గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా? | Are You Going To Be Charged On Every Rs 1000 UPI Transfer Know The Details | Sakshi
Sakshi News home page

గూగుల్ పే, ఫోన్‌పే ట్రాన్సాక్షన్.. రూ.1000 దాటితే ఫీజులా?

Feb 15 2026 7:27 PM | Updated on Feb 15 2026 7:46 PM

Are You Going To Be Charged On Every Rs 1000 UPI Transfer Know The Details

దేశంలో యూపీఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతి రోజూ లెక్కకు మించిన నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రూ. 1000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

రూ.1000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే.. సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. ప్రస్తుతం వ్యక్తుల మధ్య లేదా వ్యక్తులు - వ్యాపారాలు మధ్య జరిగే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని దెబ్బతీసే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఇలాంటి వార్తలను ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. 2026–27 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం UPI & RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి రూ. 2,000 కోట్లు కేటాయించింది. చిరు వ్యాపారులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) భారం పడకుండా ఉండటానికి ఈ నిధులను కేటాయించనున్నారు. దీని ద్వారానే బ్యాంకులకు, పేమెంట్ అగ్రిగేటర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది.

ఇదీ చదవండి: ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?

ప్రస్తుతం భారతదేశంలో చాలావరకు యూపీఐ లావాదేవీలే జరుగుతున్నాయి. నేడు చిన్న బట్టి కొట్టు నుంచి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు దాదాపు అందరూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకు ఒక లక్ష రూపాయల వరకు పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంది. బిజినెస్ అకౌంట్ అయితే రోజుకి రూ. 5 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement