ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక చిన్న అబ్బాయికి మధ్య సాగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా గోరఖ్‌నాథ్ ఆలయంలో ఏటా నిర్వహించే ఖిచ్డీ ఉత్సవంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి ఒక చిన్నారి వచ్చాడు. సీఎం యోగి ఆ చిన్నారితో ముచ్చటిస్తూ ‘నీకు ఏం కావాలో చెప్పు?’ అని మురిపెంగా అడిగాడు. ఆ పిల్లాడు ఏ మాత్రం తడబడకుండా ‘నాకు చిప్స్ కావాలి’ అని ముఖ్యమంత్రి చెవిలో చెప్పాడు. అతడి సీక్రెట్ విన్నపం అక్కడున్న వారికి వినిపించింది. ఆ పసివాడి మాటతో ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఉన్న అధికారులు, భక్తులు ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సరదా సన్నివేశం వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది.
बच्चे ने की CM योगी से चिप्स की डिमांड #CMYogi #YogiAdityanath pic.twitter.com/KzDA0rO7tC
— Shubhendra Singh Gaur 🇮🇳 (@ShubhendraSGaur) January 15, 2026


