
అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే యంగ్ లుక్ కోసం, ఆరోగ్యకరమైన జీవనశైలి, చర్మ సంరక్షణ, సరైన ఆహారం తీసుకోవడంం చాలా ముఖ్యం. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా యవ్వనంగా కనిపించడానికి కొన్ని చిట్కాలలను చూద్దాం.
అందంగా కనిపించడం అంటే ఆరోగ్యంగా, చురుగ్గా ఉండటమే. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. కొవ్వు , చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ,చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడికి దూరంగా ఉండాలి. యోగా మరియు ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
పుష్కలంగా నీరు త్రాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ముఖంపై తొందరగా ముడతలు రావు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ప్రతి రోజు 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం. అలాగే ప్రతిరోజూ SPF ఉన్న సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
ఇదీ చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్
మన స్కిన్ బట్టి క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్,ఎక్స్‌ఫోలియేటింగ్ లాంటి పద్ధతులను ప్రయత్నించవచ్చు. వయసు పెరుగుతున్న క్రమంలో వృద్ధాప్య ఛాయలను తగ్గించుకునేలా, నిపుణుల సలహా మేరకు కొన్ని యాంటీ ఏజింగ్ క్రీములు వాడవచ్చు.

బెల్లం ఫేస్ వాష్
బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించ నియ్యదు.
చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, మజ్జిగవేసి బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాల పాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి.
చదవండి: Vidhu Ishiqa: మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ కిరీటంతో చరిత్ర సృష్టించింది!
ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి.
