సంక్రాంతికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా.. కానీ ఆ సామంత గ్రామాల్లో మాత్రం పండగ అయిపోయింది. గిరిజనులుగా పిలిచే సామంతులకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారమే అసలైన పండగ. ఆదివారం నాడు వారు అమ్మవారి ప్రతి రూపంగా భావించే వేప చెట్టును పసుపు, కుంకుమతో అలంకరించారు. అమ్మవారి ప్రతి రూపంగా భావించే గజముద్దను పూలతో అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు.
– ఇచ్ఛాపురం రూరల్
ఊరికి స్వాగతం
పెద్ద పండుగకు ఊరికి వచ్చే వారిని ఓవీపేట వాసి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పాలకొండ–ఆమదాలవలస రోడ్డు లచ్చయ్యపేట కూడలికి ఓవీపేట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రా మానికి బస్సు సదుపాయం లేదు. దీంతో పండగకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఆయన ఉచితంగా ఆటో నడుపుతున్నారు. 20వ తేదీ వరకు ఉచితంగానే బండి నడుపుతానని ఆయన చెబుతున్నారు.
–శ్రీకాకుళం జిల్లా


