బాపట్లటౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికకు అర్జీదారులు భారీగా హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 62 మంది బాధితులు హాజరై తమ సమస్యలను నేరుగా ఎస్పీకు విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
రూ.పది లక్షలు తెస్తేనే కాపురం చేస్తారంటా
నాకు 2016లో కందూకురుకు చెందిన గుజ్జుల శ్రీమన్నారాయణతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో మా అమ్మనాన్నలు నాకు కట్నం క్రింద రూ.5 లక్షలు నగదు ఇచ్చారు. నాకు పాప పుట్టింది. ఆడపిల్లను కన్నావు. మీ పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తీసుకొని వస్తే నీతో కాపురం చేస్తాను. లేకుంటే నాకు నీవు అవసరం లేదంటూ గత ఏడాది నుంచి నన్ను పుట్టింటిలోనే వదిలేశాడు. ప్రస్తుతం కందుకూరు ప్రాంతంలోనే బ్యాంక్ ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకొని నన్ను నా భర్తతోపాటు అత్త, మామలు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. న్యాయం చేయాలి.
– గుజ్జుల హేమ, ఈపూరుపాలెం, చీరాల మండలం


