EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభం! | EPFO Big Update, Members Soon To Withdraw PF Money Via UPI With New Mobile App, Know More Details | Sakshi
Sakshi News home page

EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రా మరింత సులభం!

Feb 9 2026 8:44 PM | Updated on Feb 10 2026 10:51 AM

EPFO Big Update Can Soon Withdraw PF Money Through UPI

ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్‌సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్‌ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్‌ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చు. EPFO ​​3.0 అప్‌గ్రేడ్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్‌డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్‌మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.

  • ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు.

  • ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

  • యాప్‌లో మీరు ఎంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్‌గా యూపీఐ విత్‌డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్‌సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement