బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే? | Chinese Trading Behind Gold Price Swings Says Scott Bessent | Sakshi
Sakshi News home page

బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

Feb 9 2026 5:25 PM | Updated on Feb 9 2026 6:54 PM

Chinese Trading Behind Gold Price Swings Says Scott Bessent

ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. చైనా ట్రేడర్ల పాత్ర దీనికి కారణమని, అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ విషయాలను ఆయన ఫాక్స్ న్యూస్‌లో ప్రసారమైన సండే మార్నింగ్ ఫ్యూచర్స్ కార్యక్రమంలో వెల్లడించారు.

చైనాలో బంగారం ట్రేడింగ్.. కొంచెం నియంత్రణ తప్పిన స్థాయికి చేరిందని బెస్సెంట్ అన్నారు. దీనివల్ల అక్కడి అధికారులు మార్జిన్ నిబంధనలను కఠినతరం చేయాల్సి వచ్చిందని, ఈ పరిణామాలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత అకస్మాత్తుగా పడిపోయేలా చేసిందని అన్నారు.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతపై ఉన్న ఆందోళనలు ప్రధానమైనవి. ఇదే సమయంలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ అవరేజ్ సూచీ 50,000 మార్క్‌ను తొలిసారి దాటింది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ లాభాలపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచేసింది.

భారతదేశంలో బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,55,000 దాటేసింది. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,44,000 క్రాస్ చేసింది. వెండి ధరలు మళ్లీ రూ. 3 లక్షలకు (కేజీ) చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement