యుద్ధం ప్రభావం.. క్రికెట్‌ సిరీస్‌ రద్దు | Sri Lanka Cricket Cancels Afghanistan Tour Due To War Crisis | Sakshi
Sakshi News home page

యుద్ధం ప్రభావం.. క్రికెట్‌ సిరీస్‌ రద్దు

Mar 10 2026 4:54 PM | Updated on Mar 10 2026 5:11 PM

Sri Lanka Cricket Cancels Afghanistan Tour Due To War Crisis

పశ్చియాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రికెట్‌కు కూడా తగిలింది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 13 నుంచి 25 వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ల మధ్య దుబాయ్‌ వేదికగా వన్డే సిరీస్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విమానాల రాకపోకలపై నిషేధంతో సిరీస్‌ రద్దు అయినట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. కాగా షార్జా వేదికగా మార్చి 13 నుంచి అఫ్గానిస్థాన్‌, శ్రీలంక మధ్య మూడు టీ20లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే సిరీస్‌ నిర్వహించే అవకాశాల్లేవు.  దీంతో సిరీస్‌ రద్దుకే మొగ్గు చూపుతున్నట్లు ఇరుజట్ల క్రికెట్‌ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు నిరాశ పరిచాయి. అఫ్గానిస్థాన్ గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టగా.. ఆతిథ్య హోదాలో సూపర్‌-8కు పరిమితం కావాల్సి వచ్చింది.  పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ అటు ఇరాన్‌, ఇటు ఇజ్రాయెల్‌, అమెరికాలు మాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement