ఇరాన్ భద్రతా దళాల కీలక స్థావరాలు ధ్వంసం | IDF destroys IRGC internal security Basij forces infrastructure in Ilam area | Sakshi
Sakshi News home page

ఇరాన్ భద్రతా దళాల కీలక స్థావరాలు ధ్వంసం

Mar 11 2026 12:05 AM | Updated on Mar 11 2026 12:05 AM

IDF destroys IRGC internal security Basij forces infrastructure in Ilam area

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ఇరాన్‌లోని ఇలామ్ ప్రావిన్స్‌లో ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలకు గణనీయమైన నష్టం కలిగించామని వెల్లడించాయి. ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇరాన్‌కు చెందిన కీలక వ్యవస్థలు, సామర్థ్యాలను క్రమబద్ధంగా లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపింది.

గత వారం రోజులుగా ఇరాన్ అంతటా ఉన్న అంతర్గత భద్రతా దళాలు, బసిజ్ బలగాలకు చెందిన మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించి వాటికి తీవ్ర నష్టం కలిగించామని ఐడీఎఫ్ పేర్కొంది.

ఈ దాడుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇలామ్ ప్రావిన్స్ ఒకటిగా పేర్కొంది. ఈ ప్రావిన్స్‌లోని భద్రతా దళాలు గతంలో పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు, అలాగే డిసెంబర్–జనవరి నెలల్లో ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనలను అణచివేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఐడీఎఫ్ ఆరోపించింది.

ఇలామ్ ప్రావిన్స్‌లోని పలు కీలక స్థావరాలు ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వాటిలో అంతర్గత భద్రతా దళాల ప్రధాన కార్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కేంద్ర కార్యాలయం, నిరసనలను అణచివేసే బెటాలియన్లకు బాధ్యత వహించే ఐఆర్‌జీసీ (IRGC) కమాండ్ సెంర్, అంతర్గత భద్రతా దళాల్లోని స్పెషల్ ఫోర్సెస్ యూనిట్ ప్రధాన కార్యాలయం, పలు బసిజ్ యూనిట్ కేంద్రాలు, ఐఆర్‌జీసీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement