పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. 593 కిమీ రేంజ్! | Tata Punch EV Facelift 590 Km Range On Single Charge | Sakshi
Sakshi News home page

పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. 593 కిమీ రేంజ్!

Feb 15 2026 3:50 PM | Updated on Feb 15 2026 4:40 PM

Tata Punch EV Facelift 590 Km Range On Single Charge

టాటా మోటార్స్ ఫిబ్రవరి 20న.. భారతదేశంలో పంచ్ ఫేస్‌లిఫ్టెడ్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేయనుంది. అయితే ఈ కారు లాంచ్ కావడానికి ముందే.. టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది ఎంత రేంజ్ ఇస్తుందనే విషయం కూడా లీక్ అయింది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ ఒక ఫుల్ ఛార్జ్‌పై 593.6కిమీ దూరం ప్రయాణిస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. కారు చిన్నదే అయినా.. మంచి పర్ఫామెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. దీని ధరలను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది.

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 25 కిలోవాట్, 35 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లను పొందుతుంది. చిన్న బ్యాటరీ 82 హార్స్ పవర్, 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. పెద్ద బ్యాటరీ 122 హార్స్ పవర్, 190 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలో కూడా లభించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

ఇదీ చదవండి: స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్.. బంపర్ క్లీనర్ లేఅవుట్‌తో రీడిజైన్ చేయబడి ఉండటం చూడవచ్చు. వై షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఛార్జింగ్ స్లాట్ అదే విధంగా ఉంటుంది. ఎయిర్ డ్యామ్ & స్కిడ్ ప్లేట్ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. వెనుక వైపు.. ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్ కనిపిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement