chips
-
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్‌లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్‌లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్‌తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
విలువైన వస్తువులను ఖాళీ చిప్స్ ప్యాకెట్లో పెడితే.. ఫ్లైట్ అటెండెంట్ సలహా!
మనం ఏదైనా పెళ్లి లేదా పెద్దపెద్ద ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మనతో పాటు విలువైన వస్తువులు అంటే.. బంగారు ఆభరణాలు, విలువైన గాడ్జెట్స్ తీసుకువెళుతుంటాం. ఇటువంటి వేడుల సందర్భంలో బంధువుల సందోహం ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనతోపాటు తీసుకువచ్చిన విలువైన సామాను చోరీ జరిగే అవకాశం ఉండవచ్చు. అలాగని ప్రతి నిముషం మన విలువైన వస్తువులను కంట కనిపెట్టుకుని ఉండలేం. పైగా ఇటువంటి సందర్భాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరిపైనా నిందలు కూడా వేయలేం. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఫ్లైట్ అటెండెంట్ సలహా.. ఫ్లైట్ అటెండెంట్ మైగుల్ మనోజ్ ఇటీవల సోషల్ మీడియాలో..విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు ఒక ఆశ్చర్యకరమైన లైఫ్ హ్యాక్ తెలియజేశారు. ఇది అందరికీ ఎంతగానో ఉపకరిస్తుంది. మన దగ్గరున్న విలువైన వస్తువులను కాపాడుకునేందుకు ఖాళీ చిప్స్ ప్యాకెట్స్ మన దగ్గర ఉంచుకోవాలని అయన సలహా ఇచ్చారు. నిజానికి మనం ఖాళీ చిప్స్ ప్యాకెట్లను చెత్తగా భావించి, బయటపారవేస్తుంటాం. అయితే విలువైన వస్తువులను ఎవరూ గుర్తించలేని చోట పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. చిప్స్ ప్యాకెట్‌తో పనేంటి? తాను చిప్స్ ప్యాకెట్ లైఫ్ హ్యాక్‌ను ఫాలో చేస్తానని చెప్పిన ఆయన.. తాను ఏదైనా హోటల్లో బస చేసినప్పుడు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో విలువైన వస్తువులను దాచివుంచుతానన్నారు. దీంతో ఎవరూ కూడా విలువైన వస్తువులు ఖాళీ చిప్స్ ప్యాకెట్లలో ఉంటాయనే విషయాన్ని అంచనా వేయలేరన్నారు. సాధారణంగా చోరీకి పాల్పడేవారు అల్మరాలు, సూట్‌కేసులు, బ్యాగులను, పర్సులను గమనించి వాటిని తస్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా విలువైన వస్తువులు అక్కడే ఉంటాయనే భావనతో చోరులు వాటిపై కన్ను వేస్తారు. దొంగకు దిమ్మతిరిగిపోయేలా.. ప్రయాణ సమయంలో లేదా వేడుకల సందర్భంలో ఖాళీ చిప్స్ ప్యాకెట్ లేదా ఖాళీ టిన్లలో విలువైన వస్తువులను ఉంచితే దొంగలు వాటిని పసిగట్టలేరు. ఫలితంగా మన విలువైన సామాను సురక్షితంగా ఉంటుంది. కాగా మైగుల్ మనోజ్ సోషల్ మీడియాలో ఇచ్చిన ఈ సలహా చాలామందికి నచ్చలేదు. విలువైన వస్తువులను మనం ధరించే దుస్తులలోని సీక్రెట్ పాకెట్లు, ధార్మిక గ్రంథాలు, ఖాళీ కాస్మొటిక్ డబ్బాలలో ఉంచడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్.. -
రిలయన్స్ స్నాక్స్ బిజినెస్.. భారత్‌లోకి అమెరికన్ బ్రాండ్ చిప్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించే క్రమంలో అమెరికాకు చెందిన బ్రాండెడ్ కన్జూమర్ ఫుడ్స్ తయారీ సంస్థ జనరల్ మిల్స్‌తో రిలయన్స్ రిటైల్ చేతులు కలిపింది. తద్వారా అత్యంత వేగంగా ఎదుగుతున్న స్నాక్స్ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టింది. దేశీ మార్కెట్లో అలాన్స్ బ్యూగుల్స్ బ్రాండ్ కార్న్ చిప్స్ స్నాక్స్‌ను ప్రవేశపెట్టినట్లు రిలయన్స్ రిటైల్‌లో భాగమైన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, (ఆర్సీపీఎల్) తెలిపింది. ముందుగా కేరళతో ప్రారంభించి ఇతర రాష్ట్రాల్లో క్రమంగా వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. వీటి ధర రూ. 10 నుంచి ప్రారంభమవుతుంది. 110 బిలియన్ డాలర్ల ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) మార్కెట్లో గణనీయ మార్కెట్ వాటాను దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆర్సీపీఎల్ ఇటీవల క్యాంపా, సోస్యో, రస్కిక్, టాఫీమ్యాన్ తదితర బ్రాండ్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: రిలయన్స్ రిటైల్ చేతికి లోటస్ చాకొలెట్లు -
విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత
న్యూయార్క్: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. యాపిల్, ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలకు ఆగమనానికి ఆద్యుడు మూరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. Today, we lost a visionary. Gordon Moore, thank you for everything. pic.twitter.com/bAiBAtmd9K — Intel (@intel) March 25, 2023 మూరే ఎప్పుడూ 'యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్' అని తనను తాను పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన టీచర్ కావాలనుకునేవారట. కానీ ఎలక్ట్రానిక్స్‌ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్‌గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్.. సిలికాన్ వ్యాలీకి ఆ పేరు రావడానికి దోహదపడింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, గతంలో అమెరికన్ విస్తారమైన ఉక్కు పారిశ్రామిక ఆధిపత్యానికి బ్రేక్ వేసింది ఇంటెల్. ఇంటెల్ ఆవిష్కారం మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్‌టాప్ కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్లు, బాత్రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్‌క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటేముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్‌గా ఉన్నారు. మరో విశేషమేమిటంటే, 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80శాతం కంప్యూటర్లలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్లే. ఫలితంగా చరిత్రలో అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది. (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్‌బర్గ్) గొప్ప దాత మూరే మూరే, అతని భార్య బెట్టీ మూరేతో కలిసి విస్తృత దానాలు చేశారు. 2001లో వీరిద్దరూ కలిస బెట్టీ మూరే ఫౌండేషన్‌ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్ షేర్లను విరాళంగా ఇచ్చారు. 2001లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్ డాలర్లతో ఒక విశ్వ విద్యాలయానికి అందించిన ఏకైక గొప్ప బహుమతినిచ్చిన గౌరవాన్ని దక్కించుకున్నారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) మూర్స్ లా కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు. -
నయా సాల్ జోష్.. 3.50 లక్షల బిర్యానీలు
హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను జనం బిర్యానీ, పిజ్జాలతో ఘనంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.50 లక్షల బిర్యానీ, 2.5 లక్షలకు పైగా పిజ్జా ఆర్డర్లను కస్టమర్లకు చేరవేసినట్లు చేసినట్లు ఫుడ్ డెలివరీ యాప్ ‘స్విగ్గీ’ వెల్లడించింది. ట్విట్టర్లో తాము నిర్వహించిన ఓ సర్వేలో 75.4 శాతం మంది హైదరాబాద్ బిర్యానీ, 14.2 శాతం మంది లక్నో బిర్యానీ, 10.4 శాతం మంది కోల్‌కతా బిర్యానీని ఇష్టపడుతున్నట్లు తేలిందని వివరించింది. హైదరాబాద్‌లో బావార్చీ హోటల్ పసందైన బిర్యానీకి పేరొందిన హోటల్. కొత్త సంవత్సరం డిమాండ్‌ను తట్టుకోవడానికి శనివారం ఏకంగా 15 టన్నుల బిర్యానీని సిద్ధం చేసినట్లు బావార్చీ హోటల్ యాజమాన్యం తెలియజేసింది. ఇదిలా ఉండగా, శనివారం రాత్రి 7 గంటల కల్లా 1.76 లక్షల చిప్స్ ప్యాకెట్లను కస్టమర్లు ఆర్డర్ చేశారని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ పేర్కొంది. అలాగే 2,757 డ్యూరెక్స్ కండోమ్ ప్యాకెట్లను కస్టమర్లకు చేరవేశామని తెలిపింది. కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 12,344 మంది వినియోగదారులు కిచిడీ కోసం స్విగ్గీలో ఆర్డర్ చేయడం మరో విశేషం. -
రూ. 10 ప్యాకెట్లో 5 చిప్స్! ఇక రూ.2 చేంజ్‌కి ఒక చిప్ ఇస్తారా?!
సాక్షి, ముంబై: చిరుతిండి, కాలక్షేపం అనగానే దాదాపు అందరి దృష్టి చిప్స్ వైపే మళ్లుతుంది. ఎంత పెద్ద చిప్స్ ప్యాకెట్ కొన్నా.. అందులో గ్యాస్ ఎక్కువ.. చిప్స్ తక్కువ ఇది అందరికి తెలిసిన సంగతే. తాజాగా మరో వింత సంగతి ఒకటి వెలుగులోకి వచ్చింది. 10రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్న వినియోగదారుడు అందులో కేవలం చిప్స్ ఉండటంతో తెల్లబోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సెటైర్లతో సందడి చేస్తున్నారు. ఒక విద్యార్థి కాలేజీకి వెడుతూ పది రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. కట్ చేస్తే.. అక్షరాలా ఐదు చిప్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం రెడిట్‌లో షేర్ చేయగానే.. చిప్‌కు రెండు రూపాయలు భయ్యా.. ఇకపై రెండు రూపాయల చేంజ్ లేకపోతే ఒక చిప్ చేతిలో పెడతారేమో అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. గత 27 ఏళ్లుగా టాప్ క్వాలీటీ మసాలా ఎయిర్ అమ్ముతూనే ఉన్నారు.. అది కాస్ట్లీ గ్యాస్... మనం తినే చిప్స్ జస్ట్ కాంప్లిమెంట్.. ఇలా రకరకాల కామెంట్లతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. -
యువకుడి ప్రాణం తీసిన చిప్స్?
తిరువొత్తియూరు(చెన్నై): చిప్స్ తిని కూల్‌డ్రింక్స్ తాగిన యువకుడు కొద్ది సమయానికే ఊపిరాడక మృతి చెందాడు. వివరాలు.. పొల్లాచ్చికి చెందిన సతీష్ (25). చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను చెన్నై ఈస్టుకోస్టు ఆలయానికి స్నేహితులతో కలసి వెళ్లి.. అక్కడ ఓ దుకాణంలో చిప్స్, కూల్‌డ్రింక్స్ తీసుకుని తరువాత సముద్రతీరంలో వెళ్లాడు. అక్కడ కూర్చొని చిప్స్ తింటూ కూల్‌డ్రింక్స్ తాగాడు. కొద్ది సమయానికే గొంతులో సమస్యగా ఉందంటూ సతీష్ పడిపోవడంతో.. స్నేహితులు అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. చదవండి: ఆన్లైన్ పరిచయం.. అసభ్యకర వీడియోలను అప్లోడ్ చేస్తానని బెదిరించడంతో.. -
ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!
మన దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడం కోసం వేదాంత గ్రూపు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ పెట్టుబడిని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేదాంత గ్రూపుకు చెందిన అవన్ స్ట్రేట్ సంస్థ 2025 నాటికి భారతీయ తయారీ ప్లాంట్ల నుంచి ఎలక్ట్రానిక్ చిప్స్ & డిస్ప్లేలను విడుదల చేయాలని ఆశిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. "సెమీకండక్టర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాపారం. మేము డిస్ప్లే తయారీ రంగంలో సుమారు 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము. ప్రస్తుతం మేము ఈ సెమీకండక్టర్ రంగంలో 7 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాము, ఆ తర్వాత ప్లాంట్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడి మరో 3 బిలియన్ డాలర్లు కూడా పెరగవచ్చు. మొదటి 10 సంవత్సరాల మేము 15 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము. తదుపరి దశలో మరిన్ని పెట్టుబడులను పెడుతాము" అని అవన్ స్ట్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ అకర్ష్ హెబ్బర్ చెప్పారు. సెమీకండక్టర్ ప్లాంట్ & డిస్ప్లే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవన్ స్ట్రేట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారు కోసం జాయింట్ వెంచర్ కింద కంపెనీని ఏర్పాటు చేయడానికి వేదాంత గ్రూప్, ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల(రూ.76,000 కోట్లు) పథకాన్ని ప్రకటించిన తర్వాత సెమీకండక్టర్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంస్థలలో మొదటి సంస్థ వేదాంత గ్రూప్. (చదవండి: ఎన్ఎస్ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్ఔట్ నోటీసులు..!) -
చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!
చాలా మంది పేదవాళ్ల కోసం తమకు తోచినరీతిలో రకరకాలు సహాయ సహకారాలు అందించడం గురించి విని ఉన్నాం. అంతెందుకు వాళ్లకు ఉండేందకు వసతి, మూడు పూటలా భోజనం వంటి రకరకాల ఏర్పాట్లు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా చూశాం. కానీ 11 ఏళ్ల బాలిక తనకు వీలైనంతలో అది కూడా పర్యావరణ రహితంగా నిరాశ్రయులకు ఉపయుక్తంగా ఉండేలా దుప్పట్లు తయారు చేసి తనకున్న దొడ్డ మనసును చాటుకుంది. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో వేల్స్‌లోని ప్రిస్టాటిన్కు చెందిన 11 ఏళ్ల అలిస్సా డీన్ నిరాశ్రయుల కోసం దుప్పట్లను తయారు చేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యులను సురక్షితంగా ఉంచే నిమిత్తం దుప్పట్లను తయారు చేయాలనుకుంది. అంతేకాదు దుప్పట్లు తయారు చేసే నిమిత్తం ప్లాస్టిక్ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చాక్లెట్ ట్రీట్ వంటి తదితర ప్యాకెట్లను ఉపయోగించి 80 దుప్పట్లను తయారు చేసింది. అయితే ఒక్కో దుప్పటి తయారు చేయడానికి 44 ప్యాకెట్లు అవసరం. అంతేకాదు విరామ సమయంలో అలిస్సా, ఆమె తల్లి రకరకాల సంచులను సేకరించే పనిలో నిమగ్నమౌతారు. ఈ మేరకు ప్రతి దుప్పటిని ఇస్త్రీ చేసి వెదర్ ప్రూఫింగ్(అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా) చేసి ఇస్తామని అలిస్సా తెలిపింది. అయితే తాము వారికి మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. అయితే వీటిని తయారుచేసేందుకు ఆమె కూతురు తన పాకెట్ మనీ ఉపయోగించేది. కానీ ఇప్పుడూ తాము నిధులను సమకూర్చుకుంటున్నాం అని అన్నారు. అంతేకాదు తాము తయారు చేసే దుప్పట్లు డెన్బిగ్షైర్తో పాటు కాన్వీ, ఫ్లింట్షైర్ అంతటా పంపిణీ చేశాం అని చెప్పారు. ఈ మేరకు అలిసా, ఆమె తల్లి ఫేస్బుక్ సాయంతో దుప్పట్లు తయారు చేయడానికి అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తామని తెలిపారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) -
Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్నాక్ ఐటమ్ చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడూ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన సామాన్ల లిస్టులో చిప్స్ తప్పనిసరి. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్లో ఉమ్మివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ చేసిన పాడు పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిప్స్ ప్యాకెట్లో ఉమ్మిన మహిళ మేకప్ ఆర్టిస్ట్ లిబ్బి బర్న్స్‌గా గుర్తించారు. సంగీతకారుడు హంటర్ హేస్ మాజీ ప్రియురాలు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే తరువాత లిబ్బికి నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఈ క్లిప్‌ను డిలీట్ చేసినప్పటికీ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. వీడియోలో.. అమెరికాలోని నాష్విల్లే కిరాణ దుకాణంలోకి వెళ్లిన లిబ్బి బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్‌ను తెరిచి అందులోంచి ఒకటి తీసుకొని రుచి చూస్తుంది. తనకు నచ్చకపోవడంతో చిప్స్ ప్యాకెట్లో ఉమ్మి మళ్లీ సీల్ చేసే ప్రయత్నం చేసింది. అనంతరం దాన్ని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. అంతేగాదు సీల్ చేసిన వాటర్ బాటిల్ నుంచి కూడా సిప్ తీసుకొని దానిని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. షాప్‌లో నుంచి తీసిన టాయిలెట్ పేపర్‌తో నాలుకను తుడుచుకోవడం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తున్న ఆమె కెమెరా చూస్తూ నవ్వుతోంది. అయితే ఈ దృష్యాలన్నీంటిని వీడియో తీసిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదు. చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!! ఇంతలో, ఒక వ్యక్తి, లిబ్బి వద్దకు వచ్చి నువ్వు దొంగతనం చేస్తున్నావా అని అడిగాడు, దానికి ఆమె “నేను దొంగతనం చేయడం లేదు. నేను ఆ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. నేను వాటిని ఎక్కడ ఉంచానో నాకు గుర్తుంది. ఇది నీకు సంబంధించినది కాదు’ అంటూ మండిపడింది. ఇక్కడితో వీడియో ముగియడంతో దీనిని చూసిన నెటిజన్లు.. ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా అంటూ లిబ్బి చర్యలపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదంతా నిజం కాదని, వినోదం కోసం ఇలా వీడియో చేసిందని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, క్రోగర్ షాప్ యాజమాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమ కస్టమర్ల భద్రత మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ‘నాష్విల్లే డివిజన్లోని మా స్టోర్‌కు చెందిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నట్లు మాకు తెలిసింది. మేము వెంటనే దర్యాప్తును ప్రారంభించాం. దీని ద్వారా మహిళ వీడియోలో చూపించిన వస్తువులను షెల్ఫ్‌లో ఉంచలేదని తెలిసింది. ఆమె వాటిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ వీడియో ఫన్ కోసం తీసినప్పటికీ పలువురిని ఇబ్బందులకు గురిచేస్తోంది. వినియోగదారుల ప్యాకేజింగ్‌ను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలి’ అని తెలిపారు. చదవండి: Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’ -
షావోమీ కొంపముంచిన చిప్స్..! ఆ పొజిషన్ యాపిల్ కైవసం..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీకి మరో గట్టి దెబ్బ తగిలింది. క్యూ3 ఆదాయ విషయంలో సమీప ప్రత్యర్థి కంపెనీల నుంచి గట్టి పోటీతో పాటుగా చిప్స్ కొరత షావోమీ కొంపముంచింది. చిప్స్ కొరతతో షావోమీకి గట్టి దెబ్బ..! ప్రపంచవ్యాప్తంగా పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు, ఆటోమొబైల్ కంపెనీలను సెమికండక్టర్స్ (చిప్స్) కొరత తీవ్రంగా వేధిస్తోంది. చిప్స్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల జాబితాలో షావోమీ కూడా నిలిచింది. చిప్స్ కొరత కారణంగా క్యూ3లో కంపెనీ వృద్ధి రేటు నెమ్మదించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ, షావోమీ 2021లో దాదాపు 190 మిలియన్ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 29 శాతం పెరిగిన కూడా యాపిల్ లాంటి కంపెనీలు షావోమీకు భారీ దెబ్బను వేశాయి. క్యూ3లో దాదాపు రూ. 90,910 కోట్ల విక్రయాలను జరిపిన షావోమీ అంచనాలను చేరుకోలేకపోయింది. రెండో స్థానం నుంచి ..! ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్స్ కొరత, చైనాలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల తగ్గుదల కారణంగా...ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాలో షావోమీ రెండోస్ధానం నుంచి మూడో స్ధానానికి పడిపోయింది. తాజాగా యాపిల్ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఐఫోన్-13 రాకతో షావోమీ అమ్మకాలు ఒక్కింతా పడిపోయాయి. ఐఫోన్-13ను రిలీజ్ కావడంతో ఇతర ఐఫోన్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ రేట్లు అమాంతం తగ్గాయి. దీంతో షావోమీ అంచనాలు తారుమారు అయ్యాయి. చదవండి: ఈవీ ఛార్జింగ్ సదుపాయాల కల్పన కోసం మెజెంటా భారీ పెట్టుబడులు -
ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్‌తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరత పలు ఆటోమొబైల్ కంపెనీలను తీవ్రంగా వేధిస్తూనే ఉంది. చిప్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్ కూడా చేరింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. డెలివరీ వాయిదా పడటంతో కొనుగోలుదారులకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! డెలివరీ ఎప్పుడంటే..! ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల తొలి బ్యాచ్ డెలివరీ నవంబర్ 30న జరగాల్సి ఉండగా...అది కాస్త డిసెంబర్ 15కు వాయిదా పడింది. చిప్సెట్స్, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా బైక్‌ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రిబుక్ చేసుకొని పూర్తి అమౌంట్‌ను చెల్లించిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31న డెలివరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షమాపణలు కోరిన ఓలా..! ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ బృందం , గ్లోబల్ సప్లై చైన్ల మధ్య శనివారం జరిగిన సమావేశంలో చిప్స్ , ఎలక్ట్రానిక్ విడిభాగాల డెలివరీ మరింత అధ్వాన్నంగా ఉండడంతో తొలి బ్యాచ్ స్కూటర్ల డెలివరీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డెలివరీ మరోసారి వాయిదా పడటంతో కొనుగోలుదారులకు కంపెనీ క్షమాపణలను చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల 4జీ కనెక్టివిటీలో భాగంగా కంపెనీ క్వాలకమ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా? -
వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో..
కాన్బెర్రా: సోషల్ మీడియాలో చాలా మంది వెరైటీ చాలెంజ్‌లు వేసుకుంటూ ఓవర్‌నైట్ ఫేమస్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైస్‌బకెట్ చాలెంజ్, ట్రీ చాలెంజ్ వంటి.. అనేక రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, మైఖేల్ బ్రోఖుయ్స్, మార్టిన్ సోకోలిన్స్కి జంట ఒక కొత్త రకం స్కిట్‌ను చేశారు. ఈ ఫన్నీ జంట.. ఎప్పటి కప్పుడు కొత్త ప్రయోగాలు, కామెడి స్కెచ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా వీరు.. ఒక విచిత్రమైన వీడియోను తమ మార్టియండ్ అండ్ మైఖేల్ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం దాన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. ఈ వీడియోలో.. ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్‌లో మైఖేల్ తనను తాను.. హట్ చిప్స్‌తో కప్పించుకున్నాడు. దాదాపు 75వేలరూపాయల.. చిప్స్‌లను అతని చుట్టు కుప్పగా పోశారు. ఈ చిప్స్‌లను తినడానికి అక్కడి పక్షులు.. అతని చుట్టు కొన్ని వందల పక్షులు గుమిగూడాయి. పాపం.. అతను మాత్రం కదలకుండా ఒక శిల్పం మాదిరిగా ఉండిపోయాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘బలే.. ఫన్నీగా ఉంది..’..‘పాపం.. చిప్స్‌లో కప్పేసారుగా..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Marty and Michael (@martyandmichael) -
Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే!
కష్టాలు అందరికీ వస్తాయి! ఐతే అవి కొందరిని ఉతికి ఆరేస్తాయి. మరికొందరేమో వాటినే ఉతకడంలో రాటుతేలిపోతారు. ఇటువంటి వాళ్లకి ఓడిపోవడం అస్సలు ఇష్టముండదు. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి ఈ రెండో కోవకి చెందినవాడు. కష్టపడే తత్వం, పట్టుదల కలిగిన ఇటువంటి వారిముందు విధి సైతం తలవంచవల్సిందే! తాజాగా చూపుకోల్పోయిన వృద్ధుడి జీవనపోరాటానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మొత్తం క్లిప్ చూస్తే అతని అంకిత భావం అవగతమౌతుంది. విధి నిర్థాక్షిణ్యంగా చూపుకోల్పోయేలా చేసినప్పటికీ ప్రతిరోజూ తను చేసే పనిని మాత్రం ఆపకుండా చేసుకుపోతున్నాడండీ! దీనిని చూసిన నెటిజన్లు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. అసలీ వీడియోలో ఏముందంటే.. నాసిక్‌లోని మఖ్మలబాద్ రోడ్డు పక్కనే ఇతని అరటి చిప్స్ దుకాణం ఉంది. మరుగుతున్న నూనెలో అరటి చిప్స్ చకచకా వేసి, బాగా వేగాక వాటిని ఒక పెద్ద గరిటెతో పక్కనే ఉన్న బేసిన్లో వేస్తాడు. తర్వాత హెల్పర్ వాటిని ఉప్పుకారంతో బాగాకలిపి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్‌చేయడం ఈ వీడియోలో కన్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను శాన్స్కర్ స్కేమణి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ ఓల్డ్మాన్కి మర్యాద ఇవ్వండి. నాసిక్‌లో మీకు తెలిసిన వారెవరైనా ఉంటే ఈ వృద్ధుడు తయారు చేసిన చిప్స్ కొనమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా అతనికి తిరిగి చూపును ప్రసాదించడంలో మనమందరం సహాయపడగలం’ అనే కాప్షన్‌ను ఈ పోస్టుకు జోడించాడు. ఈ వీడియో ద్వారా అతని చూపుకోసం విరాళాలు సేకరిస్తున్నాడట కూడా. కాగా ధర్మల్ పవర్ ప్లాంట్‌లోని వేడి, ఆవిరి కారణంగా అతను చూపు కోల్పోయాడని అధికారిక సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 12 లక్షల మంది దీనిని వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు ఈ వ్యక్తి స్థితిని చూసి చలించిపోతున్నారు. అతని హార్డ్ వర్క్‌ను ప్రశంశించకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా చూడండి!! చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. View this post on Instagram A post shared by Sanskar Khemani 🐒 (@sanskarkhemani) -
కనికట్టు కొలత.. బంకుల్లో పెట్రోల్ కాజేస్తున్న చిప్‌లు
విజయవాడలోని గుణదలలో ఓ పెట్రోల్ బంకులో మోసాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తూనికలు–కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లీటర్లకు 560 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు గుర్తించారు. మదర్ బోర్డును పరిశీలించగా అందులో కొన్ని మార్పులు చేసి తక్కువ కొలత వచ్చేట్టుగా చేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆ బంకులో ఉన్న రెండు యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 7వేల లీటర్ల పెట్రోలులో 840 లీటర్ల వరకు మోసం చేస్తున్నారు. బంకును సీజ్ చేసి యాజమానిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం జరిమానా విధించింది. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలోని ఓ పెట్రోల్‌బంకులో 5 లీటర్లకు 120 ఎంఎల్ తక్కువ కొలత వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బంకులోని మెకానికల్, ఎలక్ట్రానిక్ బోర్డులు చూపిస్తున్న నెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే... రెండు బోర్డుల మధ్య 62,458లీటర్ల వ్యత్యాసం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. లీటరుకు రూ. 100 చొప్పున చూసినా నెలలో రూ.62.45లక్షలు దోపిడీ చేశారని అర్థమవుతుంది. బంకులోని మదర్బోర్డ్, డిస్ప్లే బోర్డ్, సెన్సారల్ సర్క్యూట్ బోర్డులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపగా వాటిలో మైక్రో కంట్రోలర్ చిప్ అమర్చినట్టు బయటపడింది. బంకు యజమానిపై కేసు నమోదుచేశారు. ఇవే కాదు తూనికలు కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 600 పెట్రోల్ బంకుల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాటిలో 17 బంకుల్లో ఇలా చిప్‌లు పెట్టి మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. ఆ బంకులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. వడ్డాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి: పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్న కొద్దీ వాటి విక్రయాల్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి. పెట్రో ధర లీటరుకు రూ.100 దాటగానే... పెట్రోల్ బంకుల్లో మోసాలు కూడా 100కి.మీ. స్పీడ్ అందుకున్నాయి. పెట్రోలు బంకుల్లో మోసాలు అంటే ఏదో అక్కడ సిబ్బంది ప్రదర్శించే చేతివాటం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఈ పెట్రో దందా స్థాయి అంతకుమించి ఉంది. ఏపీలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రాలుగా ఈ ముఠాలు పనిచేస్తున్నాయి. ఈ మూడింటికి ముంబై వరకు లింక్ ఉంది. వీరికి సాంకేతిక సహకారం చైనాలోని ముఠాల నుంచి అందుతోందని అధికారులు గుర్తించారు. (చదవండి: టీడీపీలో ముసలం: తారస్థాయికి వర్గ విభేదాలు) హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక చిప్‌లు అమర్చి పెట్రోల్ కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా దందాను పోలీసులు పట్టుకోవడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఆ ముఠాను పట్టుకోవడంతోనే ఈ మోసాలకు చెక్ పడిందనుకుంటే పొరపాటే. పెట్రోల్ బంకుల్లో టెక్నాలజీ మారుస్తున్న కొద్దీ మోసగాళ్లు కూడా మరింతగా రాటుదేలుతున్నారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని రివర్స్ ఇంజినీరింగ్‌తో ఏమారుస్తున్నారు. ఏటా తూనికలు–కొలతల శాఖ దాడులు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న బంకులపై కేసులు నమోదు చేస్తున్నా...పెట్రోలు బంకుల మదర్‌బోర్డులను మారుస్తున్నా... మోసాలు ఆగడం లేదు. చైనా నుంచి కథ నడుపుతున్న ఆ ముఠా ‘రివర్స్ ఇంజనీరింగ్’ ఎత్తుగడతో మరోకొత్త దొడ్డిదారిని విజయవంతంగా కనిపెడుతుండటం విస్మయపరుస్తోంది. చెక్ మిజర్ క్యాన్‌లో పెట్రోల్ కొలతను పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్ ఫొటో) బంకుల్లో టెక్నాలజీ ట్యాంపరింగ్.. పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడే ముఠాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. బంకులకు సరఫరా అయిన పెట్రోలు/ డీజిల్, బంకుల ద్వారా విక్రయాలు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలు... తదితర వివరాలను బంకుల్లో ఉన్న మెకానికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు వెల్లడిస్తాయి. అందుకోసం కీ బోర్డ్, పల్సర్ బోర్డ్, మదర్ బోర్డ్, డిస్ప్లే బోర్డ్ అనే 4 వ్యవస్థలు ఉన్నాయి. ఎంత పెట్రోల్/ డీజిల్ కావాలో కీ బోర్డులో నమోదు చేయగానే.. మదర్ బోర్డ్‌కు సందేశం వెళ్తుంది. ఆ వెంటనే పల్సర్ బోర్డ్‌కు ఆ సందేశం చేరి నిల్వల నుంచి ఆ మేరకు పెట్రోల్/ డీజిల్ పంపింగ్ ద్వారా వినియోగదారుని వాహనం ట్యాంకులోకి చేరుతుంది. ఈ సందర్భంలో బంకుల నిల్వల్లో ఎంత పెట్రోల్/డీజిల్ ఉందన్నది మదర్ బోర్డ్, సెన్సార్ బోర్డ్ ఒకే రీతిలో చూపించాలి. కానీ పెట్రో ముఠాలు ఈ నాలుగు వ్యవస్థలను ట్యాంపర్ చేస్తున్నాయి. చిప్‌లతో మన పెట్రోలుకు చిల్లు ►పల్సర్ బోర్డ్‌కు మదర్ బోర్డ్‌కు మధ్యగానీ మదర్ బోర్డ్‌కు డిస్ప్లే బోర్డ్‌కు మధ్యగానీ ప్రత్యేక చిప్‌ను అమరుస్తున్నారు. దాంతో ఒక పరిమాణంలో పెట్రోల్ కావాలని ఫీడ్ చేస్తే... అంతకంటే తక్కువ మేరకు సందేశం వెళ్లి తక్కువ పెట్రోల్/డీజిల్ బయటకు వస్తుంది. కానీ డిస్ప్లే మాత్రం ఎంత ఫీడ్ చేశారో అంతే వేసినట్టు కనిపిస్తుంది. కానీ వాహనాల్లోకి అంతకంటే తక్కువ పెట్రోల్/డీజిల్ వెళ్తుంది. ►ఇక కీబోర్డ్‌ను ప్రత్యేక చిప్‌తో ట్యాంపర్ చేస్తున్నారు. ఉదాహరణకు కీ బోర్డులో 5 లీటర్లు అని ఫీడ్ చేసినా సరే మదర్‌బోర్డ్‌కు మాత్రం 4.5లీటర్లు అనే సందేశం వెళ్తుంది. దాంతో 4.5లీటర్ల పెట్రోల్/డీజిలే వస్తుంది. అంటే వినియోగదారుడు అరలీటర్ పెట్రోల్‌ను కోల్పోతాడన్నమాట. పెట్రో దోపిడీ ముఠాలు చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే డిస్ప్లే బోర్డు వెనుకభాగం మదర్ బోర్డులు చిప్‌లను ఏర్పాటు చేసి మోసానికి పాల్పడే పల్సర్ బోర్డ్‌లు ‘రివర్స్ ఇంజనీరింగ్’తో ఏమారుస్తున్న ముఠాలు బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న విషయం తొలిసారిగా హైదరాబాద్‌లోనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు, తూనికలు–కొలతల శాఖల అధికారులు నిర్వహించిన దాడుల్లో అటువంటి తరహా మోసాలు బయటపడ్డాయి. దాంతో పెట్రోల్ బంకుల యూనిట్లలో చిప్‌లు అమర్చేందుకు అవకాశం లేకుండా సీళ్లు వేసి సరికొత్త పరిజ్ఞానంతో కంపెనీలు పెట్రో బంకుల యూనిట్లను తయారు చేశాయి. అయినా మోసాలు ఆగలేదు. ఏడాదికో రెండేళ్లకో తూనికలు–కొలతల శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెట్రో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో సమర్థంగా బురిడీకొట్టిస్తున్నాయి. ఈ దందాకు పెట్రోల్ బంకుల యూనిట్లను ఉత్పత్తి చేసే కంపెనీల్లోని కొందరు నిపుణులు కూడా సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. బంకుల లీజులు.. ఆపై మోసాలు.. పెట్రోల్ బంకుల్లో భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు మన రాష్ట్రంలోని గుంటూరుజిల్లాలోని పల్నాడు ప్రాంతంలోనూ, ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలోనూ, హైదరాబాద్‌లలోనూ ఉన్నాయి. సుదీర్ఘకాలం పెట్రోల్ బంకుల్లో పని చేసిన కొందరు అందులో లోటుపాట్లు పసిగట్టారు. వారే ఒక గ్రూపుగా ఏర్పడి వీరు పెట్రోల్ బంకుల యూనిట్లు తయారు చేసే కంపెనీల్లోని కొందరు సాంకేతిక నిపుణులు, చైనాలోని ముఠాలతోనూ సంబంధాలు పెట్టుకున్నారు. ఆ ముఠా సభ్యులే ఏపీ, తెలంగాణతోపాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులను లీజుకు తీసుకోవడం మొదలుపెట్టారు. భారీ లీజు మొత్తం ఆశ చూపిస్తుండటంతో బంకుల యజమానులు వారికి తమ బంకులను లీజుకు ఇస్తున్నారు. పెట్రోలియం కంపెనీలు కొత్త టెక్నాలజీతో బంకుల యూనిట్లను రూపొందించగానే... ఆ కంపెనీలో పనిచేసే కొందరు నిపుణులే ఆ మదర్బోర్డ్, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్ప్లే బోర్డులను గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాల వద్దకు పంపిస్తారు. వాటిని ఎలా తయారు చేసిందీ చెబుతారు. అనంతరం గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లోని ముఠాలు పెట్రో బంకు యూనిట్ల మదర్ బోర్డు, పల్సర్ బోర్డ్, కీ బోర్డ్, డిస్ ప్లే బోర్డ్లను ఏకంగా చైనాకు పంపుతున్నాయి. అక్కడ సాంకేతిక నిపుణులతో వ్యవస్థీకృతమైన అతి పెద్ద ముఠాలు ఆ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఆ బోర్డులను ఎలా తయారు చేశారన్నది రివర్స్ ఇంజనీరింగ్ విధానం ద్వారా తెలుసుకుంటాయి. అనంతరం వాటిలో ఎక్కడ ఎలాంటి చిప్పెడితే మోసం చేయొచ్చనేది కనిపెడతాయి. ఆ విషయాన్ని ఇక్కడి ముఠాలకు చేరవేస్తాయి. అనంతరం ఇక్కడి ముఠాలు ఆ మేరకు స్థానికంగా ఉన్న నిపుణులతో తాము లీజుకు తీసుకున్న పెట్రోల్ బంకుల యూనిట్లలో ఆ చిప్‌లను అమర్చి భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. అందుకే యజమానులు నిర్వహిస్తున్న బంకుల్లో కంటే లీజుకు ఇచ్చిన పెట్రోల్ బంకుల్లోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మొదలైన దేశాల్లో కూడా ఇదే రీతిలో భారీగా పెట్రోల్ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. కొత్తగా రిమోట్ కంట్రోల్.. అధికారుల తనిఖీలు, దాడులు నిరంతరాయంగా జరుగుతుండడంతో దీనినుంచి తప్పించుకోవడం కోసం మరో కొత్త వ్యవస్థనుకూడా ఈ ముఠాలు కనుక్కున్నాయి. పెట్రోల్ బంకుల్లో మదర్ బోర్డ్, పల్సర్ బోర్డ్, డిస్ ప్లే బోర్డులలో చిప్‌లు ఏర్పాటు చేసి ట్యాంపర్ చేస్తున్న ముఠాలు వాటని్నంటికి కేంద్రీకృత వ్యవస్థను రూపొందించి దానిని ఓ రిమోట్ కంట్రోల్‌కు అనుసంధానిస్తున్నాయి. తనిఖీలకు అధికారులు రాగానే వెంటనే ఆ రిమోట్ కంట్రోల్‌తో ఆ బోర్డులన్నీ సాధారణ స్థితికి వచ్చేట్టుగా మేనేజ్ చేస్తున్నాయి. దాంతో చాలా పెట్రోల్ బంకుల్లో మోసాలు అధికారుల తనిఖీల్లో కూడా బయటపడటం లేదు. అధికారులు అంతా ఓకే అని వెళ్లిపోగానే ఆ రిమోట్ కంట్రోల్‌ను ఆన్ చేయగానే కొలతను కంట్రోల్ చేసే చిప్ పనిచేయడం ప్రారంభిస్తుంది. రాష్ట్రంలో రోజుకు రూ.2కోట్లపైనే దోపిడీ... చిప్‌లు అమర్చడం ద్వారా 10 లీటర్ల పెట్రోల్‌కు అర లీటరు నుంచి లీటరున్నరవరకు దోపిడీ చేస్తున్నట్టుగా గుర్తించారు. పెట్రోల్‌కు త్వరగా ఆవిరయ్యే గుణం ఉంది కాబట్టి 10 లీటర్లకు 50ఎంఎల్ వరకు కొలత తక్కువ రావచ్చని ప్రమాణాలు నిర్దేశించారు. కాగా చిప్‌లు అమర్చిన బంకుల్లో 10 లీటర్లకు అర లీటరు నుంచి లీటరున్నర వరకు తక్కువ కొలుస్తున్నారు. ఎవరికీ సందేహం రాకుండా ఉండేందుకు ఎక్కువగా 10 లీటర్లకు లీటరు వరకు మోసానికి పాల్పడుతున్నారు. సాధారణంగా ఏకకాలంలో పెద్ద సంఖ్యలో బంకులపై దాడులు నిర్వహిస్తే 5శాతం బంకుల్లో చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్నట్టు గత రికార్డులు తెలుపుతున్నాయి. ♦మన రాష్ట్రంలో వివిధ కంపెనీలకు చెందిన మొత్తం 3,878 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో పెట్రోల్ విక్రయించే పెట్రోల్ యూనిట్లు దాదాపు 15వేలు ఉన్నాయి. ♦రోజుకు దాదాపు 1.20 కోట్ల లీటర్ల పెట్రోల్, 2.70కోట్ల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. అంటే మొత్తం దాదాపు 4కోట్ల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు అమ్ముతున్నారు. ♦సగటున 200 పెట్రోల్ బంకుల్లో మోసం చేస్తున్నారని భావించినా సరే వాటిలో మొత్తం మీద రోజుకు 20.63 లక్షల లీటర్ల పెట్రోలియం ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ♦చిప్‌లు అమరిస్తే పది లీటర్లకు సగటున లీటరు మోసం చేస్తున్నారని లెక్కించినా సరే ... 20.63లక్షల లీటర్లకు 2.06లక్షల లీటర్లు మోసం చేస్తున్నట్టు. ♦ప్రస్తుత ధర ప్రకారం లీటరుకు సగటున రూ.100 ధర వేసుకున్నా సరే రోజుకు రూ.2.06కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మన రాష్ట్రంలో అంచనా ఇలా ఉంటే ఇక దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారో ఊహించవచ్చు. బంకుల్లో సిబ్బంది మోసాలు సరేసరి.... చాలా పెట్రోల్ బంకుల్లో సిబ్బంది కూడా మోసం చేస్తున్నారు. బంకుల్లో రెండు డిస్పాచ్ పంపులు, రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఓ డిస్ప్లేలో ‘సున్నా’ చూపిస్తూ ఆ పంపు నుంచి కాకుండా మరో డిస్పాచ్ పంపు నుంచి పెట్రోల్/ డీజిల్ పోస్తారు. ♦కార్లు, ఇతర పెద్ద వాహనాల్లో పెట్రోల్/డీజిల్ కొంత వరకు నింపిన తరువాత పైప్ బయటకు తీసి మరో వాహనం వస్తే అందులో నింపుతున్నారు. కారు, ఇతర వాహనాల్లో ఉన్నవారు డిస్ప్లే బోర్డునే చూస్తున్నారు. వారి కారు సైడ్ మిర్రర్‌కు ఆయిల్ ట్యాంకర్‌కు మధ్యలో ఒకరు వచ్చి అడ్డుగా నిలబడతారు. ♦బంకులో సిబ్బంది పెట్రోల్ పూర్తిగా పోసే వరకు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. దృష్టి మళ్లించకూడదు. ♦పెట్రోల్ నాణ్యతపై సందేహం ఉంటే వెంటనే ఫిల్టర్ చెక్ చేయమని అక్కడి సిబ్బందిని డిమాండ్ చేయాలి. పెట్రోల్ నాణ్యతను పరీక్షించడానికి పెట్రోల్ బంకుల వద్ద ఫిల్టర్ పేపర్లు అందుబాటులో ఉంచాలి. వాటిపై పెట్రోల్ ఒక చుక్క వేయగానే పూర్తిగా ఆరిపోయి మరక కూడా కనిపించకూడదు. అలా అయితేనే ఆ పెట్రోల్ నాణ్యమైనది. మరక కనిపిస్తే కల్తీ చేసినట్టు భావించాలి. డీలర్లు చేయాల్సినవి... ♦పెట్రోల్‌బంకుల్లో పంపుల(నాజల్)లను రోజూ తనిఖీ చేయాలి. ఠి పెట్రోల్ సాంద్రతను రోజూ నమోదు చేయాలి. ♦వినియోగదారులకు సందేహం వస్తే వారి సమక్షంలోనే నిర్దేశించిన 5 లీటర్ల క్యాన్‌లో పెట్రోల్ నింపి పరీక్షచేయాలి. ♦వినియోగదారులు ఫిర్యాదు చేయాలని భావిస్తే అందుకు సంబంధించిన అధికారుల నంబర్లను పెట్రోల్ బంకుల్లో ప్రదర్శించాలి. ♦పెట్రోల్ మోసాలపై తూనికలు, కొలతల శాఖ టోల్‌ఫ్రీ నంబరు 18004254202ను అందుబాటులోకి తెచ్చింది. ♦ఆన్లైన్లో కూడా ఫిర్యాదులు చేసేందుకు clm&ap@nic.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. పెట్రోల్ బంకుల మోసాలపై కఠిన చర్యలు తీసుకుంటాం పెట్రోల్ బంకుల్లో మోసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. చిప్‌లు అమర్చడం, ఇతరత్రా విధానాలతో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందుకోసం తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో మళ్లీ తనిఖీలు ముమ్మరం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. – కేఆర్ఎం కిశోర్ కుమార్, కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ మోసాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు పెట్రోల్ బంకుల్లో మోసాలను కట్టడి చేయడానికి తూనికలు–కొలతల శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్, డీజిల్ కొలత, నాణ్యత సక్రమంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించడానికి 10 రకాల తనిఖీలు నిర్వహిస్తున్నాం. అందుకోసం ఫ్లయింగ్ స్వా్కడ్లు, ఇతర తనిఖీ బృందాలను నియోగించాం. వాహనదారులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు ప్రవేశపెట్టడంతోపాటు ఆన్లైన్లో ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం కల్పించాం. – రామ్‌కుమార్, జాయింట్ కంట్రోలర్, తూనికలు –కొలతల శాఖ చదవండి: గణేష్ ఉత్సవాల్లో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
పండుగ సీజన్‌పై ఆటో కంపెనీల ఆశలు
న్యూఢిల్లీ: చిప్‌ల కొరతతో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్లో అమ్మకాలు మరింత మెరుగ్గానే ఉండవచ్చని ఆటోమొబైల్ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఓనంతో మొదలైన పండుగ సీజన్ నవంబర్‌లో దీపావళితో ముగియనుంది. ఇప్పటిదాకానైతే డిమాండ్ బాగానే ఉండటంతో, అక్టోబర్‌లో సీజన్ తారస్థాయికి చేరితే సన్నద్ధంగా ఉండటం కోసం డీలర్లకు సరఫరా పెంచేందుకు వాహన కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటర్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. బుకింగ్‌లు, ఎంక్వైరీలు, రిటైల్ విక్రయాలు గణనీయంగానే ఉంటున్నాయని.. సరఫరా తరఫునే కొన్ని సమస్యలు ఉండగా, వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. పండుగ సీజన్లో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగవచ్చని, ప్యాసింజర్ వాహనాల విభాగంలో వీటి అమ్మకాల వాటా సగం దాకా ఉండవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో వీజే నక్రా పేర్కొన్నారు. ఆరి్థక రికవరీ, వ్యక్తిగత రవాణా వాహనాల అవసరం పెరగడం, కొత్త వాహనాల ఆవిష్కరణ వంటి అంశాలతో రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత మెరుగుపడొచ్చని టయోటా కిర్లోస్కర్ మోటర్ అసోసియేట్ జీఎం వి సిగమణి తెలిపారు. -
లాక్డౌన్ కాలంలో వీటికి భారీ డిమాండ్!
కరోనా మహమ్మారి కాలంలో చాలా వ్యాపారులు కుదెలు అయినప్పటికీ కొన్ని వ్యాపారులు మాత్రం ఎన్నడూ లేనంతగా తిరిగి పుంజుకున్నాయి. అటువంటి వాటిలో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ పెరిగింది. ఈ మహమ్మారి కాలంలో వినియోగదారులు రక రకాల తినుబండరాలపై ఆసక్తి కనబరిచారు. గురువారం కాంటార్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఏప్రిల్-మే 2019 నుంచి ఏప్రిల్-మే 2020 మధ్య స్నాక్స్ కు డిమాండ్ 8 శాతం పెరగింది. ఆ తర్వాత సంవత్సరం ఏప్రిల్-మే 2020 నుంచి ఏప్రిల్-మే 2021 మధ్య వీటి డిమాండ్ 12 శాతం పెరిగింది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి వేగంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్డౌన్ విధించింది. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉండటం, బయటకు వెళ్లే ఆస్కారం లేకపోవడంతో ప్యాకేజ్డ్ కుకీలు, చిప్స్, నూడుల్స్, మాకరోని వంటి స్నాక్స్ కు డిమాండ్ ఏర్పడింది. అలాగే, ప్రజలు తమ ఇంట్లో కొత్త రకంవంటకాలతో ప్రయోగాలు చేశారు. ఇంకా పట్టణాలలోని ప్రజలు బ్రాండెడ్ ఆహారాలను కొనుగోలు చేశారు. లాక్డౌన్ కాలంలో యూట్యూబ్ లోని ఫుడ్ మేకింగ్ వీడియోలకు డిమాండ్ ఏర్పడింది అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ మహమ్మారి కాలంలో అల్పాహార స్నాక్స్ కి భారీగా డిమాండ్ ఏర్పడినట్లు అని కాంటార్ తెలిపారు. ఉదాహరణకు పార్లే ప్రొడక్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ రెండూ గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో గణనీయమైన వృద్ధిని నమోదుచేశాయి. -
2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ
డెహ్రడూన్: ఆమె ఒకప్పుడు అంతర్జాతీయ వేదికల మీద మన దేశ జాతీయ పతకాన్ని రెపరెపలాడించారు. భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. దేశానికి అవసరమైనప్పుడు ఆమె నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి.. దేశ కీర్తిని పెంచారు. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్, బిస్కట్ ప్యాకెట్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు దిల్‌రాజ్ కౌర్. ఆ వివరాలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన దిల్‌రాజ్ కౌర్ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ఈ రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు గెలుచుకున్నారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్ పిస్టల్ షూటర్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు ఒక్క చిప్స్ ప్యాకెట్ ధర కేవలం పది రూపాయలు మాత్రమే అంటూ ఇలా రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను.. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరఖండ్ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం, మద్దతు లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నాను’’ అని తెలిపారు. చదవండి: కరోనాతో ‘షూటర్ దాదీ’ మృతి.. మిమ్మల్ని మిస్సవుతున్నాం -
చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర చిరుతిండి ప్యాకెట్లు కొంటే ఉచితంగా డేటాను అందిస్తోంది. 10 రూపాయల ప్యాకెట్‌తో 1 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ డోరిటో ఇతర తినదగిన వస్తువుల ప్యాకెట్ కొనుగోలు చేసిన ప్రతిసారీ వారికి ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ఉచిత ఇంటర్నెట్ డేటాను పొందాలంటే ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ కోసం వెతకాలి. ఆతరువాత ఈ కోడ్‌ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసి,ఆపై మైకూపన్‌ల విభాగంలో నమోదు చేయాలి. అంటే ఎయిర్టెల్ వినియోగదారులు చిప్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్యాకెట్ తో పాటు కూపన్‌ను తీసుకోవడం మర్చిపోకూడదు. 10 రూపాయల విలువైన చిప్స్ కొనుగోలు చేస్తే, ఒక జీబీ ఉచితం. అదే 20 రూపాయలు కొనుగోలు చేస్తే, 2 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అయితే రీడీమ్ చేసిన తేదీ నుండి మూడు రోజులు మాత్రమే ఈ ఉచిత డేటా చెల్లుతుంది. వినియోగదారులకు ఉత్తమ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పోకడలను సరిపోలే కొత్త వ్యూహాలను తాము అభివృద్ధి చేస్తామనీ, ఇందులో భాగంగానే ఎయిర్టెల్ తో భాగస్వామ్యం అని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ కంటెంట్ చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారన్నారు. -
హువావేకు మరో దెబ్బ
వాషింగ్టన్: చైనా టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం హువావేకు అమెరికాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశ కార్యకలాపాలపై నిఘా పెడుతోందంటూ చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్ సంస్థపై ఇప్పటికే పలు ఆంక్షలను విధించిన డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సోమవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హువావేకి అనుబంధంగా 21 దేశాల్లో పనిచేస్తున్న మరో 38 సంస్థలపై ఆంక్షలను విధించింది. అమెరికన్ చట్టాన్ని అధిగమించకుండా నిరోధించేందుకు వీటిని బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. అమెరికా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ లేదా టెక్నాలజీతో అభివృద్ధి చేసిన లేదా ఉత్పత్తి చేసిన, విదేశీ సంస్థల చిప్‌లతో సహా ప్రత్యేక లైసెన్స్ లేకుండా సెమీకండక్టర్లను పొందకుండా నిరోధించే లక్ష్యంతో ఈ ఆంక్షలు విధించింది. ఈ చర్యలు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫారెన్-ప్రొడ్యూస్డ్ డైరెక్ట్ ప్రొడక్ట్ (ఎఫ్‌డిపి) నిబంధనలను సవరించింది. దీంతో మొత్తం సంస్థల సంఖ్య 152 కి చేరింది. (అలీబాబాకు ట్రంప్ సెగ) చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన విధాన లక్ష్యాలను నెరవేర్చడానికి అమెరికా సాఫ్ట్వేర్ , టెక్నాలజీ నుండి అభివృద్ధి లేదా ఉత్పత్తి చేసిన అధునాతన సెమీకండక్టర్లను పొందటానికి హువావే, దాని విదేశీ అనుబంధ సంస్థలు తమ ప్రయత్నాలను విస్తరించాయని వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ ఆరోపించారు జాతీయ భద్రతను , విదేశాంగ విధాన ప్రయోజనాలను బలహీనం చేసేలా థర్డ్ పార్టీల ద్వారా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభావిత కంపెనీలు, వ్యక్తులకు ప్రధానంగా హువావే కస్టమర్లకు పరికరాలు, సాఫ్ట్వేర్, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను గుర్తించి మార్చుకోవడానికి, వారి కార్యకలాపాలను విండ్-డౌన్ చేయడానికి తాము తగినంత సమయాన్ని ఇచ్చామని , ఇపుడు ఆ సమయం ముగిసిందని విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో ఒక ప్రత్యేక ప్రకటనలో వెల్లడించారు. కాగా 2019లో హువావేపై భారీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల హువావే టెక్నాలజీస్, జెడ్‌టీఈ కార్పోరేషన్లను ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్(ఎఫ్ సీసీ) యూనివర్సల్ సర్వీస్ ఫండ్ నుంచి నిషేధించింది. చైనా మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలతో ఈ రెండు కంపెనీలకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఇరాన్‌కు సహాయం, ఇతర ఆరోపణలతో హువావేపై న్యాయ శాఖ అభియోగాలు మోపింది. -
కాలక్షేపం కోసం వీటిని తినేస్తున్నారు..
సాక్షి, సిటీబ్యూరో : చిన్న పిల్లలు నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంతో ఇష్టపడేది స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు వాటికి కష్టకాలం వచ్చింది. సూపర్ మార్కెట్, కిరాణా దుకాణాల్లోనూ స్టాక్ లేక వినియోగదారులు నిరాశకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు బిస్కెట్లు, చాక్లెట్లు, వేపర్స్, చిప్స్, కార్న్‌ఫ్లేక్, కుర్కురే, పల్లీ చిక్కీలు, ఐస్‌క్రీమ్, నూడిల్స్, పాస్తా, చుడువా, సూప్స్, నమ్కిన్, గులాబి జామున్ తదితర స్నాక్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ నిల్వలు నిండుకున్నాయి. ఒక వైపు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు ఇళ్లలో ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం కోసం వీటిని ఎక్కువగా తింటున్నారు. దీంతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్‌కు ఒకేసారి డిమాండ్ పెరిగింది. మరోవైపు లాక్‌డౌన్‌తో వాటి ఉత్పత్తి ఆగి సరఫరా లేకుండా పోయింది. ఈ కారణంగానే మార్కెట్లో ఇప్పుడు స్నాక్స్ కొరత ఏర్పడింది. తాజాగా ఇండస్ట్రీ సెక్టార్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినా..కార్మికుల కొరతతో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. దీంతో వాటి సరఫరా తగ్గుముఖం పట్టింది. స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటెమ్స్‌కు ఇండెంట్ ఆర్డర్స్ పెడితే...పెట్టిన దాంట్లో కనీసం 30 శాతం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొందని వ్యాపారులు, సూపర్ మార్కెట్ల మేనేజర్లు పేర్కొంటున్నారు. (మహమ్మారి.. దారి మారి! ) లోకల్ ఉత్పత్తులు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడంతో కొంతమేర లోకల్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక కొన్ని సూపర్ మార్కెట్స్ తమ సంస్థల పేర్లతో స్నాక్స్, ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అమ్మడం ప్రారంభించాయి. పేరొందిన సూపర్ మార్కెట్లు, స్థానిక చిన్న చిన్న సంస్ధలు సైతం సొంతంగా బిస్కెట్లు, చిప్స్, ఐస్‌క్రీమ్, నమ్కిన్, నూడుల్స్, సూప్స్ తదితర ఐటెమ్స్‌ను సొంతంగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు మాత్రం బ్రాండ్ ఉత్పత్తులపైనే ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. కిరాణా దుకాణాల్లో మాత్రం పేద, మధ్య తరగతి వర్గాల నుంచి మాత్రం లోకల్ ఉత్పత్తులకు ఆదరణ బాగానే లభిస్తోంది. (కరోనా: టాస్క్‌ఫోర్స్‌కు రిస్క్!) -
హాట్ హాట్ చిప్స్
జగిత్యాల టౌన్: కాలానికి అనుగుణంగా రుచులు కూడా మారుతున్నాయి. ఆహార ప్రియులు కొత్తకొత్త రుచులను కోరుతున్నారు. ఏదిఏమైనా సాయంత్రం స్నాక్స్ పక్కా ఉండాల్సిందేనని ఆరాటపడుతున్నారు. పట్టణాల్లో అయితే ఇది తప్పనిసరిగా మారింది. రుచితో పాటు వేడివేడిగా హాట్ చిప్స్ అందించే కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో యువకులు హాట్ చిప్స్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. హాట్ చిప్స్‌పై ఈఆదివారం ప్రత్యేక కథనం మీకోసం ..... అందరికీ అందుబాటులో చిన్నారులు, పెద్దలు సాయంత్రం స్నాక్స్ కోసం చిప్స్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చిప్స్ కేంద్రాల్లో వివిధ పిండి పదార్థాలతో ఘటి, బొంది, రింగులు, కారపూస, మిక్చర్, శబ్దాన, దల్మోట్, మురుకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చిప్స్‌లో ఆలు, కాకరకాయ, అల్లం ఆలు చిప్స్, బనాన చిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతో రుచి తాజాగా ఎప్పటకప్పుడు పిండి పదర్ధాలు తయారు చేయడంతో ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజు స్నాక్స్ కొనుగోలు చేస్తుంటాం. రుచి, శుచితో ఉండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. – గోపినాథ్, జగిత్యాల ఆదరణ లభిస్తోంది మొదట్లో ఇబ్బంది ఎదురైంది. రుచి శుభ్రత విషయంలో రాజీ పడలేదు. రోజు రోజుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా చిప్స్ అమ్మకాలు ఉంటాయి. – నరేశ్, నిర్వాహుకుడు, జగిత్యాల -
బయట పడిన తిను'బండారం'
తణుకు టౌన్: పట్టణంలో కాలాతీతమైన తినుబండారాలు అమ్ముతున్న షాపుపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు దాడి చేసి నిల్వ పదార్థాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సత్యవతి ఆస్పత్రి ఎదురుగా కిరాణా, కిళ్లీ షాపులను నిర్వహిస్తున్న పెరుమాళ్ల సాయి గుప్తా గడువు పూర్తయిన కుర్కురే, మ్యాగి, మూంగ్‌దాల్ వంటి చిరు తినుబండారాల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో షాపును తనిఖీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ డెప్యూటీ తహసీల్దార్ డి.అశోక్ వర్మ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు షాపులో నిల్వ ఉన్న ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇదే షాపులో వంట గ్యాస్ సిలిండర్ ఉపయోగించడంతో సిలిండర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు డీటీ వర్మ తెలిపారు. బయట పడిందిలా... మంగళవారం రాత్రి తణుకులోని సత్యవతి ఆస్పత్రిలో ఒక మహిళకు రక్తం అవసరం కావడంతో రక్తదానం చేయడానికి భీమవరంలో బీఎల్ చదువుతున్న, పెనుగొండకు చెందిన కర్తాకులు కుమార్ ఆస్పత్రికి వచ్చాడు. అతను రక్తం ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని, తర్వాత పిలుస్తాం అప్పుడు రండని చెప్పడంతో కుమార్ ఎదురుగా ఉన్న షాపులో రూ.5 విలువ చేసే మూంగ్‌దాల్ ప్యాకెట్లు మూడు కొని ఒక ప్యాకెట్‌ను అక్కడే ఓపెన్ చేశాడు. ప్యాకెట్ ఓపెన్ చేయగానే ప్యాకెట్ నుంచి దుర్వాసన రావడంతో మిగిలిన రెండుప్యాకెట్లు తీసుకుని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని కుమార్ షాపు యజమానిని అడిగాడు. దీనికి అతను సరిగా సమాధానం చెప్పకపోగా.. దబాయించాడు. గత్యంతరం లేక మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కుమార్ ఫిర్యాదు చేశాడు. వారు షాపులో తనిఖీలు నిర్వహించి నిల్వ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాగే అన్ని షాపులపై దాడులు చేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. అడిగితే ఘర్షణకు దిగారు మంగళవారం రాత్రి సత్యవతి ఆస్పత్రి వద్ద మూంగ్‌దాల్ ప్యాకెట్లు 3 కొని అక్కడే ఒక్కటి ఓపెన్ చేశా. ఓపెన్ చేయగానే దుర్వాసన రావడంతో వద్దని వేరే ప్యాకెట్లు ఇవ్వాలని షాపు యజమానిని అడిగా. అతను తన స్నేహితులతో కలిసి నాపై ఘర్షణకు దిగడంతో గత్యంతరం లేక రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశా.– కర్తాకుల కుమార్, బాధితుడు, పెనుగొండ -
పసివాడి ప్రాణం తీసిన ‘రింగ్స్’
ఏలూరు(వన్‌టౌన్): ‘రింగ్స్’ తినుబండారం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. ప్యాక్‌లో రింగ్స్‌తో కలిపి ఉంచిన రబ్బరు బొమ్మ మింగి బాలుడు ఊపిరాడక మృతిచెందాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 29వ డివిజన్ తాపీ మేస్త్రీ కాలనీ కుమ్మరిరేవులో నివాసముంటున్న మీసాల లక్ష్మణరావు టైల్స్ కార్మికుడు. బుధవారం ఉదయం అతని భార్య దుర్గ తన కుమారుడు నిరీక్షణ్‌కుమార్ (4)ను దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురమ్మని పంపారు. నిరీక్షణ్‌కుమార్ పాల ప్యాకెట్‌తో పాటు తినడానికి రింగ్స్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చాక రింగ్స్ ప్యాకెట్ తింటూ అందులో ఉన్న రబ్బరు బొమ్మను కూడా మింగేయడంతో అది గొంతుకు అడ్డుపడింది. ఊపిరాడక విలవిల్లాడుతున్న బిడ్డను చూసిన తల్లి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంత వాసులను తీవ్ర విషాదానికి గురిచేసింది.