దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు | Top 5 Highest Earning Toll Plazas In India | Sakshi
Sakshi News home page

దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు

Feb 15 2026 2:28 PM | Updated on Feb 15 2026 3:29 PM

Top 5 Highest Earning Toll Plazas In India

భారతదేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై గత ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) సుమారు రూ. 2.27 లక్షల కోట్ల టోల్ వసూళ్లు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. అయితే టాప్ టోల్ ప్లాజాల వివరాలు 2019-20 నుంచి 2023-24 వరకే అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్‌ 5 టోల్‌ ప్లాజాల గురించి తెలుసుకుందాం.

ఎన్‌హెచ్-48పై వడోదర–భరూచ్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో రూ. 2,043.81 కోట్లు వసూలు చేసింది. పారిశ్రామిక కారిడార్‌గా పేరుగాంచిన ఈ మార్గంలో భారీ వాణిజ్య వాహనాల రాకపోకలు అధికంగా ఉండటం ప్రధాన కారణం.1
1/5

ఎన్‌హెచ్-48పై వడోదర–భరూచ్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్లలో రూ. 2,043.81 కోట్లు వసూలు చేసింది. పారిశ్రామిక కారిడార్‌గా పేరుగాంచిన ఈ మార్గంలో భారీ వాణిజ్య వాహనాల రాకపోకలు అధికంగా ఉండటం ప్రధాన కారణం.

ఎన్‌హెచ్-48లో గుర్గావ్–జైపూర్ విభాగంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,884.46 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ-జైపూర్ రహదారిపై ప్రయాణికులు, పర్యాటకులు, సరుకు రవాణా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.2
2/5

ఎన్‌హెచ్-48లో గుర్గావ్–జైపూర్ విభాగంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,884.46 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ-జైపూర్ రహదారిపై ప్రయాణికులు, పర్యాటకులు, సరుకు రవాణా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.

ఎన్‌హెచ్-16లో ధంకుని–ఖరగ్‌పూర్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,538.91 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.3
3/5

ఎన్‌హెచ్-16లో ధంకుని–ఖరగ్‌పూర్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,538.91 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.

ఎన్‌హెచ్-19లో ఇటావా–కాన్పూర్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,480.75 కోట్లతో నాల్గవ స్థానంలో ఉంది.4
4/5

ఎన్‌హెచ్-19లో ఇటావా–కాన్పూర్ మార్గంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,480.75 కోట్లతో నాల్గవ స్థానంలో ఉంది.

ఎన్‌హెచ్-44పై పానిపట్–జలంధర్ విభాగంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,314.37 కోట్లు వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది.5
5/5

ఎన్‌హెచ్-44పై పానిపట్–జలంధర్ విభాగంలో ఉన్న ఈ ప్లాజా రూ. 1,314.37 కోట్లు వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement