భారతదేశంలో టోల్ విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి 2014లో ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలులోకి వచ్చింది. ఇప్పుడు రద్దీని తగ్గించడానికి.. ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్ తీసుకురావడానికి సిద్ధమైంది.
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేదించనుంది. ప్రయాణికులు టోల్‌లు చెల్లించడానికి ఫాస్ట్‌ట్యాగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. త్వరలోనే ఇది అమలులోకి రానున్నట్లు సమాచారం.
గడువు సమీపిస్తున్నందున, ప్రయాణికులు డిజిటల్ మార్పుకు సిద్ధం కావాలని మరియు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇది అమలులోకి వచ్చిన తరువాత వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇంధనం ఆదా అవుతుంది. డిజిటల్ చెల్లింపులు అన్ని లావాదేవీల పారదర్శకంగా ఉంటాయి.
ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి


