అర్షదీప్‌ సింగ్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ | ICC Slaps Arshdeep Singh With Heavy Fine For Aggressive Act In World Cup Final | Sakshi
Sakshi News home page

అర్షదీప్‌ సింగ్‌పై కన్నెర్ర చేసిన ఐసీసీ

Mar 10 2026 4:51 PM | Updated on Mar 10 2026 5:51 PM

ICC Slaps Arshdeep Singh With Heavy Fine For Aggressive Act In World Cup Final

భారత నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్‌ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్‌ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అర్షదీప్‌ డారిల్‌ మిచెల్‌పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్‌పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్‌ మిచెల్‌పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్‌లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్‌ను బలంగా తాకింది. 

ఆ సమయంలో మిచెల్‌ సైతం​ సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్‌ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్‌-మిచెల్‌ కరచాలనం చేసుకున్నారు.

అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్‌ చెల్లించుకున్నాడు.

కాగా, ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్‌ను (2024, 2026), ఓవరాల్‌గా మూడో పొట్టి ప్రపంచకప్‌ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్‌ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement