నిస్సాన్ (Nissan) తన కొత్త సబ్-4 మీటర్ ఎంపీవీ ‘గ్రావైట్’ (Gravite)ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఆధారంగా రూపొందించిన ఈ గ్రావైట్.. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులతో కొంత భిన్నంగా కనిపిస్తుంది. మస్క్యులర్ స్టైలింగ్, కొంచెం ప్రీమియం ఫీలింగ్ కలిగిన ఇంటీరియర్ ఈ మోడల్‌కు ప్రత్యేకతను ఇస్తాయి.
అయితే ఇంజిన్, ఫీచర్ల పరంగా చాలా వరకు ట్రైబర్‌ను పోలి ఉంటుంది. భారత మార్కెట్లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు నిస్సాన్ ఈ గ్రావైట్‌ను కీలక మోడల్‌గా భావిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.
వేరియంట్లు, ధరలు, బుకింగ్ వివరాలు
నిస్సాన్ గ్రావైట్ మొత్తం నాలుగు ప్రధాన ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి విసియా (Visia), అసెంటా (Acenta), ఎన్-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna). ఇంట్రడక్టరీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి..
విసియా ఎంటీ – రూ. 5.65 లక్షలు
అసెంటా ఎంటీ – రూ. 6.59 లక్షలు
ఎన్-కనెక్టా ఎంటీ – రూ. 7.20 లక్షలు
ఎన్-కనెక్టా ఏఎంటీ – రూ. 7.80 లక్షలు
టెక్నా ఎంటీ – రూ. 7.91 లక్షలు
టెక్నా ఏఎంటీ – రూ. 8.49 లక్షలు
టెక్నా లాంచ్ ఎడిషన్ ఎంటీ – రూ. 8.35 లక్షలు
టెక్నా లాంచ్ ఎడిషన్ ఏఎంటీ – రూ. 8.93 లక్షలు
గ్రావైట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలివరీలు 2026 మార్చి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వేరియంట్-వైజ్ ఫీచర్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఎక్స్‌టీరియర్
డిజైన్ పరంగా నిస్సాన్ గ్రావైట్.. రెనాల్ట్ ట్రైబర్ ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్‌తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్‌పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.
సైడ్ ప్రొఫైల్‌లో రెనాల్ట్ ట్రైబర్ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్‌లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్‌తో కలిపి అమర్చారు. బంపర్‌పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.
ఇంటీరియర్
ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్‌బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్ మోడల్‌ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్‌ను అందిస్తున్నాయి.
ఫీచర్లు, సేఫ్టీ
గ్రావైట్‌లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్‌తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్.
ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్ ఉన్నాయి.
ఇంజిన్, పనితీరు
గ్రావైట్‌లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఇవ్వగా ఇంధన సామర్ 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT)
పోటీ మోడళ్లు
నిస్సాన్ గ్రావైట్ ప్రధానంగా రెనాల్ట్ ట్రైబర్‌తో పోటీ పడుతుంది. అలాగే మారుతి ఇర్టిగా, మారుతి ఎక్స్‌ఎల్6, కియా కారెన్స్, కియా కారెన్స్ క్లావిస్ లకు ఇది అందుబాటు ధరలో ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.


