వెల్‌నెస్‌ డ్రింక్స్‌ మంచివేనా? | Wellness Drinks Benefits limitations health tips | Sakshi
Sakshi News home page

వెల్‌నెస్‌ డ్రింక్స్‌ మంచివేనా?

Mar 12 2026 11:29 AM | Updated on Mar 12 2026 11:48 AM

Wellness Drinks Benefits limitations health tips

ఇటీవల కొన్ని పోషకాహార పదార్థాలూ, ఖనిజ లవణాలతో కూడిన పదార్థాలు చేర్చిన పానీయాలు చాలా ఎక్కువ ్రపాచుర్యం పొందుతున్నాయి . వీటినే వెల్‌నెస్‌ డ్రింక్స్‌గా పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్యం కోసం వీటిని తీసుకోవాలంటూ కొంతమంది ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు కూడా. అయితే కొందరు మాత్రం వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటూ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వెల్‌నెస్‌ డ్రింక్స్‌ తీసుకోవడం ఏ మేరకు ప్రయోజనం... ఎంత వరకు సహాయపడతాయనే అంశాలను పరిశీలిద్దాం...

మాక్‌టెయిల్స్‌ పేరిట మంచి రుచికరమైన పానీయాలు ఎప్పటినుంచో ఉన్నవే. కాకపోతే ఇటీవల వెల్‌నెస్‌ డ్రింక్స్‌ ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఈ వెల్‌నెస్‌ డ్రింక్స్‌ అవి తయారు చేసే పద్ధతులను పెడుతూ, వాటిని తీసుకుంటే ఆరోగ్యమూ, వ్యాధినిరోధక శక్తి సమకూరతాయంటూ చెబుతున్నారు. వాటి తాలూకు ఉపయోగాలూ, పరిమితులు చూద్దాం...

వీటిల్లో ఏముంటాయంటే... 
మామూలు మాక్‌టెయిల్స్‌లో సాధారణ సోడా డ్రింక్స్‌తో పాటు అనేక రకాల రుచికరమైన ఎసెన్స్‌లను కలిపి తయారు చేస్తారు. ఒకటికంటే ఎక్కువ ఫ్లేవర్స్‌ ఉంటాయి కాబట్టే మాక్‌టెయిల్స్‌ అని పిలుస్తారు. అయితే వీటిల్లో ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్లు, ఖనిజలవణాలూ, యాంటీ ఆక్సిడెంట్స్,ప్రోబయాటిక్స్, కొబ్బరినీళ్లు, గ్రీన్‌ టీ...లతో పాటు... పసుపు, అల్లం, కొలాజెన్, అడాప్టోజెన్స్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలు వాడతారు. అడాప్టోజెన్స్‌ అంటే మొక్కల నుంచి లభ్యమయ్యే మెడిసినల్‌ విలువలుండే రకరకాల పదార్థాలు. వీటిని తీసుకోగానే ఒక ఆనందకరమైన భావన (యుఫోరియా ఫీలింగ్‌) కలుగుతుంది. ఉదాహరణకు... కొబ్బరినీరు తీసుకోగానే కలిగిన మంచి ఫీలింగ్స్‌ లాంటివి. అల్లం వాడగానే గొంతులోని శ్లేష్మం వదిలిపోయిన భావనల్లాంటివి.

ప్రధానంగా మెగ్నీషియమ్‌ డ్రింక్స్‌... 
ఈ వెల్‌నెస్‌ డ్రింక్స్‌లో ప్రధానంగా మెగ్నీషియమ్‌తో చేసినవి ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే మెగ్నీషియమ్‌ లవణాలు మెదడును ప్రశాంతంగా ఉండే న్యూరో ట్రాన్స్‌మిటర్‌ అయిన ‘గాబా’ (గాబా అమైనో బ్యూటెరిక్‌ యాసిడ్‌కు సంక్షిప్త రూపం)ను క్రియాశీలం చేయడం ద్వారా మెదడును... తద్వారా మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. దాంతో దేహం ‘రెస్ట్‌ అండ్‌ రిపేర్‌’ మోడ్‌లోకి వెళ్తుందన్నది నిపుణుల మాట. ఇలా మెగ్నీషియమ్‌ ప్రధానంగా ఉండేవాటిల్లో కొన్ని...

∙మెగ్నిషియమ్‌ గ్లైసినేట్‌ ప్రధానంగా ఉన్నవి మంచి నిద్రపట్టడానికీ, యంగై్జటీ తగ్గడానికీ ∙మెగ్నీషియమ్‌ టారేట్‌ ఉన్నవి నరాల వ్యవస్థను ఎగై్జట్‌ కాకుండా కామ్‌గా ఉంచడానికీ ∙మెగ్నీషియమ్‌ సిట్రేట్‌ ఉన్నవి బాగా నిద్రపట్టడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేలా చేసి మలబద్ధకం తొలగించడానికి ఉపయోగపడతాయి.

ఏయే పదార్థాలతో తయారు చేస్తారంటే... 
సాధారణంగా పింక్‌ రంగులో చాలా కలర్‌ఫుల్‌గా ఉండే ఈ డ్రింక్స్‌లో టార్ట్‌ చెర్రీ జ్యూస్, మాగ్నీషియం ΄÷డి, స్పార్క్‌లింగ్‌ వాటర్‌తో తయారు చేస్తారు. వీటిల్లో మెగ్నీషియమ్‌ ఖనిజాలే కాకుండా అరటిపండ్లు, కివీ పండ్లు, అవకాడో పండ్లు, ఆకుకూరలలో పాలకూర (స్పినాచ్‌) వంటివీ ఉపయోగిస్తారు. పాలు కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు పాలలో ఉండే ‘ట్రి΄÷్టఫాన్‌’ అనే అమైనో యాసిడ్‌ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ అనే మెదడు రసాయనాన్ని స్రవింపజేసి హాయిగొలిపే నిద్రను ఇస్తుంది. అలాగే పండ్లతో కూడిన ఈ వెల్‌నెస్‌ డ్రింక్స్‌లో స్వాభావికంగా దొరికే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ ఉండటంతో ఆరోగ్య నిర్వహణకు బాగానే తోడ్పతాయి.

ఆహార నిపుణులఅభిప్రాయాల మేరకు... ప్రయోజనాలేమిటంటే... 
మెగ్నీషియమ్‌ లవణాలూ, ఖనిజాలూ, విటమిన్‌ బి–12, ఐరన్‌ వంటి పోషకాలూ, ఆహారంలో లభ్యమయ్యే పీచు (ఫైబర్‌)లు స్వాభావికమైన పదార్థాలతోనే సమకూరడం వల్ల ఈ పోషకాలన్నీ సప్లిమెంట్లలా మనకు మామూలుగా దొరుకుతాయి. దాంతో ఆ ఆహార లోపాలేవైనా (విటమిన్‌ / మినరల్‌ డెఫిషియెన్సీస్‌) ఉంటే అవి నేచురల్‌గానే భర్తీ అవుతాయి. ఇకప్రోబయాటిక్స్‌ వంటి వాటివల్ల జీర్ణకోశ ఆరోగ్యం (గట్‌–హెల్త్‌) మెరుగుపడుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పానీయాలతో దేహంలోని సెల్‌ రిపేర్స్‌ జరుగుతుంటాయి. తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసేవారికీ, సరైన నిద్రలేనివారికి ఇవి కొంతవరకు తోడ్పడతాయి.

పరిమితులేమిటంటే... 
ఈ వెల్‌నెస్‌ డ్రింక్స్‌ అన్నవి మామూలుగా పోషకలోపాలు ఉన్నవారికి ఇచ్చే ‘న్యూట్రస్యూటికల్‌ మెడిసిన్స్‌’ లాంటివే. అంటే విటమిన్‌ సప్లిమెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ, కంటినిండా నిద్రపోతూ, సరైన వ్యాయామం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇవి అదనంగా సమకూరుతూ దేహ ఆరోగ్యాన్ని కొంతమేరకు బూస్ట్‌ చేయడానికి పనికి వస్తాయి. అంతే తప్ప... మిగతా పోషకాహారాలకూ, వ్యాయామలేమికీ ఇవి ప్రత్యామ్నాయంగా గానీ లేదా కొన్ని ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాలుగా పనిచేయవు. కాకపోతే వీటివల్ల నష్టమేదీ లేనందున అదనంగా తీసుకోవడంలో తప్పేమీ ఉండదు. వెల్‌నెస్‌ డ్రింక్స్‌ అనేవి ఆరోగ్యకరమైన జీవనశైలికి కొంతమేరకు తోడ్పడవచ్చు గానీ అవి మాత్రమే మన ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చివేయలేవని గుర్తించాలం’’టూ ఆహార నిపుణులు పేర్కొంటున్నారు.

నిర్వహణ: యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement