పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు | New Insurance Plans Focused on Childrens Future and Fetal Health | Sakshi
Sakshi News home page

పిల్లలకు ప్రత్యేక బీమా పథకాలు

Feb 9 2026 4:44 PM | Updated on Feb 9 2026 4:54 PM

New Insurance Plans Focused on Childrens Future and Fetal Health

పిల్లల భవిష్యత్‌ ప్రణాళికల కోసం ఉపయోగపడేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  సంస్థ స్మార్ట్‌కిడ్‌ 360 ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ఇది బీమా ప్రయోజనాలను కల్పించడంతో పాటు దీర్ఘకాలిక పొదుపు పథకంగా కూడా ఉపయోగపడుతుంది. పాలసీదారుకేదైనా జరిగితే ప్రీమియంల నుంచి మినహాయింపు, ప్రయోజనాల కొనసాగింపు, కుటుంబానికి క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే ఫ్యామిలీ ఇన్‌కం బెనిఫిట్‌ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పిల్లల చదువులు తదితరాలకు మనీబ్యాక్‌ పొందే వీలుంది.  

బజాజ్‌ జనరల్‌ ఫీటల్‌ ఫ్లరిష్‌ ఆరోగ్య బీమా 
గర్భస్త శిశువు ఆరోగ్యానికి సంబంధించి ‘ఫీటల్‌ ఫ్లరిష్‌’ పేరిట బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రత్యేక ఇన్సూరెన్స్‌ రైడర్‌ని ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి రాని అధునాతన ఇన్‌–యుటెరో ప్రొసీజర్లు, రిస్కులు ఎక్కువగా ఉండే ప్రెగ్నెన్సీలకు కవరేజీ లభిస్తుంది. ‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌’, ‘హెల్త్‌ గార్డ్‌’ పథకాలతో కలిపి ఈ రైడర్‌ని తీసుకోవచ్చు. 18–45 ఏళ్ల వయస్సు గల మహిళలకు, ఒక్కో ప్రసవానికి రూ. 2 లక్షల సమ్‌ ఇన్సూర్డ్‌తో రెండు ప్రసవాల వరకు వర్తిస్తుంది. ప్రీమియం రూ. 1,025గా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement