టెస్లా అధినేత, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో అరంగేట్రం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్, గురువారం 2026 WEF సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో సంభాషణ సందర్భంగా, మానవుల్లో వృద్ధ్యాప్యాన్ని తిప్పికొట్టే అవకాశం ఉందంటూ ఎలాన్ మాస్క్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
లారీ ఫింక్‌తో జరిగిన చర్చలో మాస్క్ వృద్ధాప్యం అనేది చాలా సులభంగా పరిష్కరించగల సమస్యే కానీ రిస్క్‌తో కూడుకున్నదన్నారు. వృద్ధాప్యానికి కారణమేమిటో మనం గుర్తించినపుడు ఏజింగ్ రివర్స్ ప్రక్రియ సులభ మవుతుందని తాను భావిస్తున్నా అన్నారు. వృద్ధాప్యాన్ని తిప్పికొట్టడం సాధ్యమే కానీ మరణానికి సామాజిక ప్రయోజనం ఉంది. అయితే ఇది అంత చిన్న విషయం కాదని ఎందుకంటే శరీరంలోని అన్ని కణాలు దాదాపు ఒకే రేటుతో వృద్ధాప్యానికి గురవుతాయి. బాడీలోని 35 ట్రిలియన్ కణాలన్నీ ఒకే వేగంతో వృద్ధాప్యానికి గురవు తాయని, దీని వెనుక ఒక ఖచ్చితమైన 'క్లాక్' (యంత్రాంగం) ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కనిపెడితే వృద్ధాప్యాన్ని అరికట్టడం సాధ్యమేనని చెప్పారు.
సమాజానికి ముప్పు
అయితే ఏజ్ రివర్సింగ్ వల్ల సామాజిక సవాళ్లు, ఊహించని పరిణామాలు ఏర్పడతాయని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధాప్యం లేకపోతే కొత్త ఆలోచనలు రాకుండా సమాజం "స్తంభించిపోయే" (Ossification) ప్రమాదం ఉందని, మరణం అనేది సమాజంలో కొత్తదనం రావడానికి అవసరమని మస్క్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సెలబ్రిటీలను సైతం ఇన్‌స్పైర్ చేసిన 70 ఏళ్ల బామ్మ
దావోస్ సదస్సును గతంలో "బోరింగ్" అని విమర్శించిన మస్క్, మొదటిసారి ఈ వేదికపై ప్రసంగించడం విశేషం. దావోస్‌లో జరిగిన తన మొదటి WEFలో మస్క్ వయస్సు మార్పు , దీర్ఘాయువు గురించి మాట్లాడారు. అలాగే భవిష్యత్తులో మనుషుల కంటే రోబోలే ఎక్కువ ఉంటాయని, 2027 నాటికి టెస్లా రోబోలు మార్కెట్లోకి వస్తాయని మాస్క్ అంచనా వేశారు. అలాగే ఈ చర్చ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల స్పెషల్ పెరోల్


