నెట్టింటి నిండా సైబర్‌ సైకోలే! | Women falling prey to social networking crime | Sakshi
Sakshi News home page

నెట్టింటి నిండా సైబర్‌ సైకోలే!

Mar 11 2026 1:06 AM | Updated on Mar 11 2026 1:06 AM

Women falling prey to social networking crime

ఇంటర్నెట్‌.. సమాచారానికి, అవకాశాలకు ఒక విస్తారమైన డిజిటల్‌ వేదిక. అయితే, నేడు ఇదే వేదిక నేరాలకూ నిలయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు సైబర్‌ నేరగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడం, సరైన అవగాహన లేకపోవడంతో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

31.2% నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో 2025–26 నివేదికల ప్రకారం, 2023తో పోలిస్తే 2024–25 నాటికి దేశంలో సైబర్‌ నేరాలు 31.2% పెరిగాయి. ఇది ఆందోళనకరమైన అంశం.

50 భారతదేశంలో ప్రతి గంటకు సగటున 50 కంటే ఎక్కువ మంది మహిళలపై హింస, నేరాలు జరుగుతున్నాయి. అందులో గణనీయమైన నేరాలు డిజిటల్‌ మాధ్యమాల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి.

28.15 - 2025లో భారతదేశంలో మొత్తం సైబర్‌ క్రై మ్‌ కేసులు 28.15 లక్షలకు చేరాయి (ఇది 2024తో పోలిస్తే 24% ఎక్కువ). ఇందులో మహిళలు బాధితులుగా ఉన్న కేసుల శాతం గణనీయంగా ఉంది.

51- నేషనల్‌ సైబర్‌ క్రై మ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం, ప్రతి గంటకు సగటున 51 ఫిర్యాదులు నమోదవుతున్నాయి.

రూ. 22,495 కోట్లు సైబర్‌ నేరాల వల్ల దేశం మొత్తం మీద దాదాపు రూ. 22,495 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మహిళలు ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్‌ స్కామ్స్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు.

20,551 మహిళలపై సైబర్‌ నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి లక్షమంది మహిళలకు 125 మంది సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కకుంటున్నారు. హైదరాబాద్‌లో డిజిటల్‌ కేసులపై అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేవలం 2025లోనే రాష్ట్రవ్యాప్తంగా 20,551 మహిళా సంబంధిత కేసులు నమోదయ్యాయి.

48,475- 2020లో మహిళలపై 22,188 సైబర్‌ నేరాలు నమోదు కాగా, 2024 నాటికి ఈ సంఖ్య 48,475కు (దాదాపు 118% పెరుగుదల) చేరిందని నివేదికలు చెబుతున్నాయి.

2వ స్థానం దేశంలోని మెట్రో నగరాల్లో మహిళలపై సైబర్‌ వేధింపుల విషయంలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముఖ్యంగా అసభ్యకరమైన కంటెంట్‌ సర్క్యులేషన్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

69% మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్‌ నేరాలలో లైంగిక వేధింపులు 4.9%, బ్లాక్‌మెయిలింగ్‌ 3.8%, ఆర్థిక మోసాలు 69% ప్రధానంగా ఉన్నాయి.

9% మహిళలను, ముఖ్యంగా ఉద్యోగినులను భయపెట్టి లక్షల రూ΄ాయలు వసూలు చేసే (డిజిటల్‌ అరెస్ట్‌) మోసం 2025–26లో 
9% పెరిగింది.

15-20% ఏఐ డీప్‌ఫేక్‌ కేసులు 2026 లో దాదాపు 15–20% పెరిగాయి. ఫొటోలను అసభ్యంగా మార్చి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం ప్రధాన సమస్యగా మారింది.

18,236 అత్యధికంగా సైబర్‌ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. మొత్తం కేసుల సంఖ్య 21,889. తెలంగాణ రెండో స్థానంలో అంటే నమోదైన కేసుల సంఖ్య 18,236. ఉత్తరప్రదేశ్‌ 10,794 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కేసుల సంఖ్య 2,500 మార్కును దాటింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన సైబర్‌ నేరాల రేటు దక్షిణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement