breaking news
Sankranti 2026
-
ఈ పాపం ఎవరిది?
మూసాపేట (హైదరాబాద్): చైనా మాంజాకు ఓ నిండు ప్రాణం బలైంది. తల్లిదండ్రులతో సంతోషంగా బైక్‌పై వెళుతున్న ఓ చిన్నారి గొంతుకు చైనా మాంజా తగిలి గొంతు తెగటంతో మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోనసీమ, అంబాజీపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామ్‌సాగర్, పద్మావతిలు కేపీహెచ్‌బీ కాలనీలోని గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నిష్విక దర్యా (4) లండన్ కిడ్స్ స్కూలులో ఎల్కేజీ చదువుతోంది. వీరు ఇటీవల కాజీపల్లిలో ఓ ఇల్లు కొనుగోలు చేశారు.సోమవారం సెలవు కావటంతో తమ కొత్తింట్లో జరుగుతున్న ఇంటీరియర్ పనులను చూసేందుకు కుటుంబ సభ్యులు బైక్‌పై వెళ్లి వస్తున్నారు. కూకట్పల్లి, వివేకానందనగర్‌లో పిల్లర్ నంబర్ 781 వద్ద డివైడర్ పక్క నుంచి వస్తుండగా పాప ఒక్కసారిగా గట్టిగా అరిచింది. తండ్రి వెంటనే వాహనాన్ని ఆపి చూడగా పాప గొంతు నుంచి రక్తం కారుతోంది. రక్తాన్ని చూసి తండ్రి అక్కడే పడిపోయాడు. పాప మెడకు మాంజా దారం చిక్కుకుని ఉండటాన్ని గమనించి వెంటనే మాంజాను తొలగించారు. అటు నుంచి బైక్‌పై వెళుతున్న మరో వ్యక్తి పాపను బైక్‌పై సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. గొడవపడి.. బైక్ ముందు కూర్చుని.. కాజిపల్లి నుంచి బయలుదేరేటప్పుడే తన అక్కతో ముందు నేను కూర్చుంటానని గొడవపడి నిష్విక ముందు కూర్చుంది. జేఎన్టీయూ వద్ద యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చాలా ముందుకు వచ్చారు. పిల్లర్ నంబర్ 781 వద్ద పాప గొంతుకు మాంజా తగిలింది. వాహనం ఆపడానికి వీల్లేక పోవడం.. అలాగే ముందుకు రావటంతో పాప గొంతు లోతుగా తెగింది. కాగా, తీవ్రంగా రక్తస్రావం కావడంతోనే పాప చనిపోయిందని వైద్యులు రఘురాం తెలిపారు. మెదడు నుంచి గుండెకు, గుండె నుంచి మెదడుకు రక్తాన్ని పంపు చేసే రెండు ప్రధాన నరాలు గొంతులో తెగిపోయాయని ఆయన చెప్పారు.కేసు ఎవరి మీద?జేఎన్టీయూ వద్దే యూటర్న్ తీసుకుని ఇంటికి వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని పాప తల్లిదండ్రులు రోదించారు. కూకట్పల్లి పోలీసులు పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ.. కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగురవేశారనేది గుర్తించడం కష్టమని ఈ సందర్భంగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది చైనా మాంజా కారణంగా సంభవించిన మరణాల్లో ఇది రెండోదని గుర్తు చేశారు. -
‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌మీట్ (ఫొటోలు)
-
అనిల్ రావిపూడికి ఒక రేంజ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)
-
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం చేశారు. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.(చదవండి: జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు) -
జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి-2026 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొసమెరుపుగా జనవరి 10న రోజంతా సాగిన శాస్త్రీయ మరియు సినీ నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు, జపనీస్ వారికి చిరస్మరణీయ అనుభూతిని కలిగించాయి. ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా తదుపరి తరాలకు అందించే రీతిలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.(చదవండి: కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం) -
కోలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్
సంక్రాంతి వచ్చిందంటే ఆనందాల సందళ్లు తెచ్చినట్లే. ప్రతి ఇంటా సంబరాలు వెల్లి విరుస్తాయి. పేద ,గొప్ప అన్న తేడా లేకుండా తమకు తోచిన విధంగా అందరూ సంక్రాంతి పండగను జరుపుకుంటారు. రంగవళ్లుల లోగిళ్లు, పిండివంటల ఘుమఘుమలు, ఆత్మీయుల నవ్వుల పలకరింతలు, అనుబంధాలు, అనురాగాలతో, సంతోషాలతో ఆనందంగా గడుపుతారు. పొంగల్ వేడుకపల్లెటూరల్లో అయితే ఈ వేడుకల మోత మోగుతుంది. కోడిపందేలు, ఎద్దుల పోటీలు, ఇంకా కాయ్ రాజా కాయ్ అంటూ అనేక క్రీడలు ఆడతారు. సినిమా వాళ్ల విషయానికి వస్తే సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో ఆడంబరంగా, ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా కోలీవుడ్‌లో మన తారలు పొంగల్ వేడుకను భక్తిశ్రద్ధలతో వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు.ఫ్యామిలీతో రజనీకాంత్అలా రజనీకాంత్ నుంచి దర్శకుడు మారిసెల్వరాజ్ వరకు పలువురు పొంగల్ సంబరాలు చేసుకున్నారు. రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం తనను కలవడానికి వచ్చిన అభిమానులను సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. ఈ పండగ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.సెలబ్రిటీల సంక్రాంతిహీరోయిన్ నయనతార ఈ పొంగల్ వేడుకలను తన భర్త ,దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఇద్దరు పిల్లలతో కలిసి విశేషంగా జరుపుకున్నారు. పిండివంటలు, రకరకాల తీపి పదార్థాలు, పళ్లు, చెరుకు గడలు ఏర్పాటు చేసి, పాలు పొంగించారు. హీరో కార్తీ కూడా ఇంటి ముంగిట్లో పాలు పొంగించి పొంగల్‌ను వేడుకగా నిర్వహించారు. అదేవిధంగా శివకార్తికేయన్ తన కుటుంబ సభ్యుల సమేతంగా పొంగల్ వేడుకను జరుపుకున్నారు. నటుడు అరుణ్ విజయ్, నటుడు అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ దంపతులు, దర్శకుడు మారిసెల్వరాజ్ తదితర సినీ ప్రముఖులు సంక్రాంతిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. Thalaivar waiting to eat Pongal just like us @rajinikanth 😃😃❤️✨️#SuperstarRajinikanth #Rajinikanth #Jailer2 #Thalaivar173 pic.twitter.com/8ARzjZPmXW— Achilles (@Searching4ligh1) January 15, 2026இனிய பொங்கல் திருநாள் நல்வாழ்த்துக்கள் 🍚🌾🎋 తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు #MegaBlockBusterPongal pic.twitter.com/9aHE3KdODI— Nayanthara✨ (@NayantharaU) January 15, 2026 View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
పండుగ వంటలు సుష్టుగా తిన్నారా? ఆరోగ్యం కోసం ఇలా చేయండి..
ఆరోగ్య స్పృహ బాగా ఉన్నవాళ్లు కూడా పండుగ సమయంలో ఫుడ్ విషయంలో తమ నియంత్రణలను కాస్త సడలించుకోవడం, పండుగ వంటల్నిఇ ఆస్వాదించడం సాధారణమే. ఇక భోజన ప్రియులైతే చెప్పనే అక్కర్లేదు. పైగా సంక్రాంతి అంటే 3రోజుల పాటు కొనసాగే పండుగ...పిండింటలకూ కొదవలేని పండుగ. అందుకే ఈ పండుగ సీజన్ తర్వాత,కొంచెం నిస్సత్తువగా అనిపించడం, ఉబ్బరం, తక్కువ శక్తి, నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పండుగ తర్వాత ఆహార విహారాల్లో కొన్ని మార్పు చేర్పులు అవసరం అని సూచిస్తున్నారు.రీహైడ్రేట్, టాక్సిక్స్ బయటకు...పండుగల సమయంలో, మనం తరచుగా అదనపు చక్కెర, నూనె పదార్ధాలు అలవాటున్నవాళ్లు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు. ఇవన్నీ డీహైడ్రేషన్, అలసటలతో బాధపెడతాయి. కాబట్టి పండగ తర్వాత రోజుల్ని ఒక సాధారణ దినచర్యతో ప్రారంభించాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. ఉదర వ్యవస్థను ఫ్లష్ చేసి హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కనీసం 8–10 గ్లాసుల నీటిని లక్ష్యంగా పెట్టుకోవాలి. నీటిలో నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలను జోడించడం వల్ల మరింత రిఫ్రెష్‌గా ఉంటుంది తేలికపాటి డిటాక్స్ ఇస్తుంది. అల్లం, పుదీనా లేదా సోంపు వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి శరీరాన్ని లైట్‌గా మారుస్తాయి.సమతుల ఆహారం వైపు తిప్పు చూపు...పండుగలు అంటే స్వీట్లు, వేయించిన వంటలతో భారీ భోజనం. ఇక ఇప్పుడు భోజనంలో సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలి. జీర్ణక్రియను నియంత్రించడంలో ఉబ్బరం తొలగించడంలో ఫైబర్–రిచ్ ఫుడ్స్, తృణæధాన్యాలు, ఓట్స్ తాజా పండ్లు సహాయపడతాయి.బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను వంటలో చేర్చాలి. పండుగ తర్వాత పెరిగే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడానికి వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.కాయధాన్యాలు, పప్పు, కాటేజ్ చీజ్ గుడ్లు వంటి సాధారణ ప్రోటీన్లు కడుపు నిండినట్టు తృప్తికరమైన స్థితిలో ఉంచుతాయి, ఆయిల్ ఫుడ్స్ పట్ల ఇష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.గింజలు, విత్తనాలు తక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన నూనెలు (ఆలివ్ లేదా కొబ్బరి నూనె వంటివి) చేర్చాలి.తేలికపాటి ఉపవాసం జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడానికి సులభమైన మార్గం. పూర్తి రోజు చేయలేకపోతే కనీసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే తినడం వంటి పద్ధతిని అనుసరించాలి. తద్వారా రాత్రిపూట 14 గంటల ఉపవాసం ఉన్నట్టు అవుతుంది. ఈ విధానం శరీరపు పండుగ ఓవర్‌లోడ్‌ను ప్రాసెస్ చేయడానికి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది శక్తి స్థాయిలను రీసెట్ చేస్తుంది.పండుగ తర్వాత అలసటతో వ్యాయామాన్ని ఆపేయాలని అనుకోవచ్చు, కానీ సున్నితమైన కదలికలు అయినా తప్పనిసరి. దశలవారీగా 20–30 నిమిషాల నడక రక్త ప్రసరణను పెంచుతుంది, మరింత శక్తినిచ్చేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. తేలికపాటి యోగా భంగిమలు, లోతైన శ్వాసపై దృష్టి సారించి చేసే స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఉబ్బరాన్ని కండరాల బిగుతు ను తగ్గిస్తాయి మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి.పండుగ రోజుల రాత్రులు, తెల్లవారుఝాములు నిద్ర షెడ్యూల్‌లను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కోలుకోవడానికి ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడానికి మేల్కొలపడానికి ప్రయత్నించాలి. అలాగే నిద్రవేళకు ఒక గంట ముందు స్క్రీన్ వీక్షణను నివారించి బదులుగా, పుస్తకం చదవడం మంచిది. ప్రశాంతమైన సంగీతాన్ని వినడం కూడా మంచిదే. నిద్ర పోయే గది పూర్తి నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ముందు ధ్యానం లేదా లోతైన శ్వాస మనస్సును ప్రశాంతపరుస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.కొన్ని ఆయుర్వేద చిట్కాలు...డిటాక్స్ వాటర్: ఒక టీస్పూన్ పసుపు లేదా చిటికెడు దాల్చిన చెక్క కలిపిన గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి. రెండు సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి పేరుకున్న చెడు టాక్సిన్స్‌ను తొలగించడానికి సహాయపడతాయి.భోజనానికి చిటికెడు ఆసాఫోటిడా (హింగ్) జోడించడం లేదా సోంపు లేదా అజ్వైన్ నీటిని త్రాగడం అనేవి జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఉబ్బరం తగ్గించడానికి సహాయపడతాయి.త్రిఫల పౌడర్: పడుకునే ముందు గోరువెచ్చని నీటితో ఒక టీస్పూన్ త్రిఫల పౌడర్ తీసుకోండి. ఈ ఆయుర్వేద మిశ్రమం ప్రేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.జీలకర్ర, కొత్తిమీర, సోంపు నీరు: ఒక లీటరు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర, కొత్తిమీర, సోంపు గింజలను ఉడకబెట్టండి. జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఉబ్బరం తగ్గించడానికి రోజంతా త్రాగండి.ఒక టీస్పూన్ పసుపు చిటికెడు నల్ల మిరియాలు కలిపిన గోరువెచ్చని పాలు టర్మరిక్ లాట్టే (గోల్డెన్ మిల్క్)ఉపశమనం కలిగించేవి శోథ నిరోధకమైనవి. రోజును ప్రారంభించడానికి వెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన అల్లం తేనె కలిపితే... ఇది జీర్ణక్రియను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.(చదవండి: పొంగల్‌వేళ అద్భుతమైన సాంప్రదాయ పులినృత్యం..!) -
సంక్రాంతి సంబురాలు.. అడ్డంగా దోచేస్తున్న కూటమి నేతలు
ఏపీలో సంక్రాంతి సంబురాలను కూటమి నేతలు పూర్తి జూదంగా మార్చేశారు. ప్రత్యేకించి.. టీడీపీకి చెందిన నేతలు ప్రజల పండుగను విపరీతంగా క్యాష్ చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆటలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో నడిపిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలను టీడీపీ, జనసేన నేతలు దగ్గరుండి నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. కూటమి నేతల ఆ దోపిడీ ఎలా ఉందంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. కానీ.. కూటమి నేతలకు భయపడుతున్న పోలీసులు ఆ పక్కకు కూడా పోవడం లేదు. సీఎం సభ రేంజ్లో..ఒక పక్క.. ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మీడియాను బరుల చుట్టుపక్కలకూ కూడా రానివ్వడం లేదు. ఆఖరికి.. సెల్ఫోన్లతో వీడియోలు తీయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏరపాటు చేస్తున్నారు. వీఐపీలు రిఫ్రెష్ కావడానికి కారవాన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట గుండాటతోపాటు మరికొన్ని ఆటలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తున్నారు. అలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.2000 కోట్లకు దాకా జూద క్రీడలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు.. ఏరులై పారతున్న..మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గరే బెల్ట్ షాపులు వెలిశాయి. అవి వైన్ షాపులను తలపిస్తున్నాయి. కూటమి నేతలు, వాళ్ల అనుచరులే వాటిని నడిపిస్తున్నారు. మద్యం ప్రియుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ.50 , బీర్ బాటిల్ పై రూ.100 వసూలు చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.డాన్స్ బేబీ డాన్స్ఇంకోవైపు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నారు. కూటమి నేతలైతే ఆ డ్యాన్సర్లతో కలిసి హుషారుగా గంతులేస్తున్నారు. కొందరైతే.. యువతులను దుస్తులు విప్పమంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డాన్సర్లతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం సహ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా ఈ తంతు జరుగుతోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుచరుడు దగ్గురుండి మరీ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అశ్లీల వ్యవహారాలను అడ్డుకోవాల్సిన పోలీసులు పత్తా లేకుండా పోయారు. నెట్టింట చర్చ.. రచ్చ..ఈ బాగోతాలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. కోడి పందేలు, గుండాట.. ఆ ప్రాంగంలోనే మందు బాబుల వీరంగం తాలుకా వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అశ్లీల నృత్యాలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నెట్టింట పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదే సమయంలో.. వీటి కోసం తెలంగాణ నుంచి భారీగా తరలి వస్తున్నారనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం సంబురాల పేరిట గబ్బు పట్టిస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
ప్రభుత్వం మారింది.. పరపతి పోయింది...!
పాలకొండ రూరల్: ఏటిరో.. పిల్లాజల్లా అంతా కలిసి బెజివాడలో ఉంటున్నారట.. పండగకు ఇదేనా రావడం అంటూ శ్రీనివాసరావును సంఘంశాల ఎదుట కూర్చున్న ఊరిపెద్దలు పలుకరించారు. కొండపై అమ్మవారి దయతో అక్కడ బతుకుతున్నాం. పండగ కోసం ఊరు వచ్చేందుకు నరకం చూశాం. శ్రీకాకుళం నుంచి పాలకొండ చేరడం అటుంచితే ఆటోలో నవగాం మీదుగా ఊరి వచ్చేసరికి సరదా తీరిపోయింది. రోడ్డు మధ్యలో గోతులు ఏంటిరా దద్ది.... పడితే పెద్దల్లో కలసిపోతాం. గత పండగకు వచ్చినప్పుడు రోడ్డు వేస్తామన్నారు.. నిజమే అనుకున్నాను. చూస్తే రోడ్డు వేయలేదు. మరీ దారుణంగా ఉన్నాయంటూ వాపోయాడు. సురేష్: శ్రీనుతో కలిసి ఆటోలో వచ్చిన సురేష్ మాట అందుకున్నాడు... ఇక్కడే రేషన్ బండి నడిపేవాడిని. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రేషన్బండిని నిలిపివేసింది. ఉపాధికోసం తెలంగాణా వెళ్లాను. ఇప్పుడు జనమంతా రేషన్ కోసం కొండలు దిగి దుకాణాలకు పరుగుతీయాల్సిన పరిస్థితి. భీమన్న: ప్రయాణికుడైన భీమన్న అంతలో కలుగచేసుకుని ఈ ఏడాది పంటలు సరిగ్గా పండించ లేకపోయాను. విత్తనాలు లేవు. అన్నదాత సుఖీభవ పథకం పూర్తిగా అందలేదు. పెట్టుబడికి అప్పుచేశాను. సాగు నీరు లేక పంట ఎండిపోయింది. వర్షాలకు ఒరిగిపోయింది. బస్తాడు యూరియా కోసం పాలకొండే కాదు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లాను. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఈ దుస్థితి ఏ రైతుకూ కలగలేదు. అందుబాటులోనే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు లభించేవి. ఇప్పుడు రైతుభరోసా కేంద్రం ఎక్కడుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు అంతా డాబుడూబులే.. చిన్నయ్య: మరో వృద్ధుడైన చిన్నయ్య మాటకలుపుతూ కరెంట్ బిల్లు ముట్టుకుంటే షాక్తగులుతోంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఊరికి రావడంలేదు. వైద్యసేవలు గతంలో వలే అందడంలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసేస్తున్నారని తెలిసింది. ఇది ఎంతఘోరం. ఇలాగైతే మనలాంటి పేదలు ఏమైపోవాలి. రైతులు పంటలు కోల్పోతే పరిహారం కూడా అందడంలేదు. ఏ పథకమూ సరిగా అందిన దాఖలా లేవు. ఏం చెప్పుకుంటామయ్యా.. ప్రభుత్వం మారింది.. పరపతి పోయింది అంటూ నిట్టూర్చారు.అమ్మకు ఉద్యోగం పోయింది.. నాన్న చనిపోయాక ఊరిలో పనులుకు చేసుకునేవాడిని. ఇప్పుడు విజయవాడలో కూలి పనులు చేస్తున్నా. అక్కడ వచ్చే సొమ్ము భార్యా, పిల్లలకు కడుపు నింపేందుకే చాలదు. అమ్మ ఊరి బడిలో ఆయాగా చేసేది. గత ప్రభుత్వంలో బడిలో స్వీపర్‌గా చేరింది. మేం ఎక్కడ ఉన్నా అమ్మకు ఎదో చిన్నపని ఉంది అని భరోసాతో ఉండేవాడిని. ఇటీవల స్వీపర్ ఉద్యోగం తొలగించారు. అమ్మను కూడా ఇకపై నేనే చూసుకోవాలి. ఇంటిళ్లపాది కష్టపడితేనే బతుకు. ఏం చేస్తాం... మధ్యతరగతి కుటుంబాలు మావి. – టి.శ్రీను, ఎం.సింగుపురం, పాలకొండ మండలం -
సంప్రదాయ సంక్రాంతి.. ఇలా చేస్తే మరీ మంచిది
మకర సంక్రాంతి పర్వదినాన ఏం చేస్తే మంచిదా... అని చాలామందికి సందేహం ఉంటుంది. సాధ్యం అయినవాటిని కానీ ఆచరించడం మంచిది. ఈ కింద చెప్పినవి అన్నీ చేస్తే మరీ మంచిది. అవేమిటో తెలుసుకుందాం. మకర సంక్రాంతి నాడు నువ్వుల పిండిని నలుగు పెట్టుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.కూష్మాండదానంసంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్రమైన రోజు. ఈ పర్వదినాన గుమ్మడికాయను దానం చేస్తే దేవతలు సంతోషిస్తారు. పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి జరుగుతుందని పెద్దలంటారు.గోపూజసంక్రాంతినాడు గోపూజ చేసినవారినీ, గోక్షీరంతో పాయసాన్నం వండి తనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారినీ, ఆవుపేడతో ఇంటిముందు కళ్ళాపుచల్లి ముగ్గులు పెట్టినవారినీ సర్వసంపన్నులను చేస్తానని సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మీదేవే చెప్పినట్లుగా మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోగల ఓ కథ చెబుతోంది. పుష్పాలతో పూజఅదేవిధంగా సంక్రాంతినాడు సువాసన గల పూలతో ఇష్టదేవతాపూజ చేయాలనీ, అలా చేస్తే సకలసుఖాలూ కలుగుతాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకే పుష్యమాసంలో ఇంటి నిండా పూలు ఉంచాలనీ, పూలవాసనతో, సురలు సంతోషిస్తారనీ, పూలదర్శనంతో యక్షులు తృప్తి పొందుతారనీ, పూలను అనుభవించి నాగదేవతలు ప్రసన్నులౌతారనీ, దేవతలు వరాలనూ, యక్షులు సంపదలనూ, నాగదేవతలు వంశాభివృద్ధినీ, ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తారనీ పురాణాలు చెపుతున్నాయి. వాటితో పాటు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, కలిగినంతలో దానధర్మాలు చేయడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. – డి.వి.ఆర్. -
స్వరాల సంబురం
ఇప్పుడు తెలుగువారికి పండుగ రోజుల్లో పిండివంటలతో పాటు పాటలు కూడా వస్తున్నాయంటే ఆ ట్రెండ్‌కి సృష్టికర్త ఆమే. తెలుగు జానపద కళాకారులు యూ ట్యూబ్ వేదికగా సృష్టిస్తున్న నేటి సోలో సంచలనాలకు నిన్న నాంది పలికింది ఆమే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఓ కుటుంబానికి చెందిన యువతి.. ఇప్పుడు కోట్లాది మంది తెలుగు లోగిళ్లలో నిత్యం కని–వినిపించే చిరపరిచిత స్వరంగా మారింది. సత్యవతి చౌహాన్ అంటే తెలియని వారుంటారేమో గానీ మంగ్లీ అంటే తెలియని సంగీతాభిమానులుండరు. తెలుగువారి అచ్చమెన పండుగ సంక్రాంతి రోజున తెలుగు పాటల పండుగ మంగ్లీని పలకరించినప్పుడు ఆమె పంచుకున్న జీవితానుభవాల మాలిక ఇది...ఆ విశేషాలు... ఆమె మాటల్లోనే...సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, ఎడ్లపోటీలకు వెళుతుండే. నెల రోజుల ముందుగానే ముగ్గుల కోసం బాగా ప్రిపేరయేదాన్ని, చుక్కలు ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. తెల్లవారు ఝామునే లేచి చలిలో ముగ్గులు వేయడం ఎంత వెచ్చని జ్ఞాపకమో. పండుగ దుస్తుల్లో మెరిసిపోతూ అమ్మాయిలమందరం కలిసి వేప చెట్టుకు తాడు కట్టుకుని ఊయలు లూగేవాళ్లం. మా ఇళ్లలో ఈ పండుగకు పిండి వంటలు స్పెషల్... నువ్వులతో చేసే సిరిపిండి... ముగ్గులు, సద్దల స్వీట్... కజ్జికాయలు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. పండుగలు అంటే అవి మన సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు వాటిని ఆస్వాదించాలి.. ఆ జ్ఞాపకాలను తలచుకోవాలి అందరితో పంచుకోవాలి... అందుకే ఈ పండుగ పాటల ట్రెండ్‌కు నేనే శ్రీకారం చుట్టాను. సంక్రాంతి అంటే అర్ధం పరమార్ధం మొత్తం తెలిసేలా.. స్వర్గీయ కందికొండన్న రాసిన భోగి మంట భాగ్యం, వెచ్చనైన రాగంతో సంక్రాంతి పాటలు మొదలుపెట్టాను. ఆ పాటకు వచ్చిన ఆదరణతో ఆ తర్వాత కూడా పలు సంక్రాంతి పాటలు పాడాను. రంగుల పుట్టిల్లు, తెలుగు లోగిళ్లు. హేమంత మంచులో సూరీడు... పాటల్లో వాడ వాడలా సంక్రాంతి వేడుకలు భీమవరంలో పండుగ సందడి మొత్తం కనిపిస్తుంది.నా వేదిక యూట్యూబ్క్లాసికల్ సంగీతం, క్లాసికల్ డ్యాన్స్ వచ్చి కూడా నేను యాంకర్ గా మిగిలిపోవడం బాధగా ఉండేది. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లని కలవడం ఎలాగో తెలీదు. ఆ సమయంలో యూ ట్యూబ్ అందుబాటులోకి వచ్చింది. ఇండిపెండెంట్æసింగర్‌గా 2017లో యూ ట్యూబ్ లో పోస్ట్ చేసిన ‘రేలా.. రేలారే...’ పాట సూపర్ హిట్ అయి యాంకర్ మంగ్లి సింగర్ మంగ్లిగా ప్రపంచానికి తెలిసింది. ‘తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి.. ’ బతుకమ్మ పాట కూడా దుమ్ము రేపింది. ఆ తర్వాత ‘ఎండికొండలేలేటోడా... నర్సపెల్లె’ ...ఇలా ఒక్కో పాట ఒక్కో మెట్టుగా మారి నా ఎదుగుదలకు నిచ్చెన వేశాయి. ఇక పండుగ పాటల ట్రెండ్‌కి ఊపునిస్తూ సాగిన ప్రతీ పాటా హిట్టే. కంది కొండన్న రాసిన సమ్మక్క సారక్క సాంగ్ వింటే వేరే పుస్తకాలు కూడా చదవనక్కర్లేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. శైలజా రెడ్డి అల్లుడు, జార్జిరెడ్డి సినిమాలలో పాడాను. ఇక రాములో రాములా... పాట నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఆ తర్వాత సారంగదరియా.. రా రా రక్కమ్మ... ఇలా ఒకటొకటిగా నా హిట్ ఖాతాలో పడుతూ నన్ను నిలబెట్టాయి.సింగర్... ఆల్‌రౌండర్...శివుని పాటలు ప్రతియేటా చేయాలని.. చేస్తూ వస్తున్నా. కేదార్‌నాద్‌లో డంగురు డంగురు శివ సాంగ్, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీలో చేశాం. వంద మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కాశీలో ‘సాధు జంగమ.. ’పాటను చిత్రీకరించాం. ఈషా ఫౌండేషన్ వాళ్ల ఆహ్వానం మేరకు 2022లో ఆ వేదిక మీద తొలిసారి పాడాను. ఆ«ధ్యాత్మిక గీతాలతోనే పుట్టి పెరిగినా, ఎదిగినా.. ఏదో ఒక శైలికి పరిమితం కాకుండా అన్ని రకాల పాటలూ పాడాలనేది నా లక్ష్యం. గ్రామీణంలో ఉన్న జానపదాన్ని గ్లోబల్ వైజ్‌గా తీసుకెళ్లాను. సంగీత దిగ్గజాలు సలీం సులేమాన్ , విజయ్‌ప్రకాశ్, ఉషా ఉతప్, సుధా రఘునాథన్ , ఎ.ఆర్.రెహ్మాన్ తో కలిసి పనిచేశాను. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ప్రోగ్రామ్‌లో పాడటం ఎప్పటికీ మర్చిపోలేను.లక్ష్యాలు ఇవే...విదేశాలలో మా సంస్కృతీ సంప్రదాయాలకు గుర్తింపు తెచ్చేలా మా కమ్యూనిటీ కల్చర్ డ్రెస్ వేసుకుని ధరించి పాటలు పాడాను. ఫోక్ సాంగ్స్‌కి సంబంధించి ఒక ఫార్మాట్ చేయాలని, మా బంజారా కమ్యూనిటీ కల్చర్‌ని విశ్వవ్యాప్తం చేయాలని...ఆశ. గుజరాత్, రాజస్థాన్, మరాఠా .. బంజారాల మీద సాంగ్స్ ఇంకా చేయాలని ఉంది. భవిష్యత్తులో నాకు వచ్చిన విద్యను నేర్పించాలని ఉంది. నేను నేర్చుకున్న కర్నాటిక్ శాస్త్రీయ సంగీతంతో కచేరీలు చేయాలని ఉన్నది. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, పురంధర దాసుల వంటి మహామహుల కీర్తనలను నా గొంతుతో రికార్డు చేయాలనుంది. అందుకున్న పురస్కారాలు...∙సంగీత్ నాటక్ అకాడమీ వారి ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్∙ఐఫా, సైమా, గామా..లలో బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్పాట... మా సంస్కృతిమాది ఒక బంజారా వ్యవసాయ కుటుంబం. పాటలు పాడటం మా బంజారా సంస్కృతి, జీవనంలో మమేకమై ఉంటుంది. ప్రకృతే మాకు పాటలు నేర్పిస్తుంది. మాలో చదువుకున్నవారికి తప్ప ఎవరికీ తెలుగు భాష సరిగా రాదు. నాలోని గాయనిని మా నాన్న తర్వాత గుర్తించింది మా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఫాదర్ విన్సెంట్, బృందం.. ప్రతి గ్రామం నుంచి ఎవరెవరిలో ఏయే ప్రతిభ ఉంది... అనేది పరిశీలించి ప్రోత్సహించేవారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అలా నన్ను కూడా వాళ్లే గుర్తించి పాటలు నేర్పించి తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. అప్పుడే సిటీ స్కూల్లో మ్యూజిక్ క్లాసులు, డ్యాన్స్ నేర్పితే డబ్బులు వస్తాయని మా సీనియర్స్ పిలవడంతో హైదరాబాద్‌కి 2013లో వచ్చాను. ఆ సమయంలోనే వి 6 చానల్లో పొలిటికల్ సెటైర్ ప్రోగ్రామ్ మాటకారి మంగ్లీతో నేను మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యాను. ఆ ప్రోగ్రామ్‌లో అప్పుడప్పుడు పాటలు పాడి సింగర్‌గా తృప్తిపడేదాన్ని.– సత్యబాబు, సాక్షి సిటీలైఫ్ ప్రతినిధి -
స్పెషల్ సంక్రాంతి
ఒకవైపు సంక్రాంతి సంబరాలు... మరోవైపు సక్సెస్ సంబరాలతో సుష్మిత కొణిదెల ఫుల్ జోష్‌గా ఉన్నారు. తండ్రి చిరంజీవి హీరోగా ఆమె నిర్మించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఈ సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే సుష్మిత ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇది తనకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’ అంటున్నారామె. ఇంకా సంక్రాంతి పండగ గురించి ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సుష్మిత పలు విశేషాలు పంచుకున్నారు.మా చిన్నప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ మా ఇంటికే పరిమితం. కాలేజ్ టైమ్‌లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పట్నుంచి బెంగళూరులో మా ఫామ్‌హౌస్‌లో జరుపుకోవడం ఆనవాయితీ అయింది. పండగలప్పుడు అందరూ కలిసి మన సంప్రదాయం ప్రకారం జరుపుకోవాలని మా నాన్నగారు అనుకుంటారు. అలా అందరూ కలిసి ఈ పండగ నాలుగు రోజులు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, ఆటలు ఆడుకుంటూ, పిండివంటలు, నాన్‌వెజ్ అవీ తింటూ సరదాగా గడపటం వల్ల బంధాలు బలపడతాయని ఆయన నమ్ముతారు. అది నిజం అని మాకు అర్థం అయింది.వేడి కాఫీ... హాట్ దోసెభోగితో ్రపారంభించి, కనుమ వరకూ మా సెలబ్రేషన్స్ హంగామాగా ఉంటాయి. భోగి రోజున తెల్లవారుజాము ఐదు గంటలకల్లా చలి మంట వేస్తాం. అక్కడే లైవ్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటాం. ముందు వేడి వేడి కాఫీతో మొదలుపెట్టి, రకరకాల దోసెల వరకూ బ్రేక్‌ఫాస్ట్ ఫుల్లుగా లాగించేస్తాం. ముందు మా నాన్న ఒక దోసె వేస్తారు. ఆ తర్వాత ఇంట్లో మిగతా మగవాళ్లు కూడా గరిటె తిప్పుతారు. భోగి రోజు మా ఇంట్లో లేడీస్‌కి దాదాపు రెస్ట్ అన్నమాట (నవ్వుతూ). ఆ తర్వాత లంచ్ కూడా గ్రాండ్‌గా ఉంటుంది. వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియన్ వరకూ బోలెడన్ని వంటకాలు. మా ఇంటికి ఉపాసన వచ్చాక సంక్రాంతి మెనూ ఇంకా పెద్దదైంది. ముఖ్యంగా ఈ పండగకి మేం ‘మిక్సర్’ చేస్తాం. ఆ మిక్సర్ నా ఫేవరెట్. నో డైట్... ఓన్లీ చీట్ అనుకుని, నచ్చినవన్నీ తింటాం.నేను... చరణ్ వేరే జట్టుచిన్నప్పట్నుంచి నాకు కైట్స్ పెద్దగా ఇంట్రస్ట్ లేదు. కైట్స్ అంటే మాత్రం వరుణే (హీరో వరుణ్ తేజ్). తను హైట్‌గా ఉంటాడు కాబట్టి అదో అడ్వాంటేజ్. అయితే సేఫ్టీగా ఎగురవేస్తాం. అలాగే అందరం కలిసి అంత్యాక్షరి ఆడతాం. మా కజిన్ నైనికా గొంతు బాగుంటుంది. ‘మన శంకర వరప్రసాద్‌గారు’లోని ఫ్యామిలీ మాంటేజ్ సాంగ్ తనే పాడింది. ఆ తర్వాత మా పిన్ని పద్మజ కూడా బాగా పాడుతుంది. ఇక ‘టగ్ ఆఫ్ వార్’ (తాడు లాగే ఆట) గేమ్ సందడి భలేగా ఉంటుంది. ఈ గేమ్‌లో నన్ను, చరణ్ (హీరో రామ్‌చరణ్)ని వేరే జట్టులో వేస్తారు. ఇద్దరం ఒకే జట్టులో ఉంటే చీట్ చేస్తామని అలా ΄్లాన్ చేస్తారు. యంగ్æ, మిడిల్ ఏజ్డ్, ఎల్డర్స్... ఇలా మూడు జట్లుగా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడతాం. చిన్నవాళ్లందరం కలిసి కబడ్డీ కూడా ఆడతాం.ఈసారి అమ్మ చీరలే...పండగకి మంచి మంచి ఔట్ఫిట్స్ సెలక్ట్ చేసుకుంటుంటాను. అయితే ఈసారి సినిమాప్రొడక్షన్తో బిజీ కాబట్టి ΄్లాన్ చేయలేదు. మా అమ్మ దగ్గర మంచి మంచి చీరలు ఉన్నాయి. ఆవిడ వార్డ్రోబ్ ఓపెన్ చేసి, నచ్చిన చీరలు కట్టుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి అంటేనే నాకో పెద్ద సెలబ్రేషన్‌లా అనిపిస్తుంది. పల్లెటూళ్లల్లో బాగా చేసుకుంటారు. మేం స్వయంగా విలేజ్‌కి వెళ్లకపోయినా అక్కడ బంధువులు అందరూ కలిసి ఎలా చేసుకుంటారో మేం అలా చేసుకుంటాం. ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయినప్పుడు ఆ స్ట్రెంత్, ఆ వైబ్ వేరు. పిల్లలకు మన సంప్రదాయాలు తెలుస్తాయి... కుటుంబ అనుబంధాల విలువ కూడా తెలుస్తుంది.ఆ డైలాగ్ ఇష్టంఈసారి మా సంక్రాంతి సెలబ్రేషన్ హైదరాబాద్‌లోనే. ‘మన శంకర వరప్రసాద్‌గారు’ రిలీజ్ హడావిడి, ప్రమోషన్, ఇప్పుడు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్‌లో పండగ చేసుకుంటున్నాం. నా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద మా నాన్నగారితో సినిమా తీయడం, అది సూపర్ హిట్ కావడంతో ఇది మాకు ‘సూపర్ సంక్రాంతి... స్పెషల్ సంక్రాంతి’లా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఒక సీన్లో ‘రేఖ... శశిరేఖ’ అని నాన్న చెప్పిన డైలాగ్ నాకు ఇష్టం. మా అమ్మ పేరు (సురేఖ) కూడా ఉంది కాబట్టి, ఆ విధంగానూ ఈ సినిమా నాకు స్పెషల్. అమ్మ మనసు ఎప్పుడూ పిల్లల కష్టం గురించే ఆలోచిస్తుంటుంది. ఆ కష్టం తాలూకు సక్సెస్ గురించి కూడా ఆలోచించదు. ఒకవైపు సినిమాప్రొడక్షన్, పిల్లలను చూసుకుంటూ కష్టపడిపోతున్నావని అమ్మ తెగ ఫీల్ అయ్యేది (నవ్వుతూ). ఇక మేం ఎంజాయ్ చేస్తున్నట్లే అందరూ తమ ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతి జరుపుకోవాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ: డి.జి. భవాని -
గ్లోబల్ ఫెస్టివల్ పొంగల్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతను ప్రతిబింబించే గొప్ప పండుగ పొంగల్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇది ప్రపంచ స్థాయి పండుగగా మారిందని ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, కె.రామ్మోహన్ నాయుడితోపాటు పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ గోపూజ చేశారు. స్వయంగా పొంగలి వండారు. తమిళ సంప్రదాయం ప్రకారం ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పంటలు ఇచ్చే భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పొంగల్ నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. పండుగ పరమార్థంలో రైతన్నల శ్రమ కూడా దాగి ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్న సందేశాన్ని పొంగల్ ఇస్తోందని తెలిపారు. ప్రపంచంలో తమిళులు ఎక్కడున్నా సరే పొంగల్‌ను ఉత్సాహంగా నిర్వహించుకుంటారని, తమిళ సంస్కృతిని సుసంపన్నం చేసుకోవడంలో వారు ముందుంటారని గుర్తుచేశారు. పొంగల్ గ్లోబల్ ఫెస్టివల్‌గా మారడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం ‘‘కృతజ్ఞత అనేది కేవలం మాటలకే పరిమితం కావొద్దని, నిత్య జీవితంలో అది అంతర్భాగం కావాలని పొంగల్ మనకు గుర్తుచేస్తుంది. మనం జీవించడానికి ఎన్నో ఇస్తున్న భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. పొంగల్ పండుగలో భాగం కావడం గర్వంగా భావిస్తున్నా. ప్రపంచంలో ఇప్పటికీ మనుగడలో ఉన్న ప్రాచీన నాగరికతల్లో తమిళ నాగరికత, సంస్కృతి ఉన్నాయి. ఇది శతాబ్దాల జ్ఞానం, సంప్రదాయాల సమ్మేళనం. చరిత్ర నుంచి పాఠాలను స్వీకరిస్తూ భవిష్యత్తుకు దారిచూపుతున్న మహోన్నత సంస్కృతి ఇది. తమిళ వారసత్వం నుంచి స్ఫూర్తి పొందుతున్నాం. సాంస్కృతిక మూలాల ద్వారా బలోపేతం అవుతూ మున్ముందుకు సాగుతున్నాం. ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సుహృద్భావ బంధం ఉండాలన్న పొంగల్ సందేశాన్ని మనమంతా స్వీకరిద్దాం. భవిష్యత్తు తరాల బాగు కోసం భూమి నిస్సారం కాకుండా రక్షించుకోవడం, జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వనరులను తెలివిగా, పరిమితంగా ఉపయోగించుకోవడం అత్యవసరం. ఇందులో భాగంగానే మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ వంటి పథకాలు తీసుకొచ్చాం. ఐక్యత, విశ్వాసం మన బలం. భూమిని గౌరవించుకోవడం మన సంస్కృతిలో అంతర్భాగం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. సందడి చేసిన ‘పరాశక్తి’ టీమ్ కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో తమిళ సినీ నటులు కూడా సందడి చేశారు. తమిళ చిత్రం ‘పరాశక్తి’లో నటించిన శివకార్తికేయన్, రవి మోహన్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ కుమార్ పొంగల్ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పొంగల్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. 1960వ దశకంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక నిరసన కార్యక్రమాల ఆధారంగా పరాశక్తి చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ఇందులో ప్రస్తావించడం పట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రజలకు మోదీ పొంగల్ శుభాకాంక్షలు పొంగల్ సందర్భంగా ప్రధాన మోదీ తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రజలకు బుధవారం లేఖ రాశారు. కష్టపడి పనిచేస్తూ మన జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారికి కృతజ్ఞతలు తెలియజేసే పండుగే పొంగల్ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యంతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ పండుగతో వ్యవసాయం, అన్నదాతలు, గ్రామీణ, జీవితానికి బలమైన అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా కుటుంబాలు కలుస్తుంటాయని, ప్రజలు కష్టసుఖాలు కలబోసుకుంటారని, వారి మధ్య బంధం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఐక్యతా స్ఫూర్తిని పొంగల్ మరింత బలోపేతం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాష అయిన తమిళం మన దేశంలో ఉన్నందుకు మనం గర్వించాలని మోదీ ఉద్ఘాటించారు. -
KSR Show: పోలీసులే దోషులు..! కత్తులు కట్టి
-
Sankranti 2026: కొత్త అల్లుళ్లకు మర్యాదలే వేరు..
విజయనగరం: హరిలోరంగ హరి అంటూ సమస్తం చల్లగా ఉండాలని దీవించే హరిదాసుల కీర్తనలు.. అయ్యగారికి వందనం.. అమ్మగారికి చందనమంటూ డూడూ బసవన్న దీవెనలు.. వేకువజామున జంగమదేవరలు మోగించే గంటలు.. బుడబుక్కలి వాయించే ఢమరుక నాదాలు.. బడాయి పోతూ నాకేం తక్కువంటూనే మామూళ్లడిగే పిట్టల దొరలు.. చమత్కారాలతో చిందులేస్తూ ఎంతోకొంత సమరి్పంచుకుంటే కానీ కదలని కొమ్మదాసరులు.. ఇలా చెప్పుకొంటే పోతే పెద్ద జాబితాయే పెద్ద పండుగది. ప్రతి ఏటా నిర్వహించుకునే హిందువుల అతిపెద్ద సంప్రదాయ పండగకు పట్టణాలు నుంచి సొంత ఊర్లకు తరలివస్తున్నారు బంధువులంతా. ఆకాశమంత ఆనందం.. భూమండలమంత సంతోషం.. జతకలిస్తే ఎలాగుంటుందో సంక్రాంతి సందడి అలా ఉంటుంది. ధనుర్మాసం మొదలైన నాటి నుంచి అంటే నెలరోజుల ముందుగానే పల్లెల్లో పండగ హడావుడి ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని పల్లెల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహించడంతో సందడి ప్రారంభమైంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికివారే సందడిగా ఉండే పండగ సంక్రాంతి మాత్రమే. భోగిపండగ వచ్చేసింది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో పండగను జరుపుకునేందుకు సర్వం సన్నద్ధమయ్యారు. కొత్త అల్లుళ్లకు మర్యాదలే వేరు.. కొత్త అల్లుళ్లకు సంక్రాంతి కానుకగా ద్విచక్రవాహనాలు ఇవ్వడం జిల్లాలో ఆనవాయితీ. ఆ ఏర్పాట్లలో మామయ్యలు మునిగి తేలుతున్నారు. ఇదిగాకుండా ఇంటికొచ్చిన బంధుమిత్రులకు నూతన దుస్తులు పెట్టడం సంస్కృతిగా వస్తోంది. వస్త్ర దుకాణాల్లో ఇటువంటి సందడే కనిపిస్తోంది. జనజాతర సంక్రాంతి మూడు రోజులూ ఎక్కడ చూసినా జనజాతరలానే కనిపిస్తుంది. స్వగ్రామాలకు వచ్చిన వారంతా ఆయా వీధుల్లో తిరుగుతూ తెలిసినవారిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటుంటారు. ఎవరి ఇంటికెళ్లినా ఏదో ఒకటి తినకతప్పదు. పండగ రోజుల్లో అనాథలకు అన్నసమారాధనలు చేసే కుటుంబాలు జిల్లాలో కోకొల్లలు. వచ్చిన అతిథులకు లేకుండా అన్ని మర్యాదలు చేసే సత్సంప్రదాయం జిల్లా ప్రత్యేకత. ఇక పట్టువ్రస్తాల్లో మహిళలు, సంప్రదాయ దుస్తుల్లో యువత మెరిసిపోతుంటారు. మొత్తమ్మీద పండగంటే జిల్లాలోనే చూడాలని ఇక్కడకు తరలివచ్చే అతిథులు అనేకమంది ఉన్నారు. పందెం రాయళ్లకు పండగే.. పండగ సంక్రాంతి పండగ నేపథ్యంలో పందెం రాయళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. మూడురోజుల పాటు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసుకుని మరీ జూదమాడేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. జూదంతో పాటు కోడి పందాలు జిల్లాలో జోరుగా సాగుతాయి. దీనికోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వివిధ జాతుల కోళ్లు బరిలోకి దిగేందుకు కాళ్లు రువ్వుతున్నాయి. అయితే, కోడి, పొట్టేళ్లు పందాలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు. ప్రతి ఇంటా ప్రత్యేక వంట సంక్రాంతికి ప్రత్యేక వంటలు పల్లెల్లో ప్రసిద్ధి. అరిసెలు, పాకుండలు, సున్నుండలు, జంతికలు, కారంబూందీ, కారపూస, బొబ్బట్లు వంటి వంటకాలు సంక్రాంతి ప్రత్యేకమైనవి. అరిసెల్లో నువ్వులు వేసి చేస్తే మరో ప్రత్యేకం. స్వచ్ఛమైన నేతితో, అచ్చమైన బెల్లంతో చేసే సున్నుండలు నోరూరిస్తాయి. భోగిరోజున భోగిమంటలో కాలి్చన వంకాయలతో చేసిన పచ్చడి, మకర సంక్రాంతి నాడు పులిహోర, గారెలు, పాయసం, కనుమకు గ్రామదేవతలకు సమరి్పంచే నైవేద్యాల్లో మాంసాహారం ఉంటుంది. ఇవిగాకుండా ఇష్టాలనుబట్టి తయారుచేసుకునే దద్దోజనం, పొంగలి వంటివి అతిథులకు ప్రత్యేక వంటకాలుగా చెప్పవచ్చు.అన్నింటా సంక్రాంతి.. చిన్ననాటి బాల్య స్నేహితులంతా స్వగ్రామాలకు వస్తుంటారు. అంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సదావకాశం ఇచ్చేది సంక్రాంతే. కుటుంబంలో తరతరాలుగా ఉన్నవారంతా ఒకచోట చేరి కుటుంబాల పండగ నిర్వహిస్తారు. పూర్వ విద్యార్థులంతా కూడా ఒక వేదికపైకి చేరే అపూర్వ కలయిక సంక్రాంతికే చేసుకుంటున్నారు. పిల్లలకు ఇష్టమైన బొమ్మల కొలువు సంక్రాంతి ప్రత్యేకత. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు బొమ్మల కొలువు వద్ద చేసే సందడి అంతా ఇంతాకాదు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీల వంటివి పల్లెల్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్నిచోట్ల చూస్తే కళాకారులకు సత్కారాలు నిర్వహించి సంప్రదాయాన్ని కాపాడుతున్నందుకు కతజ్ఞతలు తెలియజేస్తారు.ఎన్నాళ్లయ్యిందో ఆలకించి ఒక పంక్తి.. ఎన్నేళ్లయ్యిందో ఆరగించి సహపంక్తి అన్నచందాన స్నేహితులంతా కలిసి చెప్పుకొనే ముచ్చట్లు, కుటుంబ సభ్యులంతా కలిసి చేసే భోజనాలు మధురానుభూతులను మిగులుస్తాయి. స్నేహితులతో కలిసి స్వీయచిత్రం దిగాలంటే చరవాణి తెర పట్టనంతగా ఉంటుంది సంక్రాంతి సందర్భం. సంక్రాంతి సందర్భంగా సంప్రదాయ వేషధారణలు చిన్నారులకు పరిచయం చేయాలి. రోజు ఆధునిక దుస్తుల్లో విసిగిపోయినవారికి ఊరటగా ఉంటుంది. -
చెడును దహనం చేసేది భోగి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక అని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు.మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.చెడును దహనం చేస్తూ భోగి, సంతోషానికి , సంవృద్ధికి స్వాగతం పలుకుతూ సంక్రాంతి, పశు సంపదను ప్రేమిస్తూ కనుమ... మీకు, మీకుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2026 -
సంక్రాంతి వేళ ‘టెర్రస్ టూరిజం’.. 20వేల నుంచి లక్ష వరకు..
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్లో ఇంటి పైకప్పులు కూడా కాసులు కురిపిస్తున్నాయి. సంక్రాంతి వేళ అక్కడి ఇంటి పైకప్పులకు డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాయణంలో భాగంగా 1989 నుంచి అహ్మదాబాద్‌లో అధికారికంగా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వేడుకలను 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్స్లర్ ఫెడ్రిక్ మెర్జ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించారు. సుమారు 50 దేశాల నుంచి వెయ్యి మంది తమ గాలిపటాలతో ఇక్కడ వాలిపోయారు. ‘పద పదవే వయ్యారి గాలి పటమా’ అంటూ తమ ప్రతిభను చాటుకున్నారు.పతంగుల పండుగకు మంచి పేరు రావడంతో అహ్మదాబాద్‌లో ఇప్పుడు ‘టెర్రస్ టూరిజం’ఊపందుకుంది. నాలుగైదేళ్లుగా పతంగులను ఎగురవేసేందుకు స్థానికులు తమ ఇంటి పై కప్పులను అద్దెకిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఎంత ఎత్తైన ఇంటి పైకప్పు ఉంటే అంత ఎక్కువ డిమాండ్, అంత ఆదాయం. పోల్స్, ఖాడియా, రాయ్‌పూర్ ప్రాంతాల్లోని ఎత్తైన ఇళ్ల పైకప్పులు పండుగకు ముందే బుక్ అయ్యాయి. పైకప్పుల అద్దెలు రూ.20 వేల నుంచి రూ.లక్షన్నర వరకు పలుకుతున్నాయి. సాధారణంగా ఒక రోజు (24 గంటలు) అద్దె రూ.20–25 వేల వరకు ఉంటుంది. చివరి క్షణాల్లో అది లక్షల్లోకి చేరుతుంది. విదేశీయులే కాదు అక్కడ స్థిరపడిన స్థానికులు కూడా స్వస్థలాలకు చేరుకుంటారు. గాలి పటాలు ఎగురవేసి చెరిగిపోని పాత జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. గాలిపటాలు.. వంటకాల విందు... ఇళ్ల పైకప్పులపై గాలిపటాలే కాదు పసందైన గుజరాతీ సంప్రదాయ వంటకాల విందు కూడా అందిస్తున్నారు ఇంటి యజమానులు. అతిథులకు ఉంధియూ–పూరి, జిలేబీ, భజియా, నువ్వుల చిక్కీ, రుచికరమైన భోజనం వంటివి అందిస్తున్నారు. అంతేకాదు.. మినరల్ వాటర్, కూర్చోవడానికి సోఫాలు–కురీ్చలు, వృద్ధులు–పిల్లల విశ్రాంతి కోసం గదులు కూడా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెర్రస్ టూరిజం వల్ల ఇళ్ల యజమానులకే కాదు, పరిసరాల్లో చిన్న వ్యాపారులకూ మేలు జరుగుతోంది. ఈ పండుగ వేళ్లలో వారు ప్రతిరోజు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు సంపాదిస్తున్నారు. సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా... హోటళ్ల కంటే స్థానిక ప్రాంతాల్లో ఉండడం వల్ల పండుగ వాతావరణాన్ని దగ్గరగా అనుభవించే అవకాశం ఉంటుంది. అలాగే.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. పాత హవేలీలు, ఒకదానితో ఒకటి కలిసిన పైకప్పుల కారణంగా ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది. అందుకే టెర్రస్ టూరిజం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని స్థానికులు చెబుతున్నారు. -
బ్లాక్ మ్యాజిక్ ముగ్గులు గీస్తున్నారు..!
సంక్రాంతి పండుగ వస్తోందంటే.. బడులు, కాలేజీల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం సాధారణమే..! సహజంగా అమ్మాయిలు పొంగల్, రథం, సంక్రాంతి గాలిపటాలు, హరిదాసుతో కూడిన రంగోళీలతో అలరించడం తెలిసిందే..! కానీ, ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది. గడిచిన నాలుగైదు రోజులుగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో రంగోళీ పోటీలో వినూత్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదేంటో తెలిస్తే.. మీరూ షాకవుతారు..! అందమైన రంగవల్లుల స్థానంలో చేతబడి ముగ్గులు వేస్తున్నారు కొందరు పిల్లలు. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో పెట్టినట్లుగా.. చేతబడి బొమ్మలు.. అదే వుడూలను ముగ్గులో పెడుతున్నారు.ఇటీవల హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్ మండల పరిధిలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గుల పోటీ జరిగింది. అంతకు ముందురోజు ఓ కుర్రాడు ముగ్గుల పోటీకి పేరు ఇచ్చాడు. టీచర్లు ఆశ్చర్యంతో.. అదేంట్రా? అమ్మాయిలు కదా? ముగ్గులు వేసేది? అని ప్రశ్నిస్తే.. నేను కూడా ముగ్గు వేస్తాను అంటూ సమాధానమిచ్చాడు. సరేనని అవకాశమిస్తే.. పోటీరోజున సీరియస్‌గా ముగ్గు వేశాడు.జడ్జిమెంట్‌కు టీచర్ల బృందం ఒక్కోముగ్గును పరిశీలిస్తూ.. ఆ కుర్రాడి ముగ్గు వద్దకు వచ్చి అవాక్కయ్యారు. కొందరైతే భయభ్రాంతులకు గురయ్యారు. కారణమేంటంటే.. అచ్చంగా క్షుద్ర పూజల్లో మాంత్రికులు వేసినట్లుగా ఆ కుర్రాడు చేతబడి ముగ్గు వేశాడు. అంతేకాదు..! ఆ ముగ్గు మధ్యలో ఓ చేతబడి బొమ్మను పెట్టి.. దాన్ని సూదులతో గుచ్చాడు. కంగారుపడ్డ టీచర్లు వెంటనే బకెట్ నీళ్లతో ఆ ముగ్గుని చెరిపివేయించారు. ఈ ఉదంతాన్ని మరవక ముందే.. తాజాగా.. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఉండే ఓ కాలేజీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జూనియర్ ఇంటర్ చదివే ఓ అమ్మాయి రంగోళీ పోటీలో ఇదేవిధంగా చేతబడి ముగ్గు వేసి.. భయభ్రాంతులకు గురిచేసింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు అక్కడి టీచర్లు ‘సాక్షి డిజిటల్’కు తెలిపారు. ఈ ఉదంతాలను గురించి వింటుంటే మీకేమనిపిస్తోంది? పిల్లల్లో చేతబడిపై ఆసక్తి పెరుగుతోందా? లేక.. ఈ మధ్యకాలంలో చిన్నాపెద్దా తేడా లేకుండా మూఢనమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారా? ఈ ప్రశ్నలకు సైకాలజిస్టులు అనేక కారణాలను చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్.. అంటే.. చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం పిల్లలపై చాలా సులభంగా పడుతుందంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో చేతబడి సీన్లు ఎక్కువగా ఉండడంతో.. అనుకున్నది సాధించాలంటే.. ఇదొక్కటే షార్ట్‌కట్ అనే భావన పిల్లల్లో త్వరగా వస్తుందని వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమాల్లో మంచి కంటే.. చెడు అనేది చాలా త్వరగా పిల్లల్లో నాటుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సినిమాల్లో మంత్రగాళ్లు చదివే చేతబడి మంత్రాలను పిల్లలు వల్లెవేయడం వంటి కేసులు తమ వద్దకు వచ్చాయని చెబుతున్నారు.ఇక పేరెంటింగ్ నిపుణులు, స్కూల్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు సైతం తప్పు తల్లిదండ్రులదేనని చెబుతున్నారు. పిల్లలను సరిగ్గా పర్యవేక్షించకుండా తమ పనుల్లో బిజీ అవుతున్నారని, చిన్నారులు ఏంచేస్తున్నారో చూసే తీరిక కూడా వారికి ఉండడం లేదని పేర్కొంటున్నారు. నిత్యం మొబైల్ గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూడడంలో బిజీగా మారిపోతున్న చిన్నారులు క్రమంగా ప్రతికూలాంశాలు ఎక్కువగా ఉండే యాప్స్, మంత్రసాధన సంబంధిత యాప్స్‌వైపు మొగ్గుచూపుతున్నట్లు వివరిస్తున్నారు. పిల్లలు ఇలా తయారవ్వడానికి ముమ్మాటికీ తల్లిదండ్రుల పర్యవేక్షణలోపమే కారణమంటున్నారు. -
సంక్రాంతి ఘుమ ఘుమలు
నేతి అరిసెలు.. కొబ్బరి బూరెలు.. కజ్జికాయలు.. కరకరలాడే చక్రాలు.. చక్కలు, బూందీ లడ్డూలు, బెల్లం గవ్వలు.. ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే పిండి వంటకాలెన్నో.. ఎన్నోన్నో.. తెలుగునాట పెద్ద పండుగగా జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో పిండి వంటలది ప్రథమ స్థానం. అందులోనూ అరిసెలది అందెవేసిన చెయ్యి. సంక్రాంతికి సమ్‌థింగ్ స్పెషల్ వంటకమూ ఇదే.. తెలుగింటి ముంగిట మరో 24 గంటల్లో సంక్రాంతి సందడి ప్రారంభం కానుండడంతో పల్లెల్లో ఎక్కడ చూసినా పిండివంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. నేతి అరిసెల సువాసనలు వీధులను చుట్టేస్తున్నాయి. గ్రామాలలో చుట్టుపక్కల నివాసాల వారు, బంధుమిత్రులంతా ఒక చోటకు చేరి కలిసికట్టుగా సంక్రాంతి వంటకాల తయారీలో నిమగ్నమై కనిపిస్తున్నారు. -
భోగికి దూరంగా బూరవిల్లి గ్రామం
శ్రీకాకుళం జిల్లా: గార మండలంలోని బూరవిల్లి గ్రామం భోగి ఉత్సవానికి దూరంగా ఉంటోంది. అన్ని గ్రామాల మాదిరిగా వేకువజామున వేసే భోగి మంట అక్కడ వేయరు. పెద్దల కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని తామంతా కొనసాగిస్తున్నామని అక్కడి గ్రామపెద్దలు చెబుతుంటారు. ఇక్కడ ఉగాది రోజున రైతులు ఏరువాక చేయకుండా, మరో రోజు ముహూర్తం చూసి ఏరువాక చేస్తారు. నాగుల చవితి రోజు కాకుండా అదే నెలలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి రోజున పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు. మంట వేస్తే అరిష్టమని నరసన్నపేట: నరసన్నపేట మండలం చోడవరం, చింతు వానిపేట, బసివలస, గోకయ్యవలస, సుందరాపురం గ్రామాల ప్రజలు భోగి మంటలకు దూరంగా ఉంటారు. ఏళ్ల తరబడి ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మంట వేస్తే గ్రామానికి అరిష్టం కలుగుతుందని వీరి నమ్మకం. అయితే పూజలు, పిల్లలకు భోగిపళ్లు పోయడం వంటి కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుపుతారు. 150 ఏళ్లుగా.. జలుమూరు: లింగాలవలస గ్రామం భోగి పండుగ జరుపుకోదు. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి భోగి మంటే వేయలేదు. 150 ఏళ్ల కిందట గ్రామంలో భోగి పండగ చేసేందుకు కర్రలు, పిడకలు సిద్ధం చేశారు. మంట వెలిగించేందుకు నిప్పు పెడుతుండగా ఒక పెద్ద పులి వచ్చి గ్రామంలో ఓ వ్యక్తిని నోట కరుచుకొని తీసుకెళ్లిపోయిందనే కథ ప్రచారంలో ఉంది. ఆనాటి నుంచి ఇక్కడ భోగి మంట వేయకూడదని పెద్దలు తీర్మానం చేశారు.ఆ రెండు గ్రామాల్లో.. కొత్తూరు: మండలంలోని ఓండ్రుజోల, బడిగాం గ్రామాల్లో భోగి పండుగ జరుపుకోరు. అప్పట్లో మంట దగ్గరకు పులి వచ్చి ఒకరిని ఎత్తుకుపోవడంతో నాటి నుంచి రెండు గ్రామాల్లో భోగి చేసుకోవడం లేదని వృద్ధులు చెబుతున్నారు. ముందురోజే.. కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామంలో భోగి పండుగను ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంప్రదాయంగా వచ్చే భోగికి ముందు రోజు రాత్రి మంట వెలిగిస్తారు. రాత్రి సుమారు 9 గంటలు తర్వాత భోగి మంటకు గ్రామ పెద్దలు నిప్పు పెడతారు. భోగి రోజు యథావిధిగా పిల్లలు పిడకలను మంటలో వేస్తారు. కక్క.. ముక్క.. పెరిగిన లెక్క సంక్రాంతికి ముందే మాంసాహార ధరలు పెరిగాయి. నాటుకోళ్లు, చేపలు, మటన్ ధరలన్నీ బాగా పెరిగాయి. సోమవారం సంతలో నాటు కోళ్లు కిలో రూ. 800కు విక్రయించారు. నాటు కోడి చికెన్ ధర రూ. 1200 ఉంది. మటన్ రూ.900 వరకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.వెయ్యి తాకింది. చెరువు చేపల ధరలు కూడా పెరిగాయి. –నరసన్నపేటహరిలో రంగ హరి సంక్రాంతి అతిథులు వచ్చేశారు. హరిలో రంగా.. హరీ అంటూ హరిదాసులు, భలే దొడ్డ దొరండీ మా బసవన్న అంటూ గంగిరెద్దుల వారు, అంబ పలుకు అంటూ కోయిదొరలు, హరోం హరా అంటూ జంగమ దేవరలు ఊరికి కళ తీసుకువచ్చారు. వీరు వేకువ జాము మొదలు ఆయా గ్రామాల్లో శంఖారావం చేస్తూ ఇంటింటా తిరిగి దీవిస్తున్నారు. –జలుమూరు -
పెద్దపండగకు భాగ్యవంతులొస్తున్నారు!!
సాక్షి,ప్రతినిధి, విజయనగరం: ఆశలు మూటలు నెత్తిన మోస్తూ.. గతంలో తాము నడిచివెళ్లిన బాటల్లో ఆనందపు అడుగులను వెతుక్కుంటూ.. పెద్దపండగకు ఒక్కొక్కరుగా భాగ్యవంతులు ఇంటిల్లిపాదీ చేరుకుంటున్నారు. వారిని వలసకూలీలని సామాజికవేత్తలు అంటున్నా.. నా లాంటి అల్ప సంతోషుల దృష్టిలో వారు నిజమైన భాగ్యవంతులు. వాళ్లంతా ఇక్కడ బతకలేని పేదల ని మేధావులు పేర్కొంటున్నా.. నా లాంటి సామా న్యులకు మాత్రం వాళ్లంతా తమ బతుకులు బాగుచేసుకునేందుకు జిల్లాల హద్దులు దాటిన శ్రమజీవులు. ఏ పల్లెలో చూసినా వారి ముచ్చటే ఎక్కువ. అక్కడ రాత్రీపగలూ శ్రమించి సంపాదించిన నాలుగు రూపాయలతో ఊరిలో ఆనందంగా గడుపుతా రు. సంక్రాంతి తమదే అన్న రీతిన ఊరంతా కలియతిరిగి తిరుగుప్రయాణమవుతారు. ఊళ్లలోకి వచ్చిన భాగ్యవంతుల ముచ్చటకు ‘సాక్షి’ అక్షర రూపం. హైదరాబాద్ నుంచి వచ్చిన అప్పలనాయుడు, లక్ష్మి, నాయుడి వీరకాడు నారాయణ.. వీధి మధ్యన దమట ముట్టించి చుట్టూ కూర్చుని కబుర్లు మొదలెట్టారు.. మరేటిబావా హైదరాబాద్‌లో అంతా బాగు న్నట్టేనా.. అన్న నారాయణ ప్రశ్న పూర్తి కాకుండానే లక్ష్మి అందుకుని.. పర్లేదన్నయ్యా.. ఇద్దరం డ్యూటీకి వెళ్తాం.. మాతోబాటే మా మహేష్ కూడా వస్తాడు. ముగ్గురికి బాగానే వస్తాది.. ఆదివారం సెలవు.. ఒకరి జీతం అద్దెకి.. ఖర్చులకు పోయినా.. రెండు జీతాలు మిగుల్తాయి. ఆ డబ్బులతోనే కదా ఈ ఇల్లు పునాదులు, రేకులు వేయడం, పెద్దదాని పెళ్లి అప్పు లక్షన్నర తీర్చడం.. చిన్నదాని నర్స్ ట్రైనింగ్.. అంతా దాన్లోంచే అంటున్నప్పుడు ఒకనాడు వంద నోటును అబ్బురంగా చూసిన పేదరికాన్ని కష్టంతో దాటుకొచ్చాము అంటున్న లక్ష్మి ఆత్మవిశ్వాసం కని పిస్తుంది. అంతలోనే లక్ష్మి మళ్లీ అందుకుని తిండికి.. గుడ్డకు లోటు లేదన్నయ్యా.. మీ బావకు మాత్రం వారానికి మూడ్రోజులు మాంసాహారం ఉండాలి అంటున్నప్పుడు.. ఆరేడేళ్లు కిందట ఇదే ఊరిలో అడ్డెడు బియ్యం.. తవ్వెడు నూకలికి ఇల్లిల్లూ తిరిగిన జ్ఞాపకాన్ని మర్చిపోలేదు అంటూనే ఇప్పుడు మేం అలా లేం.. మేం కష్టంతో స్థాయిని పెంచుకున్నాం అంటుంది.. పోనిలేరా ఊరిలో అయినోళ్ల ముందు చెడి.. చెయ్యిచాచి బతకడం కన్నా ఊరుదాటి బాగుపడడం మేలని నారాయణ చెబుతుండగా పక్కింటి వదిన చేటలో చెత్త పెంట మీద పారేస్తూ దమటకాడికి వస్తూనే ఏటీ లచ్చిమొదినా.. చెవులోవి కొత్తవా ఏటి అంటూ పలకరించినప్పుడు.. లక్ష్మి మొహం సంతోషంతో వెలిగిపోయింది. అవును మంగొదినా.. ఇన్నాళ్లకు అరుతులం చెయిను అరుతులం జుంకాలు చేయించాడు మీ అన్న య్య అని చెబుతూ... భర్తను మురిపెంగా చూస్తుంటే దమట వెలుగులో జుంకాలు మరింత మెరుస్తూ కనిపించా యి. ఇదిగో ఈ చీర్లన్నీ పెద్దషాపు లో కొనేశాం ఒకేసారి అంటున్నప్పుడు.. అప్పట్లో పాత చీరలకోసం తెలిసినవాళ్లను అడిగిన లక్ష్మి గొంతు నుంచి.. మాకిప్పు డా అవసరం లేదన్న భరోసా వినిపించింది. మొన్నామధ్య యాదగిరి వెళ్లాం.. తిరుపతి కన్నా పెద్దది తెలుసా... అని చెబుతున్నప్పుడు.. మేం.. విహారయాత్రలకూ వెళ్తాం.. మేం అప్పట్లా లేం..అనే ధీమా ముప్పిరిగొంటుంది. పాత్రల పేర్లు మారతాయేమో కానీ ఉమ్మడి విజయనగరంలోని పలు గ్రామాల్లో ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి.. ఆరేడేళ్లు కిందట పూటపుటనూ లెక్కించుకుని జీవించే వందలాది కుటుంబాలు.. కాలాన్ని నిందించలేదు. ప్రభుత్వాలను తిట్టలేదు. కష్టాన్ని నమ్ముకుని ట్రైన్.. బస్సు ఎక్కి.. పని ఉన్న చోటకు వెళ్లాయి. రైస్ మిల్లులు.. నూలు మిల్లులు.. టాబ్లెట్స్.. ప్లాస్టిక్ కంపెనీలు.. చేపలు.. రొయ్యల చెరువులు.. ఫామ్ హౌస్‌లు, కోళ్లఫారాలు.. డైరీ ఫారాలు.. ఎక్కడ పనిదొరికితే అక్కడ చేరిపోయాయి. పాపం అమాయకులు. నిజాయితీగా ఒళ్లొంచి పని చేస్తారు.. అందుకేనేమో కొద్దిరోజుల్లోనే యజమానులకు ఇషు్టలైపోయారు.. చాలామందికి.. చిన్నపాటి షెడ్.. ఇల్లు.. రేషన్ కూడా యజమానులే ఇస్తారు. ఇక ఖర్చేముంది.. మూణ్ణాలుగేళ్లు తిరిగేసరికి తమ జీవితం మారుతుందన్న.. మారిందన్న తేడా వాళ్లకే స్పష్టంగా కనిపిస్తోంది. రూ.కోట్లు లేకపోవచ్చు.. రూ.లక్షలూ అక్కర్లేదు.. శ్రమే పెట్టుబడి.. మూడేళ్లు తిరిగేసరికి మెల్లగా చేతిలో డబ్బు కనిపిస్తుంది.. తమ అభివృద్ధి తమకే తెలుస్తోంది.. ఓపికున్నన్నాళ్లు చేద్దాం.. ఊళ్లోకొచ్చిమాత్రం చేసేదేముందన్న ధీమా.. కష్టంలోనే ఆనందం.. వచ్చే జీతంలోనే సంతోషం.. ఆ పక్కనే సంబరం.. ఇంతకన్నా భాగ్యవంతులెవరు.. డబ్బుమాత్రమే ఉన్నోళ్లు ధనవంతులు అవుతారు. జీవితంలో అన్ని కోణాలూ.. అన్ని భావాలూ.. అన్ని ఎత్తుపల్లాలూ చూసి తమను తాము గెలిచిన వాళ్లు భాగ్యవంతులే... ఓ రాసీరాయని పెన్నుతో వీళ్ల జీవనరేఖలను బ్రహ్మ తన ఇష్టానుసారం రాసేస్తుంటే బ్రహ్మచేతిని ఒడిసి పట్టుకుని అలాక్కాదు... మా రాత మేం రాసుకుంటాం.. నువ్ పక్కకేళ్లు స్వామీ అని గదమాయించి తమ రేఖలను భాగ్యరేఖలుగా మార్చుకున్న కుటుంబాలు కోకొల్లలు... వీళ్లెవరూ పేదలు కారు... అవును పేదలు కారు... అక్షరాలా శ్రామికులు.. కార్మికులు... కృషి.. శ్రమ ఉన్న చోట పేదరికం ఉండదు. దానికి వీళ్లంటే భయమెక్కువ.. పారిపోతుంది.. ఎక్కడికి.. ఇంకెక్కడికి.. సోమరిపోతుల దగ్గరకు..! -
పెద్ద పండగొచ్చింది
అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. బొమ్మల కొలువులు, పేరంటాలు... సంక్రాంతి సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ పిండి వంటలు, పండగ నాడు అవన్నీ పంచటాలు అబ్బో ఊపిరి సలపనంత సందడి. ఇక ఊరంతా ముగ్గుల తివాచీలే. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి పంచుకుంటున్న జ్ఞాపకాలు.పండుగలు ఎన్ని ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. పెద్ద పండుగ సంక్రాంతి. అప్పట్లో అంటే 60 ఏళ్ల కిందట సంక్రాంతి వస్తుంది అంటే అందరికీ సంబరం. ఆ రోజుల్లో అందరివీ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు. సంక్రాంతి అంటే పంట ఇంటికి వచ్చే సమయం. ఆ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికి వచ్చిన పంట ఏ వర్షం వల్లనో నాశనం అయిపోవటం లేదు కాబట్టి అందరికీ వారు పడ్డ కష్టానికి శ్రమ చేతికి అందే సమయం. అందరి చేతిలోనూ డబ్బులు ఆడే ఆ సమయంలో బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్లు, హరిదాసులు వచ్చేసేవాళ్ళు. ఏదో ఒక ఊరిలో బస చేసి రెండు మూడు గ్రామాలు చుట్టపెట్టుకునేవాళ్ళు. ఒక రోజు రెండు రోజులు కాదు సుమారు నెలరోజులు వారి సంచారం ఉండేది. ప్రతి వీధిలో తెల్లవారుజాము నుంచి ముగ్గుల సందడి. ఊరి మొత్తం తివాచీ పరిచారా అన్నట్లు ప్రతి ఇంటి ముందు ముగ్గులే. వాటికి మరింత సొబగు నద్దుతూ గొబ్బిళ్ళు.పెద్ద పండగకు పిల్లా పెద్దా అందరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం ఆనవాయితీ. పల్లెటూర్లలో పదిమంది ఉన్న ఉమ్మడి కుటుంబాల వారి కొత్త బట్టల సరదా ప్రత్యేకంగా ఉండేది. అలవాటుగా బట్టలు కుట్టే దర్జీ మిషన్ తీసుకుని వచ్చి వీళ్ళ వరండాలో తిష్ట వేసేవాడు. అక్కడే బట్టలు కుట్టటం. అత్తవారింటికి వచ్చే కొత్త అల్లుళ్ళు, వాళ్లకు భోగి పండగ రోజున నూనె అంటి స్నానం చేయించే ఇంటి పని వాళ్ళు. ఇంటి ముందు అంత ఎత్తున ఎగసే భోగి మంటలు. భోగి పండ్లు, బొమ్మల కొలువులు, పేరంటాలు. ఆ సందడి వర్ణనాతీతం. ఇంటింటా భారీ ఎత్తున తయారు చేసే పిండి వంటలు, సంక్రాంతి పండగ నాడు అవన్నీ పనివారికి పంచటాలు... అబ్బో ఊపిరి సలపనంత సందడి. మిగిలిన అన్ని పండుగల కంటే సంక్రాంతికి మరొక ప్రత్యేకత కనుమ. పశువుల పండగ. ఏడాది పొడుగునా తమకు వ్యవసాయంలో సాయం చేసిన పశువులకు కృతజ్ఞతగా జరిపే పండుగ. పశువులను చెరువుకు తీసుకువెళ్లి శుభ్రంగా కడిగి తీసుకువచ్చి పసుపు కుంకాలతో, గులాం రంగులతో మెడ పట్టెడలు కొమ్ములకు మువ్వలు కట్టి అలంకరించి ఎంతో ప్రేమతో చేసేవారు పశువుల పండుగ. కాలక్రమేణ కొంత మార్పు వచ్చినా ఈనాటికి ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది సంక్రాంతి. ఈ నాటి పద్ధతి ప్రకారం గుండుసూది మొదలుకొని కారు వరకు, అన్ని వస్తువుల మీద సంక్రాంతి సేల్. ఆకర్షణీయమైన ఆఫర్లు. ఎవరి ఇంటి ముందు వారు ముగ్గు వేసుకోవటంతో సరిపెట్టకుండా ఎంతోమంది ప్రముఖులు పెద్దపెద్ద మైదానాలలో భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి ఘనంగా బహుమతులు అందజేస్తున్నారు. ప్రతి ఊళ్లోనూ ప్రతి కూడలిలోనూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి భోగి మంటలు. గాలిపటాలతో ఆకాశం కొత్త అందాలు సంతరించుకుంటోంది. సంప్రదాయ వంటకాలు రకరకాలు ఇక్కడ తయారై తాజాగా అమెరికా దేశంలో ఉన్న తెలుగువారి కోసం ఆకాశమార్గాన ఎగిరి పోతున్నాయి. గొప్ప వారి కోసం ప్రత్యేకంగా జరిగే కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పండగకు ముందే భాగ్యనగరం నుంచి సగం మంది సొంత ఊర్లకు ప్రయాణం కట్టడంతో పంతంగి టోల్ గేట్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ సంక్రాంతి పండగలో ఒక భాగం అయిపోయింది. అప్పట్లో చదువులు ఇంత భారంగా ఉండేవి కాదు కాబట్టి సంక్రాంతి పండుగకు బోలెడన్ని సెలవులు ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. కాని నగరంలో ఇప్పటికీ కాలనీలలో గంగిరెద్దు వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అన్ని లావాదేవీలు ఫోన్ ద్వారానే కాబట్టి గంగిరెద్దు మొహాన స్కానర్ తగిలించి తీసుకువస్తున్నారు. ఏళ్లు గడిచినా, తరాలు మారినా సంక్రాంతి పండుగ వైభవం మాత్రం తగ్గలేదు. ఈనాటికీ పెద్ద పండుగ సంక్రాంతి.ఇక సంక్రాంతి పండుగ విషయంలో నాకు మాత్రమే సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని మీతో పంచుకుంటాను.అప్పుడు నేను సెకండ్ ఫామ్ అంటే ఇప్పటి ఏడవ తరగతి చదువుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా వ్యాసం రాయమన్నారు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మొదటి నుంచి నాకు కొంచెం అత్యుత్సాహం. మామూలుగా గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు అన్నీ రాసిన తరువాత ఏదైనా కొత్తగా రాయాలి అనిపించింది. ‘సంక్రాంతికి శంకరుడు సంక్రమణమున ప్రవేశించును’ అని రాశాను. మా తెలుగు టీచర్ గారు వేరే మతస్తులు. నేను రాసిన విషయం ఆవిడకి తెలియక మరి కొంతమంది టీచర్లని అడిగారుట. అందరూ ఏమో మాకు తెలియదు అని అన్నారుట. చివరికి అందరూ కలిసి సూర్యుడు మేషరాశి అందు ప్రవేశిస్తాడుగానీ శంకరుడు సంక్రమణమున ప్రవేశించటం ఎవరము ఎక్కడా వినలేదు అని నన్ను పిలిచి నిలదీసి అడిగారు. నేను తలవంచుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్లకు అర్థమైంది అది కేవలం నా అతి తెలివి అని. చక్కగా అక్షింతలు వేసి పంపించారు. మరొక సంక్రాంతి వచ్చింది మన జీవితాల్లోకి. పండగనాడు చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆనందంగా గడపండి. కాస్త మనసు అదుపు చేసుకుని పండగ నాడైనా సెల్‌ఫోన్ పక్కన పెట్టి, టీవీకి దూరంగా అందరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొని ఆత్మీయత పెంచుకుంటే అదే అసలైన పండగ... పదిమందితో జరుపుకునేదే పండగ. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకొని ఆ మధురమైన అనుభూతులతో వచ్చే పండగ కోసం ఎదురుచూడటం జీవితానికి సార్ధకత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. -
బాదం–జీడిపప్పుతో పెరిగిన పుంజులు, పందాల్లో పంచ్‌లు
శ్రీకాకుళం జిల్లా: గోదారి గట్టంత కాకపోయినా సిక్కోలు తీరంలోనూ అక్కడక్కడా సంక్రాంతికి పందెం కోళ్లు తలపడుతుంటాయి. ఈ కోళ్ల పందాలే కాదు.. ఈ పుంజులను పెంచే తీరు కూడా చాలా ప్రత్యేకం. వేకువ జామున నది, కాలువల్లో ఈత కొట్టించి, ప్రత్యేక వ్యాయామం చేయించి, బాదం పిస్తా పెట్టి పెంచుతారు. సాధారణ దాణాతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం తప్పని సరి. రాగులు, బియ్యం, పాలిష్ తవుడు రెండుసార్లు, దినుసులు, నూకలు, అన్నం బాగా కలిపి గోధుమలతో సిద్ధం చేసి రోజుకు ఐదారుసార్లు తినిపిస్తారు. అలాగే దాణా పెట్టిన ప్రతిసారి బాదం, జీడి పప్పు పెడతారు. బొబ్బిలి సెంటిమెంట్ పౌరుషానికి ప్రతీకంగా భావించే బొబ్బిలిని ఇక్కడ పందెందార్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. అక్కడ గుడ్లను తీసుకువచ్చి ఇక్కడ పొదిగిస్తారు. పండక్కి ఒక పది నెలలు ముందుగా పక్కా ప్రణాళిక ప్రకా రం చేస్తారు. పుట్టిన పుంజులను ఎంతో శ్రద్ధతో పెంచి పందెంకోళ్లుగా తీర్చి దిద్దుతారు. బలిష్టంగా తయారవ్వడాని వాటికి ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరి. ఈ జాతికే డిమాండ్.. కోడి పందాలను రెండు రకాలుగా పెడతారు. అందులో మొదటిది కాళ్లకు కత్తి కట్టి పందానికి దించితే పందెం ప్రారంభం నుంచి 20 నిమిషాలకు ముగు స్తుంది. రెండోది ‘డెంకీ’ ఈ పందెంలో కాళ్లకు కత్తి లేకుండా నేరుగా పుంజుకు పుంజుకు పోటీకి ఉసిగొల్పుతారు. ఇందులో రూ.లక్షలు పందెం కాసి, గంటలు కొద్దీ పందాలు జరుపుతారు. కాకి, డేగ, కాకి నెమలి, పింగళి, నెమలి, కాకిడేగ, కక్కిరి, పాసి వంటి జాతులకు డిమాండ్ బట్టి రూ.ఐదు వేలు నుంచి లక్ష వరకూ ఇస్తారు. నదీ తీర ప్రాంతాలతోపాటు కొండపక్కల ఉన్న గ్రామాల్లో పందెందార్లు ప్రస్తుత కోళ్లను సిద్ధం చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకులాం, అంబాజీపేట, జలుమూరు మండలం మాకివలస, పర్లాం, చెన్నా యవలస, సారవకోట మండలం బొంతు, పోలాకి మండలం గంగివలస, సరుబుజ్జిలి మండలం యరగాం, పెద్దసవలాపురం, తెలికిపెంట తదితర గ్రామాలలో ఈ కోళ్ల పెంపకం జరుగుతుంది. -
Sankranti 2026: అక్కడ పండగ అయిపోయింది
సంక్రాంతికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది కదా.. కానీ ఆ సామంత గ్రామాల్లో మాత్రం పండగ అయిపోయింది. గిరిజనులుగా పిలిచే సామంతులకు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారమే అసలైన పండగ. ఆదివారం నాడు వారు అమ్మవారి ప్రతి రూపంగా భావించే వేప చెట్టును పసుపు, కుంకుమతో అలంకరించారు. అమ్మవారి ప్రతి రూపంగా భావించే గజముద్దను పూలతో అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి భక్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. – ఇచ్ఛాపురం రూరల్ఊరికి స్వాగతం పెద్ద పండుగకు ఊరికి వచ్చే వారిని ఓవీపేట వాసి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పాలకొండ–ఆమదాలవలస రోడ్డు లచ్చయ్యపేట కూడలికి ఓవీపేట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రా మానికి బస్సు సదుపాయం లేదు. దీంతో పండగకు వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఆయన ఉచితంగా ఆటో నడుపుతున్నారు. 20వ తేదీ వరకు ఉచితంగానే బండి నడుపుతానని ఆయన చెబుతున్నారు.–శ్రీకాకుళం జిల్లా -
ఆకాశమంతా సంక్రాంతి
తెలుగు వారు ఏడాది మొత్తం వేచి చూసే పండగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండగ వస్తోంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అతివలు ముంగిట్లో అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో గాలిపటాలు ఎగురవేయడం అనేది కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం అయిన విషయం కాదు. జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో గాలిపటం ఎగురేయడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్లో ఉత్తరాయణ సమయంలో ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు సందడి చేస్తాయి. ⇒ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా మేడలపై, మైదానంలో,పోలాల్లోంచి పతంగులు ఎగుర వేస్తారు. మహారాష్ట్ర ప్రజలు కూడా సముద్ర తీరాల్లో ఎగిసే కెరటాల మధ్య గాలిపటాల ΄ోటీలు పెట్టుకుంటారు.⇒ రాజస్థాన్ ఓల్డ్ సిటీలో ఉన్న మేడలపై యువతీ యువకులు అక్కడి ఘేవర్ పేనీలు, నువ్వుల లడ్డూలను ఆస్వాదిస్తూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు.⇒ ఉత్తర ప్రదేశ్‌లో ప్రతీ గల్లీలో పతంగుల పోటీ జరుగుతుంది. ⇒ కలకత్తాలో గ్రూపులుగా ఏర్పడి గాలిపటాలు ఎగరేయడానికి ఇష్టపడగా, కర్ణాటక, తమిళనాడులో బీచుల్లో గాలిపటాలను ఎగరేయడానికి ఇష్టపడతారు.అన్ని రాష్ట్రాల్లో పండగ స్పూర్తి గాలిపటాలు ఎగరవేయడంలోనే కనిపిస్తోంది. ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే ఆశయానికి సంక్రాంతి ఒక వేదికగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ఆకాశం సాక్షిగా చాటే మార్గంగా గాలిపటం నిలుస్తోంది. -
గుంటూరు సంక్రాంతి సంబరాల్లో RK రోజా, అంబటి
-
టోల్‌ప్లాజాల వద్ద కొనసాగుతున్న రద్దీ.. వాహనదారుల ఆగ్రహం!
సాక్షి, యాదాద్రి భువనగిరి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతికి ఇప్పటికే లక్షలాదిగా పట్నంవాసులు ఏపీకి తరలి వెళ్లారు. ఇవాళ రాత్రి వరకు కూడా వాహనాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. లక్షలాదిగా వాహనాలు ఏపీ వైపు వెళ్లడంతో టోల్ ప్లాజా నిర్వాహకులకు సైతం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు.. ఆదాయం వస్తున్నా పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజా నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. -
పండుగను ఆస్వాదిద్దాం
అదే పండగ. కాని తీరు మారింది. గతంలో నలుగురూ కూడి ఆస్వాదన చేసేవారు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదనలో జ్ఞాపకం మిగులుతుంది. ఎంజాయ్మెంట్ క్షణికం. పండుగ చేసుకోవడం సులభమైంది. పెరట్లో పూచే బంతిపూల చెట్ల వరుస నేడు కుండీలు చేరాయి. గ్లోబల్ మార్పుల్లో సంక్రాంతిని కొత్తగా చూడాలి... అంటున్నారు ప్రసిద్ధ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీ దేవి.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వచ్చిన ప్రతి సంక్రాంతి పండగ నాకు బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు మా గిరిజన ప్రాంతపు పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో పంటతో పాటు తోటల నుంచి తాజా చిక్కుడు కాయలు, ఏజన్సీ ముళ్ళ వంకాయలూ, పచ్చి మిరపకాయలు ఇళ్ళకు గుట్టగా వచ్చి పడేవి. తియ్య గుమ్మడి పళ్లు సరేసరి. ‘కొసరి నూరిన పచ్చి పసుపు పూత మొగాన గుమ్మడి పూ దుమారమ్ము నద్ది పండ రేగడి బండి నార కన్పండువై ΄÷లుచు మిర్యపు పండు బొట్టు పెట్టి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వీధి‘ అని రాసేడు ఆనాడెప్పుడో కవి. దేశంలో ఇప్పుడు పంట ఉత్పత్తి పెరిగింది. ఎరువులు, పురుగుల మందులు మనవి కాదనుకుంటే దిగుబడి పెరిగింది. బజార్ల నిండా బంతి పూలు, చేమంతి పూలు విరగబడి ఉంటున్నాయి. ఈ ఏడాది చలి కూడా బావుంది. పుష్యమాసానికి తగినట్టు ఉంది. పాత, పాత సంక్రాంతి రోజులను గుర్తుకు తెచ్చింది. మా గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ ఇంత గ్లోబల్ నాగరికత వల్ల కమ్ముకొన్న ΄÷గ అంతటిలోనూ ధనుర్మాసమంతా వీథి వీథినా వాకిళ్లలో ముగ్గులు పెడుతూనే ఉన్నారు.మధ్యలో కొన్ని సంవత్సరాల పాటు ప్రజలు సంక్రాంతి సంప్రదాయ వేడుకలకు గ్లోబల్ మెరుపుల మధ్య పరాకు పడినట్టయేరు. ఎనభయిల్లో మా రాజవొమ్మంగికి టూరింగ్ టాకీస్ వచ్చినప్పుడు జనం సంక్రాంతి పండగని పక్కన పెట్టి విగబడి సినిమాకి పోయేవారు. ఆ రోజుల్లో పండగ తాలూకు అన్ని సంబరాలూ తగ్గేయి. గ్లోబల్ నాగరికత అలా పండుగను వెనక్కు నెట్టింది. కానీ తిరిగి దేశమంతా మళ్లీ కొత్తదారుల్లో పండుగను వెతుక్కుంటోంది. నా చిన్నప్పుడు మా పెరట్లో పశువుల శాల ఉండేది. అక్కడి ఆవు పేడ తీసుకెళ్లి మా వెదురు కంచె అవతల ఉన్న చింత చెట్టు మాను మీద గిరిజన పిల్లలతో కలిసి పిడకలు వేసేదాన్ని. ఆ చింత చెట్టు మాను దాని చుట్టూ ముగ్గురు చేతులు చాపి కౌగిలించుకుంటే పట్టే అంత పెద్దగా ఉండేది. బహుశా ఒక 300 ఏళ్ల వయసు అయి ఉంటుంది దానిది. భోగి పండగ నాటికి ఆ పిడకలన్నీ గుచ్చి భోగిమంటలో వేయటానికి. ఇది ఒక వారం రోజుల కార్యక్రమం. ఇప్పుడు అమెజాన్ నుంచి డైరెక్ట్‌గా ఆవుపేడ, పిడకలు కూడా వచ్చేస్తున్నాయి. ప్రజలకి ఆ సంప్రదాయం కావాలి, ఎలా దొరికినా సరే. దాంట్లో ఉన్నది అందమా, పుణ్యమా, పురుషార్ధమా అన్నది వేరే విషయం. మేము చదువులకి పట్టణానికి వచ్చినప్పుడు సంక్రాంతి పండక్కి మా పల్లెటూళ్ళకి తరలి వెళ్లే వాళ్ళం. ఎక్కడెక్కడ చుట్టాలూ, బంధువులూ ఇళ్లలో కలిసి పండగ చేసుకునేవారు. ఇవాళ మనిషి రోజులో ఎక్కువ గంటలు సెల్‌ఫోన్‌తో జీవిస్తున్నాడు. కానీ సెల్‌ఫోన్ ద్వారా కూడా చేస్తున్నది సమూహానికి దగ్గర అయ్యే ప్రయత్నమేనేమో. అందులో ఉన్న వాట్సాప్ నిండా ఎన్ని గ్రూపులు ఉంటాయో చెప్పలేం. బయట గ్రూపులే కాక కుటుంబాల గ్రూపులని, కుటుంబాల్లో కజి¯Œ ్స గ్రూపులని, ఒక ఊరి బంధువుల గ్రూపులని రకరకాలు. ఇలా ఒకరినొకరు కలుపుకుంటూ మళ్లీ తిరిగి ఈ పండగలకి ఎక్కడో చోట అందరూ కలవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. కలుస్తూ ఉంటున్నారు. పల్లటూర్లు, రిసార్ట్లు నిండి పోతున్నాయి.తిరిగి అవే అరిసెలు, అవే బొబ్బట్లు, అవే చక్రాలు, అవే పిండి వంటలు. పూర్వం వండుకుని తినేవారు. ఇప్పుడు చేయించుకుని తింటున్నారు. సాంకేతికంగా వస్తున్నటువంటి పెనుమార్పులు చూసినప్పుడు, ఇవి మానవ జీవితంలో తీసుకొస్తున్న సౌకర్యాలను గాని, అలజడులను గాని గమనిస్తున్నప్పుడు మన పాత సరదాలన్నీ వెనక్కి పోయాయా అనే విచారం కలుగుతుంది. కానీ కాస్త జాగ్రత్తగా చూస్తే మనుషులు మళ్ళీ తిరిగి కష్టపడకుండా ఇంకా సులువుగా పండగలను ఎంజాయ్ చేయడానికి సర్వవిధాలా సంసిద్ధులవుతూనే ఉన్నారు. ఇది నగరాలకు కూడా మినహాయింపు కాదు. అసలు జీవితంలో తిండినేనా, అనుబంధాన్నేనా పూర్వం ఆస్వాదించే వారు. ఇప్పుడు ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆస్వాదన వేరు ఎంజాయ్ వేరు. నేను ఎప్పుడో చె΄్పాను– ఈ ఎంజాయ్మెంట్ అన్నది కూడా గ్లోబలైజేషన్ తాలూకు జార్గాన్ అని. ఎంజాయ్మెంట్ క్షణికం. ఆస్వాదనలో జ్ఞాపకం, కొనసాగింపు ఉంటాయి.సంక్రాంతి పండుగ అంటే మూడు నెలల ముందు నుంచి రైలు టికెట్లు దొరక్కపోవడం, బస్సులు కిటికిటలాడుతూ ఉండటం ఇప్పటికీ ఆ పండగ తాలూకు అట్టహాసాన్ని చెప్తూనే ఉన్నాయి. పల్లెటూర్ల నుంచి, ΄÷లాల నుంచి తోటల నుంచి దూరంగా వచ్చేసిన నేను కూడా సంక్రాంతి పండగ ముందు నాలుగు బంతిపూల కుండీలు, నాలుగు చామంతి పూల కుండీలు కొనుక్కుని ప్రతి ఏడాది బాల్కనీలో పెట్టుకుని కవులను తలుచుకుంటూ ఉంటాను. ‘బంతి పువ్వులకు చామంతులకు నెయ్యమును గూర్చి కబరీభరమ్ము చక్కన కుదిర్చి వచ్చె సంక్రాంతి లక్ష్మి మా ఇంటి వైపు’వాడ్రేవు వీరలక్ష్మీ దేవి రచయిత్రి, సాహితీ విమర్శకులు -
Y జంక్షన్ వద్ద ప్రయాణికుల ఇక్కట్లు
-
దారి దోపిడీకి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా!
-
పల్లెబాట పట్టిన హైదరాబాద్ వాసులు
-
సంక్రాంతికి వస్తున్నాం..
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/సూర్యాపేట టౌన్ : నగరం నుంచి పండుగ ప్రయాణాలు మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో పోటెత్తాయి.ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఈసీఐఎల్, మెహిదీపట్నం, అమీర్‌పేట, సాగర్ రింగ్ రోడ్డు, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి శనివారం ప్రయాణికులు భారీ ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతోపాటు మరో 300 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సిటీ బస్సులను సైతం దూర ప్రాంతాలకు నడుపుతున్నారు. శనివారం 75 సిటీ బస్సులను విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట తదితర ప్రాంతాలకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో సైతం పెద్ద ఎత్తున తరలివెళ్లారు. దీంతో విజయవాడ, వరంగల్, కర్నూలు రహదారులు వాహనాలతో పోటెత్తాయి. రైళ్లలో కిక్కిరిసిన జనరల్ బోగీలు... సాధారణ రైళ్లతోపాటు వివిధ మార్గాల్లో సుమారు 60 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా అన్ని రైళ్లలోనూ బెర్తులు బుక్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో తరలి వెళ్లారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి శనివారం పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిత్యం సుమారు 1.85 లక్షల మంది ప్రయాణం చేస్తారు. శనివారం సుమారు 2.20 లక్షల మంది తరలి వెళ్లినట్లు అంచనా, లింగంపల్లి, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. జాతీయ రహదారిపై రద్దీ పండుగ నేపథ్యంలో ప్రజానీకం సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఏర్పడింది. ఈ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం సాయంత్రం 5గంటల వరకు విజయవాడ వైపు 55వేల వాహనాలు వెళ్లాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16టోల్‌బూత్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ వైపునకు 12బూత్‌లు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో నాలుగు బూత్‌ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. అయితే, అదనంగా కేటాయించిన టోల్‌బూత్‌లకు ఫాస్టాగ్ స్కానింగ్ చేసే అవకాశం ఉండదు. స్కానింగ్ వ్యవస్థ వెనుక భాగంలో ఉండడంతో విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు ఆటోమెటిక్ స్కానింగ్‌కు అవకాశం లేదు. దీంతో ఆ నాలుగు బూత్‌ల వద్ద హ్యాండ్ మిషన్ ద్వారా స్కానింగ్ చేస్తున్నారు. ఇందుకుగాను అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రద్దీని తట్టుకునేలా సిబ్బంది హ్యాండ్ గన్లతో సిద్ధంగా ఉంటూ స్కాన్ చేస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సంక్రాంతికి పల్లె బాట.. ఒక్కసారిగా పెరిగిన వాహనాల రద్దీ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు. ఏపీకి వెళ్లే వారి వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి.ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్... విజయవాడ హైవే ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు, రేపు(శని, ఆది) ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ చంద్రశేఖర్ అన్నారు.హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్..హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీ కాలేజీ, ఎంజే మార్కెట్, బేగంబజార్, హైకోర్టు, ఆఫ్జల్‌గంజ్, నయాపూల్ భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. వీకెండ్ సంక్రాంతి సెలవులు, ఎగ్జిబిషన్ కారణంగా రద్దీ నెలకొంది.విజయవాడలో..పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి సొంత గ్రామాలకు ప్రజలు ప్రయాణమయ్యారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో రద్దీ పెరిగింది. ఇవాళ ఉదయం నుండి ప్రయాణికులతో బస్టాండ్లు రద్దీగా మారాయి. -
ట్రాఫిక్ దెబ్బకు కారు వదిలేసి నడుచుకుంటూ..
-
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
రైల్వేస్టేషన్(విజయవాడ): తెలుగింట పెద్ద పండుగ సంక్రాంతికి అనేక ప్రాంతాల నుంచి వారి స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల నుంచి ఏపీలోని ముఖ్యపట్టణాలకు బయలుదేరే ప్రయాణికులతో ఇప్పటికే నడుస్తున్న రెగ్యూలర్ రైళ్లు రిజర్వేషన్లు పూర్తయ్యి వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోయింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ కోసం అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్లాట్‌ఫాంలు కిటకిట.. సంక్రాంతి పండుగకు పాఠశాలలు, కశాశాలలకు సెలవులు రావటంతో విద్యార్థులు, ఉద్యోగులు రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుండటంతో అన్ని ప్లాట్‌ఫాంలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఒకటి, ఆరు, ఏడు ప్లాట్‌ఫాంలలో ఈ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో పాటుగా విజయవాడ, పరిసర ప్రాంతాలలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా విజయనగరం, విశాఖ, కాకినాడ, భీమవరం, నర్సాపూర్, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు స్టేషన్‌కు వస్తుండటంతో ప్లాట్‌ఫాంలు రద్దీగా మారాయి. ప్రైవేటు బస్సులలో చార్జీలు రెట్టింపు వసూలు చేస్తుండటంతో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రైలు మార్గం ఎంచుకోవడంతో రెగ్యులర్ రైళ్లు నెలరోజుల కిత్రమే నిండిపోయి భారీగా వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయింది. దీంతో రైల్వేఅధికారులు ఎప్పటికప్పుడు రద్దీకి అనుగుణంగా డిమాండ్ ఉన్న మార్గాలలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.విజయవాడ మీదుగా 150 ప్రత్యేక రైళ్లు.. హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నర్సాపూర్, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఆ మార్గంలో నడిచే రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 21 వరకు 150 సంక్రాంతి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సంఖ్యను తగ్గించేందుకు సమీపంలోని సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి విజయవాడ మీదుగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో పాటుగా హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా స్టాపేజీ సదుపాయం కల్పించారు. -
పందెం కోడి కయ్యానికి రెఢీ..!
సంక్రాంతి వచ్చిందంటే..కోడి పందేల జోషే వేరు. పండుగ ముందుగానే బరులు సిద్ధమవుతాయి. పందెంకోళ్లు యుద్ధ క్షేత్రంలోకి దిగుతాయి. శిక్షణ పొందిన కోళ్లు హోరా హోరీగా పోట్లాడుతాయి. ఊపిరి ఆగేదాక రక్తం చిందించి మరీ పోరాడతాయి.బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన సంతోషం. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. పందేలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగ సంబరాల్లో కోడి పందేలు ప్రత్యేకం. మూడు రోజుల ముందుగానే జిల్లాలో బరులు సిద్ధమయ్యాయి. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో కోడి పందేల నిర్వాహకులు ఢీ అంటే ఢీ అంటున్నారు. కత్తి కట్టి కదనరంగానికి దూకేందుకు కోళ్లను దువ్వుతున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతం, తీర ప్రాంతాలు, పశి్చమ ప్రకాశంలోని కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించనున్నట్లు సమాచారం. అధికార టీడీపీ నాయకులు బరులు తమ ఆ«దీనంలో ఉంచుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పల్లెసీమల్లో కోడి పందేల జోష్... జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతిసారి కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని తీర ప్రాంతాల్లో ఎక్కువగా కోడి పందేలు నిర్వహిస్తుంటారని వినికిడి. ఈ ఏడాది కూడా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు ముందుగానే బరులు సిద్ధం చేసినట్లు చెప్పుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలోని మోటుమాల, రాజుపాలెం, గవండ్లపాలెం, మడనూరు, రాజుపాలెం పట్టపుపాలెం, గుండమాల గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తుంటారని సమాచారం. ఒంగోలు మండలంలోని కరవది, గుండాయిపాలెం సముద్రం ఒడ్డున, చేజర్ల, పాతపాడు తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ మండలంలోని పాకల, పాత సింగరాయకొండ, ఊళ్లపాలెం, సోమరాజుపల్లి, జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు, పొన్నలూరు మండలంలోని కె.అగ్రహారం గ్రామాల్లో పోటాపోటీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. టంగుటూరు మండలంలోని కొణిజేడు, కొత్తపట్నం మండలంలోని రాజుపాలెం, గవళ్లపాలెం, సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామాల్లో జరిగే పోటీలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు అత్యధికంగా వస్తుంటారని చెప్పుకుంటున్నారు. చీమకుర్తి మండలంలోని తొర్రగుడిపాడు, ఎర్రగుడిపాడు గ్రామాల్లో భారీ ఎత్తున పందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. అలాగే గుడ్లూరు సరిహద్దులోని రామాయపట్నం, కొండపి, సంతనూతలపాడు సరిహద్దుల్లోని మద్దలూరు వాగు ఒడ్డులో కోడి పందేలు నిర్వహించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామాల శివారు ప్రాంతాల్లో కోడి పందేలు పుంజుకుంటున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు మండలాల్లో కూడా అక్కడక్కడా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ.... జిల్లాలో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. చీమకుర్తి రోడ్డు, దర్శి దగ్గర రాజంపల్లి, తాళ్లూరు, తూర్పు గంగవరం, కొత్తపట్నం మండలంలోని మడనూరు గ్రామాల్లో పందెం కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. పందెం కోళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. కోడి పుంజులను వాటి రంగు, ఎత్తు, పోరాట పటిమ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. ఒక్కో కోడి రూ.10 వేల నుంచి లక్ష రూపాయలు విక్రయిస్తుంటారని సమాచారం. ఈ కోళ్లను కొందరు ఇళ్ల వద్దనే పెంచితే మరికొందరు మాత్రం పొలాలు, చెరువుల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వీటికి బాదంపప్పు, పిస్తా, జీడిపప్పుతో పాటుగా కోడిగుడ్లు, మటన్ వంటి పౌష్టికాహారాన్ని తినిపిస్తారు. అలాగే పందేలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.రూ.కోట్లలో పందేలు... జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందేల్లో భారీగా చేతులు మారుతాయని ప్రచారం జరుగుతోంది. పందెంకాసిన దానికి రెట్టింపు లాభం వస్తుండడంతో బెట్టింగ్ రాయుళ్లు కొందరు అప్పులు చేసి మరీ పందెం కాస్తుంటారని ప్రచారం జరుగుతోంది. రెండు గ్రూపులను కలిపి జోళ్లు అని పిలుస్తుంటారని, జోళ్లు పందెం కాసినవాళ్లు లక్ష, రెండు లక్షల రూపాయలు కాస్తుంటారని చెబుతున్నారు. ఇలాంటి పోటీలకు నెల్లూరు, గుంటూరు నుంచి ఇక్కడకు వస్తుంటారని సమాచారం.నెమలి...అబ్రాస్...సీతువా... పందెం కోళ్లను చాలా మక్కువగా పెంచుతుంటారు. వాటికి ఖరీదైన ఆహారం ఇస్తుంటారు. అంతేకాకుండా ముద్దుగా నెమలి, అబ్రాస్, సీతువా వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కాకిడేగ, కక్కెర, రసంగి, పింగల, కాశీ, కొక్కెరాయి వంటి పేర్లతో పిలుస్తుంటారు. కత్తి కట్టి కదన రంగంలోకి... కోడి పందేల సమయంలో పందెం కోళ్లకు కత్తి కట్టి బరిలోకి దింపుతారు. హోరాహోరీగా జరిగే పోరులో ఓటమిపాలైన కోడి కత్తి గాయాలతో తీవ్రంగా గాయపడి మరణిస్తుంటాయి. వన్యప్రాణి ప్రేమికుల విజ్ఞప్తి మేరకు పందెం సమయంలో కత్తి కట్టకూడదని ప్రభుత్వం ఆదేశాలున్నాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పట్టించుకునే వారు లేరు. సంప్రదాయం ప్రకారం సరదాగా కోడి పందెం నిర్వహిస్తున్నట్లు చెబుతున్న నిర్వాహకులు దీన్ని ఫక్తు వ్యాపార ధోరణిలోనే సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పందెం కోళ్లకు కత్తులు తయారు చేసేవారున్నారు. నగరంతో పాటుగా అనేక మండలాల్లో కత్తులు తయారు చేస్తున్న సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పోలీసుల అనుమతి కోసం ఒత్తిళ్లు... సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో కోడి పందేలు నిర్వహించుకోడానికి పోలీసుల అనుమతి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు విముఖంగా ఉండడంతో ప్రభుత్వ పెద్దల నుంచి చక్రం తిప్పేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయతి్నస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కోడి పందేలకు ఇలాగే అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఏడాది కూడా పోలీసుల అనుమతి ఇప్పించాలని అధికార పార్టీకి చెందిన నిర్వాహకులు కోరుతున్నారు. -
సంక్రాంతి రష్.. భారీగా ట్రాఫిక్ జామ్
-
సంక్రాంతి ప్రయాణం.. MGBSలో భారీ రద్దీ..
-
హెవీ ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసిన పంతంగి టోల్ ప్లాజా
-
Hyd: సంక్రాంతి పండుగ రద్దీ షురూ..
హైదరాబాద్: సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. ప్రధానంగా నగరాలను నుంచి పల్లెలకు వెళ్లే జనం.. శుక్రవారం(జనవరి 9వ తేదీ) నుంచే క్యూకట్టేశారు. దాంతో హైదరాబాద్ బిజీబిజీగా కనిపిస్తోంది. నిన్న రాత్రి నుంచే సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. ప్రధానంగా ఏపీకి వెళ్లే ప్రయాణికులతో అటు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. మరొకవైప ఇప్పటికే పంతంగి టోల్‌ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు. సంక్రాంతి నేపథ్యంలో హైవే 65పై ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.విజయవాడ వైపు టేకుమట్ల వద్దపాత డైవర్షన్ ఎత్తివేశారు. రాజమండ్రి-విశాఖ వైపు వెళ్లే వాహనాలు నకిరేకల్‌వైపు మళ్లిస్తున్నారు. హైదరాబాద్-గుంటూరు వెళ్లేవాహనాలు నార్కెట్‌పల్లి వైపు మళ్లిస్తున్నారు. నియంత్రణకు చర్యలు..సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి, కాచిగూడ స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైళ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ప్రతిరోజూ 2.2 లక్షల మంది.. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రస్తుతం సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రతి రోజు సగటున 2.2 లక్షల మంది ప్రయాణం చేయనున్నారు. లింగంపల్లి నుంచి 50 వేల మంది, నాంపల్లి నుంచి మరో 35 వేల మంది ప్రయాణం చేయనున్నట్లు అంచనా. దీంతో అన్నిచోట్లా అదనపు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్లో 17 టిక్కెట్ బుకింగ్ కేంద్రాలతో పాటు 20 ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్లను అందుబాటులో ఉంచారు. తొక్కిసలాటకు తావివ్వకుండా.. రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు తొక్కిసలాట వంటివి చోటుచేసుకోకుండా ఆరీ్పఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో అవసరమైన సహాయ సహకారాలను అందజేసేందుకు టీటీఈలను అదనంగా నియమించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా, ప్రస్తుతం ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు పార్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ.. పరిమితంగా పికప్,డ్రాప్ సదుపాయం మాత్రం ఉంటుంది. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ వైపు విశాలమైన పార్కింగ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, తదితర అన్ని సదుపాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు.అదనపు ఏర్పాట్లు ఇలా.. పదో నెంబర్ ప్లాట్‌ఫామ్ గేట్– 2, గేట్– 4 వద్ద కొత్త హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లోని 24 రైళ్లకు లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో అదనపు హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. టికెట్ బుకింగ్ కౌంటర్లను పెంచారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో ఉంచారు. రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన ‘రైల్‌వన్’ యాప్ ద్వారా సాధారణ టికెట్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు 3 శాతం రాయితీ లభించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.


