ఒక్కసారి చార్జ్‌తో 468 కిలోమీటర్లు
ఎక్స్ షోరూం ధర రూ. 9.69 లక్షలు
బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ రూ. 6.49 లక్షలకే ..!
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(పీవీ) కొత్త టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ రూ.9.7 లక్షలుగా ఉంది. బ్యాటరీ యాజ్ ఏ సరీ్వసెస్(బీఏఏఎస్) ఫైనాన్స్ ఆప్షన్‌తో రూ.6.5 లక్షలు (ఎక్స్–షోరూమ్)కే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత కస్టమర్లు ప్రతి కిలోమీటరుకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ ఈఐఎంలు కిలోమీటరుకు రూ.2.6 నుంచి ప్రారంభమవుతాయి.
బ్యాటరీ–రేంజ్
పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ 40 కేడబ్ల్యూహెచ్, 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఇందులో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేశారు. ఈ పవర్‌ట్రెయిన్ సింగిల్ చార్జ్‌పై ఏఆర్‌ఏఐ–సర్టిఫైడ్ 468 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో 355 కిలోమీటర్ల కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇక 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఏఆర్‌ఏఐ ప్రమాణాల ప్రకారం 365 కి.మీ రేంజ్ ఇస్తుంది.
ఈ మోడల్‌లో 65 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీనితో బ్యాటరీని 26 నిమిషాల్లో 20–80% వరకు చార్జ్ చేయవచ్చు, 15 నిమిషాల్లో 135 కి.మీ రేంజ్ టాప్–అప్ చేయవచ్చు. ఎంట్రీ సెగ్మెంట్‌లో 40 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో 350 కిలోమీటర్ల రియల్–వరల్డ్ రేంజ్ అందించే తొలి కారు టాటా పంచ్ ఈవీగా రికార్డు సృష్టిస్తోందని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర పేర్కొన్నారు.


