విషాదం: ఇంటెల్‌ కో-ఫౌండర్‌, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత

Intel cofounder Gordon Moore dies at 94 - Sakshi

న్యూయార్క్: అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్ మూరే (94)కన్నుమూశారు. శనివారం హవాయిలోని తన స్వగృహంలో  తుది శ్వాస విడిచారు. ఇంటెల్ కార్పొరేషన్ తన సహ వ్యవస్థాపకుడికి నివాళులర్పించింది. ఆయన చిరస్మరణీయం.. గొప్ప విజనరీని కోల్పోయమంటూ ట్వీట్‌ చేసింది. మూరే దూరదృష్టి హైటెక్ యుగానికి వేదికైంది అంటూ వ్యాపార వర్గాలు నివాళులర్పించాయి. యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి కంపెనీలకు ఆగమనానికి  ఆద్యుడు మూరే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మూరే ఎప్పుడూ 'యాక్సిడెంటల్ ఎంటర్‌ప్రెన్యూర్' అని తనను తాను పిలుచుకునేవారు. ఎందుకంటే ఆయన  టీచర్‌ కావాలనుకునేవారట. కానీ ఎలక్ట్రానిక్స్‌ను ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటిగా మార్చి సరికొత్త విప్లవానికి నాంది పలికారు. మైక్రోచిప్ పరిశ్రమలో 500 డాలర్ల పెట్టుబడితో బిలియనీర్‌గా అవతరించారు. 1960లలో కంప్యూటర్ చిప్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన కాలిఫోర్నియా సెమీకండక్టర్ చిప్ మేకర్ ఇంటెల్‌.. సిలికాన్ వ్యాలీకి ఆ పేరు రావడానికి దోహదపడింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, గతంలో అమెరికన్ విస్తారమైన ఉక్కు పారిశ్రామిక ఆధిపత్యానికి బ్రేక్‌  వేసింది ఇంటెల్‌.

ఇంటెల్‌ ఆవిష్కారం
మూరే అతని దీర్ఘకాల సహచరుడు రాబర్ట్ నోయ్స్ జూలై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. వందల మిలియన్ల మందికి ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తెచ్చిన ఘనత, టోస్టర్ ఓవెన్‌లు, బాత్‌రూమ్ స్కేల్స్ , టాయ్ ఫైర్ ట్రక్కుల నుండి టెలిఫోన్‌లు, ఆటోమొబైల్స్ ,ఎయిర్‌క్రాఫ్ట్ దాకా తమ మైక్రోప్రాసెసర్‌లతో అరుదైన ఘనతను మూరే దక్కించుకున్నారు. 1975లో ఇంటెల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికంటేముందు మూరే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు 1979లో బోర్డ్ ఛైర్మన్, సీఈవోగా నియమితుడయ్యారు. 1987లో సీఈవోగా పదవి నుంచి వైదొలగి ఛైర్మన్‌గా ఉన్నారు.

మరో విశేషమేమిటంటే, 1990ల నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన 80శాతం కంప్యూటర్లలో ఇంటెల్‌ మైక్రోప్రాసెసర్లే.  ఫలితంగా చరిత్రలో  అత్యంత సంపన్నమైన సెమీ కండక్టర్ వ్యాపారంగా నిలిచింది.

(ఇదీ చదవండి:  బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్‌ జుకర్‌బర్గ్)

గొప్ప దాత మూరే
మూరే, అతని భార్య బెట్టీ మూరేతో కలిసి విస్తృత దానాలు చేశారు. 2001లో  వీరిద్దరూ కలిస బెట్టీ మూరే ఫౌండేషన్‌ను స్థాపించారు. 175 మిలియన్ ఇంటెల్‌ షేర్లను విరాళంగా ఇచ్చారు. 2001లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి 600 మిలియన్‌ డాలర్లతో ఒక విశ్వ విద్యాలయానికి  అందించిన ఏకైక గొప్ప బహుమతినిచ్చిన గౌరవాన్ని దక్కించుకున్నారు.  (శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ , అదిరిపోయే లాంచింగ్‌ ఆఫర్‌ కూడా!)

మూర్స్ లా
కంప్యూటర్ విప్లవం ప్రారంభమవడానికి రెండు దశాబ్దాల ముందే కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్స్‌ ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతాయని మూరే ముందే ఊహించాడు. ఆ తర్వాత దీన్ని ప్రతి రెండేళ్లకు అని  సవరించారు. దీన్నే మూర్స్ లా అని పిలుస్తారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top