Woman Spitting Into Chips Packet In US Grocery Store, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా?

Dec 7 2021 7:25 PM | Updated on Dec 8 2021 10:40 AM

US Woman Spits Into Packets Of Chips At Grocery Store In Viral Video - Sakshi

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్నాక్‌ ఐటమ్‌ చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడూ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన సామాన్ల లిస్టులో చిప్స్‌ తప్పనిసరి. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ మహిళ చిప్స్‌ ప్యాకెట్‌లో ఉమ్మివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ చేసిన పాడు పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిప్స్‌ ప్యాకెట్‌లో ఉమ్మిన మహిళ మేకప్‌ ఆర్టిస్ట్‌ లిబ్బి బర్న్స్‌గా గుర్తించారు. సంగీతకారుడు హంటర్‌ హేస్‌ మాజీ ప్రియురాలు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే తరువాత లిబ్బికి నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఈ క్లిప్‌ను డిలీట్‌ చేసినప్పటికీ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. 

వీడియోలో.. అమెరికాలోని నాష్‌విల్లే కిరాణ దుకాణంలోకి వెళ్లిన లిబ్బి బంగాళాదుంప చిప్స్‌ ప్యాకెట్‌ను తెరిచి అందులోంచి ఒకటి తీసుకొని రుచి చూస్తుంది. తనకు నచ్చకపోవడంతో చిప్స్‌ ప్యాకెట్‌లో ఉమ్మి మళ్లీ సీల్‌ చేసే ప్రయత్నం చేసింది. అనంతరం దాన్ని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. అంతేగాదు సీల్ చేసిన వాటర్ బాటిల్ నుంచి కూడా సిప్ తీసుకొని దానిని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. షాప్‌లో నుంచి తీసిన టాయిలెట్ పేపర్‌తో నాలుకను తుడుచుకోవడం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తున్న ఆమె కెమెరా చూస్తూ నవ్వుతోంది. అయితే ఈ దృష్యాలన్నీంటిని వీడియో తీసిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదు. 
చదవండి: ఆ షార్క్‌ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!

ఇంతలో, ఒక వ్యక్తి, లిబ్బి వద్దకు వచ్చి నువ్వు దొంగతనం చేస్తున్నావా అని అడిగాడు, దానికి ఆమె “నేను దొంగతనం చేయడం లేదు. నేను ఆ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. నేను వాటిని ఎక్కడ ఉంచానో నాకు గుర్తుంది. ఇది నీకు సంబంధించినది కాదు’ అంటూ మండిపడింది. ఇక్కడితో వీడియో ముగియడంతో దీనిని చూసిన నెటిజన్లు.. ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా అంటూ లిబ్బి చర్యలపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదంతా నిజం కాదని, వినోదం కోసం ఇలా వీడియో చేసిందని చెబుతున్నారు.

ఈ సంఘటన తర్వాత, క్రోగర్ షాప్‌ యాజమాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమ కస్టమర్ల భద్రత మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ‘నాష్‌విల్లే డివిజన్‌లోని మా స్టోర్‌కు చెందిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నట్లు మాకు తెలిసింది. మేము వెంటనే దర్యాప్తును ప్రారంభించాం. దీని ద్వారా మహిళ వీడియోలో చూపించిన వస్తువులను షెల్ఫ్‌లో ఉంచలేదని తెలిసింది. ఆమె వాటిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ వీడియో ఫన్‌ కోసం తీసినప్పటికీ పలువురిని ఇబ్బందులకు గురిచేస్తోంది. వినియోగదారుల ప్యాకేజింగ్‌ను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలి’ అని తెలిపారు.
చదవండి: Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement