7 బూస్టర్ చర్యలు ప్రకటించిన కేంద్రం
వరల్డ్ మార్కెట్ వైపు సర్కార్ పుష్
క్రెడిట్ నుంచి లాజిస్టిక్స్ వరకు సపోర్ట్
ఈ–కామర్స్ ఎగుమతులకు ఎక్స్‌ట్రా కేర్
రూ. 25 000 కోట్ల మిషన్ స్టార్ట్
కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: దేశ ఎగుమతులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు కీలక చర్యలను ప్రకటించింది. లోకల్ ప్రొడక్ట్ గ్లోబల్ మార్కెట్ అనే కొత్త గేమ్ చేంజర్ విధానానికి తెరతీసింది. రూ. 25,060 కోట్ల ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌లో భాగంగా ఈ చర్యలను అమలు చేయనున్నారు. ఈ–కామర్స్ ఎగుమతి సంస్థలకు రుణ సాయం, ఎగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ సాధనాలు తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. దీంతో చిన్న వ్యాపారులకు ఎగుమతుల పరంగా కొత్త మార్కెట్లలో కొత్త అవకాశాలు దక్కనున్నాయి.
→ ప్రత్యక్ష ఈ–కామర్స్ రుణ సదుపాయం కింద.. రూ.50 లక్షల వరకు రుణాన్ని 90 శాతం హామీపై ఈ–కామర్స్ ఎగుమతిదారులకు ఇవ్వనున్నారు.
→ ఓవర్సీస్ ఇన్వెంటరీ క్రెడిట్ ఫెసిలిటీ కింద రూ.5 కోట్ల వరకు రుణాన్ని 75 శాతం గ్యారంటీ కవరేజీతో ఇవ్వనున్నారు. 2.75 శాతం మేర వడ్డీ రేటులో రాయితీ లభిస్తుంది. ఒక ఏడాదిలో ఇలా ఇచ్చే వడ్డీ రాయితీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు.
→ ఎగుమతులకు సంబంధించి రావాల్సిన చెల్లింపులపై రుణ సదుపాయం కలి్పంచడం (ఫ్యాక్టరింగ్) ఇందులో ఒకటి. ఆర్‌బీఐ/ఐఎఫ్‌ఎస్‌సీఏ నమోదిత కంపెనీల ద్వారా చేసే లావాదేవీలపై ఫ్యాక్టరింగ్ వ్యయంలో 2.75 శాతం వడ్డీ రాయితీగా ఇవ్వనున్నారు. ఎంఎస్‌ఎంఈల మూలధన నిధుల అవసరాలకు ఇది పరిష్కారం చూపుతుందని కేంద్రం భావిస్తోంది.
→ ఒక ఎంఎస్‌ఎంఈకి ఏడాదిలో సాయం రూ.50 లక్షలకు పరిమితం.
→ విదేశీ గోదాములు, ఫుల్‌ఫిల్‌మెంట్ సదుపాయాలు, ఈ–కామర్స్ హబ్‌లను ఎగుమతిదారులు వినియోగించుకుని అంతర్జాతీయ పంపిణీ నెట్‌వర్క్‌లతో అనుసంధానమయ్యేందుకు వీలుగా.. ఆమోదిత ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం సాయాన్ని మూడేళ్ల కాలానికి అందించనున్నారు.
→ ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంతాల్లోని ఎగుమతిదారులు భౌగోళికంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతల నుంచి ఉపశమనం కల్పించేందుకు, లాజిస్టిక్స్ ఇంటర్‌వెన్షన్ ఫర్ ఫ్రైట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (లిఫ్ట్)ను తీసుకొచ్చారు. దీని కింద ఒక్కో ఎగుమతి సంస్థకు అయ్యే రవాణా వ్యయంలో 30 శాతం రీయింబర్స్‌మెంట్ (తిరిగి పొందడం/సబ్సిడీ) లభిస్తుంది. ఒక్కో ఎగుమతి సంస్థకు (ఐఈసీ) గరిష్టంగా రూ.20 లక్షల వరకే ఇది పరిమితం.
→ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) అంతర్జాతీయ మార్కెట్లలో రాణించేలా చూడడమే ప్రభుత్వ చర్యల ఉద్దేశమని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విస్తరణతో భారత ఎగుమతిదారులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఇప్పటికే చేసుకున్న తొమ్మిది ఎఫ్‌టీఏలతో ప్రపంచ జీడీపీలో 70% మేర, ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండొంతుల మేర భారత సంస్థలకు అందుబాటులోకి రానున్నట్టు చెప్పా రు. అంత ర్జాతీయ వాణిజ్య ప్రయోజనాలు ప్రతీ ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్, వ్యాపారవేత్తకు అందుబాటులోకి రావాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతిదారులకు నిధుల వ్యయాలు దిగొస్తాయని, వాణిజ్య రుణాలకు మరిన్ని మార్గాలు ఏర్పడతాయని లాజిస్టిక్స్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది.


