ఫ్రెషర్స్‌కు పండగే! | Demand for freshers highest in e-commerce and tech startups | Sakshi
Sakshi News home page

ఫ్రెషర్స్‌కు పండగే!

Feb 19 2026 4:59 AM | Updated on Feb 19 2026 4:59 AM

Demand for freshers highest in e-commerce and tech startups

మెజారిటీ సంస్థల్లో నియామకాలు 

రిటైల్, ఈ–కామర్స్‌లో అత్యధికం  

టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక

ముంబై: ఈ ఏడాది ఫ్రెషర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలు రానున్నాయి. 73 % సంస్థలు జనవరి–జూన్‌ మధ్య కాలంలో ఫ్రెషర్లను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ కెరీర్‌ అవుట్‌లుక్‌ సర్వేలో తెలిపాయి. విద్యార్హతలు ఒక్కటే కాకుండా.. అప్ప టికే ఏవైనా ప్రాజెక్టులపై పనిచేసిన అనుభవం, ఇంటర్న్‌íÙప్‌ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని సర్వేలో రిక్రూటర్లు చెప్పారు. 2025 నవంబర్‌ నుంచి 2026 జనవరి మధ్య వివిధ రంగాల్లోని 1,051 సంస్థల రిక్రూటర్లను సర్వే చేసి టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ ఈ ఏడాది ప్రథమార్ధం లో నియామకాలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక నివేదికను విడుదల చేసింది.  

ఈ రంగాల్లో జోరు: రిటైల్, ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, తయారీలో ఈ ఏడాది ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలు రానున్నాయి. రిటైల్‌ రంగంలో 91% సంస్థలు ఫ్రెషర్లను తీసుకునే ఉద్దేశంతో ఉన్నాయి. ఆ తర్వాత ఈ–కామర్స్‌ రంగంలో, టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థలో 90 %, తయారీ కంపెనీల్లో 85%  ఫ్రెషర్లను తీసుకోనున్నాయి. డార్క్‌ స్టోర్‌ అసిస్టెంట్‌ (క్విక్‌ కామర్స్‌), ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ అసిస్టెంట్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 

ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు డిజిటల్‌ సేల్స్‌ అసోసియేట్, జూనియర్‌ వెబ్‌ డెవలపర్లను నియ మించుకోవాలని అనుకుంటున్నాయి. తయారీలో ఇన్వెంటరీ, లాజిస్టిక్స్‌ కోఆర్డినేటర్, బ్యాటరీ అసెంబ్లీ టెక్నీషియన్‌ ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకం విషయమై కంపెనీలు నమ్మకంగా ఉన్నాయని, కొన్ని రంగాల్లో నియామకాల ఉద్దేశం 2025 ద్వితీయ ఆరు నెలల కాలంలో ఉన్న 41% నుంచి, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి 91 శాతానికి పెరిగినట్టు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్‌ తెలిపారు. రవాణా రంగంలో నియామక ఉద్దేశ్యం 77 శాతానికి చేరిందని, విద్యుత్, ఇంధన రంగంలోనూ 22 % నుంచి 72 శాతానికి చేరినట్టు చెప్పారు. 

బెంగళూరు టాప్‌: ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టుల అనుభవం ఉన్న వారు వేగంగా ఉపాధి అవకాశాలను పొందగలరని రూజ్‌ తెలిపారు. కేవలం డిగ్రీ అర్హతే కలిగిన వారు అవకాశం కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావొచ్చన్నారు. అధ్యయనమే దీనికి పరిష్కారమని సూచించారు. ఫ్రెషర్లకు అత్యధికంగా బెంగళూరులో (84 శాతం ) అవకాశాలు రానున్నాయి. టెక్నాలజీ, స్టార్టప్‌లకు బెంగళూరు కేంద్రంగా ఉండడం తెలిసిందే. ఇక్కడ ఐటీలో 81 శాతం, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థల్లో 90 శాతం, ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా కంపెనీల్లో 61 శాతం ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement