రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే | 2 Years Old Missing Boy Spends Whole Night In Temple Bushes Surrounded By Stray Dogs In Hyderabad | Sakshi
Sakshi News home page

రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే

Mar 5 2026 9:24 AM | Updated on Mar 5 2026 1:02 PM

2 Year Boy Missinig In Hyderabad

హైదరాబాద్‌: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు. వందలాది కుక్కలు అక్కడే తచ్చాడుతున్నా బాలుడికి పెద్దగా ప్రమాదం తలపెట్టలేదు.  ఒకటి, రెండు కాట్లు వేసి వదిలిపెట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన నార్సింగి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 

గండిపేట మైసమ్మ దేవాలయానికి మంగళవారం తెల్లాపూర్‌నకు చెందిన వడ్డె వెంకటే‹Ù, అనూష దంపతులు కుమారుడు అభిమన్యు (2)తో కలిసి మొక్కు చెల్లించుకునేందుకు వచ్చారు. సాయంత్రం 5.50కు అభిమన్యును తీసుకుని వెంకటేష్‌ కుళాయి వద్దకు వెళ్లారు. కొద్ది సేపట్లోనే అభిమన్యు అదృశ్యమయ్యాడు. వెతికినా ప్రయోజనం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు ఆలయ ఆవరణలోని చెట్ల పొదల్లోనే రాత్రంతా ఉన్నాడు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో ఉండే వందల కుక్కలు బాలుడిని ఏమీ చేయకపోవడంతో గమనార్హం. ఈ సందర్భంగా ఇటీవల చిన్నారులను కుక్కలు తీవ్రంగా కరిచిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement