ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌ | UK nutritionist warns stop wearing your Apple Watch | Sakshi
Sakshi News home page

ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Mar 11 2026 12:30 PM | Updated on Mar 11 2026 12:51 PM

UK nutritionist warns stop wearing your Apple Watch

యాపిల్‌ వాచ్‌లను ఇష్టపడని వారుండదరు. ఇవి మన ఆరోగ్యం, జిమ్‌కి సంబంధించి కేలరీల ఖర్చు, ఆరోగ్య సమాచారం వరకు అన్ని అందించే ఆధునిక పరికరం. చెప్పాలంటే గడియారానికి మించినది. మన బాడీలోని అతిముఖ్యమైన పార్ట్‌లా బాగమైపోయింది. కానీ ఈ యాపిల్‌ వాచ్‌లను ఆ విధంగా అస్సలు చూడొద్దని అంటున్నారు అమెరికా ఆరోగ్య నిపుణులు. మిమ్మల్ని ఆరోగ్యపరంగా అలర్ట్‌ చేసే గొప్ప సాధనమే అయినా..కేర్‌ఫుల్‌గా ఉండకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఎందువల్ల ఇలా అంటున్నారంటే..

జేబులో ఉండే స్మార్ట్‌ఫోన్‌ లేదా డెస్క్‌పై ఉపయోగించే ల్యాప్‌టాప్‌లా కాకుండా..స్మార్ట్‌వాచ్‌ చాలా ప్రత్యేకమైనది. ఇది 24/7 మన సంరక్షణ కోసం రూపొందించిన సాధనంగా అందరికీ అత్యంత ప్రీతీపాత్రమైనది. ఈ వాచ్‌లపై ఉండే మక్కువతో దాని భద్రత గురించి పెద్దగా అస్సలు పట్టించుకోరు కూడా. కానీ ఈ పరికరం గంటల తరబడి రేడియోఫ్రీక్వెన్సీ(RF) సంకేతాలను నేరుగా మన కణజాలంలోకి పంపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ ఫ్రీక్వెన్సీలను గ్రేడ్ 2B కార్సినోజెన్‌లుగా పేర్కొంది. 

ఆయా సంస్థలు ఈ వాచ్‌లో ఉద్గారాలు పరిమితుల్లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. దీని పరిమితులు మనం నిద్రిస్తున్నపుడూ కూడా చేతికే ధరించేంత సురక్షితంగా రూపొందించింది మాత్రం కాదని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఇది కేవలం రేడియేషన్‌ మాత్రమే కాదు..దాని చుట్టూ ఉండే హై-ఎండ్ 'ఫ్లోరోఎలాస్టోమర్' బ్యాండ్‌లు తరుచుగా PFAS లేదా ఎక్కువ మోతాదులో రసాయనాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. 

అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రకారం, ఫ్లోరినేటెడ్ సింథటిక్ రబ్బరుతో తయారు చేసిన ఖరీదైన రిస్ట్‌బ్యాండ్‌లు ముఖ్యంగా అధిక స్థాయిలో  రసాయనాలు ఉంటాయని 2024 జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిలో PFAS సమస్య ఉందనేది వాస్తవమే అని నిరూపితమైంది. అందువల్ల దీన్ని గనుక దీర్ఘకాలంపాటు మణికట్టు వద్ద ధరిస్తే..ఈ రసాయనాలు చర్మం, రక్తప్రవాహంలోకి చొచ్చుకుపోతాయని అంటున్నారు నిపుణులు. ఈ PFAS విచ్ఛిన్నం కానందున, అవి కాలక్రమేణా అవయవాలలో పేరుకుపోతాయి. 

అవి కాస్తా కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగజేసి అనారోగ్యానికి దారితీస్తుందని చెబుతున్నారు. అంతేగాదు హార్మోన్లు ఇన్‌బ్యాలెన్సింగ్‌కి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పరీక్షించిన  22 ప్రముఖ బ్యాండ్‌లలో 15 ఈ విషపదార్థాలను కలిగి ఉన్నాయని, అందులోనూ అధిక ధర కలిగిన ప్రీమియం బ్యాండ్‌లలో ఈ సమస్య మరింత ఎక్కువని అంటున్నారు.

ఇది అవగాహన..సంరక్షణ కోసమే..
ఇది లేనిపోని భయాలు కలుగజేసందుకు కాదని అవగాహన కల్పించేందుకేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. ఆపిల్‌ వాచ్‌ శక్తిమంతమైన సాధనమే కానీ..దాన్ని మన శరీరంలోని సహజ భాగంగా పరిగణించొద్దని హెచ్చరిస్తున్నారు. 

సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే.. 
సాంకేతిక ప్రయోజనాలు పొందేలా సురక్షితంగా ఎలా ఉపయోగిస్తే మంచిదంటే..

సింథటిక్ ఫ్లోరోఎలాస్టోమర్ బ్యాండ్‌లను సేంద్రీయ తోలు, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా జనపనార వంటి సహజ పదార్థాలతో  ఉపయోగించేందుకు ప్రయత్నించండి

వర్కింగ్‌ టైంలో  లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాచ్‌ను తీసివేయండి

పడుకునే ముందు వాచ్ ధరించడం మానేయండి. నిద్ర అంటే శరీరం నిర్విషీకరణపై దృష్టి పెడుతుంది ​కాబట్టి ఈ సమయంలో ఇతర రసాయనాలకు గురికావడం వల్ల సహజమైన నిద్ర ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: జస్ట్‌ ఒక్క ఏడాదిలో 26 కిలోల బరువు..! నో డైట్‌ ప్లాన్‌, నో ఫిట్‌నెస్‌ మంత్ర)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement