
ఒక వయసు పెరిగిన తరువాత, ప్రస్తుతం ఆధునికకాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్లు (Cartilage) అరిగి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు చాలామంది.కొందరికి నడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. అయితే ఈ నొప్పులకు పెయిన్‌కిల్లర్స్‌తో తాత్కాలిక ఉపశమనం లభించినా, అవి ఎక్కువ కాలం వాడలేం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయామోనని భయం. అందుకే తేలికపాటి వ్యాయామం, కొన్ని ఆయుర్వేద చిట్కాలతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో భాగంగా మహాబీర గింజల ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
అసలు మోకాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి?
సాధారణంగా మోకాళ్లలోని రెండు ఎముకల మధ్య గుజ్జు Cartilage కరుగిపోతుంది. ఇలా రెండు ఎముకల మధ్య ఉండే ఈ గుజ్జు పూర్తిగా కరిగిపోతే నడవడం, మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి కింద కూర్చుని లేవడం కూడా కష్టం. అలాగే మోకాళ్లలో తీవ్రమైన నొప్పి, మంట వంటివి కలుగుతుంటాయి. దీన్నే ఆర్థరైటిస్ అని పిలుస్తారు.
మోకాళ్లలో గుజ్జు పెరగడానికి స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటి రకరకాల వ్యాయామాలతో పాటు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నొప్పిగా ఉంది కదా అని భయపడకూడదు. మెల్లిగా నడక లాంటి వ్యాయామాలు చేస్తూ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలను చేయాలి.
(Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!)
మహాబీర గింజలు- ప్రయోజనాలు
మహాబీర గింజలువీటినే వనతులసి గింజలు అంటారు. తులసి జాతికి చెందిన మొక్కల ద్వారా వచ్చిన గింజలు. చూడటానికి సబ్జా గింజలలాగానే కనిపించే ఈ మహాబీర గింజలు ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తాయి. వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం మోకాళ్లలో నొప్పి తగ్గుతుంది. మహాబీర విత్తనాల్లో క్యాల్షియం, విటమిన్ డి, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
అంతేకాదు జీర్ణక్రియ మెరుగువుతుంది. వెయిట్‌లాస్‌కు కూడా ఉపయోపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
ఇవి చర్మ సంబంధింత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఒత్తిడి, శ్వాసకోశ రుగ్మతలు తగ్గడానికి కూడా మహాబీర గింజలు ఉపయోగపడతాయి.మహాబీర విత్తనాల్లో వున్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కేన్సర్ వంటి వాటిని నిరోధిస్తుంది.
మహాబీర గింజలను ఎలా వాడాలి?
ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలు వేసి ఎనిమిది గంటల పాటు నాన బెట్టాలి. ఉదయాన్నే పరగడుపున అలాగే తీసుకోవాలి. గింజలు బాగా నమిలాలని ఆయుర్వేదం చెబుతోంది.
ఇంకా నిమ్మరసంలో, పెరుగులో లేదంటే సలాడ్లు, స్మూతీలు వంటి వాటిలో వీటిని కలుపుకుని తినచ్చు.
ప్రతి రోజు క్రమం తప్పకుండా తిన్నారంటే మోకాళ్ల నొప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి.
వీటి పౌడర్‌ను నూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశాలలో రాస్తారు.
మహాబీర చెట్టు ఆకుల రసాన్ని చర్మవ్యాధులైన గజ్జి, తామర నివారణలో కూడా వాడతారు.
ఎవరు తినకూడదు: మహాబీర విత్తనాలు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. థైరాయిడ్ సమస్యలను కలిగించవచ్చు, కాబట్టి, గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ ఉన్నవారు తీసుకోకుండా ఉండటం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం కేవలం అవగాహనకోసమే అని గమనించాలి. మోకాళ్ల నొప్పి గల కారణాలను వైద్యుల ద్వారా నిర్ధారించుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించి, వారి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: Today tips : బొద్దింకలతో వేగలేకపోతున్నారా?