country exports
-
ఎగుమతుల్లో పావు శాతం
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు దేశ ఎగుమతుల్లో గణనీయమైన వాటా ఆక్రమిస్తున్నాయి. 2024–25లో నమోదైన మొత్తం ఎగుమతుల్లో ఈ రంగాల వాటాయే 50 శాతంగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా 26.67 శాతం వాటాతో ఇంజనీరింగ్ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఆ తర్వాత 11.85 శాతం ఎగుమతులు వ్యవసాయ రంగం నుంచి నమోదవగా.. ఫార్మా 6.96 శాతం, ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 8.82 శాతం చొప్పున ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో అత్యధికంగా ఎల్రక్టానిక్స్ నుంచి 32.46 శాతం మేర వృద్ధి నమోదైంది. 2023–24లో 29.12 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు జరగ్గా.. 2024–25లో 38.58 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2021–22లో ఇవే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 15.7 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే మూడేళ్లలో 130 శాతం వరకు వృద్ధి చెందాయి. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో కంప్యూటర్ హార్డ్‌వేర్, పెరిఫెరల్స్ వాటా 3.8 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 101 శాతం పెరిగాయి. యూఏఈ, అమెరికా, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇటలీ భారత ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎగుమతులు 117 బిలియన్ డాలర్లు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2023–24తో పోల్చి చూస్తే 2024–25లో 6.74 శాతం పెరిగి 117 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎగుమతులకు అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. 2014–15 నుంచి 2020–21 వరకు దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు 73–83 బిలియన్ డాలర్ల మధ్య ఉండగా.. 2021–22లో 112 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అప్పటి నుంచి ఇవి ఏటా 100 బిలియన్ డాలర్లకు పైనే ఉంటున్నాయి. ఔషధాల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 9.4% పెరిగి 30.47 బిలియన్ డాలర్లకు చేరగా, వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు 7.36% పెరిగి 52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 200 దేశాలకు ఫార్మా ఎగుమతులు భారత్ నుంచి 200 దేశాలకు ఔషధాల ఎగుమతులు జరుగుతున్నట్టు వాణిజ్య శాఖ డేటా తెలిజేస్తోంది. ముఖ్యంగా 2014–15 నుంచి ఫార్మా ఎగుమతులు ఏటేటా పెరుగుతూ వెళుతున్నాయి. వ్యవసాయ రంగం నుంచి మసాలా దినుసులు, కాఫీ, టీ, పొగాకు, బియ్యం, పండ్లు, కూరగాయాలు, సముద్ర ఉత్పత్తుల్లో సానుకూల వృద్ధి నమోదైంది. దినుసుల ఎగుమతులు 4.45 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. చైనా, అమెరికా, యూఏఈ, బంగ్లాదేశ్, థాయిలాండ్ మసాలా దినుసులను ఎక్కువగా దిగుమతి చేసుకున్నాయి. మిరప, పసుపు, అల్లం, జీలకర్ర ఎగుమతులు ప్రధానంగా ఉన్నాయి. కాఫీ ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి కాఫీ ఎగుమతులు 1.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023–24లో కాఫీ ఎగుమతులు 1.29 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కాఫీ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ఇటలీ, రష్యా, జర్మనీ, యూఏఈ, బెల్జియం, యూఎస్‌కు రొబుస్టా కాఫీ ఎక్కువగా ఎగుమతి అయింది. దేశీయంగా కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంటే, కేరళ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలకు చెందిన కొన్ని రకాల కాఫీలకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఉండడం సానుకూలిస్తోంది. ఇక తేయాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 0.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు తేయాకు తయారీలో 81 శాతం వాటా కలిగి ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు 2 బిలియన్ డాలర్లు 2024–25 సంవత్సరం ఎగుమతుల్లో పొగాకు ఉత్పత్తులు 1.98 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2023–24లో నమోదైన 1.45 బిలియన్ డాలర్లతో పోల్చితే మెరుగైన వృద్ధి కనిపించింది. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి పరంగా భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా యూఏఈ, బెల్జియం, ఇండోనేషియా, ఈజిప్ట్, యూఎస్ఏ, టరీ్కకి పొగాకు ఎగుమతులు జరుగుతున్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, యూపీ, కర్ణాటక పొగాకు ఉత్పత్తిలో కీలక వాటా ఆక్రమిస్తుండగా, సుమారు 4.57 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. జోరుగా బియ్యం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో 12.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023–24లో ఇవి 10.4 బిలియన్ డాలర్లుకు చేరాయి. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, యూఎస్ఏ, యేమెన్కు బియ్యం ఎగుమతులు అధికంగా జరిగాయి. ఆ తర్వాత కూరగాయల ఎగుమతులు 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ద్రాక్ష, దానిమ్మ, మామిడి, అరటి, టమాటా ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక సుమద్ర ఉత్పత్తుల ఎగుమతులు 7.2 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
2030 నాటికి సేవల ఎగుమతులదే పైచేయి
న్యూఢిల్లీ: దేశ ఎగుమతుల్లో వస్తువులను సేవలు అధిగమించనున్నాయి. 2030 మార్చి నాటికి 618.21 బిలియన్ డాలర్లకు (51.92లక్షల కోట్లు) చేరుకుంటాయని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్’ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. అదే కాలంలో వస్తు ఎగుమతుల విలువ 613 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. 2018–19 నుంచి 2023–24 వరకు దేశ వస్తు ఎగుమతులు ఏటా 5.8 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందాయని, ఇదే కాలంలో సేవల ఎగుమతులు 10.5 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగితే 2030 మార్చి నాటికి సేవల ఎగుమతులు 618.21 బిలియన్ డాలర్లకు, వస్తు ఎగుమతులు 613 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా కట్టింది. ఐటీ, సాఫ్ట్వేర్, ఓబీఎస్ హవా.. భారత సేవల రంగం వృద్ధిలో అధిక భాగం సాఫ్ట్వేర్, ఐటీ సేవలు, ఇతర వ్యాపార సేవల (ఓబీఎస్) నుంచే ఉంటోందని.. 2023–24 ఎగుమతుల్లో వీటి వాటా 86.4 శాతంగా ఉన్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. ఓబీఎస్ పరిధిలోని న్యాయ సేవలు, అకౌంటింగ్, పన్ను సంబంధిత సేవలు, మేనేజ్మెంట్ కన్సలి్టంగ్, మార్కెట్ పరిశోధన కలిపి 2023–24లో 10.28 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదైనట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. మొత్తం సేవలు ఎగుమతుల్లో ఓబీఎస్ వాటా 33.2 శాతంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో అత్యంత నైపుణ్య మానన వనరులు, అభివృద్ధి చెందుతున్న ఐటీ సదుపాయాలు అంతర్జాతీయ సేవల కేంద్రంగా భారత్ ప్రతిష్టను పెంచుతున్నట్టు జీటీఆర్ఐ తెలిపింది. జెనరేటివ్ ఏఐ, మెషిన్ లెరి్నంగ్(ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) భారత కంపెనీల అవకాశాలను అధికం చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘సాఫ్ట్వేర్, ఐటీ సేవలు అతిపెద్ద విభాగంగా ఉండగా, వృద్ధిలో ఈ విభాగాన్ని ఓబీఎస్ దాటిపోనుంది. ప్రత్యేకమైన సేవలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. యూఎస్ వెలుపల ఐటీ సేవల విస్తరణ.. యూఎస్‌కు బయట ఐటీ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం మొదట చేయాల్సిన పనిగా జీటీఆర్ఐ పేర్కొంది. దేశ ఐటీ ఎగుమతుల్లో 70 శాతం యూఎస్‌కే వెళుతున్న నేపథ్యంలో, అక్కడి విధానాల్లో మార్పుల రిస్క్ ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. ‘‘ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఔట్సోర్స్ను విమర్శించడం, హెచ్–1బి వీసా పాలసీల కట్టడి తదితర విధానాలు ఈ రిస్‌్కలను గుర్తు చేస్తున్నాయి. ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ) 40 శాతం మేర ఐటీ ఉద్యోగులకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది’’అని శ్రీవాస్తవ తెలిపారు. ఇతర మార్కెట్లకు విస్తరించడం, డిజిటల్ పరివర్తిన, ఏఐ ఇంటెగ్రేషన్ యూఎస్‌పై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఓబీఎస్ ఎగుమతులను ప్రోత్సహించాలని జీటీఆర్ఐ నివేదిక సూచించింది. ఈ విభాగంలో ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నప్పటికీ, భారత సంస్థలు పూర్తి స్థాయిలో వినియోగంచుకోవడం లేదని పేర్కొంది. ఇంజనీరింగ్, పరిశోధన, మేనేజ్మెంట్ నిపుణులకు అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలపై అవగాహన పెరిగితే వృద్ధి అవకాశాలను మరింత ఇతోధికం చేసుకోవచ్చని తెలిపింది. -
ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్న ఆందోళనల నడుమ దేశ ఎగుమతులు ప్రోత్సాహకర స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ నెలలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 39.2 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. చివరిగా 2022 జూన్ నెలలో ఎగుమతుల్లో 30 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసి గణాంకాలను పరిశీలించగా.. అక్టోబర్‌లో దిగుమతులు 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో దిగుమతులు 63.86 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ముడి చమురు దిగుమతులు 13.34 శాతం పెరిగాయి. దీంతో వాణిజ్య లోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 27.14 బిలియన్ డాలర్లకు చేరింది. సెపె్టంబర్ చివరికి ఇది 20.8 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలతో పోల్చి చూస్తే వాణిజ్య లోటు 3.29 బిలియన్ డాలర్ల మేర తక్కువగా ఉంది. చమురు, నూనెల దిగుమతులు అధికం.. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఎగుమతులు 3.18 శాతం పెరిగి 252.28 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 5.77 శాతం ఎగసి 416.93 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏడు నెలల కాలంలో వాణిజ్య లోటు 164.65 మిలియన్ డాలర్లకు ఎగిసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 149.67 బిలియన్ డాలర్లుగా ఉంది. → ఏప్రిల్–అక్టోబర్ మధ్య సేవల ఎగుమతులు 216 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 192 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → అక్టోబర్‌లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 40 శాతం పెరిగి 11.25 బిలియన్ డాలర్లకు చేరగా.. ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు 46 శాతం వృద్ధితో 3.43 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. → వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 36 శాతం మేర పెరిగాయి. → బంగారం దిగుమతులు సైతం సెపె్టంబర్లో ఉన్న 4.39 బిలియన్ డాలర్ల నుంచి అక్టోబర్‌లో 7.13 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. క్రితం ఏడాది అక్టోబర్‌లో 7.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → ముడి చమురు దిగుమతులు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 18.2 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. -
ఎగుమతుల లక్ష్యం మిస్...
⇒ 2014-15లో లక్ష్యం 340 బిలియన్ డాలర్లు ⇒ జరిగింది 311 బిలియన్ డాలర్లే ⇒ మార్చిలో భారీగా పెరిగిన వాణిజ్య లోటు ⇒ బంగారం దిగుమతుల పెరుగుదల ఎఫెక్ట్ న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు గడచిన ఆర్థిక సంవత్సరం (2014 ఏప్రిల్-2015 మార్చి) తీవ్ర నిరుత్సాహ పరిచాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం 340 బిలియన్ డాలర్ల వార్షిక లక్ష్యాన్ని ఎగుమతుల రంగం చేరుకోలేకపోయింది. కనీసం 2013-14 ఆర్థిక సంవత్సరం పరిమాణం కన్నా తక్కువగా నమోదయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 314 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో 311 బిలియన్ డాలర్ల వద్ద చతికిలపడిపోయాయి. అంటే వార్షికంగా చూసుకుంటే అసలు వృద్ధి లేకపోగా(-) 1.23 శాతం క్షీణించాయన్నమాట. ఇక వార్షికంగా దిగుమతులు - 0.5 శాతం క్షీణించి 450 బిలియన్ డాలర్ల నుంచి 448 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దీనితో ఎగుమతులు-దిగుమతుల విలువల వ్యత్యాసం వాణిజ్యలోటు ఆర్థిక సంవత్సరంలో 137 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చిలో భారీ వాణిజ్య లోటు మార్చి నెల విదేశీ వాణిజ్యానికి సంబంధించి, ఈ నెలలో భారీ వాణిజ్యలోటు ఏర్పడింది. వార్షికంగా (2014 మార్చితో పోల్చి) ఎగుమతులు 21 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో ఎగుమతుల రేటు పడిపోవడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. దిగుమతులు వార్షిక ప్రాతిపదికన చూస్తే- 13 శాతంపైగా తగ్గి 36 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఈ లోటు నాలుగు నెలల గరిష్ట స్థాయి. 2014 మార్చిలో వాణిజ్యలోటు 11 బిలియన్ డాలర్లయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ లోటు 7 బిలియన్ డాలర్లు. డిసెంబర్ నుంచీ ఎగుమతుల రంగం క్షీణ దశలో ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మార్చి నెలలో 59.5 శాతం తగ్గాయి. రత్నాలు, ఆభరణాల విలువ 8.36 శాతం తగ్గింది. రసాయనాల ఎగుమతుల విలువ 5.36% పడింది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 2.5% తగ్గాయి. మొత్తం ఎగుమతుల్లో ఈ నాలుగు విభాగాల ఎగుమతుల వాటా దాదాపు 70 శాతం. భారీగా పెరిగి పసిడి దిగుమతులు... మార్చిలో వాణిజ్యలోటు పెరగడానికి దేశంలోకి బంగారం భారీ దిగుమతులు ఒక కారణం. 2014 మార్చి నెలతో పోల్చితే పసిడి దిగుమతులు దాదాపు రెట్టింపై 5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. కలిసి వచ్చిన చమురు... ఇక చమురు దిగుమతుల విలువ 53% క్షీణించడం విశేషం. ఈ విలువ మార్చిలో 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూసినా... చమురు దిగుమతుల విలువ 16% పైగా తగ్గి 138 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అంతర్జాతీయ చమురు ధరలు దిగువ స్థాయిలో కొనసాగుతుండడం దీనికి ప్రధాన కారణం. ఇక చమురు యేతర దిగుమతుల విలువ 8.4% పెరిగి 310 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ప్రత్యేక దృష్టి అవసరం: నిపుణులు ఎగుమతుల రంగం మెరుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు పేర్కొన్నారు. ఎగుమతి చేస్తున్న వస్తువుల నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వానికి ప్రభుత్వ తోడ్పాటు అవసరమని భారత్ ఉత్పత్తుల ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్ అజయ్ సాహీ అభిప్రాయపడ్డారు.