జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు | Sankranti 2026: grand traditional celebrations At japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు

Jan 19 2026 11:50 AM | Updated on Jan 19 2026 11:58 AM

Sankranti 2026: grand traditional celebrations At japan

సంక్రాంతి-2026 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొసమెరుపుగా జనవరి 10న రోజంతా సాగిన శాస్త్రీయ మరియు సినీ నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు, జపనీస్ వారికి చిరస్మరణీయ అనుభూతిని కలిగించాయి. 

ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా తదుపరి తరాలకు అందించే రీతిలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

(చదవండి: కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement