
సాధారణంగా పాము అన్న పదం వింటేనే ఆమడ దూరం పారిపోతారు చాలామంది. మరికొంత మంది దాన్ని చంపేదాకా నిద్రపోరు. కానీ 70 ఏళ్ల బామ్మ చేసిన సాహసం చూస్తే..వామ్మో..బామ్మో.. అంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పూణేలోని ముల్షి తాలూకాలోని అంబోలి గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతార్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. పామును మెడకు చుట్టుకుని నెటిజన్లను ఆశ్చర్యపర్చింది.
ఏం జరిగిందంటే
చుట్టు పక్కల వాతావరణం కారణంగా ఇంట్లోకి భారీ పాము (కోబ్రా) వచ్చింది. ఈ పామును చూడగానే ఇంట్లో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. కానీ బామ్మ ఏమాత్రం భయపడలేదు. దాన్ని భయపెట్టి, చంపేందుకు ప్రయత్నించలేదు. పైగా దాన్ని కాపాడింది. అదీ వట్టి చేతులతోనే, చాకచక్యంగా నక్కి ఉన్న పామును పట్టుకుంది. అయితే ఆ పాము అంత ఈజీగా ఏమీ లొంగలేదు. అయినా సరే నిర్భయంగా, అత్యంత సాహసంతో దాన్ని దొరకబుచ్చుకుని పామును పట్టుకుని మెడలో వేసుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో అక్కడున్న వారు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వారికి ఫోజులిచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
🐍💪 70 साल की उम्र में भी हौसला जवान!
पुणे के मुलशी तालुका के कासर अंबोली गाँव की शकुंतला सुतार दादी ने जो किया, वो किसी फिल्मी सीन से कम नहीं।
जब उनके घर में धामन सांप निकला, तो दादी ने
ना डर दिखाया
ना हंगामा किया
बल्कि बिना घबराए साँप को खुद पकड़ा
और गले में डालकर लोगों को… pic.twitter.com/eKuoKCntat— Satyaagrah (@satyaagrahindia) July 27, 2025
చదవండి: 100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్‌డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!
ఈ పామును స్థానికంగా ధమన్ అని పిలుస్తారట. దీనివల్ల మనుషులకు ఎలాంటి హాని లేదు. పైగాఎలుకల నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము. ఇది 18 అడుగుల (5.5 మీటర్లు) పొడవు వరకు పెరుగుతుంది. భారతదేశం సహా ఆగ్నేయాసియా అడవులలో కనిపించే కింగ్ కోబ్రా దట్టమైన వృక్షసంపద, సమృద్ధిగా ఆహారం ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయి.
అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు. వాటిని చూసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. తమకు హాని కలుగుతుందని భయపడనంతవరకూ అవి ఎలాంటి హానీ చేయవు. అలాగని పాము కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. దానికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. ఎక్కడ ఎలా పట్టుకోవాలనే ఒడుపు, విజ్ఞానం తెలియాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా పాము, ఇతర ప్రమాదకరమైనవి కనిపించినపుడు వన్యప్రాణ సంరక్షణ అధికారులకు సమాచారం అందివ్వాలి.
ఇదీ చదవండి: HealthTip ఈ గింజలతో మెకాళ్ల నొప్పి, అధిక బరువుకు చెక్ !