ఆస్పత్రికి వెళ్లినా మందుల్లేవంటున్నారు. – దుద్దుకుంట వెంకటేశ్వరరెడ్డి, గొర్రెలకాపరి, మర్రిపూడి, ప్రకాశం జిల్లాఅమూల్ లేక నెలకు రూ.6వేలు నష్టం నాకున్న ఐదు ఆవులు పూటకు 20 లీటర్ల పాలిస్తాయి. ఉదయం, సాయంత్రం కలిపి 40 లీటర్ల పాలు అమ్ముతాను. ఎంతోకాలం హెరిటేజ్, శ్రీజ వంటిæ డెయిరీలకు అమ్మినా ఒక లీటరు పాలకు రూ.35 పైన ఎప్పుడూ ఇవ్వలేదు. అంత తక్కువ ఇస్తే ఎలాగని అడిగితే పాలలో వెన్న శాతం తక్కువగా ఉందన్నారు. అదే పాలను అమూల్ డెయిరీ డెయిరీ వాళ్లకు ఇచ్చినప్పుడు లీటరుకు రూ.38 నుంచి రూ.40 ఇచ్చారు. అమూల్ వల్ల ఒక లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు అదనంగా రావడంతో 40 లీటర్లకు రోజుకు రూ.200 వరకు అదనపు లాభం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అమూల్‌ను లేకుండా చేయడంతో రోజుకు రూ.200 లెక్కన నెలకు రూ.6 వేలు వరకు నష్టపోతున్నా. అయినా ఏమీ చేయలేక శ్రీజ డెయిరీ వాళ్లకు పాలు అమ్ముకుంటున్నా. – రాజమ్మ, మహిళా పాడిరైతు, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లాఅన్నదాతా సుఖీభవ.. రెండో ఏడాదీ మొండి చెయ్యి మా ఊళ్లో 1.40 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు గత ఏడాది అన్నదాతా సుభీభవ పథకం డబ్బులు పడలేదు. వ్యవసాయ శాఖ, సచివాలయ అధికారులను అడిగితే, నా భూమికి సంబంధించిన పత్రాలు అడిగారు. అవి అందజేసినా గత ఏడాది రావాల్సిన రూ.7 వేలు రాలేదు. ఇటీవల విడుదల చేసిన అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం సొమ్ము కూడా నాకు రాలేదు. వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాధానం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు ఏదైనా సమస్య వస్తే మా ఊరిలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం చూపేవారు. ప్రస్తుతం జిల్లా అధికారులను అడిగినా ప్రయోజనం కని పించడం లేదు.– ఇనకొండ సత్యనారాయణ, రైతు, సిరివాడ, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లాఅప్పుల బాధ భరించలేక మా ఆయన ఉరి పోసుకున్నాడుమాకున్న 4 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన సాగు చేశాడు. సాగు ఖర్చుల కోసం రూ.10 లక్షల వరుకు అప్పులు తెచ్చారు. సాగు చేసిన మిర్చి తెగుళ్ల వల్ల దెబ్బతింది. కాస్త పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులవారు, అప్పులు ఇచి్చనవారు వెంటనే అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మా ఆయన ఈ ఏడాది జూలై 2వ తేదీన మా ఇంటి పక్కన షెడ్డులో ఉరిపోసుకుని చనిపోయాడు. కొనకొండ్ల గ్రామం కెనరా బ్యాంకులో రూ.4 లక్షల అప్పుతోపాటు గుంతకల్లు మణప్పరంలో గోల్డ్ లోన్‌లో బంగారు తాకెట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చారు. బయట వ్యక్తుల వద్ద రూ.4 లక్షల వరుకు అప్పులు ఉన్నాయి. నాకు ఇద్దరు కుమారులు. బాగా బతికిన మా కుటుంబం పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. – ఉప్పర శంకరమ్మ, రైతు ధనంజయ భార్య, కొనకొండ్ల గ్రామం, వజ్రకరూర్ మండలం, అనంతపురం జిల్లా -
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’!
ముందు మనం రైతులకు ఏం చేశామో చెప్పమంటున్నారు ‘సార్’! -
మొక్కజొన్నకు దక్కని మద్దతు
సాక్షి, అమరావతి: మొక్కజొన్నకు మద్దతు కరువైంది. అగ్రివాచ్‌తో పాటు వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఎఎంఐసీ) ముందస్తు అంచనా ధరల కంటే దిగజారిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కోతలు ప్రారంభమై 45 రోజులు దాటినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలోచన చేయకపోవడం పట్ల రైతులు మండిపడుతున్నారు. మార్కెట్లో మద్దతు ధర దక్కక పోవడంతో వ్యాపారులు, దళారీల చేతిలో నిలువు దోపిడికి గురవుతున్నారు. భారీగా తగ్గిన దిగుబడులు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3.32 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది సాగు లక్ష్యం 3.62 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. కాగా, లక్ష్యానికి మించి 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. నంద్యాల, అనంతపురం, సత్యసాయి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, ప్రకాశం జిల్లాలో అధిక సాగు నమోదయ్యింది. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే దిగుబడులు సగటున 25–35 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, అధిక వర్షాల ప్రభావంతో 20–23 క్వింటాళ్లకుమించి రాని పరిస్థితి నెలకొంది. నాణ్యత కూడా పడిపోవడంతో మార్కెట్లో మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. ధరల అంచనా తారుమారు ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధరగా క్వింటా రూ.2400గా కేంద్రం ప్రకటించింది. కాగా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధరలను అంచనా వేసే మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం (ఎఎంఐసీ) ప్రకటించిన ముందస్తు ధరల అంచనా ప్రకారం కోతలు ప్రారంభమయ్యే సమయానికి ధర రూ.2,335–2,625 మధ్య పలకాల్సి ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో క్వింటా రూ.1,600 నుంచి రూ.1,900కు మించి పలకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు రైతులు నష్టపోతున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచే కోతలు మొదలయ్యాయి. రైతుల గోడు పట్టని చంద్రబాబు కోతల సమయంలో అధిక వర్షాలు, ఆ తర్వాత మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు మొక్కజొన్న రైతులను కోలుకోలేని దెబ్బతీసాయి. దీంతో తేమశాతం అధికంగా ఉంటోంది. ఆరుదల కోసం రోజుల తరబడి ఎండలో ఆరబెడుతున్నా ఫలితం లేకుండా పోతుంది. మొక్కజొన్న విత్తనాలను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యార్డులో ఆరబెడుతున్న రైతులు ప్రత్యేకంగా కాపలా ఉండాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ధరలు పతనమైన సమయంలో మార్కెట్లో జోక్యం చేసుకొని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే మాకీ తిప్పలు ఉండేవి కావని చెబుతున్నారు. మార్కెట్లో కొనేవారు లేకపోవడంతో రైతులు దళారీలను ఆశ్రయించి, నష్టపోవాల్సి వస్తోంది. -
అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!
చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృతరూపం దాలుస్తున్నది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను గమనించండి. ఎటు చూస్తే అటు చీకటి. వికసిత జీవితాల విధ్వంసం. రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలైన దృశ్యం కనిపిస్తుంది.అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు పది పన్నెండు వేలన్నా వస్తేనే... పెట్టిన ఖర్చు గిట్టుబాటవుతుంది. వెయ్యి రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురించింది. జగన్ హయాంలో ఇరవై నుంచి ముప్ఫై వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఢిల్లీ నగరం దాకా పరుగెత్తిన ప్రత్యేక అరటి రైళ్ల దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలార్జించిన నాటి వైభవం ఇంకా వారి మనోఫలకాల్లో మెరుస్తూనే ఉన్నది. ఇప్పుడెందుకీ దుర్గతి?పత్తి పంటనూ దున్నేస్తున్నారు. పలనాటి రైతు విలవిల్లాడు తున్నాడు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల జమిలి దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుపాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ కళ్లప్పగించి చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవి కెక్కడం లేదు. ఈ సీజన్లో అన్ని పంటల పరిస్థితీ అంతే. గిట్టుబాటు ధరల్లేక ఉల్లి పంటను దున్నేసిన వార్తలను చదవాల్సి వచ్చింది. గుండెజారిన ఉల్లి రైతుల ఆత్మహత్యలు కూడా రిపోర్టయ్యాయి.టమాటా రైతుల కన్నీటి పాట ఈ యేడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉన్నది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయరంగాన్ని వదిలేసింది. ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్లో సర్కార్ జోక్యం వంటి మాటలే ఇప్పుడు వినిపించడం లేదు. తుపానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరానికి అత్తెసరుతో సరిపెట్టారు.వ్యవసాయ రంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆయనేం ఖాళీగా లేరు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ తాను వ్యవసాయరంగం గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నానని కడప జిల్లాలో రైతులతో జరిపిన ముఖా ముఖిలో ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలులు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో, ఆ గాలుల క్వాలిటీ ఏమిటో, అందులో ఏమేమి తెగుళ్లున్నాయో, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో, ఏ పంటల మీద దాడి చేస్తాయో అనే విషయాన్ని తాను ఎనలైజ్ చేస్తున్నట్టు రైతులకు అభయమిచ్చారు.ఆ తెగుళ్ల సంగతి, పురుగుల సంగతి తెలిస్తే రైతుకు ఏ భయం ఉండదని చెప్పారు. అంతేగాక భూమిలో తేమ ఎంత ఉంది, ఎండ ఎంత తగులుతుంది అనే విషయాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ రకమైన టెక్నాలజీ డెవలప్మెంట్పై తాను దృష్టి పెట్టినందువల్ల పంటల బీమా గురించి, మార్కెట్ జోక్యం గురించి, పెట్టుబడి సాయం గురించి, ఇన్పుట్ సబ్సిడీ వంటి చర్యల గురించి అడగొద్దనేది ఆయన ఉద్దేశం కాబోలు! రాష్ట్ర రైతాంగంతోపాటు భూవసతి లేని వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం కష్టాల కొలిమిలోకి నెట్టింది.ఈ–కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దు చేసింది. ఇది ఆ పథకం నిబంధనలకు విరుద్ధం. గ్రామసభలో నిర్ధారణ చేసుకోకుండా జాబ్ కార్డులను రద్దు చేయడానికి వీల్లేదు. అయినా ఎడాపెడా రద్దు చేస్తున్నారు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా, ఇటు ఉపాధి హామీ ఆసరా లభించకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఒక విస్తారమైన చీప్ లేబర్ మార్కెట్‌ను రైతు–కూలీల్లో సృష్టించే కుతంత్రంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది.ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు పేదలకు అసైన్ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరా ఆర్డినెన్స్‌ను జారీచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన అసైనీలకు ఉపయోగపడే విధంగా ఇరవయ్యేళ్ల తర్వాత వారు ఆ భూముల్ని అవసరార్థం అమ్ము కునే విధంగా జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ఇచ్చింది. దీనివల్ల తొమ్మిదిన్నర లక్షలమంది అసైనీలకు లబ్ధి జరిగింది. పేద రైతులకు లబ్ధి జరిగితే పెత్తందారీ సర్కార్‌కు నిద్రపట్టదు కదా! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం దాని పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చీరావడంతోనే యెల్లో మీడియా బాకా ద్వారా ఫ్రీహోల్డ్ స్కీమ్‌పై దుష్ప్రచారాన్ని ఊదరగొట్టి, ఆ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు.ప్రభుత్వ రంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగేసి ప్రైవేటీకరించ డానికి ఇప్పటికే బాబు సర్కార్ తెగబడింది. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యాక మాట మార్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగించినా నియంత్రణ మాత్రం సర్కారుకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అదెలా సాధ్యమో తెలియదు. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీ కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సేవలు ఏవీ ఉచితం కాదని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు.ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్ అడియాసలు చేసింది. అక్కడా ప్రైవేటీకరణ మంత్రాన్నే జపిస్తున్నది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే! ఇదీ బాబు విధానం.విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేమిటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగుగా మారిందని ఆయనీ మధ్యనే ఈసడించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైన సొంత గనుల కేటాయింపు విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు మాత్రం మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేందుకు రాయ బారాలు నడుపుతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టును దెబ్బ తీసే విధంగా ఆ స్టీల్ ఫ్యాక్టరీ సొంత రేవును కూడా నిర్మించుకుంటోంది. మిట్టల్ స్టీల్ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటి మెంట్‌తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బ తీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తున్నది.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ‘పీ–4’ అనే పేరుతో ప్రైవేటీకరించే విపరీత చర్యకు కూటమి సర్కార్ తెగబడింది. ఈ దేశ సంపదలో పేద ప్రజలు హక్కుదారులు కాదు, కేవలం యాచకులు మాత్రమేననేది ఈ ‘పీ–4’ పథకంలో అంతర్లీనంగా ప్రవహించే ఫిలాసఫీ. ఇది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన. బలహీన వర్గాల మహిళల ఆత్మ గౌరవాన్ని నిల బెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయిం చింది జగన్ ప్రభుత్వం. అందులో తొమ్మిది లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి చంద్రబాబు సర్కార్ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకొని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఈ పదిహేడు మాసాల పాలనలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా మూడు లక్షల ఇళ్లను పూర్తిచేయడం నిజంగా ప్రపంచ వింతే! అంతటితో ఆగ లేదు. ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నామని, అందులో మూడు లక్షలు ఇప్పటికే అప్పగించామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? జగన్ సర్కార్ భూమిని సేకరించి ప్లాట్లు వేసి, పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కావా?రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పదిహేడు మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది జాతీయ రికార్డు. ఒకపక్క విద్యా, వైద్య రంగాలతో సహా సమస్తాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజల కిచ్చిన హామీలను ఎగవేస్తున్న సర్కార్ ఈ సొమ్మునంతా ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడమంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తున్నట్టు! ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు! పోలీసింగ్‌పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్ గవర్నెన్స్ మన పోలీసింగ్‌ను పక్కదారి పట్టించింది. ఉద్యోగాల కల్పనలో కూడా ఏపీ అధమ స్థానంలోనే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. ఇవేమీ యెల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతున్నది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉండి చేసిన అవినీతిపై విచారణ జరిపి పలు ఛార్జిషీట్లు వేశారు. స్కిల్ కుంభకోణంలో జైలుకు కూడా ఆయన వెళ్లి వచ్చారు.ఇప్పుడా కేసుల నుంచి బయటపడేందుకు బాబు సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వ్యవహారం నుంచి కూడా దృష్టి మళ్లించాలి. కనుక జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుతో, ‘సిట్’ చెప్పిందన్న సాకుతో యెల్లో మీడియా నిండా అవే వార్తలు. పెట్టుబడులు తరలివస్తున్నాయంటూ పోచికోలు ప్రచారం. అమరావతిలో అంతస్థులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్యస్థితిని దాచి పెట్టగలరు! విశాఖ సదస్సు ద్వారా పది లక్షల కోట్లు వస్తున్నా యని క్రితంసారి ప్రకటించుకున్నారు.కానీ పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్న నిజాన్ని దాచగలిగారా? ఇంకెంత కాలం జగన్ వ్యక్తిత్వ హననంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు! జగన్ హైదరాబాదు కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలాకాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు కనుక పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. యెల్లో మీడియాకు, కూటమి సర్కార్‌కు మింగుడుపడినా, పడక పోయినా జాతీయ స్థాయిలోనే జగన్ అతిపెద్ద పొలిటికల్ క్రౌడ్ పుల్లర్. కోర్టు హాజరుపై సైతం యెల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషాన్ని ఎగజిమ్మాయి.ఒక ఎల్లో విశ్లేషకు డైతే ఏకంగా హిడ్మా మాదిరిగా జగన్‌ను కూడా ఎన్కౌంటర్ చేయాలని ఊగిపోయాడు. కొత్తగా చేయడమేమిటి? పదహా రేళ్లుగా ఆయన వ్యక్తిత్వంపై ఎన్కౌంటర్లు చేస్తూనే ఉన్నారు కదా! హిడ్మా ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడట! రాజ్యాంగాన్ని వ్యతి రేకించాడట! జగన్ కూడా అదే పని చేశాడట. అదీ ఆ విశ్లేషకుని రీజనింగ్. సరే, హిడ్మా చనిపోతే వందలాది గిరిజన గూడేలు గుండె పగిలేలా ఎందుకు రోదించాయో, దండకారణ్యం కడుపు కోతతో ఎందుకు కుదేలైందో కాలమే సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని అడు గడుగునా అమలుచేసిన జగన్ రాజ్యాంగ వ్యతిరేకా? ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తా? తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘రైతులు రోడ్డున పడ్డా చంద్రబాబుకు పట్టింపు లేదు’
తాడేపల్లి : ఏపీ రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉండి కూడా ఏపీకి నష్టం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే రైతులు రోడ్డున పడినట్టే. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరికి అరటి పంటని కూడా అమ్ముకోలేక పోతున్నారు.పొగాకు, మిర్చి, మామిడి, పత్తి, కొబ్బరి, పామాయిల్, ధాన్యం.. ఇలా ఏ పంటకూ ధరలేదు. రైతులు సర్వనాశనం అవుతున్నా చంద్రబాబుకు పట్టింపు లేదు. జగన్ హయాంలో రైతలు ఎంత గొప్పగా బతికారు? చంద్రబాబు హయాంలో ఎలా ఉన్నారు?, ప్రపంచమంతా వ్యవసాయంలో యంత్రాలు వాడుతున్నారుఇక చంద్రబాబు కొత్తగా నేర్పించేదేంటి?, ఈ 20 నెలల్లో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నైనా తెచ్చారా?, చంద్రబాబు వాడే హెలికాప్టర్లు, విమానాలకు వెంటనే డబ్బులిస్తారు. కానీ రైతులకు మాత్రం ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతుల ధాన్యాన్ని రానివ్వటం లేదు. రైతులు కాలర్ ఎగరేయటం కాదు, కనీసం ఒంటి మీద చొక్కా వేసుకునే పరిస్థితి కూడా లేదు. పోలీసులు, టీడీపీ గూండాలు లేకుండా ఎమ్మెల్యేలు రైతుల దగ్గరకు వెళ్లే దమ్ముందా?, 85 లక్షల మంది రైతుల్లో ఎంతమందికి క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు?, తుపానులు, వరదల వలన నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వందల ఎకరాల భూములను మాత్రం ఇష్టం వచ్చి వారికి దోచి పెట్టే పనిలో ఉన్నారు. దళితులు, పేద రైతుల ఎసైన్డ్ భూములను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టారు. ధరల స్థిరీకరణ నిధితో పంటలు కొంటామని చెప్పి ఒక్క గింజైనా కొన్నారా?, దళ్వాకు సాగు నీరు అందించాలి. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ప్రధానిని ఎన్నిసార్లు కలిసినా రైతులకు మేలు చేయమని ఎందుకు అడగటం లేదు?, లేఖల పేరుతో డ్రామాలు ఎందుకు?, ఇరిగేషన్ లో ఓనమాలు తెలియని వ్యక్తి రామానాయుడు. బుడమేరు వరదలతో వందలమందిని చనిపోయినా పట్టించుకోని వ్యక్తి. అలాంటి వారు కూడా జగన్ గురించి విమర్శలు చేస్తారా?, కేంద్ర జలసంఘాన్ని ఏనాడైనా కలిసి రాష్ట్రానికి ఏమైనా మేలు చేశారా?, జగన్ తప్పులు చేస్తే ఈ 20 నెలల్లో ఎందుకు సరి చేయలేదు?’ అని ప్రశ్నించారు. -
అరటి రైతు ఆశలు గెల్లంతు
సాక్షి, అమరావతి, నెట్వర్క్: కంటికి రెప్పగా సాకిన పంటను అరటి రైతు ట్రాక్టర్‌తో దున్నేస్తున్నాడు..! కన్నబిడ్డలా పెంచిన తోటను తమ చేతులతోనే తొలగిస్తున్నాడు..! చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నాడు..! అనంత రైతు ఆక్రందన వ్యక్తం చేస్తుంటే... అన్నమయ్య జిల్లా రైతు అల్లాడుతున్నాడు..! వైఎస్సార్ కడప రైతు కుదేలవుతుండగా.. నంద్యాల రైతు నిలువునా మునిగిపోయామని వాపోతున్నాడు..! సర్కారు పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయి అరటి రైతు మొత్తానికి దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాడు.అరటి ఒక్కటే కాదు... రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకు మిగులుతున్నది ఆక్రందనే! వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టమాట, కొబ్బరి, వేరుశనగ, మామిడి, ఉల్లి, సజ్జ.. ఆలా పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్య గోచరమే. మద్దతు ధర మాటే లేదు.. ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం అరటి రైతు పరిస్థితి అయితే అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. పెట్టుబడులూ రాని దైన్యంలో ఉన్నారు. రైతులకు భరోసాగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ ఆలోచనే చేయడం లేదు. కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నం చేయడం లేదు. పశువులకు వదిలేసిన అరటి తోట తోటలు టిల్లర్లుతో దున్నేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో అన్నదాతలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసింది. రైతన్నా మీ కోసం.. పంచ సూత్రాలు అంటూ మభ్యపుచ్చే ఎత్తుగడలు వేస్తోంది. దీంతో ఇదేనా? కాలర్ ఎగరేసుకునేలా చేయడం అని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో అన్నదాత ఆవేదన వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా అరటి రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.రూ.లక్షలు ఖర్చు చేసి సాగుచేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. అరటికే కాదు.. మొన్నటికి మొన్న మామిడి, ఆ తర్వాత ఉల్లి, టమాట, మొక్కజొన్న ఇలా పంటలన్నీ మద్దతు ధరలు లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దున్నేస్తున్న పరిస్థితులు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొన్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.‘అనంత’ రైతన్న ఆక్రందన.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. వ్యాపారులు అరటి తోటల వైపు కన్నెత్తి చూడకపోవడంతో దళారులు చొరబడుతున్నారు. టన్నుకు రూ.వెయ్యిలోపే ఇస్తుండడంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఎకరాకు రూ.లక్షన్నర పెట్టుబడి పెడితే రూ.15 వేలు రావడం కూడా కష్టంగా ఉందని, కూలీల ఖర్చులూ వెళ్లడం లేదని వాపోతున్నారు.అనంతపురం జిల్లాలో 40 వేల ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షన్నర పెట్టుబడులు పెట్టారు. మూడేళ్లుగా టన్ను రూ.25 వేలు పలికిన ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ.వెయ్యి లోపు పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు, తుపాను తదితర కారణాలతో అరటి పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. దీంతో ఎగుమతి చేసే కంపెనీలు కొనడం లేదు. ఇదే అదనుగా దళారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. రైతుల నుంచి కేజీ రూపాయికి కొని మార్కెట్లో రూ.30–రూ.50కి అమ్ముతున్నారు.అనంతపురం జిల్లా యాడికి వద్ద అరటి గెలలను మేస్తున్న గొర్రెలు తోటల్లోనే మాగిపోతున్న గెలలు వైఎస్సార్ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగులో ఉంది. పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశినాయన, మైదుకూరు మండలాల్లో సుమారు 16 వేల ఎకరాల్లో పంట చేశారు. ఈసారి అంచనాలకు తగ్గట్లు దిగుబడులున్నా పంటను అమ్మలేని దుస్థితి. విదేశాలకు ఎగుమతి నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నట్లు రైతులు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులు సీజన్లో ధరలు లేక అల్లాడిపోగా ప్రస్తుతం అరటి రైతులు కడగండ్లు ఎదుర్కొంటున్నారు. టన్ను రూ.2–4 వేల లోపే అంటుండడంతో ఏంచేయాలో పాలుపోక పడరాని కష్టాలు పడుతున్నారు.జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా పంట సాగులో ఉండగా 9 వేల ఎకరాల్లో మొదటి, రెండు, మూడో క్రాప్ కోతకు సిద్ధంగా ఉంది. 20 రోజులుగా ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట, రైల్వేకోడూరు నుంచి నిత్యం నాందేడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడు వెళ్లేవి. ప్రస్తుతం ధరలు లేకపోవడంతో లారీలు రైల్వేకోడూరులో పక్కన పెట్టేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో రూ.15–18 వేల వరకు ధరలు పలకగా ప్రస్తుతం టన్ను అరటి రూ.2–4 వేలకు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొనేవారు లేక తోటల్లో చెట్లపైనే కాయలు మాగుతున్నాయి. అర్థ రూపాయికే కిలో నంద్యాల జిల్లాలో ఉద్యానశాఖ లెక్కల ప్రకారం 40 వేల ఎకరాల్లో అరటి సాగు అవుతోంది. ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. గతంలో గెలల చొప్పున విక్రయించగా ఇటీవల కిలోల్లో అమ్ముతున్నారు. మొన్నటివరకు విజయవాడ, గుంటూరు, వినుకొండ తదితర చోట్లకు ఎగుమతులు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అడిగేవారు లేకపోవడంతో భువనేశ్వర్, ఒడిశా, బిహార్‌కు తరలిస్తున్నారు. అంతదూరం తరలిస్తే రైతులకు మిగిలేది శూన్యమేనని వాపోతున్నారు. ప్రస్తుతం కేజీ అర్థ రూపాయి (టన్ను రూ.500)కి పడిపోయింది. దీంతో రైతులు తోటలను దున్ని వేస్తున్నారు. ఉల్లితో మొదలైన ధరల పతనం.. ఈ సీజన్లో ఉల్లితో మొదలైన ధరల పతనం అరటి వరకు కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి ధరలు పడిపోయిన పంట ఉత్పత్తులను కొను గోలు చేసి మద్దతు ధరలు దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టడం తప్ప రైతులను ఆదుకునే దిశగా అడుగు కూడా వేయని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.ప్రత్యేక రైలు నిలిచిపోయింది..వైఎస్ జగన్ హయాంలో అరటి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా అనంతపురం నుంచి ముంబైకు ఏటా ప్రత్యేక రైళ్లు నడిపితే.. చంద్రబాబు సర్కార్ వచ్చాక ఒక్క రైలు కూడా నడపలేని దుస్థితి. వైఎస్ జగన్ హయాంలో టన్ను రూ.30 వేలకుపైగా పలకగా, నేడు రూ.వెయ్యికి కూడా కొనేవారు లేక తోటలను రైతులు దున్నేస్తున్న పరిస్థితి నెలకొంది.18 నెలలుగా అన్నదాత గుండెకోత అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో ఇచి్చన హామీకి తూట్లు పొడుస్తూ తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు సీఎం చంద్రబాబు. కనీసం ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో ఇస్తారనుకుంటే అదీ లేదు. అడ్డగోలు కోతలు పెడుతూ అరకొరగా విదిల్చి ఏడు లక్షల మందికి ఎగనామం పెట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా నోటిఫై చేసిన ప్రతి పంటకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్శల్ కవరేజీ కల్పిస్తూ అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం వచ్చీరాగానే అటకెక్కించేసింది. మరోపక్క వరుస వైపరీత్యాల వల్ల లక్షలాది ఏకరాల్లో పంటలు దెబ్బతిన్న రైతులకు కనీసం ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) సకాలంలో ఇవ్వడంలో చేతులెత్తేసింది. మద్దతు ధరకు కొనేవారు లేక రూ.వేల కోట్ల పెట్టుబడులు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతూ వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఆదుకున్న దాఖలాలు లేవు.వైఎస్ జగన్ హయాంలో అరటి రైతుకు మహర్దశవైఎస్ జగన్ హయాంలో అరటి రైతుకు సువర్ణ యుగమనే చెప్పాలి. నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా ఏటా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహిస్తూ సబ్సిడీపై కవర్లు ఇవ్వడమే కాదు. తోట బడుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రి ప్రాసెసింగ్ టెక్నిక్స్‌పై అరటి రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించడమే కాదు. ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా పంట మార్కెట్‌కు వచ్చే ముందే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటు ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేవారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విదేశాలకు ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ముంబైకు ప్రత్యేకంగా ఏటా కిసాన్ రైళ్లు నడిపారు.ఫలితంగా ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ధరలు పతనం కాలేదు. రాష్ట్రంలో 2018–19లో 1.75 లక్షల ఎకరాల్లో సాగవుతూ 45 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. అలాంటిది 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో విస్తీర్ణం 2.74 లక్షల ఎకరాలకు పెరగగా, దిగుబడులు 70 లక్షల టన్నులకు చేరాయి. ఎగుమతులైతే 2014–19 మధ్య 23 వేల టన్నులు జరిగితే.. 2019–24 కాలంలో ఏకంగా 3 లక్షల టన్నులు దాటాయి.సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, యూరోప్ దేశాలతో పాటు అమెరికాకు సైతం ఎగుమతయ్యాయి. 2018–19లో టన్ను రూ.5వేలకు మించని ధర 2023–24లో ఏకంగా రూ.30 వేలకు పైగా పలికింది. నాడు ఐదేళ్లలో అరటి సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో ఏపీ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ బనానా ఎక్స్‌పోర్టు ప్రమోషన్ అవార్డు–2020, ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు–2022 వంటి ఎన్నో అవార్డులు ఏపీని వరించడం వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.కొబ్బరి ధర.. మరింత దిగజారి..సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్లో నెల వ్యవధిలో పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.9 వేల వరకు తగ్గింది. గత నెలలో ఇదే సమయంలో రూ.23 వేలు–రూ.25 వేలు ఉంది. సెపె్టంబర్లో రూ.28 వేల దాక పలికింది. కానీ, గత వారం రూ.19 వేలకు, ఇప్పుడు రూ.16 వేలకు పడిపోయింది. పండగలు పూర్తి కావడం, తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి పెరగడంతో మన పంటకు డిమాండ్ తగ్గింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధరలు పడిపోయి, ఎగుమతులు తగ్గడంతో కాయల రాశులు పేరుకుపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో ఇతర రాష్ట్రాల్లో ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇక సంక్రాంతి వరకు పండగల సీజన్ లేకపోవడంతో రైతుల్లో గుబులు పట్టుకుంది. కోనసీమ జిల్లా రైతుల వద్ద పేరుకుపోయిన కొబ్బరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ప్రస్తుతం సగటున దింపునకు (45 రోజులకు) 14 కోట్ల కాయలు దిగుబడిగా వస్తోందని, రోజుకు 30 లారీల వరకు ఎగుమతి జరుగుతోందని అంచనా. సెపె్టంబరులో ఇది 90 లారీల వరకూ ఉండేది.ధరల పతనం ప్రభావం కురిడీ కొబ్బరిపై కూడా కనిపిస్తోంది. గత నెల కన్నా కురిడీ కొబ్బరి పాత కాయలో గండేరా (పెద్దకాయ), గటగట (చిన్నకాయ) ధరలు రూ.వెయ్యి చొప్పున తగ్గాయి. రూ.30 వేలు ఉన్న గండేరా రకం రూ.29 వేలు, గటగటా రూ.28 వేల నుంచి రూ.27 వేలకు తగ్గింది. కొత్త కాయలు రూ.29 వేలు ఉన్న గండేరా రకం రూ.27,500కు, రూ.27 వేలున్న గండేరా రకం ధర రూ.25 వేలకు పడిపోయాయి. కొత్త కాయ కురిడీ రకం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు తగ్గడం గమనార్హం. ‘‘దిగుబడి ఆశాజనకంగా ఉన్న సమయంలో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. మంచి ధర వస్తుందనే ఆశతో నిల్వ చేసిన మాలాంటి రైతులం నష్టపోతున్నారు’’ అని పోతవరం గ్రామానికి చెందిన రైతు పాటి శేఖర్ వాపోయాడు.ధర లేక, వ్యాపారులూ రాక 8 ఎకరాల్లో అరటి తొలగించానాకున్న 20 ఎకరాలలో 14 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టా. దిగుబడి బాగా రావడంతో ఆశలు పెట్టుకున్నా. కానీ, కోతకు వచ్చే సమయానికి మార్కెట్లో ధరలు పడి పోయాయి. వ్యాపారులు తోటల వైపే రావడం లేదు. టన్ను రూ.1,500కు ఇస్తామన్నా ఆసక్తి చూపడం లేదు. ధర లేక, వ్యాపారులూ రాక 8 ఎకరాల్లో అరటి పంట తొలగించా. 6 ఎకరాలలో నెల రోజుల్లో పంట కోతకు రానుంది. అప్పటికైనా ధర దక్కు తుందన్న ఆశ లేదు. ఇప్పటికే రూ.15 లక్షల మేర నష్టపోయా. 15 ఏళ్లుగా అరటి సాగు చేస్తున్నా ఇంతటి అధ్వాన పరిస్థితి ఎన్నడూ చూడలేదు.– ఓబుళరెడ్డి రామచంద్రారెడ్డి, వేముల మండలం భూమయ్యగారిపల్లె, వైఎస్సార్ కడపతెగనమ్ముదామని చూస్తున్నా ఎవరూ రావడం లేదుఆరు ఎకరాలలో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షల మేర రూ.8 లక్షల వరకు ఖర్చు చేశా. దిగుబడి ఎకరానికి 25 టన్నులు తక్కువ ఉండదనుకున్నా. ధరలు పూర్తిగా పడిపోయాయి. కాయలు మాగితే నష్టపోతామని ఉన్న రేటుకే అమ్ముదామని చూస్తున్నా... అరటి గెలల కొనుగోలుకు వ్యాపారులు దరిదాపులకు కూడా రావడం లేదు. – కల్లూరు ఓబుళరెడ్డి, వైఎస్సార్ కడప వేల్పుల గ్రామం, వైఎస్సార్ కడపపెట్టుబడులు కూడా వచ్చేలా లేదునాలుగు ఎకరాల్లో అరటి సాగు చేశా. పెట్టుబడులు కూడా లభించే పరిస్థితి లేదు. నా ఆశలు గల్లంతయ్యాయి. మా అబ్బ (తాత), నాన్న కూడా అరటినే పండించారు. 30 ఏళ్లుగా ఈ పంటనే నమ్ముకుని ఉన్నాం. గతంలో పులివెందుల అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పడు అసలు రైతుల వద్దకు వచ్చి వ్యాపారులు కొనే పరిస్థితి లేదు. ధర లేక చాలామంది తోటలోనే కాయలను వదిలేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే కడుపు మండిపోతోంది.– ప్రసాద్, నల్లపురెడ్డిపల్లె గ్రామం, పులివెందుల మండలం, వైఎస్సార్ కడపపరిస్థితి అత్యంత దయనీయం గత 25 ఏళ్ల నుంచి 5 ఎకరాలలో అరటి పండిస్తున్నా. ఎకరాకు రూ.లక్ష ఖర్చు పెట్టా. కానీ, పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో టన్ను రూ.30 వేలు కూడా పలికింది. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టన్ను రూ.1,500–రూ.2,500 మాత్రమే ఉంది. పెట్టుబడులూ రావడం లేదు.– విష్ణు, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల మండలం, వైఎస్సార్ కడపరూ.20 లక్షల ఆదాయం ఊహిస్తే పెట్టుబడీ వచ్చేలా లేదుపది ఎకరాలలో ఏడేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. పెట్టుబడికి రూ.లక్షలు అయింది. కానీ, పంటను అడిగే నాథుడు లేడు. టన్ను రూ.3 వేలకు కూడా అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. పంట అమ్మితే రూ.20 లక్షలపైన ఆదాయం వస్తుందని అనుకుంటే, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు.– కుమ్మెత నాగార్జునరెడ్డి, లింగాల, వైఎస్సార్ కడపచీనీ తీసేసి మరీ అరటి వేశాను.. మునిగిపోయానుఏడు ఎకరాలలో చీనీ తొలగించి అరటి సాగు చేశాను. కానీ, దానికంటే దారుణంగా నష్టపోయాను. గత మూడేళ్లు అరటికి మంచి ధరలు రావడంతో ఈ పంట వైపు మొగ్గాను. కానీ, ఈ ఏడాది ధరలు భారీగా పతనమయ్యాయి. పంటను అమ్ముకునేందుకు వ్యాపారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీవ్రంగా నష్టపోతున్నాం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు.– అలవలపాటి నాగేశ్వర్‌రెడ్డి, లింగాల, వైఎస్సార్ కడపకనీసం కౌలు కూడా వచ్చేలా లేదు..పొలాలు కౌలుకు తీసుకుని అరటి సాగు చేస్తున్నా. సుమారు 30 వేల అరటి చెట్లు వేశా. మార్కెట్లో ధరలు చూస్తే పెట్టుబడుల మాట దేవుడెరుగు, కనీస కౌలు కూడా వచ్చేలా లేదు. కష్టపడి పండిస్తే తుఫాను, అకాల వర్షాలు మరింత నష్టం కలిగించాయి. – గాజుల నాగయ్య, అబ్బీపురం, మహానంది, నంద్యాల జిల్లా -
కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవల పిల్లలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందన్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామిడి రైతులకు అండగా ఉండటం కోసం బంగారుపాలెం పర్యటన చేశారు. జగనన్న వస్తుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ప్యాక్టరీలకు తోలారు.అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు ప్యాక్టరీలు 8 రూపాయలు మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. రైతు సంఘాలు ఆందోళన చేయడం వారికి అండగా నా వంతు బాధ్యతగా నేను కూడా రైతుల ఆందోళనకు అండగా నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన 180 కోట్లు విడుదల చేశారు. అయితే, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుండటంతో ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోతే రైతులకు మద్దతుగా పోరాటం చేశామని నేను మాట్లాడిన విషయం మీకు తెలిసిందే.తాజాగా ప్రభుత్వం ప్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాల్సిన 8 రూపాయలు కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే 4 రూపాయలు ఇస్తుంది. కొన్ని చోట్ల మూడు రూపాయలు కూడా ఇస్తున్నారని కూడా రైతులు తమ బాధను నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో.. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు ఇవ్వాలని మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయమైన డిమాండు కోసం మామిడి రైతులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఎప్పటిలాగే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. స్వంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు...మోసం - కూటమి ప్రభుత్వం రెండూ కవలపిల్లలుగా మారింది, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు మామిడి రైతులకు అండగా ఉండటం కోసం…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 21, 2025 -
2030 నాటికి 10వేల మంది రైతులకు సపోర్ట్
స్టార్‌బక్స్ కాఫీ కంపెనీ, టాటా ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఫార్మర్ సపోర్ట్ పార్ట్నర్షిప్ (FSP) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళపై దృష్టి సారించి 2030 నాటికి 10,000 మంది భారతీయ కాఫీ రైతులకు మద్దతు ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం.స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పరీక్షించడానికి, పంట నాణ్యతను మెరుగుపరచడానికి ఫార్మర్ సపోర్ట్ పార్ట్నర్షిప్ (FSP) సహాయపడుతుంది. దీంతో రైతులు డిజిటల్ శిక్షణ సాధనాలు, పునరుత్పాదక వ్యవసాయం & నైతిక వనరులలో ఉత్తమ పద్ధతులతో సహా వ్యవసాయ శాస్త్ర నైపుణ్యానికి ప్రాప్యతను పొందుతారు.ఈ చొరవ భారతీయ రైతులను.. ఇండోనేషియా, చైనా, కోస్టా రికాలోని రైతు మద్దతు కేంద్రాలతో సహా స్టార్‌బక్స్ యొక్క ప్రపంచ నెట్‌వర్క్‌తో కలుపుతుంది. ఇది భాగస్వామ్య పరిశోధన, వ్యవసాయ అటవీ అంతర్దృష్టుల ద్వారా ఆవిష్కరణ, వాతావరణ స్థితిస్థాపకత, లాభదాయకతను ప్రోత్సహిస్తుంది. -
ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు
-
నాటు నాటు పొగాకు నాటు
దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో 2025–26 పంట కాలానికి సంబంధించి వర్జీనియా పొగాకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధిక వర్షాలు, మోంథా తుపాను కారణంగా రైతులు ఈ ఏడాది పొగాకు నాట్లు దాదాపు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. తుపాను అనంతరం వాతావరణం అనుకూలించడంతో భూములను దుక్కి చేసి, డ్రిప్ ఏర్పాటు చేసి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం రైతులు అధిక దిగుబడులు వచ్చే ఎల్వీ–7, 1353 వంగడాలను సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు దిగుబడి వస్తాయి. కౌలు, బ్యారన్ అద్దెకు రెక్కలు రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉండటంతో దీని సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా కౌలు రైతులు అధిక ధరకు భూములను కౌలుకు, బ్యారన్లను అద్దెకు తీసుకుని పొగాకు సాగు చేస్తున్నారు. భూములను బట్టి ఎకరం కౌలు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకూ పలుకుతోంది. బ్యారన్ అద్దె రూ.2.50 లక్షలు పలుకుతున్నప్పటికీ రైతులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. బ్యారన్ ఖరీదైతే ఏకంగా రూ.10 లక్షలు పలుకుతోంది. పొగాకు గరిష్ట ధర 2024–25 సీజన్లో కిలోకు ఏకంగా రూ.454 లభించింది. దీంతో భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు రెక్కలొచ్చాయి. పెద్ద రైతులంతా సాగు విస్తీర్ణం తగ్గించుకుని, భూములను కౌలుకు, బ్యారన్లను అద్దెకు ఇస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాది ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) 29,480 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. వచ్చే ఏడాది ఈ విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 9,674 బ్యారన్ల రిజిస్ట్రేషన్ టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 12,723 బ్యారన్లు, 14,254 మంది రైతులు ఉన్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ 8,515 మంది రైతులు 9,674 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 15,170 హెక్టార్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఇప్పటి వరకూ 8138 హెక్టార్లలో నాట్లు వేశారు. డిసెంబర్ మొదటి వారం నాటికి నాట్లు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 61.27 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 84 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది 51.8 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చింది. బిందుసేద్యం సాగునీటి ఎద్దడి, కూలీల సమస్యను అధిగమించడానికి రైతులు బిందుసేద్యం (డ్రిప్) చేపట్టారు. పొగాకు సాగు చేస్తున్న భూముల్లో ముందుగా డ్రిప్ పైపులు ఏర్పాటు చేసి, నాట్లు వేస్తున్నారు. ఎరువులను డ్రిప్ ద్వారా ద్రవ రూపంలో మొక్కలకు అందిస్తున్నారు. దీనివల్ల మొక్కకు ఎరువులు సమానంగా అందుతాయని చెబుతున్నారు. కొంత మంది రైతులు మల్చింగ్ షీట్ ఏర్పాటు చేసి పొగాకు నాట్లు వేస్తున్నారు. దీనివల్ల కలుపును నివారించవచ్చని, మొక్క ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలోని పొగాకు రైతులకు గోపాలపురం మార్కెట్ యార్డులో ఎరువులు అందజేస్తున్నట్టు బోర్డు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. బ్యారన్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్న రైతులు ఎరువులు పొందవచ్చని పేర్కొన్నారు. ఈమేరకు పొగాకు పంటకు అవసరమైన ఎరువులను యార్డులో అధికారులు సిద్ధం చేశారు. డీసీఎంఎస్ ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తున్నారు. యోగ్యమైన భూముల్లోనే సాగు పొగాకు సాగుకు యోగ్యమైన భూముల్లోనే ఈ పంట పండించాలి. బాడవ భూములు, సెలైన్ భూముల్లో పొగాకు సాగు చేసి నష్టపోవద్దు. బోర్డు అనుమతించిన మేరకే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. ప్రపంచ దేశాల్లో పొగాకు సాగు గణనీయంగా పెరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సాగు చేస్తే లాభదాయకమైన ఉత్పత్తి వస్తుంది. ఇక నుంచి బ్యారన్ రిజి్రస్టేషన్ మూడేళ్లకొకసారి జరుగుతుంది. – జీల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
అన్నదాతా ‘దుఃఖీ’భవ!
సాక్షి, అమరావతి: చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం దుఃఖీభవగా మారింది. కర్షకులను చంద్రబాబు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ పథకం ద్వారా రెండేళ్లలో తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పుడిస్తావు అంటూ రైతులు, రైతుసంఘాలు సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. మాయమాటలతో 18 నెలలుగా తమను మోసగిస్తూనే ఉన్నారంటూ మండిపడుతున్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు బృందం గద్దెనెక్కగానే తానిచ్చిన హామిని తుంగలో తొక్కిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి ఏడాది ఏ ఒక్కరికి పైసా కూడా విదల్చకుండా నిస్సిగ్గుగా పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్ ఈ ఏడాది అడ్డగోలుగా కోతలతో మోసగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీకి తూట్లు పొడుస్తూ.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగా ఈ పథకాన్ని కూడా పూర్తిగా ఎగనామం పెట్టింది. రెండో ఏడాది అమలు చేసినా, ఆంక్షల పేరిట కోతలు పెడుతూ ఏకంగా ఏడు లక్షల మందికి ఎగ్గొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ, అమలు తీరుపై వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే ఏస్థాయిలో అన్నదాతలను నిలువునా మోసగిస్తున్నారో ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. 2018–19 మాదిరిగానే మరోసారి అన్నదాత సుఖీభవ పేరిట రైతుల నెత్తిన టోపీ పెడుతోంది. మరొక పక్క రెండేళ్లుగా కౌలు రైతులను ఏ స్థాయిలో మోసగిస్తున్నారో చెప్పడానికి ఈ పథకమే ఉదాహరణగా చెప్పొచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా చూస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినట్లు 53,58,366 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రెండేళ్లలో ప్రతి రైతుకు రూ.40 వేల పెట్టుబడి సాయం చేయాల్సి ఉంది. ఆ మేరకు ఇప్పటి వరకు 21,433.46 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సి ఉంది. రూ.16,748 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో ఇచ్చింది ఎంతో తెలుసా? తొలి విడతలో అన్నదాతల సంఖ్యలో కోతలు వేసి 46,85,838 మంది రైతులకు తొలి విడతగా రూ.5 వేలు, ఇప్పుడు మరో రూ.5 వేలు.. అంటే రూ.10 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చినట్టుగా చెబుతోంది. ఆ మేరకు లెక్కిస్తే రెండు విడతల్లో కలిపి ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్ల మాత్రమే. అంటే రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా రూ.16,748 కోట్లు. పైగా పీఎం కిసాన్ కింద కేంద్రం ఇస్తున్న సాయాన్ని తన ఖాతాలో వేసుకొని రెండు విడతల్లో రూ.14వేల చొప్పున ఇచ్చామని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటోంది. పైగా కౌలు రైతులకు 18 నెలల్లో పైసా కూడా విదిల్చిన పాపాన పోలేదు. ఇలా వాస్తవాలకు ముసుగేసి తామేదో రైతులను ఉద్దరిస్తున్నట్టుగా గొప్పగా ప్రచారం చేసుకోవడం పట్ల మండిపడుతున్నారు. ఎన్నికల్లో హామీ మేరకు రూ.20వేలలో తమకు రావాల్సిన బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం మరొక వైపు ఉచిత పంటల బీమాను సీఎం చంద్రబాబు అటకెక్కించారు. సున్నా వడ్డీ పంట రుణ పథకానికి సున్నా చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ–క్రాప్ విధానాన్ని నిరీ్వర్యం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. ఇలా అన్నదాత సుఖీభవతో మొదలుకొని సున్నా వడ్డీ వరకు రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడిన బాబు ప్రభుత్వం రైతుల పాలిట పెనుశాపంలా మారింది. 18 నెలల్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసినట్లుగానే, రైతులకూ బాబు ప్రభుత్వం దారుణంగా దగా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హామీ కంటే మిన్నగా సహాయంఅధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతీ రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామంటూ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ కంటే మిన్నగా నభూతో న భవిష్యతి అన్నట్టుగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయం అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పైగా పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది నుంచే పెట్టుబడి సాయం పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు ప్రతీ ఏటా మే/జూన్లలో రూ.7,500, రబీ సీజన్‌కు ముందు అక్టోబర్‌లో రూ.4 వేలు, రబీ పంట చేతికొచ్చే సమయంలో జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేసేవారు. వెబ్‌ల్యాండ్ లేని భూయజమానులు, చనిపోయిన రైతుల వారసులతోపాటు అటవీ, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారు,.సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఈ ఐదేళ్లూ జగన్ ప్రభుత్వమే సొంతంగా రూ13,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేసింది. ఇలా 53.58 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378.16 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచింది. -
బీఎన్‌ను ఇట్లా స్మరించుకుందాం!
కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి కార్యాచరణే వారిని ముందు తరాల వారు గుర్తించేలా చేస్తుంది. మరి కొన్నిసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. కొద్ది రోజులుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్) గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే డిమాండే ఈ చర్చకు నేపథ్యం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వెళ్లిన సందర్భంలో వరద కాలువకు ఫలానా నాయకుని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. ఫలానా నాయకుని పేరు పెట్టడం పట్ల అభ్యంతరం లేదు. దానికి ఎవరి పేరు పెడితే సరైందో వారి పేరు పెట్టాలనే సూచన బలంగా వస్తున్నది. 1940లకు పూర్వం నుండే ఈ ప్రాంత చైతన్యానికి బాటలు వేసిన వారిలో బీఎన్ ఒకరు. బీఎన్ సేవలను కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మాత్రమే పరిమితం చేయకూడదు. కాకపోతే సందర్భం అలాంటిది కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తున్నది. వరద కాలువ నీటి కోసం ఆయన నిర్వహించిన సభలు, సమావేశాల గురించి కథనాలు నాటి పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చాయి. బీఎన్ ఇంట ర్వ్యూలు కూడా అందులో ఉన్నాయి. నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడే ఈ ఆందోళనకు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారింది. కానీ అప్పట్లో అధికార, విపక్షాల్లో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకూ అన్ని విషయాలు తెలుసు. చదవండి: Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయంతెలంగాణ రైతాంగ పోరాటాన్ని ‘మట్టి మనుషుల పోరాట’ మని నిర్వచించిందే బీఎన్. తాను భూస్వామి అయినా పేదల పక్షాన్నే నిలబడ్డారు. తన భూములను కూడా పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ జీవితపు సంఘర్షణను అనుభవించి, దాన్ని పారదోలేందుకు కంకణం కట్టుకున్న వారాయన. కాబట్టే అట్టడుగు వర్గాల ప్రజలకు ఆత్మగౌరవం కావాలని పట్టు బట్టారు. రైతుల సాగు ముందుకు సాగాలన్నారు. నీటి వసతి కావాలని డిమాండ్ చేశారు. కార్యాచరణ తీసుకున్నారు. ‘కొట్టిన వారిని, పెట్టిన వారిని మర్చిపోర’ని తెలంగాణలో అందరికీ పరిచయం ఉన్న సామెత. బీఎన్ అశేష తెలంగాణ ప్రజల మేలుకోరారు. మరీ ముఖ్యంగా తాను పుట్టిపెరిగిన నల్లగొండ జిల్లా జనాల, పొలాల దాహార్తి తీర్చాలని తపన పడ్డారు. బీఎన్ ఆనాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి నుండి చివరిదాకా ఆయుధం పట్టి పోరాడిన యోధుడే కాదు... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా చట్టసభలలో అనేక సందర్భాలలో ప్రజా సమస్యలపై పోరాడిన మహాయోధుడు. అలాంటి వారి గురించి పట్టించుకోపోతే ఎట్లా? నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వారిని గుర్తించాలని అడగటమే ఆవేదన కలిగించే విషయం. జన జీవితాలను మారుస్తున్న వరద కాలువకు ఆయన పేరు పెట్టాలనే ఉమ్మడి నల్లగొండ ప్రజల డిమాండ్ సముచితమే! – గోర్ల బుచ్చన్న, జర్నలిస్టు(ఎస్ఆర్ఎస్పీ వరద కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని రేపు జరగనున్న ధర్నా సందర్భంగా) -
కాంటా వేయలే.. కొనలే!
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: ఎక్కడా కాంటా వేయలేదు.. దూది పింజ కూడా ఖరీదు జరగలేదు. ఖమ్మం మార్కెట్ మినహా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు సోమవారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిన్నింగ్ మిల్లులున్న 28 జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రమే 1,095 మంది రైతులు 10,750 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. సోమవారం 52 జిన్నింగ్ మిల్లుల్లో 478 మంది రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి స్లాట్స్ బుక్ చేసుకున్నా.. కొనేవారు కరువయ్యారు. సమాచారం లేకుండా పత్తిని మిల్లులకు తీసుకొచ్చిన రైతులు.. అక్కడి బంద్ బ్యానర్లు, ఫ్లెక్సీలు చూసి వెనుదిరిగారు. కొందరు రైతులు పత్తి కొనాలంటూ రోడ్డెక్కారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు, ఎల్–1, ఎల్–2 అంటూ కేటగిరీల వారీగా జిన్నింగ్ మిల్లుల విభజనను రద్దు చేయాలని రాష్ట్ర కాటన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ట్రేడర్లు డిమాండ్ చేస్తున్నారు. సీసీఐ నిబంధనలను సడలించి నోటిఫై చేసిన అన్ని మిల్లుల్లో కొనేలా నిర్ణయం తీసుకునే వరకు బంద్ చేపడతామని జిన్నర్లు సోమవారం కూడా పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు గాడిన పడతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్ సాగు కోసం సన్నద్ధమవుతున్న రైతులు పత్తి అమ్ముకుని అప్పులు కట్టుకోవడమో.. పెట్టుబడులకు ఉపయోగించుకోవడమో చేద్దామనుకుంటే నిలిచిపోయిన కొనుగోళ్లు ప్రతికూలంగా మారాయి. అసలే అంతంత దిగుబడి.. ఆపై బంద్ పిడుగు ఏటా ఎకరానికి సుమారు 10–15 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేది. ఈసారి సాగు లెక్కల్ని బట్టి 4.90 కోట్ల నుంచి 7.34 కోట్ల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని భావించారు. అయితే అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. తెగుళ్లు సోకి దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు అంటున్నారు. ఇదైనా అమ్ముకుందామంటే కొద్దిరోజులు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110లుగా నిర్ణయించి.. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 ఇచ్చారని రైతులు వాపోతున్నారు. పోనీ.. పెట్టుబడులకన్న అయితయి అమ్ముదామని చూస్తే ఇప్పుడు కొనుగోళ్లు బంద్ కావడంతో రైతుల వెన్ను విరిగినట్టయింది. సీసీఐ కొన్నది 5.69 లక్షల క్వింటాళ్లే... వరంగల్ ఏనుమాముల మార్కెట్లో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 1,60,644 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో సీసీఐ 39,182 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిందంతా ప్రైవేటు వ్యాపారులు కొన్నారు. వరంగల్ రీజియన్ పరిధి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని 214 జిన్నింగ్ మిల్లులు నోటిఫై కాగా, 155 మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 5,68,960 క్వింటాళ్ల పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ఇక అమ్ముకోవడానికి పత్తిని తీసుకొచ్చిన రైతులు.. బంద్‌తో ఇబ్బంది పడ్డారు. నారాయణపేట జిల్లా వడ్వాట్తో పాటు పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మంత్రులు మాట్లాడినా మిల్లర్లు ససేమిరా బంద్ పిలుపు నేపథ్యంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిన్నింగ్ మిల్లుల యజమానులతో మాట్లాడారు. పత్తి కొనుగోళ్లు కొనసాగించాలని జిన్నింగ్ మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే, తమ డిమాండ్‌ను పరిష్కరించే వరకు పత్తి కొనుగోళ్లు జరిపేది లేదని మిల్లర్లు తేల్చిచెప్పారు. వీరి డిమాండ్లకు సంబంధించి సోమవారం రాత్రి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో సీసీఐ సీఎండీ లలిత్కుమార్గుప్తా మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. సీసీఐ.. మిల్లర్లను నయానో, భయానో ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని జౌళిశాఖ వర్గాలు తెలిపాయి. పత్తితో పాటు మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లకు సంబంధించి నెలకొన్న సమస్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సీసీఐ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. నిబంధనలు సడలించాలి ⇒ బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో సీసీఐ నోటిఫై చేసిన 322 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టాలి. నిబంధనల పేరుతో మొండి వైఖరిని విడనాడి రైతుల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్ని మిల్లుల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
‘అన్నదాతా’.. మళ్లీ కోత!
సాక్షి, అమరావతి: అన్నదాతా సుఖీభవ పథకం కింద తొలి ఏడాది రూ.10,716 కోట్ల పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు రెండో ఏడాదిలోనూ మరోసారి రైతన్నలను వంచిస్తోంది. ఓవైపు భూ యజమానులకు అడ్డగోలుగా కోతలు పెడుతూ మరోవైపు కౌలు రైతులకు మొండిచెయ్యి చూపుతోంది. సూపర్ సిక్స్ హామీ మేరకు ఈ పథకం కింద పీఎం కిసాన్తో సంబంధం లేకుండా, ఏటా ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు నమ్మబలికారు. ఆ లెక్కన అర్హులైన 53.58 లక్షల మందికి రూ.10,716 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎగ్గొట్టింది. సామాజిక వర్గాలకు అతీతంగా భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీని అటకెక్కించింది. బకాయిలతో కలిపి అన్నదాతా సుఖీభవకు ఈ ఏడాది రూ.21,432 కోట్లు జమ చేయాలి. కానీ కేవలం రూ.4,685.84 కోట్లు మాత్రమే విదిల్చింది. 2024–25 ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రెండు నెలలు తర్వాత పీఎం కిసాన్తో ముడిపెట్టి తొలివిడత సాయం అంటూ మభ్యపుచ్చారు. వాస్తవానికి 53.58 లక్షల మందికి జమ చేయాల్సి ఉండగా చివరికి 46.86 లక్షల మందికి సరిపెట్టారు. దాదాపు ఏడు లక్షల మందికి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారు. తొలి ఏడాది సీసీఆర్సీ కార్డులు పొందిన 9.25 లక్షల మంది కౌలు దారులకు సైతం మొండిచెయ్యి చూపారు. రెండో విడతలోనూ కోతలే లక్ష్యంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2023–24 సీజన్లో 53.58 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇలా ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఆరు దశల వడపోతల అనంతరం అన్నదాతా సుఖీభవ తొలిదశ లబ్ధిదారులను 46.86 లక్షలకు కుదించింది. చనిపోయిన రైతుల స్థానంలో అర్హులైన వారి వారసులను మ్యుటేషన్ ద్వారా గుర్తించి గత ప్రభుత్వంలో పెట్టుబడి సాయం అందించగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు దీనికి మోకాలడ్డుతోంది. వాస్తవానికి ఏటా భూ యజమానులతో పాటు కౌలుదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గతంతో పోలిస్తే భూ యజమానుల సంఖ్య పెరగాల్సి ఉండగా ఇప్పుడు రెండో విడతలో 46,85,838 మంది మాత్రమే అన్నదాతా సుఖీభవకు అర్హత పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోతలే కోతలు.. తొలి విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.2,342.92 కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు రెండో విడతలో 46.85 లక్షల మందికి రూ.2,342.92 కోట్లు జమ చేయనుంది. ప్రభుత్వం సాయం అందించే మొత్తం పెరగాల్సింది పోయి లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధించడం పట్ల అన్నదాతల్లో తీవ్ర నిరాశ అలుముకుంది. కౌలు రైతులకు మళ్లీ నిరాశే.. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులందరికీ అన్నదాతా సుఖీభవ సాయాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా ఈ క్రాప్ అంటూ మెలిక పెట్టారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. వారిలో సెంటు భూమి కూడా లేని సాగుదారులు 10 లక్షల మందికి పైనే ఉన్నారు. గతేడాది 9.25 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేసినా పెట్టుబడి సాయం అందించిన పాపాన పోలేదు. ఈ ఏడాది 10 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 7.92 లక్షల మందికి కార్డులు జారీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు. తొలి ఏడాది సీసీఆర్సీ కార్డులు పొందిన వారిని పరిగణలోకి తీసుకున్నా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1,850 కోట్లు జమ చేయాల్సి ఉండగా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు సీసీఆర్సీలు పొందిన వారితోపాటు ఈ క్రాప్‌లో నమోదైన వాస్తవ సాగుదారులను లెక్కలోకి తీసుకుంటే కనీసం 10 లక్షల మందికిపైగా కౌలుదారులకు రూ.రెండు వేల కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించాలి. కౌలు రైతులకు రెండోసారి కూడా మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవడం పట్ల కౌలు రైతుల సంఘాలు మండిపడుతున్నాయి. -
పత్తి రైతు ‘ఫైర్’
ప్రత్తిపాడు: మోంథా తుపాను పత్తి రైతును ఆగమాగం చేసేసింది. పైకి పైరు పచ్చగా కళకళలాడుతున్నట్లు కనిపిస్తున్నా, భూమి లోపల మొక్కల వేర్లు కుళ్లి పోవడంతో క్రమేపీ మొక్క నశించిపోతోంది. అయినా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. కడుపు మండిన కర్షకుడు సాగు చేసిన పత్తి పైరును పీకేసి నిప్పు పెడుతున్నాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన కమ్మ సురేష్ బాబు ఏడు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తుపాను తరువాత వేర్లు కుళ్లిపోయి పంట కృశించిపోయింది.పత్తి తీతలు తీస్తే ఎకరాకు 50 నుంచి 60 కిలోలు మాత్రమే వచ్చింది. దీంతో ఇక లాభం లేదనుకున్న రైతు సోమవారం కూలీలను పెట్టి పత్తి మొక్కలను పీకేశాడు. వాటిని కుప్పలుగా పోసి పొలంలోనే నిప్పుపెట్టాడు. తానూ టీడీపీ మనిషినేనని, 30 ఏళ్లుగా సభ్యత్వం ఉందని, అయినా చంద్రబాబు సర్కారు పంట నష్టపరిహారం అందించడం లేదని విమర్శించాడు.ఏ అధికారీ పొలాన్ని పరిశీలించలేదని, పరిహారం ఇస్తున్నామంటూ టీవీల్లో ఘనంగా చెప్పుకుంటున్న సర్కారు పొలంలోనే తగలబడిపోతున్న ఈ పత్తి పంటకు ఏం సమాధానం చెబుతుందని నిలదీశాడు. కనీసం సగం రాయితీపైన అయినా విత్తనాలను అందించాలని డిమాండ్ చేశాడు. తమ గ్రామంలో అందరూ దాదాపుగా పంటను పీకేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పత్తిపైరును పీకేసి పొలంలోనే నిప్పుపెట్టిన దృశ్యం(ఇన్సెట్) రైతు సురేష్‌బాబు -
అనంతపురం జిల్లాలో అరటి రైతుల ఆక్రందన
-
తేమ.. 7 క్వింటాళ్లు.. కపాస్ యాప్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఆయా మిల్లుల్లో 724 మంది నుంచి 13,613 క్వింటాళ్ల పత్తి సేకరించాయి. కానీ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ వ్యాపారులు ఇదే సమయంలో ఏకంగా 1,23,776 క్వింటాళ్ల మేర పత్తి కొనడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పత్తి పంటను తేమ శాతం ఆధారంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొర్రీలతో రైతులను ఇబ్బంది పెడుతోంది. పత్తి చేతికొచ్చే వేళ వర్షాలతో దిగుబడి తగ్గగా.. వచి్చన పత్తి సైతం రంగు మారింది. దీంతో ఇటు ప్రైవేట్, అటు సీసీఐ కేంద్రాలకు వెళ్లినా మద్దతు ధర లభించట్లేదు. తేమ శాతం 12 నుంచి మరింత పెంచాలన్న రైతుల డిమాండ్‌ను సీసీఐ పెడచెవిన పెట్టడం, కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి కావడం రైతులపాలిట శాపంగా మారింది. దీనికితోడు గతంలో ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్లకే కొనుగోళ్లను పరిమితం చేయడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. తేమ శాతం పేరుతో.. మొదటి తీత పత్తిని రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించగా తేమ శాతం, ఇతర సాకులతో తక్కువ ధరే చెల్లించారు. ఆపై క్వింటాకు రూ. 8,110 మద్దతు ధరతో సీసీఐ రాష్ట్రంలో అక్టోబర్ 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఇప్పటివరకు 188 కేంద్రాలు ప్రారంభమవగా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తేమ 8 శాతం నుంచి 12 శాతం లోపు ఉంటేనే కొంటామని సీసీఐ చెబుతోంది. ఈ కారణంగా కొందరికే అవకాశం లభిస్తుండగా రవాణా ఖర్చులు భరించి జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకెళ్లిన వారు అక్కడే ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. తుపాను ప్రభావం, చలికాలం వల్ల 15–20 శాతం తేమ ఉన్నా కొనాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. గుదిబండలా యాప్.. సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించాలనుకునే రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయమై విస్తృత ప్రచారం లేక నేరుగా వెళ్లి అవస్థలు పడుతున్నారు. అలాగే రైతు ఫోన్ నంబర్ మారినా, భూ భారతిలో వివరాలు లేకపోయినా తిరస్కరిస్తుండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడలో గత నెల 22న కొనుగోళ్లు మొదలవగా ఇప్పటివరకు కేవలం 650 క్వింటాళ్లే సేకరించారు. తేమ 12 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో నిరాకరిస్తుండగా రైతులు తిరిగి తీసుకెళ్లలేక తల్లాడలోనే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు క్వింటాకు రూ. రూ. 2 వేల వరకు తగ్గిస్తున్నారు.తేమ ఉందని కొనుగోలు చేయలే.. ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. తల్లాడ సీసీఐ కేంద్రంలో తేమ ఎక్కువగా ఉందని కొనలేమన్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారు. ప్రభుత్వం 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. – బుర్రె రామారావు, అంజనాపురం, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లాబస్తా పత్తికి చూడరట.. నాలుగెకరాల్లో కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తే 35 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. కానీ సీసీఐలో ఎకరాకు ఏడు చొప్పున 28 క్వింటాళ్లే కొంటామన్నారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు సీసీఐ కేంద్రానికి బస్తా పత్తి తీసుకొస్తే తేమ చూడకుండా మొత్తం తేవాలన్నారు. తీరా తెచ్చాక తేమ ఎక్కువుందని తిరస్కరిస్తే రవాణా ఖర్చు భారం పడుతుంది. – ఎస్.కే.చాంద్, వెంకటాపురం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా -
Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన
-
రైతన్నకు చేదోడుగా మార్కెట్లోకి ఏఐ టూల్
భారతదేశంలో వ్యవసాయ రంగం అనిశ్చితి, వాతావరణ మార్పులు, సరైన సమాచార లేమి వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కోసం అగ్రిటెక్ ప్లాట్‌ఫామ్ ‘ఆర్య.ఏజీ’(Arya.ag)ను ఓ ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది. ఈ సెంటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా టెక్నాలజీల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ నిర్ణయాలను మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది.ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ ఫీచర్లుఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ కేవలం ఒక టూల్‌గానే కాకుండా వ్యవసాయానికి సంబంధించిన పూర్తి పరిష్కారాలను అందించే ఒక లోకల్ హబ్‌గా పనిచేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఐఓటీ ఆధారిత మట్టి విశ్లేషణనియోపర్క్ సెన్సార్ల వంటి సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల సాంప్రదాయ ల్యాబ్ పరీక్షల కంటే తక్కువ సమయంలోనే భూసార స్థితి, పోషకాల లభ్యత గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది.వాతావరణ అంచనాలువ్యవసాయ క్షేత్రానికి అతి దగ్గరగా ఉన్న వాతావరణ పరిస్థితులపై ఆన్లైన్లో సమగ్ర సమాచారాన్ని అందిస్తారు. దీనివల్ల రైతులు విత్తనాలు నాటడం, నీటి పారుదల, ఎరువుల వినియోగం, పంట కోత వంటి కీలక నిర్ణయాలను సకాలంలో తీసుకోగలుగుతారు.డ్రోన్ ఆధారిత పంట పరిశీలనడ్రోన్ ఇమేజింగ్, శాటిలైట్ మ్యాపింగ్ టెక్నాలజీలను ఉపయోగించి పంట ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తారు. పంటల్లో చీడపీడల దాడిని, వ్యాధులను త్వరగా గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలను సిఫార్సు చేస్తారు.రైతులకు మేలు చేస్తుందిలా..ఆర్య.ఏజీ స్మార్ట్ ఫామ్ సెంటర్స్ సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకురావడం ద్వారా రైతులకు అనేక విధాలుగా మేలు చేస్తున్నాయి. సరైన సమయంలో, సరైన పరిమాణంలో వ్యవసాయం సాగేందుకు ఇది తోడ్పడుతుంది. ఉదాహరణకు, మట్టి విశ్లేషణ ద్వారా ఎంత ఎరువు వాడాలి.. వాతావరణ అంచనా ద్వారా ఎప్పుడు విత్తనం వేయాలి లేదా ఎప్పుడు పంట కోయాలి అనే విషయాలపై కచ్చితమైన సమాచారం లభిస్తుంది.చీడపీడల తక్షణ గుర్తింపు (డ్రోన్ ఇమేజింగ్ ద్వారా) వల్ల త్వరగా నివారణ చర్యలు తీసుకునే వీలుంటుంది.సకాలంలో వాతావరణ హెచ్చరికలు అందుకోవడం వల్ల రైతులు పంట నిర్ణయం తీసుకుంటారు.అనవసరమైన లేదా అధిక ఎరువుల వాడకం, నీటి పారుదల వంటి వాటిని డేటా ఆధారంగా తగ్గించడం వల్ల రైతులకు ఉత్పాదక వ్యయం తగ్గుతుంది.ఈ కేంద్రాలు ఆర్య.ఏజీ నిల్వ, మార్కెట్ లింకేజీలు, ఫైనాన్స్ సేవలతో అనుసంధానించబడి ఉండడం వల్ల, రైతులకు మెరుగైన ధర లభిస్తుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల టోల్ పాలసీలో మార్పులు? -
అంత నష్టం లేదట!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్టుగానే చేశారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపలేదు. నిబంధనలను పక్కన పెట్టి పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఉదారంగా ఆదుకోవల్సిన ప్రభుత్వం వారి నోట్లో మట్టికొట్టేందుకు ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు)ను మమ అనిపించింది. రైతులను ఆదుకునేందుకు పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయాలని యంత్రాంగం ఎంతగా శ్రమించినా, పచ్చ నేతల కనుసన్నల్లోనే తుది జాబితాలు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యçస్తంగా సాగింది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ ఒక్క రోజు ముందు అంటే 30వ తేదీన సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. తుది అంచనాల తయారీకి కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గడువు పెంచాలని రైతులు, రైతు సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రభుత్వం గడువు పెంచుతున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం అంచనాల పరిశీలన, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునః పరిశీలన, తుది జాబితాల తయారీ అంతా సమాంతరంగా జరిగిపోతుందంటూ బిల్డప్ ఇచ్చారు. దీంతో తుది అంచనాల తయారీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే, స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకు తయారవుతున్నాయన్న విమర్శలు విన్పించాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అంచనాలు కుదించి.. మోంథా తుపాను ప్రభావం 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగైన పంటలపై తీవ్రంగా ఉంటుందని తొలుత ప్రభుత్వమే అధికారికంగా అంచనా వేసింది. అయితే తుపాను ఆగిపోయిన మర్నాడు నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్య 3.45 లక్షల ఎకరాలే అంటూ చెప్పుకొచ్చింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరకు తుది అంచనాలు కొలిక్కి వచ్చే సమయానికి 4.17 లక్షల ఎకరాలుగా నిర్ధారించింది. దాంట్లో 4.11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 16 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చారు. క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఆరు నుంచి 8 లక్షల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లగా, తుది అంచనాల్లో మాత్రం కేవలం 3.25 లక్షల ఎకరాల్లోనే వరి పంట దెబ్బ తిన్నట్టుగా నిర్ధారించింది. దాదాపు 50 వేల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైనట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం 9,700 ఎకరాల్లోనే నష్టం వాటిల్లినట్టు తేల్చింది. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము, సజ్జ, కందితో సహా ఇతర పంటల నష్టాన్ని కేవలం 90 వేల ఎకరాలకు పరిమితం చేసింది. ప్రధానంగా ఐదారు లక్షల ఎకరాల్లో వరి పంట నేలకొరిగి పూర్తిగా దెబ్బతినగా, మరో రెండు లక్షల ఎకరాల వరకు పంట నిలబడినప్పటికీ సుంకు (పుప్పొడి) విరిగి ఫలదీకరణ చెందక తాలు గింజలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో ఎకరాకు 20–25 బస్తాలకు మించి దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు ర్యాండమ్ చెక్ చేస్తూ మండలానికి ఒకటి రెండు గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి అధికారులు ఎన్యుమరేషన్‌ను మమ అనిపించారు. సుంకు విరిగిపోవడం వల్ల దెబ్బతిన్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమకు చెందిన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీగా రూ.875 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని లెక్క తేల్చారు. అక్టోబర్ 31 లోపు పంట నష్టం వివరాలను తెలపాలంటూ రైతులకు ప్రభుత్వం పంపిన మెసేజ్ చనిపోయింది 2,279 పశువులు,జీవాలేనట!మోంథా తుపాను వల్ల క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఐదారు వేల జీవాలు మృత్యువాత పడినట్టుగా రైతులు చెబుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 94 ఆవులు, గేదెలు, 393 మేకలు, గొర్రెలు, 17 ఎద్దులు, దున్నలు, 82 దూడలు, 1,693 కోళ్లు మృత్యువాత పడినట్టుగా ప్రకటించారు. 155 పశువుల షెడ్లు నేల కూలినట్టుగా నిర్ధారించారు. తొలుత వీటికి రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేయగా, చివరికి రూ.1.05 కోట్లకు పరిమితం చేశారు. ఆక్వా రంగానికి తొలుత రూ.514 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా ప్రకటించిన ప్రభుత్వం, తుది అంచనాలకొచ్చేసరికి కేవలం 33.23 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆక్వా రైతులు మండిపడుతున్నారు. తొలుత 50 వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్నట్టుగా చెప్పుకొచ్చిన ప్రభుత్వం చివరికి 5 వేల ఎకరాలకు పరిమితం చేసింది. తొలుత 10 వేల మంది ఆక్వా రైతులకు నష్టం వాటిల్లినట్టు చెప్పగా, చివరికి 2,541 మంది రైతులకు చెందిన ఆక్వా చెరువుల్లో ఇసుక మేటలు వేయడం, పూర్తిగా దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. మత్స్యశాఖకు సంబంధించి 9 మోటరైజ్డ్ బోట్లు పూర్తిగా, మరో 304 బోట్లు పాక్షికంగా, 41 నాన్ మోటరైజ్డ్ బోట్లు, సంప్రదాయ బోట్లు మరో 18 పూర్తిగా దెబ్బ తిన్నాయని, అలాగే 121 వలలు పూర్తిగా, మరో 241 వలలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. తుపాను వల్ల దాదాపు 20 రోజులుగా వేట లేక పస్తులతో గడిపిన మత్స్యకారులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి, వారికి బోట్లు, వలలకు కేవలం రూ.1.06 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. ఇలా అన్ని విధాలుగా కోతలు వేస్తూ తుది అంచనాలను కుదించేశారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర బృందం ముందు ఈ నివేదికలు ఉంచేందుకు సన్నద్ధం చేస్తున్నారు. -
రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు: కైలే
సాక్షి, తాడేపల్లి: రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్ట పోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుపానును కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. నష్టపోయిన రైతులను మాత్రం కనీసంగా కూడా పట్టించుకోలేదంటూ ఆయన నిలదీశారు.‘‘పంట నష్టం అంచనాలలో కూడా రైతులను దగా చేస్తున్నారు. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒకే ఒక్క రోజులో పంట నష్టం అంచనాలను ఎలా వేస్తారు?. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు ధైర్యంగా ఉండేవారు. ఏ విపత్తు వచ్చినా అందుకునేందుకు జగన్ ఉన్నాడనే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం ధాన్యం పండించడం అనవసరమని మాట్లాడారు. కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఈ ప్రభుత్వంలో అసలు యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది...పంట నష్టం జరిగితే ఆ వివరాలు తెలుసుకునే పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు. అసలు ఈ ప్రభుత్వానికి రైతు అంటే చిన్నచూపు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాల్సిందే. అంచనాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తే సహించం. వెంటనే ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలి. రబీ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయాన్ని అందించాలి. జగన్‌ని చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు...ఇదేమని ప్రశ్నిస్తే సీఐ నన్ను దుర్భాషలాడారు. పైగా కేసు నమోదు చేశారు. పోలీసులంటే గౌరవం ఉంది. కానీ అన్యాయంగా కేసులు పెట్టటం బాగోలేదు. దీనిపై మాట్లాడటానికి ఎస్పీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా మీద కేసులు పెట్టటం కాదు, గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులు అరిట్టండి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకోండి. పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియాని అరికడితే సంతోషిస్తాం’’ అని కైలే అనిల్‌కుమార్ పేర్కొన్నారు. -
కాళ్లావేళ్లా పడ్డ కనికరించలేదు ... YSRCP మద్దతుదారులపై టీడీపీ నేతల కక్షసాధింపు
-
Botsa: మోంథా తుఫాన్ తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
-
మెడికల్ కాలేజీలో పరికరాలు తరలింపు YS అవినాష్ రెడ్డి సీరియస్ వార్నింగ్
-
అన్నదాతకి వెన్నుపోటు
-
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్‌సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్‌ఫెడ్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్‌తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్‌లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్‌ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్‌ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్‌లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
ఎవరూ వచ్చి చూసింది లేదు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్వర్క్: ‘తుపాను వల్ల దెబ్బతిన్న మా పంటలను చూడటానికి రావాలని కోరినా.. ఎవరూ రావట్లేదు. ఇప్పుడు దెబ్బతిన్న పంటలను జాబితాలో రాసుకుంటే.. రేపు ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. బయట వ్యాపారులకు అమ్ముకోమంటున్నారు. గత 17 నెలల కాలంలో ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ వేసింది లేదు. తాలు ధాన్యంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన రోడ్ షోలా సాగిందే గానీ రైతులకు ఒనగూడింది ఏమీ లేదు..’ అంటూ అన్నదాతలు నిర్వేదం వ్యక్తం చేశారు. రైతుకు కష్టమొచ్చినపుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే.. వ్యాపారులు పట్టించుకుంటారా? అని ఆక్రోశించారు. వైఎస్ జగన్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి, విపత్తులతో పంటలు దెబ్బతిన్న ప్రతిసారి సహాయం అందించిందని.. ఇప్పుడు కూటమి సర్కారు రైతులనే కట్టుకోమంటోందని, వంద మంది రైతుల్లో ఎనిమిది మంది కూడా ఇన్సూరెన్స్ కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకున్న వారే లేరని, మీరే యాత్రల ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తుపాన్ బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెడన నియోజకవర్గం రామరాజుపాలెం, ఆకుమర్రు లాకుల వద్ద రైతులతో మాట్లాడారు. పంట పొలాల్లోకి దిగి స్వయంగా నష్టాన్ని పరిశీలించి వారిని ఓదార్చారు. రైతు పరసా వెంకటేశ్వరరావుతో వైఎస్ జగన్ రైతు: నమస్తే సార్... నాకు మూడు ఎకరాలుంది వైఎస్ జగన్: మూడు ఎకరాల పరిస్థితి ఏమిటి? రైతు: ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టా... యూరియా అందలా వైఎస్ జగన్: యూరియా బ్లాక్‌లో కొనుక్కోవాల్సి వచ్చింది! రైతు: ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు... వైఎస్ జగన్: ఇన్పుట్ సబ్సిడీ రావటం లేదు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చాక ఇన్సూరెన్సు ఇచ్చిందీ లేదు. రైతు: చేను పడిపోతే వచ్చి చూసిన అధికారి లేడు వైఎస్ జగన్: చేను పడిపోయినా ఏ ఒక్క అధికారీ వచ్చి చూడలేదు. పొలంలోకి వచ్చి చూసింది లేదు. రైతులు: లోపలకు అయితే అనుకోవచ్చు... రోడ్డు పక్కనే ఉన్నా వచ్చి రాసింది లేదు.రామరాజుపాలెంలో వరి పొలంలో దిగి రైతులకు వైఎస్ జగన్ ఓదార్పు..వైఎస్ జగన్: పంట నష్టం నమోదు చేశారా? రైతు ఓడుబోయిన బ్రహ్మకృష్ణ: రాయలేదు సార్.. వైఎస్ జగన్: సుంకు విరిగి పోయింది. దాని వల్ల పాలు పోసుకునే పరిస్థితి లేదని చెప్పినా కూడా రాయలేదా..? రైతు: రాయలేదు సార్...! నాకు మీ ప్రభుత్వంలో 3.18 ఎకరాలకు రూ.66,780 డబ్బులు పడ్డాయి వైఎస్ జగన్: మన ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండటం వల్ల మీకు రూ.66,780 పడ్డాయి. ఈ రోజు కనీసం పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసేవాడు లేడు. ఎన్యూమరేషన్ అనేది జరగలేదు. సుంకు పోయిందని చెప్పినా కూడా ఎవరూ రాలేదా? రైతు: రాలేదు సార్... వైఎస్ జగన్: ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారంటే.. సుంకు ఉందా లేదా? ఇవన్నీ చూడటానికే..! సుంకు పోయింది కాబట్టి దిగుబడి రాదు. అందుకు ఎన్యూమరేషన్ చేయాలి. రైతు: ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి అయింది సార్...యూరియా బస్తా బ్లాక్‌లో రూ.500 పెట్టి కొన్నా. మీ ప్రభుత్వంలో రూ.270కి ఎక్కడ పడితే అక్కడ యూరియా కట్టలు దొరికాయి సార్. వైఎస్ జగన్: రూ.260...270 పెట్టి కొనాల్సింది... రూ.500 పెట్టి కొనుక్కున్నారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున అన్నదాతా సుఖీభవ ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారు? రెండేళ్లకు రూ.40 వేలకు ఎంత వచ్చింది? రైతు: రూ.5 వేలు ఇచ్చారు సార్. వైఎస్ జగన్: రూ.40 వేలు అని చెప్పి.. రూ.5 వేలు ఇచ్చారు. ఈ 18 నెలలు కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా ఇచ్చారా..? ఒక్కసారైనా వచ్చిందా? రైతులు: ఏమీ రాలేదు సార్. వైఎస్ జగన్: ఒక్కసారి కూడా రాలా..? ఈ క్రాప్ కూడా చేయడం లేదు! రైతు: నిరుడు కూడా మునిగిపోతే పట్టించుకోలేదు. వైఎస్ జగన్: లాస్ట్ టైం పోయినా కూడా పట్టించుకోలేదు... ఇప్పుడు కూడా పట్టించుకోలేదు...! ఇది వరుసగా రెండోసారి...! ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడు లేడు. మన ప్రభుత్వంలో సమయానికి రైతు భరోసా వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. యూరియా బస్తా కూడా తక్కువ రేటుకే ఆర్బీకేల ద్వారా రూ.270కే ఇచ్చాం. రైతు: మీ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్... వైఎస్ జగన్: ఈ ప్రభుత్వంలో కౌలు కార్డు ఇవ్వలేదా...? రైతులు: లేదు సార్.లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా...!మచిలీపట్నంటౌన్: ‘నువ్వు లేని లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా..! నిన్ను కోల్పోయి ఎంతో తప్పు చేశాం. ఈసారికి మన్నించయ్యా..’ అంటూ కృష్ణా జిల్లా గూడూరు మండలం రామరాజుపాలేనికి చెందిన రైతు సాయిబాబు వైఎస్ జగన్ ఎదుట ఆక్రోశించాడు. ‘మీరు సీఎంగా ఉన్న సమయంలో రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగించారు. ప్రస్తుతం ఆ తేడా మాకు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు. తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని, వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద రూ.72 వేలు అందాయని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు చెబుతున్నారని, ఇదెక్కడి అన్యాయమో తమకు అర్ధం కావటం లేదని వాపోయాడు. ఆకుమర్రు లాకు సమీపాన నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు సాయిబాబు, గణేశన రమేష్ బాబు, దేసు ప్రసాద్‌తో వైఎస్ జగన్ మాట్లాడారు. జగన్: తుపాన్ తర్వాత ఎవరైనా అధికారి వచ్చారా? రైతు సాయిబాబు: రాలేదన్నా.. జగన్: మనిషి వచ్చి చూసి రాసుకోవడం ఇంపార్టెంట్.. సుంకు ఉందా? పాలు పోసుకుంటుందా.. లేదా? అన్నది అప్పుడే తెలుస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అడిగితే.. పంటలు కొనుగోలు చేయబోమని చెప్పారా? రైతులు: రైతుకు పంట నష్ట పరిహారం ఇస్తే.. ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. జగన్: చంద్రబాబు వచ్చి రెండు సంవత్సరాలు..! రెండు సీజన్లు అయిపోయాయి.. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఏరోజూ రాలేదు. పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తామన్నారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ. 40 వేలు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు? రైతులు: రూ.5,000 ఇచ్చారు. జగన్: మిగిలిందంతా ఎగరగొట్టారు. అన్నదాతా సుఖీభవ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఎరువుల రేటు ఎలా ఉంది? రైతులు: యూరియా బ్లాక్‌లో అమ్మారు. జగన్: యూరియా ఎంతకు కొన్నారు? రైతు సాయిబాబు: మూడు రోజులు తపస్సు చేసి యూరియా కట్ట రూ.1200కు కొన్నాం అన్నా..! రైతు రమేష్ బాబు: యావరేజ్ మీద రూ.650, రూ.700కి కొన్నాం. జగన్: రూ.260 ఖరీదు చేసే కట్టను.. రూ.600 – రూ.700 దాకా కొనాల్సి వచ్చింది. పంటలకు కనీసం గిట్టుబాటు ధరైనా వస్తోందా? రైతులు: అదీ లేదన్నా..! జగన్: గత సంవత్సరం బస్తా ఎంతకు అమ్మారు? రైతులు: సార్వాలో బస్తా వడ్లు రూ1250 – రూ.1300కి అమ్మేమన్నా..! జగన్: రూ.1750కి అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.1300కి అమ్మారు.. రైతు సాయిబాబు: ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లా.. తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఉందని కటింగ్‌లు చేసుకుంటూ పోయి మా చేతికి రూ.1,300 ఇచ్చారు. జగన్: ఎకరాకు పెట్టుబడి ఎంత పెట్టారు? రైతులు: ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెట్టాం. జగన్: ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చేలా ఉంది? రైతులు: పది బస్తాలు కూడా వస్తాయో లేదోనయ్యా..! కంకిలో 25 శాతం గింజలు కూడా వచ్చేలా లేవు. జగన్: వారు (ప్రభుత్వం) చేసిన సాయం ఏమీ లేదు.. కనీసం తుపాన్ వచి్చన రోజైనా ఆదుకుందా? రైతులు: సర్పంచ్ మమ్మల్ని తీసుకెళ్లి భోజనాలు పెట్టారు. జగన్: మన ప్రెసిడెంట్ రాజు పెట్టించారు.. వాళ్లేమీ పెట్టలేదుగా! రైతు సాయిబాబు: మమ్మల్ని ఆదుకునే వారు లేరు. ఎరువులు బ్లాక్‌లో కొన్నాం. గత ఐదు సంవత్సరాల్లో పంటల బీమా మీరు ఎలా చేశారో కూడా మాకు తెలియదు. మాది రూపాయి ఖర్చు లేదు. నాకు సబ్సిడీ పడింది. మొత్తం రూ.72 వేలు వచ్చాయి. ఇవాళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలేదు. కడదాం అని వెళితే టైం అయిపోయిందన్నారు. రైతు రమేష్ బాబు: మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలనే మాట కూడా మర్చిపోయాం సార్..జగన్: మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సమయానికి వచ్చేది. పెట్టుబడికి రైతు భరోసా ఇచ్చేవాళ్లం. రైతు రమేష్ బాబు: ఇవాళ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. రైతు సాయిబాబు: మీరున్న ఐదు సంవత్సరాలు ధైర్యంగా వడ్లు అమ్ముకున్నాం. మిల్లర్ల వద్దకు తీసుకువెళ్లి అమ్మాం. రైతు రమేష్ బాబు: ఇప్పుడు వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు -
YS Jagan: పంట పొలాల పరిశీలన (ఫొటోలు)
-
వైఎస్ జగన్‌ను చూడగానే ఆత్మకూరు రైతుల ఆవేదన..
-
Farmers: రామరాజుపాలెంలో YS జగన్ మీరే ఆదుకోవాలి..
-
Gudur Farmers: పంట పొలాల్లో రైతులతో YS జగన్
-
గూడూరు రెతులను పరామర్శించిన వైఎస్ జగన్
-
పంట ‘కోత’లు!
అర ఎకరా పొలంలో వరి సాగు చేశా. ఈసారి పంట బాగా పండడంతో సంతోషపడ్డాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పొలాన్ని చూస్తే ఏడుపొస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోతే రూ.18 వేల వరకు పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంట. పరిహారం వస్తుందో, లేదో తెలియట్లేదు. వైఎస్ జగన్ సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటే.. ఈ ప్రభుత్వం రైతుల్ని అసలు పట్టించుకోవడం లేదు. – డి.గురుమూర్తి, గిరిజన రైతు, కొత్తవలస, అల్లూరి సీతారామరాజు జిల్లాపరిహారం ఇస్తారో.. లేదో!పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే..! ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బసిరెడ్డి జగన్మోహన్రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు స్వగ్రామం. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చి సొంత పొలం 30 ఎకరాలు, కౌలుకు మరో 30 ఎకరాలు సాగు చేశాడు. పొగాకు 15 ఎకరాలు, కంది 30 ఎకరాలు, బొబ్బర్లు 12 ఎకరాలు, వరి 3 ఎకరాల్లో సాగు చేశాడు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలంలో నీరు నిలిచి ఆశలు నీటి పాలయ్యాయి. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పంట నష్ట పరిహారం కింద ఆ కుటుంబానికి దాదాపు రూ.7 లక్షలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో సమయానికి డబ్బులు లేక పంటల బీమా చేయలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతు పూర్తిగా నష్టపోయారు. సాక్షి, అమరావతి: ఈ–క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కారు నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ–క్రాప్ పక్కాగా, పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కారు మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ–క్రాప్‌ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవడం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావడం లేదని మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ నేతల సిఫార్సులతో.. వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కారు మట్టి కొడుతోంది! ఈ–క్రాప్ నిర్వీర్యం.. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో పారదర్శకంగా అమలు చేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలు ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం మొక్కుబడి తంతుగా తయారైంది. సరిగ్గా ఖరీఫ్–25 సీజన్ ప్రారంభమయ్యే సమయంలోనే సచివాలయాల పునర్ వ్యవïÜ్థకరణతోపాటు రేషనలైజేషన్ పేరిట రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అడ్డగోలుగా బదిలీలు చేయడం ఈ–క్రాప్ నమోదుపై తీవ్రంగా ప్రభావం చూపింది. బదిలీలపై వచ్చిన సిబ్బంది ఆయా ప్రాంతాలకు కొత్తవారు కావడంతో సర్వే నంబర్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు సైతం అవగాహన లేక కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ఇబ్బందులకు గురి చేయడం మినహా రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఈ–పంట నమోదు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది. కానీ ఇప్పటి వరకు 60శాతానికి మించి ల్యాండ్ పార్సిల్స్‌లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ ఉండగా.. 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్‌ను నమోదు చేసినట్టు అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతోపాటు ఈ–పంట నమోదును ధ్రువీకరిస్తూ ఆర్ఎస్కే, రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్‌గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు. ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ–క్రాప్‌లో నమోదు కావడం లేదు. సీసీఆర్సీ కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావడం లేదు. దీనికి ఏకైక కారణం.. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోననే భయమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం..! ఈ–క్రాప్ నమోదులో నిబంధనలకు పాతరేశారు. ఈ–క్రాప్ నమోదు సక్రమంగా జరగని కారణంగానే గతేడాది ధాన్యంతో పాటు వివిధ పంటలను రైతులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోలేకపోయారు. ఈ–క్రాప్ నమోదు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి, పొగాకు, మిర్చి రైతులతోపాటు టమాటా, ఉల్లి రైతులను గుర్తించడంలో అధికారులు నానా పాట్లు పడ్డారు. గడిచిన ఏడాదిన్నరలో అకాల వర్షాలు, తుపానులు, కరువు ప్రభావానికి గురైన 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇలా పరిహారం ఎగ్గొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్‌ను నిర్వీర్యం చేస్తోందని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కొనబోమంటూ.. గ్రామాల్లో టాంటాంచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్ జాబితాలో పేర్లు ఉన్న వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని గ్రామాల్లో టాంటాం వేస్తుండడం బాధిత రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయడం, నష్ట తీవ్రత తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాల్లో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి.మఠం మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. కనీసం ప్రాథమిక అంచనాలు గానీ, తుది జాబితాలను గానీ ఆర్ఎస్కేల్లో ప్రదర్శించడం, అభ్యంతరాలు స్వీకరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం నమోదు, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునఃపరిశీలన అంతా సమాంతరంగా జరిగిపోతోందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. దేశానికే ఆదర్శంగా ‘ఈ–క్రాప్’.. ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు అది. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ పరిధిలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏ పంటను ఎవరు సాగు చేస్తున్నారో ఒక్క క్లిక్‌తో తెలుసు కోవడమే కాదు.. ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులైన వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం), సున్నా వడ్డీ రాయితీ లాంటి సంక్షేమ ఫలాలు అందించేవారు. రబీ 2019 సీజన్లో శ్రీకారం చుట్టిన ఈ–క్రాప్ నమోదు సాంకేతికత అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంది. 2023లో ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా వరించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేసేవారు. సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు చేసేవారు. 15–30 రోజుల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంటల ఫొటోలు అప్లోడ్ చేసి, రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని మొబైల్ నంబర్‌కు డిజిటల్ రసీదు పంపేవారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల పరిశీలన తర్వాత రైతులకు భౌతిక రసీదు కూడా అందించేవారు. ఈ భౌతిక రసీదులోనే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేయడమే కాదు.. మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. ఇలా ఏటా 1.65 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ–క్రాప్ ప్రామాణికంగా 2019–24 మధ్య 75.82 లక్షల మందికి రూ.1,373కోట్ల సబ్సిడీతో 45.16 లక్షల టన్నుల విత్తనాలు అందించారు. 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు సరఫరా చేశారు. 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలను అందించారు. మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించి సాగుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల రాయితీని గత ప్రభుత్వం అందచేసింది.సేద తీరుతున్న ప్రభుత్వ పెద్దలుపుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు షికార్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తే.. మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ చిల్ అవుతున్నారు. మరోవైపు ఫొటోలకు ఫోజులిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పుడు పరిహారం ఎవరిస్తారు గత ప్రభుత్వంలో అధికారులే దగ్గరుండి బీమా చేయించేవారు. ఈ ప్రభుత్వం సొంతంగా బీమా చేయించుకోవాలని చెప్పడంతో రెండుసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్లా. సర్వర్ పని చేయడం లేదని చెప్పారు. తరువాత సమయం అయిపోయిందన్నారు. ఐదు ఎకరాల్లో స్వర్ణరకం సాగు చేశా. పంట మొత్తం పోయింది. పరిహారం ఎవరిస్తారు? కౌలుదారులకు ఆత్మహత్యలే శరణ్యం! – గున్నం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం రూరల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కౌలు రైతుకు పరిహారం ఇవ్వాలి కౌలుకు ఏడు ఎకరాలు తీసుకున్నా. తొలుత నీరందక దెబ్బతిన్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే తుపాను పంటను దెబ్బతీసింది. ఎకరానికి రూ.25 వేలకు పైగా వెచ్చించా. నాలాంటి కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అందించాలి. – నాగరాజు, కౌలు రైతు, పెడన, కృష్ణా జిల్లాదిక్కుతోచడం లేదు రూ.ఐదు లక్షల వరకూ వెచ్చించి 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. పంట తొలగించే రోజు మొదలైన వాన తుపానుగా మారి పదిరోజుల పాటు కొనసాగింది. టార్పాలిన్ కప్పి భద్రపరిచినప్పటికీ మొక్కజొన్నలు మొత్తం మొలకలు వచ్చాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మధు, కదిరిపల్లి, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లాప్రభుత్వ నిర్ణయం చాలా అన్యాయం ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకూడదన్న నిర్ణయం చాలా అన్యాయం. పంటలు నష్టపోయారు కాబట్టే ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుల నుంచి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి.. – పోతిరెడ్డి భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా జగన్ హయాంలో రైతులకు మేలు మొక్క జొన్న కోత కోసి ఆరబోశాం. క్వింటా రూ.2,200 పలకాల్సింది రూ.1,600కు అడుగుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు చేకూరేది. – గుత్తి ఏసన్న, రైతు, కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లాఈ ప్రభుత్వంలో బీమా గురించి చేప్పేవారే లేరు నాకు ఎకరా పొలం ఉంది. వరి, మిరప పండిస్తా. గత ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు చేసి ప్రీమియం కూడా చెల్లించడంతో రూ.26 వేలు బీమా నగదు వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – వేణు, రైతు, బంగారుపాళెం, చిత్తూరు జిల్లాఅస్తవ్యస్తంగా ఎన్యుమరేషన్...మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించటాన్ని బట్టి ఎన్యుమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతోంది. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా.. ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఎన్యుమరేషన్ పెంచొద్దంటూ క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఉల్లి పంటకు అపార నష్టం వాటిల్లింది. కానీ దెబ్బతిన్న ఉల్లి పంట వివరాలు నమోదు చేయడానికి వీల్లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అలా నమోదు చేసిన ఆర్ఎస్కే సిబ్బందిపై చర్యలకు సైతం సిద్ధపడుతుండడం సర్కారు తీరుకు అద్దం పడుతోంది. -
నాడు ఉచిత బీమా రక్ష.. నేడు అనుచిత శిక్ష
ఈయన పేరు శీలం శ్రీను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరి పంట సాగు చేశారు. ఇప్పటికే రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మోంథా తుపాను బారిన పడి పంట పూర్తిగా ముంపునకు గురై కుళ్లిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.27 వేలు బీమా పరిహారంగా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారం భరించలేక చెల్లించలేదు. గత 17 నెలల్లో దాదాపు మూడుసార్లు వరి పంట నీట మునిగి పూర్తిగా పాడైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. ఈసారైనా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని శీలం శ్రీను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాక్షి, అమరావతి: ‘పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే.. బీమా పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై తుపాను ప్రభావిత ప్రాంతాల రైతులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పైసా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించడం వల్లే తమకీగతి పట్టిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రీమియం చెల్లించిన వారికి బీమా పరిహారం ఇప్పిస్తానంటున్నావ్.. మరి ప్రీమియం భారం కావడంతో బీమా చేయించుకోలేని తమబోటి నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటి చంద్రబాబూ.. అంటూ నిలదీస్తున్నారు.కూటమి సర్కారు నిర్వాకంతో బీమాకు దూరమైన లక్షలాది మంది తుపాను బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కులు చూస్తున్నారు. తుపాను బారినపడి దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఇందులో అత్యధికంగా వరి పంట 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతుల్లో నూటికి 90 శాతం మంది రైతులు ప్రీమియం భారం కావడంతో పంటల బీమా చేయించుకోలేకపోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రీమియం చెల్లించని రైతులకూ చంద్రబాబు ప్రభుత్వమే సొంతంగా బీమా పరిహారానికి సమానంగా ఆరి్థక లబ్ధి చేకూర్చి అండగా నిలవాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్‌లో వరి సాగైంది 38.97 లక్షల ఎకరాలు.. బీమా చేయించుకుంది4.94 లక్షల ఎకరాలకే.. ఉచిత పంటల బీమా పుణ్యమా అని గడిచిన ఖరీఫ్–2024 సీజన్లో 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించగా, 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. ఉచిత పంటల బీమా ఎత్తివేతతో రబీ–2024 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 19.55 లక్షల మంది రైతులు 19.69 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. గత ఖరీఫ్‌తో పోలిస్తే 51.48 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 66.28 లక్షల మంది రైతులకు బీమా రక్షణ దక్కలేదు.నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో 27 శాతం పంటలకు మించి బీమా కవరేజ్, 85 శాతం మంది రైతులకు బీమా రక్షణ లభించలేదు. దీంతో వారి పరిస్థితి ప్రçస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావం వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, అరటి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 38.97 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, రైతులు బీమా చేయించుకున్నది కేవలం 4.94 లక్షలు ఎకరాలకు మాత్రమే. అంటే దాదాపు 34 లక్షల ఎకరాల్లో సాగైన వరి పంటకు బీమా రక్షణ కరువైంది.మొక్కజొన్న పంట 4.67 లక్షల ఎకరాల్లో సాగవగా. కేవలం 15,638 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఇక పత్తి విషయానికి వస్తే 11.4 లక్షల ఎకరాల్లో సాగవగా, కేవలం 1.03 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ లభించింది. అరటి 2.74 లక్షల ఎకరాల్లో సాగవగా, 16 వేల ఎకరాలకే బీమా కవరేజ్ పరిమితమైంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగవగా, కేవలం 2284 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఈ గణాంకాలు చాలు రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో స్వచ్ఛంద బీమా నమోదు అమలు తీరు ఏ విధంగా ఉందో చెప్పడానికి.ఐదేళ్లూ పైసా భారం పడకుండా రైతుకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం.. 2019–24 మధ్య ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పించింది. ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు.ప్రభుత్వ వాటాతోపాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం అందిస్తే 2019–24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేయగా, వైపరీత్యాల వేళ పంటలు నష్టపోయిన 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందజేసి అండగా నిలిచారు.17 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు ఖరీఫ్‌లో ఎకరన్నరలో వరి వేశా. రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి అందే వేళ మోంథా తుపాను ముంచేసింది. తీవ్రంగా నష్టపోయాను. పట్టుమని పది బస్తాలు కూడా చేతికొస్తుందో లేదో తెలియడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా పంటలు దెబ్బతిన్నప్పుడు పైసా చెల్లించకుండానే పంట బీమా పరిహారం ఇచ్చేవారు. నాకు కూడా పరిహారం వచి్చంది. కానీ ఇప్పుడు బీమా భారమైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడైనా పారదర్శకంగా నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం ఇప్పించాలి. –బచ్చల తమ్మారావు, గుమ్మరేగుల, కాకినాడ జిల్లాజగన్ హయాంలో ఎకరాకు రూ.36 వేల పరిహారం అందుకున్నాం.. వైఎస్ జగన్ హయాంలో ఇదే రీతిలో తుపాను వల్ల పంట నష్ట పోయిన సందర్భంలో ఎకరానికి రూ.36 వేలు పరిహారం అందుకున్నాను. ఉచిత పంటల బీమా పథకం ద్వారా పైసా భారం పడకుండా క్రమం తప్పకుండా పరిహారం జమ చేసేవారు. నాడు ప్రభుత్వం రైతులకు ఎంతో తోడ్పాటు అందించింది. ఇప్పుడు కూటమి సర్కారులో అటువంటిది కనిపించడం లేదు. ఇప్పుడు పంట కోల్పోయి బీమా ప్రీమియం చెల్లించని మా లాంటి రైతులం అన్యాయం అయిపోయేలా ఉన్నాము. కూటమి సర్కారు ఆదుకుంటుందో లేదోనని ఆందోళనగా ఉంది. – పిల్లా శ్రీనివాస్, కొత్తపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా -
రెండో పంటకు నీరు లేనట్లే!
కర్నూలు సిటీ: భారీ వర్షాలు కురిసి సమృద్ధిగా నీరు ఉన్నా రైతులు రెండో పంట పండించే వీలు లేకుండా పోయింది. గతేడాది ఆగస్టులో టీబీ డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర దిగువ కాలువ కింద రబీలో ఆయకట్టు సాగు కాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. డ్యాంలో 80 టీఎంసీల నీరు ఉండడంతో ఆయకట్టు రైతులు రబీపై ఆశలు పెట్టుకున్నారు. డ్యాం గేట్ల మార్పుల పనులతో రెండో పంటకు నీరు అందుబాటులో ఉండే పరిస్థితులు అగుపించడం లేదని డ్యాం ఇంజనీర్లు చెబుతున్నారు. 19వ గేటు ఏర్పాటుకు ఆటంకం! టీబీ డ్యాం 19వ గేటు గతేడాది ఆగస్టులో కొట్టుకుపోయింది. దాని స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు నిపుణుల కమిటీ సలహా మేరకు రూ.1.98 కోట్లతో టెండర్ పిలిచారు. టెండర్‌ను దక్కించుకున్న గుజరాత్ కంపెనీ ఏప్రిల్ చివరి వారంలో డిజైన్స్ తయారు చేసింది. టీబి బోర్డు ద్వారా ఏపీ సెంట్రల్ డిజైన్ కమిటీకి పంపించారు. అయితే ఆ డిజైన్‌కు ఆమోదం నెల రోజులు ఆలస్యం కావడంతోనే సకాలంలో గేటు తయారు చేసి బిగించలేకపోవడంతో 105 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు సామర్థ్యాన్ని తగ్గించారు. ఏజేన్సీ గేటు తయారు చేసి బిగించేందుకు రెండు నెలల గడువు ఇచ్చారు. గేటును సిద్ధం చేసుకొని డ్యాం దగ్గరకు తీసుకొచ్చింది. అయితే డ్యాం ఎగువన భారీ వర్షాలు కురవడంతో గేటు బిగించేందుకు సాధ్యం కాకపోవడంతో జూన్ నెలలో వాయిదా వేశారు. ఈ గేటుతో పాటు మిగిలిన 32 గేట్ల తయారీ టెండర్ దక్కించుకున్న గుజరాత్ కంపెనీ జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 12 గేట్లను తయారు చేసింది. ఈ నెల 15వ తేదీలోపు మిగిలిన గేట్లను సిద్దం చేయనున్నట్లు డ్యాం ఇంజినీర్లు చెబుతున్నారు.3.5 లక్షల ఎకరాల్లో పంటలు లేనట్లే! తుంగభద్ర జలాలపై రాయలసీమ జిల్లాల్లో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, ఆలూరు బ్రాంచ్ కెనాల్, కేసీ కాలువల పరిధిలో 6.56 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రబీ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు కావాలి. అయితే డ్యాం గేట్ల మార్పుతో సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు తగ్గించారు. రబీకి నీరు ఇవ్వమని ఖరీఫ్ సీజన్‌కు ముందే బోర్డు ప్రకటించింది. అయితే వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలో నీటి సామర్థ్యం (80 టీఎంసీలకు)తగ్గిపోయింది. ఇన్‌ఫ్లో ఉండడంతో రబీ ఆయకట్టుకు కూడా నీరు ఇస్తారని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెలలోపు వర్షాలు నిలిచిపోయే అవకాశాలు ఉండడం, ఉన్న నీటితో ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు డిసెంబర్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాల్సి ఉండడంతో రెండో పంటలకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని ఇంజినీర్లు చెబుతున్నారు. రబీలో ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ, కర్ణాటక సాగు నీటి కాలువకు రోజుకు 0.89 టీఎంసీలు, నెలకు సుమారు 27 టీఎంసీల ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు నీరు ఇవ్వాలంటే కనీసం 110 టీఎంసీల నీరు అవసరం ఉంది. అంత నీటి లభ్యత లేదని, తాగు నీటి అవసరాలు, వేసవిని దృష్టిలో పెట్టుకొని రబీకి నీరు ఇవ్వలేమని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఈ నెల 7న టీబీ బోర్డు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ తరుపున సభ్యులుగా ఉండే వ్యక్తి ఆ రోజు వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ఈ నెల 21వ తేదీకి సమావే«శం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ‘సుంకేసుల’పై నిర్లక్ష్యం ఓఅండ్ఎం నిధుల మంజూరులో జాప్యం రూ.52 లక్షల బిల్లులు పెండింగ్ ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిండంలో కీలకమైనా సుంకేసుల బ్యారేజీ గేట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో లీకేజీలు అవుతున్నాయి. బ్యారేజీకి స్పిల్‌వేకు 30 క్రస్టు గేట్లు ఉన్నాయి. ఓక్కో గేటు 18 మీటర్లు పొడవు, 7 మీటర్లు వెడల్పు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి 5.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చు. అదే విధంగా స్కవరింగ్ స్లూయిజ్‌కు నాలుగు వర్టికల్ గేట్లు ఉన్నాయి. కేసీ కాలువకు నీటి విడుదలకు నాలుగు వర్టికల్ గేట్లు ఉన్నాయి.మొత్తం 38 గేట్లను రూ.140 కోట్లతో రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి వరకు బ్యారేజీలో నీరు అడుగంటలేదు. 2014 తరువాత ఇప్పటి వరకు నాలుగు సార్లు పూర్తిగా ఎండిపోయింది. ఆ సమయంలో బ్యారేజీ గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. తాగు నీటికి ఇక్కట్లే! సుంకేసుల బ్యారేజీ 1.2 టీఎంసీల సామర్థ్యం. ఇందు లో పూర్తి స్థాయిలో నీరు ఉంటేనే కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి అవసరాలు తీరేది. ఈ ఏడాది సీజన్ మొదలయ్యాక బ్యారేజీ నిర్వహణకు కొంత నిధులు మంజూరు చేశారు. ఈ ఏడాది ఎనిమిది గేట్లు రోప్స్ తుప్పుపట్టి ఇంజినీర్లను ఇబ్బంది పెట్టాయి. ఈ గేట్లకు రోప్స్ మార్చాలని రూ.24 లక్షలతో అంచనాలు వేసి పనులు చేపట్టారు. స్పిల్‌వే గేట్ల రబ్బర్ సీల్సు మా ర్చాల్సి ఉందని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. కేసీ కెనాల్ డివిజన్ కార్యాలయంలో అప్లోడ్ చేయకపోవడంతో ఏడాదిన్నరగా రూ.52 లక్షల బిల్లులు రాలేదు. రబ్బర్ సీల్సు టెఫ్లాన్ కోటింగ్ పోయి చాలా గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతోంది. నీరంతా దిగువకుపోతే కర్నూలు నగరవాసులతో పాటు వందలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రబీకి నీరు ఇవ్వలేం తుంగభద్ర డ్యాం గేట్లు కొత్తవి ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. డ్యాంలో ఉండే 80 టీఎంసీల నీటితో రెండో పంటకు నీరు ఇవ్వడం సాధ్యం కాదు. ఖరీఫ్‌కు డిసెంబర్ వరకు నీరు ఇవ్వాల్సి ఉంది. రబీకి నెలకు 27 టీఎంసీల నీరు ఇవ్వాలి. డ్యాంలో నీరు లేదనందున రబీకి ఇవ్వడం సాధ్యం కాదు. – జ్ఞానేశ్వర్, టీబీ డ్యాం డీఈఈ దెబ్బతిన్న గేట్లుతుంగభద్ర డ్యాంను సుమారు ఏడు దశబ్దాల క్రితం నిర్మించారు. డ్యాంలో మొత్తం 33 క్రస్టు గేట్లు ఉన్నాయి. నిర్మాణం సమయం నుంచి ఇప్పటి వరకు డ్యాం గేట్ల భద్రతపై దృష్టి సారించలేదు. దీంతో గేట్లన్నీ దెబ్బతిన్నాయి. గతేడాది ఆగస్టు నెలలో వచ్చిన భారీ వరద నీటి ప్రవాహనికి డ్యాం 19వ క్రస్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు స్థానంలో నాడు తాత్కాలికంగా నిపు ణుల పర్యవేక్షణలో స్టాప్‌లాక్ గేటును ఏర్పాటు చేశారు. ఏడాదికిపైగా స్టాప్‌లాక్ గేటుతోనే డ్యాం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీడబ్యూసీ మాజీ చైర్మెన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేశారు. వారు ఇచ్చిన సూచనల ఆధారంగా కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ అనే సంస్థతో స్టడీ చేయించారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి నివేదిక ఇచ్చింది. అందులో డ్యాం 33 గేట్లు మార్చాలని, గేట్లలో అత్యధిక శాతం 40 నుంచి 50 శాతం తప్పుపట్టి దెబ్బతిన్నాయని, గడ్డర్లు, సపోరి్టంగ్ ప్లేట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో అన్ని గేట్లు మార్చేందుకు రూ. 52 కోట్లతో అంచనాలు వేసి టెండర్లు పిలవ్వగా..గుజరాత్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. -
అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవడంలో చంద్రబాబు నిర్లక్ష్యం
-
చేలో నీళ్లు.. రైతుకు కన్నీళ్లు
సాక్షి నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రంలో రైతులను నిలువునా ముంచేసింది. వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, తదితర పంటలకు, ఉద్యాన తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే మురిగిపోతోంది. నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులు మెజారిటీ శాతం మునిగిన పంటను పూర్తిగా పరిశీలించిన పాపానపోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. తమకు జరిగిన నష్టంపై ప్రతి చోటా రైతులు ఏకరువు పెట్టారు. నేలకొరిగిన పంటను కాపాడుకోవడంలో భాగంగా పొలంలో ఉండిపోయిన నీటిని బయటకు పంపేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూ రైతులు పలు చోట్ల కనిపించారు. పడిపోయిన వరి పంటను కట్టలు కట్టుకుంటున్నారు. అధికారులు వస్తే జరిగిన నష్టాన్ని చూపాలని ఆత్రంగా ఎదురు చూస్తూ కనిపించారు. కాగా, తుపాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రైతాంగంలో ఆందోళన » శ్రీకాకుళం జిల్లాలో మోంథా తుపాను 23 మండలాలపై ప్రభావం చూపింది. 82 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎక్కువగా నష్టం జరగ్గా, మిగతా నియోజకవర్గాల్లో ఓ మాదిరి నష్టం సంభవించింది. ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, తులిగాం, ఇన్నేషుపేట, కోట»ొమ్మాళి మండలంలోని గుంజిలోవ తదితర గ్రామాల్లో రైతులు తమ పొలాల్లో చేరిన నీటిని బయటికి పంపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. » విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలతోపాటు పెందుర్తి మండలంలోనూ తుపాను బీభత్సం సృష్టించింది. వరి మొదళ్లు కుళ్లిపోయాయి. మళ్లీ.. పంటని నిలబెట్టుకోవాలంటే.. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాతే సాధ్యమవుతుందని రైతులు చెబుతున్నారు. అయితే.. వరద నీరు మొత్తం పోయేందుకు మరో 15 రోజుల సమయం పడుతుందని ఈలోగా.. పంట మొత్తం కుళ్లిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. » పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు రూరల్, పాచిపెంట, మక్కువ, బలిజిపేట, సీతానగరం, పాలకొండ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, భామిని తదితర మండలాల్లో వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాచిపెంట, కురుపాం, సాలూరు, కొమరాడ తదితర మండలాల్లో పత్తి పంట తడిసి ముద్దయ్యింది. » అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 15,800 ఎకరాల్లో పంటలు నష్టపోతే... అధికారులు మాత్రం 2వేల ఎకరాలే చూపిస్తున్నారు. 13,800 ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో చెరకు, వెయ్యి ఎకరాల్లో బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 60వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం! కాకినాడ జిల్లాలో ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 60 వేల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా వరి, మిర్చి, పత్తి, దొండ తదితర పంటలు దెబ్బతిన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల పరిధిలోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేలంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరంలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగింది. పొలాల్లోని ముంపునీరు బయటకు వెళ్లే దారి లేక పంటను కాపాడుకునేందుకు కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డుపైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. కేంద్రాలకు వచ్చిన వారికే పరిహారమట! డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 76,709 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. ఉద్యాన పంటలు 3,935 ఎకరాల్లో దెబ్బ తిన్నాయి. కేవలం సహాయ పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి మాత్రమే నగదు పరిహారం అందిస్తామని చెప్పడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. గోదారి జిల్లాల్లో గుండెకోత తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా పడిపోయిన అరటి తోటలు, నేలకొరిగిన వరి పనలే దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లాలో తుపాను ప్రభావం 209 గ్రామాల్లో కినిపించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్, వీరవాసరం, నరసాపురం రూరల్ పరిధిలోని తాడేరు, బేతపూడి, తుందుర్రు, కంశాల బేతపూడి, మత్స్యపురిలో వరి పంట వెన్నుల వరకు నీట మునిగిపోయి ఉంది. ముంపునీరు లాగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతూ, వెన్నులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపించాయి. ఈ ప్రాంతంలోని తొక్కోడి డ్రెయిన్‌లోని పూడిక ముంపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉండటంతో పొలాల్లోకి నీరు ఎగదన్నుతోంది. కొన్నిచోట్ల రైతులు ఇంజన్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. కోతకు పనికిరాదన్న భావనతో తాడేరులో పశువుల కోసం పంటను కోసేస్తున్న పరిస్థితి కనిపించింది. » ఏలూరు జిల్లాలో మోంథా తుపాను అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. వాస్తవానికి తుపాను నేపథ్యంలో జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ బలమైన ఈదురుగాలుల ప్రభావంతో వరి కంకులు నేలకొరిగాయి. మరోవైపు రోజుల తరబడి పంట చేల్లో నీళ్లు నిలిచిపోవడంతో కొన్నిచోట్ల పంట కుళ్లిన పరిస్థితి. ‘సరిగ్గా ఇంకో 15 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవి. కనీసం పెట్టుబడులైనా దక్కేవి. కోతలకు ముందు తుపాను విరుచుకుపడటంతో వరి కంకులు నేలకొరిగాయి. పర్యవసానంగా మళ్లీ ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి అనివార్యంగా మారిన పరిస్థితి’ అని రైతులు వాపోతున్నారు. కృష్ణ కృష్ణా.. ఆదుకునే వారేరీ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంటలు నీటి పాలవ్వడంతో అరకొర పంటనైనా రక్షించుకుందామనే తాపత్రయంలో అన్నదాతలు ఉన్నారు. కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు, మంతెన గ్రామాల్లో రైతులు నేలవాలిన వరిపైరును దుబ్బులుగా కడుతూ మిగిలిన పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేల వాలిన వరి పైరును నిలగట్టేందుకు కూలీల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక పలువురు రైతులు పంట చేను వైపు దీనంగా చూస్తున్న పరిస్థితులు కనిపించాయి. పొలాల్లో నిలిచిన నీరు పంట బోదెల్లోకి సైతం మళ్లక పోవటంతో పొలాల్లో ఉన్న వరి దుబ్బులను నిలగట్టి పంట నష్టాన్ని నివారించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు కూలీల ఖర్చు అదనపు భారంగా మారింది. ఒక్కొక్కరికి రూ 330 చొప్పున కూలీ చెల్లిస్తూ వరి దుబ్బులను నిలగడుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న∙నమ్మకం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కదిలిస్తే కన్నీరై పారుతోంది » గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, అరటి, పసుపు, కూరగాయలు, పూలు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. బురదమయమైన పొలాలు, ఇంకా నీట నానుతున్న పంటలు, పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న పాట్లు, ఇప్పటికే తెచ్చిన అప్పులకు తోడు పంటను కాపాడుకునేందుకు కొత్త అప్పుల కోసం పడే తిప్పలు, ఎరువుల కోసం అరువు కోసం దీనంగా వెతికే చూపులు.. ఇలాంటి దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. » భారీ వర్షాలకు బాపట్ల జిల్లా అతలాకుతలమైంది. వరి, పత్తి, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరల పంటలు నీటి పాలయ్యాయి. పర్చూరు వాగు, రొంపేరులు పొంగి పొర్లడంతో పర్చూరు, కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో శుక్రవారం నాటికి 50 వేల ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉండిపోయింది. నల్లమడ డ్రైన్, ఈపూరుపాలెం స్రైట్ కట్, పేరలి డ్రైన్లు పొంగి పొర్లడంతో బాపట్ల పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రజలు ఇప్పటికీ నీటిలో ఉన్న పొలాలను చూపించారు. » ప్రకాశం జిల్లాలో ఏ రైతును పలకరించినా కన్నీరు పెట్టుకుని, గద్గద స్వరంతో దీనగాధను వినిపిస్తున్నారు. ప్రధానంగా నష్టపోయిన పంటల్లో సింహ భాగం పత్తిదే. కొన్ని ప్రాంతాల్లో ఒక తీత పత్తిని తీయగా జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు ఒక తీత కూడా తీయలేదు. తీద్దామని సన్నద్ధమయ్యే లోపు వరుసబెట్టి కురిసిన వర్షాలు, ఆపై మోంథా తుపాను అన్నదాత నెత్తిన పిడుగులా పడింది. వరి, పొగాకు, సజ్జ, మొక్కజొన్న, మినుము పంటలకు కూడా నష్టం వాటిల్లింది. నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన గోపతోటి శామ్యూల్ 50 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. అంతా నీటిలో మునిగి పోయిందని, నాలుగు రోజులైనా పంట ఇంకా నీటిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కురిచేడు మండలం గంగ దొనకొండ గ్రామానికి చెందిన కసిబిసి వెంకటేశ్వర్లదీ ఇదే పరిస్థితి. అయితే ఇతను 20 ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేయగా, పంట నీట మునిగింది. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరి, మినుము, జొన్న, వేరుశనగ, తమలపాకు, అరటి, బొప్పాయి, పసుపు తదితర పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఇంత వరకు ఎన్యుమరేషన్ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కోత దశ సమయంలో పూర్తిగా నీట మునిగి మొలకలెత్తాయి. గింజ ధాన్యం కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కర్షకులు కంటతడ పెడుతున్నారు. » నంద్యాల జిల్లాను తుపాను అతలాకుతలం చేసింది. వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సగానికి సగం పంట తుడిచి పెట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వరి, వేరుశనగ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. పరిహారం పరిహాసం! మోంథా తుపాను వల్ల కలిగిన నష్టంకన్నా, ప్రభుత్వం రైతులకు పెడుతున్న కష్టమే వారిని ఎక్కువగా బాధ పెడుతోంది. కళ్ల ముందు పంట నష్టపోయి పొలం గట్టున నీళ్లు నిండిన కళ్లతో నిలబడి తమను ప్రభుత్వం ఆదుకోకపోతుందా అనే ఆశతో రైతులు చూస్తుంటే.. అధికారులు అలా వచ్చి పైపైన చూసి.. అబ్బే ఇది పరిహారం చెల్లించాల్సిన నష్టం కాదు.. దీనికి ఏమాత్రం పరిహారం రాదన్నట్లు చులకనగా చూసి వెళ్లిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెయ్యెత్తులో ఉన్న చెరుకు పంట నిలువునా నీట మునిగినా, అబ్బే ఇదొక నష్టమే కాదన్నట్లుగా అధికారులు చూస్తున్నారని వాపోతున్నారు. తుపాను పంట నష్టాన్ని లెక్కించే క్రమంలో అధికారులు ఒక ప్రామాణికతను నిర్ధారించారు. రైతు వేసిన మొత్తం పంటలో 30 శాతం నష్టం జరిగితేనే దానికి పరిహారం ఇవ్వదగిందిగా లెక్కలోకి వేస్తున్నారు. అంతకన్నా తక్కువ నష్టం జరిగితే పైసా కూడా పరిహారం రాదు. ఈ మేరకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పంటల బీమా ప్రీమియం చెల్లించే బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోవడంతో బీమా సంస్థల నుంచి ఏమాత్రం పరిహారం వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం దయతలచి ఇచ్చే సాయం తప్ప, దర్జాగా రైతులకు దక్కే బీమా పరిహారం ఇప్పుడు దక్కకుండా పోయింది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేది. దీంతో ఏదైనా విపత్తుల్లో పంటలకు నష్టం వస్తే సదరు బీమా సంస్థలు ఇన్సూరెన్స్ కింద పరిహారం చెల్లించేవి. ఈ క్రమంలో గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలోని మొత్తం 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్లు బీమా రూపంలో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం బీమా చెల్లించకపోవడంతో కేవలం పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే సదరు బ్యాంకులు బీమా ప్రీమియం చెల్లించడంతో కేవలం 19 లక్షల మందికి మాత్రమే అరకొరగా పరిహారం దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన మిగతా వారు పూర్తిగా నష్టపోయినట్లే అని అధికారులే స్పష్టంచేస్తున్నారు. పరిహారం వస్తుందో రాదో... మొక్కజొన్న పొత్తులు కోసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాం. ఈలోగా వర్షం వచ్చి మొత్తం పొత్తులను తడిపేసింది. రంగుమారిపోయి నాణ్యత తగ్గిపోయాయి. వీటిని కొనుగోలు చేస్తారో లేదో తెలియడం లేదు. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. పంట నష్టానికి పరిహారం వస్తుందో రాదో తెలియదు. అంతా దైవా«దీనం. వేసిన పంటలు చేతికి వచ్చేవరకు నమ్మకంలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం అంటేనే భయంగా ఉంది. – చందక నారాయణమ్మ, పెరిపి గ్రామం, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా పశువుల మేతగా అయినా పనికొస్తుందని.. ఏడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరింది. విత్తనం నుంచి దమ్ము, నాట్లు, ఎరువులు, పురుగు మందుల కోసం ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు వరకు ఖర్చయ్యింది. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మాయదారి తుపాను వచ్చింది. వర్షాల వలన రోజుల తరబడి పొట్టల పైవరకు నీరు నిలిచిపోయింది. వరి వెన్నులు కుళ్లిపోతుండటంతో నీరు లాగగానే పైరు పడిపోతుంది. కంకులు తాలుగా మారిపోతాయి. పశువులకు మేతగా అయినా పనికొస్తుందని ఇప్పుడే కోసేస్తున్నాం – పెంటపాటి త్రిమూర్తులు, తాడేరు, భీమవరం రూరల్, ప.గోదావరి జిల్లా వ్యవసాయం అంటేనే వణుకు పుడుతోంది ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి రైతులను ఇబ్బంది పెడుతూ ఉంటే వ్యవసాయం చేయాలంటేనే వణుకు పుడుతోంది. పంట పండించే వరకు ఎరువుల కోసం పాట్లు పడవలసి వచ్చింది. చేలో వేద్దామంటే యూరియా కూడా దొరకలేదు. అదేదో గట్టెక్కామనుకుంటుంటే పంట వచ్చిన సమయంలో పొలాన్ని ముంపు నీరు ముంచేసింది. సొంత పొలం రెండు ఎకరాలు, తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గింజ గట్టిపడుతున్న సమయంలో ముంపునకు గురై, నీటిలో నిండిపోయింది. రూ.10 వేలు అయినా చేతికొస్తుందో లేదో. – ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం కౌలు రైతుకు ఏమీ లేవు దేవుడు మాన్యం రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నా. స్వర్ణ రకం సాగు చేశాను. ఇంకో 20 రోజుల్లో పంట చేతికివచ్చే తరుణంలో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు అంతా తారుమారైంది. కౌలురైతు కావడంతో ఎలాంటి సాయం దక్కదని ఆందోళనగా ఉంది. ఏ అధికారీ ఇప్పటి వరకు పొలం వైపు రాలేదు. – సీమల జానరాజు, చిన్న రైతు, పెదపాడు, ఏలూరు జిల్లా రైతు పరిస్థితి దయనీయం నాకు సెంటు పొలం లేదు. స్టూవర్టుపురం రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాను. ఎకరాకు రూ.10 వేల చొప్పున ముందే రూ.లక్ష చెల్లించాను. ఇప్పటికీ పైర్లు నాట్లువేసి 70 రోజులు అయ్యింది. ఒక్కో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చుచేశాను. 10 ఎకరాలకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. నా పొలం మొత్తం నీటిలో మునిగింది. మాలాంటి రైతుల పరిస్థితి దయనీయం. – కుంచాల లక్ష్మారెడ్డి, బేతపూడి, బాపట్ల జిల్లా పెట్టుబడీ రాదు ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు మద్దిపాటి హరే రామకృష్ణ. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామంలో 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులు, వర్షాలకు వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. 7 ఎకరాల్లో పంట నేల కొరిగింది. ఇప్పటికే పంట సాగుకు ఎకరానికి రూ.30 వేలు చొప్పున రూ.2.50 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి గింజ గట్టిపడే దశకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో కోతలకు సిద్ధమవుతుండగా ప్రకృతి కన్నెర్ర చేసింది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట మొత్తం నేలకొరిగింది. ప్రస్తుతం ఆ వరి పనలు కట్టేందుకు ఎకరానికి మరో రూ.10 వేలు వెచ్చించాల్సి వస్తోంది. మరో రూ.70 వేలు అదనపు భారం పడుతోంది. దీంతోపాటు ఎకరానికి 40 బస్తాల ధాన్యం దిగుబడి అందుతుందని భావిస్తే.. ప్రస్తుతం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రతి రోజూ 20 మంది కూలీలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కూలి ఇచ్చి పనలు కట్టిస్తున్నారు. మొక్క బతుకుతుందో లేదో.. ఈ రైతు పేరు చాగంరెడ్డి రామకోటి రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఈ ఏడాది తొమ్మిది ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాడు. మొక్క ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ దశలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పైరు నీట మునిగింది. ఒక రోజంతా కష్టపడి ఇంజిన్లతో పొలంలో నిలిచిన నీటిని బయటకు పంపాడు.రెండవ రోజు నేలవాలిన మొక్కలను పైకి లేపుతున్నారు. మూడవ రోజు బలం మందులు పిచికారీ చేశాడు. ఇప్పటి వరకు ఈ రైతుకు ఎకరాకు సుమారు రూ. 60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. కౌలు అదనం. ఇప్పుడు ఆయిల్ ఇంజిన్లు, ఎరువుల ఖర్చు అదనం. ఇంతా చేసినా మొక్క బతుకుతుందో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. పడిపోయిన చేను కోసేస్తున్నాడు ఈ రైతు పేరు చప్పగడ్డి నాగేశ్వరరావు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ఖండేపల్లి గ్రామం. 1.20 ఎకరాల్లో వరి పంట వేశాడు. ఆర్ఆర్ వరి రకం వేయడంతో త్వరగా పండేసింది. మరో పది రోజుల్లో కోత కోయాలనుకునేలోపే తుపాను దెబ్బతో పంట మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. నిన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి చూసి ఫొటో తీసుకుని వెళ్ళిపోయింది. పరిహారం ఇస్తారో లేదో ఎవరూ చెప్పడం లేదు. నేలకొరిగిన పొలాన్ని కోసేస్తున్నాడు. కోసి ఎండ పెడితే ఏదో కొద్దిగానైనా ధాన్యం చేతికొస్తుందనే ఆశతో ఇలా చేస్తున్నాడు. పెట్టుబడి కూడా చేతికి రాదని, పొలాన్ని చూస్తే ఏడుపు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశలన్నీ వరదపాలుఈ రైతు పేరు మేర్నిడి గంగరాజు. కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామం. 8వ ఏట నుంచే వ్యవసాయం పనుల్లో ఉన్నాడు. రెండు ఎకరాలు సొంత పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించడంతో వరిచేలు ఈనిక పూర్తయి గింజ తోడుకునే దశకు చేరుకుంది. ఈ సమయంలో మోంథా తుపాను నట్టేట ముంచేసింది. మొత్తం ఐదు ఎకరాల్లో పంట నేలనంటేసింది. గింజ పాలు తోడుకునే దశలో ఉండడంతో పువ్వారం రాలిపోయింది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశలన్నీ వరదలో కొట్టుకుపోయాయని చెబుతున్నాడు. అంచనాలో సగం దిగుబడి కూడా రాదని వాపోతున్నాడు. -
Ongole: 5 లక్షలు పెట్టుబడి.. మొత్తం నష్టమే ప్రభుత్వమే ఆదుకోవాలి
-
ఉసురు తీసిన ప్రభుత్వం.. రైతు బతుకు మట్టిపాలు
-
పంట పొలంలో పవన్ ‘షో’
కోడూరు/అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పర్యటన ఒక ‘షో’లా సాగింది. కేవలం 15 నిమిషాల్లోపే రైతుల పరామర్శను ముగించారు. అది కూడా ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఒక్క పొలాన్ని మాత్రమే పరిశీలించారు. ఫొటోలు, వీడియో పోజులకే అధిక ప్రాధాన్యమిస్తూ.. ఇతర రైతులను దగ్గరికి రానివ్వలేదు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా రైతులను పోలీసులు పక్కకు లాగేశారు. దీంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓట్లు కావాలి గానీ.. సమస్యలు పట్టవా? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ గురువారం కృష్ణా జిల్లా కోడూరు మండలం కృష్ణాపురంలో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన ఐదెకరాల వరి పొలాన్ని పరిశీలించారు. ఆ పొలాన్ని సాగు చేస్తున్న ఇస్మాయిల్‌బేగ్‌పేటకు చెందిన అన్నదమ్ములు రమేశ్, వెంకటేశ్వరరావు, శివరామకృష్ణను పవన్ పరామర్శించారు. అప్పులు చేసి వరి సాగు చేస్తున్నామని.. తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయామని వారు వివరించారు.అనంతరం తీర ప్రాంతంలో ముంపు బారిన పడిన వరి పొలాల డ్రోన్ విజువల్స్‌ను పవన్ వీక్షించారు. అదే సమయంలో ఇస్మాయిల్‌బేగ్‌పేటకు చెందిన కొందరు మహిళా రైతులు తమ సమస్యలను పవన్‌కు చెప్పుకునేందుకు రాగా.. పోలీసులు వారిని నెట్టివేశారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతు కుటుంబంతో మాట్లాడితే అందరి సమస్యలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు.మా ఓట్లు కావాలి గానీ.. మా సమస్యలు చెప్పుకుందామంటే తోసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హంసలదీవి, రామకృష్ణాపురం జనసేన నాయకులను కూడా దగ్గరికి రానివ్వకపోవడంతో.. వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవుట్ ఫాల్ స్లూయిస్ గేట్లు దెబ్బతినడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని వారు చెప్పారు. స్లూయిస్ గేట్లు, రత్నకోడు డ్రెయిన్లను పరిశీలించకుండా ఒక్క పొలాన్ని చూసి వెళ్లిపోతే సరిపోతుందా? అంటూ మండిపడ్డారు.ఫొటో పోజులకే ప్రాధాన్యంపవన్కళ్యాణ్ పర్యటన యావత్తు ఫొటో పోజులకే ప్రాధాన్యమిచ్చారని స్థానికులు మండిపడ్డారు. మీడియా ప్రతినిధులు కాకుండా ప్రత్యేకంగా వచ్చి న కొందరు వీడియో, ఫొటో కెమెరాలతో చిత్రీకరిస్తుండగా.. మరికొందరు మూడు డ్రోన్ కెమెరాలతో హడావుడి చేశారు. తమను పట్టించుకోకుండా.. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద రోడ్డు పక్కన పళ్ల వ్యాపారులతో ఫొటోలకు పోజులివ్వడంతో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు నిర్లక్ష్యమే రైతులకు శాపం
-
AP: క‘న్నీరే’ మిగిలింది
నేను కౌలు భూమి 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా వరి కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పదెకరాల్లో పంట నేలవాలిపోయింది. కొంత పంట నీట మునిగింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. ప్రభుత్వం, అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. – వడిశ మహేశ్వరరావు, రైతు, ధవళపేట, శ్రీకాకుళం ఎనిమిది ఎకరాల పొలంలో కేఎన్ఎం రకం వరి పంట సాగు చేశాం. రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి, నానా చాకిరి చేస్తే పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం వల్ల మొత్తం నష్టపోయాం. నష్టపోయినట్లు అధికారులకు తెలిపినా ఇప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. ఏ అధికారి రాలేదు. కనీసం నష్టపోయిన రైతుల నుంచి వివరాలైన తెలుసుకుంటే పరిహారం వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. – పెయ్యల శ్రీకాంత్, ఉప్పలపాడు, నెల్లూరు జిల్లా సాక్షి, అమరావతి: అన్నదాతకు కన్నీరే మిగిలింది. రెక్కల కష్టాన్ని మోంథా తుపాను తుడిచిపెట్టేసింది. ఏపుగా ఎదిగిన వరి కంకులు తలలు వాల్చాయి. కళ్లేదుటే కుళ్లిపోతున్నాయి. మురుగనీటి డ్రెయిన్లలో సకాలంలో పూడిక తీయకపోవడం వల్ల ముంపునీరు దిగే మార్గం లేక ఓ వైపు గోదావరి డెల్టా రైతులు గగ్గోలు పెడుతుంటే.. కృష్ణా డెల్టా పరిధిలో ముంపునీటిని మళ్లించేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరొక వైపు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు, బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగి ప్రవహిస్తూ పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. మరొక వైపు ముంపు లేని ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. పూర్తిగా ముంపునకు గురైన పంట చేల వైపు బృందాలు కన్నెత్తి చూడకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిగా పలు విపత్తుల బారిన పడిన సందర్భాల్లో పంట నష్టపోయిన తమకు పైసా పరిహారం కూడా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులను తలపిస్తున్న చేలు పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో వరి కంకులు నేలరాలాయి. చేలల్లో ముంపునీరు పోయే మార్గం లేక రైతులు తలలుబాదుకుంటున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థను కూటమి సర్కారు గాలికి వదిలేయడంతో డ్రెయిన్లు పూడిపోయి అధ్వానంగా మారాయి. దీంతో మోంథా ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం సవ్యంగా సాగే పరిస్థితి లేకపోవడంతో నీరు పంట చేలను ముంచెత్తింది. దీనికితోడు అవుట్‌పాల్ స్లూయిస్సు, స్ట్రయిట్ కట్లు నిర్వహణ వైఫల్యం కూడా పంట పొలాల మునకకు కారణంగా కనిపిస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో నేలమట్టమైన అరటి తోట పొంగి ప్రవహిస్తున్న ఏలేరు, సుద్దగడ్డ రిజర్వాయర్లు కాకినాడ జిల్లాలో ఏలేరు, సుద్దగడ్డ జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. ఏలేరులో ఇప్పటికే 22 వేల క్యూసెక్కుల నీరు చేరింది. కిందకు ఏడువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ఒకటి రెండ్రోజుల్లో గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే పిఠాపురం బ్రాంచి కెనాల్ కింద 15 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. మరో 30వేల నుంచి 50వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ముంపునకు గురైన వేలాది ఎకరాల్లోని పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, బాపట్లతోపాటు పలు జిల్లాల్లో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు పంట చేలను ముంచెత్తుతున్నాయి. బాపట్ల జిల్లాలో మినుము, పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న పంటలు సగానికిపైగా దెబ్బతిన్నాయి. లంకల్లో అరటి, బొప్పాయి పంటలు తుపాను ధాటికి పూర్తిగా నేల మట్టమయ్యాయి. దీంతో రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. పంట నష్ట అంచనాలను పారదర్శకంగా పూర్తిచేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన చెందుతున్నారు.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలో నేలవాలిన వరి మొలకెత్తిన దృశ్యం పంటంతా నీట మునిగిపోయిందినేను రెండు ఎకరాల్లో వరి పంట వేశాను. రూ.45 వేలు వరకు ఖర్చు చేశాను. పొట్ట దశలో వరి పంట ఉండగా తుపాన్ వల్ల పంటంతా నీట మునిగిపోయింది. నోటి కాడ కూడు లాగేసినట్టైంది. – పోతు ఈశ్వరరావు, చిన అప్పనపాలెం, బుచ్చెయ్యపేట మండలం, అనకాపల్లి జిల్లామొక్కజొన్న పొత్తులు తడిచిపోయాయి ఈ ఏడాది సుమారు 50 సెంట్లు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేశా. పంట కంకులు (పొత్తులు) విరిచి నూర్పిడికి సిద్ధం చేశా. తుపాన్‌తో కంకులు తడిచిపోయాయి. మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. – కత్తుల రాధ, జుమ్మువలస, విజయనగరం జిల్లానారు మడి కొట్టుకుపోయింది నాకు సిద్దిగుంటపాళెం సమీపంలో 3 ఎకరాల పొలం ఉంది. ఈ పొలాన్ని సాగు చేసే నిమిత్తం ఈ నెల 27న 10 సెంట్ల విస్తీర్ణంలో నారుమడి తయారు చేసి 90 కిలోల బిపీటీ విత్తనాలను చల్లుకున్నాను. తుఫాన్‌కు నారుమడి కొట్టుకుపోయింది. – కొక్కముళ్ళ పెంచలయ్య, నెల్లిపూడి, వాకాడు మండలం, తిరుపతి జిల్లా గుర్రపు డెక్కతో నీళ్లన్నీ చేలోనే.. తుపాన్‌తోపాటు కాలువల్లో గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల చేలు నీటమునిగాయి. డెక్క సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించినా ఫలితం లేదు. ఇప్పుడు తీరని నష్టం జరిగింది. – పిట్టా రత్నరాజు, ఆగర్రు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా పంట మొత్తం చేజారిపోయింది 8 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశా. ఎకరానికి రూ.40 వేలు ఖర్చయింది. 105 బస్తాలు కౌలు ఇవ్వాలి. తుపాన్ వల్ల పంట మొత్తం దెబ్బతింది. తీవ్రంగా నష్టపోయాను. సర్కారు ఆదుకోవాలి. – గరువు శ్రీను, శివదేవుని చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లామొక్కజొన్న దెబ్బతింది ఐదు ఎకరాల్లో మొక్కజొన్న వేస్తే అధిక వర్షాలకు రెండు ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన మూడు ఎకరాల్లో పంట కోత కోసి ఆరబోస్తే తుఫాన్‌కు భారీ వర్షం కురిసి కల్లాల్లో ఆరబోసిన పొత్తులు తడిచిపోయింది. దీనిని ఎలా అమ్మాలో కూడా తెలియని దుస్థితి. ప్రభుత్వం స్పందించి తడిచిన పంటను కొనాలి. – సుబ్బన్న, రైతు, కరివేన, నంద్యాల జిల్లాతుపాను తుడిచిపెట్టేసింది గొడవర్రులో 60 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పైగా పెట్టుబడి అయ్యింది. తుపాను కారణంగా మొత్తం వరి చేలు పూర్తిగా పడిపోయాయి. కంకులు నీటిలో నానుతున్నాయి. తాలు, తప్ప తప్ప మరేమీ చేతికి వచ్చేట్టు లేదు. తుపాను పూర్తిగా పంటను తుడిచేసింది. అధికారులు సమగ్రంగా నష్టం నమోదు చేసి ఆదుకోవాలి. – కురగంటి నాగేశ్వరరావు, కౌలురైతు, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా మొక్కలు విరిగిపడితేనే పరిహారమట! 8 నెలల క్రితం బొప్పాయి మొక్కలు నాటుకున్నాను. ఆరు ఎకరాల్లో పంట సాగు చేసా. నిండు కాపుతో కోత దశలో ఉంది. తుఫాన్‌తో పంటంతా దెబ్బతింది. ఆరు ఎకరాలకు రూ.5 లక్షలు అప్పుచేసి పెట్టుబడి పెట్టా. ఒక్క రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఉద్యానవనశాఖ అధికారుల దృష్టికి విషయం తీసుకెళితే మొక్కలు గాలికి విరిగిపడితేనే పరిహారం వస్తుందంటున్నారు. ఇదెక్కడి విడ్డూరమో అర్థం కావడం లేదు. – దమ్మని చంద్రమోహన్, శింగరపల్లె, బేస్తవారిపేట మండలం, ప్రకాశం జిల్లాకౌలు రైతులను ఆదుకోవాలి నేను 22 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. పంట పూర్తిగా నేలకొరిగింది. ఎకరానికి రూ.30 వేల చొప్పన పెట్టుబడి పెట్టాను. సుమారు రూ.6.5 లక్షల వరకూ పంట నష్టం వచ్చింది. కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – యామసాని శివకుమార్, కౌలు రైతు, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లావరి పంటకు మొలకలొచ్చాయి 10 కుంటల్లో వరి పంట సాగు చేశాను. రూ.20 వేలు ఖర్చు అయ్యింది. వరి పంట కోత దశకు వచ్చింది. 15 రోజులు తర్వాత కోత కోద్దామనుకున్నా. ఈలోగా వచ్చిన మొంథా తుఫాన్ కొంప ముంచింది. వరి పంట నేలవాలి మొలకలు వచ్చాయి. సర్కారు న్యాయం చేసి పరిహారం అందించాలి. – కుమార్‌స్వామి రెడ్డి, రైతు, టి.పుత్తూరు, తవణంపల్లె మండలం, చిత్తూరు జిల్లా తుపాను మా కొంప ముంచింది.. మాకు కాగుపాడు ఆయకట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. సొంతంగా సాగు చేశాం. వంద బస్తాలు అవ్వాల్సింది. 60 బస్తాలు కూడా అవ్వుతాదో లే§దో అర్థం కావడం లేదు. పైగా ఆ పంటను పోగుచేసేందుకు అదనపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. కోత మిషన్ ఖర్చులు అదనంగా అవుతాయి. తుఫాన్ మా కొంపముంచింది. – గండికోట నాగయ్య, ఉంగుటూరు, ఏలూరు జిల్లా -
ఆపత్కాలంలో ఆసరా ఏది?
తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్ షీర్’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్పుట్ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత? కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి. -
రైతుల కడుపు కొట్టేలా దిగుమతులా?
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ సమావేశంలో సరైన వైఖరినే ప్రదర్శించారు. భారతదేశం తలకు పిస్తోలు గురి పెట్టి ఎవరూ బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేయించలేరని తెగేసి చెప్పారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థి తులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ధైర్యంగా పలికిన మాటలు నాకొక పాత సంఘటనను గుర్తుకు తెచ్చాయి. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది. ఒకప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఉన్న జగ్జీవన్ రామ్ కోపంతో దాని సమావేశం నుంచి ఒక సారి వాకౌట్ చేశారని చెబుతారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారం, ‘‘మీ వ్యవసాయ ఎగుమతులను మాపై రుద్దాలని చూస్తే సహించేది లేదు’’ అని అమెరికా సీనియర్ అధికారి ఒకరికి జగ్జీవన్ రామ్ నిస్సంకోచంగా చెప్పారు. ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వివిధ హోదాలలో దాదాపు అందరు వ్యవసాయ మంత్రుల వద్ద పని చేశారు కదా! మీకు ఎవరు ఉత్తమమైన వ్యవసాయ మంత్రిగా తోచా’రని అడిగినపుడు స్వామినాథన్ పై ఉదంతం చెప్పారు. జగ్జీవన్ రామ్ 1974 నుంచి 1977 వరకు వ్యవసాయ, సేద్యపు నీటి శాఖ మంత్రిగా పనిచేశారు. కాచుకుని ఉన్న అమెరికావిస్తారమైన భారతీయ వ్యవసాయ మార్కెట్లోకి అడుగు పెట్టాలని అమెరికా ఏనాటి నుంచో కాచుకుని ఉందని మనం గుర్తుంచుకోవాలి. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలలో భారత్ ఇంతవరకు దృఢ వైఖరినే అనుసరిస్తూ వస్తోంది. వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్య సంపదల రంగాలను కాపాడుకుని తీరుతామని చెబుతోంది. కానీ, మన దేశంలోని కొన్ని బలమైన వర్గాలు ఎప్పుడూ బహుళ జాతి కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతూ వస్తున్నాయి. ఆత్మనిర్భరత సాకుతో అవి తమ వైఖరిని సమర్థించుకుంటున్నాయి. అమెరికా సంస్థలకు ద్వారాలు తెరిస్తే– దేశంలోని పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పాడిపరిశ్రమ, యాపిల్, ఇతర పండ్ల విభాగాల వారి ప్రయోజనాలను పణంగా పెట్టినట్లు అవుతుంది. అమెరికా సహజంగానే తన తదుపరి లక్ష్యంగా మొదట వరిని, తర్వాత గోదుమలను ఎంచుకుంటుంది. అమెరికా సిసలైన ప్రయోజనాలు వీటిలోనే ఇమిడి ఉన్నాయి. జన్యుపరంగా సవరించిన (జీఎం) యాపిల్స్, మొక్కజొన్న, సోయాబీన్ల ప్రవేశం వివాదాస్పదంగా మారడంతో, దానికి సంబంధించిన కార్యనిర్వాహక పత్రాన్ని నీతి ఆయోగ్ ఇప్పటికే ఉపసంహరించుకుంది. సుంకాలు లేని విధంగా పత్తి దిగుమతికి అనుమతిస్తున్నట్లుగానే, పాలు, పాల ఉత్పత్తులకు కూడా మార్కెట్ ద్వారాలు తెరవడం సముచితంగా ఉంటుందని వాదించే ఆర్థికవేత్తలు కొందరు తయారయ్యారు. కానీ, వారొక సంగతిని గ్రహించడం లేదు. అమెరికాలో సుమారు 8,000 మంది పత్తి రైతులున్నారు. అక్కడి వ్యవసాయ క్షేత్ర సగటు పరిమాణం 600 హెక్టార్లు. వారికి ఏటా లక్ష డాలర్లకు పైగా సబ్సిడీ అందుతుంది. అది అంతర్జాతీయ ధరలను తగ్గిస్తుంది. ఫలి తంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని రైతులు దెబ్బతింటారు. మన దేశంలో పత్తి రైతులు 98 లక్షల మందికి పైగా ఉన్నారు. వారి కమతాలు సగటున 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే. చౌక ధరలకు, సబ్సిడీ దిగుమతులను అనుమతిస్తే, అసలే అంతంత మాత్రంగా ఉన్న వారి బతుకు బండలవుతుంది. దానికి బదులు, దేశీయ పత్తి పరిశ్రమ మన రైతులకు అండగా నిలిస్తే, అది నిజంగా ఉభయ తారకమైనది అవుతుంది. పత్తి దిగుమతిపై సుంకాలు పైసా కూడా లేకుండా చేయడం ద్వారా, భారత్ తన రైతులను తోడేళ్ళ బారిన పడేసినట్లయింది. చౌక దిగుమతులతో రైతులకు నష్టంపప్పు ధాన్యాల విషయంలో సరఫరా–డిమాండ్ సూత్రం పనిచేయడం లేదు. పప్పు ధాన్యాల విస్తీర్ణం 3.07 కోట్ల హెక్టార్ల నుంచి గత ఐదేళ్ళలో 2.76 కోట్ల హెక్టార్లకు కుంచించుకుపోయింది. దానివల్ల డిమాండ్ కొద్దిగా పెరిగినా, ఆ మేరకు రైతుల మార్కెట్ యార్డు ధరలు ఏమీ పెరగలేదు. నిజానికి, వాటి ప్రస్తుత మార్కెట్ ధరలు, ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా సుమారు 30 శాతం తక్కువగా ఉన్నాయి. దిగుబడి తగ్గడం వల్ల ఏర్పడిన వెలితిని చౌక దిగుమతులు భర్తీ చేయడమే దానికి కారణం. ఆ దిగుమతులు కూడా అవసరమైన దానికన్నా రెండింతలున్నాయి. చాలా రకాల చిక్కుళ్ళు సుంకాలు లేకుండా దిగుమతి అయ్యాయి. ఒక్క 2024–25లోనే 7.6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నారు. అలాగే, 2020 –21లో పప్పు ధాన్యాల దిగుమతికి రూ. 12,153 కోట్లను వెచ్చిస్తే, గడచిన ఐదేళ్ళలో దిగుమతి వ్యయం ఇప్పటికే అంటే 2024–25లో రూ. 47,000 కోట్లను దాటినట్లు వార్తలు సూచిస్తున్నాయి. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే నెపంతో జీఎం సోయా గింజల దిగుమతిని సమర్థించుకుంటున్నారు. నిజానికి, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని సోయా రైతులు గిట్టుబాటు ధర కోసం లబోదిబోమంటున్నారు. సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ. 5,328గా నిర్ణయించగా, మార్కెట్ ధరరూ. 3,500 నుంచి రూ. 4,000 మధ్య ఊగిసలాడుతోంది. ఒత్తిళ్లకు లొంగకూడదు!కేంద్రం తగిన నియమ, నిబంధనలను రూపొందించేంత వరకు జీఎం ఆహార పదార్థాల దిగుమతి, అమ్మకాలను నిలిపి వేయాలని రాజస్థాన్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. దిగుమతులకు అది కాస్త బ్రేకు వేయవచ్చు. జీఎం సోయాబీన్ దిగుమతులకు ద్వారాలు తెరవవలసిందని అమెరికా గతంలోనూ మనపై ఒత్తిడి తెచ్చింది. బయోటెక్నాలజీ –ఫుడ్ సెక్యూరిటీ ఫోరమ్ (ఢిల్లీ) చేపట్టిన ఉద్యమం వల్ల, ఎట్టకేలకు భారతీయ రేవులకు అమెరికా సోయా బీన్ చేరగానే దాన్ని (దేశీయ ఉత్పత్తితో కలపకుండా) వేరుగా ఉంచా లని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆదేశించింది. అమెరికా సరఫరాదారులు తమ దేశంలోని సీనియర్ అధికారుల మద్దతుతో ఆ చర్యను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిడికి తలొగ్గ లేదు. ఇప్పుడూ అదే రకమైన వైఖరిని అనుసరించాలి. ఆహార పదార్థాలను నౌకల నుంచి దించుకొనే దయనీయమైన పాత రోజులలోకి భారత్ మళ్ళీ జారి పోకూడదు.దేవీందర్ శర్మవ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
కూటమి ప్రభుత్వం ఈ-క్రాప్‌ను పూర్తిగా నీరుగార్చింది: YS జగన్
-
Vidadala: ఇది చిలకలూరిపేట రైతుల పరిస్థితి.. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే
-
రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది: YS జగన్
-
చంద్రబాబు, లోకేష్ పబ్లిసిటీ.. ఏకిపారేసిన రాచమల్లు శివ ప్రసాద్
-
కేబినెట్ లోకి కొత్త మంత్రి.. అన్నదాతపై తుఫాను పంజా
-
ఓ వైపు బాబు పాలన.. మరోవైపు ప్రకృతి ప్రళయం.. కుదేలైన అన్నదాత
-
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిండా మునిగిన రైతులు
-
పంటలపై 'మోంథా' తాండవం!
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘మోంథా’ తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్క జొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుపాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30 శాతం మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ, కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు.. ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన పంట ఇలా నీటి పాలవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. భారీగా తగ్గనున్న దిగుబడులతో వందల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి నష్టం రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నీటమునిగిన మొక్కజొన్న రాశులు ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అడుగడుగునా కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి–అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం అదునుకు విత్తనాలతోపాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓ వైపు పెట్టుబడులు తడిసి మోపెడైనా.. మరోవైపు ప్రభుత్వం పట్టించు కోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86.32 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. లక్ష్యానికి మించి ఇప్పటి వరకు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే సాగయ్యాయి. 38.97 లక్షల ఎకరాల్లో వరి, 11 లక్షల ఎకరాల్లో పత్తి, 5 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగయ్యాయి. వరి, మొక్కజొన్నకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, పత్తికి రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అయితే మోంథా తుపాను వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు పైగా వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో ఉద్యాన.. ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. వరి పంటపై 30 శాతం ప్రభావం సాగైన వరి విస్తీర్ణంలో 30 శాతం పంటను తుపాను దెబ్బ తీసిందని తెలుస్తోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో దాదాపు 6–10 లక్షల ఎకరాలకు పైగా పంట ముంపునకు గురైనట్టుగా అంచనా. ఇతర పంటలన్నీ కలిపి మరో నాలుగైదు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. లేటుగా నాట్లు వేసిన చోట పంట నిలదొక్కుకున్నప్పటికీ ముందుగా సాగైన చోట మాత్రం పంట చాలా వరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని సెంట్రల్–ఈస్ట్రన్ డెల్టా పరిధిలో పంటలు ఎక్కువగా దెబ్బతినగా, ఉత్తరాంధ్ర, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని భవనాశి వాగు వెంట నీట మునిగిన మొక్కజొన్న తోట కృష్ణా, గోదావరి లంకల్లో అరటి, బొప్పాయి పంట దెబ్బతినగా.. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా 396 మండలాల పరిధిలో 2,320 గ్రామాల్లో 1.38 లక్షల మంది రైతులకు సంబంధించి 2.82 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగాప్రాథమికంగా అంచనా వేసింది. దాంట్లో ప్రధానంగా 1.79 లక్షల ఎకరాల్లో వరి, 75 వేల ఎకరాల్లో పత్తి, 15 వేల ఎకరాల్లో మినుము, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్టుగా చెబుతోంది. నంద్యాల యార్డులో కొనేవారు లేక విక్రయానికి సిద్ధంగా ఉంచిన మొక్క జొన్న రాసులు తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. తగ్గనున్న దిగుబడులపై అన్నదాత గుబులు అధిక వర్షాల కారణంగా లక్షలాది ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. వర్షాలు పూర్తిగా తెరిపినిచ్చి, ముంపు నీరు కాస్త దిగినా ముంపునకు గురైన ప్రాంతాల్లోని పంట ఆశించిన దిగుబడి వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవంటున్నారు. గతేడాది హెక్టారుకు 5,578 కిలోలు చొప్పున దిగుబడి రాగా, ఈ ఏడాది 5,543 కిలోలకు మించి రాదని మొదటి ముందస్తు అంచనాలను బట్టి లెక్కగట్టారు. కానీ ఈ తుపాను ప్రభావం వల్ల దిగుబడి కాస్త 4,000–4,500 కిలోలకు పడిపోతుందని తాజా అంచనా. మొదటి ముందస్తు అంచనా ప్రకారం 81.87 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, తుపాను ప్రభావం వల్ల 65 లక్షల టన్నులకు మించదని తెలుస్తోంది. మరొక వైపు గతేడాది పత్తి హెక్టార్‌కు 442 కిలోలు రాగా, ఈ ఏడాది 357 కిలోలు, మొక్కజొన్న గతేడాది 4,710 కిలోలు రాగా, ఈసారి 4,259 కిలోలు, కంది గతేడాది 171 కిలోలు రాగా, ఈసారి 117 కిలోలు, వేరుశనగ గతేడాది 258 కిలోలు రాగా, ఈ ఏడాది 149 కిలోల చొప్పున దిగుబడులొస్తాయన్నది మొదటి ముందస్తు అంచనా. అయితే తుపాను ప్రభావంతో కనీసం 20–30 శాతం మేర పంటల దిగుబడులు తగ్గి పోతాయని తెలుస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో నేలకొరిగిన వరి పైరును నిలబెడుతున్న రైతు పంట నష్ట పరిహారం పరిస్థితీ అంతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండగా ఏ సీజన్‌కు సంబంధించిన పంట నష్టపరిహారాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేసేవారు. ఇప్పుడా పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదు. నిర్ణీత గడువులోగానే వ్యవసాయ, ఉద్యాన శాఖలు తుది అంచనాలు తయారు చేస్తున్నప్పటికీ పరిహారం మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కరువు సాయంతో పాటు పంట నష్ట పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూనే వస్తోంది. గడిచిన 17 నెలలుగా పెండింగ్ ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 5.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.595 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిలో గతేడాది వరదలతో పాటు అకాల వర్షాలకు సంబంధించి 76.75 కోట్లు ఉండగా, ఖరీఫ్ 2024, రబీ 2024–25 సీజన్లకు సంబంధించి దాదాపు రూ.100 కోట్లకు పైగా కరువు సాయం రూ.వంద కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో నిలిచిన ఖరీఫ్ 2023, రబీ 2023–24 సీజన్లకు సంబంధించి మరో రూ.311.39 కోట్లు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంక–పోతార్లంక రోడ్డులో నేలమట్టమైన అరటి తోట కదిలిస్తే కన్నీరే.. మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు రాష్ట్రంలోని సగం జిల్లాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రైతులను కదిలిస్తే చాలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్క నంద్యాల జిల్లాలోనే 1.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలో వేలాది ఎకరాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వేరుశనగ, వరి, టమాటా, ఉద్యాన పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 33వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో ప్రధానంగా 43,375 ఎకరాల్లో పత్తి, 5,250 ఎకరాల్లో వరి, 3,048 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లాలో వరి, పత్తి, మినుము, సోయాబీన్, మిర్చి, అరటి, బొప్పాయి పంటలు.. మొత్తంగా 12,293 ఎకరాల్లో నెలకొరిగాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరి పంటతోపాటు బొప్పాయి, అరటి, కూరగాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. 1,15,892 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు రూ.73.45 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. ఎన్టీఆర్ జిల్లాలోని 17 మండలాల్లో 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో రూ.60 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో 6 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేలాది కొబ్బరి చెట్లు పడిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 10,309 ఎకరాల్లో పంట నీట మునగ్గా, ఈదురు గాలుల ధాటికి 16,072 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వేలాది ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లింది. నల్లి క్రిక్ సముద్రపు ఆటుపోట్లతో చెరువుల గట్లు తెగి ముంపు బారిన పడ్డాయి. ఏలూరు జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. వర్షాలు, చలిగాలుల ప్రభావంతో చెరువుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతుండటం ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 16,092 హెక్టార్లలో వరి నేలకొరిగింది. వేలాది హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లా పాతదేవరాయపల్లిలో నీటిలో తేలియాడుతున్న వరి పైరు ఉచిత పంటల బీమా ఉండి ఉంటే..⇒ కూటమి ప్రభుత్వంలో పంటలకు ఈ–క్రాప్ లేదు.. ఇన్సూ్యరెన్సూ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ అంతంతే.. పెట్టుబడి సాయం రూ.40 వేలకు గాను తూతూ మంత్రంగా కొద్ది మందికే రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉల్లి, టమాటా పంటలకు కూలి కూడా దక్కక పశువులకు వదిలేస్తున్న దీన స్థితి. కూటమి ప్రభుత్వం ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందకుండా చేసింది. ⇒ ఉచిత పంటల బీమా పథకం ఉండి ఉంటే ఇలాంటి విపత్తు వేళ రైతులకు అక్కరకొచ్చేది. నూరు శాతం కవరేజీతో నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా రక్షణ లభించేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించి స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియం భారం కావడంతో ఈ పథకంలో చేరేందుకు రైతులెవ్వరూ ముందుకు రాలేదు. ⇒ ఉచిత పంటల బీమా పుణ్యమా అని ఖరీఫ్–2024లో 84.80 లక్షల మంది రైతులు 69.51 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకు బీమా రక్షణ పొందగలిగారు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో రబీ 2024–25 సీజన్లో 9.93 లక్షల ఎకరాలకే పరిమితం కాగా, 7.65 లక్షల మంది రైతులు మాత్రమే బీమా కవరేజ్ పొందలిగారు. ఖరీఫ్ 2024–25 సీజన్లో 19.60 లక్షల ఎకరాల్లో మాత్రమే బీమా కవరేజ్ లభించగా, 19.51 లక్షల మంది బీమా చేయించుకోగలిగారు.⇒ 2024 జూన్‌లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్లు నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది. మరొక వైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ 2024 సీజన్‌కు రూ.894.62 కోట్లు, రబీ సీజన్‌కు రూ.758.74 కోట్లు, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.774.87 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా, ఒక్క పైసా కూడా చెల్లించిన పాపాన పోలేదు. ఫలితంగా పంటల బీమా పరిహారం అందని ద్రాక్షగా మారింది.తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి– పట్లంట్ల రోడ్డులోని ఓ తోటలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలిపంట నష్టం అంచనాలు పక్కాగా రూపొందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో మాదిరిగా తూతూ మంత్రంగా చేపట్టడం కాకుండా, పక్కాగా చేపట్టి సాధ్యమైనంత త్వరగా రైతుల ఖాతాకు పరిహారం జమ చేయాలని, పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నాయి. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటన సందర్భంగా విపత్తుల్లో దెబ్బతిన్న వరి పంటకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆ మాటను నిలబెట్టు కోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఉచిత పంటల బీమాను కొనసాగించి, నూరు శాతం పంటల బీమా వర్తింప చేయాలని, దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రభుత్వమే బాధ్యతగా తీసుకొని పంటల బీమా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. తుపాను అనంతరం పంటలను కాపాడుకునేందుకు పంటను బట్టి ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు రైతులకు ఖర్చవుతుందని అంచనా. ఇందు కోసం ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, లేబరు ఖర్చును పూర్తిగా ఈ పథకం కింద ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.గుంటూరు జిల్లా తాడికొండలో పత్తి పొలంలోకి చేరిన వరద నీరు ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేంనాలుగెకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంటలను సాగు చేశాను. పత్తి తీతలు ప్రారంభమయ్యే దశలో తుపాను కారణంగా కాయలు కుళ్లిపోయాయి. ఎకరాకు 3–5 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కంది పంట పూర్తిగా నేలవాలింది. తీవ్రంగా నష్టపోయాను. నాలాంటి రైతులు ఎంతో మంది నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మేం బతకలేం. – బొల్లా మాలకొండయ్య, నాదెండ్ల, పల్నాడు జిల్లాపంట పూర్తిగా నేలకొరిగింది నాకు ఉన్న రెండు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పూర్తిగా నేలకొరిగింది. ప్రభుత్వం న్యాయం చేసి మాలాంటి రైతులను ఆదుకోవాలి. – కాళా వెంకటరావు, ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లానారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి వరి పంట సాగు చేయడానికి పోసుకున్న నారుమళ్లు తుపానుతో పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 20 రోజుల్లో నాట్లు వేయాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతింది. మళ్లీ నార్లు పోసుకోవాల్సి ఉంది. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఆర్థిక స్తోమత లేదు. ప్రభుత్వం విత్తనాలు రైతులకు ఉచితంగా అందించాలి. – కృష్ణయ్య, రైతు, వాకాడు మండలం, తిరుపతి జిల్లా పంట పూర్తిగా నానిపోయింది ఈ ఏడాది చోడి (రాగులు) పంట వేసిన సమయంలో విపరీతమైన ఎండ వల్ల పంట ఎండిపోయింది. కొద్దోగొప్ప మిగిలిన పంట చేతికందే సమయంలో తుపాను కారణంగా చేనంతా నేలకొరిగింది చోడి కంకులు పూర్తిగా నానిపోయాయి. ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.విశ్వనాథ్, గిరిరైతు, బోసుబెడ గ్రామం, అరకులోయ చివరికి కన్నీళ్లే మిగిలాయిమూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాం. పంట బాగా పండిందని సంబరపడ్డాం. తుపాను ఉందని తెలియడంతో కల్లాల్లో ఉంచితే మొక్కజొన్నలు తడిచి పోతాయని భయపడ్డాం. వ్యవసాయ మార్కెట్ యార్డులో నిల్వ ఉంచితే తడవకుండా గట్టెక్కుతామని కూలీలను పిలిపించుకుని మొక్కజొన్నను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌కు తరలించాం. గంట గంటకు వరద నీరు వచ్చి చేరింది. కళ్ల ముందే మొక్కజొన్నలు కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయాం. ఏడు రోజులు తిప్పలు పడుతూ పంటను కాపాడుకుంటే కష్టమంతా వర్షం పాలైంది. – శ్రీదేవి, క్రిష్ణాపురం, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాఈ అప్పు ఎలా తీర్చుకోవాలయ్యా?కూలీనాలీ చేసుకుంటూ మాకున్న పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేశాం. నారు పోసిన సమయం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1.30 లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాం. తీరా‡ కోతకు వచ్చి కోసుకునే సమయంలో తుపాను దెబ్బకు పైరు మొత్తం నేలకు వాలిపోయింది. వర్షం అలానే కురుస్తుండడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. ప్రస్తుతం కోసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. చేసిన అప్పు ఎలా తీర్చాలో దిక్కు తోచడం లేదు. – పి.రాజమ్మ, ఉప్పలపాడు , నెల్లూరు జిల్లా -
రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్
-
కౌలు రైతులకు గడ్డుకాలం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నివిధాలుగా మోసపోయామని కౌలు రైతులు వాపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఏపీ కౌలు రైతుల సంఘం, పీపుల్స్ పల్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20 నుంచి నెల రోజులపాటు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సర్వే జరిపారు. సర్వే ఫలితాలను రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి.జములయ్య సోమవారం మీడియాకు విడుదల చేశారు. 40 ప్రశ్నల ద్వారా కౌలు రైతుల నుంచి రాబట్టిన సమాధానాలను క్రోఢీకరించి తుది సర్వే నివేదిక రూపొందించినట్టు వెల్లడించారు. కౌలు రైతుల దయనీయ పరిస్థితికి ఈ సర్వే అద్దం పడుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకం దూరం కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని కౌలు రైతులు తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల సంక్షేమ ఫలాలు ఏ ఒక్క కౌలు రైతుకు అందడం లేదనే విషయాన్ని కుండబద్దలు గొట్టారు. సర్వేలో ఏం తేలిందంటే.. స్వచ్ఛంద నమోదు పద్ధతిన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం పుణ్యమా అని గడచిన 17 నెలల్లో ప్రీమియం భారమై పంటల బీమా రక్షణ కోల్పోయామని 99.1 శాతం మంది కౌలు రైతులు సర్వేలో స్పష్టం చేశారు. మద్దతు ధర దక్కడం లేదని 96.2 శాతం మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ–పంటలో నమోదు చేయకపోవడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతానికి మించి పంట ఉత్పత్తులను కౌలు రైతులు అమ్ముకోలేకపోతున్నారని సర్వేలో తేలింది. మాట ఒప్పందంతోనే కౌలు ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటారని అంచనా. వారిలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నట్టు సర్వేలో నిర్ధారించారు. 92.3 శాతం మంది కౌలు రైతులు మాట ఒప్పందం ద్వారానే భూముల్ని కౌలుకు తీసుకుంటున్నారు. 3.9 శాతం మంది రాతపూర్వక ఒప్పందం చేసుకోగా.. రెవెన్యూ రికార్డుల ద్వారా 2.6 శాతం మంది కౌలు ఒప్పందాలు చేసుకున్నారు. నగదు రూపంలో ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.35 వేల వరకు లేదా ఎకరాకు 10 నుంచి 30 బస్తాల వరకు చెల్లిస్తున్నారు. 96.6 శాతం మందికి అందని ఫలాలు 87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేకపోతున్నారని సర్వేలో తేలింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని 96.6 శాతం మంది కౌలు రైతులు తేలి్చచెప్పారు. పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందలేకపోతున్నామని 92.7 శాతం మంది స్పష్టం చేశారు. పెట్టుబడి కోసం ఏటా పంటను బట్టి 65 శాతం మంది రూ.60 వేల వరకు, 34.3 శాతం మంది రూ.60 వేలకు పైగా అప్పులు చేస్తున్నారు. వీటికోసం 38 శాతం మంది వడ్డీ వ్యాపారులను, 28.8 శాతం మంది వ్యాపారులు/దళారులను, 12.7 శాతం మంది భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. తీసుకునే రుణంపై 79 శాతం మంది నూటికి రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తుండగా.. మిగిలిన వారు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. అదనుకు విత్తనాలు, ఎరువులు దొరకడం లేదని, పురుగు మందులు, కూలిరేట్లు, యంత్రాల అద్దెల భారం వల్ల ఆరి్థక ఇబ్బందులకు గురవుతున్నామని 67.2 శాతం మంది వాపోయారు.91.4 శాతం మందికి ఈ–పంట దూరం వాస్తవ సాగుదారుల పంట వివరాలను మాత్రమే నమోదు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే.. తాము పండించిన పంటల వివరాలను ఈ–పంట యాప్‌లో నమోదు చేయడం లేదని 91.4 శాతం మంది కౌలు రైతులు ఈ సర్వేలో తేల్చి చెప్పారు. ఫలితంగా పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేక దళారులు, ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రైవేటు మార్కెట్లో 79.5 శాతం మంది, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 14.3 శాతం, దళారులకు 6.2 శాతం మంది అమ్ముకుంటున్నట్టుగా వెల్లడించారు. సగటున రూ.5 లక్షల అప్పు ఒక పంట సాగుచేస్తే ఏటా రూ.25 వేలపైన ఆదాయం వస్తోందని 28.1 శాతం, లాభం లేదు, నష్టం లేదని 19.4 శాతం మంది వెల్లడించగా.. నష్టం వస్తోందని 15.4 శాతం మంది కౌలు రైతులు తెలిపారు. దాంట్లో కూలీలకే దాదాపు 69.8 శాతం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం మీకు ఎంత అప్పు ఉందని ప్రశ్నిస్తే రూ.5 లక్షలపైన ఉందని 20.4 శాతం మంది చెప్పగా.. మిగిలిన వారు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల మధ్య ఉన్నట్టుగా చెప్పారు. తాము ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం మంది, సకాలంలో గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం మంది, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం మంది, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం మంది, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు.పంటల బీమాకు దూరమైన కౌలు రైతులు 99.1% సంక్షేమ పథకాలు అందని వారు 96.6% మద్దతు ధర దక్కని కౌలుదారులు 96.2% పంట రుణాలు దక్కని వారు 92.7% సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదన్న వారు 67.2% సీసీఆర్సీ కార్డులు అందని వారి శాతం 87.7% కొనుగోలు కేంద్రాల్లో పంటల్ని విక్రయించే వారు 14.3% -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
-
చంద్రబాబుకు రైతులంటే పగ: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదంటూ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలన్నచిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.చంద్రబాబుకు రైతులంటే పగ.. వారి గోడును పట్టించుకునే పరిస్థితిలో లేడు. రైతుల సమస్యలను గాలికొదిలేసి తండ్రీకొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు, లోకేష్ హేళనగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబే అంగీకరించారు’’ అని కాకాణి గుర్తు చేశారు.‘‘తుపాను నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, హెచ్చరికలు లేవు. వరి నాట్లు వేసిన తరువాత యూరియా కొరత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరో వైపు లక్ష ఎకరాలలో నెల్లూరు, కర్నూలు, ఒంగోలులో నీట మునిగిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖా మంత్రి పనిచేస్తున్నాడా?. రైతుల కష్టాలపై ఏమాత్రం అయినా స్పందన ఉందా?...ఇప్పటికే మామిడి రైతులు, పత్తి రైతులు భారీగా నష్టపోయారు. తాజా వర్షాలతో 50 వేల ఎకరాల పంట నష్టపోయారు. మొక్కజొన్న రైతులు ఎకరానికి 12 వేల రూపాయలు మేర నష్టపోయారు. కృష్ణ, గోదావరి డెల్టాలలో తుపాన్ నేపథ్యంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది. పంట నష్టం పై ఎక్కడా నష్టపరిహారం లేదు. చంద్రబాబుకు రైతు అంటే పట్టదు.. వ్యవసాయం అంటే గిట్టదు. చంద్రబాబు ఇప్పటి వరకు రైతులపై ఒక్క సమీక్ష నిర్వహణ లేదు. టమోటా రైతులు, ఉల్లి రైతులను హేళనగా మాట్లాడే పరిస్థితి... వైఎస్ జగన్ హయాంలో ఏనాడు అయినా యూరియా కోసం రైతు కష్టపడ్డ పరిస్థితులు లేవు. రైతుల కోసం జగన్ నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. చంద్రబాబు ఏనాడు సీఎం అయినా రాష్ట్రం దుర్భిక్షం... రైతాంగానికి తీరని నష్టం. అన్నదాత సుఖీభవ సాక్షిగా రైతులకు 20 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు కేవలం ఐదు వేలు ఇచ్చి మోసం చేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి దళారీల లబ్ధి కోసం పనిచేస్తాడు తప్ప రైతుల కోసం కాదు. రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వడం, దానికి కార్డులు పంచడం హాస్యాస్పదం. యూరియా విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. యూరియా కోసం రేషన్లాగా కార్డులు పంచిన చరిత్ర హీనుగా చంద్రబాబు నిలిచిపోతాడు. రైతులకు అవసరం మేర యూరియా పంపిణీ చేయాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. -
ఈసారి పత్తి విక్రయాలు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: జిన్నింగ్ మిల్లుల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు, దళారుల జోక్యాన్ని అడ్డుకోవ డానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెచ్చిన నిబంధనలు పత్తి రైతులకు గుది బండగా మారాయి. గతేడాది వరకు సీసీఐ నోటిఫై చేసిన సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లో రైతులు పత్తిని విక్రయించుకొనే వెసులుబాటు ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోవడమే అందుకు కారణం. సీసీఐ తీసుకొచ్చిన తాజా నిబంధనల ప్రకారం రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో వారి వివరాలతో పంట సమాచారాన్ని నమోదు చేసుకొని స్లాట్ బుక్ చేసుకున్నాక సీసీఐ నోటిఫై చేసిన ఆయా జిల్లాల్లోని కొన్ని మిల్లుల్లో ఏదో ఒక దాన్ని మాత్రమే ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. తదనుగుణంగా ఎంత దూరమైనా ఆ జిల్లాలో నిర్దేశించిన మిల్లుల్లోనే రైతులు పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్దేశించిన రోజు పత్తిని విక్రయించకపోతే రైతులు మళ్లీ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 జిల్లాలలోని మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3లుగా 12 రకాల సీసీఐ విభజించడంతో ఈ సమస్య తలెత్తింది.ఎల్–1 నుంచి ఎల్–12 వరకు మిల్లుల విభజనఏదైనా పనికి టెండర్లు వేసినప్పుడు తక్కువ ధరకు బిడ్ వేసిన వారిని ఎల్–1గా, ఆ తర్వాత వారిని ఎల్–2, ఎల్–3గా నిర్ణయిస్తారు. పత్తి విక్రయాల్లోనూ ఈసారి సీసీఐ అదే విధానాన్ని అవలంబించింది. పత్తి కొనుగోళ్లకు టెండర్లు పిలిచినప్పుడు 347 మిల్లులు పాల్గొనగా వాటిలో 317 మిల్లులను పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ నోటిఫై చేసింది. వాటిలోనూ తక్కువ ధరకు జిన్నింగ్ చేసేందుకు ముందుకొచ్చిన, నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి, మెరుగైన సదుపాయాలు ఉన్న మిల్లులకు ఇచ్చిన మార్కుల ఆధారంగా ఎల్–1, ఎల్–2 నుంచి ఎల్–12 వరకు కేటగిరీలుగా విభజించింది. ఈ లెక్కన రాష్ట్రంలో ఎల్–1 కింద 117 మిల్లులు ఉండగా ఎల్–2 కింద 75, ఎల్–3 కింద 48, ఎల్–4 కింద 26, ఎల్–5 కింద 10 మిల్లులు, ఎల్–12 కింద వరంగల్‌లోని ఒక మిల్లును సీసీఐ ఎంపిక చేసింది.ఒకటి నిండాకే మరొకటి..రాష్ట్రంలో ప్రస్తుతం సీసీఐ ద్వారా నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఆదిలాబాద్‌లో 6, కొత్తగూడెంలో 2, ఖమ్మంలో 3, నారాయణపేట, సిద్దిపేటలో ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున 13 మిల్లులు మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. వాటిలో ఇప్పటివరకు 26 మంది రైతులు కేవలం రూ. 53 లక్షల విలువైన 66.48 క్వింటాళ్ల పత్తినే విక్రయించారు. వారంతా ఎల్–1 కింద నమోదైన మిల్లుల్లోనే పత్తిని విక్రయించారు. ఎల్–1 కింద కేటాయించిన 117 మిల్లుల్లో వాటి సామర్థ్యం మేరకు పత్తి బేళ్లు నిండాకే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3కి కేటాయిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లకు పత్తి తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎల్–1 మిల్లులకే రైతులు పత్తిని విక్రయించాల్సి వస్తోంది. వచ్చే నెలలో పత్తి ఎక్కువగా మార్కెట్లకు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎల్–1లో లేని మిల్లులు తమ వంతు వచ్చే వరకు మిల్లింగ్ చేయకుండా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతకు ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: అన్నదాతకు మోంథా తుపాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగే అపార నష్టం భయం పట్టుకుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేతికొచ్చి న పంట ఎక్కడ తుపాను బారిన పడుతుందోననే ఆందోళన కలవరపెడుతోంది. ముంచుకొస్తున్న మోంథా నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోతలు ప్రారంభమైన జిల్లాల్లో కనీస మద్దతు ధర లేక, పంటను అమ్ముకునే దారిలేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు.. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా వెంటాడింది. అన్నదాతలు తీవ్ర వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేశారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకూ ఏదీ సక్రమంగా అందించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసినా.. నానా అవస్థలు పడి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా పంట చేతికొచ్చే దశలో మోంథా రూపంలో విరుచుకుపడుతున్న తుపాను వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. కానీ క్షేత్ర స్థాయిలో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టుగా రైతులు చెబుతున్నారు. ముంచుకొస్తున్న మోంథా తుపాను ప్రభావం వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పత్తి, మొక్కజొన్న రైతు దిగాలు పత్తి రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఖరీఫ్‌లో వరి తర్వాత కాస్త ఆశాజనకంగా సాగైన పంట పత్తి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా ఆగస్టు రెండో వారంలో పూత, పింద రాలిపోగా, సెప్టెంబర్ నాలుగో వారంలో వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర రూ.8,110 కాగా మార్కెట్లో రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఏటా అక్టోబర్ 1న సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఏడాది నాలుగో వారం వచ్చి నా కూటమి ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో కొతకొచ్చి న పంటను తేమ శాతంతో కొర్రీలు వేయడంతో అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పూతకొచ్చి న పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. అధికారికంగానే 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మోంథా తుపాను కూడా జతకలిస్తే పత్తి రైతుల ఆశలు పూర్తిగా గల్లంతైనట్టే. ఇక పత్తి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో మొక్కజొన్న 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాల వల్ల 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్త 15–20 క్వింటాళ్లకు పరిమితమైంది. మరో వైపు కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రస్తుతం దళారీలు రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య కొంటున్నారు. ఫలితంగా ఎకరాకు రూ.17,500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఇదే అదనుతో పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం రైతుపై తుపాను పోటు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. గతేడాది మద్దతు ధర లేక 75 కేజీల బస్తాకు రూ.300–రూ.500 వరకు నష్టపోయిన కర్షకులు ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నారే తప్ప ఒక్క కేంద్రం కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా కసరత్తు కూడా చేసే ఆనవాళ్లు కనిపించట్లేదని రైతులు వాపోతున్నారు. -
‘పొట్ట’ కొడుతున్న వానలు
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల పొట్ట కొడుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి సంకటంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప.గో., గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరితోపాటు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో వరి చేలు పడిపోయాయి. నంద్యాలలో మొక్కజొన్న రైతును దెబ్బతీసింది. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వాస్తవానికి రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. రైతుల కష్టాలుకుండపోత వర్షాలకు పొట్ట దశకు చేరుకున్న వరి పంట నేలకొరగడంతో రైతులు పడరాని పాట్లు పడుతన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో పాటు గింజలు రంగుమారే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. అన్ని పంటలకూ నష్టం రబీ సీజన్లో మినుము, జొన్న, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల మళ్లీ విత్తుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వరి, కూరగాయలు, చెరకు, ఆరుతడి పంటలకు అధిక నష్టం వాటిల్లగా, రాయలసీమ జిల్లాల్లో అపరాలు, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి రైతును తేమ ముప్పు వణికిస్తోంది. పత్తి తీసి అమ్మకాలకు సిద్ధపడుతున్న తరుణంలో భారీ వాన రైతుల ఆశలను చిదిమేసింది. వరిపైనే అధిక ప్రభావం వరిపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గింజల్లో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీపీటీ 5204, పీఎల్ 1100 వంటి రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకు మచ్చ, పాముపొడ, కాటుక తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల వరి దిగుబడులు 15–25 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపరాలకు 10–20 శాతం, కూరగాయలకు 20–30 శాతం,మిరపకు 15–30 శాతం, మొక్కజొన్నలో 10–18 శాతం, చెరకులో 8–15 శాతం మేర దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరిలో...యాజమాన్య పద్ధతులిలా..వరి పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాలలో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాలలో డ్రెయినేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ ,కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి » ధాన్యం గట్టిపడే నుంచి కోత దశలో ఉన్న పంట పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే (వాలిన లేదా నిలిచిన పంటలో) 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల గళ్ళ ఉప్పు / లీటరు నీరు) పిచికారీ చేయాలి.» ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ) వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాలలో 7 రోజుల్లో తగ్గితే ఎకరాకు యూరియా 20 కేజీలు + పొటాష్ 20 కేజీలు/ బూస్టర్ డోసుగా వేయాలి.» నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నర్సరీ దశలో ఉన్న పంట పొలాలకు నీరు తగ్గిపోయిన తర్వాత ప్రతి 5 సెంట్ల నారుమడికి యూరియా 1 కిలో + పొటాష్ 1 కిలో కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారుమడులు కుళ్లిపోకుండా ఉండేందుకు కార్బెండాజిం 1 గ్రాము లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ 2 గ్రాములు/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.పత్తి, వేరుశనగలో యాజమాన్య పద్ధతులిలా..ఈ వర్షాలకు ఆకుమచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయ్యాలి » పత్తిలో పూత, గూడ రాలే అవకాశం ఉంది కాబట్టి నివారణకు బోరాక్స్‌ను లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.» 2 శాతం యూరియ లేదా నీటిలో కరిగే ఎరువులైన 19–19–19 లేదా 17–17–17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయాలి.» కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.సజ్జ పంట: కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెట్ట ప్రాంతాల్లో అయితే... అన్ని పంటలకు ఒకే రీతిలో పొలం నుంచి నీళ్లను పూర్తిగా దిగిపోయిన తర్వాత బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లకు హెక్సాకొనజోల్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
ఉద్యోగులను నడి రోడ్డుపై నిలబెట్టి వికృతానందం
ఎన్నికల హామీల అమలుపై ఉద్యోగులంతా రోడ్డెక్కిన తర్వాత చంద్రబాబు అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు.. ఆ ప్రకటనే తప్ప.. ఇంత వరకు డీఏ ఇచ్చింది లేదు. ఫస్ట్ దసరా అన్నాడు.. తరువాత నవంబర్ అన్నాడు.. తరువాత దీపావళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డప్ ఇచ్చారు. వాళ్లకు రావాల్సింది నాలుగు డీఏలు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబరాలు అంటూ ప్రచారం నడిపారు. జిమ్మిక్కులు చేశారు. చివరకు ఇచ్చిన ఒక్క డీఏ అరియర్స్‌ను ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇస్తామని జీవోలో చెప్పారు. 3.5 లక్షల మంది పెన్షనర్లకు డీఆర్ అరియర్స్ రెండేళ్ల తర్వాత ఇస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. ఉద్యోగులు కళ్లెర్ర చేస్తే ఆ జీవోలను సవరించారు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికల తర్వాత అలా ఒక్క నెల మాత్రమే ఇచ్చాడు. ఇవాళ ఏ తేదీల్లో జీతాలు వేస్తారో తెలియడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ పరిస్థితులు ఉన్నా.. ఏ రోజూ కూడా ఉద్యోగుల జీతాల విషయంలో ఇబ్బందులు పడే పరిస్థితి తేలేదు. మా పరిస్థితుల్లో చంద్రబాబు ఉండి ఉంటే.. రాష్ట్రం కోవిడ్‌తో అతలాకుతలం అయిపోయింది.. మీరు రెండు నెలలు జీతాలు వదిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండ(విరాళంగా ఇవ్వండి)ని పిలుపునిచ్చేవాడు కచ్చితంగా. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాం. ఉద్యోగుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ఇచ్చాం. జూలై 1 నుంచి అమలుచేశాం. అది ఉద్యోగస్తులపట్ల మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వ హయాంలో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. కాంట్రాక్టు ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయడం మొదలు పెట్టాం. 10,117 మందిని గుర్తించాం. వీళ్లలో 3,400 మందిని రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేసేందుకు సిద్ధం చేసినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయాం. వాళ్లను ఇప్పుడు చంద్రబాబు రెగ్యులరైజ్ చేయడంలేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాదు.. వారికి ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చేలా మేము సర్క్యులర్ జారీ చేశాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి, దళారీ వ్యవస్థను తీసేసి వాళ్ల బతుకులు మార్చాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్)ను ఏర్పాటుచేసి లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా 1వ తేదీన జీతాలు వచ్చేటట్టుగా మేలు చేశాం. ఈ రోజు ఆప్కాస్‌ను చంద్రబాబు నీరుగారుస్తున్నారు. చివరికి ఆలయాల్లో శానిటేషన్ కాంట్రాక్టు పనులను చంద్రబాబు బంధువు భాస్కరనాయుడుకు అప్పగించారు. మా హయాంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాం. మేము రాక ముందు ఏడాదికి వారి వేతనాలు రూ.1,100 కోట్లు ఉండగా.. మేము అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.3,300 కోట్లు చెల్లించాం. ఇప్పుడు చంద్రబాబు సచివాలయాల ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని కొత్త కొత్త స్టోరీలు చెబుతున్నారు. అంటే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు లక్ష మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, లక్షా 35 వేల మంది సచివాలయ ఉద్యోగులపై ఆయన కన్ను పడింది. వీళ్లను క్లీన్ చేస్తే మిగిలిన వారిని కూడా నెమ్మదిగా తప్పించేయొచ్చన్నది చంద్రబాబు ఆలోచన. సాక్షి, అమరావతి : ఎన్నికల్లో తీపి తీపి మాటలతో ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేసి నడిరోడ్డున నిలబెట్టి వికృతానందం పొందుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారంలో కుప్పిగంతులు, పిల్లి మొగ్గలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రచారంలో పీక్.. వాస్తవాలు చాలా వీక్’ అనడానికి ఉద్యోగులకు ఇచ్చిన డీఏనే ఉదాహరణ అంటూ ఎత్తిచూపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని.. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, జూన్ 2025.. ఇలా నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని గుర్తుచేశారు. ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రోడ్డెక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్రకటించాడు తప్ప.. ఇంత వరకూ ఇచ్చింది లేదన్నారు. ఉద్యోగులను చంద్రబాబు తరహాలో మోసం చేసిన సీఎం చరిత్రలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో చంద్రబాబు వ్యవహార శైలిని సాక్ష్యాధారాలతో సహా ఎత్తిచూపుతూ కడిగి పారేశారు. తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చి.. జూలై, 2019 నుంచి పెంచిన వేతనాలు ఇవ్వడం ద్వారా వారి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేస్తూ ఆప్కాస్‌ను తెచ్చామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి వేతనాలను పెంచామని.. దీనివల్ల వారి వేతనాలు ఏడాదికి రూ.1100 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా లంచాలకు తావు లేకుండా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించి చూపించామని చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తారా? మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి కష్టకాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విషయంలో వెనకడుగు వేయలేదు. మామూలుగా ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాలి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11 డీఏలు ఇచ్చాం. చంద్రబాబు అంతకు ముందు 2014–19 మధ్య కేవలం 8 డీఏలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు.. ఆ ఒకటి కూడా డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక అన్నాడు. పెన్షనర్లకు డీఆర్ రెండేళ్ల తరువాత 2027–28లో ఇస్తానని ప్రకటించాడు. చంద్రబాబు ఇచ్చిన జీవోపై ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టడంతో ఆ జీవో సవరించారేగానీ ఇంతవరకు పైసా ఇచ్చింది లేదు. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 4 పెండింగ్‌లో పెట్టారు. ఒక్కో సరెండర్ లీవ్‌కు రూ.210 కోట్లు అవుతుందనుకుంటే.. అందులో రూ.100 కోట్లు ఇప్పుడిస్తాడట (అదీ ఇవ్వలేదు).. మిగిలిన రూ.100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. ఇస్తానన్న దాంట్లో రూపాయి ఇవ్వలేదు.. మరి దీన్ని చూసి ఉద్యోగులంతా పండగ చేసుకోవాలంట. ఎలా సంబరాలు చేసుకోవాలి? టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తానని హామీ ఇచ్చాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చ బిళ్లలు వేసుకొని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. కుట్రపూరితంగానే పీఆర్సీ వేయడం లేదుఇవాళ ఉద్యోగులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంకుస్వర్గంలో ఉన్నారు. మరో వైపు మేము తెచ్చిన జీపీఎస్‌ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర్నుంచి అనేక రాష్ట్రాలు దాన్ని స్వీకరించి, అమలు చేస్తూ ముందుకుపోతున్నాయి. ఎన్నికలప్పుడు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు. ఎన్నికలు అయిపోయాయి.. ఐఆర్ మాట దేవుడెరుగు.. పీఆర్సీ మరీ దారుణం. మేము నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను బలవంతంగా వెళ్లగొట్టాడు. కొత్త పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదు. కొత్త పీఆర్సీ వేస్తే ఎక్కడ ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందో అన్నది చంద్రబాబు దుగ్ధ. ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే.. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు జీతాలు పెరగకుండా అడ్డుకోవడం అన్నింటికంటే దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీ జీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ అన్ని కలిపి దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిల గురించి చంద్రబాబు మాట్లాడడు. ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు ఠంఛన్‌గా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎన్నికలైన తర్వాత ఒక నెల మాత్రమే అలా ఇచ్చాడు. మరో వైపు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. మా పథకాలన్నీ రద్దయిపోయాయి. ఇచ్చే పథకాలే అరకొర. వాటిలో కూడా అవుట్ సోర్సింగ్ వాళ్లకు ఇచ్చేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు. అధికారంలోకి రాగానే వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేలు కాదు..రూ.10 వేలకు పెంచేస్తామన్నాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు. ఎన్నో కుట్రలు చేశాడు. ఎన్నికల తర్వాత ఏకంగా ఆ ఉద్యోగాలన్నీ పీకేసి, 2.66 లక్షల మందిని రోడ్డున పడేశాడు.మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ » చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. వాటిలో ఏడు పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలు పూర్తి చేయాల్సి ఉంది. వీటి కోసం కేటాయించిన రూ.8 వేల కోట్లకు గాను రూ.3వేల కోట్లు ఖర్చు చేశాం. ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చు చేస్తే మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిని పూర్తి చేయడం ఇష్టం లేక.. సగంలో కట్టిన ఈ కళాశాలలను స్కామ్‌లు చేస్తూ అమ్మడానికి సిద్ధమయ్యారు. » మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నవంబర్ 22వ తేదీ వరకు కొనసాగుతోంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అక్టోబర్ 28వ తేదీన ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ కోటి సంతకాలను నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబర్ 24న జిల్లాల నుంచి విజయవాడకు పంపిస్తారు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఏ విధంగా రిఫరెండం ఇచ్చారో కోటి సంతకాల ద్వారా తెలియజేస్తాం.విద్య, వైద్యం, గవర్నెన్స్.. అన్నీ తిరోగమనమే » ఉద్యోగులకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. కనీసం ప్రజలకైనా ఏమైనా చేస్తున్నాడా అంటే అదీ లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ తిరోగమనమే. స్కూల్స్‌లో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద నాణ్యత పోయింది. 3వ తరగతి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చదువులు గాలికెగిరిపోయాయి. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు ఆగిపోయాయి. అమ్మఒడి అరకొరగా మిగిలిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన ఆగిపోయింది. ఏడు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు పెండింగ్. ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు చొప్పున రూ.4,500 కోట్లు నుంచి రూ.4,900 కోట్లు విడుదల చేయాలి. కానీ ఈయన ఇచ్చింది రూ.700 కోట్లే. వసతి దీవెన రూ.2,200 కోట్లు ఇవ్వాలి. రూపాయి కూడా ఇచ్చింది లేదు. » వైద్య రంగంలో చూస్తే రూ.25 లక్షల వరకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వారికి ఆరోగ్య భద్రత కలి్పంచే ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. ఈ పథకానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 17 నెలలకు దాదాపు రూ.5,100 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టారు. దీంతో వైద్యం అందించలేక నెట్వర్క్ ఆస్పత్రులు చేతులెత్తేసాయి. ఈ రోజు వాళ్లు విజయవాడలో ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. పేద వాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ ఆస్పత్రులు..పేదవాడిని వదిలేసి చంద్రబాబు పుణ్యమా అని ఆందోళనకు దిగాయి. » ఆరోగ్య ఆసరా గాలికెగిరిపోయింది. 104, 108.. కుయ్..కుయ్..కుయ్ అంటూ రావాల్సిన ఈ అంబులెన్స్‌ల నిర్వహణను రూ.5 కోట్ల టర్నోవర్ కూడా లేని చంద్రబాబు మనిషికి ఇచ్చారు. ఇలా అయితే 104, 108 సర్వీసులు ఇంకేమి నడుస్తాయి? విలేజ్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు గాలికెగిరిపోయాయి. జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ అటకెక్కింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్వోజీఎంపీ ప్రమాణాల మేరకు మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు కనీసం దూదికి కూడా దిక్కు లేదు. -
రైతులను నిలువునా ముంచేస్తారా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది.. ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంత దారుణ పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుత రబీ సీజన్లో రాయలసీమ ప్రాంతంలో వేరు శనగ (బుడ్డ శనగ) విత్తనం వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసిందే తప్ప ఇంతవరకు కార్యాచరణే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు దయనీయ, దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ‘ఉల్లి రైతును గాలికొదిలేశారు. గడిచిన 60రోజుల నుంచి కిలో రూ.3 కన్నా దాటడం లేదు. ప్రభుత్వం క్వింటాకు రూ.1,200 ఇస్తామని చెప్పింది. ఎవరికిస్తున్నారో ఎవరికీ తెలియదు.’ ఎవరికీ ఇచ్చిందీ లేదు.ప్రభుత్వంపై రైతులు నిరసన తెలిపేసరికి హెక్టారుకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటివరకు విధివిధానాలే రూపొందించలేదు. ధాన్యానికి గతేడాది గిట్టుబాటు ధర లేక బస్తా రూ.1,100 నుంచి రూ.1,200కు తెగనమ్ముకునే పరిస్థితి. ఈ ఏడాది పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కాక రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా పత్తి గతంలో రూ.12 వేలు పలికితే, ఇప్పుడు రూ.5,500కు మించి పలకడం లేదు. అరటి పంట గతంలో టన్ను గరిష్టంగా రూ.28 వేలు పలికితే ఇప్పుడు రూ.3,500కు మించి పలకడం లేదు. కూలి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ, పంట నష్టపరిహారం కానీ ఇవ్వడంలేదు. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమరేషన్ చేయలేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
కొత్త గోడౌన్లు ‘కోల్డ్ స్టోరేజీ’లోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు నిల్వ చేసుకోవడానికి వీలుగా రాష్ట్రంలో మరిన్ని కోల్డ్ స్టోరేజీ గోడౌన్లను నిర్మించాలని ఉద్యానవనశాఖ చేస్తున్న ప్రయత్నాలకు ఆశించిన స్పందన రావట్లేదు. పండ్లు , కూరగాయలు, ఉల్లి వంటి ఉద్యాన పంటలతోపాటు మిర్చి, చేపలు, గుడ్లు, మాంసం, చీజ్ వంటి ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు భారీ స్థాయిలో కోల్డ్ స్టోరేజీల అవసరం ఉంది. ప్రస్తుతం ఉద్యానవనశాఖ పరిధిలోని సమీకృత ఉద్యానవన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 89 కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉండగా మరో 100 యూనిట్లు ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ నిల్వ సామర్థ్యం సరిపోదని అధికారులు చెబుతున్నారు. అయితే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించట్లేదు.35 శాతం రాయితీ ఇవ్వనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలురాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 12 కోల్డ్ స్టోరేజీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అయితే కేవలం సిద్దిపేట నుంచి ఒక దరఖాస్తు రాగా మిగతా జిల్లాల నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో ఔత్సాహికులు తగిన అర్హతలతో ముందుకు వస్తే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని ఉద్యానవన శాఖ భావిస్తోంది. ఎంఐడీహెచ్ పథకం కింద శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. 5 వేల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ యూనిట్ నిర్మాణానికి రూ. 4.80 కోట్లు ఖర్చయితే అందులో రూ. 1.68 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ కింద చెల్లించనున్నాయి. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 9,600 చొప్పున ఖర్చయితే అందులో రూ. 3,360 అందనుంది.సబ్సిడీ సరిపోదని..ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణదారులు ఐదు అంతస్తుల్లో రెండు వేర్వేరు చాంబర్లను నిర్మించాలి. ఒక్కో చాంబర్ నిల్వ సామర్థ్యం 3,631.90 టన్నుల చొప్పున రెండు చాంబర్లు కలిపి 7,284 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కట్టాలి. అయితే 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి మాత్రమే ఎంఐడీహెచ్ పథకం సబ్సిడీ లభిస్తుంది. అంటే మిగిలిన 2,284 మెట్రిక్ టన్నుల నిర్మాణాలు పూర్తి చేసుకున్న కోల్డ్ స్టోరేజీలకు అద్దె ప్రాతిపదికన చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ తగిన సంఖ్యలో లేకపోవడంతో పంటలు వృథా అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తగినంత భూమి ఉన్న ఔత్సాహికులు కోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణానికి ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవాలికోల్డ్ స్టోరేజీ యూనిట్ల నిర్మాణం కోసం ఔత్సాహికులను ఆహ్వాని స్తున్నాం. ఇందుకోసం అందిస్తున్న 35 శాతం సబ్సిడీని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. శీతల గిడ్డంగులకు ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటే తగిన ఆదాయం లభిస్తుంది. రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. – యాస్మిన్ భాషా, ఉద్యానవన శాఖ డైరెక్టర్ -
‘పత్తి’ రైతు చిత్తు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం చేతిలో పత్తి రైతు మరోసారి చిత్తయిపోతున్నాడు. మార్కెట్ మాయాజాలంతో గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధరలు పడిపోతున్నా సర్కారు తనకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దిగుమతి సుంకం మినహాయింపు ప్రభావంతో ఈ ఏడాది పత్తి కొనేవారు లేకపోవడంతో ఈ అవకాశాన్ని దళారులు తమకు అనుకూలంగా మలుచుకుని రైతులను నిలువునా దోచుకుంటున్నారు.మరోవైపు.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పిలిచిన టెండర్లకు జిన్నింగ్ మిల్లు యజమానుల నుంచి స్పందన కరువైంది. ఫలితంగా.. ఎప్పుడు, ఎన్ని ఏర్పాటుచేస్తారో కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.ముందుకు రాని జిన్నింగ్ మిల్లులు.. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు. ఈ ఏడాది అతికష్టం మీద 10.75 లక్షల ఎకరాల్లో సాగవగా, 8 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ చేసేందుకు మిల్లులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో 122 జిన్నింగ్ మిల్లులు ఉండగా, గతేడాది కేవలం 45 మిల్లులు మాత్రమే సీసీఐతో ఎంపానల్ అయ్యాయి.కానీ, ఈ ఏడాది పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గత నెల ఒకటిన సీసీఐ టెండర్లు పిలిచినా ఒక్క జిన్నింగ్ మిల్లు కూడా ముందుకు రాలేదు. దీంతో టెండర్ల ప్రక్రియ ఇప్పటివరకు కొలిక్కిరాలేదు. మరోవైపు.. అధిక వర్షాలతో పత్తి పంట దెబ్బతింది. మిగిలిన దిగుబడినైనా మద్దతు ధరకు అమ్ముకుందామంటే వ్యాపారులు రైతుల్ని నిలువునా దోచేస్తున్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్లో క్వింటాకు మధ్యస్థ రకం పత్తికి రూ.7,710, పొడవు రకానికి రూ.8,110గా కేంద్రం ప్రకటించింది. మూడొంతులు లాట్లకు దక్కే ధర రూ.3,960లే..కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ పరిధిలో ఏటా రూ.1,400 కోట్ల పత్తి వ్యాపారం జరుగుతుంది. ఈ యార్డుకు ప్రస్తుతం 10–12 వేల క్వింటాళ్ల పత్తి నిల్వలు వస్తున్నా.. రైతులకు మాత్రం మద్దతు ధర దక్కడంలేదు. ఏటా అక్టోబరు 1 నుంచి ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలు ఈసారి ఎప్పుడు తెరుస్తారో తెలీక రైతులు దళారులకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యమైన పత్తికి సైతం క్వింటా ధర సగటున రూ.5 వేల నుంచి రూ.7వేలే పలుకుతోంది. యార్డులో శనివారం గరిష్టంగా క్వింటా పత్తి రూ.7,499 పలికినప్పటికీ ఈ ధర దక్కింది కేవలం 5–10 శాతం లాట్లకు మాత్రమే.మధ్యస్థ రకం క్వింటాకు రూ.7,299 దక్కింది. కానీ, ఈ ధర 15 శాతం లాట్లకు మించి లభించలేదు. ఇక దాదాపు 75 శాతం లాట్లకు క్వింటాకు రూ.3,960 చొప్పున మాత్రమే లభించింది. తేమ శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో అడ్డగోలుగా కోత పెడుతున్నారు. పెద్ద వాహనానికి 20–30 కిలోలు, చిన్న వాహనానికి 10–15 కిలోలు చొప్పున తక్కువ తూకాలు చూపుతున్నారు. పైగా.. క్వింటాకు 6–10 కిలోల తరుగు తీసేస్తున్నారు. కనిష్ట, మధ్యస్థ ధరలే కాదు.. గరిష్ట ధర కూడా కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు దరిదాపులో లేకపోవడంతో రైతులు ఏస్థాయిలో నష్టపోతున్నారో అర్ధమవుతుంది.గతంలో సీజన్‌కు ముందుగానే..నిజానికి.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పంట కోతకొచ్చేందుకు కనీసం 45 రోజుల ముందుగానే కేంద్రాల ఏర్పాటుపై స్వయంగా సీఎంతో పాటు వ్యవసాయ శాఖమంత్రి సమీక్ష చేసేవారు. ఏటా సెప్టెంబరు రెండో వారం నుంచే ఈ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టేవారు. మూడో వారంలో ఆర్బీకేల ద్వారా రైతుల వివరాలు నమోదుచేసి నాలుగో వారం నుంచి కొనుగోలుకు శ్రీకారం చుట్టేవారు. పైగా.. ఏటా గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకునేవారు. ఫలితంగా నాడు క్వింటా రూ.9,500 నుంచి రూ.10,600 వరకు ధర లభించింది. కానీ, కూటమి ప్రభుత్వంలో గతేడాది సగటున క్వింటాకు రూ.5,500 నుంచి రూ.6,200 మాత్రమే లభించింది. ఈ ఏడాది కూడా పంట పూర్తిగా మార్కెట్‌కు వచ్చే సమయానికి క్వింటాకు గరిష్టంగా రూ.5 వేలకు మించి లభించదని అంచనా వేస్తున్నారు.కూలీ ఖర్చులు కూడా రావడం లేదు నాలుగు ఎకరాల్లో పత్తి వేశా. ఎకరాకు రూ.50 వేల చొప్పున రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. భారీ వర్షాలవల్ల పంట పూర్తిగా దెబ్బతింది. కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే చేతికొచి్చంది. అది కూడా సెకండ్ క్వాలిటీ. మార్కెట్లో క్వింటా రూ.4 వేల నుంచి రూ.5.50 వేలకు మించి పలకడంలేదు. కూలీ ఖర్చులు కూడా రావడంలేదు. – వాల్మీకి వీరేష్ , గోతులదొడ్డి, కర్నూలు జిల్లావ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు.. మూడెకరాల్లో పత్తి పంట వేశా. ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టా. భారీ వర్షాలవల్ల ఎకరాకు ఐదు క్వింటాళ్లకు మించి రాలేదు. మార్కెట్లో ధర ఏమాత్రం బాగోలేదు. కొనేవారు కూడా కన్పించడంలేదు. వ్యాపారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. క్వాలిటీ ఏదైనా రూ.8 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. అప్పుడే రైతుకు పెట్టుబడి దక్కుతుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పరిస్థితి అథోగతే. – హరిజన శివన్న, దొడ్డనగిరి, కర్నూలు జిల్లా -
రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు. బంగాళాఖాతంలో విసిరేశారు గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. మా సైన్యం మీరే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్‌లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల వాహనాలను ట్రాక్టర్‌తో ఢీ
గుర్రంకొండ: కూటమి ప్రభుత్వంలో రైతులకు రక్షణ లేకుండా పోతోంది. మండీలకు టమాటాలను తీసుకొచ్చిన రైతుల వాహనాలను ఓ మండీ యజమాని ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు, ఒకబొలెరో, ఒక ఆటో దెబ్బతిన్నాయి. వాహనాల వద్ద రైతులు లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. జాక్‌పాట్ వద్దన్నందుకే తమపై మండీ యజమానులు దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ రైతులు పేర్కొన్నారు. ఈ ఘటనతో రైతులు మార్కెట్‌యార్డు గేట్లు మూసేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మండీ యజమాని విపరీతం ఇదీ.. స్థానిక మార్కెట్‌యార్డుకు ఆదివారం రైతులు వాహనాల్లో టమాటాలను తీసుకొచ్చారు. ఇక్కడ తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో తమ వాహనాలను మండీల ముందు ఉంచారు. గత కొన్ని రోజులుగా రైతులు జాక్‌పాట్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవి మనసులో పెట్టుకొన్న మండీ యజమానులు రైతులపై కక్ష గట్టారు. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఓ యజమాని తన మండీ ముందు వాహనాలు పెట్టారంటూ మరో రైతుకు చెందిన ట్రాక్టర్ తీసుకొని రైతుల వాహనాలపైకి వేగంగా ఎక్కించాడు. ఈసంఘటనలో పెద్దమండ్యం మండలానికి చెందిన ఇద్దరు రైతుల ద్విచక్రవాహనాలు ట్రాక్టర్ చక్రాల కింద పడి ధ్వంసం అయ్యాయి. కాగా ఒక బొలోరో వాహనం, ఒక ఆటో దెబ్బతిన్నాయి. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం ఈ ఘటనతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండీల యజమానులపై తిరగబడ్డారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డు ముందువైపుకు చేరుకొని యార్డుగేట్లు మూసేసి ఆందోళకు దిగారు. మండీల యజమానులు వచ్చి జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపినా ఫలించలేదు. విషయం తెలుసుకొన్న పోలీసులు, మార్కెట్‌కమిటీ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. మార్కెట్‌కమిటీ సూపర్వైజర్ నయూబ్ బాషా రైతులతో చర్చించారు. ‘మీరు పట్టించుకోకపోవడంతో మండీల యజమానులు ఇలా రెచ్చిపోతున్నారు’ అంటూ రైతులు ఈ సందర్భంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాక్పాట్లు వద్దన్నందుకే మండీల యజమానులు తమపై కక్షగట్టి మమ్మల్ని చంపాలను చూస్తున్నారని మండిపడ్డారు. జాక్ పాట్లు అరికట్టాల్సిన అధికారుల చేతగాని తనం వల్లే ఈ ఖర్మ పట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు రైతులు వాహనాల వద్ద ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసు నమోదుకాకుండా ‘మేనేజ్’ చేయడం కొసమెరుపు! సదరు మండీల యజమానులపై చర్యలు తీసుకొని లైసెన్స్‌లు రద్దు చేస్తామని మార్కెట్ కమిటీ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. బాధిత రైతులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఏఎస్ఐ గజేంద్ర పేర్కొన్నారు. అయితే రాత్రంతా మార్కెట్ కమిటీ అధికారులు, మండీల యజమానులు బాధిత రైతులను లోబరుచుకొని బెదిరింపులకు గురి చేసి కేసు నమోదు కాకుండా చేయడం ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు. జాక్‌పాట్ అంటే.. మండీలకు రైతులు 100 టమాటా బుట్టలను తీసుకునివస్తే, అందులో 15 నుంచి 20 బుట్టలను ఉచితంగా వ్యాపారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని బుట్టలు ఉచితంగా ఇవ్వాలనే అంశంపై నిర్ణయాన్ని వ్యాపారులే తీసుకోవడం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. -
అడవి పందిని తింటే పంట సేఫ్!
అలప్పుళ (కేరళ): అడవి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి కేరళ రైతులకు.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఆయన శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీలో మాట్లాడుతూ... ‘అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి కదా?. మీరంతా వాటి మాంసాన్ని తినండి!. ఈ సమస్య చాలా వేగంగా పరిష్కారమవుతుంది!‘ అని సెలవిచ్చారు. పంట పొలాల్లో హతమైన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ఆయన దీనికి లాజిక్ కూడా చెప్పారు. ‘ప్రజలకు అడవి పందులను చంపి, వాటి మాంసాన్ని తినేందుకు అనుమతి ఉంటే, ఈ సమస్య చాలా తొందరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రస్తుత చట్టం దీనికి ఒప్పుకోవట్లేదు’.. అని వాపోయారు. ‘అడవి పంది ఏమంత అంతరించిపోతున్న జంతువు కాదు కదా!‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు.. రాష్ట్రంలో మానవ–జంతు సంఘర్షణలను తగ్గించేందుకు ఉద్దేశించిన వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను సవరించడానికి కేరళ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత రావడం విశేషం. -
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు
సాక్షి, సిద్దిపేట: పండించిన పంటలను విక్రయించే సమయంలో తేమ శాతం తగ్గించేందుకు రైతులు యుద్ధం చేయాల్సి వస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా ఆటోమేటిక్ డ్రయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ప్రతి జిల్లాకు 2 నుంచి 4 డ్రయర్లు పంపించారు. ఇవి ఇప్పటికే ఆయా జిల్లాల్లోని వ్యవసాయ మార్కెట్లకు చేరుకున్నాయి.ప్యాడీ డ్రయర్ మెషీన్ 40 క్వింటాళ్ల ధాన్యాన్ని గంటకు 6 శాతం చొప్పున తేమను తగ్గిస్తుంది. తేమ 30 శాతం ఉన్నా కూడా అందులో పోస్తే ఆరబెడుతుంది. దీంతో ధాన్యం నాణ్యత మెరుగుపడుతుంది. గంటకు 40 క్వింటాళ్ల ధాన్యాన్ని ఆరబెట్టేందుకు దాదాపు రూ.500 వరకు ఖర్చవుతుంది. దీంతో రైతుల ఇబ్బందులు తప్పనున్నాయి.జిల్లాకు రెండు వచ్చాయి..కొనుగోలు కేంద్రాలకు తొలిసారిగా ప్యాడీ డ్రయర్లను అందుబాటులోకి తెచ్చాం. సిద్దిపేట జిల్లాకు రెండు కేటాయించారు. ఇది గంట సమయంలో దాదాపు 6% తేమను తగ్గిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ -
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
గిట్టుబాటులేక రోడ్డు మీదే.. పూల రైతుకు మిగిలింది కన్నీరే
కోలారు: బెంగళూరులోని కోలారు ప్లవర్ మార్కెట్లో వారం రోజుల క్రితం కిలో రూ.60 నుంచి రూ.70 ధర పలికిన బంతిపూల ధరలు మళ్లీ పాతాళానికి దిగజారాయి. దీంతో గిట్టుబా టుకాక రైతులు తాము పండించిన బంతి పూలను రోడ్డుపై పారబోసి వెళుతున్నారు. శ్రావణ మాసంలో వరుసగా పండుగలు రావడంతో పూల ధరలు ఆశాజనకంగా ఉండే వి. అనంతరం ఆశ్వీయుజ మాసంలో దనరా పండుగ కారణంగా బంతిపూలకు మంచి ధరలే లభించాయి. అయితే దసరా అనంతరం డిమాండ్ బాగా తగ్గింది. కిలో బంతిపూలు రూ.10, చేమంతులు కిలో రూ.40, గులాబీలు కిలో రూ.50 ధర పలుకుతున్నాయి. మంగ ళవారం మార్కెట్‌కు తీసుకు వచ్చిన పూలకు సరైన ధరలు లభించక రైతులు వాటిని బంగారుపేట-కోలారు రోడ్డు పక్కనే పారబోసి వెళ్లారు. పూలు విడిపించడానికి, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే ఖర్చులు కూడా మిగ లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రైతులు పూల కోతకోయకుండా పాలంలో అలాగే వదిలేస్తున్నారు. కాగా అక్టోబర్ నెలలో పెద్ద ప్రమాణంలో బంతి పూల కోతకు రావడంతో డిమాండ్ తగ్గి ధరలు భారీగా తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. -
బాబును నమ్మి... రెంటికీ చెడుతున్న అమరావతి రైతులు
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ, బలవంతపు సేకరణ ప్రతిపాదనలు వస్తూండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతుల నుంచి సేకరించింది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కలిపి 53 వేల ఎకరాల వరకూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని భూములు కావాల్సిందేనని భీష్మించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో స్వచ్చందంగా భూములివ్వని వారిపై 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా సుమారు 3500 ఎకరాలు తీసుకోబోతున్నారట. తద్వారా తొలిదశ అసలు లక్ష్యమైన 38 వేల ఎకరాలు సేకరించినట్లు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. రెండో దశ భూ సమీకరణపై చర్చ జరగలేదని చెబుతూ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, రోప్ వే, రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనర్థం... రెండో దశకు సుమారు 44 వేల ఎకరాలు తీసుకోబోతున్నామని తెలివిగా చెప్పడమే. ఇది రైతులకు అర్థం కాదన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా అమరావతి రైతులను సంక్షోభంలోకి నెట్టేదే. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, బలవంతపు సేకరణ అస్సలు ఉండదని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నమ్మబలికింది. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తే చాలామందికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వదలుకోవడానికి సిద్దపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వాన్ని ఎదిరించారు. బెదిరింపులకు లొంగకుండా సేద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని బెదిరించేందుకు పంటలను దగ్దం చేశారన్న ఆరోపణలూ అప్పట్లో వచ్చాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. చంద్రబాబు, మరికొందరు నేతలు అమరావతి రైతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. వాస్తవానికి జగన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెయాలని సంకల్పించారు. కానీ ఈ విషయంపై అప్పటి ప్రతిపక్షం రకరకాలుగా దుష్ప్రచారం చేయించింది. ఉద్యమం పేరుతో హడావుడి చేయించారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత తమకు లాభం చేకూరుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలతో ప్లాట్లు వచ్చేస్తాయని అమరావతి రైతులు భావించారు. కానీ.. జరిగింది వేరు. చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేయకపోగా అదనపు భూముల కోసం ఎత్తులేస్తున్నారు. పైగా తొలిదశలో భూములిచ్చిన కొందరు రైతులకు.. పూలింగ్‌కు ఇవ్వని వారి భూమిలో ప్లాట్లు కేటాయించారట. ఆ భూములను ఇప్పుడు బలవంతంగా సేకరించి ప్లాట్లు ఇస్తారట. ఇది ఏ ధర్మం? ఇంకో సంగతి చెప్పాలి. ఇక్కడ ఎకరా రూ.నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోతోందని, చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు మార్లు చెప్పారు. ఆ ప్రకారం వీరికి 2013 చట్టం కింద మూడు రెట్లు ఎక్కువ ధర ఇస్తారా? అలా కాకుండా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే పరిహారంగా ఇచ్చే యత్నం చేస్తే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరో వైపు అప్పట్లో పూలింగ్‌కు భూములు ఇవ్వని 3500 ఎకరాల రైతులకు ఎంత పరిహారం దక్కుతుందో తెలియదు. ప్లాట్ల కేటాయింపు కేవలం పేపర్లపైనే ఉండడం వల్ల భూములు అమ్ముడుపోవడం లేదని రైతులు చెబుతున్నారు.ఇక రెండో దశ భూ పూలింగ్‌కు భూములివ్వడం చాలామందికి ఇష్టం లేదు. పెదపరిమి వంటి గ్రామాలలో కొందరు టముకు వేసి మరీ పూలింగ్‌కు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగానూ తొలిదశ రైతులకు న్యాయం చేయకుండా తమ వద్దకు ఎలా వస్తారని చాలామంది ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాకపోతే ఒకసారి భూమి తీసుకోవడం లేదని చెబుతారు. ఇంకోసారి ఆ భూములు ఇవ్వకపోతే, ఈ ప్రాంతం ఒక మున్సిపాల్టీగా మిగిలిపోతుందని బెదిరిస్తున్నారు. రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని ఎల్లోమీడియాలో ప్రచారం చేయించారు. కాని అదే సమావేశంలో ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటుకు తీర్మానించారు. ఆ కంపెనీ విమానాశ్రయం, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ వంటివి చేపడుతుందని చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణ పనులు నేరుగా కాంట్రాక్టర్లకే భూములు కేటాయించి అప్పగిస్తారట. ఆ కాంట్రాక్టర్లు భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుని వాటిని కడితే యూజర్ ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నష్టమొస్తే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వం మళ్లీ ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. ఈ ప్రత్యేక కంపెనీకి భూములు గతంలో ప్రతిపాదించిన ప్రకారం రెండో దశ గ్రామాల నుంచే రావాలి. ఆ రకంగా 44 వేల ఎకరాల భూమి తీసుకుంటారని నేరుగా కాకుండా ప్రాజెక్టుల మిష పెడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు చేసి, రైతులకు న్యాయం చేయకపోతే అమరావతిలోనే తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు. కొందరు రైతులు ప్రభుత్వం తమను ఏ రకంగా వేధిస్తుందో ఇప్పటికే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాకి లెక్కలతోనే క్రాప్ బుకింగ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రతి సీజన్లో అనుసరించే క్రాప్ బుకింగ్ (పంటల నమోదు) విధానం లోపభూయిష్టంగా మారిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జియో ట్యాగింగ్ ద్వారా పంటలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించినప్పటికీ..ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. క్రాప్ బుకింగ్‌తో పాటు వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, నివారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సెక్టార్ల వారీగా నియమించిన వ్యవ సాయ విస్తరణాధికారులు (ఏఈవోలు) ఇచ్చే నివేదికల పైనే ప్రభుత్వం ఆధారపడుతోంది.రైతు పంటలు వేసినప్పుడే ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారనే వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిస్తే, కచ్చితమైన సాగు విస్తీర్ణం, సాగైన పంటల వివరాలు తెలుస్తాయి. తదనుగుణంగా ఎరువుల పంపిణీ, మద్దతు ధరకు కొనుగోళ్లు, అందుకయ్యే నిధులు సమకూర్చుకోవడం వంటి ప్రక్రియ సజావుగా జరిగే వీలుంటుంది. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. క్రాప్ బుకింగ్ అంతా కాకి లెక్కలతో సరిపెడుతున్నారని, ఎరువుల పంపిణీ మొదలుకొని పంటల సేకరణ వరకు అంతా లోపభూయిష్టంగానే సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ సీజన్లో 60శాతం మించని క్రాప్ బుకింగ్రాష్ట్రంలో ఖరీఫ్ (వానాకాలం) సీజన్ గత నెల 30వ తారీఖుతో పూర్తయింది. ఆనాటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 133.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. ఇవి కాకుండా ఎర్ర మిర్చి, పసుపు 1.34 లక్షల ఎకరాల్లో సాగయినట్లు చెపుతున్నారు. అయితే అధికారికంగా పంటల నమోదు మాత్రం సెప్టెంబర్ 30 నాటికి 70 లక్షల ఎకరాల (53 శాతం) మేరకే పూర్తయింది. సెప్టెంబర్ 30 నుంచి ఈనెల 7 వరకు వారం రోజుల్లో మరో ఏడు శాతం క్రాప్ బుకింగ్ అయిందనుకున్నా, 60 శాతం మించలేదు. ఒకవైపు వరి కోతలు ప్రారంభం కాగా, మరోవైపు పత్తి ఏరడం కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు వరి క్రాప్ బుకింగ్ 53 శాతం, పత్తి పంట నమోదు 57 శాతం మాత్రమే పూర్తయింది.చేతులు దులుపుకొంటున్నారా?ఒక గ్రామంలో ఒక ఖరీఫ్ సీజన్లో సాగైన పంటల విస్తీ ర్ణం ఆధారంగా మరుసటి సంవత్సరం పంట నమోదును కొంత అటు ఇటుగా నమోదు చేస్తున్నారనే విమర్శలు వ్యవసాయ శాఖలోనే ఉన్నా యి. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా కొరత అత్యంత తీవ్ర రూపం దాల్చడానికి సరైన క్రాప్ బుకింగ్ డేటా లేకపోవడమే కారణమ నే అభి ప్రాయం వ్యక్తమైంది. రైతులు పంటలు సాగు చేసి నప్పుడే ఆయా పంటలను కచ్చితమైన విస్తీర్ణంతో నమోదు చేస్తే, ఏ గ్రామానికి ఏ పంటలకు ఎంత యూరియా, ఇతర ఎరువులు అవ సరమవుతాయనే అంచనాలకు అవకాశం ఉంటుంది. కానీ అది జర గడం లేదు. అలాగే వరి ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.పత్తి, జొన్నలు విక్రయించే సమయాల్లో వేసే లెక్కలకు పొంతన ఉండడం లేదు. పంటల నమోదు ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో ఉంటే ఈ పరిణామాలు ఉత్పన్నం కావని వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు చెపుతున్నారు. వ్యవ సా య విస్తరణాధికారులకు జిల్లా, మండల స్థాయిలో చేయాల్సిన వ్యవసాయ పనులు అప్పగించడం వల్ల పంట నమోదు కాకుండా ఇతర పనులపైనే ఎక్కు వ సమయం గడిపే పరిస్థితి ఉందంటున్నారు. ఈ కారణంగానే గత ఏడాది అదే సీజన్లో నమోదు చేసిన పంటలకు కొంత ఎక్కువ, తక్కు వగా నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. -
యంత్రం సాగుకు తంత్రం
యంత్రం.. సాగుకు తంత్రం అన్న విషయాన్ని ఉమ్మడి శామీర్‌పేట రైతులు గుర్తించారు. దీంతో వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మేలైన దిగుబడులను రాబడుతున్నారు. ఎకరాకు గంటల సమయం పట్టే మందుల పిచికారీకి డ్రోన్ల సాయంతో కేవలం పది నిమిషాల్లోనే పూర్తి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దుక్కుల నుంచి మొదలు కోతల వరకూ అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వరి నాట్లకు రైస్ ట్రాన్స్ ప్లాంటర్, డ్రమ్ సీడర్, మందు పిచికారీకి డ్రోన్లు, స్ప్రేయర్లు వంటివి వినియోగిస్తున్నారు. – శామీర్‌పేట ఉమ్మడిశామీర్పేట మండలంలో రైతులు వరి, మొక్కజొన్న పంటలతోపాటు కూరగాయల సాగు పెరిగింది. అధిక వర్షాలకు పంట రంగు మారుతుండడంతో మందులు పిచికారీ చేయాల్సి వస్తోంది. అయితే కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో కొంత మంది రైతులు డ్రోన్ల సహాయంతో పంటలకు మందులు పిచికారీ చేయిస్తున్నారు. కొంత మంది డ్రోన్లు అద్దెకు నడుపుతున్నారు. డ్రోన్లు ఎకరా పంటకు కేవలం పది నిమిషాల్లో పిచికారీ చేస్తున్నాయి. చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!నేరుగా మొక్కలపై మందులను పిచికారీ చేయడంతో మందులు కూడా వృథా కావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కూలీలు చేసే పని ఒక్క డ్రోన్ చేస్తుంది. దీంతో ఇటు సమయం.. ఆటు డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 10 నిమిషాలు.. డ్రోన్ సహాయంతో ఎకరా పంటకు 10 నిమిషాల్లో మందులు పిచికారి పూర్తవుతుంది. నేను నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేస్తున్నాను. దీనికి యూరియా స్ప్రే చేయించాలంటే ఇద్దరు కూలీలు ఒక రోజంతా కష్టపడాలి. డ్రోన్ సాయంతో నాలుగు ఎకరాలకు గంటలో పూర్తిచేశాం. ఎకరాకు డ్రోన్ అద్దె రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. – సంజీవరెడ్డి, రైతు, అలియాబాద్ వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. పొరుగు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీలపై అధారపడాల్సి వస్తోంది. డ్రోన్ స్ప్రే ద్వారా ఎకరాకు 10 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదాతో పాటు కూలీల సమస్య తీరుతుంది. డ్రోన్ అద్దెకు తీసుకోవడంతో ఖర్చులు తగ్గుతాయి. – రమేష్ వ్యవసాయ అధికారి, శామీర్‌పేట -
ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ
రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు... కాదు.. సాక్షాత్తూ టీడీపీ నేత ఇల్లు. విషయమేమంటే... శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను తన వారికి ఇచ్చేందుకు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం. శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని, తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు.వాటిపై ఆ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వారికి టోకెన్లు ఇవ్వడమేంటని కొందరు టీడీపీ నేతలను నిలదీశారు. ఈ విషయమై వ్యవసాయాధికారి నవీన్‌ను సంప్రదించగా కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపామని, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. – శ్రీకాకుళం రూరల్ -
ఆఫ్రికా నత్తల నియంత్రణ అంత సులువు కాదు!
ప్రకృతిలో పుట్టిన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే జాతులను ఇన్వాసివ్ స్పెసీస్ (దురాక్రమణ జాతులు) అంటారు. మొక్కలు, జీవులు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా ఉండవు. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని తామర తంపరగా పెంపొందించుకుంటూ సమస్యాత్మకంగా మారతాయి. స్థానికంగా పంటలను ఆరగించేస్తూ.. రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్మ, వయ్యారిభామ అలాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది ‘జెయింట్ ఆఫ్రికన్ నత్త’. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శక్తివేల్, డాక్టర్ ఎ. మరియదాస్, డాక్టర్ సి. ఆలిస్ ఆర్ పి సుజీత ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను సూచిస్తున్నారు. ‘సాక్షి సాగుబడి’ కోసం వారు అందించిన వివరాలతో ప్రత్యేక కథనం.మన దేశంలో దాదాపు 1,500 రకాల నత్తలున్నాయి. వాటిలో తొమ్మిది జాతుల నత్తలు పూలు, కూరగాయలు, పండ్ల తోటలకు హాని కలిగిస్తున్నాయి. హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అచటినా ఫులికా అనే జెయింట్ ఆఫ్రికన్ నత్త కూడా ఇప్పుడు తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని చోట్ల పండ్ల తోటలు, కూరగాయ తోటల్లో తామర తంపరగా విస్తరిస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దీన్ని ‘అత్యంత దురాక్రమణ గుణం కలిగిన వంద జాతు’ల్లో ఒకటిగా గుర్తించింది. నత్తల సమగ్ర నిర్వహణ మార్గాలివి:→ తోటను శుభ్రంగా ఉంచండి. కలుపు మొక్కలను తొలగించండి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొక్కల్లేకుండా ఖాళీగా ఉంచండి. → తోటలు/పొలాల్లోకి నత్తలు రాకుండా ఉండాలంటే చుట్టూతా ఉప్పు, సున్నపు పొడి లేదా కాపర్ సల్ఫేట్ చల్లితే చాలు. ఈ పదార్థాలను దాటి నత్తలు వెళ్లలేవు. → ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి, చంపుతుంది. కాపర్ సల్ఫేట్ విషపూరితమైన రసాయనం కాబట్టి అవరోధంగా పనిచేస్తుంది. వీటిని చల్లిన ప్రాంతాల్లో నత్తల సంఖ్య వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటల్లోకి ప్రవేశించకుండా లేదా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి నమ్మదగిన పద్ధతి ఇది. → ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా బీరు, వైన్ లేదా ఈస్ట్‌లను పోసి.. ఆ పాత్ర అంచు నేలతో సమానంగా ఉండేలా, పాతిపెట్టాలి. నత్తలు పాక్కుంటూ వచ్చి అందులో పడతాయి. అప్పుడు ఉప్పు వేస్తే, చనిపోతాయి. → నత్తలను ఆకర్షించడానికి కుండలు, బాక్సులు లేదా తడి సంచుల కింద నత్తలు లోపలికి వెళ్లే అంత ఖాళీ ఉండేలా రాళ్లు అమర్చి, వాటి లోపల క్యాబేజీ ఆకులు లేదా బొప్పాయి కాండాలను ఎరగా పెట్టి, రాత్రంతా అలా ఉంచాలి. ఉదయానికి నత్తలు వాటి కింద చేరతాయి. వాటిపై ఉప్పు చల్లితే చనిపోతాయి. లేదా వాటిని నలిపివేసి చంపండి. → పండ్ల చెట్లు, కూరగాయ మొక్కల కాండాలకు ఎగబాకకుండా ఉండాలంటే.. వాటి చుట్టూ ఒక వలయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లండి. → నత్తలు మొక్కలు, చెట్ల పైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు (సుమారు 0.8 మిమీ మందం) చుట్టండి. → నత్తలున్న తోటల్లో 3 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం (అంటే.. 400 లీటర్ల నీటిలో 12 కిలోల కాపర్ సల్ఫేట్ కలిపి హెక్టారుకు) పిచికారీ చేయండి. → కంచెలు/ప్రహరీలు, నత్తలు గుడ్లు పెట్టిన ప్రాంతాల్లో ఒక లీటరు నీటిలో కాపర్ సల్ఫేట్ (60 గ్రా.), పొగాకు(25 గ్రా.) రసం కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా నత్తల ముప్పును నియంత్రించవచ్చు. → పొగాకు మిశ్రమాన్ని తయారు చేసే పద్ధతి: 50 గ్రాముల పొగాకును 1.5 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ద్రావణం 1 లీటరుకు తగ్గే వరకు మరిగించండి. అందులో, 1 లీటరు నీటిలో 60 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కలపండి. ఆ ద్రావణాన్ని నత్తలున్న చోట పిచికారీ చేయండి. → ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టి సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు/చెట్లపై ఉండే నత్తలను ప్రజల సహకారంతో చేతులతో తీసివేయించటం, బాతులతో నత్తలను తినిపించటం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని నియంత్రించడానికి అవకాశం ఉంది.నత్తలన్నీ గుడ్లు పెడతాయి!జెయింట్ ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తలన్నిటిలో మగ, ఆడ జననాంగాలుంటాయి. కాబట్టి ఆడ, మగ కూడా గుడ్లు పెడతాయి. సాధారణంగా శరద్ రుతువు, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు జతకూడి తడి నేలలో గుండ్రని తెల్ల గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు ఒక సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. నత్త మూడు నుంచి ఐదేళ్లు జీవిస్తుంది. జెయింట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50–200 గుడ్లు పెడుతుంది. దాని జీవితకాలంలో వెయ్యి వరకు గుడ్లు పెడుతుంది.నత్తల ద్రావణంతో పంటలకు మేలు!నత్తలు పంటలకు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ నత్తలతో పంటల పెరుగుదలను వేగవంతం చేసే ద్రావణం(గ్రోత్ పమోటర్) తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నత్తల ద్రావణం తయారు చేసే పద్ధతి: అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకొని, అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం పొయ్యాలి. 15 రోజులు ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగానే పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిని 7 రోజులు వూరబెట్టండి. నత్తల ద్రావణం అర లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో ఏ పంటల కైనా పిచికారీ చెయ్యొచ్చు. నత్తల సమస్య తీరిపోతుంది. పంట బలంగా పెరిగి రైతుకు డబ్బులు వస్తాయని ఆయన సూచించారు. -
మొండి కోతులకు ముకుతాడు.. డమ్మీ చింపాజీలతో చెక్..
-
బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు
సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ఈ వానాకాలం సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నాం. అందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నరకాలే. వీరందరికీ బోనస్ ఇస్తాం. – మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క సీజన్‌కే పరిమితమైంది. గత (2024– 25) వానాకాలం సీజన్లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించిన సుమారు నాలుగున్నర లక్షల మంది రైతులకు రూ.1,200 కోట్ల వరకు చెల్లించింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన బోనస్ ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా ప్రాంత రైతులు ఏకంగా పోరుబాట పట్టారు. బోనస్ చెల్లించకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడగా పోటీ చేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. నిజామాబాద్, నల్లగొండ తదితర జిల్లాల్లో సైతం రైతులు యాసంగి బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్‌ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రావలసిన బోనస్ రూ.1,159.64 కోట్లు యాసంగి సీజన్లో 74.22 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం ధాన్యం 51.03 ఎల్ఎంటీ కాగా, సన్న ధాన్యం 23.19 ఎల్ఎంటీ. ఈ మొత్తం ధాన్యానికి రూ.17,198.58 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించింది. సన్నధాన్యం పండించిన 4,09,031 రైతులకు 1,159.64 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ విడుదల చేయలేదు. బోనస్ కోసం పోరుబాట పట్టిన మక్తల్ రైతులను మంత్రి వాకిటి శ్రీహరి సముదాయించే ప్రయత్నం చేశారే తప్ప బోనస్‌పై హామీ ఇవ్వలేదు. ఇటీవల పదవీ విరమణ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సైతం బోనస్ అంశాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని వారం క్రితం మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున రైతులు యాసంగిలో కూడా సన్నాలు సాగు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 8 లక్షల ఎల్ఎంటీ ధాన్యాన్ని సేకరిస్తే, అందులో 7.15 లక్షల ఎల్ఎంటీ సన్నాలే ఉన్నాయి. నల్లగొండ, నారాయణపేట, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సన్న ధాన్యాన్ని పండించారు. ప్రస్తుత వానకాలం సీజన్లో సాగు చేసిన 67.33 లక్షల ఎకరాల్లో 60 శాతానికి పైగా సన్నధాన్యమే పండించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 ఎల్ఎంటీ ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇందులో 40 నుంచి 45 ఎల్ఎంటీ సన్నధాన్యం మార్కెట్‌కు వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తానికి బోనస్ క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తే రూ.2,200 కోట్లు అవుతుంది. ఇప్పటికే ఉన్న బాకాయి 1,159.64 కోట్లు కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. నాకు రూ.5.60 లక్షల బోనస్ రావాలి నాకు ఉన్న 5 ఎకరాల పొలంతోపాటు కొంత కౌలుకు తీసుకొని రబీలో వరి సాగు చేశాను. 2,800 బస్తాలు పండించాను. మొత్తం 1,120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాను. రూ.5.60 లక్షల బోనస్ రావాల్సి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. – వాడ్వాట్ తిమ్మన్న, రైతు, గుడే బల్లూరు గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానన్న బోనస్ డబ్బులు ఇవ్వక పోవడంతో బాధిత రైతులమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో జెడ్పీటీసీకి రైతులందరం రాజకీయాలకు ఆంతీతంగా పోటీ చేయాలని నిర్ణయించాం. – చెవిటోళ్ల వెంకటేష్, రైతు, గుడే బల్లూరు గ్రామం -
Kakani: నీ పాలనలో రైతుల పరిస్థితి ఇది చంద్రబాబు..
-
ఇక పంట విక్రయాల్లో దళారులకు నో చాన్స్
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమ పద్ధతుల్లో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించే దళారులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. పండించిన రైతు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీ ఇచ్చేలా రూపొందించిన ‘పీఎమ్–ఆశా’పథకం కింద ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని పెట్టుబడి, మద్దతు ధర విభాగం నుంచి ఈనెల 18న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవి అమల్లోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్రమాలకు చెక్ పెట్టేందుకే...బహిరంగ మార్కెట్లో ధర లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసే విధానం కొంతకాలంగా దేశంలో అమలవుతోంది. అయితే దీనిని దళారులు దుర్వినియోగం చేస్తున్నారు. » వరి, పత్తి కందులు, మొక్కజొన్న, పెసర, జొన్నలు, మినుములు మొదలైన పలు రకాల పంటలకు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. » ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్‌సీఐ సేకరిస్తుండగా, పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుంది. ఇవి కాకుండా పెసలు, సోయా బీన్, మినుములు వంటి పంటలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్సీసీఎఫ్, నాఫెడ్ కొనుగోలు చేస్తాయి. » కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జొన్నలు, మక్కలు మొదలైన పంటలను రైతుల నుంచి సేకరిస్తుంది. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేస్తోంది. పంట నాణ్యత లేదని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, ప్రైవేటు వ్యాపారులు తిరిగి ఆ పంటనే మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్, సీసీఐ వంటి సంస్థలతో కుమ్మక్కై రైతుల పేరిట మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. » గత సంవత్సరం పత్తి పంటకు సంబంధించి ఇలాంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ద్వారా ధ్రువీకరించి, కేంద్రానికి పంపించింది. » గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా జరిగిన జొన్నల కొనుగోళ్లలో కూడా దళారులే రైతుల పేరిట విక్రయాలు జరిపినట్టు రుజువైంది.» దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ రైతులే లబ్ధిదారులుగా ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది. రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ...ధర మద్దతు పథకం (పీఎస్ఎస్) ప్రత్యేక పోర్టల్‌లో రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కూడా రైతు డేటాను కేంద్రం సేకరిస్తుంది. » రాష్ట్ర పోర్టల్‌లో రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. డీసీఎస్/అగ్రి–స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా పంట వివరాలు ధ్రువీకరించాలి. లేనిచోట పాత పద్ధతిలోనే వెరిఫికేషన్ చేపడతారు.» రైతు ఆధార్, పట్టాదార్‌పాస్ పుస్తకంతో పాటు క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతు ఏ పంట వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ నుంచి సేకరించి, పంటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలతో రైతుల డేటాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. » డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రి–స్టాక్ డేటాతో ఆటో వెరిఫికేషన్ తప్పనిసరి. » ఒకవేళ రైతులు తమ పంటలను విక్రయించడానికి నేరుగా రాని పక్షంలో తన ఆధార్ నంబర్‌తో గరిష్టంగా ముగ్గురికి ఆథరైజేషన్ ఇచ్చి పంటల విక్రయానికి పంపించే అవకాశం ఉంటుంది. రైతు హాజరు కాకపోతే, అతడి అధీకృత ప్రతినిధి ఉత్పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చే వీలు ఉంటుంది. చెల్లింపు మాత్రం నేరుగా రైతు (యజమాని) బ్యాంక్ ఖాతాకు మాత్రమే వెళుతుంది. » ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు అనుమతి ఉండదు. తద్వారా రైతుల పేరిట దళారులు పంటలను బల్క్‌గా విక్రయించే అవకాశం ఉండదు.» రైతులకు చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ఆధార్ వెరిఫైడ్ ఖాతాల్లోనే జరుగుతాయి. ఆధార్ చట్టం 2016 సెక్షన్ 7 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 30లోపు రాష్ట్రాలు దీనిని కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. » నిజమైన రైతులకే మద్దతు ధర ప్రయోజనం చేరేలా చూడటం, మధ్యవర్తుల జోక్యం తగ్గించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ వ్యాఖ్యలతో ఏపీ అన్నపూర్ణ బ్రాండ్ ఇమేజ్‌కు గట్టి దెబ్బ!
రాష్ట్రం పరువు పోవాలని ఏ ముఖ్యమంత్రైనా కోరుకుంటాడా? రైతుల ప్రతిష్ట దెబ్బతినాలని ఆకాంక్షిస్తాడా? మిగిలిన రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం ఈ రెండు కాంక్షిస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే పలు చిత్ర, విచిత్రమైన ప్రకటనలతో ప్రజలను తరచూ గందరగోళంలోకి నెట్టేసే చంద్రబాబు నాయుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రైతులు పండించే ధాన్యం తినేందుకు, ఎగుమతి చేసేందుకూ పనికి రాదని తేల్చేశారు. ఇందుకు ఆధారాలున్నాయా? లేదా? అన్నది వేరు సంగతి కానీ.. ఇలా చెబితే రైతులకు అన్యాయం జరగదా? అన్న ఆలోచన కూడా చేయలేకపోయారు ఘనత వహించిన సీఎంగారు. ఎగుమతులకు పనికి రాదని సీఎం స్వయంగా అంటే.. కొనుగోళ్లకు ఏ దేశం ముందుకొస్తుంది?. ఇలా మాట్లాడటం ద్వారా సీఎం ఇక్కడి ధాన్యాన్ని విస్తృతంగా వాడే రాష్ట్ర ప్రజలందరిలో అనుమానాన్ని సృష్టించినట్లు అవ్వదా!. దీంతో ఈ ఆరోపణ కూడా తిరుమల ప్రసాదంలో కల్తీ చందంగా అనుచితమైపోయిందని తేలుతోంది. కోనసీమలో వరి సాగు సమస్యలపై కొన్నేళ్ల క్రితం క్రాప్ హాలిడే ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తీవ్రంగా తప్పుపట్టారు. ఇప్పుడు ఆయన అధికారంలో ఉండి వరి వేయడం మంచిది కాదని చెబుతున్నారు. పైగా అధిక యూరియాతో పండించిన పంటలు తినడం వల్ల కేన్సర్ వస్తుందని అంటున్నారు. ఎంత బాధ్యతారహిత ప్రకటన ఇది!!.ఎరువుల విచ్చలవిడి వాడకం సరికాదనడం వేరు కేన్సర్ వస్తుందనడం వేరు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా పేరుంది. దశాబ్దాలుగా వరి సాగు జరుగుతోంది. ఒకపక్క రికార్డు స్థాయి వది దిగుబడులపై పొరుగున ఉన్న తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబరంగా చెప్పుకుంటూంటే... మొత్తం ఉత్పత్తిని కొనుగోలు చేశామని సంబరంగా చెబుతూంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తి నిరుత్సాహకరమైన వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణలోనూ యూరియా కొరత(Urea Crisis In Telangana) వచ్చింది కానీ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు కేంద్ర స్థాయిలో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకున్నారు. అవసరానికి తగినంత రాకపోయి ఉండవచ్చు. అది వేరు సంగతి. అంతమాత్రాన తెలంగాణలో ఎవరూ వరి వేయద్దని అనలేదు. కేన్సర్ బూచిని చూపలేదు. ఏపీలో యూరియా కొరత(AP Urea Crisis) సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన వరదరాజులరెడ్డి స్వయంగా శాసనసభలో యూరియా కొరతపై మాట్లాడారు. ఒకదశలో అసలు యూరియా కొరత లేదని చంద్రబాబు సోషల్ మీడియాపైన, వైసీపీపైనా మండిపడ్డారు. ఆ తర్వాత కలెక్టర్ల సమావేశంలో పంపిణీలో విఫలం అయ్యామని, వచ్చేసారి రైతుల ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని, తాజాగా పొలాల వద్దే అందచేస్తామని అంటున్నారు. కేంద్రంలో తమ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అవసరమైన మేర యూరియాను తెప్పించుకోలేకో, వచ్చిన యూరియాను క్రమబద్దంగా పంపిణీ చేయలేకో, బ్లాక్ మార్కెట్‌ను, టీడీపీ నేతల దందాను అరికట్టలేకో తెలియదు కాని, మొత్తం నెపాన్ని రైతులపై నెట్టే యత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పిఠాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న యూరియా లారీలను పోలీసులు పట్టుకున్నారు. అదను దాటిపోతున్నా యూరియా అవసరమైన మేర అందడం లేదని రైతులు వాపోతున్న దృశ్యాలు పలు చోట్ల కనిపిస్తున్నాయి. ఈ దశలో ఎంతో బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన ముఖ్యమంత్రి అసలు మన వరి పంటపైనే తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అత్యంత శోచనీయం. మనం పండిస్తున్న వరి మద్యం తయారీకి తప్ప దేనికి పనికి రాదని అన్నారు. ఇప్పుడు జనం అంతా వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న బియ్యాన్ని వాడుతున్నారా? రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏపీలో పండిందా? కాదా? నిజంగానే అది తినడానికి యోగ్యమైనది కాకపోతే ఎందుకు పంపిణీ చేస్తున్నారు? ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే దృష్టి మరల్చే వ్యూహాలు అమలు చేస్తూంటుంది. దానికి కూడా హద్దు ఉంటుంది. మొత్తం రాష్ట్రం పరువు ,ఇమేజీ పోయే విధంగా ఉండరాదు. యూరియా కొరత ఏర్పడినప్పుడే కేన్సర్ సమస్య గుర్తుకు వచ్చిందా? ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పాలి? ఆ ఎరువు వాడకం తగ్గించాలని సీజన్ కు కనీసం ఆరు నెలల ముందు చెప్పాలి కదా? అంతా వరి వేసేసిన తర్వాత అది వద్దని, అది తినడానికి పనికి రాదని అంటే రైతులు ఏమి చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నుందుకు తమకు తగిన శాస్తి జరిగినట్లు రైతులు భావించరా? కొన్ని జిల్లాలలో మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో వరిని రెండు పంటలుగా వేస్తారు. మిగిలిన చోట్ల రెండో పంటగా అపరాలు వేస్తారు. వరి వద్దని ఉద్యాన పంటలు వేయాలని చెబితే అది ఇప్పటికిప్పుడు అవుతుందా? పైగా ఇప్పుడు ఉద్యాన పంటల వారు ఎన్ని బాధలు పడుతున్నారో చూడడం లేదా? మామిడి, బొప్పాయి తదితర రైతులు గిట్టుబాటు ధరలు లేక ఎన్ని పాట్లు పడుతున్నారు! పోనీ మెట్ట పంటలు వేద్దామనుకుంటే మిర్చి, పొగాకు వంటి పంటలకు ధర లేక ఎంత ఆందోళన జరిగింది. మాజీ సీఎం జగన్ ఆయా పంటల రైతుల వద్దకు వెళ్లేవరకు ప్రభుత్వంలో చలనం కనిపించిందా?. ఉల్లి, టమోటా రైతులు పడుతున్న పాట్ల మాటేమిటి?. అమరావతికి లక్షల కోట్లు అప్పులు చేసి ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు మూడు, నాలుగువేల కోట్లు వెచ్చించ లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దానికి బదులు ఇవ్వడం లేదు. ఆయా పంటలు ఎంత సాగు అవుతాయన్న దానిపై వ్యవసాయ శాఖకు అంచనాలు, లెక్కలు ఉంటాయి. వాటిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని ,నిజంగానే ఆ పంటల వల్ల రైతులకు లాభం రాదనుకుంటే ప్రత్యామ్నాయాలతో సహా ప్రభుత్వం సాగు సీజన్‌కు కొన్ని నెలల ముందు సూచనలు చేయాలి కదా!. అవేమీ చేయకుండా, ఇప్పటికిప్పుడు వరికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రైతులకు అన్యాయం చేయడం అవుతుంది.వరి పంట కొనుగోలుకు కూడా సమస్య వస్తుందని ఇప్పుడే చంద్రబాబు చెబుతున్నారంటే, రైతులకు ధాన్యం అమ్మకాలలో మున్ముందు ఎన్ని కష్టాలు వస్తాయో ఊహించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు వాటిని ఎంతవరకు నెరవేర్చారు. 2014 టరమ్‌లో రైతుల రుణాలన్నిటిని మాఫీ చేస్తామని ఊదరగొట్టి, తీరా ప్రభుత్వం వచ్చాక ఆరో వంతు రుణాలు కూడా మాఫీ చేయలేదు.ఈసారి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద రైతుకు ఇస్తామని చెప్పి ఒక ఏడాది ఎగవేసి, ఈ ఏడాది రూ.ఐదువేలు మాత్రం ఇచ్చారు. అయినా రైతులకు ఏదో చాలా చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటారు.రైతులకు ఇవ్వవలసిన ఇన్ పుట్ సబ్సిడీ. బీమా సదుపాయం తదితర అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏమి చేసిందో తెలియదు. జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే ఎంతో గొప్ప వ్యవసాయదారులు ఉన్న రాష్ట్రంగా పేరొందిన ఏపీ రైతుల ప్రతిష్ట దెబ్బతినేలా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడే మాట్లాడడం దారుణం అని చెప్పక తప్పదు. ఇది ఒక రకంగా ఏపీ బ్రాండ్ ఇమేజీని తనకుతానే దెబ్బతీయడం అని, వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమేనని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ఏకీభవించకతప్పదు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: బిల్డప్ బాబు కొత్త బొంకులు.. పచ్చ మీడియాపై సెటైర్లు! -
తప్పని యూరియా కష్టాలు
-
చంద్రబాబూ.. మా భూముల జోలికొస్తే ఖబడ్దార్
సాక్షి, అమరావతి: పారిశ్రామికీకరణ పేరిట టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు చేపట్టిన ఆందోళనతో బుధవారం విజయవాడ దద్దరిల్లింది. ఆందోళన చేపట్టినవారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు పలువురు నేతల్ని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలేశారు. చివరికి కొందరు ప్రతినిధులు అసెంబ్లీలో మంత్రిని కలిసేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మా భూముల జోలికొస్తే ఖబడ్దార్.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరించారు. బలవంతంగా భూసేకరణ జరిపితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏపీ వ్యవసాయ కార్మిక, రైతుసంఘాలు ఇచ్చిన ‘చలో విజయవాడ’ పిలుపుతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు తొలుత విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగారు. తమ గోడు వినేందుకు రెవెన్యూ మంత్రి లేదా ఉన్నతాధికారులు రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో అక్కడి నుంచి ఛలో అసెంబ్లీ చేపట్టారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అప్సర హొటల్ జంక్షన్లో ఏలూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకి దిగారు. దాదాపు గంటసేపు వాహనాల రాకపోకలు స్తంభించాయి. అనంతరం రైతులు, వ్యవసాయ కార్మికులు ఛలో రాజ్‌భవన్ అంటూ గవర్నర్ బంగ్లా వైపు ర్యాలీగా తరలివెళ్లారు. రాజ్‌భవన్ సమీపంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారికి, పోలీసులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పోలీసులు ముఖ్యనేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆందోళన మరింత తీవ్రతరం అవుతుండటంతో ఉన్నతాధికారులు స్పందించారు. కొద్దిమంది ప్రతినిధుల్ని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. అనంతరం మంత్రిని కలిసిన నేతలు మాట్లాడుతూ రైతులతో పాటు రైతుకూలీల అనుమతి లేకుండా భూములు తీసుకోబోమని మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్‌వా? ధర్నాచౌక్‌లో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా అని ప్రశ్నించారు. కరేడులో 20 వేల ఎకరాలు, కుప్పంలో రెండువేల ఎకరాలు కావాలంటున్నారని చెప్పారు. కరేడులో ఐదువేల ఎకరాలు, కుప్పంలో 1,500 ఎకరాలు, అమరావతిలో 50 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకొన్నారని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా భూమి ఇచ్చేందుకు సిద్ధంగా లేడని చెప్పారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు 100 నుంచి 200 ఎకరాలున్నాయని, ఆ భూములు తీసుకుని ఏ ప్రాజెక్టు కావాలంటే ఆ ప్రాజెక్టు కట్టుకోవచ్చని చెప్పారు. చంద్రబాబూ నువ్వు ముఖ్యమంత్రివా.. రాజకీయ బ్రోకర్‌వా.. అదాని, అంబానీలకు గుమాస్తావా? అంటూ నిలదీశారు. కరేడులో ఎకరం కోటి రూపాయలైతే.. అప్పనంగా కాజేయాలని చూస్తున్నారన్నారు. వంద ఎకరాలు సరిపోయే ఇండోసోల్‌కు ఎనిమిదివేల ఎకరాలు కావాలనడం.. రియల్ ఎస్టేట్ కోసం కాదా? అని నిలదీశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికే 500 ఎకరాలు చాలని, అలాంటిది కుప్పం ఎయిర్‌పోర్టుకు రెండువేల ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. మా పేదల జోలికి వస్తే ఖబడ్దార్ చంద్రబాబూ.. అంటూ హెచ్చరించారు. ఈ ఆందోళనలోఆయా సంఘాల రాష్ట్ర నేతలు వి.కృష్ణయ్య, బలరాం, హరిబాబు, దడాల సుబ్బారావు, కె.ప్రభాకర్‌రెడ్డి వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.పాల రైతు సంఘ నేతల అరెస్టు హేయం విశాఖ డైరీలో అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాసనసభ కమిటీ నివేదిక తక్షణమే ఇవ్వాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో పాల్గొన్న రైతులను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని ఏపీ రైతు సంఘం అధ్యక్ష,ప్ర«దాన కార్యదర్శులు వీ.కృష్ణయ్య, కే.ప్రభాకరరెడ్డి ఓ ప్రకటనలో ఖండించారు. -
హంద్రీనీవాలో ఉల్లి పారబోత
-
రైతులపై కానిస్టేబుల్ ఓవరాక్షన్
-
ఒక్కటే పంట..ఐదు ఆదాయాల పెట్టు!
చాలా రకాల పంటలు రైతుకు ఒకే ఆదాయాన్ని ఇస్తుంటాయి. కానీ, 5 రకాలుగా ఆదాయాన్నిచ్చే పంట ఒకటుంది. మరో విశేషం ఏమిటంటే...దీన్ని సాగు చెయ్యటానికి సారం కోల్పోయిన, కరువు ప్రాంతాల్లో బంజరైనా భేషుగ్గా పనికొస్తుంది. ఆ పంట పేరు ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్ కాక్టస్). క్షీణించిన భూమిలో ‘5 ఎఫ్ మోడల్’ పంటగా కాక్టస్‌ను పండించడం అంటే.. ఎడారీకరణను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించటం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిస్సారమైన కరువు ప్రాంత భూముల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇంతకీ ‘5ఎఫ్ మోడల్’ పంట అంటే ఏమిటి?.. చదవండి...ముళ్లులేని బ్రహ్మజెముడు ఒకటే పంట.. 5 ప్రయోజనాలు చేకూర్చుతోంది. రైతులకు బహుళ ఉత్పాదనలు, బహుళ ఆదాయ మార్గాలను అందిస్తున్నది. ఆ ఐదు ‘ఎఫ్‘లు ఏవంటే.. ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫ్యాషన్! ఈ ఐదు ఆంగ్ల పదాలు ఎఫ్‌తో ప్రారంభం అవుతాయి కాబట్టి ‘5ఎఫ్ మోడల్ పంట’ అని దీనికి పేరొచ్చింది. ఆహారం, పశుల మేత, ఇంధనం, ఎరువులు, ఫ్యాషన్ రంగాల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు పంట ఉపయోగపడుతోంది. ఆ విధంగా కరువును ΄పారదోలుతోంది!1. ఆహారం: దీని పండ్లను కాక్టస్ పియర్ (ఓపుంటియా ఫికస్–ఇండికా) అంటారు. ఈ పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. తాజాగా తినవచ్చు లేదా జామ్‌లు, జ్యూస్‌లు, సిరప్‌లుగా ్ర΄ాసెస్ చేయవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను ముక్కలుగా కత్తిరించి కూర వండుకొని తీసుకుంటారు.2. పశువుల మేత: ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను క్యాక్టస్ ప్యాడ్లు లేదా క్లాడోడ్లు అంటారు. ఇవి పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయి. నమ్మకమైన, తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల పచ్చి మేత. ముఖ్యంగా ఇతర రకాల మేతకు కొరత ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లో ఇవి పశువులకు ప్రాణం నిలిపేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో నీరు అధికపాళ్లలో ఉంటుంది.3. ఇంధనం: ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (కాక్టస్ బయోమాస్‌ను) బయోగ్యాస్ ఉత్పత్తికి మూల వనరు (ఫీడ్ స్టాక్)గా ఉపయోగిస్తున్నారు. 10% ఆవు పేడతో 90% కాక్టస్ బయోమాస్‌ను ఉపయోగించడం వల్ల 65% వరకు మీథేన్ కంటెంట్‌తో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఒక పైలట్ అధ్యయనం నిరూపించింది. ఈ గ్యాస్‌తో వంటకు, ఇతర ఉపయోగాలకు స్వచ్ఛమైన శక్తి వనరుగా పనికొస్తుంది.4. ఎరువులు: బయోగ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే పోషకాలతో కూడిన స్లర్రీని సేంద్రియ ఎరువుగా ఉపయోగించి నేలను సారవంతం చేసుకోవచ్చు. పంట ఉత్పాదకతను మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఖరీదైన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. పొలంలో పండే మొక్కల ఆకులతోనే ఎరువుగా వాడటం ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవచ్చు.5. ఫ్యాషన్: బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాల కోసం బయో–లెదర్ (మొక్కలకు సంబంధించిన తోలు) ఉత్పత్తి చేయడానికి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను ఉపయోగించవచ్చని మన దేశంలోని భూ వనరుల శాఖ, ఇతర పరిశోధకులు నిరూపించారు. 3 కిలోల దీని ఆకుల ద్వారా 3 చదరపు అడుగుల కంటే ఎక్కువ బయో–లెదర్‌ను ఉత్పత్తి చేయగలదని ఒక పైలట్ అధ్యయనంలో తేలింది.ఎడారిగా మారిపోతున్న ప్రదేశాలు, కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల్లో భూములు నిస్సారమైపోయి ఉంటాయి. అయితే, అటువంటి కఠిన పరిస్థితుల్లో మనుగడ సాగించగలిగే జాతుల పంటలను గుర్తించి, పరిశోధనలు చేయటం.. ఆయా పంటలను సాగు చేయించటంలో తోడ్పాటునందించటం ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం. ఇటువంటి పని చేస్తున్న ఒకానొక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఏఆర్డీఏ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ద డ్రై ఏరియాస్. దీని ప్రధాన కార్యాలయం లెబనాన్‌లో ఏభయ్యేళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాసియా, చైనాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయాన్ని 2008లో న్యూఢిల్లీలో నెలకొల్పారు. ఐసీఏఆర్డీఏ మన దేశంలోకి 67 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలను ప్రవేశపెట్టి, భారతీయ సంస్థల సహకారంతో పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించింది. ఆ కృషి ఫలితంగానే దేశంలో రైతులకు ఇప్పుడు తమ జీవనోపాధిని పెంచుకునే, కరువును ఎదుర్కొనే ఆశాజనకమైన ముళ్లులేని బ్రహ్మజెముడు అనే కొత్త పంట అందుబాటులోకి వచ్చింది. ఐసీఏఆర్డీఏ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని అమ్లహలో ఫుడ్ లెగ్యూమ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ నేహా తివారీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. మన దేశంలో ఎడారీకరణను, కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల అభ్యున్నతికి ‘కాక్టి రాణి’గా ప్రసిద్ధి చెందిన ముళ్లులేని బ్రహ్మజెముడు ఎంత అవసరమో ఆమె ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. ముఖ్యాంశాలు..ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను సాగు చేయటానికి తగిన వ్యవసాయ పరిస్థితులు ఏమిటి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట తక్కువ తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఇసుక నేలలు, కంకర నేలలకు ఇది అనువైనది. ముళ్లులేని బ్రహ్మజెముడు నిస్సారమైన నేలల్లో స్థిరంగా పెరిగే పంట అయినప్పటికీ, ముఖ్యంగా దాని పెరుగుదల దశలో, దానికీ కొంత తేమ అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు బాగా పెరగాలన్నా, పండ్ల కాపు రావాలన్నా ప్రతిరోజూ కనీసం ఆరు గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. ఈ మొక్క ఉదజని సూచిక కొద్దిగా ఆమ్ల లేదా తటస్థంగా ఉన్న నేలలను ఇష్టపడుతుంది. సాధారణంగా 6.0 నుండి 7.5 వరకు పీహెచ్ ఉండాలి. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. మన దేశంలోని మెట్ట ప్రాంతాలలో కఠినమైన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు ముళ్లులేని బ్రహ్మజెముడుకు అద్భుతమైన అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటలేవీ పండించలేని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. వాస్తవానికి, ఐసీఏఆర్డీఏ భారతదేశంలో అరవై ఏడు కాక్టస్ రకాలను ప్రవేశపెట్టింది. ఈ రకాలను పెంచే మదర్ నర్సరీలు అమలహాలోని ఐసీఏఆర్, ఐసీఏఆర్డీఏ సంస్థల్లో ఏర్పాటయ్యాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును ప్రోత్సహించడానికి డిసెంబర్ 2023లో ఐసీఏఆర్డీఏ భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.దేశంలో ముళ్లులేని బ్రహ్మజెముడు మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిందా?చిన్న రైతులు స్థానికంగా ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్ల కోసం, పశుగ్రాసం కోసం పండిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువే. మార్కెటింగ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఐసీఏఆర్డీఏ కేంద్ర భూ వనరుల శాఖతో కలిసి పనిచేస్తున్నది. ఆహారంగా, ఇంధనంగా, పశుగ్రాసంగా, ఎరువుగా, కార్బన్ క్రెడిట్స్, ఫ్యాషన్ రంగాల్లో రైతులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు.. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 61% మీథేన్‌తో కూడిన బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేశాం. అలాగే చౌకగా, సమృద్ధిగా లభించే బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతలను అభివృద్ధి చేశాం. అదనంగా, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో బయో–లెదర్‌ను రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ప్రాథమిక పరీక్షలు ఆశాజనకమైన ఫలితాలిచ్చాయి. 3 కిలోల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల బయో లెదర్‌ను ఉత్పత్తి చేశాం. ఇది 2 జతల చెప్పులు, 3 చిన్న బ్యాగులు లేదా 2 జతల బూట్లను తయారు చేయడానికి సరి΄ోతుంది. బయోలెదర్ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి అనేక జాతుల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బయో లెదర్ రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో, రైతులకు ప్రయోజనం చేకూరుస్తూనే ప్రైవేట్ రంగాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. బ్రహ్మజెముడు ఉత్పత్తుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట నిరూపిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఈ పంట సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని పెంపొందించడానికి ఐసీఏఆర్డీఏ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తున్నది. ముఖ్యంగా ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలు, కరువు ప్రాంతాల్లో ఆహార భద్రత, జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం.ఒక రైతు ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను ఎలా పండించవచ్చు?ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగులో గమనించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నీరు నిలవని నేలలు, తగినంత సూర్యకాంతి ఉన్న ప్రదేశాల్లో పెంచాలి. దీనికి కూడా ఎండా కాలంలో నీరందించాలి. జంతువుల నుంచి రక్షణకు కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దున్నిన తర్వాత నాటుకోవాలి. వాన నీరు బయటకు వెళ్లిపోవటానికి ఏర్పాట్లు చేసుకోకపోతే వేరుకుళ్లు సమస్య వస్తుంది. ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులనే నాటుకోవాలి. వీటిని ఐసీఏఆర్డీఏ, ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ నర్సరీల నుంచి ఆరోగ్యకరమైన, ముదురు ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను తెచ్చుకొని రైతులు నాటుకోవాలి.వరుసలలో తగినంత దూరంలో నాటుకోవాలి. ముళ్లు లేని బ్రహ్మజెముడు రకాన్ని, దాని పెరుగుదల అలవాటును బట్టి ఎంత దూరం పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ ఆకులను తెచ్చిన 10 నుండి 15 రోజులు వాడబెట్టిన తర్వాత నాటుకోవాలి. వరుసల మధ్య 2 మీటరు, మొక్కల మధ్య 1 మీటరు దూరంలో నాటాలి. ఆకు 1/3 వంతు నేలలోకి ఉండేలా నాటాలి. వ్యాధి నివారణ కోసం కార్బెండజిమ్ (2 గ్రాములు/లీటరు) ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన తర్వాత మొదటి 10 రోజులు నీరు పెట్టవద్దు. తరువాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు ఇవ్వండి. అది వేరుపోసుకొని మొలకెత్తిన తర్వాత అంత తరచుగా నీరు పెట్టనవసరం లేదు. నేల పరీక్ష నిర్వహించి తగినంత ఎరువు వేయాలి. నాటేటప్పుడు మొక్కకు బాగా కుళ్ళిన పశువుల ఎరువు 2 కిలోలు వెయ్యండి. పండ్లు, ఆకులు కోసిన ప్రతి సారీ ఎరువులు వేయాలి. పిండినల్లి, శిలీంధ్ర తెగుళ్లు, ఇతర పురుగుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలి. ఒక సంవత్సరం తర్వాత, అడుగున రెండు ఆకులు వదిలి, పైన పూర్తిగా ఎదిగిన ఆకులను కోసి ఉపయోగించుకోవాలి. మొదటి సంవత్సరంలో మొక్కకు 8–10 కిలోల ఆకుల దిగుబడి వస్తుంది. మేకలు, గొర్రెలు, పశువులు, గేదెలకు మేతగా వీటిని వేసుకోవచ్చు. ఇతర పచ్చి మేతకు 25% ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. వసంతకాలం చివరిలో లేదా వేసవి ప్రారంభంలో ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్లు కోతకు వస్తాయి.ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నాటే ఆకులను ఎలా సేకరించుకోవాలి?ఐసీఏఆర్డీఏ, ఐజీఎఫ్ఆర్ఐ, సీఏజడ్‌ఆర్‌ఐ, సెంట్రల్ ఇన్సి్టట్యూట్ ఫర్ ఆరిడ్ హార్టికల్చర్, బీఏఐఎఫ్ వంటి పరిశోధనా సంస్థల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు నర్సరీలు ఉన్నాయి. వారి నుంచి విత్తన ఆకులను తీసుకొని నాటుకోవచ్చు. ఇప్పటికే ఈ పంట సాగు చేస్తున్న రైతుల పొలాల నుంచి ఆరోగ్యకరమైన ఆకులు లేదా కాండం ముక్కలను తెచ్చి నాటుకోవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్క 3–4 సంవత్సరాలలో పూర్తి పరిపక్వతకు చేరుకుంటుంది. కొందరు గ్రీనహౌస్లో కూడా పెంచుతున్నారు. చదరపు మీటరుకు రూ. 500 నుండి 600 వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. రూపాయి ఖర్చుకు 3 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వివరాలకు.. www.icarda.orgదీన్ని సాగు చేస్తే భూమికి మేలు... నిస్సారమైన ఇసుక దువ్వలాగా మారిపోయిన భూమికి జవ జీవాలను అందించి పునరుద్ధరించడానికి అనేక విధాలుగా బ్రహ్మజెముడు పెంపకం అనువైనదని నిపుణులు చెబుతున్నారు:కరువు నిరోధకత... వాతావరణం నుంచి నీటిని పీల్చుకొని తనలో నిల్వ చేసుకోవటం బ్రహ్మజెముడు మొక్క లక్షణం. అందువల్లే ఇది కరువును గట్టిగానే తట్టుకోగలుగుతుంది. ఈ మొక్క జీవించడానికి, ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ నీరు సరిపోతుంది.నేలకు మేలు... బ్రహ్మజెముడును పెంచడం వల్ల మట్టి వానకు, గాలికి కొట్టుకుపోకుండా ఆపటం ద్వారా నేల సారాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ మొక్కలు మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి.కర్బన స్థిరీకరణ... బ్రహ్మజెముడు మొక్క కర్బనాన్ని వాతావరణం నుంచి సంగ్రహించి తన ఆకులు, కాండంతో పాటు నేలలో నిల్వ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ కర్బన స్థిరీకరణ ప్రక్రియ సహాయపడుతుంది.అధిక దిగుబడి సామర్థ్యం... కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ముళ్లు లేని బ్రహ్మజెముడు చక్కగా పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారులో 80–100 టన్నుల బరువైన ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను పండించవచ్చు.అమలుకు అవకాశాలు... ఈ 5 రకాల ప్రయోజనాలను పొందే ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నమూనాను స్వీకరించడానికి ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారం అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు నాణ్యమైన ఆకులు నాటుకుంటే చాలు. అవి వేరుపోసుకొని ఎత్తయిన మొక్కగా ఎదుగుతాయి. కరువు ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు రైతులకు నాణ్యమైన ఆకులను అందించటం, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం ముఖ్యమైన విషయం. మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడం, ఈ ఆకులను 5 రకాలుగా ఉపయోగించేందుకు వీలుగా ప్రాసెస్ చేయడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరం.ఈ 5 రకాల ప్రయోజనాలనిచ్చే పంట నమూనాను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల్లో అవగాహన పెంచడం, సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలి. ఈ పంట నమూనా ముఖ్యంగా కరువు, ఎడారి తాలకు బాగా సరిపోతుంది. భారతదేశం, పాకిస్తాన్, ఇథియోపియా, మొరాకోతో సహా ఎడారీకరణను ఎదుర్కొంటున్న అనేక దేశాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్నారు. బహుళ ఆదాయ మార్గాలను అందించడం, పనిలో పనిగా భూమిని తిరిగి సారవంతం చేయటం ద్వారా 5 రకాలుగా ప్రయోజనకరమైన బ్రహ్మజెముడు పంట నమూనా బడుగు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మెరుగైన ఆహార భద్రతనిస్తుంది. అదే సమయంలో పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. –పంతంగి రాంబా, బుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: Sagubadi: మునగ మేలు!) -
యూరియా కోసం తోపులాట
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని రైతులు యూరియా కోసం మంగళవారం ఉదయం పీఏసీఎస్ వద్దకు అధిక సంఖ్యలో వచ్చి క్యూలో నిల్చున్నారు. ఒకే కౌంటర్ ఉండడంతో ఒకవైపు మహిళలు, మరోవైపు పురుషులు క్యూ కట్టారు. రెండువైపుల నుంచి రైతులు కౌంటర్ వద్దకు ఒకేసారి తోసుకోవడంతో శ్వాస ఆడక ముగ్గురు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, వ్యవసాయ సిబ్బంది వారిని పక్కకు తీసుకొచ్చి ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేయడంతో ఇద్దరు మహిళలు స్పృహలోకి వచ్చి మరలా క్యూలైన్లోకి వెళ్లారు. గేమ్యానాయక్‌తండాకు చెందిన లక్ష్మి కొంత ఇబ్బంది పడటంతో 108లో పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ చొరవ తీసుకుని పీఏసీఎస్‌కు పక్కనే ఉన్న పాత సీడీపీఓ కార్యాలయం వద్ద మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయించారు. రైతుపై చేయిచేసుకున్న హోంగార్డు! యూరియా కోసం క్యూలో నిల్చున్న ఓ రైతుపై హోంగార్డు చేయిచేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్ పెద్దవూరకు వచ్చి బాధిత రైతుతో మాట్లాడారు. తనను హోంగార్డు ఏమీ కొట్టలేదని, తాను వేకువజామునే వచ్చి క్యూలో నిల్చున్నట్లు మూత్రం రావడంతో బయటకు వెళ్లి వచ్చానని, తిరిగి క్యూలో నిల్చుండగా ఈ క్రమంలో తన వెనకాల ఉన్న రైతులు గొడవ చేశారని, దీంతో హోంగార్డు వచ్చి తనను బయటకు లాగే ప్రయత్నం చేశాడని, తాను ఉన్న విషయాన్ని చెప్పడంతో వెళ్లిపోయాడని చెప్పాడు.» సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్‌లోని మనగ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పెద్ద సంఖ్యలో బారులు దీరారు. -
రైతులను అవమానించేలా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
-
అచ్చెన్నాయుడే ఎరువులు తరలిస్తున్నారు
పొందూరు: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతుంటే... వచి్చన ఎరువుల్లో మంత్రులు చేతివాటం చూపుతున్నారని సాక్షాత్తూ అధికార పక్షం నాయకులే విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మలకాం గ్రామానికి రావాల్సిన ఎరువులను మంత్రి అచ్చెన్నాయుడే తరలించారంటూ టీడీపీ సర్పంచ్ జాడ శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మలకాం గ్రామానికి వచి్చన ఎరువుల లారీని బయటకు వెళ్లనీయకుండా సర్పంచ్‌తో పాటు రైతులు సచివాలయం వద్ద అడ్డుకున్నారు.తమ గ్రామానికి పూర్తి స్థాయిలో ఎరువులు పంపాలని డిమాండ్ చేశారు. తొలివిడతలో 444 యూరియా బస్తాలు రాగా రెండో విడతలో వచి్చన ఎరువులను వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడే పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. తమ గ్రామానికి అధికారులు 330 బస్తాలు కేటాయించారని సర్పంచ్ చెప్పారు. అయితే సోమవారం 110 బస్తాలు మాత్రమే వచ్చాయని, మిగిలిన 220 బస్తాలు మాటేంటని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రావాల్సిన ఎరువులు సరఫరా అయ్యేంత వరకు లారీలోని 110 బస్తాల లోడును దించబోమని, లారీని ఇక్కడ నుంచి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు. -
నివేదన.. నిర్వేదం
‘అధికార కూటమి నాయకులను ఎదిరించలేం. మాకు జీవనాధారమైన ఇంటి స్థలం... పొలం వదిలి బతకలేం. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ పలువురు పేదలు, రైతులు తమ గోడును అధికారులకు వివరించేందుకు సోమవారం కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోనే చచ్చిపోతాంచిత్తూరు కలెక్టరేట్: ‘మా భూమిని అక్రమంగా ఓ వ్యక్తి అమ్మేశాడు. పొలం వదిలి వెళ్లాలని మా టీడీపీ నాయకులే బెదిరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. ఇక మాకు చావే శరణ్యం..’ అంటూ చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పొట్టగానిపల్లికి చెందిన బాధితుడు వెంకటేష్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ సభ్యత్వ కార్డులు మెడలో వేసుకుని సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద పెట్రోల్ క్యాన్‌తో ఆత్మహత్యాయత్నం చేసింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తమకున్న 2.15 ఎకరాల భూమిని మునుస్వామి అనే వ్యక్తి అమ్మేశాడని, పొలం వదిలి వెళ్లాలని కూటమి నేతలతో బెదిరింపులకు గురిచేస్తున్నాడని వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు.టీడీపీ నేతల అండతో స్థలం కబ్జా చేస్తున్నారని..వెదురుకుప్పం: టీడీపీ నేతల అండతో తన ఇంటి స్థలాన్ని ఓ మహిళ ఆక్రమించేందుకు యతి్నస్తున్నారని రమణమ్మ అనే మహిళ సోమవారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం తహశీల్దార్ కార్యాలయం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంటి స్థలాన్ని టీడీపీ నేతల అండతో చంద్రమ్మ కబ్జా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తోటి అర్జీదారులు రమణమ్మను తిరుపతి ఆస్పత్రికి తరలించారు. కాగా, చంద్రమ్మ వర్గీయులూ తహశీల్దార్ కార్యాలయం వద్దకు రావడంతో ఇరువర్గాలవారు ఘర్షణ పడ్డారు. పల్నాడు కలెక్టరేట్లో తాపీమేస్త్రి..నరసరావుపేట: తన 50 గజాల స్థలం వేరే వ్యక్తికి చెందినదని పంచాయతీ సెక్రటరీ సరి్టఫికెట్ ఇచ్చాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనే ఆవేదనతో సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో జొన్నగలగడ్డ గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ చుట్టు బ్రహ్మం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యతి్నంచాడు. వెంటనే పోలీసులు అతడ్ని ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘నా స్థలాన్ని మరో వ్యక్తికి చెందినదిగా పంచాయతీ కార్యదర్శి సరి్టఫికెట్ ఇచ్చాడు. నేను గతంలో అనేకసార్లు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అధికారులకు అర్జీ అందజేసినా ఫలితం లేదు. అందుకే గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని బ్రహ్మం తెలిపారు. అయితే దీనిని అధికారులు ఖండించారు.పొలం మధ్యలో రోడ్డు వేశారని...నంద్యాల: రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుని తమ పొలంలో నుంచి రోడ్డు వేశారని ఓ రైతు కుటుంబం నంద్యాల కలెక్టర్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యతి్నంచింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన బాధితులు మధుశేఖర్గౌడ్, మద్దిలేటిస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ పొలంలో నుంచి కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు లంచాలు తీసుకుని రోడ్డు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కలెక్టర్ రాజకుమారి బాధితుల వద్దకు వచ్చి విషయం తెలుసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్‌ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ఆనాడు పీఎం వాజపేయ్‌కు చెప్పి, వన్‌మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్‌కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్‌కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్‌లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్‌లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్‌లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్‌ను దక్కుతుంది. ల్యాబ్‌లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
యూరియా.. యాతన
కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన నువ్వుల శ్రీనివాసరావు పదెకరాలు కౌలుకు చేస్తున్నారు. ఈ సీజన్లో ఎంటీయూ 1318 రకం వరి పంట సాగు చేశారు. తొలి విడతలో అతికష్టమ్మీద మూడు కట్టల యూరియా మాత్రమే దొరికింది. రోజుల తరబడి పడిగాపులు కాసినా రెండో విడతలో నిరాశే మిగిలంది. దీంతో చేసేది లేక అధిక ఖర్చు అయినా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అదే యూరియా దొరికితే ఎకరాకు రెండు కట్టల చొప్పున రూ.533తో సరిపోయేది. కాంప్లెక్స్ ఎరువులు వాడుతుండటంతో రూ.3 వేల దాకా ఖర్చు అవుతోంది. అంటే దాదాపు ఆరు రెట్లు అదనపు భారం పడింది. పైగా ఒక్కో సొసైటీలో ఒక్కో ధర. లోడింగ్, రవాణా ఖర్చులు దీనికి అదనం. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయితే ప్రస్తుతం రూ.8 వేలకు పైగా ధారపోయాల్సి వస్తోందని ‘సాక్షి’ ఎదుట రైతు వాపోయాడు.ఎన్టీఆర్ జిల్లా పురుషోత్తపట్నానికి చెందిన రైతు మైనేని దుర్గాప్రసాద్ 17 ఎకరాలు కౌలుకు తీసుకొని 1318 వరి వేశారు. రెండో విడతగా కట్ట యూరియా కోసం నాలుగుసార్లు పనులు మానుకుని వచ్చినా మీ టోకెన్ నెంబర్ రాలేదంటూ తిప్పి పంపిస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా రూ.300 నుంచి రూ.500 దాకా అడుగుతున్నారు. పైగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు పురుగుల మందులు అంటగడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో చేసేది లేక 20ః20 వేశాడు. ఈ ప్రభుత్వం అదునుకు యూరియా కూడా అందించలేకపోతోందని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆక్రోశిస్తున్నాడు. ఈ ప్రభావంతో ఈసారి దిగుబడులు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు.సాక్షి, అమరావతి: ఒకపక్క యూరియా కరువు.. మరోవైపు ఏ పంటకూ మద్దతు ధరలు లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని దయనీయమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యూరియా కోసం క్యూలైన్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఆత్మగౌరవాన్ని దిగమింగుకుని రోజుల తరబడి పడిగాపులు కాసినా అరకట్ట దొరకడం గగనంగా మారింది. ఎంత తిరిగినా యూరియా దొరక్క ఖరీదైన కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుతో పెట్టుబడి ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు.. దిక్కులు చూస్తోంది. అటు పెట్టుబడి సాయం అందక.. ఇటు ఉచిత పంటల బీమాకు దూరమై రైతన్నలు అల్లాడుతున్నారు. పంట నష్టపోతే కనీసం కరువు సాయం కూడా అందని దుస్థితి నెలకొంది. వరి ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్న తరుణంలో రెండో విడతగా ఇవ్వాల్సిన యూరియా కోసం కటకటలాడుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో యూరియా కోసం తమ అగచాట్లను అన్నదాతలు మొర పెట్టుకున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడుతూ గత ఐదేళ్లలో ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితులు లేవని చెబుతున్నారు.పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు..గత ప్రభుత్వ హయాంలో గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కావాల్సినంత యూరియా అందుబాటులో ఉండేది. కియోస్క్‌లో బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తమ కళ్లాలకు సరఫరా చేసేవారు. ఫలితంగా లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు రవాణా ఖర్చుల రూపంలో బస్తాకు రూ.20–50 వరకు ఆదా అయ్యేది. ఆ ఐదేళ్లలో ఏ ఒక్క రోజూ విత్తనాలు, యూరియా కోసం ఎక్కడా క్యూలైన్లు కనిపించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎంత కావాలంటే అంత యూరియా దొరికేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదిగా పరిస్థితి మారిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాకు మంగళం పాడారు. సబ్సిడీ విత్తనాలకూ కోత పెట్టారు. మరోవైపు ఎరువుల సరఫరాను సొసైటీలకు పరిమితం చేశారు. దీంతో ఎరువుల కోసం సీజన్లో పొలం పనులు మానుకుని మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దాదాపు 10 రోజుల పాటు పొలం పనులు వదిలేసి సొసైటీల వద్ద పడిగాపులు కాస్తేగానీ అరకట్ట దొరకడం గగనమైపోయింది. టీడీపీ కూటమి నేతల సిఫార్సు మేరకు సరఫరా జరుగుతుండటంతో సన్న, చిన్న కారు రైతులు అల్లాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సీసీ ఆర్సీ కార్డులున్న వారు సైతం యూరియా దొరక్క ప్రైవేటు వ్యాపారుల వద్ద నిలువు దోపిడికి గురవుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో నూటికి 70–80 శాతం మంది కౌలు రైతులే. వీరంతా రెండో విడతలో కూడా యూరియా దొరక్క యాతన అనుభవిస్తున్నారు. బాపట్ల జిల్లా ఆవులవారిపాలెంలో యూరియా కోసం రైతుల పడిగాపులు (ఫైల్) పక్కదారి పట్టిన యూరియా..వ్యవసాయ సీజన్లో 10 శాతానికి మించి పనులు సాగని జూన్, జూలైలోనే దాదాపు 35 శాతం యూరియా అమ్మకాలు జరగడం చూస్తే అదంతా నల్ల బజారుకు చేరిపోయిందని అర్ధమౌతుంది. డిమాండ్ సాకుగా చేసుకుని టీడీపీనేతలు యూరియాను అధికధరలకు అమ్ముకున్నారు. వరి పొలాలకు యూరియా ఇవ్వాల్సిన తరుణంలో సర్కారు చేతులెత్తేసింది. పెద్ద ఎత్తున నిల్వలు పక్కదారి పట్టినా కళ్లప్పగించి చూసింది. దీంతో కట్ట యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా సరఫరాలో అలసత్వాన్ని ఎండగడుతూ రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టే వరకు చంద్రబాబు సర్కారు మేలుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదునుకు యూరియా దొరక్క రైతులు ఖరీదైన కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా కట్ట రూ.266.50 కాగా సొసైటీల్లోనే రూ. 25 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500 వరకు గుంజుతున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బస్తా రూ.600–700 వరకు పిండుతున్నట్లు రైతులు చెబుతున్నారు. బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అవసరం లేని పురుగు మందులను అంటగడుతుండడంతో ఎకరాకు రూ.5 వేలకు పైగా అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో సొసైటీలను పరిశీలించగా చాలా చోట్ల యూరియా నిల్వలే లేవు. డిమాండ్‌కు సరిపడా లేక రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి.అదునుకు అందకపోతే..శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాతో పాటు ఉత్తర కోస్తాలో ఎకరాకు 75–80 కేజీలు యూరియా అవసరం. గిరిజన ప్రాంతాల్లో 55–69 కిలోలు వినియోగించాలి. వర్షాధార ప్రాంతాల్లో మూడు విడతల్లో 100–125 కేజీలు, నీటిపారుదల ప్రాంతాల్లో నాలుగు విడతల్లో 80–90 కిలోల చొప్పున పంటలకు యూరియా వేస్తారు. వర్షాధార ప్రాంతాల్లో విత్తే సమయంలో తొలి విడతగా, 30–35 రోజుల మధ్య రెండో విడత, మిగిలింది 50–55 రోజుల మధ్య వేస్తారు. నీటిపారుదల ప్రాంతాల్లో నాట్లు వేసిన 7–10 రోజుల్లో తొలి విడత, 25–30 రోజుల్లో 2వ విడత, 45–50 రోజుల మధ్య మూడో విడత, చివరగా 60–65 రోజుల మధ్య నాలుగో విడత యూరియా అవసరం ఉంటుంది. తొలిదశలో యూరియాతో పాటు డీఏపీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. రెండో విడతలో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువు 20–25 కేజీలు వేస్తారు. చివరి రెండు దశల్లో యూరియా ఎక్కువగా అవసరం ఉంటుంది. మూడో దశకు యూరియా అందకపోతే పంట ఏపుగా ఎదగదు. దుబ్బులో పిలకలు తగ్గిపోతాయి. చివరి దశలో యూరియా అదునుకు ఇవ్వకుంటే కంకి సైజు తగ్గిపోవడం, గింజ బరువు తగ్గిపోవడం జరుగుతుంది. 3, 4వ దశల్లో నత్రజని అందకపోతే దిగుబడి గణనీయంగా 5–10 బస్తాల వరకు తగ్గిపోతుంది.రెండో దశలోనూ కటకట..ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంది. కృష్ణా డెల్టా పరిధిలో ఎకరాకు దాదాపు రెండు బస్తాల యూరియా వాడతారు. రెండో విడతలోనూ మెజార్టీ రైతులకు యూరియా అందకపోవడంతో చేసేది లేక కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో 46 శాతం నత్రజని ఉంటుంది. అదే కాంప్లెక్స్ ఎరువు (20ః20)లో 20 శాతం మాత్రమే నత్రజని, 20 శాతం ఫాస్పేట్ ఉంటాయి. తీవ్ర కొరత కారణంగా రెండు మూడు విడతల్లో 20 కేజీల చొప్పున వేయాల్సిన యూరియాకు బదులుగా 20ః20 కాంప్లెక్స్ ఎరువులను వినియోగించారు. యూరియాలో ఉండే నత్రజని కోసం దాదాపు 60 కేజీల కాంప్లెక్స్ ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 20 కేజీల యూరియాకు రూ.135 ఖర్చవుతుండగా, 60 కేజీల కాంప్లెక్స్ కోసం దాదాపు రూ.1,600 వరకు వెచ్చించాల్సిన అగత్యం తలెత్తింది. ఈ లెక్కన 2–3 విడతల్లో 45 కేజీల యూరియా బస్తాకు కేవలం రూ.266.50 ఖర్చు చేస్తే సరిపోయేది. కానీ కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల దాదాపు రూ.3,200 వ్యయం అయింది. అంటే ఐదారు రెట్లు అదనంగా రైతుల నెత్తిన భారం పడింది. అయినప్పటికీ పంట ఎదుగుదల కానరాక ఈసారి దిగుబడులు తగ్గిపోతాయన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. కనీసం ఎకరాకు 5 బస్తాలకు పైగా దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరియా కోసం తోపులాట..తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి పీఏసీఎస్ పరిధిలో యూరియా పంపిణీ గందరగోళంగా మారింది. యూరియా వచ్చినట్లు తెలియడంతో చౌటపల్లి, గానుగపాడు, జీకొత్తూరు, తదితర గ్రామాల రైతులు ఆదివారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్దకు పోటెత్తారు. పోలీసులు తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకోగా మూడు గంటల పాటు రైతులు పడిగాపులు కాశారు. క్యూలైన్లు ఏర్పాటు చేసేలోపే పీఏసీఎస్ సిబ్బంది టోకెన్ల పంపిణీ ప్రారంభించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. వారిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. పోలీసులు, సహకార సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారికి సిఫారసు చేశారు.శ్రీకాకుళం జిల్లా మజ్జిలిపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) పలుకుబడి ఉన్న వాళ్లకే ఇస్తున్నారునాకు సొంతంగా అరకెరం భూమి ఉంది. కౌలుకు ఏడెకరాలు తీసుకొని ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసా. యూరియా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందిపడ్డాను. యూరియా దొరక్క కాంప్లెక్స్ వాడుతున్నాం. సొసైటీలో ఎకరాకు అరకట్టకు మించి ఇవ్వడం లేదు. ఇది ఏ మూలకు సరిపోతుంది. ఊర్లో పలుకుబడి ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తున్నారు. మాలాంటి బక్క రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు..బహిరంగ మార్కెట్లో యూరియా దొరకడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. అదును యూరియా కూడా అందించడం ఈ ప్రభుత్వం చేతకావడం లేదు. – తెన్నేటి శ్రీనివాసనాయక్, తెన్నేరు, కృష్ణా జిల్లాఅరకట్ట ఏ మూలకు సరిపోతుందిఆరుకట్టలు. పురుషోత్తపట్నం నుంచి మంతెన తీసుకెళ్తున్నారు.ఎకరాకు అరకట్ట ఇచ్చారు. చాలడం లేదు. 33 ఎకరాల సొంత భూమి భూమి ఉంది. ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేస్తే..ఆరు కట్టలు ఇచ్చారు. మూడు విడతల్లో కట్ట వెయ్యాలి. కానీ అరకట్టే ఇస్తున్నారు. అమ్మోనియా వేస్తునాం.– కిరణ్..పురుషోత్తçపట్నం, కృష్ణా జిల్లాఅందరికీ సరిపెట్టాలంటున్నారు20 ఎకరాలు..10 కట్టలు ఇచ్చారు. ఒక కోటా వేసాం. అధిక వర్షాలకు పంట మునిగిపోయింది. పంట పోయింది. మళ్లీ నాట్లు వేసాం. రెండో విడతలో యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నాం. ఎకరాకు అరకట్ట ఇస్తున్నారు,. చాలా ఇబ్బంది ఉంది. అడిగితే అందరికి సరిపెట్టాలి కదా అంటున్నారు.2వేలకు పైగా అదనంగా ఖర్చు 15 ఎకరాల్లో వరి వేశా. 11 కట్టలిచ్చారు. పైగా సొసైటీలోనే కట్ట రూ.270 తీసుకుంటున్నారు. రెండో విడత యూరియా దొరక్క 20ః20 వేసాం. బస్తాకు రూ.1350 చొప్పున రెండు బస్తాలు వేయాల్సి వచ్చింది. దాదాపు 2వేలకుపైగా అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.– పిన్నబోయిన కొండలరావు, కృష్ణా జిల్లారైతులకు బాబు ఎగ్గొట్టిన బకాయిలిలా..⇒ కేంద్రంతో నిమిత్తం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. దీన్ని తుంగలో తొక్కి 53.58 లక్షల మందికి రూ.20 వేల చొప్పున రూ.10,716 కోట్లు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.5 వేల చొప్పున రూ.2342.92 కోట్లతో సరిపెట్టారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే దాదాపు 7 లక్షల మందికి కోతపెట్టారు.⇒ ఎన్నడూ లేని విధంగా గడిచిన 15 నెలల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయి 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఏ ఒక్కరికీ పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.⇒ ఎన్నికల కోడ్ కారణంగా ఉచిత పంటల బీమా పథకం కింద 2023–24 సీజన్‌కు సంబంధించి రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు కంపెనీలకు చెల్లించలేదు. ఫలితంగా ఆ సీజన్లో కరువు, వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 11 లక్షల మంది రైతులకు రూ.1385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు.⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్–2024–25 ఉచిత పంటల బీమా పథకం కింద రైతుల తరపున చెల్లించాల్సిన రూ.833.92 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు.⇒ రబీ–2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిన అమలు చేసిన ఫసల్ బీమా కోసం ప్రభుత్వం తరపున చెల్లించాల్సిన రూ.88.09 కోట్లు ఇప్పటి వరకు కంపెనీలకు జమ చేయలేదు. ఈ కారణంగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా బీమా పరిహారం నేటికీ రైతులకు అందని పరిస్థితి నెలకొంది.⇒ 2023–24 సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్‌తో పాటు వివిధ సాంకేతిక కారణాలతో 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు ఎగ్గొట్టారు.⇒ సున్నా వడ్డీ రాయితీ కింద ఖరీఫ్–2023 సీజన్‌కు సంబంధించి 2024 సీజన్లో 6.31లక్షల మందికి జమ చేయాల్సిన రూ.132 కోట్లు నేటికీ జమ చేయలేదు.⇒ 2024–25 సీజన్లో వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి 4.50 లక్షల మందికి చెల్లించాల్సిన మరో రూ.650 కోట్లు ఇప్పటికీ జమ చేయలేదు. ఈ విధంగా దాదాపు రూ.23,584 కోట్లు కూటమి సర్కారు రైతులకు ఎగ్గొట్టింది.మద్దతు ధర కరువు..సీజన్ ఆరంభంలోనే ధరల పతనం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నెల్లూరులో మాసూళ్లకు వచ్చిన సన్నరకాలకే మద్దతు ధర కరువైంది. మద్దతు ధర ప్రకారం పుట్టికి (850 కేజీలు) రూ.19,720 దక్కాల్సి ఉండగా రూ.14వేల నుంచి రూ.15 వేలు మాత్రమే పలుకుతోంది. అదీ కూడా కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏ పంటకూ కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరలు పతనం కాకుండా అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది. ఉల్లి కిలో 50 పైసలకు పడిపోయింది. జీ–9 రకం అరటి టన్ను రూ.4–6 వేలకు పడిపోగా చీని (బత్తాయి) ధర టన్ను రూ.6–12వేలకు పతనమైంది. ఉల్లి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటా రూ.1,200 చొప్పున తమ వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలని రైతులు కోరుతుంటే వారిని మభ్యపుచ్చేందుకు హెక్టార్‌కు రూ.50 వేల సాయం అంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. తొలి ఏడాది పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి రెండో విడతలో 7 లక్షల మందికి కోతపెట్టింది. ఉచిత పంటల బీమాను అటకెక్కించి బీమా ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపింది. ఏడాదిగా కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం ఎగ్గొట్టడంతో రైతులకు దక్కాల్సిన రూ.2 వేల కోట్లకుపైగా పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. కరువు బారిన పడి నష్టపోయిన రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. సున్నా వడ్డీ రాయితీకి చాప చుట్టేసింది.గత ప్రభుత్వం ఆదుకుంది ఇలా..వైఎస్సార్సీపీ హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906 కోట్ల విలువైన 3.60 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించి అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాదు.. ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి కనీస మద్దతు ధరలు దక్కేలా చర్యలు తీసుకుంది. సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు గ్రామస్థాయిలోనే పంటల ధరలను పర్యవేక్షించింది. టమాటా, ఉల్లి, బత్తాయి, పొగాకు, పత్తి తదితర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఇలా ఐదేళ్లలో రికార్డు స్థాయిలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి అండగా నిలిచింది. -
కూపన్ల కోసం రైతుల పోటాపోటీ
కారేపల్లి/అడవిదేవులపల్లి: ఒక్క బస్తా యూరియా దక్కించుకునేలా కూపన్ కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 890 బస్తాల యూరియా రాగా, శుక్రవారం కూపన్లు జారీ చేస్తున్నారనే సమాచారంతో మహిళలు సహా పెద్దసంఖ్యలో రైతులు వచ్చారు. కారేపల్లి ఎస్సై బి.గోపి, ఏఓ భట్టు అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో రైతులను నియంత్రించేందుకు శ్రమ పడాల్సి వచి్చంది. రైతుల ఉరుకులు పరుగులు, తోపులాటలో ఒకరిపై ఒకరు పడగా, కొందరు వాహనాలపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.తొక్కిసలాటలో ఏఓ అశోక్‌కుమార్ కూడా సొమ్మసిల్లడంతో కారేపల్లి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చివరకు కూపన్లను జిన్నింగ్ మిల్లులో ఇస్తామని చెప్పడంతో రైతులు అక్కడికి పరుగులు తీశారు. అక్కడికీ వేలాదిగా చేరడంతో అదే పరిస్థితి ఎదురైంది. కొందరు రైతులు కూపన్ల కోసం ఎగబడటంతో హోంగార్డు శంకర్ ఉక్కిరిబిక్కిరై కారేపల్లి పోలీసుస్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నాడు. ఈక్రమంలో 2,152 కూపన్లను రైతులకు అందజేయగా, మరో 1,600 మంది ఆందోళనకు దిగడంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అక్కడికి చేరుకుని నచ్చచెప్పారు. ఆపై అందరి పేర్లు నమోదు చేసుకుని 1,600 మంది రైతులకు ఇళ్ల వద్దే శనివారం నుంచి కూపన్లు ఇస్తామని చెప్పడంతో నిరాశగా వెనుదిరిగారు. 11న తోపులాటలో గాయపడ్డ మహిళ మృతినల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం జరిగిన తోపులాటలో గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. గోన్యాతండాకు చెందిన పాతులోతు దసి (52) ఈనెల 11న రైతు వేదిక వద్దకు యూరియా కోసం వచ్చి క్యూలో నిలబడింది. ఈ సందర్భంగా రైతుల మధ్య జరిగిన తోపులాటలో క్యూలో ఉన్న దసి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు ఆమెను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎరువు కోసం రైతన్న ఏకరువు!
రైతన్న దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నాడని ఎంత చెప్పుకుంటున్నా వ్యవసాయానికి సంబంధించి తనకు మౌలిక సదుపాయాల భరోసా ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్నలొస్తున్నాయి. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం అన్నదాత పడిగాపులు అంతాఇంతా కావు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా అని చెప్పుకుంటున్న కుప్పంలోనూ ఎరువు కోసం కర్షకులు ఏకరువు పెడుతున్న దుస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితులు లేవు. అయితే అప్పటి రైతన్న కష్టాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పోకడలు కారణమవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.ఎంత అవసరమో ముందే తెలిసినా..యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను పెంచడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ప్రతి ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాలి లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.అడపాదడపా నిధులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. బడ్జెట్లో వ్యవసాయానికి అడపాదడపా కేటాయించిన మొత్తం నిధుల నుంచి ఇలాంటి ప్రాజెక్ట్‌లకు ఖర్చు చేయడం సవాలుగా కూడుకుంటోంది.సబ్సిడీ భారంనిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం. ఇంకొన్ని కంపెనీలు డీఏపీ, పొటాష్..వంటి ఇతర కృత్రిమ ఎరువుల తయారీకి యూరియాను దారి మళ్లిస్తున్నాయి. ఆయా ఎరువులపై మార్జిన్లు అధికం ఉండడం, వాటికి మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుండడంతో ఈమేరకు అక్రమాలకు పాల్పడుతున్నాయి.ప్రాజెక్ట్‌ల తాత్సారంకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.అంతర్జాతీయ మార్కెట్లు..స్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి. అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.లాభదాయకంగా చేయవచ్చు.. కానీ..యూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇప్పుడేం చేయాలంటే..ప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
యూరియా కోసం రేయింబవళ్లూ పడిగాపులు
సంతకవిటి: ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. ఆర్ఎస్కేలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ కడుతూనే ఉన్నారు. నిద్రకూడా మానుకుని రాత్రుళ్లూ షాపుల వద్దే పడిగాపులు పడుతున్నారు. వేకువనే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. యూరియా కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదంటూ ఆవేదన చెందుతున్నారు. విజయనగరం జిల్లా సంతకవిటిలో ఓ ప్రైవేటు దుకాణం వద్ద బుధవారం రాత్రి 9 గంటల వరకు యూరియా కోసం క్యూకట్టిన రైతులు సరుకు అందకపోవడంతో నిరాశచెందారు. గురువారం మళ్లీ పంపిణీ చేస్తామని దుకాణం యజమాని చెప్పడంతో రాత్రంతా రైతులు అక్కడే ఉండిపోయారు. దోమలతో జాగారం చేశారు. గురువారం వేకువనే ఇలా బారులుతీరారు. భారీగా బారులు తీరిన రైతులను చూసి యజమాని దుకాణం తెరిచేందుకు భయపడ్డారు. ఏఓ సి.బి.యశ్వంతరావు, పోలీసుల సమక్షంలో దుకాణం తెరిచి యూరియా పంపిణీ ప్రారంభించారు. ఆధార్‌కార్డు, వన్–బి తెచ్చిన వారికే యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. రాత్రి నుంచి దోమల్లో కాపలా ఉంటే ఇప్పుడు నిబంధనలు పెట్టడంపై వాగ్వాదానికి దిగారు. టోకెన్లు ఉన్న రైతులకు 444 బస్తాలు పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వ్యవసాయం మానేయాలా బాబూ..నేను దివ్యాంగుడిని. క్యూలైన్లో నిల్చోగలనా? నేను వ్యవసాయం మానేయాలా బాబూ.. నేనేమి చేయాలి చెప్పండి. గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాలకే యూరియా వచ్చేది. ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కనీసం ఒక బస్తా యూరియా కూడా అందలేదు. – గడే సీతారాం, దివ్యాంగుడు, రైతు, ముకుందపురం -
కొందరు రైతులనైనా జైలుకు పంపండి
సాక్షి, న్యూఢిల్లీ: పంట వ్యర్థాలను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారణమవుతున్న రైతులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. కొందరు రైతులను కటకటాల వెనక్కి నెడితేనే ఇతర రైతుల్లో భయం ఉంటుందని, వ్యర్థాలను తగలబెట్టే రైతులకు గట్టి సందేశం ఇచ్చిన వాళ్లమవుతామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్తాన్, పంజాబ్‌లలో రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం పై విధంగా స్పందించింది. ‘రైతులు నిజంగా ప్రత్యేకమైనవాళ్లే. వాళ్ల కారణంగానే మనం ఆహారం తినగల్గుతున్నాం. అంతమాత్రాన మనం పర్యావరణాన్ని కాపాడకుండా మౌనంగా కూర్చోలేం కదా. పంట వ్యర్థాలను తగలబెడుతున్న రైతులను శిక్షించే సెక్షన్లు ఉన్నాయి కదా? వాయుకాలుష్యంతో పర్యావరణానికి హాని తలపెడుతున్న కొందరు రైతులను అరెస్ట్చేస్తేనే మిగతా వాళ్లకు గట్టి సందేశం వెళుతుంది. తప్పు చేసిన రైతులను శిక్షించేందుకు చట్టంలో నిబంధనలు ఉన్నాయని మీకు తెలియదా? పర్యావ రణాన్ని కాపాడాలనే సత్సంకల్పం మీకు ఉంటే రైతులను అరెస్ట్‌చేయడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని న్యాయస్థానం నిలదీసింది. ‘‘పంట వ్యర్థ్యాలను జీవఇంధనంగా ఉపయోగంచవచ్చన్న వార్తలను మేం కూడా వార్తాపత్రికల్లో చదివాం. ఇలా సద్వినియోగం చేసుకోండి అని మేం పదేపదే చెప్పలేం’’ అని సీజేఐ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ‘సీఏక్యూఎం, సీపీసీబీల్లో పోస్ట్‌లను మూడు నెలల్లోపు భర్తీచేయండి. పదోన్నతి పోస్ట్‌లను ఆరు నెలల్లోపు భర్తీచేయండి’ అని కోర్టు ఆదేశించింది. రైతులు కథలు చెబుతున్నారుఈ కేసులో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకురాలు)గా అపరంజిత హాజరయ్యారు. గతేడాదితో పోల్చితే పంట వ్యర్థాల దహనం తగ్గుముఖం పట్టిందని మెహ్రా న్యాయస్థానానికి తెలిపారు. ఈ ఏడాది వ్యర్థాల దహనాలను మరింతగా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ వాదనలతో అమికస్ క్యూరీ అపరంజిత విభేదించారు. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండటానికి ప్రభుత్వం రైతులకు నగదు ప్రోత్సాహకాలు, ఇతర పరికరాలు అందిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు లేదని ఆమె న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఉపగ్రహాలు తమ పంటపొలాల మీదుగా వెళ్లిన సమయాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులే తమకు ఉప్పందించారని రైతులు అవే కథలు మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె కోర్టుకు వివరించారు. పంట వ్యర్థాల దహనంపై 2018లోనే సుప్రీంకోర్టు విస్తృతమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలో కోర్టు ముందు నిలిచాయని వ్యాఖ్యానించారు.లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం‘పర్యావరణానికి నష్టం కలిగించే రైతులపై చర్యలు తీసుకోవాలి. ఒక వేళ కఠిన చర్యలు తీసుకోవడానికి మీకు మనసురాకపోతే ఆ విషయాన్ని అయినా లిఖితపూర్వకంగా మాకు తెలపండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. లేకుంటే మేమే తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ముందుగా అరెస్టులు, చర్యలు తీసుకున్నాం. కానీ వీరిలో హెక్టార్ సాగుభూమి ఉన్న రైతులే ఎక్కువ. వీళ్లను జైల్లో పెడితే, వీళ్లపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? గడిచిన సంవత్సరాల్లో పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన ఘటనలు 77,000 జరిగితే అవి ఏకంగా 10,000 స్థాయికి దిగొచ్చాయి’ అని రాహుల్ మెహ్రా కోర్టుకు నివేదించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ‘ఎప్పట్లాగా రోటీన్‌గా రైతులకు సూచనలు చేయడం మానేసి ఈసారి అరెస్టులు, జైలుకు పంపడానికి కూడా మేం వెనకాడము అనే గట్టి సందేశాన్ని ఇవ్వండి. వచ్చే పంటకాలంలోపు పొలాల్లో వ్యర్థాలు పర్యావరణహితంగా తొలగించాలి’ అని ఆయా రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. -
ముద్దబంతి తోటలో మూగ రోదన!
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ధర లేక ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంది. అరటి, చినీ, టమాటా ధరలు కర్షకుల ఆశలు విరిచేస్తున్నాయి. తాజాగా బంతి పూల ధరలూ పతనం కావడం రైతులను మరింతగా కుంగదీస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక అప్పుల ఉబిలో కూరుకకుపోయి సీమ రైతులు గగ్గోలు పెడుతున్నారు. పూల ఉత్పత్తి అంతా.. సీమ నుంచే.. రాష్ట్రంలో అన్ని పూలు కలిపి ఉత్పత్తి 10.88 లక్షల టన్నులు కాగా, ఒక్క రాయలసీమలోనే 7 లక్షల టన్నుల (64.39శాతం)కు పైగా ఉత్పత్తి అవుతుంది. బంతిపూల ఉత్పత్తిలోనూ రాయలసీమదే అగ్రస్థానం. ఏటా 1.12 లక్షల టన్నుల బంతిపూలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా, ఒక్క రాయలసీమ జిల్లాల్లోనే 77 వేల టన్నులు ఉత్పత్తి అవుతాయి. బంతిపూల సాగు, ఉత్పత్తిలో టాప్–10 జిల్లాల్లో 8 జిల్లాలు రాయలసీమలోనే ఉన్నాయి. సాగులో వైఎస్సార్ కడప జిల్లా మొదటి స్థానంలో ఉండగా, ఉత్పత్తి పరంగా చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంటుంది. ఎకరాకు రూ.లక్షా 25వేలు పెట్టుబడి సాధారణంగా ఎకరాకు రూ.16–18 వేల వరకూ బంతి మొక్కలు నాటతారు.. ఒక్కొక్క మొక్క ధర రూ.2–2.5కు తక్కువ ఉండదు. ఎకరాకు కేవలం మొక్కలకే రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఇక కోయడానికి కిలోకు రూ.6–7 చొప్పున ఖర్చు చేస్తారు. ఇతర ఖర్చులన్నీ కలుపుకుంటే ఎకరాకు పెట్టుబడి రూ.లక్షా 25వేల వరకు అవుతుందని కర్షకులు చెబుతున్నారు. సాధారణంగా దిగుబడి ఎకరాకు ఐదు టన్నుల వరకు వస్తుంది. అయితే ఈ ఏడాది వర్షాల వల్ల దిగుబడి మూడు టన్నులే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దసరా ఆరంభ సీజన్లోనూ ధర లేక సాధారణంగా పండగ సీజన్లో బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దసరా పండగ సీజన్లో అయితే నవరాత్రుల తొమ్మిది రోజులూ ఆలయాల్లో అమ్మవారిని అలంకరించేందుకు బంతిపూలను ఎక్కువగా వాడతారు. దీంతో దసరా సీజన్ ప్రారంభమవుతుందంటే ఏటా బంతిపూలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. రైతులు కూడా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పండగ సీజన్‌కు దిగుబడి వచ్చేలా సాగు చేస్తారు. ఈ సీజన్లోనే మంచి ధర పలుకుతుందని, నాలుగు డబ్బులు వెనకేసువచ్చని ఆశతో ఉంటారు. అలాంటిది ఈ ఏడాది దసరా సీజన్ ప్రారంభమయ్యే తరుణంలో బంతి పూల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. కిలో రూ.10–12కు మించి కొనే పరిస్థితి లేకుండా పోయింది. వినాయకచవితి పండగ రోజుల్లో రెండు రోజులు మాత్రమే కిలో రూ.50–60 ధర లభించగా, ఆ తర్వాత ధరలు పతనమవుతూ వచ్చాయి. కనీసం కిలోకు రూ.35–40 వస్తే కానీ రైతులకు పెట్టుబడులు దక్కవు. ప్రస్తుత ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ధర వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బంతిపూల ధరలు రికార్డుస్థాయిలో పలికాయి. కిలో రూ.80–120 మధ్య ధర లభించింది. 2019–24 మధ్యలో ఒక్క బంతిపూలే కాదు. రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పూలకు ఏటా గిట్టుబాటు ధరలు లభించడంతో రైతులు మంచి లాభాలనే ఆర్జించారు. సంక్షోభంలో సీమ రైతులు కూటమి ప్రభుత్వం వచి్చనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పండ్లు, కూరగాయలతోపాటు పూల ధరల పతనంతో సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఉల్లి, అరటి, చినీ, టమాటా ధరలు పతనమైపోయాయి. తాజాగా ఈ బాటలో బంతిపూల రైతులు చేరారు.వరుసగా ధరల పతనంతో సీమలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో 19శాతం చిత్తూరు 24శాతం, వైఎస్సార్ కడప 35శాతం, సత్య సాయి జిల్లాలో 42శాతం నామమాత్రపు విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగయ్యాయి. ఇక్కడ ఎక్కువగా సాగయ్యే వేరుశనగ పూర్తిగా తగ్గిపోయింది. సాగు జరిగిన చోట కూడా వేరుశనగ, మినుము పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
పట్టువిడుపులుంటేనే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: సాదా బైనామా.. తెలంగాణ రైతాంగం పరిష్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న భూ సమస్య. దాదాపు 9.84 లక్షల దర ఖాస్తులకు సంబంధించిన 11 లక్షలకు పైగా ఎకరాలకు యాజమాన్య హక్కులు ఇచ్చే ప్రక్రియ. దీని అమలు కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోయినా, ఈ క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న, వ్యవహరించాల్సిన తీరుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. చట్టం, నిబంధనల పేరుతో రైతులపై కఠినంగా కాకుండా అందరి ఆమోదం మేరకు ఉదారంగా వెళ్లడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు. తొలుత మూడు.. ఆ తర్వాత మరిన్ని గతంలో ఉన్న ధరణి చట్టం స్థానంలో భూభారతి చట్టం తెచ్చినప్పుడు సాదా బైనామాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త అంశాలను చేర్చింది. సమస్య పరిష్కారానికి 2020లో ప్రభుత్వానికి దర ఖాస్తు చేసుకుని ఉండాలని, 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉండాలని, సమస్య పరిష్కారమయ్యేటప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కట్టాలని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత చట్టానికి నిబంధనలు తయారు చేసేటప్పుడు అదనంగా మరికొన్ని నిబంధనలు పెట్టారు. సాదా బైనామా పరిష్కరించి 13 బీ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత ప్రభుత్వానికి చెల్లించాలని, సాదా బైనామాపై విచారణ సందర్భంగా కొన్న వ్యక్తితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధనలు విధించారు. ఈ అఫిడవిట్‌తోనే తంటా.. రాష్ట్ర ప్రభుత్వం సాదా బైనామాలను పరిష్కరించే క్రమంలో చట్టంలోని నిబంధనల మేరకు వెళ్తే సన్న, చిన్నకారు రైతాంగానికి చాలా ఇబ్బందులు వస్తాయని భూచట్టాల నిపుణులు చెపుతున్నారు. గత ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుని పరిష్కరించకుండా వెళ్లిపోతే, ఈ ప్రభుత్వం సదరు దరఖాస్తులను పరిష్కరించకపోగా, రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని, కోర్టుల పాలు చేసిందనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి 2007 కంటే ముందు సాదా బైనామాలను పరిష్కరించే సమయంలో అమ్మిన వ్యక్తి సమ్మతి తప్పనిసరి అనే నిబంధన ఉండేది. కానీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఆ నిబంధనను తీసేశారు. ఎప్పుడో అమ్మిన వ్యక్తి ఇప్పుడు అంగీకరించేందుకు ఇష్టపడక పోవచ్చు కాబట్టి చుట్టుపక్కల రైతులను విచారణ చేసి, లేదంటే గ్రామ పెద్దల స్టేట్మెంట్ ఆధారంగా కూడా క్రమబద్ధీకరించేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికి తోడు పహాణీలోని సాగుదారు కాలమ్‌లో ఉన్న కొన్న వ్యక్తి పేరును ఆధారంగా పరిగణనలోకి తీసుకునేవారు. 2009–16 వరకు ఇదే పద్ధతిలో సాదా బైనామాలు క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్న వారితో పాటు అమ్మిన వ్యక్తి కూడా అఫిడవిట్ ఇవ్వాలంటే సమస్యను సృష్టించడమేనంటూ, ఆ నిబంధనను తొలగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రైతుల నుంచి రాతపూర్వక అభ్యంతరాలు తీసుకోవడంతో పాటు చుట్టు పక్కల రైతులను విచారించాలనేది నిబంధనగా చేర్చాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ దరఖాస్తుల సంగతేంటి? సాదా బైనామాల పరిష్కారానికి 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 9.84 లక్షల దరఖాస్తులు రాగా కొన్నింటిని అప్పట్లోనే పరిష్కరించినట్టు తెలుస్తోంది. అప్పట్లో వచ్చిన ధరణి చట్టంలో సాదా బైనామాల పరిష్కార అంశం లేనప్పటికీ ఆన్లైన్లో వచ్చిన దాదాపు 4 లక్షల దరఖాస్తులపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారని, అందులో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించారని తెలుస్తోంది. అయితే కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల పరిష్కారం కోసం 2020లో దరఖాస్తు చేసి ఉండాలని మాత్రమే ఉంది కానీ, అప్పట్లో తిరస్కారానికి గురైతే మళ్లీ పరిశీలించకూడదని లేదు. ఈ చట్టం నిబంధనల్లోనూ దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం గురించిన ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయం మధ్యలో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాల్సిందేనని నిపుణులు చెపుతున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా చట్టం, నిబంధనలపైనే ఆధారపడకుంగా సమ్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపిస్తూ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. సాదా బైనామాలను ఉదారంగా పరిష్కరించకపోతే మరోమారు పరిష్కారానికి అవకాశం లేదు కాబట్టి రైతులు నష్టపోతారని, మళ్లీ సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని వారు చెపుతున్నారు. చెక్‌లిస్టు, ఎంక్వైరీ ఫార్మాట్, ప్రాసెస్ విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని అంటున్నారు. ఉదారంగా వెళ్లడమే మేలు సాదా బైనామా అనేది తెలంగాణలో పెద్ద భూసమస్య. 1989 నుంచి నలుగుతున్న సమస్య. అది కూడా చిన్న, సన్నకారు రైతులకు సంబంధించింది. కొన్న మాట వాస్తవమా?.. కాదా?, సాగులో ఉన్నారా?.. లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలింకుని మిగిలిన అంశాల్లో పట్టుదలకు పోకుండా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించాలి. అదే సమయంలో అవకతవకలు జరగకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలి. – భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు సాదాబైనామా క్లియరెన్స్ కోసం ఏముండాలంటే...! – భూమి రైతు ఆదీనంలో కొనసాగుతుండాలి – 12 సంవత్సరాలుగా సదరు వ్యక్తి అనుభవంలో ఉండాలి – కొనుగోలు చేసినట్టుగా పత్రం లేదా పహాణీలోని సాగుదారు కాలమ్‌లో పేరు ఉండాలి. సాదా బైనామా.. కథా కమామిషు తెలంగాణ రైతాంగానికి సుపరిచితమైన ఈ సాదా బైనామాల వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. నిజాం రాజ్యం నుంచి నిన్న మొన్నటి వరకు కూడా రాష్ట్ర రైతాంగం కేవలం తెల్ల కాగితాలపై రాసుకోవడంతో పాటు నోటి మాటలతో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు జరిపింది. వీటినే సాదా బైనామాలంటున్నారు. నిరక్షరాస్యతతో పాటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలంటే ప్రభుత్వానికి ఫీజు చెల్లించాల్సి వస్తుందనే కారణంతో కొందరు రైతులు ఈ ప్రక్రియ ద్వారా భూముల యాజమాన్య హక్కును మార్చుకునే వారు. కానీ కొన్ని వ్యక్తికి అధికారికంగా ఎలాంటి హక్కులు వచ్చేవి కావు. తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో తొలిసారిగా 1989లో సాదా బైనామాలను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. ఆ తర్వాత 1996, 97.. ఇలా ఇప్పటికి 13 సార్లు ఉచితంగా ఈ తరహా భూములను క్రమబద్ధీకరించారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016, 2017లో కూడా క్రమబద్ధీకరణ జరిగింది. చివరిసారిగా 2020లో ఆన్లైన్లో దరఖాస్తులు. ఇప్పుడు ఈ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియనే జరుగుతోంది. అయితే గతానికి భిన్నంగా ఈసారి ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలనే నిబంధన విధించారు. -
గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను దున్నేసిన రైతు
-
కనికరం లేదా చంద్రబాబు..?
-
రైతుల కష్టాలపై జగన్ ఎమోషనల్ ట్వీట్
-
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025 -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
ఆత్మకూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామానికి చెందిన శీనప్ప కుమారుడు హరిజన కుంటెన్న (37)కు భార్య ముత్యాలమ్మ, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమకున్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం శీనప్ప మృతి చెందాడు. అప్పటి నుంచి వ్యవసాయంతోపాటు ఇంటి బాధ్యతలు కుంటెన్నపై పడ్డాయి. ఇటీవల 3.8 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోగా, వాటిని తొలగించాడు. వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. సోమవారం భార్యాపిల్లలు ఆమె పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న కుంటెన్న మధ్యాహ్నం ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
మేం చెప్పిన వారికే ఇవ్వాలి
‘యూరియా మేం చెప్పిన వారికే ఇవ్వాలి. లేదా గతంలో చేసినట్టు మా ఇంటి దగ్గర టోకెన్లు రాసి రైతులకు ఇవ్వాలి. లేదంటే అమ్మకాలు ఆపేయాలి’ అంటూ శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లిలో ఓ టీడీపీ నాయకుడు అధికారులకు హుకుం జారీ చేశాడు. ఆదివారం బూరవిల్లి రైతు సేవా కేంద్రానికి 313 యూరియా బస్తాలు వచ్చాయి. ఇదే ఆర్ఎస్కే పరిధిలో అంబళ్లవలస గ్రామం ఉంది. ఆ రైతులకు సచివాలయం దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు టోకెన్లు మెయిన్‌రోడ్డులోని పాల కేంద్రం దగ్గర ఇస్తారనే సమాచారంతో రైతులంతా అక్కడకు చేరుకున్నారు.కొందరు రైతులకు టోకెన్లు ఇస్తుండగా, స్థానిక టీడీపీ నాయకుడు మళ్ల అబ్బాయినాయుడు అక్కడకు చేరుకొని ఇక్కడ యూరియా ఇవ్వడానికి వీల్లేదని, టీడీపీ కార్యకర్తలకే యూరియా ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగా రు. అధికారులు టోకెన్లు పంపిణీ నిలిపేశారు. ఎస్ఐ సీహెచ్ గంగరాజు టోకెన్లు ఇచ్చే పాలకేంద్రం వద్దకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయమై ఏఓ డి.పద్మావతిని వివరణ కోరగా యూరియా పంపిణీ మంగళవారం సచివాలయం వద్ద జరుగుతుందని చెప్పారు. -
యూరియా కోసం యాతన
సాక్షి, నెట్వర్క్: యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసేవా కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టంచుకోవడం లేదు. పైగా కూటమి నేతలు, వారి అనుయాయులకు యూరియా బస్తాలను అడ్డదారిలో అందిస్తోంది. ఫలితంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర ఘటనలు ప్రభుత్వ కఠినత్వానికి, తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ⇒ విజయనగరం జిల్లా గజపతినగరం మండలం లోగీశ గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు సోమవారం బారులు తీరారు. క్యూలో ఉన్నవారికి కాకుండా టీడీపీ అనుచరులకు అడ్డదారిలో యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఓ రైతు కిందపడిపోయాడు. దీంతో కర్షకులు ఆందోళన చేయడంతో అధికారులు యూరియా పంపిణీని నిలిపివేశారు. ⇒ శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం హెచ్ఎన్ పేట, వడ్డితాండ్ర సచివాలయ పరిధిలోని రైతులు యూరియా కోసం సోమవారం బారులు తీరారు. ఎండలోనే గంటల తరబడి క్యూలో నిరీక్షించారు. సగం మందికే యూరియా బస్తాలు అందాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళిలోనూ రైతులు యూరియా కోసం గ్రోమోర్ సెంటర్ వద్ద పడిగాపులు పడ్డారు. ⇒ చిత్తూరు జిల్లా బంగారుపాళెంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు పడ్డారు. బస్తాలు తీసుకునే క్రమంలో గందరగోళం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. ⇒ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక, తోటపల్లి రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా కోసం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో ఉంచి మండుటెండలో పడిగాపులు పడ్డారు. సాయంత్రం సమయంలో వర్షం పడటంతో తోటపల్లిలో వానలోనే తడిసిముద్దయ్యారు. ⇒ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సచివాలయం వద్ద రైతులు యూరి యా కోసం సోమవారం ఆందోళన చేశారు. కేవలం 40 బస్తాలు పంపిణీ చేసి ఆపేయడంతో మిగతా రైతులు సిబ్బందిని నిలదీశారు. ⇒ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిశింగిలో సోమవారం అరకొరగా యూరియా అందుబాటులోకి రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు. క్యూలైన్లో నిరీక్షించినా యూరియా దొరక్క రైతులు నిరాశతో వెనుదిరిగారు. ⇒ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలోని రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం తహసీల్దార్ కార్యాయలం వద్ద ధర్నా చేపట్టారు. టోకెన్ల జారీలోనూ అధికారులు చేతివాటం చూపుతున్నారని దుయ్యబట్టారు. విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారిణి గీతాకుమారి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. -
AP: ‘యూరియా’పై హ్యాండ్సప్!
కొరతలేదు.. న్యూసెన్స్ చేస్తే బొక్కలో పెట్టి పనిష్ చేస్తాఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడైనా ఎరువులు లేవంటే నేనే అక్కడకు వెళ్తా! కావాలని న్యూసెన్స్ చేస్తే తీసుకెళ్లి బొక్కలో పెట్టి పనిష్ చేస్తా.. మీరు రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు.. రైతులు రైతులుగా ప్రవర్తించండి! డ్రామాలు ఆడితే ఈ ప్రభుత్వమంటే ఏమిటో చూపిస్తాం.. – ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఔను.. యూరియా పంపిణీలో విఫలమయ్యాం.. రైతులకు యూరియా సరఫరాలో వైఫల్యం చెందాం.. ఇది మానవ తప్పిదమే. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూరియా వినియోగాన్ని తగ్గించాలి. భూసార పరీక్షలు నిర్వహించ లేదు.. రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదు.. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు.. ఇప్పుడు ఉల్లి, టమాటా ధరలు పడిపోయాయి.. ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలి. – కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: రైతులకు యూరియా సరఫరా చేయడంలో వైఫల్యం చెందామని, ఇది మానవ తప్పిదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని సీఎం అంగీకరించారు. శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో రైతుల పడిగాపులు ఏ రైతుకూ యూరియా కొరత రానివ్వకుండా చూసే బాధ్యత తాను తీసుకుంటానని, ఎక్కడైనా ఎరువులు లేవంటే తానే స్వయంగా అక్కడకు వెళ్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు తాజాగా యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని ఎట్టకేలకు కలెక్టర్ల సదస్సు సాక్షిగా ఒప్పుకోవడం గమనార్హం. సాగు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో వృద్ధి లక్ష్యాలపై ప్రజెంటేషన్ అనంతరం కలెక్టర్లు వివిధ సమస్యలను ప్రస్తావించిన సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.అల్లూరి సీతారామరాజు జిల్లా తోటపల్లిలో క్యూలైన్లో చెప్పులు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు..యూరియా సరఫరాలో వైఫల్యం మానవ తప్పిదమే అవుతుందని సీఎం పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడేవి కావని, కరెంట్ ఉండేది కాదని, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసుకుని పోయేదన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవని, అయితే రైతులకు యూరియా సరఫరా విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పారు. యూరియా సరఫరా విషయంలో ప్రణాళిక సరిగా అమలు చేయలేదన్నారు. ఈ విషయంలో వైఫల్యం చెందామన్నారు. ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటే సమస్యలు వచ్చేవి కావన్నారు. భూసార పరీక్షలు.. పోషకాల పంపిణీ లేదు ఈ ఏడాది భూసార పరీక్షలు నిర్వహించలేదని, రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక నుంచి ముందుగా భూసార పరీక్షలు చేసి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవ్వాలని సూచించారు. యూరియాను ఎక్కువగా వినియోగిస్తే కేన్సర్ జబ్బుల్లో తొలి ఐదు రాష్ట్రాల్లో ఉన్న ఏపీ మొదటి స్థానానికి వెళ్తుందని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పంజాబ్‌ను కేస్ స్టడీగా తీసుకోవాలన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. ఆ దిశగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం వినియోగిస్తున్న యూరియాలో ఒక బస్తా తగ్గించే రైతులకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తామన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గిస్తే పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ ఇస్తుందని, ఆ మొత్తాన్ని యూరియా వాడకం తగ్గించే రైతులకు ఇస్తామని చెప్పారు. త్వరలోనే విధి విధానాలను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఉల్లి, టమాటా రైతులు రోడ్డెక్కకుండా చూడాలి..రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. యూరప్ దేశాల్లో మన ఉత్పత్తులకు ధర తగ్గిస్తున్నారన్నారు. ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయన్నారు. ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, లేదంటే ఉత్పత్తులను కొనేవారు ఉండరన్నారు. డిమాండ్, సరఫరాకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్యపరచడంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. పొగాకు కొనుగోలు చేశామని, ఈ ఏడాది పంట హాలిడే ఇచ్చామన్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు పడిపోయాయని, ఈ సమయంలో రైతులు రోడ్డు మీద పడకుండా వారి ఇబ్బందులను తగ్గించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. కడప నుంచి రైతులు టమోటా తీసుకురావాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతుందని వదిలేస్తున్నారని, అలా కాకుండా రవాణా చార్జీలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. పట్టణ నియోజకవర్గాలను మినహాయించి మిగతా 157 చోట్ల పశువుల హాస్టళ్లను చేపట్టాలని సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటర్న్∙గిఫ్ట్ ఇస్తుందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో పశు సంపద పాత్ర కీలకమన్నారు. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేయాలని సూచించారు.రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ కట్సాగు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని నిలిపేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికి 30 శాతం మందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మిగతా వారు కూడా నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, లేదంటే యూనిట్ విద్యుత్ రూ.1.50 సరఫరాను నిలుపుదల చేస్తామన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా రైతుల్లో క్రమశిక్షణ అవసరమన్నారు. కాలుష్యం పెరిగి ఆక్వా ఉత్పత్తులు దెబ్బ తింటే కొనేవారు ఉండరని సీఎం పేర్కొన్నారు.కోనసీమ కంటే ‘అనంత’ తలసరి ఆదాయం అధికం..కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువగా ఉందని సీఎం చెప్పారు. ఇందుకు ఉద్యాన పంటలే కారణమన్నారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయిల్ పామ్ ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు. ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. ఫెయిల్.. పాస్ మంత్రులకూ వర్తిస్తుంది ఈ ఆర్థిక ఏడాది వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఎవరు ఫెయిల్? ఎవరు పాస్? అనేది డేటా ప్రకారం తేలుతుందని, ఇది కలెక్టర్లతోపాటు మంత్రులకూ వర్తిస్తుందని సీఎం స్పష్టంచేశారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఈ ఏడాది 17.11 శాతం వృద్ధి సాధించాలన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారి నుంచి మంత్రులు, కలెక్టర్లు గ్రామ కార్యదర్శి వరకు వృద్ధి సాధనలో పాత్ర పోషించాలన్నారు. విమానాశ్రయాలు, పోర్టులు, పర్యాటక ప్రాజెక్టుల వద్ద ఎకో సిస్టం రూపొందించాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాలు అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. -
sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!
రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి. సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మంథా జ్ఞాన ప్రకాశ్. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..క్లైమేట్ ఛేంజ్ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్‌లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ క్లైమేట్ ఛేంజ్ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోనే అది సరిగ్గా పనిచేయగలదు. పాలు, మాంసం వంట ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఛేంజ్ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్‌గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్ ఫర్మంటేషన్) వల్ల మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్‌కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పేడ నుంచి కూడా ఉద్గారాలు..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్‌ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్ మాడిఫికేషన్ అంటారు. అది రిస్క్‌తో కూడిన పని. అవసరం లేదు. జీన్ ఎడిటింగ్‌ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్ టాలరెంట్ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్ అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల్లో ఆర్గానిక్ బ్రీడ్స్ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్ సహజంగా ఎవాల్వ్ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్‌గా ఎవాల్వ్ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. ఆర్గానిక్ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిడ్యూస్, థెరప్యూటిక్ రెసిడ్యూస్ లేని ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్‌ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్ ఉంటుంది. పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. పరిష్కారం ఏమిటి?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబుఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
శ్రీకాకుళం జిల్లా బూరవెల్లి లో యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
-
మీ వల్లే యూరియా కొరత..’: చంద్రబాబు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మరోసారి తన మార్క్ కుట్రకు తెరతీశారు. ఈ కుట్రలో కలెక్టర్లను బలిచేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత అనే మాట వినిపించలేదు. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ, అదే అధికారులు ఉన్నా, రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారు. బ్లాక్ మార్కెట్ దందా పెరిగిపోవడంతో రైతులు నిస్సహాయంగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే విషయాన్ని అంగీకరించారు. అయితే చేతిలో ఉన్న సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. ఇవన్నీ మ్యాన్ మెడ్ సమస్యలే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలో.. యూరియా సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయలేకపోయాం అgటూ యూరియ కొరత అంశాన్ని చంద్రబాబు కలెక్టర్లపై తోసేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో సమావేశంలో పాల్గొన్న కలెక్టరు సైతం కంగుతిన్నారు. క్రెడిట్లు కొట్టేయడంలో ఆరితేరిన చంద్రబాబు.. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మాత్రం అవతలి వాళ్లపై నెట్టేయడంలో సిద్ధహస్తుడనే విషయం మరోసారి రుజువైందని విశ్లేషకులు అంటున్నారు. -
సీమ రైతు..కంట కన్నీరు
-
యూరియా కోసం అవస్థలు.. అధికారులపై తిరగబడ్డ రైతులు
-
గజపతినగరంలో ఉద్రిక్తత.. యూరియా కోసం రైతుల కొట్లాట
విజయనగరం: గజపతినగరం పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతుల ఆందోళనకు దిగారు. యూరియా కొరత కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో రైతుల కొట్లాటకు దిగారు. కుర్చీలు విరిగేలా టీడీపీ నేతలు, రైతులు కొట్టుకున్నారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.. లాఠీఛార్జ్ చేశారు. దీంతో పోలీసులపై రైతులు తిరగబడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు పడనిరాని పాట్లు పడుతున్నారు.అనకాపల్లి: హోం మంత్రి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో యూరియా కోసం రైతుల పాట్లు పడుతున్నారు. ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. యూరియా ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా సక్రమంగా పంపిణీ చేయలేదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు సరిపడా యూరియా అందించాలంటూ వ్యవసాయ శాఖ అధికారిని రైతులు డిమాండ్ చేశారు.కాగా, కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత బొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. -
కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి
-
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఠాణాలో టోకెన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా పంపిణీ పోలీసుల చేతుల్లోకి వెళ్తోంది. పంటల అదును దాటిపోతోందన్న బాధతో రైతు వేదికల ముందు యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు.. ఎలాగైనా యూరియా దక్కించుకోవాలన్న ఆశతో పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో చాలాచోట్ల రైతులను అదుపు చేసేందుకు సాయుధ పోలీసులను మోహరిస్తున్నారు. వ్యవసాయ సహకార సొసైటీలకు వస్తున్న యూరియా తక్కువగా ఉండటం, రైతులు అధిక సంఖ్యలో లైన్లలో వేచిచూస్తుండటంతో అధికారులు టోకెన్ల పంపిణీకి జంకుతున్నారు. ఆ బాధ్యతను కూడా పోలీసులకే అప్పగిస్తున్నారు. తరుముతున్న కాలం.. రాష్ట్రంలో వానాకాలం వరి పంట చాలా జిల్లాల్లో పొట్టదశకు వచ్చింది. గింజ గట్టి పడేందుకు, మొక్కకు బలాన్నిచ్చేందుకు ఇప్పుడు యూరియా వాడకం అత్యవసరం. అదును తప్పితే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. దీంతో రైతులు సొసైటీ ఆఫీసులు, యూరియా దుకాణాల ముందు రాత్రి పగలు పడిగాపులు పడుతున్నారు. రాష్ట్రంలోని 500 రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ జరుపుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. దీంతో ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల ప్రజలంతా ఉదయాన్నే రైతు వేదికల వద్దకు వచ్చి లైన్లల్లో నిలబడుతున్న దృశ్యాలు దాదాపు అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నాయి. మరినాట్లు ముందుగా పడే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మలిదశ యూరియా వాడకం కోసం రైతులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ‘అదును తప్పుతోంది.. ఒక్క బస్తా అయినా ఇప్పించండి’అని కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, జగిత్యాల మొదలైన జిల్లాల రైతులు అధికారులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూరియా కొరత లేకుండా కేంద్రంతో మాట్లాడి తెప్పిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రోజూ ప్రకటనలు ఇస్తున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్నది 23 వేల మెట్రిక్ టన్నులే.. రాష్ట్రానికి కేంద్రం నుంచి వస్తున్న యూరియా ఏ రోజుకు ఆరోజే అన్నట్లుగా అయిపోతోంది. నిల్వ లేకుండా డిమాండ్‌కు అనుగుణంగా వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు యూరియాను ఆయా జిల్లాల్లో డిమాండ్ అధికంగా ఉన్న మండలాలకు పంపిస్తున్నారు. రైల్వే వ్యాగన్ల ద్వారా ప్రతిరోజు 5 వేల టన్నులకు తగ్గకుండా యూరియాను కేంద్రం నుంచి తెప్పిస్తున్నా.. అది ఏమూలకు సరిపోవడం లేదు. శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రంలో 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందులో సొసైటీల వద్ద 6 వేల మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఉదయం దుకాణాలు తెరిచిన వెంటనే టోకెన్ల ప్రకారం ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఈ నిల్వల్లో 70 శాతం వరకు పంపిణీ చేసి, మిగతా నిల్వను మరుసటి రోజు కోసం దాచిపెడుతున్నారు. మార్క్‌ఫెడ్ గోదాముల్లో ఉన్న 10 వేల మెట్రిక్ టన్నులను ఆచితూచి పంపిస్తున్నారు. వీటికి తోడు ఆ రోజు వచ్చే రైల్వే వ్యాగన్ల లోడ్ మీదనే వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ ఆధారపడుతోంది. సరఫరా చేసింది 7 లక్షల టన్నులు.. రాష్ట్రంలో ఈ వానకాలం సీజన్లో ఇప్పటివరకు సరఫరా చేసిన యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్రంలో ఈ సీజన్లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, ఒక లక్ష ఎకరాలు తక్కువగా అంచనాలో 98 శాతం మేర సాగయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు విస్తీర్ణం ఉన్నది ఈ సీజన్లోనే. ఇందులో యూరియా అత్యధికంగా వినియోగించే వరి ఏకంగా వ్యవసాయ శాఖ అంచనాలకు మించి 104 శాతం సాగైంది. 65.52 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మొక్కజొన్న కూడా అంచనాకు మించి 122 శాతం.. అంటే 6.36 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈ మూడు పంటలకే కాకుండా ఉద్యాన పంటలకు కూడా యూరియా వినియోగం అధికంగా ఉండడంతో రైతులకు ఈ పరిస్థితి తలెత్తింది. గత సంవత్సరం కన్నా దాదాపు 10 లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం పెరగ్గా, యూరియా కేటాయింపులు మాత్రం తగ్గాయి. ఈ నెలాఖరు వరకు 9.91 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు వచ్చింది 7 లక్షల మెట్రిక్ టన్నులే. కనీసం మరో 2 లక్షల మెట్రిక్ టన్నులు వెంటనే వస్తే తప్ప రైతులకు బాధలు తప్పవు. అదును తప్పిపోయిన తరువాత యూరియా వచ్చినా ఉపయోగం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచే యూరియా విక్రయంలో రేషన్ పద్ధతి పాటించేలా చేయడంలో విఫలమైన అధికార యంత్రాంగం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తోంది. దీంతో సామాన్య చిన్న, సన్నకారు రైతులు ఒక్కో యూరియా బస్తా కోసం పడిగాపులు పడుతున్నారు. -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడిఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్‌షాపు యజ మాని బ్లాక్‌లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మీరు కొంచెం మసాలా యాడ్ చేశారు’.. కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు
సాక్షి,న్యూఢిల్లీ: సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌనత్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. రైతు చట్టాల ఆందోళనపై మీరు రీట్వీట్ మాత్రమే చేయలేదు. కొంచెం మసాలా యాడ్ చేశారని మండిపడింది. 2020-21లో రైతు చట్టాలకు సంబంధించిన ఆందోళన సమయంలో కంగనారౌనత్ ఓ మహిళా రైతును ఉద్దేశిస్తూ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో మహిళా రైతు కంగనారౌనత్‌పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా, పంజాబ్ రాష్ట్రం బాథిండా కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో కంగనాపై నమోదైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అంతేకాదు.. మహిళ రైతు గురించి మీరు ట్వీట్లు మాత్రమే కాదు మసాల్ యాడ్ చేశారు’అని వ్యాఖ్యానించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.2020-21 దేశ రాజధాని ఢిల్లీ రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో మరో ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. అయితే, రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న మహీందర్ కౌర్.. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాల్గొన్న బిల్కిస్ బానో ఇద్దరూ ఒకటేనంటూ తాను చేసిన పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఆ రీట్వీట్‌పై మహీందర్ కౌర్ కోర్టును ఆశ్రయించారు. ఆ కేసునే కొట్టేయొమని కంగాన న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. కంగనా ఇప్పటికే పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు సూచన మేరకు ఆమె ట్రయల్ కోర్టులోనే న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. -
జగన్ ప్రభుత్వంలో ఈ కష్టాల్లేవ్: రైతులు
సాక్షి, కృష్ణా: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు ఎరువుల కొరత(Urea Crisis) అనే మాటే వినిపించలేదు. కానీ ఇప్పుడు అదే వ్యవస్థ.. అదే అధికారులు ఉన్నా.. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాతో నిస్సహాయంగా మిగిలిపోయారు. దీంతో రైతులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉయ్యూరు మండలం ముదునూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS) వద్ద పడిగాపులు పడుతున్న రైతులు కొందరిని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై వాళ్లు దుమ్మెత్తిపోశారు. ‘‘అర్ధరాత్రి నుంచి సొసైటీ గేట్ ఎదురు పడిగాపులు కాస్తున్నాం. మొదటి కోట యూరియా ఇంకా వెయ్యలేదు. రైతు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం చేయటం దుర్భరంగా మారింది.బ్లాక్‌లో యూరియా రూ.800 పైగా అమ్ముతున్నారు. 10 ఎకరాలకు 2 కట్టలు ఇస్తున్నారు. యూరియా కోసం ఇంతకు ముందెప్పుడూ రోడ్లపైకి ఎప్పుడు రాలేదు. జగన్ ప్రభుత్వంలోనూ ఈ పరిస్థితి లేదు. సకాలంలో ఎరువులు, పంట సాయం అందేవి. ఇప్పుడు యూరియా వాడితే చంద్రబాబు క్యాన్సర్ వచ్చింది అంటున్నాడు. చంద్రబాబుకు రైతులు అంటే అంత చులకన?. ఇకనైనా ప్రభుత్వం రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న అవస్థలపై తాజాగా ప్రెస్మీట్లో కూటమి సర్కార్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Press Meet On Urea Troubles) చురకలంటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. అధికారులు కూడా రైతుల పక్షాన ఉండేవారు. ఇప్పుడు మాత్రం యూరియాను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించి, రూ. 250 కోట్ల స్కాం చేశారు. రైతులు బారులు తీరుతున్నారు, కానీ అధికార పార్టీ క్యాడర్‌కు మాత్రం యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. MSP (మద్దతు ధర) కూడా ఇవ్వకుండా, రైతులను ఆత్మహత్యల దిశగా నెట్టుతున్నారు. మేము తిరిగి అధికారంలోకి వస్తే, ఈ దందా అంతా బయటపెడతాం. రైతులకు న్యాయం చేస్తాం అని అన్నారాయన. గత వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాల) ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో అదే అధికారులు ఉండి, అదే వ్యవస్థ ఉండి.. అప్పుడు లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? అని చంద్రబాబును నిలదీశారాయన. ఇదీ చదవండి: ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్ -
బస్తా కోసం భారంగా..
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి. » కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు. » సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. » మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది. » సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్‌కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు. » మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్‌కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి. -
YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు
-
ఎరువులు అందిస్తే ఏ రైతూ రోడ్డెక్కడు: వైఎస్ జగన్
గిట్టుబాటు ధరలు, ఇంకా మరేదైనా సమస్య అయినా సరే తొలుత అసలు ఒప్పుకోడు. రేట్లు లేవయ్యా అంటే ఉన్నాయంటాడు. అంతా భేషుగ్గా ఉందని వాదిస్తాడు. రైతులు కేరింతలు కొడుతున్నారని గొప్పలకు పోతాడు. చివరకు సమస్య ఉందని ఒప్పుకోక తప్పదని నిర్ధారించుకున్నాక మోసం చేసేందుకు తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా.. చంద్రబాబు ఇంద్రుడు.. చంద్రుడు.. ఆదేశాలిచ్చేశాడంటూ ఆకాశానికెత్తేస్తాయి. తాటికాయంత అక్షరాలతో రాసేస్తారు. ఇదంతా ఓ బూటకం. ఏ రైతుకూ సమస్యలు తీరవు. మిర్చి, పొగాకు, మామిడి, చివరకు ఉల్లి విషయంలోనూ అదే జరిగింది.రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈృక్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధరల స్థిరీకరణ నిధి లేదు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఈ క్రాప్‌ను నిర్వీర్యం చేశారు. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడేశారు. సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఖరీఫ్‌లో ఇప్పటికే రైతులకు 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశామని, గతేడాది కంటే 97 వేల టన్నులు అధికంగా అందించామని మీరు గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వం అవసరమైన మేరకు యూరియా, ఎరువులు అందించి ఉంటే రాష్ట్రంలో ఏ రైతూ రోడ్డెక్కడు కదా?’ అని సీఎం చంద్రబాబు నాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటన చూస్తుంటే ఆశ్చర్యం వేసిందన్నారు. రైతులకు అందించాల్సిన ఎరువులు, యూరియాను దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ అధికార పార్టీ నేతలు కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు కూడా భాగస్వామి అని దునుమాడారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర దక్కక రైతులు పడుతున్న ఇబ్బందులను ఆధారాలతో ఎత్తిచూపుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం కోసం తెచి్చన విప్లవాత్మక పథకాలను గుర్తు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ఇంకా ఏమన్నారంటే.. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా? రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా? అన్న సందేహాలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నొక్కేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా తిరోగమనం పట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రస్తుతం మన కళ్ల ఎదుటే ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయి. అసలు రాష్ట్రంలో పాలన ప్రజల కోసం సాగుతోందా? లేక దోపిడీదారుల కోసం సాగుతోందా? రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలి పోవడంతో కుంభకోణాలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీ రైతుల పక్షాన మంగళవారం ‘అన్నదాత పోరు’ చేపడితే కేసులు పెడతామంటూ బెదిరించి నోటీసులు ఇచ్చారు. వారంతా ఏం తప్పు చేశారు? రైతుల పక్షాన నిలబడితే తప్పా? రాష్ట్రంలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యానికి ఇవన్నీ నిదర్శనాలు. చంద్రబాబు బావిలో దూకితే మేలు రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం సరిపడా ఎరువులు అందించి ఉంటే అసలీ పరిస్థితే ఉండేది కాదు కదా.. మీరు ఎరువుల విషయంలో కుంభకోణాలు చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా.. ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు. రెండు నెలలుగా కనిపిస్తోంది. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎరువులు దొరక్క కృష్ణా జిల్లా ఘంటశాల మండలం లంకపల్లి పీఏసీఎస్, పార్వతీపురం మన్యం జిల్లాలో, విజయనగరం జిల్లా ఎస్ కోటలో బారులు తీరిన రైతులు, రాజాంలో ఎరువుల కోసం కొట్లాట, అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాట్లు, తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో, ఏలూరు జిల్లా నూజివీడులో, ఎన్టీఆర్ జిల్లా గొళ్లపూడిలో ఎరువుల కోసం పాదరక్షలను క్యూలో పెట్టిన రైతులు.. గుంటూరు జిల్లా రేపల్లె గోడౌన్ వద్ద రైతుల ఆందోళన.. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులు కళ్లకు కట్టాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం కురమద్దాలి, సత్యసాయి జిల్లా సోమందేపల్లి పీఏసీఎస్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రైతులు బారులు తీరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కూడా ఎరువులు దొరకని పరిస్థితి. సొంత నియోజకవర్గంలోనూ ఎరువులు సక్రమంగా పంపిణీ చేయలేని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులు ఏదైనా బావి చూసుకుని దూకితే మేలు. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి మా ఐదేళ్ల పాలనలో రైతులకు ఈ కష్టాలు లేవు. ఇప్పుడు రైతులకు అందించే ఎరువుల్లో కూడా కుంభకోణాలు చేసి, డబ్బు ఎత్తాలన్న ఆలోచన చేస్తున్నారు కాబట్టే దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉన్నందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారని లెక్క కడతారు కదా? దాని ఆధారంగా ఎంత ఎరువులు కావాలని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అంచనాకు వస్తుంది. ఆ లెక్కలన్నీ మనదగ్గర కూడా ఉంటాయి కదా? మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు » రాష్ట్రంలో రైతులు పండించే వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీని, కోకో, పొగాకు, మామిడి, ఉల్లి, టమాటా ఇలా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబు పట్టించుకోరు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తారు. » ఉల్లి విషయంలో ఆగస్టు 29న క్వింటా రూ.1200కు కొనుగోలు చేయాలని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్టు ఈనాడు రాసింది. మళ్లీ సెప్లెంబర్ 7న అంటే 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే క్వింటా రూ.201, 300, 400, 600 ఇలా రకరకాలుగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రాస్తుంది. అంటే.. దాని అర్థం రూ.1,200కు కొనుగోలు చేశారంటే ఒట్టిమాటే కదా? అన్నీ తూతూ మంత్రాలే.. అబద్ధాలు, మోసాలు. » ఈ రోజు ఉల్లి.. క్వింటా రూ.200 నుంచి రూ.400. అదే ఉల్లి బహిరంగ మార్కెట్లో (బిగ్ బాస్కెట్) కేజీ రూ.34. అంటే క్వింటా 3,400. రైతులకు క్వింటా రూ.300–400 వస్తున్నట్టు ఈనాడు రాస్తోంది. రేటు పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడు. మా పాలనలో కేజీ ఉల్లి రూ.40 నుంచి రూ.125 వరకు పలికింది. ఒకసారి మధ్యలో ఒడిదుడుకులు వస్తే రూ.9 వేల టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కోవిడ్ లాంటి సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. చినీ ధర ఈ రోజు టన్ను రూ.7–8 వేలు..బాగా వస్తే రూ.12–14 వేలు. అదే మా హయాంలో కనిష్ట ధర రూ.30 వేలు. గరిష్ట ధర రూ.లక్ష. నాడు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి వైఎస్సార్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీని పెంచాం. రైతులకు తోడుగా నిలబడేందుకు రూ.7,802 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ పెట్టాం. అక్కడే ఈ క్రాప్ జరిగేది. దాంతో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వివరాలను ఆ యాప్‌లో అప్లోడ్ చేసేవారు. ఇది కంటిన్యూస్ మానిటరింగ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ అండ్ ప్రొక్యూర్ మెంట్ (సీఎంయాప్) ద్వారా కచ్చితంగా పని చేసేది. ఆర్బీకేలో కనీస గిట్టుబాటు ధరలు తెలిసేలా బోర్డులో పెట్టేవారు. ఆ ధరల కంటే ఎక్కడన్నా పంట ధర పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఈ రోజు ఆర్బీకేలను గాలికొదిలేశారు. ఈ క్రాప్‌ను నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేశారు. ఇన్ పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారానికి మంగళం పాడేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. మేము క్రమం తప్పకుండా రైతు భరోసా ఇచ్చేవాళ్లం. ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందేది.. ఇవన్నీ ఎత్తేశారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చారు. అంటే రూ.40 వేలకు గాను రూ.5 వేలు ఇచ్చారు. అది కూడా సుమారు 7 లక్షల రైతు కుటుంబాలకు అర్హత జాబితా నుంచి తీసేశారు. ఇవాళ ప్రతిదీ స్కామే. ప్రతి విషయంలోనూ దోచేయాలనే ఆలోచనే కనిపిస్తోంది. ఇది రూ.250 కోట్ల కుంభకోణం » అసలు రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం.. ఆర్బీకేలు, ఈ–క్రాప్, పీఏసీఏఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. ప్రైవేటుకు ఎక్కువ యూరియా, ఎరువులు కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఎరువులను టీడీపీ నాయకులు దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. » ఉదాహరణకు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారి మళ్లిన యూరియా.. పల్నాడు జిల్లా దాచేపల్లిలో 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు.. నంద్యాల జిల్లా డోన్‌లో 70 టన్నుల యూరియా మాయం.. ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్లిన యూరియా, ఎరువులను టీడీపీ నేతలు దారి మళ్లించి అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటుకు అధికంగా కేటాయించిన ఎరువులను బ్లాక్ చేసి కొరత సృష్టించడం ద్వారా బస్తా యూరియా ధర రూ.267 ఉంటే దానికంటే రూ.200 నుంచి 250 అధికంగా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. » ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువుల అమ్మకాలను చంద్రబాబు ప్రొత్సహించడం, నేరుగా భాగస్వామి కావడంతో దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల కుంభకోణం జరిగింది. రైతులను పీడించి కుంభకోణాలు చేసి, కింది నుంచి పైదాక అందరూ పంచుకున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు, ఎస్పీలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే వాడిని. ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ కనిపిస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని ఎస్పీలు, కలెక్టర్లకు బలంగా హెచ్చరికలు ఉండేవి. ఈ రోజు అది లేకుండా పోయింది. ఎవరి మీదా చర్యలు ఉండవు. నికింత– నాకింత అని.. దోచుకో పంచుకో తినుకో విధానంలో సిస్టమేటిక్ పద్ధతుల్లో వెళుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ కుంభకోణాలు చేస్తున్న వాళ్లు అసలు మనుషులేనా?


