బై బై 2025... వెల్‌కమ్ 2026. మరో నాలుగు రోజుల్లో అందరూ ఇదే అనబోతున్నారు. న్యూ ఇయర్‌లో చేయాల్సిన పనులు, అందుకోవాల్సిన విజయాల గురించి ఆరాటపడుతున్నారు. ఈ పెద్దల ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మరి పిల్లలూ... మన సంగతి? 2025 ఘటనలు, పరిణామాలు మనకు ఏం చె ప్పాయి?
ఎలా స్ఫూర్తినిచ్చాయి? ఏం నేర్పాయి? ఏమి హెచ్చరికలు చేశాయి? ఒకసారి అలా ఒక రౌండేసి చూద్దామా?
వీరే మన ఇన్‌స్పిరేషన్
2025లో మెరిసిన తారలు బాలల్లో ఉన్నారు. బాలలకు స్ఫూర్తినిచ్చేలా వార్తల్లో నిలిచినవారూ ఉన్నారు.
టైమ్ పత్రిక ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’
అమెరికన్ టీనేజర్ తేజస్వి మనోజ్ ప్రోగ్రామర్‌గా, వెబ్‌సైట్ డెవలపర్‌గా వార్తల్లో నిలిచింది. కాలిఫోర్నియాలో జన్మించిన తేజస్వి టెక్సాస్‌లో పెరిగింది. సైబర్ నేరాల నుండి వృద్ధులను రక్షించడానికి ఒక యాప్‌ను కనిపెట్టింది. ఆమె చొరవకు 2025లో టైమ్ పత్రిక వారి ’కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. ఆమె ఫ్రిస్కోలోని లెబనాన్ ట్రైల్ ౖహె స్కూల్‌లో చదువుకుంటోంది.
‘సర్కాడియావి’ యాప్..
ఎన్ ఆర్‌ఐ విద్యార్థి అయిన సిద్ధార్థ్ నంద్యాలకు 14ఏళ్లు. అంత చిన్న వయసులోనే గుండె జబ్బులను గుర్తించడానికి ఏఐను ఉపయోగించి ‘సర్కాడియావి’ అనే యాప్‌ను అభివృద్ధి చేశాడు. సిద్ధార్థ్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న రాష్ట్రనేతలు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ యాప్ ద్వారా గుండె జబ్బులను నియంత్రించడంతో పాటు మరణాలను అరికట్టవచ్చు.
గుకేష్... ది గ్రాండ్‌మాస్టర్..
2025లో భారతీయ చదరంగంలో డి.గుకేశ్ పేరు మారుమోగింది. 2025లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా మారి, ఆ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గుకేశ్ తన ఆట శైలికి, ఆత్మవిశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. కష్టపడితే కలలెలా నిజమవుతాయో చెప్పడానికి అతను నిదర్శనంగా మారాడు. గుకేష్ చాలా మంది పిల్లలకు నేడు ఐడెల్‌గా కనిపిస్తున్నాడు.
క్రికెట్ స్టార్... వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్‌లో దూసుకు΄ోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. జనవరి 2024లో అరంగేట్రం చేసి ఇండియన్ లిస్ట్ ఏలో కెరీర్ మొదలుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పేరు΄÷ందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్నవయసు ఆటగాడిగా మారాడు. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందజేశారు.
2025ల పిల్లలూ...పరిణామాలు
సోషల్ మీడియా
ఈ ఏడాది జరిగిన పరిశోధనల్లో సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపైనా పడుతోందని గుర్తించారు. చాలామంది తల్లిదండ్రులు తమ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారు, ఎందుకోసం వాడుతున్నారనేది గమనించడం లేదు. అయితే కొందరు చిన్నారులు అనైతిక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుతున్నారని, మరికొందరు మానసిక సంబంధిత సమస్యలకు గురవుతున్నారని తేలడంతో ఆస్ట్రేలియా ఇటీవల చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. తమ పిల్లలకు డిజిటల్ వ్యవహారజ్ఞానం అందించాలని అనుకోవడం మంచిదే కానీ, దానిపైనా పెద్దల అజమాయిషీ అవసరం అని 2025లో నిపుణులు తేల్చారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
2025లో ఏఐ బలంగా దూసుకు΄ోయింది. రాబోయే కాలంలో దీని ప్రభావం మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో పిల్లల హక్కులపై దాని ప్రభావం తప్పకుండా పడుతుందని నిపుణులు అంటున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఏఐ మీద నమ్మకంతో అన్ని విషయాలు దాంతో పంచుకుంటున్నారు. కొందరు తమ ఆస్తిపాస్తుల వివరాలు, తమ వ్యక్తిగత విషయాలు, తన లైంగికేచ్ఛలు కూడా వాటితో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరితనం నుంచి వారు దూరమవడానికి చేసే క్రమంలో జరుగుతున్న పరిణామం ఇది. దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా నష్టాలు ఉన్నాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకొని, కేవలం ఏఐతోనే అనుబంధం పెంచుకోవడం భారీ ముప్పుగా మారుతుందని అంటున్నారు.
రికార్డ్స్ కామిక్ పుస్తకం ఖరీదు రూ.81.8 కోట్లు
2025 నవంబర్‌లో అత్యంత అరుదైన ఓ కామిక్ పుస్తకం 9.12 మిలియన్ డాలర్ల (రూ.81.8 కోట్ల)కు అమ్ముడు΄ోయింది. సూపర్‌మ్యాన్ కథలుండే ‘సూపర్‌మ్యాన్’ కామిక్ పుస్తకాల శ్రేణిలో ఇది మొదటి సంచిక. ఒక అటకపై కనుగొన్న ఈ పుస్తకాన్ని ఆ ఇంటివారు వేలం వేయగా ఇంత భారీ ధర పలికింది. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా నిలిచింది.
80 ఏళ్ల వయసు ఐరన్ మ్యాన్
అక్టోబర్ 11న, 2025 ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయాథ్లాన్ లో 1,600 మందికి పైగా అథ్లెట్లు ఈత కొట్టారు. అనంతరం వారు 100 మైళ్లకు పైగా సైకిల్ తొక్కారు. ఆ తర్వాత ఒక మారథాన్ పరుగును పూర్తి చేశారు. ఇందులో 80 ఏళ్ల నటాలీ గ్రాబో ఈ మొత్తం రేసును పూర్తి చేశారు. ఈ ΄ోటీని పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సృష్టించింది.
ఓటీటీ స్పెషల్ ‘అడాలసెన్స్’
సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్
2025లో విడుదలైన ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ అనేకమందికి కనువిప్పుగా మారింది. 13 ఏళ్ల పిల్లాడు తన పాఠశాలలో ఒక అమ్మాయి హత్య చేసి అరెస్టయిన ఉదంతం ఇందులోని కథ. కథంతా అతని చుట్టూ, అతని ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌ను ఒకే టేక్‌లో చిత్రీకరించడం విశేషం. మార్చి 13, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది.
వాతావరణంలో మార్పులు..
వాతావరణ మార్పు పిల్లల భవిష్యత్తుకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మారుతోందని 2025 హెచ్చరించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వల్ల ఆహార అభద్రత ఏర్పడి ఆరోగ్య సంక్షోభాలు లక్షలాది మంది పిల్లల భవితను ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. అందుకే 2025లో పలు దేశాల్లో చిన్నారులు బృందాలుగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కోసం తమ వాణి వినిపించారు. భూమిని కాపాడాలని, తమ భవితకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని కోరారు. 2026 నుంచి ప్రపంచమంతా ఈ విషయంపై బలమైన దృక్పథం ఏర్పరచుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఆరోగ్యం
పిల్లలకు తినడానికి ఆహారం ఇచ్చి స్కూళ్లకు పంపితే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే శ్రమ లేని జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆటపాటలకు దూరమవడం, రసాయనిక ఆహార పదార్థాలు, వేళ కాని వేళల్లో నిద్ర వంటి అంశాలన్నీ కలిసి చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఊబకాయం రేట్లు ఒకపక్క, ప్రపంచ ΄ోషకాహార లోపం మరో పక్క 2025ను ఆందోళనకు గురి చేశాయి. ఈ ప్రభావం చిన్నారుల మీద వెంటనే పడక΄ోయినా, రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితిని తేనుందని నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ ఉత్పత్తులను చిన్నారుల దాకా చేరకుండా అడ్డుకోవడం తల్లిదండ్రులకు సవాలే అని తేల్చారు.
బాల కార్మికులుగా చాకిరీలో..
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2025 వచ్చి వెళ్లి΄ోతున్నా ఇంకా 138 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూఎన్ బాలల నిధి విడుదల చేసిన బాల కార్మిక నివేదికలో పేర్కొంది. అతి త్వరలో ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ రూపుమాసి΄ోతుందని తెలిపింది. అందరూ సమష్టిగా కృషి చేసి ఎక్కడా బాలకార్మికులు లేకుండా చూడాలని పిలుపునిచ్చింది.
పరిశోధనలూ హెచ్చరికలూ
జన్యు–సవరణ విధానం
పిల్లలూ... ఈ సంవత్సరం వైద్య రంగంలో ఒక మంచి జరిగింది. జన్యుపరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే చిన్నారుల కోసం శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి జన్యు–సవరణ విధానాన్ని సృష్టించారు. తన డీఎన్‌ఏలో సమస్య కారణంగా అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారిపై అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఇఖఐ్కఖ(ఇ uట్ట్ఛట్ఛఛీ ఖ్ఛజu ్చట y ఐn్ట్ఛటటp్చఛ్ఛిఛీ జిౌట్ట ్క్చ జీnఛీటౌఝజీఛి ఖ్ఛp్ఛ్చ్టట) విధానంతో చికిత్స అందించారు. ఆ చిన్నారి ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు. త్వరలోనే ఇతర పిల్లల్లాగే అతనూ ఎదుగుతాడని, వైద్యశాస్త్రంలో ఇది కీలక పరిణామని శాస్త్రవేత్తలు అంటున్నారు.
2025 పుస్తకాలు
2025లో పిల్లల కోసం అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అందులో కొన్ని మాయలు, మంత్రాలతో కూడిన ఊహా ప్రపంచం కాగా, మరికొన్ని వారిలో మంచిని పెంచి, ఆసక్తికరంగా చదివించే విషయాలు ఉన్నాయి. ఇవి బాగా అమ్ముడు΄ోయాయి.
ది లాస్ట్ బుక్‌స్టోర్ ఆన్ ఎర్త్
– లిల్లీ బ్రాన్–ఆర్నాల్డ్
ఒక వినాశకరమైన తుఫాను లిజ్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసి ఏడాది సంవత్సరం గడిచింది. ఇప్పుడు మరో ప్రళయం రాబోతోంది. ఈ సమయంలో ఆమె సురక్షితంగా భావించిన ఏకైక ప్రదేశంలో ఆమె గతంలో పని చేసిన పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ ఏం జరిగిందనేది ఇందులోని కథ.
పీపుల్ లైక్ స్టార్స్
– పాట్రిస్ లారెన్స్
13 ఏళ్ల ముగ్గురు అపరిచితులకు నడుమ ఒక పెద్ద రహస్యం ముడిపడి ఉంది. అదేమిటనేదే ఇందులోని కథ. వారెవరు? వారికీ, ఆ రహస్యానికీ సంబంధం ఏమిటి అనే ఆసక్తికరంగా సాగుతుంది. విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి కలవడం, చరిత్రలోని రహస్యాలు తెలుసుకోవడం ఇందులో చూడొచ్చు.
ది డే మై స్కూల్ గాట్ ఫేమస్
– జెన్ కార్నీ
పాఠశాలకు మంచి డిజైన్ సూచించాలని ప్రధాన ఉపాధ్యాయుడు సవాలు విసిరారు. గెలిచినవారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఫెర్రిస్ తన సోదరుడు నైల్‌తో కలిసి ఆ డిజైన్ కోసం ప్రయత్నించాలనుకున్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తాడు. బహుమతిని గెలుచుకోవడానికి వారిద్దరూ తమ విభేదాలను పక్కన పెట్టారా అనేది ఇందులోని కథ.
పులోమా అండ్ ది బేర్ – జస్బిందర్ బిలాన్
పులోమా అనే బాలికకు సవాల్ ఎదురైంది. ఓ ప్రమాదం నుంచి ఒకేసారి నైలా అనే ఎలుగుబంటిని, తనను తాను రక్షించుకోవాలి. అది సాధ్యమేనా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఎటువంటి మార్గాలు అన్వేషించింది? ఉత్కంఠభరితమైన ఈ సాహసయాత్ర చిన్నారుల్ని విశేషంగా అలరిస్తోంది. బందీగా ఉన్న ఎలుగుబంటిని రక్షించడానికి పులోమా ధైర్యాన్ని చదివి తీరాలి.


