బుజ్జి కోతి ‘పంచ్‌’.. మరో వైరల్‌ వీడియో | Monkey Punch Finally Accepted By His Troop With Heartwarming Hug, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బుజ్జి కోతి ‘పంచ్‌’.. మరో వైరల్‌ వీడియో

Feb 21 2026 10:48 AM | Updated on Feb 21 2026 12:06 PM

Monkey Punch Finally Accepted By His Troop With Heartwarming Hug

ఇచికావా సిటీ జూలో నివసిస్తున్న ఏడు నెలల మెకాక్ కోతి 'పంచ్-కున్' ఎట్టకేలకు తన గుంపులో చోటు సంపాదించుకుంది. ఒక పెద్ద కోతి ఈ బుజ్జి పంచ్‌ని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా హత్తుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మగా భావించి ఒక బొమ్మను పట్టుకుని తిరుగుతూ పంచ్ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ కోతి పిల్ల పుట్టిన వెంటనే తల్లి వదిలేసి పోయింది. ఆ తల్లి బంధాన్ని తెంపుకుని పోయింది. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉంటున్ప పంచ్‌.. అమ్మ కోసం అది పడే బాధను చూసి జూ అధికారులు దానికో ఉరాంగుటాన్‌ బొమ్మను ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బొమ్మలోనే తన తల్లిని చూసుకునేది.

తన జాతి నుంచి రోజుల తరబడి తిరస్కరణను గురైన బేబీ పంచ్.. ఎట్టకేలకు ప్రేమను అనుభవించింది. ఓ పెద్ద కోతి చిన్నారి పంచ్‌ను గట్టిగా హత్తుకుని భరోసా ఇచ్చిందంటూ అని వీడియోను ఒక నెటిజన్‌ షేర్‌ చేశాడు. ఈ వీడియోలో ఒక పెద్ద కోతి పంచ్‌ను సున్నితంగా నిమురుతూ కనిపించింది. ఇలా నిమరడం అనేది నమ్మకాన్ని పెంచుకోవడం, తమ బంధాన్ని బలపరుచుకోవడమేని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement