సాక్షి,వైఎస్సార్: పులివెందుల నియోజకవర్గం మంగళవారం జన సంద్రంగా మారింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వేలాది మంది అభిమానులు, స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చారు. భాకరపురంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్‌కు అన్ని వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.
వైఎస్ జగన్ పర్యటనకు ఇంత భారీ స్పందన రావడం పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, తగిన సమయంలో ప్రజలు తమ నిర్ణయం చెబుతారని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ..చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.అరటి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల వద్ద టన్నుకు రూ.200 మాత్రమే ఇచ్చి కొనుగోలు చేసి.. అదే పంటను మార్కెట్లో మధ్యవర్తులు రూ40 నుంచి రూ.50 కిలోకు అమ్ముతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారని
అన్నారు.
అరటి, చీనీ, మామిడి, టమోటా, పత్తి ఏ పంట తీసుకున్నా రైతులకు ఈ ప్రభుత్వంలో ప్రయోజనం కలగలేదని ఆయన విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పినా, 18 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందలేదని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను అర్థం చేసుకుని, సరైన సమయంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.


