breaking news
ICC
-
రాణించిన సాయితేజ, హర్మీత్
చెన్నై: దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా ఎట్టకేలకు నెదర్లాండ్స్‌పై గెలిచి ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో బోణీ చేసింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మోనాంక్ పటేల్ సారథ్యంలోని అమెరికా 93 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన డచ్ టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్లు మోనాంక్ (22 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), జహాంగీర్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడే క్రమంలో అవుటయ్యారు. తెలుగు సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ సాయితేజ ముక్కామల (51 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభమ్ రంజనే (24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. బాస్ డి లీడె 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 15.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. బాస్ డి లీడె (23), కెపె్టన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20)లు మాత్రమే రెండు పదుల స్కోరు చేయగలిగారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మీత్ సింగ్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు, వాన్ షాల్విక్ 3 వికెట్లు, మోసిన్ 2 వికెట్లు తీశారు. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో అమెరికా తలపడుతుంది. -
టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకొన్న బంగ్లా జట్టుకి రిలీఫ్
భారత్-శ్రీలంక వేదికగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 జరుగుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. మన దేశానికి రాకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవడంతో.. బంగ్లా జట్టు ప్రపంచకప్ నుంచి తప్పుకొంది. దీని స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలో అడుగుపెట్టింది. మరోవైపు ఫిబ్రవరి 15వ తేదీన భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఐసీసీ మీటింగ్ జరగ్గా.. ఇందులో బంగ్లాదేశ్ జట్టుకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడంపై నిరాశ వ్యక్తం చేసిన ఐసీసీ.. ప్రస్తుత అంశానికి సంబంధించి బంగ్లా బోర్డుపై ఎలాంటి ఆర్థిక, క్రీడాపరమైన, పరిపాలానా జరిమానా విధించబోమని ధ్రువీకరించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి తీసుకెళ్లే హక్కు.. బంగ్లా బోర్డుకి ఉందని స్పష్టం చేసింది.దీని వల్ల ఆ హక్కుకి ఎలాంటి భంగం కలగదని, అది యధాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలానే బంగ్లాదేశ్‌లో 2031 పురుషుల ప్రపంచకప్ జరగడానికి ముందు ఓ ఐసీసీ ఈవెంట్‌కి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రకటనలో తెలియజేసింది.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియాతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లో పాల్గొనాలని పాక్ జట్టుని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. భారత్‌లో కాకుండాశ్రీలంకలో తమ మ్యాచ్‌లని నిర్వహించాలనే అభ్యర్థనని ఐసీసీ తిరస్కరించిన తర్వాత.. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకొంది. ఈ సమయంలో తమకు మద్ధతుగా నిలిచిన పాకిస్తాన్‌కి బంగ్లా బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కృతజ్ఞతలు చెప్పారు. -
భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొద్ది రోజుల కిందట పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్ క్రికెట్ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం. భారతీయ క్రీడా జర్నలిస్ట్ విక్రాంత్ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. - బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు - భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ - టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి - భారత్-పాక్-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్ - అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్ కోసం కూడా డిమాండ్ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ తమతో మ్యాచ్ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.కాగా, ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వరల్డ్‌కప్ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించిన తర్వాత పాక్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడమని ప్రకటించింది. -
క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి తొలిగిపోయేలా ఉంది. తొలుత పాక్ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ జోక్యంతో పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ప్రతినిధులు ఇమ్రాన్ ఖవాజా, ముబషిర్ ఉస్మానీ పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీతో లాహోర్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత పీసీబీ కొన్ని షరతులపై భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించినట్లు సమాచారం.కాగా, గత కొద్ది రోజులుగా భారత్-పాక్ ప్రపంచకప్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణకు నిరసనగా పాక్ ప్రభుత్వం భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ రద్దైతే ఐసీసీ సహా ప్రపంచకప్ బ్రాడ్కాస్టర్లు తీవ్రంగా నష్టపోయేవారు. ఇందుకు ప్రతిగా ఐసీసీ పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవకాశాలు ఉండేవి. చివరికి ఐసీసీ ప్రతినిధుల మధ్యవర్తిత్వంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో భారత్, పాక్, వెస్టిండీస్, న్యూజిలాండ్ తలో మ్యాచ్ గెలిచాయి. భారత్ యూఎస్ఏపై, పాక్ నెదర్లాండ్స్‌పై, వెస్టిండీస్ స్కాట్లాండ్పై, న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్పై విజయాలు సాధించాయి. -
‘గత్యంతరం లేక’ ఆడటం లేదు! ఐసీసీకి పీసీబీ వివరణ
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ తిరస్కరించిన వ్యవహారాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అంత సులువుగా వదిలిపెట్టేలా లేదు. నిబంధనలు అనుసరిస్తూ అన్ని రకాలుగా పాక్‌ను ఇరుకున పెట్టేందుకు ఐసీసీ సిద్ధమైంది. భారత్‌తో మ్యాచ్ ఆడే అంశం తమ చేతుల్లో లేదని, తమ ప్రభుత్వ ఆదేశం ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి ‘గత్యంతరం లేని పరిస్థితుల్లో’ తప్పుకోవచ్చని ఐసీసీ నిబంధన (ఫోర్స్ మెజూ)ను వర్తింపజేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే ఐసీసీ దీనికి సరైన రీతిలో స్పందించింది. యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలులాంటి అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడే ఈ నిబంధనన వర్తిస్తుందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందని ఐసీసీ ప్రశ్నించింది. అసలు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు చూడటంలో కానీ, ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించడంలో గానీ పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా స్పష్టం చేయాలని ఐసీసీ కోరింది. అవి సరైన కారణాలు కాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. దాంతో ఇరకాటంలో పడ్డ పీసీబీ కాస్త వెనక్కి తగ్గి ఈ నెల 15న భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరించే అవకాశాలూ కనిపిస్తున్నాయి! -
భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ కీలక నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దాదాపుగా లేనట్టే. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలను ఐసీసీ (ICC) తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడాల్సి ఉంది. కానీ రాజకీయ ఉద్రిక్తల కారణంగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.కానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటికీ ఐసీసీకి ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. ఈ మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఐసీసీ హెచ్చరించినప్పటకి పాక్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పీసీబీకి లేఖ రాసింది.ఈ మ్యాచ్ రద్దయితే అన్ని విధాలగా తమ దేశం భారీగా నష్టపోతుందని ఆ లేఖలో శ్రీలంక క్రికెట్ పేర్కొంది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని లంక బోర్డు కోరింది. అయినా కూడా పీసీబీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సందిగ్ధత వల్లే టికెట్లు విక్రయించిన తర్వాత ఒకవేళ మ్యాచ్ రద్దయితే, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఐసీసీ బుకింగ్స్‌ను నిలిపివేసింది. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఇతర ఎనిమిది మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు మాత్రం బుకింగ్ పోర్టల్‌లో కనిపించడం లేదు. ఈ మెగా టోర్నీ శనివారం(ఫిబ్రవరి 7) నుంచి ప్రారంభం కానుంది. -
పాక్‌తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్‌పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది.ప్రపంచకప్‌లో పాక్ ఆడే మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్‌ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్‌పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్‌కు కూడా వర్తిస్తుంది.ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్‌కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్దంగా భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్‌పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.కాగా, భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచకప్ మ్యాచ్‌లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్‌తో మ్యాచ్ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి. -
ఈ కప్‌లో మనమే ప్రమాదకరం
న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్‌నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్ కూల్’ ఎమ్మెస్ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్ గురించి వ్యాఖ్యానించాడు. ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ, 37 ఏళ్ల విరాట్ కోహ్లి కెరీర్‌పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్ కీపర్‌గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే... వయసు అడ్డంకి కాదు రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్‌నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను. అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్‌కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?. ఆ అనుభవం ఒక్క సచిన్‌కే అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది. భారత జట్టే ప్రమాదకారి సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌నే పరిగణిస్తే మన టీమ్‌కు మంచి అనుభవం ఉంది. ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్ కీలకంగా మారుతుంది. కామెంట్రీ కష్టం... అందుకే దూరం మైదానంలో మైక్ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు. మ్యాచ్ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్ పాత్రకు న్యాయం చేస్తారు. నేనో మంచి స్పీకర్‌ను కాదు నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్‌ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను. -
'ఫోర్స్ మజ్యూర్' క్లాజ్‌ను చూసుకొని ధీమాగా ఉన్న పాక్
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్–పాకిస్తాన్ పోరు చుట్టూ పెద్ద వివాదం నడుస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదం మొదలైంది. పాక్ ముందస్తు వ్యూహాల్లో భాగంగానే ఈ బాయ్‌కాట్ డ్రామాకు తెరలేపింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ పాక్‌కు రాలేదని, అందుకు ప్రతిగా చివరి నిమిషంలో ఈ బాయ్‌కాట్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీని వల్ల బీసీసీఐ, ఐసీసీకి నష్టం చేకూర్చాలన్నదే పాక్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ తాము కూడా నష్టపోతామని తెలిసినా పాక్ ఈ సాహసానికి పూనుకుంది. ఇందుకు కారణం ఫోర్స్ మజ్యూర్ క్లాజ్.ఏంటా ఫోర్స్ మజ్యూర్ క్లాజ్..? ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ (Force Majeure Clause) అనేది ఒప్పందాల్లో ఉండే ఓ నిబంధన. ఈ నిబంధన అనుకోని మరియు నియంత్రణలో లేని పరిస్థితులు ఏర్పడితే, సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు సహజ విపత్తులు, యుద్ధం, మహమ్మారి లేదా ప్రభుత్వ నిషేధాలు వంటి పరిస్థితులు ఏర్పడితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయడం అసాధ్యం అవుతుంది. అప్పుడు సంబంధిత పక్షం తన బాధ్యత నుంచి విముక్తి పొందుతుంది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకొనే పాక్ భారత్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్ రద్దు విషయంలో డ్రామాలాడుతుంది. దీన్ని అడ్డుపెట్టుకొనే ప్రపంచం ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్లాజ్ తమను చట్టపరంగా కాపాడుతుందని భావిస్తుంది. అయితే ఇక్కడే పాక్ ఓ సున్నితమైన విషయాన్ని విస్మరిస్తుంది. ప్రపంచకప్ మొత్తం ఆడి, భారత్‌తో గ్రూప్ స్టేజీ మాత్రమే బహిష్కరిస్తామని స్పష్టం చేసి, పప్పులో కాలేసింది. ఇలా ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బాయ్‌కాట్ చేస్తామనేది ఐసీసీ-పాక్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందాలకు విరుద్దం.ఒప్పందాల్లో పాక్ భారత్‌తో తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పుకుంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామనేది ఒప్పందాలకు విరుద్ధం. ఇక్కడ పీసీబీ ఫోర్స్ మజ్యూర్ క్లాజ్‌ను చూపించి తప్పించుకోవచ్చని ధీమాగా ఉంది. అయితే ఐసీసీ-పీసీబీ మధ్య జరిగిన ముందస్తు ఒప్పందంలో ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ లేదని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. పాక్ జట్టు మొత్తం టోర్నమెంట్ ఆడుతోంది. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తోంది. ఇది అసాధ్యత కాదు, ఎంచుకున్న అసౌకర్యం. ఫోర్స్ మజ్యూర్ క్లాజ్ selective participationకి వర్తించదని ఐసీసీ స్పష్టం చేయడంలో పాక్ వర్గాల్లో భయం మొదలైంది. భారత్‌తో మ్యాచ్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉన్నందుకు రద్దు అంశాన్ని రద్దు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు కాబట్టి రద్దుపై పాక్ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే ముందుకెళ్దాం అని పాక్ భావిస్తే మాత్రం తిప్పలు తప్పవు. ఆ జట్టు చరిత్రలో కనీవినీ ఎరుగని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ వార్.. కీలక వ్యక్తిని రంగంలోకి దించిన జై షా
భారత్-పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పంచాయితీలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ అధ్యక్షుడు జై షా రంగప్రవేశం చేశారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించేందుకు ఓ మధ్యవర్తిని నియమించారు. సింగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారు. ఖ్వాజా గతంలో ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా పనిచేసి, అన్ని ప్రధాన క్రికెట్ బోర్డులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని మార్చుకొని, భారత్‌తో మ్యాచ్ ఆడుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ పాక్ ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను సైతం పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జై షా చాలా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పాక్‌కు చివరి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఖ్వాజాను మధ్యవర్తిత్వానికి పంపాడు. టెక్నికల్‌గా ఉండే లూప్ హోల్స్‌ను వాడుకుంటూ పాక్ డ్రామాలు ఆడుతుందన్నది షా వాదన. ఈ విషయమై పీసీబీ లిఖితపూర్వక సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటుంది. ఒకవేళ ఐసీసీ చేసే అన్ని ప్రయత్నాలు విఫలమై పాక్ భారత్‌తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టే తీవ్రంగా నష్టపోతుంది. ప్రపంచకప్ వరకు మ్యాచ్ పాయింట్లు కోల్పోతుంది. అలాగే ఈ మ్యాచ్ జరగకపోవడం వల్ల కలిగే నష్టాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అనంతరం ఆర్దిక, పాలనా పరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ పోటీలు ప్రారంభమవుతాయి. అదే రోజు భారత్, పాక్ తమ తొలి మ్యాచ్‌లు ఆడతాయి. పాక్ నెదర్లాండ్స్‌తో.. భారత్ యూఎస్ఏతో తలపడతాయి. పాక్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడుతుంది. -
మెరుపుల పండక్కి భారత సంతతి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్‌తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు. రెండోసారి టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్‌కప్ ఆడనుండగా... ఇష్ సోధి, రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్‌కప్‌లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం! పాకిస్తాన్ పనిపట్టి... సౌరభ్ నేత్రావల్కర్... ఈ పేరు గత టి20 ప్రపంచకప్ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన నేత్రావల్కర్... పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టు ‘సూపర్–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్... సాఫ్ట్వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్ అన్నాడు. మోనాంక్ పటేల్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడిన మోనాంక్ పటేల్... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మోనాంక్... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు. గుజరాత్లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్... అండర్–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్‌లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్ అన్నాడు. జస్ప్రీత్ సింగ్ మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్‌లో పుట్టి పెరిగిన జస్ప్రీత్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్... అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్ప్రీత్... వరల్డ్‌కప్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు. ఆర్యన్ దత్ ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా నెదర్లాండ్స్ తరఫున భారత్‌లో మ్యాచ్‌లాడిన ఆర్యన్ దత్... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్‌లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్ కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్‌తో సత్తాచాటిన ఆర్యన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దిల్‌ప్రీత్ బాజ్వా వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్‌ప్రీత్ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్‌ప్రీత్... కెనడా గ్లోబల్ టి20 లీగ్‌లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు. జతిందర్ సింగ్ పంజాబ్‌లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్ సింగ్... ఈ ప్రపంచకప్‌లో ఒమన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్... అవకాశాలు రాకపోవడంతో ఒమన్‌కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్ తరఫున బరిలోకి దిగనున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్లు కెనడా (11): దిల్‌ప్రీత్ బాజ్వా (కెప్టెన్ ), అజయ్‌వీర్ హుండల్, అంశ్ పటేల్, హర్ష్ థాకెర్, జస్కరణ్దీప్ బుట్టర్, కన్వర్పాల్ తత్ఘుర్, నవ్‌నీత్ ధలీవాల్, రవీందర్‌పాల్ సింగ్, శివం శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సామ్రా. అమెరికా (9): మోనాంక్ పటేల్ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నోస్తుష్ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, శుభం రంజనె. ఒమన్ (7): జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్ ఒడెద్రా, వసీం అలీ, జితేన్ రామనంది. యూఏఈ (7): అలీషాన్ షరాఫు, ఆర్యాంశ్ శర్మ, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మయాంక్ కుమార్, సిమ్రన్‌జీత్ సింగ్, సొహైబ్ ఖాన్. న్యూజిలాండ్ (2): ఇష్ సోధి, రచిన్ రవీంద్ర దక్షిణాఫ్రికా (1): కేశవ్ మహరాజ్ వెస్టిండీస్ (1): గుడకేశ్ మోతీ ఇటలీ (1): జస్ప్రీత్ సింగ్ నెదర్లాండ్స్ (1): ఆర్యన్ దత్ తెలుగువాళ్లు కూడా...అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్‌గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్‌లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు. -
భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాక్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..!
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాతో జరగాల్సిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌ను పాక్ జట్టు రద్దు చేసుకుంటున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై తీవ్రమైన చర్యలు ఉంటాయని గత రెండ్రోజులగా ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ ప్రచారాన్ని ఐసీసీ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ ఛైర్మన్ ఎహసాన్ మణి కొట్టిపారేశాడు. ఈ విషయంలో ఐసీసీ పాక్ జట్టును ఏమీ చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.ఈ నిర్ణయం పీసీబీ కాకుండా పాక్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకోవడం వల్లే ఐసీసీ ఎలాంటి శిక్షలు విధించలేదని వెల్లడించాడు. ఆయన మాటల్లో.. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించినప్పుడు ఏ దేశానికీ శిక్షలు ఉండవు. ఇదే కారణంతో (భద్రత) టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను పాక్‌లో ఆడేందుకు నిరాకరించింది. అప్పుడు టీమిండియాపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పాక్ జట్టు విషయంలోనూ అంతే. ఒకే సమస్యకు రెండు విధానాలు ఉండకూడదని అన్నారు. కాగా, తాజా పరిస్థితి ఐసీసీకి పెద్ద సవాలుగా మారింది. ఓవైపు అభిమానుల ప్రయోజనాలు, ప్రపంచ క్రికెట్ సమగ్రత దెబ్బతింటున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలను బోర్డులు తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్ల ఐసీసీకి శిక్షలు విధించే అధికారం తగ్గిపోతోంది. ఈ లూప్ హోల్‌ను ఆసరాగా తీసుకొనే పీసీబీ డ్రామాలాడుతుంది. భారత్‌తో మ్యాచ్ రద్దుపై ఇప్పటివరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వ మాటగా కాలయాపన చేస్తుంది. ఐసీసీ నియమాలను అడ్డు పెట్టుకొని రోజుకో డ్రామాకు తెరలేపుతుంది.మరోవైపు ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఉండటంతో పాక్‌పై సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. షా.. రూల్స్‌ను పక్కన పెట్టి పాక్‌పై కఠిన చర్యలు తీసుకుంటాడని ఐసీసీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ షా తన పరపతిని ఉపయోగిస్తే పాక్ జట్టుకు అంత భారీ శిక్షలు కాకపోయినా, ఓ మోస్తరు శిక్షలు అయినా పడే అవకాశం ఉంది. పాక్ జట్టు భారీ జరిమానాతో పాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి అంక్షలు ఎదుర్కోవచ్చు. పాక్‌పై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. -
భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!
క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడూ తలపడతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా చిరకాల ప్రత్యర్ధులు కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడతున్నాయి. అయితే మరోసారి దాయాదుల పోరు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురయ్యే అవకాశముంది.టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌తో జరగాల్సిన లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టోర్నీలో ఇతర జట్లతో ఆడుతామని, కానీ భారత్‌తో మాత్రం తలపడబోమని పాక్ స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ రంగంలోకి దిగింది. పాక్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది.ఐసీసీకి భారీ నష్టం..ఒకవేళ భారత్-పాక్ మ్యాచ్ రద్దు అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. ఐసీసీ ప్రసార హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు (రూ. 27,465 కోట్లు)గా ఉంది. ఇందులో 40 శాతం కంటే ఎక్కువ ఆదాయం ఒక్క భారత్-పాక్ మ్యాచ్‌ల నుంచే వస్తుంది.గత మూడేళ్లలో జరిగిన ప్రతీ భారత్-పాక్ మ్యాచ్ విలువ సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,289 కోట్లు)గా ఉంది. అదేవిధంగా టోర్నీ బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్ ఈ మ్యాచ్ ద్వారా వచ్చే భారీ యాడ్స్ రెవెన్యూ కోల్పోతుంది. 10 సెకన్ల ప్రకటన విలువ సుమారు రూ. 40 లక్షల వరకు ఉంటుంది. దీంతో ప్రసారకర్తలకు నేరుగా రూ.250 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశముంది. పాక్ తమ మొండి పట్టు వీడకపోతే ఆ నష్టాన్ని వారి నుంచే ఐసీసీ రాబట్టనుంది.చదవండి: T20 WC 2026: భారత్‌తో మ్యాచ్ బాయ్‌కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా -
భారత్‌తో మ్యాచ్ బాయ్‌కట్.. పాకిస్తాన్ మరో కొత్త డ్రామా
టీ20 ప్రపంచకప్-2026 మరో ఐదు రోజుల్లో ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ఆదివారం ఎక్స్‌వేదికగా ప్రకటించింది. దీంతో ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గట్టిగానే స్పందించింది. నచ్చిన మ్యాచ్‌లు మాత్రమే ఆడుతాము అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ పేర్కొంది. ఒకవేళ పాక్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కాగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీకి, బ్రాడ్కాస్టర్లకు సుమారు రూ. 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఐసీసీ వసూలు చేసే అవకాశముంది.'ఈమెయిల్' డ్రామాకాగా ఈ బాయ్‌కట్ గురుంచి పీసీబీ నుంచి ఐసీసీకి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పలు రిపోర్ట్లు ప్రకారం..ఎలాంటి అధికారిక ఈమెయిల్ ఐసీసీకి పంపకూడదని పీసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో పీసీబీపై ఐసీసీ తదుపరి చర్యలు తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదు. ఏదేమైనప్పటికి పాక్ తమ వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదు. అయితే ఇదే విషయం చర్చించడానికి ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇదంతా బీసీసీఐ వల్లే: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు -
భారత్‌తో మ్యాచ్ రద్దు.. పాకిస్తాన్‌కు తప్పదు భారీ మూల్యం
భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ రద్దు చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద సాహసం చేసింది. ఈ చర్య వల్ల ఐసీసీకి కలిగే నష్టం మాట అటుంచితే, పీసీబీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఐసీసీ తీవ్రంగానే స్పందించింది. పీసీబీ ఇంకా అధికారికంగా తమ వైఖరిని తెలియజేయలేదని ప్రకటిస్తూనే.. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. క్రీడా సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి చర్యలను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పీసీబీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ తీసుకోబోయే చర్యలపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను (గ్రూప్ స్టేజీ) రద్దు చేసుకుంటున్నట్లు నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. తొలుత మెగా టోర్నీ మొత్తం నుంచి వైదొలుగుతామని బెదిరించిన పీసీబీ, చివరికి భారత్‌తో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.వివాదం ఎక్కడ మొదలైదంటే..?ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వరల్డ్‌కప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపించేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బీసీబీ కోరింది. కానీ బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.భద్రత పరంగా పూర్తి స్ధాయి హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను తప్పించి వారి స్దానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించింది. చివరికి భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే రద్దు చేసుకుంటున్న ప్రకటించింది.భారత్–పాకిస్తాన్ పోటీ ప్రాముఖ్యత - ఈ రెండు జట్ల మధ్య పోటీని “మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్” అని పిలుస్తారు. - ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఈ మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షిస్తారు.ఆర్థిక నష్టం అంచనా - ఈ మ్యాచ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగే వ్యాపారం వందల కోట్లలో ఉంటుంది.- పాకిస్తాన్ నిర్ణయం ఐసీసీకి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. - క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రతి భారత్ మ్యాచ్ విలువ సుమారు 10–11 మిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు ₹100 కోట్లు) ఉంటుంది. - పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వచ్చే సరికి ఈ ఆదాయం మరింత పెరుగుతుంది. - ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ ద్వారా రూ. 200 కోట్లకు మించి ఆదాయం వస్తుందని నిర్వహకులు అంచనా వేశారు.- మ్యాచ్ జరగకపోతే, ఐసీసీతో పాటు ప్రసార సంస్థలు భారీ నష్టాన్ని ఎదుర్కొంటాయి. దీని అంచనా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.పాకిస్తాన్‌కు కలిగే నష్టాలు- భారత్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం వల్ల పాక్ క్రికెట్ బోర్డు ఆర్దికపరమైన నష్టాలతో పాటు పరిపాలనాపరమైన మరెన్నో కఠనమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంది. - టోర్నీలో పాల్గొన్నందుకు ఇచ్చే 250,000 డాలర్లు(రూ. 2 కోట్లు పైమాటే) పార్టిసిపేషన్ ఫీజును పీసీబీ కోల్పోవాల్సి ఉంటుంది.- పాక్ సెమీఫైనల్ చేరితే 790,000 డాలర్లు(సుమారు రూ. 7 కోట్లు), రన్నరప్ అయితే 1.6 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.15 కోట్లు), ఒకవేళ విజేతగా నిలిస్తే 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 కోట్లు) కోల్పోతారు.- ఐసీసీ ప్రతి ఏటా తమ సభ్యదేశాలకు ఇచ్చే రెవెన్యూ వాటాను కూడా నిలిపివేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే పాక్ క్రికెట్ బోర్డు దివాళా తీయాల్సిందే. - ఫైనల్‌గా పాకిస్తాన్ తమ ప్రదర్శన బట్టి 250,000 డాలర్లు(సుమారు రూ.2.29 కోట్లు) నుంచి 4.42 మిలియన్ల డాలర్లు(సుమారు రూ. 38 కోట్లు) ప్రైజ్ మనీని కోల్పోయే ప్రమాదం ఉంది.- PSLకు ఇతర బోర్డులు NOCలు ఇవ్వకుండా ఆపుతుంది.- ఆసియా కప్ నుంచి పాకిస్తాన్‌ను తొలగించే అవకాశం ఉంది. -
పాక్‌కు చుక్కలు చూపించిన ఆటగాడిపై ఐసీసీ వేటు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన బిమ్ టీ10 టోర్నమెంట్-2024 సీజన్లో జోన్స్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని ఐసీసీ విచారణలో ప్రాథమికంగా తేలింది. ఈ క్రమంలోనే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.తనపై వస్తున్న ఆరోపణలపై 14 రోజుల సమాధానమివ్వాలని అతడిని ఐసీసీ ఆదేశించింది. ఆరోన్ జోన్స్‌పై మొత్తం ఐదు అభియోగాలు నమోదయ్యాయి. వీటిలో మూడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిధిలోకి రాగా, మిగిలిన రెండు ఐసీసీ రిజిస్టర్ చేసింది. ఈ లీగ్‌లో ఆడే సమయంలో జోన్స్‌ను బుకీలు సంప్రదించగా.. అతడు ఆ వివరాలను అధికారులకు తెలియజేయలేదు. ఈ కారణంతో ఐసీసీ వేటు వేసింది. అమెరికా జట్టులో జోన్స్ రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా సూపర్-8 చేరడంలో ఆరోన్ది కీలక పాత్ర. ముఖ్యంగా పాకిస్తాన్‌పై అమెరికా సాధించిన చారిత్రాత్మక విజయంలో అతడి ఇన్నింగ్స్ మరువలేనిది.అటువంటి ఆటగాడు ఇప్పుడు తనంతంట తానే కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్నాడు. ఈ సస్పెన్షన్ కారణంగా రాబోయే 2026 టీ20 ప్రపంచ కప్‌లో జోన్స్ ఆడే అవకాశం కోల్పోయాడు. జోన్స్ ఇప్పటివరకు అమెరికా తరపున 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.చదవండి: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్ -
టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
2026 టీ20 వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడం, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం వంటి గందరగోళాల మధ్య షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైంది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 4న గత ఎడిషన్ రన్నరప్ సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదే వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా భారత-ఏ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు ఆడనుండటం విశేషం. చిన్న జట్లు యూఎస్ఏ, నమీబియాకు ప్రాక్టీస్ కోసం ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ చేయబడ్డాయి. ఫిబ్రవరి 2న భారత-ఏ జట్టు నవీ ముంబై వేదికగా యూఎస్ఏతో తలపడనుంది. 6న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్లో నమీబియాను ఢీకొట్టనుంది. మొత్తంగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఫిబ్రవరి 2ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 3శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)ఫిబ్రవరి 4నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 5ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)ఫిబ్రవరి 6ఇటలీ వర్సెస్ యూఎస్ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)ఈ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది. -
చరిత్రలో ఐసీసీ టోర్నీలను బహిష్కరించిన జట్లు ఇవే..!
క్రికెట్‌కు సంబంధించి ఏ జట్టుకైనా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనడమనేది చాలా ముఖ్యం. కేవలం మైదానంలో లభించే గుర్తింపు కోసమే కాకుండా, ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలోనూ ఇది చాలా కీలకం. అందుకే ప్రతి జట్టు ఐసీసీ టోర్నీల్లో ఆడే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.అయితే, క్రికెట్ చరిత్రలో కొన్ని జట్లు ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు నిరాకరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ చేరింది. ఈ జట్టు త్వరలో జరుగబోయే టీ20 ప్రపంచ కప్ నుండి వైదొలిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఐసీసీ ఈవెంట్లను బహిష్కరించిన జట్లపై ఓ లుక్కేద్దాం.చరిత్ర చూస్తే.. రాజకీయ కారణాలు, భద్రతా సమస్యలు లేదా అంతర్జాతీయ సంబంధాల కారణంగా కొన్ని జట్లు ఐసీసీ టోర్నీలను బహిష్కరించాయి. ఇందులో ముందుగా జింబాబ్వే పేరు వస్తుంది.జింబాబ్వే రాజకీయ ఉద్రిక్తతలు, ఆటగాళ్లకు వీసా సమస్యల కారణంగా ఇంగ్లండ్‌లో జరిగిన 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20ని (అప్పట్లో టీ20 ప్రపంచకప్‌ను అలా పిలిచేవారు) బహిష్కరించింది. జింబాబ్వే ఇలా చేయడానికి బీజం 2003లో పడింది. ఆయేడు జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో ఆడటానికి నిరాకరించింది. ఇందుకు కారణం నాటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబేతో యూకేకు ఉండిన రాజకీయ విభేదాలు.అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపడకపోవడంతో జింబాబ్వే 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంది. జింబాబ్వేకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్కు టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇలాంటి ఉదంతమే 2016 అండర్ 19 వరల్డ్‌కప్‌లోనూ జరిగింది. ఆయేడు బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా వైదొలిగింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ యువ ఆసీస్ జట్టు మెగా టోర్నీని బహిష్కరించింది. అప్పుడు ఆసీస్‌కు ప్రత్యామ్నాయంగా ఐర్లాండ్‌కు అవకాశం లభించింది. పై రెండు ఉదంతాల తర్వాత ఓ జట్టు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే బహిష్కరించడం ఇదే ఏడాది జరిగింది. రాజకీయ ఉద్రిక్తతలు, ఐపీఎల్ 2026లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ తొలగింపు, భద్రతా కారణాల చేత భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. దీంతో ఆ జట్టుకు ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్కు ప్రపంచకప్ బెర్త్ దక్కింది.పైన పేర్కొన్న ఉదంతాల్లో ఆయా జట్లు ఐసీసీ టోర్నీ మొత్తాన్నే రద్దు చేసుకోగా.. కొన్ని జట్లు పలు మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి.1996 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకలో జరగాల్సిన మ్యాచ్‌లను ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు బాయ్‌కాట్ చేశాయి. లంకలో అంతర్యుద్దం, భద్రతా కారణాల చేత ఆ జట్లు తమ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. ఆ టోర్నీలో శ్రీలంకనే ఛాంపియన్‌గా నిలవడం కొసమెరుపు.2003 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు కూడా ఓ మ్యాచ్‌ను ఆడేందుకు నిరాకరించింది. ఆయేడు ప్రపంచకప్ టోర్నీకి జింబాబ్వేతో పాటు కెన్యా కూడా ఆతిథ్యమిచ్చింది. మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ నైరోబీలో ఓ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌ను భద్రతా కారణాల చేత న్యూజిలాండ్ బాయ్‌కాట్ చేయాలనుకుంది. -
పాకిస్తాన్ కు ICC వార్నింగ్.. దెబ్బకు T20 ప్రపంచకప్ కు జట్టు ప్రకటన
-
బంగ్లాదేశ్ కు షాకిచ్చిన ఐసీసీ.. వరల్డ్ కప్ నుంచి ఔట్
-
బంగ్లాదేశ్ ఖేల్ ఖతం!
దుబాయ్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ ఈ టోర్నమెంట్లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. టీమ్‌ను వరల్డ్ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్ డాలర్లు కోల్పోనుంది. బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్ వేలంలో బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటికి స్పందిస్తూ కేకేఆర్ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్లైన్ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది. -
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే?
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తుందా? లేదా అన్నది? జనవరి 21న తేలిపోనుంది. భద్రత కారణాలను సాకుగా చూపుతూ తమ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్‌కు పంపబోమని బంగ్లా క్రికెట్ బోర్డు మొండి పట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఇప్పటికే పలుమార్లు ఐసీసీకి బీసీబీ విజ్ఞప్తి చేసింది.అందుకు సమాధానముగా ఆఖరి నిమిషంలో షెడ్యూల్‌ను మార్చడం కుదరదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెల్చిచేప్పేసింది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా బీసీబీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.ఈ క్రమంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ వస్తుందా లేదా అనే విషయం చెప్పేందుకు జనవరి 21ని తుది గడువుగా ఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకుంటే.. ఆ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చాలని ఐసీసీ భావిస్తుందంట. ఐసీసీ ర్యాంకింగ్స్ బంగ్లాదేశ్ తర్వాతి స్దానాల్లో జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ ఉన్నాయి. అయితే జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించగా.. తర్వాత స్దానంలో ఉన్న స్కాట్లాండ్కు బంగ్లా స్దానంలో అవకాశం దక్కనుంది.కాగా గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువలపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బంగ్లా ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇక షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది.చదవండి: T20 World Cup 2026: సౌతాఫ్రికాకు భారీ షాక్ -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది. ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.చదవండి: ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు -
ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అతడి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.వివాదానికి కారణం ఏంటంటే?ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు."ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్‌పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.చదవండి: IND vs USA: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు. -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్
భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..?ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఐపీఎల్లో ఆడించకూడదని భారత్‌లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని కేకేఆర్‌కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను కాంట్రాక్ట్ నుంచి తొలిగించింది.తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సాహసం చేసి భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. -
నంబర్‌వన్ దీప్తి
దుబాయ్: టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ... ఐసీసీ మహిళల టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా 28 ఏళ్ల దీప్తి రికార్డుల్లోకెక్కింది. శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన దీప్తి... తాజా ర్యాంకింగ్స్‌లో 737 పాయింట్లతో ‘టాప్’ ప్లేస్‌కు చేరింది. ఆస్ట్రేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ (736 పాయింట్లు), పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్ (732 పాయింట్లు) వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా స్మృతి మంధాన (766 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా... లంకతో తొలి పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ (653 పాయింట్లు) ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. రెండో మ్యాచ్‌లో దంచికొట్టిన షఫాలీ వర్మ (650 పాయింట్లు) పదో స్థానంలో ఉంది. -
ఐసీసీ ప్రీమియర్ పార్ట్నర్గా హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్ టోర్నమెంట్లకు ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్‌కప్ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.ఈ ఒప్పందంతో హ్యుందాయ్‌కు లభించే ప్రత్యేక హక్కులు..- మ్యాచ్‌డే కాయిన్ టాస్‌లో భాగస్వామ్యం - స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్ - అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement) ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు. హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్‌లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు. కాగా, హ్యుందాయ్ మోటర్ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్ పార్ట్నర్గా వ్యవహరించింది. -
'డబ్ల్యూటీసీ ఫైనల్స్.. మా అంచనాలను అందుకున్నాయి'
దుబాయ్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ టెస్టు క్రికెట్లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్ మ్యాచ్‌లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్ గుప్తా అభిప్రాయ పడ్డారు. 2025లో జరిగిన ఫైనల్స్ కోసం లార్డ్స్ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి."డబ్ల్యూటీసీ ఫైనల్స్ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్ విలువ ఏమిటో ఈ మ్యాచ్‌లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్ అందుకున్నాయి. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్ గానీ ఇంగ్లండ్ గానీ ఆడలేదు. అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్ వ్యాఖ్యానించారు.చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్ -
రోహిత్ వెనకాలే కోహ్లి
దుబాయ్: ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డేసిరీస్‌లో దంచికొట్టిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌సెంచరీతో 302 పరుగులు చేసిన 37 ఏళ్ల కోహ్లి... తాజా ర్యాంకింగ్స్‌లో 773 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరాడు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ 781 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య 8 పాయింట్ల అంతరమే ఉంది. గాయం కారణంగా సఫారీలతో సిరీస్‌కు దూరమైన శుబ్‌మన్ గిల్ (723 పాయింట్లు) ఐదో ర్యాంక్‌లో ఉండగా... కేఎల్ రాహుల్ (649 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 12వ ర్యాంక్‌లో నిలిచాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ (655 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (710 పాయింట్లు) ‘టాప్’లో కొనసాగుతున్నాడు. టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ (913 పాయింట్లు), బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి (782 పాయింట్లు) అగ్రస్థానాల్లో ఉన్నారు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా (879 పాయింట్లు) ‘టాప్’లో ఉండగా... యాషెస్ సిరీస్‌లో విజృంభిస్తున్న మిచెల్ స్టార్క్ (852 పాయింట్లు) మూడో స్థానాలు మెరుగు పరుచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. -
వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకున్న హాట్‌స్టార్..!
2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్ నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్‌స్టార్ ఈ డీల్‌ను వదులుకోనున్నట్లు సమాచారం.జియో హాట్‌స్టార్ భారత్‌లో స్ట్రీమింగ్ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్‌స్టార్ ఈ డీల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది. హాట్‌స్టార్ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.కాగా, జియో హాట్‌స్టార్ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది. దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్ రేటు కూడా పెరగడం హాట్‌స్టార్‌పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం.ఒకవేళ హాట్‌స్టార్ వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్‌లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే. -
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఝలక్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు ఐసీసీ టీమిండియాకు ఝలక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 3న రాయపూర్‌లో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ భారత ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలోగా 2 ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున, రెండు ఓవర్లకు 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను టీమిండియాకు జరిమానాగా విధించారు.ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ జరిమానాను భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్వీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండా కేసు ముగిసింది. ఆ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా విజయవంతంగా ఛేదించి, సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అనంతరం విశాఖపట్నంలో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో భారత్ విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోని మిగతా టీ20లు డిసెంబర్ 11, 14, 17, 19 తేదీల్లో ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ -
ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో షఫాలీ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ రేసులో నిలిచింది. మహిళల విభాగంలో నవంబర్ నెలలో ఆమె ప్రదర్శనకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తుది జాబితాలో షఫాలీకి చోటు దక్కింది. భారత్ తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ గెలుపొందడంలో షఫాలీ కీలకపాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఆమె 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు తీసింది. ప్రతీక రావల్ గాయపడటంతో అనూహ్యంగా సెమీస్, ఫైనల్ ఆడే అవకాశం దక్కగా ఏకంగా ఆల్‌రౌండ్ షోతో భారత వరల్డ్‌కప్ స్టార్ అయ్యింది. తాజాగా అవార్డు రేసులోనూ ఉంది. ఆమెతో పాటు ఈ అవార్డు కోసం ఈషా ఒజా (యూఏఈ), తిపత్చా పుతవాంగ్ (థాయ్‌లాండ్)లు కూడా పోటీ పడుతున్నారు. ఐసీసీ ప్రారంభించిన మహిళల ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీలో (బ్యాంకాక్)లో వీళ్లిద్దరు నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక పురుషుల విభాగంలో నవంబర్ నెలకు గాను సఫారీ స్పిన్నర్ హార్మర్, బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లామ్, పాకిస్తాన్ ఆల్‌రౌండర్ నవాజ్‌లు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డు రేసులో ఉన్నారు. భారత గడ్డపై జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా నెగ్గడంలో హార్మర్ కీలక భూమిక పోషించాడు. -
ఫిబ్రవరి 15న పాక్‌తో భారత్ పోరు
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వరల్డ్ కప్ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ లీగ్ దశను ముగిస్తుంది. గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్ దశ తర్వాత తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్–8’కు అర్హత సాధిస్తాయి. ‘సూపర్–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్–8’ మ్యాచ్‌ల తర్వాత రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్... మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఎనిమిది వేదికలు ఖరారు... టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్‌లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్ఎస్సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు. గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్ సెమీస్ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్‌ను కోల్‌కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్ ఫైనల్ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు. బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ... భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్‌ల విజేత రోహిత్ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్ కప్ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా. 9 వరల్డ్ కప్‌లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్ ఆడే టి20 మ్యాచ్‌లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.గ్రూప్‌ల వివరాలు గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా. గ్రూప్ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. -
మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నం.. యువ క్రికెటర్‌పై ఐసీసీ బ్యాన్
అంతర్జాతీయ క్రికెట్లో యూఎస్ఏ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆఫ్‌స్పిన్నర్ బొడుగం అఖిలేష్ రెడ్డి అబుదాబి టి10 లీగ్‌లో ఆడుతూ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అవినీతి నిరోధక నిబంధనలను అతను ఉల్లంఘించినట్లు వెల్లడైంది.25 ఏళ్ల అఖిలేష్ రెడ్డిపై మూడు వేర్వేరు అభియోగాలు నమోదు చేసిన ఐసీసీ... అతడిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అఖిలేష్‌కు 14 రోజుల గడువు ఇచ్చింది. విచారణ ముగిసిన అనంతరం అతనిపై పూర్తి స్థాయిలో చర్యలుంటాయి.అబుదాబి టి10 లీగ్‌లో అస్పిన్ స్టాలియన్స్ జట్టు తరఫున బుధ, గురువారాల్లో అతను 2 మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్‌కు చెందిన 25 ఏళ్ల అఖిలేష్ రెడ్డి ఈ ఏడాది ఆరంభంలో నార్త్ అమెరికా టి20 కప్‌లో యూఎస్ తరఫున అరంగేట్రం చేసి 4 మ్యాచ్‌లు ఆడాడు.చదవండి: అతడిని చూసి భయపడ్డా.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాము: స్టోక్స్ -
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
2026 పురుషుల అండర్ 19 ప్రపంచకప్ (వన్డే) షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (నవంబర్ 19) విడదల చేసింది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్ రన్నరప్ భారత్, యూఎస్ తలపడనున్నాయి. అదే రోజు జింబాబ్వే, స్కాట్లాండ్, టాంజానియా, వెస్టిండీస్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి.జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది (2026) జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 మధ్యలో జరుగనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 6న హరారేలో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వారి తొలి మ్యాచ్‌ను జనవరి 16న ఐర్లాండ్‌తో ఆడుతుంది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లు రెండు ఆతిథ్య దేశాల్లోని ఐదు మైదానాల్లో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. అనంతరం సూపర్-6, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ టోర్నీకి సంబంధించిన వార్మప్ మ్యాచ్‌లు జనవరి 9-14 మధ్యలో జరుగుతాయి.గ్రూప్‌లు..గ్రూప్-ఏ- భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్గ్రూప్-బి- జింబాబ్వే, పాకిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్గ్రూప్-సి- ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంకగ్రూప్-డి- వెస్టిండీస్, టాంజానియా, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా View this post on Instagram A post shared by Zimbabwe Cricket (@zimbabwe.cricket)చదవండి: టీమిండియాకు భంగపాటు -
పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్..
రావల్పిండి వేదికగా శ్రీలంతో జరిగిన తొలి వన్డేలో గెలిచి జోష్ మీదున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (నాలుగు ఓవర్లు వెనుకపడింది).ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 ఉల్లంఘణ కిందికి వస్తుంది. ఈ క్రమంలో పాక్ జట్టులో ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. తమ తప్పును మెన్ ఇన్ గ్రీన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది అంగీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.నేడు రెండో వన్డే..ఇక పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డేను భద్రతా కారణాల దృష్ట్యా రీ షెడ్యూల్ చేశారు. వాస్తవానికి గురువారం (నవంబర్ 13)న జరగాల్సిన రెండో వన్డే శుక్రవారం జరగనుంది. ఇటీవలే ఇస్లామాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడితో లంక క్రికెటర్లు భయందోళనకు గురయ్యారు. దీంతో తొలి వన్డే తర్వాత లంక క్రికెటర్లలో సుమారు 8 మంది ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోతామని జట్టు మేనేజ్మెంట్ను కోరారు. కానీ శ్రీలంక క్రికెట్ మాత్రం అందుకు అంగీకరించలేదు. వన్డే సిరీస్‌తో పాటు ముక్కోణపు సిరీస్‌నూ ముగించుకున్నాకే స్వదేశానికి రావాలని వారిని ఆదేశించింది. దీంతో లంక ఆటగాళ్లు పాక్‌లోనే ఉండనున్నారు.చదవండి: సెలక్టర్ల కీలక నిర్ణయం.. కెప్టెన్‌గా వరుణ్ చక్రవర్తి -
జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్: ప్రతికా రావల్
భారత్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ట్రోఫీ గెలవడంలో ప్రతికా రావల్ (Pratika Rawal)ది కూడా కీలక పాత్ర. టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన నాటి నుంచి సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రపంచకప్ టోర్నీలోనూ అదరగొట్టింది.ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 308 పరుగులు రాబట్టిన ప్రతికా ఖాతాలో ఓ శతకం.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు ప్రతికా గాయపడింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె చీలమండకు గాయమైంది.ప్రతికా స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన ప్రతికా రావల్.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరమైంది. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ షఫాలీ వర్మ (Shafali Verma) జట్టులోకి వచ్చింది. ఆసీస్‌తో సెమీస్‌లో తేలిపోయినా.. సౌతాఫ్రికాతో ఫైనల్లో (IND vs SA) షఫాలీ సత్తా చాటింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏకంగా 87 పరుగులు రాబట్టడంతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటింది.ప్రతికా స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షఫాలీ.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మెడల్ గెలుచుకుంది. మరోవైపు.. గాయం వల్ల జట్టుకు దూరమైన ప్రతికాకు నిబంధనల కారణంగా వరల్డ్‌కప్ మెడల్ దక్కలేదు.వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి..అయితే, భారత్ సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన తర్వాత ప్రతికా వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి.. సహచరులతో కలిసి సంబరాలు జరుపుకొంది. అయితే, అప్పుడు ఆమెకు మెడల్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో వన్డే వరల్డ్‌కప్ విజేత జట్టు సమావేశమైన సందర్భంగా ప్రతికా మెడలో పతకం కనిపించింది.అదే సమయంలో అమన్‌జోత్ కౌర్ మెడల్ లేకుండా కనిపించగా.. ఆమే ప్రతికాకు తన మెడల్ ఇచ్చిందని అంతా భావించారు. ఈ విషయంపై ప్రతికా తాజాగా స్పందించింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్‘‘ఆరోజు అమన్‌జోత్ మెడల్ ఎందుకు వేసుకోలేదు నాకు తెలియదు. బహుశా తను మర్చిపోయి ఉంటుంది. అయితే, సహాయక సిబ్బంది ఒకరు తన మెడల్‌ను నాకు ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే.. త్వరలోనే నా మెడల్ నా దగ్గరకు చేరనుంది.ఈ విషయం గురించి జై షా (ఐసీసీ చైర్మన్) మా మేనేజర్‌కు సందేశం అందించారు. ప్రతికాకు పతకం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తున్నానని మెసేజ్ చేశారు. కాబట్టి నాకు త్వరలోనే మెడల్ లభిస్తుంది. ఏదేమైనా సపోర్టు స్టాఫ్ నాకు మెడల్ ఇవ్వగానే.. ఏడ్చేశా.సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఐసీసీ నాకు మెడల్ పంపగలదా? అని జై షా అక్కడి వారిని అడిగారు. అయితే, పతకం నా చేతికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ప్రధాని దగ్గరకు వెళ్లినపుడు పతకం లేదనే బెంగ లేకుండా సహాయక సిబ్బంది తన మెడల్‌ను నాకు ఇచ్చారు’’ అని ప్రతికా రావల్ చెప్పుకొచ్చింది.ఐసీసీ నిబంధనల ప్రకారంకాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్‌కు ఎంపికైన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లకు మాత్రమే (గెలిచిన జట్టు) మెడల్స్ ఇస్తారు. గాయం వల్ల ప్రతికా జట్టులో స్థానం కోల్పోయినందున ముందుగా ఆమెకు మెడల్ దక్కలేదు. అయితే, ఐసీసీ చైర్మన్ జై షా నేరుగా జోక్యం చేసుకుని పతకం వచ్చేలా చేయడం చర్చకు దారితీసింది. చదవండి: అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్ -
ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు మొండిచెయ్యి..!
మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నీని (Women's Cricket World Cup Team of the Tournament) ఐసీసీ ఇవాళ (నవంబర్ 4) ప్రకటించింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు భారత్ నుంచి ముగ్గురు, రన్నరప్ జట్టు సౌతాఫ్రికా నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. అలాగే ఏడు సార్లు ఛాంపియన్, ఈ ఎడిషన్ సెమీఫైనలిస్ట్ అయిన ఆస్ట్రేలియా నుంచి కూడా ముగ్గురికి చోటు లభించింది. ఈ ఎడిషన్ మరో సెమీ ఫైనలిస్ట్ అయిన ఇంగ్లండ్ నుంచి ఒకరు, లీగ్ దశలో నిష్క్రమించిన పాకిస్తాన్ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన మరో ప్లేయర్‌కు 12వ సభ్యురాలిగా అవకాశం లభించింది. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు (Harmanpreet Kaur) చోటు దక్కలేదు.బెర్త్‌లు పరిమితిగా ఉండటంతో ఛాంపియన్ టీమ్ కెప్టెన్‌కు చోటు కల్పించలేకపోయామని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా రన్నరప్ టీమ్ కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ ఎంపిక కాగా.. అదే జట్టు నుంచి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్, ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్ చోటు దక్కించుకున్నారు.లారా సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలు సహా టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలువగా.. కాప్ 2 అర్ద సెంచరీలు సహా 208 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. డి క్లెర్క్ 52 సగటున, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 208 పరుగులు చేసి, 26.11 సగటున 9 వికెట్లు తీసింది.భారత్ నుంచి టోర్నీ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, సెమీస్‌లో ఆస్ట్రేలియాపై వీరోచిత శతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్, ఫైనల్లో హాఫ్ సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన దీప్తి శర్మకు చోటు దక్కింది.మంధన సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేయగా.. జెమీ సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేసింది. దీప్తి సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సహా 22 వికెట్లు తీసి, టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనలకు గానూ దీప్తి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగానూ నిలిచింది.ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అలానా కింగ్ ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో చోటు దక్కించుకున్నారు. గార్డ్నర్ రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో పాటు 7 వికెట్లు తీయగా.. సదర్‌ల్యాండ్ ఓ హాఫ్ సెంచరీ చేసి, 17 వికెట్లు తీసింది. లెగ్ స్పిన్నర్ అలానా కింగ్ 17.38 సగటున 13 వికెట్లు తీసింది.పాకిస్తాన్ నుంచి వికెట్‌కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లండ్ నుంచి సోఫీ ఎక్లెస్టోన్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. సిద్రా ఈ ప్రపంచకప్‌లో 8 డిస్మిసల్స్లో భాగంగా కావడంతో పాటు 62 పరుగులు చేయగా.. ఎక్లెస్టోన్ 14.25 సగటున 16 వికెట్లు తీసింది. 12వ ప్లేయర్‌గా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ ఎంపికైంది. బ్రంట్ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 262 పరుగులు చేసి, 9 వికెట్లు తీసింది.చదవండి: స్మృతి మంధనకు భారీ షాక్ -
‘అడ్డంకులు తొలిగాయి.. లెజెండ్స్ పుట్టారు’
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల సమక్షంలో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో భారత్ మొదటిసారి ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టెక్ పరిశ్రమ దిగ్గజాలు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోషల్ మీడియా వేదికగా ఇండియా జట్టును అభినందించారు.భారతదేశం ప్రతిష్టాత్మక క్రికెట్ విజయాలను గుర్తుచేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ ఫైనల్‌ను ఉత్కంఠభరితమైన మ్యాచ్‌గా అభివర్ణించారు. ‘భారత క్రికెట్ మహిళల జట్టుకు అభినందనలు. ఈ విజయంతో 1983, 2011నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఈ విజయం మొత్తం తరానికి స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా టీమ్‌కు కూడా ఇదో గొప్ప టోర్నమెంట్’ అని తన ఎక్స్ ఖాతాలో టీమ్ ఇండియాను అభినందించారు.మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ విజయంపై స్పందిస్తూ..‘ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! మహిళల క్రికెట్‌కు నిజంగా చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించారు. అడ్డంకులు తొలిగాయి. లెజెండ్స్ పుట్టుకొచ్చారు. ఈ ఫార్మాట్లో తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికాకు ప్రశంసలు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య -
WC 2025: కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబై వేదికగా భారత్- సౌతాఫ్రికా (IND W vs SA W) మధ్య ఆదివారం నాటి ఫైనల్‌తో ఈ టోర్నీలో కొత్త చాంపియన్ అవతరించనుంది.ఈ ఈవెంట్లో ఇప్పటికే రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. తొలిసారి ఫైనలిస్టు అయిన సౌతాఫ్రికా... ప్రస్తుత బలాబలాల దృష్ట్యా టైటిల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త చాంపియన్ రాకతో పాటు.. ఈసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి మరో ప్రత్యేకత కూడా ఉంది.కళ్లు చెదిరే ప్రైజ్మనీవిజేతగా నిలిచిన జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ప్రకటించింది. పురుషుల, మహిళల క్రికెట్లో రికార్డు స్థాయిలో చాంపియన్‌కు ఏకంగా 4.48 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది.123 కోట్ల రూపాయలుఅదే విధంగా.. రన్నరప్ జట్టుకు.. విజేతకు అందించిన నగదులో సగం అంటే 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (దాదాపు రూ. 19 కోట్లకు పైగా) ప్రైజ్‌మనీగా ప్రకటించింది. భారత్- శ్రీలంక సంయుక్త ఆతిథ్య దేశాలుగా ఉన్న ఈ టోర్నీ ప్రైజ్‌మనీల మొత్తానికి ఐసీసీ ఏకంగా 13.88 మిలియన్ యూఎస్ డాలర్లు అంటే... దాదాపు 123 కోట్ల రూపాయలు కేటాయించింది.239 శాతం పెంచారువరల్డ్కప్ టోర్నీ చరిత్రలోనే ఇది అత్యధికం. వన్డే వరల్డ్‌కప్-2022 ఎడిషన్‌తో పోలిస్తే ఇది ఏకంగా 297 శాతం ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. నాటి విజేత ఆస్ట్రేలియాకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే తాజా సీజన్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీని ఏకంగా 239 శాతం పెంచడం గమనార్హం.రూ. 42 కోట్లకుఇక ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే దాదాపు 3,50,000 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ (సుమారుగా 3.1 కోట్ల రూపాయలు) సొంతం చేసుకుంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో మూడు విజయాలకు గానూ ఈ మొత్తం టీమిండియాకు లభించింది. అన్నీ సజావుగా సాగి భారత్ చాంపియన్‌గా అవతరిస్తే మొత్తం ప్రైజ్‌మనీ రూ. 42 కోట్లకు చేరుకుంటుంది.మరోవైపు.. సౌతాఫ్రికా ఇప్పటికే నాలుగు లక్షల యూఎస్ డాలర్లకుపైగా గెలుచుకుంది. గ్రూప్ దశలో ఐదు విజయాలు సాధించి ఈ మొత్తం సొంతం చేసుకుంది. ఏదేమైనా క్రికెట్ ప్రపంచంలో పురుష జట్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ.. మహిళా టోర్నీలో రికార్డు స్థాయి ప్రైజ్‌మనీ అందించడం హర్షించదగ్గ పరిణామం. మహిళా క్రికెట్‌కు ఆదరణ పెంచడంతో పాటు.. యువ ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇలాంటి చర్యలు తోడ్పడతాయి.బీసీసీఐ బంపరాఫర్!ఇదిలా ఉంటే.. ఒకవేళ హర్మన్ సేన గనుక వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మహిళా క్రికెటర్లుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. పురుష క్రికెటర్లతో పాటు మహిళా ప్లేయర్లకు కూడా సమవేతనం చెల్లించాలనే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి. మరోవైపు.. హర్మన్‌సేన ట్రోఫీ గెలిస్తే బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా నవీ ముంబై వేదికగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్‌కు తెరలేస్తుంది.చదవండి: IND vs AUS 3rd T20: సమం చేసేందుకు సమరం -
జీసస్ నన్ను నడిపించాడు బైబిల్ పోరాడేలా చేసింది? జెమిమా ఎమోషనల్
-
నాకు ఫోన్ చేసి మరీ..: బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ (Chris Broad) టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. పలు మ్యాచ్‌లలో భారత జట్టు చేసిన తప్పులను కప్పి పుచ్చాలంటూ తనకు ఫోన్లు వచ్చాయని.. రాజకీయ జోక్యం వల్లే ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించాడు.కాగా ఇంగ్లండ్ దిగ్గజ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ (Stuard Broad) తండ్రే క్రిస్ బ్రాడ్. ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 25 టెస్టుల్లో 1661, 34 వన్డేల్లో 1361 పరుగులు చేశాడు. అనంతరం 2003- 2024 వరకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు క్రిస్ బ్రాడ్.కాంట్రాక్టును పునరుద్ధరించని ఐసీసీమొత్తంగా 123 టెస్టులు, 361 వన్డేలు, 138 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు బ్రాడ్ రిఫరీగా పనిచేశాడు. అయితే, ఇంకొన్నాళ్లు కొనసాగాలని చూసినా ఐసీసీ అతడి కాంట్రాక్టును పునరుద్ధరించలేదు.ఇదిలా ఉంటే.. తాజాగా ‘ది టెలిగ్రాఫ్‌నకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆనాటి మ్యాచ్‌లో నిర్ణీత ఓవర్ల కంటే ఇండియా మూడు, నాలుగు ఓవర్లు వెనుకబడి ఉంది.అక్కడ ఉంది టీమిండియాజరిమానా పడే పరిస్థితి నెలకొంది. ఇంతలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘ఉదారంగా వ్యవహరించండి. ఎందుకంటే అక్కడ ఉంది టీమిండియా’ అని నాకు సందేశం వచ్చింది. సరే మరేం పర్లేదు అనుకున్నా.గంగూలీ నా మాట లెక్కచేయలేదుతగినంత సమయం దొరకడంతో చెప్పినట్లే చేశాం. అయితే, ఆ తర్వాతి మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతమైంది. స్లో ఓవర్ రేటు నివారించేలా చర్యలు తీసుకోవాలని సౌరవ్ గంగూలీకి చెప్పినా అతడు నా మాట లెక్కచేయలేదు.అంతలో మళ్లీ ఫోన్.. ‘నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగాను. ఇందుకు బదులుగా.. ‘అతడు (గంగూలీ) ఏం చేస్తే అదే చేయనివ్వండి’ అనే సమాధానం వచ్చింది. అంతా రాజకీయం. అప్పటి నుంచే క్రీడల్లో రాజకీయ జోక్యం మొదలైంది. ఇంకా నయం నేను ఇంకా ఆ పదవిలో లేను.కానీ 20 ఏళ్ల పాటు నాపైకి ఎన్నో ‘బుల్లెట్లు’ దూసుకువచ్చాయి. రాజకీయ జోక్యం వల్ల సమస్యలు వచ్చాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ‘20 ఏళ్ల సుదీర్ఘ సమయం. ఎలా తట్టుకున్నానో అనిపిస్తుంది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపణలు చేశాడు. అయితే, టీమిండియా ఆడిన ఏ మ్యాచ్ విషయంలో తాను ఇలాంటి ఒత్తిళ్లకు గురయ్యానన్నది మాత్రం అతడు స్పష్టంగా చెప్పలేదు.అందుకే ఆరోపణలా?కాగా ఐసీసీ తన కాంట్రాక్టును పునరుద్ధరించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే బ్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఐసీసీ ప్రస్తుత చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: క్రికెట్ ఒక్కటే జీవితం కాదు.. కోహ్లి నన్ను బాగా అర్థం చేసుకుంటాడు: రోహిత్ శర్మ -
వచ్చి తీసుకోవాల్సిందే: నఖ్వీ ఓవరాక్షన్.. బీసీసీఐ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచి దాదాపు నెల రోజులు కావస్తున్నా టోర్నీకి సంబంధించిన ట్రోఫీ మాత్రం ఇంకా టీమ్‌కు అందలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ఆదేశాల మేరకు ఇప్పటికీ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. ఈ విషయంపై దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరోసారి ఏసీసీకి లేఖ రాసింది. ఏసీసీలోని సభ్య దేశాలైన శ్రీలంక, అఫ్గానిస్తాన్ జట్లు కూడా బీసీసీఐకి మద్దతు పలుకుతూ వెంటనే ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరాయి. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, రాజీవ్ శుక్లా లేఖ రాసిన విషయాన్ని ఏసీసీ అధికారి ఒకరు నిర్ధారించారు. అయితే నఖ్వీ మాత్రం తన మొండితనాన్ని వీడలేదు. బీసీసీఐకి సంబంధించినవారు ఎవరైనా దుబాయ్‌కు వచ్చి తన చేతుల మీదుగా తీసుకుంటేనే దానిని అందిస్తామని అతడు పునరుద్ఘాటించాడు. అయితే బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. దాంతో ఆసియా కప్ ఫైనల్ రోజులాంటి యథాతథ స్థితి ఇంకా కొనసాగుతోంది. నా చేతుల మీదుగా తీసుకోవచ్చుబీసీసీఐ లేఖపై తాజాగా నఖ్వీ స్పందించాడు. ‘ఆసియా కప్ ఫైనల్ రోజు నా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోమని భారత్ చివరి క్షణం వరకు చెప్పలేదు. వేదికపై అతిథులంతా చేరిన తర్వాత ఆ విషయం తెలిసింది. మేం 40 నిమిషాలు వేచి చూసినా ఎవరూ రాలేదు. ఆసియా కప్ ట్రోఫీ భారత్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి బీసీసీఐ ప్రతినిధి ఎవరైనా ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఆటగాడు ఒకరితో కలిసి ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా తీసుకోవచ్చు’ అని అదే మాట చెప్పాడు. ఈ ప్రతిష్టంభనకు ఏసీసీలో పరిష్కారం లభించదని భారత బోర్డుకు అర్థమైంది. త్వరలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి సమావేశంలో నఖ్వీపై ఫిర్యాదు చేయాలని... అక్కడే ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.చదవండి: పాకిస్తాన్ అవుట్ -
‘కంగారు’ పడతారా? పెట్టిస్తారా
విశాఖ స్పోర్ట్స్: ఐసీసీ వుమెన్ వరల్డ్ కప్‌లో అత్యంత రసవత్తరమైన పోరుకు విశాఖ వైఎస్సార్ స్టేడియం సిద్ధమైంది. వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో గత రన్నరప్ భారత్ ఆదివారం డే–నైట్ మ్యాచ్‌లో ఢీకొట్టనుంది. ఈ పోరు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లతో ఆ్రస్టేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత జట్టు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ఆటగాళ్లు శనివారం ప్రాక్టీస్‌లో శ్రమించారు. మంధాన రికార్డుపై దృష్టి భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో మరో 58 పరుగులు చేయగలిగితే.. వన్డేల్లో 5,000 పరుగుల మార్కును చేరుకోనుంది. టాస్ గెలిస్తే బౌలింగ్‌కు అనుకూలం విశాఖలో వర్షాల కారణంగా పిచ్ కొద్దిగా తడిగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశం ఉంది. మిథాలీరాజ్ స్టాండ్, కల్పన ఎంట్రీల ప్రారంభం భారత మాజీ కెపె్టన్ మిథాలీరాజ్ పేరిట ఒక స్టాండ్‌ను, ఆంధ్ర మహిళా క్రికెటర్ కల్పన పేరిట ఒక ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ స్టాండ్, ప్రవేశద్వారాలను ప్రారంభించనున్నారు. -
టీమిండియాపై ఓవరాక్షన్.. కట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమి తప్పదు అనుకున్న చోట నాడిన్ డి క్లెర్క్ అద్బుతం చేసింది. కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రోటీస్‌కు మరుపురాని విజయాన్ని అందించింది.అయితే గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికా స్టార్ బౌలర్ నోన్కులులెకో మ్లాబాకు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. తమ ప్రవర్తన నియమావళిని ఉల్లఘించినందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది.ఆమె మ్యాచ్ ఫీజులో ఎటువంటి కోత విధించనప్పటికి.. ఓ డిమెరిట్ పాయింట్ మాత్రం ఆమె ఖాతాలో చేరింది. 24 నెలల్లో ఇది ఆమెకు మొదటి డీమెరిట్ పాయింట్ కాబట్టి సౌతాఫ్రికా మెనెజ్‌మెంట్ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.అసలేమి జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో మ్లాబా తన స్పిన్ మ్యాజిక్‌తో భారత టాపార్డర్‌ను దెబ్బతీసింది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్‌ను వెంటవెంటనే పెవిలియన్‌కు పంపింది. అయితే 17వ ఓవర్లో హర్లీన్ డియోల్‌ను ఔట్ చేసిన తర్వాత మ్లాబా ఆమె వైపు చూస్తూ “గుడ్‌బై” అంటూ తన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసింది.ఆమె మరీ అంత దూకుడుగా వ్యవహరించికపోయినప్పటికి.. ఐసీసీ మాత్రం ఆమె ప్రవర్తను కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఆమెను ఐసీసీ మందలించింది. ఈ మెగా టోర్నీలో మ్లాబా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టింది.చదవండి: BAN vs AFG: ఐదేసిన రషీద్ ఖాన్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ -
ఆసియాకప్ ట్రోఫీ ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే! నఖ్వీ పోస్ట్ ఊస్టింగ్?
2025 ఆసియా కప్.. ఈ ఖండాతర టోర్నీ చరిత్రలో అత్యంత వివాదాస్పద ఎడిషన్‌గా నిలిచింది. షేక్ హ్యాండ్ వివాదం మొదలు ఆసియా కప్ ట్రోఫీ వరకూ ఆధ్యంతం తీవ్ర ఉత్కంఠను రేపింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో భారత జట్టు అంటిముట్టనట్టే వ్యవహరించింది. తొలుత షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరించిన భారత్.. ఆ తర్వాత ఏసీసీ చైర్మెన్, పీసీబీ చీఫ్ మోహ్సన్ నఖ్వీ(mohsin naqvi) చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి సముఖత చూపలేదు. నక్వీ తన చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకోవాలని పట్టుబట్టినప్పటికి బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ అందుకు అంగీకరించలేదు.దీంతో నఖ్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో పాటు విజేతల పతకాలను కూడా తీసుకెళ్లడం పెద్ద వివాదానికి దారితీసింది. ఇప్పటికి ఇంకా ట్రోఫీని భారత్‌కు అతడు అందజేయలేదు. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీస్‌లో ఉంది. తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎవరికీ అప్పగించకూడదని ఏసీసీ అధికారులకు నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం, ఇంకా అందజేయకపోవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐ లేవనెత్తునుంది. అంతేకాకుండా ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి అతడిని తొలిగించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది.నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌తో పాటు ఐసీసీ డైరెక్టర్ గానూ కొనసాగుతున్నాడు. కాగా ఐసీసీ చైర్మెన్‌గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నఖ్వీ డైరక్టర్ పదవి ఊడిపోవడం ఖాయమని ప్రచారం సాగుతోంది."ఆసియాకప్ టోర్నీకి అధికారిక హోస్ట్‌గా ఉన్న బీసీసీఐకి ట్రోఫీని పంపడానికి నిరాకరించే హక్కు నఖ్వీకి లేదు. అతడు ట్రోఫీని భారత్‌కు ఇప్పటికే పంపించాల్సింది. కానీ అందుకు అతడు ఒప్పుకోవడం లేదు. కాబట్టి అందుకు నఖ్వీ భారీ మూల్యం చెల్లించుకోనున్నాడు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: ఐపీఎల్లో అదరగొట్టాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఊహించని జాక్ పాట్ -
భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు పదే పదే వద్దు
లండన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నమెంట్లలో ఆర్థిక అవసరాల కోసం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు పెట్టే సంస్కృతిని ఇప్పటికైనా వీడాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ అన్నాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరగగా... మూడింట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. అయితే ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయానంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా విన్నర్స్ ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచే ఇరు జట్ల కెపె్టన్లు, ఆటగాళ్ల మధ్య ‘షేక్ హ్యాండ్’ కూడా జరగలేదు. తొలి మ్యాచ్ అనంతరం భారత జట్టు చేయి కలపలేదనే అంశాన్ని పాకిస్తాన్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ అమాయకుల ప్రాణాల ను బలిగొంటున్న వారికి అండగా నిలుస్తున్నంత కాలం... తమ తీరు మారదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తేల్చిచెప్పింది. ఈ పూర్తి విషయాన్ని దగ్గర నుంచి పరిశీలిస్తున్న పాకిస్తాన్ బోర్డు అధ్యక్షుడు... విన్నర్స్ ట్రోఫీ తానే అందించాలని మంకుపట్టు పట్టాడు. దీంతో టీమిండియా ట్రోఫీ అందుకోకుండానే... స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అథర్టన్... భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు... వాటిని ఐసీసీ వినియోగించుకుంటున్న తీరును ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో వివరించాడు. వారానికో మ్యాచా? ఇలాంటి చేదు అనుభవాలకంటే... ఇరు దేశాల మధ్య క్రికెట్‌ను పూర్తిగా నిలిపివేయడం మంచిదని సూచించాడు. ‘మూడు వారాల పాటు సాగిన ఆసియా కప్‌లో... ప్రతి ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించారు. కేవలం ఇదొక్కటే కాదు... ఆ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయినప్పటి నుంచి గమనిస్తే... అన్నీ ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలోనే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ చేస్తున్నారు. 2013 నుంచి చూసుకుంటే 3 వన్డే ప్రపంచకప్‌లు, 5 టి20 ప్రపంచకప్‌లు, 3 చాంపియన్స్ ట్రోఫీలు జరగగా... వాటన్నింటిలో గ్రూప్ దశలోనే ఇరు జట్లు తలపడ్డాయి. రౌండ్ రాబిన్ పద్ధతైనా... లేక గ్రూప్‌ల విధానమైనా... ఆరంభ దశలోనే ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ పరిపాటిగా మారింది’ అని అథర్టన్ రాసుకొచ్చాడు. 2008 ముంబై దాడుల సమయం నుంచే భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోగా... ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ ఘటనలో 26 మంది అమాయకులు మృతిచెందగా... దీనికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట శత్రు దేశంలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి తుదముట్టించింది. ఆర్థిక అంశాలే ముఖ్యమా! ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అని అథర్టన్ అభిప్రాయపడ్డాడు. ‘భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎన్నో ఆర్థిక అంశాలతో కూడింది. ఐసీసీ టోర్నమెంట్ ప్రసార హక్కులకు విపరీతమైన డిమాండ్ ఉండటానికి ఈ మ్యాచ్ ప్రధాన కారణం. ద్వైపాక్షిక సిరీస్‌లకు రోజురోజుకూ ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో... ఐసీసీ ఈవెంట్ల ప్రాముఖ్యత పెరిగింది. దీంట్లో తరచూ భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. దీన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు దౌత్యానికి ఆట దోహదం చేస్తే... ఇప్పుడదే ఉద్రిక్తతలు, ప్రచారానికి ప్రతినిధిగా మారింది. కేవలం ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఆ రెండు జట్ల మధ్య పదే పదే మ్యాచ్‌లు నిర్వహించడం ఇప్పటికైనా మానుకుంటేనే మంచిది’ అని అథర్టన్ పేర్కొన్నాడు. విస్తృత ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేయడం సరికాదని ఇంగ్లండ్ మాజీ సారథి సూచించాడు. కావాలనే రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండే విధంగా చూసుకోవడానికి బదులు... ‘డ్రా’ పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అంశాన్ని సైతం అథర్టన్ లేవనెత్తాడు. పాకిస్తాన్లో ఆడేందుకు టీమిండియా నిరాకరించడంతో... భారత ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించగా... ఆతిథ్య హోదా ఉన్న పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడేందుకు పదేపదే దుబాయ్‌కు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోతుండటంతో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఐసీసీ టోర్నీల్లో పదే పదే ఇలాంటి ఏర్పాట్లు చేయడం తగదని అథర్టన్ సూచించాడు. -
రణధీర శరణార్థులు
గౌహతిలోని బర్స పారా క్రికెట్ స్టేడియంలో ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్ 2025 ప్రారంభ మ్యాచ్‌కు అఫ్గానిస్థాన్ శరణార్థ మహిళల క్రికెట్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, ఇనోకా రణవీర ప్రారంభ ఆటలో అద్భుతమైన ప్రదర్శనతో వార్తల్లో నిలిచారు. అయితే ఆటలోకి అడుగు పెట్టకుండానే అఫ్గాన్ మహిళల జట్టు వార్తల్లో నిలిచింది. మహిళల హక్కుల కోసం పోరాడి, తాలిబాన్ ప్రభుత్వం నుంచి తప్పించుకున్న ఈ అఫ్గాన్ మహిళా క్రికెటర్ల బృందం ప్రవాసంలో ఉంటుంది. భద్రతా విషయాలను దృష్టిలో పెట్టుకొని అఫ్గానిస్థాన్ ప్లేయర్స్ వివరాలను ఐసీసీ బయటపెట్టలేదు. రాబోయే రోజుల్లో అఫ్గాన్ మహిళల క్రికెట్ జట్టును మరింత క్రియాశీలం చేయడానికి వారి పర్యటన తొలి ప్రయత్నంగా భావించాలి. అఫ్గానిస్థాన్ శరణార్థుల క్రికెట్ జట్టుకు భవిష్యత్తులో జరగబోయే రెండు ప్రధాన ప్రపంచ టోర్నమెంట్లలో స్థానం కల్పించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత క్రికెట్‌తో సహా ఎన్నో ఆటలపై మహిళలు ఆడకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి పారిపోయిన అఫ్గాన్ మహిళా అథ్లెట్లకు సహాయం చేయడానికి ఐసీసీ చొరవ చూపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసీసీఐ), ఇంగ్లండ్ అండ్ వేల్ఫ్ క్రికెట్ బోర్డ్ (ఇసీబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) సహకారంతో అఫ్గాన్ జట్టును ముందుకు నడిపించడానికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా కీలకంగా వ్యవహరిస్తున్నాడు.చాలామంది శరణార్థ ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. మరికొందరు యూకే, కెనడాలలో నివసిస్తున్నారు. అయితే వీసా సమస్య కారణంగా చాలామంది మన దేశానికి రాలేకపోయారు. ఇక్కడికి వచ్చిన వారు శిక్షణ శిబిరాలలో పాల్గొంటారు. దేశీయ జట్లతో కొన్ని మ్యాచ్‌లలో పోటీ పడతారు. -
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
ప్రపంచకప్ వేటకు వేళాయె...
సొంతగడ్డపై భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ వేటకు సిద్ధమైంది. ఇంటా బయటా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన మహిళల జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ వెలతిగానే ఉంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్లో తెరదించాలని క్రికెట్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా టీమిండియాకు నిరాశ తప్పలేదు. కానీ అప్పటికీ ఇప్పటికీ భారత మహిళల జట్టు ఎంతో మారింది. ప్రపంచకప్‌ను గెలిచే సత్తా కలిగి ఉంది. గువాహటి: దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ప్రపంచకప్‌ను ఎలాగైనా ఈసారి అందుకోవడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో నేడు తొలి మ్యాచ్ ఆతిథ్య దేశాలు భారత్, శ్రీలంకల మధ్య ఇక్కడ జరుగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం సొంతగడ్డ అనుకూలతల్ని వినియోగించుకొని మెగా ఈవెంట్ లో రాణించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఫామ్ కూడా భారత జట్టులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. భారత్ పటిష్టమైన ప్రత్యర్థే కాదు... టైటిల్ ఫేవరెట్లలో ఒకటని కచ్చితంగా చెప్పొచ్చు. ఫామ్‌లో స్మృతి మంధాన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన జోరు మీదుంది. ఇది జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. టాపార్డర్‌లో ప్రతీక, హర్లీన్ నిలకడగా రాణిస్తున్నారు. జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మలతో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. బౌలింగ్ బలగంలో రేణుక, క్రాంతి, అరుంధతిలతో కూడిన పేస్ దళానికి కొత్త స్పిన్ కెరటం శ్రీచరణి జతయ్యింది. మరోవైపు శ్రీలంక కూడా ప్రపంచకప్‌కు దీటుగా సిద్ధమై వచ్చింది. భారత్ లాగే ఆతిథ్య అనుకూలతల్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. 5న పాక్‌తో భారత్ పోరు శ్రీలంకతో మంగళవారం తొలి మ్యాచ్ ఆడాక భారత జట్టు కొలంబోకు వెళుతుంది. అక్టోబర్ 5న కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో టీమిండియా ఆడుతుంది. పాక్‌తో మ్యాచ్ ఆడాక భారత బృందం తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది. విశాఖపట్నంలో అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో, అక్టోబర్ 12న విశాఖపట్నంలోనే ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల తర్వాత అక్టోబర్ 19న ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్... అక్టోబర్ 23న నవీ ముంబైలో న్యూజిలాండ్ జట్టుతో, అక్టోబర్ 26న నవీ ముంబైలోనే బంగ్లాదేశ్‌తో ఆడి లీగ్ దశను ముగిస్తుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. ఆ్రస్టేలియా ఏడు సార్లు... ఇప్పటి వరకు 12 సార్లు మహిళల వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ్రస్టేలియా అత్యధికంగా ఏడు సార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ నాలుగు సార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్ ఒకసారి (2000) విజేతగా నిలిచాయి. ఇదీ మన చరిత్ర మహిళల క్రికెట్లో మన జట్టు 1976లో అరంగేట్రం చేసింది. 1978లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో భారత్ తొలి సారి పాల్గొంది. కానీ పురుషుల జట్టులా మేటిగా ఎదిగేందుకు దశాబ్దాల సమయం పట్టింది. 21 ఏళ్ల తర్వాత 1997లో జరిగిన ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరింది. అలా ఎట్టకేలకు వెలుగులోకి వచ్చిన భారత్‌కు 2005 ప్రపంచకప్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఆ మెగా ఈవెంట్లో ఫైనల్ చేరిన భారత్ చివరకు రన్నరప్‌గా తృప్తిపడింది. మళ్లీ 12 ఏళ్ల తర్వాత కూడా 2017లో టైటిల్ బరిలోఉన్నప్పటికీ ‘కప్’ ముచ్చట అయితే తీరలేదు. మళ్లీ రన్నరప్‌గానే నిలిచింది.ఇదీ ప్రస్తుత కప్ కథ భారత్, శ్రీలంక జట్లు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 5 వేదికలు కాగా... విశాఖపట్నం, నవీ ముంబై, గువాహటి, ఇండోర్ ఈ నాలుగు భారత నగరాలు. శ్రీలంకలోని కొలంబో ఐదో వేదిక. ఆతిథ్య జట్లు సహా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లాంటి గట్టి ప్రత్యర్థులే బరిలో ఉండటం వల్ల బోర్ కొట్టించే మ్యాచ్‌లకు చోటు లేదు.ప్రతీ జట్టు మిగతా ఏడు ప్రత్యర్థులతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడుతుంది. అంటే ఒక్కో జట్టుకు లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లుంటాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. అక్టోబర్ 29, 30 తేదీల్లో రెండు సెమీఫైనల్స్ గువాహటి, ముంబై, నవంబర్ 2న ఫైనల్ ముంబైలో జరుగుతాయి. అయితే పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడుతుంది. నాకౌట్‌కు చేరితే ఫైనలైనా... సెమీఫైనలైనా... కొలంబోలోనే పాకిస్తాన్ ఆడుతుంది. -
‘మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం’
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. చాంపియన్ టీమ్‌కు ట్రోఫీ ఇవ్వకుండా నిలిపివేసిన ఘటన గతంలో ఎన్నడూ చూడలేదని అతను అన్నాడు. అయితే తాము ఈ విషయాన్ని పట్టించుకోమని, ట్రోఫీ లేకపోవడం వల్ల తమ విజయం విలువ ఏమాత్రం తగ్గదని సూర్య వ్యాఖ్యానించాడు. ‘ఒక క్రికెట్ అభిమానిగా, ఆపై ఆటగాడిగా ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి విజేతగా నిలిచి సంపాదించిన ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకపోవడం ఏమిటి? దానిని అందుకునేందుకు మాకు పూర్తి అర్హత ఉంది. అయితే ట్రోఫీల గురించే మాట్లాడాల్సి వస్తే మా డ్రెస్సింగ్‌రూమ్‌లోనే ఇలాంటి 14 ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఆసియా కప్ గెలుపు ప్రయాణంలో మా ఒక్కో ఆటగాడు, సహాయక సిబ్బంది ఒక్కో ట్రోఫీతో సమానం. పాకిస్తానీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించరాదనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు. మా జట్టు సభ్యులంతా మైదానంలో కలిసి తీసుకున్న నిర్ణయమిది’ అని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. మరోవైపు పహల్గాం దాడిలో మృతి చెందిన కుటుంబాల సంక్షేమం కోసం తాను ఆసియా కప్‌లో 7 మ్యాచ్‌ల ద్వారా అందుకున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (రూ. 28 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు సూర్యకుమార్ ప్రకటించాడు. నఖ్వీ తీసుకెళ్లిపోయాడు! ఫైనల్ ముగిసిన తర్వాత బహుమతి ప్రదానోత్సవానికి వేదికను ఏర్పాటు చేశారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన మొహసిన్ నఖ్వీ అక్కడే ఉన్నాడు. అయితే పహల్గాం దాడి సమయంలో నఖ్వీ సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోబోమని భారత జట్టు ముందే ఏసీసీకి సమాచారం అందించింది. దాంతో ప్రత్యామ్నాయంగా వేదికపై ఉన్న ఇతర అధికారుల నుంచి అందించవచ్చని నిర్వాహకులు భావించారు. అయితే నఖ్వీ వేదికపై ఉన్నంత సేపు తాము అక్కడికి వెళ్లమని భారత్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఏసీసీ అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీ ఇస్తానంటూ నఖ్వీ మొండితనం ప్రదర్శించాడు. దాంతో చివరకు భారత్ కప్ అందుకోకుండానే కార్యక్రమం ముగిసింది. అయితే ఆశ్చర్యకరంగా, ఎవరూ ఊహించని విధంగా నఖ్వీ సన్నిహితులు కొందరు అక్కడ ఉన్న ఆసియా కప్ ట్రోఫీని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. అనంతరం భారత జట్టు మొత్తం వేదిక వద్ద చేరి ఊహాత్మకంగా ట్రోఫీ చేతిలో ఉన్నట్లుగా నటిస్తూ సంబరాలు చేసుకుంది. బీసీసీఐ ఆగ్రహం... నఖ్వీ ప్రవర్తనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నఖ్వీ పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఆయన నుంచి ట్రోఫీ తీసుకోవద్దని భారత్ నిర్ణయించింది. కానీ ఆయన తనతో పాటు ట్రోఫీని, పతకాలను కూడా తీసుకెళ్లమని దానర్థం కాదు. అవన్నీ వీలైనంత త్వరగా భారత్‌కు వస్తాయని నమ్ముతున్నాం. నవంబరులో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడి ప్రవర్తనపై మేం చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేయనున్నాం’ అని సైకియా వెల్లడించారు. మరోవైపు టోర్నీలో భారత జట్టు ప్రవర్తన క్రికెట్‌ను అగౌరవపర్చినట్లుగా ఉందని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా అన్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు వేర్వేరు సందర్భాల్లో తనతో కరచాలనం చేసిన సూర్యకుమార్... జనం మధ్యలోకి వచ్చేసరికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని సల్మాన్ విమర్శించాడు. తిలక్ వర్మకు ఘన స్వాగతం... అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ సోమవారం రాత్రి నగరానికి తిరిగొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో అతనికి అభిమానులు, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ‘నేను క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే నా బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలని భావించా. అనుకున్నట్లుగానే చెలరేగిపోయా. నా ఆట తర్వాత మైదానంలో వారెవరూ కనిపించలేదు. మరో మాట అనే అవకాశం వారికి లేకుండా పోయింది. స్టేడియంలో అభిమానులు వందేమాతరంతో హోరెత్తించడంతో మరింత కసిగా చెలరేగిపోయా’ అని తిలక్ మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. -
ఆ ఒక్క టీమ్ ని ఓడిస్తే.. అమ్మాయిలు వరల్డ్ కప్ తెచ్చేస్తారు
-
సూర్యకుమార్‌పై ఐసీసీ చర్య
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్‌పై విజయాన్ని భారత సైనికులకు అంకితం ఇస్తున్నట్లుగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఈ వ్యాఖ్య రాజకీయపరమైనదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ అతనిపై చర్య తీసుకుంది. సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాగా విధించింది. సెప్టెంబర్ 14న లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు మేం అండగా ఉంటాం. మా విజయం భారత సైనికులకు అంకితం’ అని సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో ఆర్మీ ప్రస్తావన తీసుకురావడాన్ని ప్రశ్నిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. గతంలోనూ రాజకీయపరమైన, గాజాపై ఇజ్రాయిల్ దాడివంటి అంశాలపై క్రికెటర్లు స్పందించకుండా ఐసీసీ ఆంక్షలు పెట్టిన విషయాన్ని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ విచారణ జరిపారు. రిఫరీ ముందు హాజరైన సూర్యకుమార్ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమాధానమిచ్చాడు. సూర్య వివరణపై విభేదించిన రిఫరీ ఇక ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరిస్తూ 30 శాతం జరిమానా విధించారు. ఈ శిక్షపై బీసీసీఐ అప్పీల్ చేసినట్లు సమాచారం. అయితే మళ్లీ ఎప్పుడు విచారణ జరుగుతుందనే విషయంలో స్పష్టత లేదు. ఇక్కడా కూడా సూర్యదే తప్పని నిర్ధారణ అయితే శిక్ష మరింత పెరుగుతుంది. ఫర్హాన్‌కు హెచ్చరికతో సరి! సూపర్–4 దశలో భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ ప్రవర్తన గురించి బీసీసీఐ చేసిన ఫిర్యాదుపై కూడా రిచర్డ్సన్ విచారణ జరిపారు. ప్రేక్షకుల వైపు చూస్తూ యుద్ధంలో భారత విమానాలు కూలినట్లుగా, వాటి సంఖ్య ఆరు అన్నట్లుగా రవూఫ్ పదే పదే సైగలు చేశాడు. తాను కూడా తప్పేమీ చేయలేదని, ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే అలా చేశానని రవూఫ్ ఇచ్చిన వివరణతో కూడా సంతృప్తి చెందని రిఫరీ అతనికి కూడా 30 శాతం జరిమానా విధించారు. అయితే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఏకే–47 తరహాలో బ్యాట్‌ను ఎక్కు పెట్టి సంబరాలు చేసుకున్న ఫర్హాన్‌పై మాత్రం ఎలాంటి చర్య తీసుకోలేదు. తాను అలా చేయడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, తాను ఉండే ప్రాంతంలో ఏదైనా సంబరాల సమయంలో ఇలా గన్ను సరదాగా ఎక్కు పెడతారని అతను చెప్పాడు. గతంలో ధోని, కోహ్లి కూడా మైదానంలో ఇలాంటిదే చేసిన విషయాన్ని కూడా అతను గుర్తు చేశాడు. దాంతో ఫర్హాన్‌ను రిఫరీ కేవలం హెచ్చరికతో వదిలి పెట్టారు. -
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్‌పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్‌పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్‌కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్‌కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్‌కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్‌ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్‌లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దు
దుబాయ్: ప్రస్తుతం ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా జరుగుతున్నాయి. కానీ ఆరోపణలు, ఫిర్యాదులే పోటాపోటీగా సాగుతున్నాయి. ‘షేక్‌హ్యాండ్’ తిరస్కరణపై సలసల ఉడికిపోతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంకో అడుగు ముందుకేసి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. లీగ్ దశలో పాక్‌పై గెలుపు అనంతరం విజయాన్ని పహల్గాంలో ఊచకోతకు గురైన బాధితులకు అంకితమిస్తున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు. క్రీడల్లో రాజకీయ ప్రభావిత అంశాల ప్రస్తావనపై పీసీబీ ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడవద్దని భారత కెప్టెన్‌కు సూచించారు. అయితే బుధవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పాకిస్తాన్ క్రికెటర్లు హరిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నెల 21న సూపర్–4 దశలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రవూఫ్ తన చేతులతో భారత యుద్ధ విమానాలు కూలినట్లుగా సంజ్ఞలు చేశాడు. అప్పుడే మైదానంలోని భారత అభిమానులు కోహ్లి... కోహ్లి... అంటూ బిగ్గరగా ఆరిచారు. 2022లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో రవూఫ్ బౌలింగ్‌ను చిత్తు చేస్తూ కోహ్లి మ్యాచ్ విన్నింగ్ సిక్స్‌లతో అలరించిన సందర్భాన్ని పాక్ బౌలర్‌కు గుర్తు చేశారు. ఓపెనర్ సాహిబ్జాదా తన అర్ధసెంచరీ పూర్తవగానే బ్యాట్‌ను గన్లా ఫైరింగ్ చేస్తూ రెచ్చగొట్టాడు. ఈ నేపథ్యంలోనే భారత బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై నేడు మ్యాచ్ రిఫరీ తన నిర్ణయాన్ని వెలువరించనున్నారు. -
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్‌లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్‌లో కాస్త సైలెంట్‌గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్‌బేస్‌లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్‌కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్‌లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్‌ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్‌పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్
దుబాయ్: యూఎస్ఏ క్రికెట్ (USA Cricket) సభ్యత్వంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వేటు వేసింది. ఐసీసీ నిబంధనలను అమలు చేయడంలో యూఎస్ఏ క్రికెట్ బోర్డు విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకుంది. కాగా, ఏడాది పాటు సమీక్షలు జరిపిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇక, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.అయితే, 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ఏ ఒలింపిక్, పారా ఒలింపిక్స్ కమిటీ గుర్తింపు పొందడానికి యూఎస్ఏ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వట్లేదని ఐసీసీ వెల్లడించింది. ఈ కారణంగానే అమెరికా క్రికెట్ సభ్యతాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వైఖరి అమెరికాతోపాటు ప్రపంచ క్రీడల ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని మండిపడింది.ఇది కూడా చదవండి: భారత్‌కు ఎదురుందా!ఇదే సమయంలో, ఒలింపిక్స్, ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే, సస్పెన్షన్ దురదృష్టకరమని పేర్కొంది. క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడటానికి ఇది అవసరమైన చర్య అని ఐసీసీ పేర్కొంది. అమెరికాలో ఆటగాళ్లను రక్షించడం, క్రీడను అభివృద్ధి చేయడం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.🚨 USA suspension Clarity 🚨 Despite the suspension, the USA men’s team remains eligible and will participate in the upcoming ICC T20 World Cup. The ICC clarified that the suspension affects governance, not team eligibilityUSA Cricket was suspended by the ICC due to serious… pic.twitter.com/3nKLk63kbf— Vipin Tiwari (@Vipintiwari952) September 23, 2025 -
‘టాప్’ ర్యాంక్‌లోనే స్మృతి
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్మృతి మంధాన అగ్ర స్థానంలోనే కొనసాగుతోంది. ఆ్రస్టేలియాతో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో 300 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన స్మృతి మొత్తం 818 ర్యాంకింగ్ పాయింట్లతో తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. స్మృతి, రెండో స్థానంలో ఉన్న నాట్ సివర్ బ్రంట్ (ఇంగ్లండ్; 731) మధ్య రేటింగ్ పాయింట్లలో భారీ అంతరం ఉండటం విశేషం.భారత్‌తో మూడో వన్డేలో శతకం బాదిన బెత్ మూనీ (ఆ్రస్టేలియా) రెండు స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరుకుంది. టాప్–10లో భారత్ నుంచి స్మృతి మినహా ఎవరూ లేకపోగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పడిపోయింది. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌కు చేరుకుంది. భారత్ నుంచి టాప్–10లో మరెవరూ లేకపోగా... స్నేహ్ రాణా 16వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. ఈ జాబితాలో సోఫియా ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్), యాష్లే గార్డ్నర్ (ఆ్రస్టేలియా), మేగన్ షుట్ (ఆ్రస్టేలియా) వరుసగా తమ టాప్–3 ర్యాంక్‌లు నిలబెట్టుకున్నారు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా దీప్తి శర్మ (4వ స్థానం)కు టాప్–10లో చోటు లభించింది. -
పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చాడు!.. అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
ఆసియా కప్-2025 టోర్నీలో పాకిస్తాన్‌కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన సూపర్- 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్‌హ్యాండ్ వివాదం తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తలుపుతట్టింది.అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!కాగా లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్ ఆడే మ్యాచ్‌లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్-4 మ్యాచ్‌లోనూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాడు.క్యాచ్ విషయంలో వివాదంఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్‌లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్ జమాన్.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్ అవుట్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అంపైర్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చాడు!ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ సన్నిహిత వర్గాలు టెలికామ్ఏసియా.నెట్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్ ఐసీసీకి మెయిల్ చేశాడు. అంపైర్‌పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్‌ట్రాలు -
అందుకే ఆసియా కప్‌లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్‌హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్‌కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్‌కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్‌ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్‌లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్‌లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి -
Asia Cup 2025: పాక్ 'బాయ్‌కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్‌షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్‌ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్‌లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్‌షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్‌ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్‌కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్‌కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్‌లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్‌కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్‌ల వరకైనా ఆండీ క్రాఫ్ట్‌ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్‌పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్‌పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
అంతర్జాతీయ క్రికెటర్‌పై నిషేధం
నెదర్లాండ్స్ జాతీయ జట్టు ఆటగాడు వివియన్ కింగ్మా నిషేధానికి గురయ్యాడు. 30 ఏళ్ల ఈ పేసర్ ఐసీసీ యాంటీ-డోపింగ్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు గానూ మూడు నెలల నిషేధానికి గురయ్యాడు. కింగ్మాకు ఈ ఏడాది మే 12న యూఏఈతో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్-2 వన్డే మ్యాచ్ తర్వాత డోపింగ్ పరీక్ష నిర్వహించగా.. అందులో అతను బెంజోయెల్కోగ్నిన్ (కోకైన్ మెటబోలైట్) అనే రిక్రియేషనల్ డ్రగ్ వాడినట్లు నిర్దారణ అయ్యింది. ఈ డ్రగ్ ఐసీసీ నిషేధిత జాబితాలో ఉంది.కింగ్మా నిషేధ కాలం ఆగస్టు 15 నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఆమోదించిన చికిత్సా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే, నిషేధకాలాన్ని ఒక నెలకు తగ్గించే అవకాశం ఉంది. ఐసీసీ యాంటి-డోపింగ్ కోడ్ ప్రకారం.. మే 12 నుంచి (డోపీగా దొరికిన రోజు) కింగ్మా ఆడిన మ్యాచ్‌లన్నీ డిస్క్వాలిఫై అవుతాయి. అంటే ఆ మ్యాచ్‌ల్లో కింగ్మా తీసిన వికెట్లు, పరుగులు, క్యాచ్‌లు పరిగణలోకి రావు. నాటి నుంచి కింగ్మా యూఏఈతో వన్డే, నేపాల్, స్కాట్లాండ్తో రెండు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో కింగ్మా గణాంకాలన్నీ రికార్డుల్లో నుంచి తొలగించబడతాయి. మరోవైపు కింగ్మా తాను చేసిన తప్పును అంగీకరించాడు. నిషేధిత డ్రగ్స్‌ను పోటీకి బయట ఉపయోగించినట్లు ఒప్పుకున్నాడు. గత ఏడాది కాలంలో కగిసో రబాడా (దక్షిణాఫ్రికా), డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్) కూడా కింగ్మా లాగే రిక్రియేషనల్ డ్రగ్ వాడకానికి సంబంధించి నిషేధాలు ఎదుర్కొన్నారు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన కింగ్మా నెదర్లాండ్స్ తరఫున 30 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. ఇందులో 40 వన్డే వికెట్లు, 24 టీ20 వికెట్లు పడగొట్టాడు. -
పాక్ మొసలి కన్నీరు.. చుక్కలు చూపించిన భారత్!
-
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్‌మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్‌తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్‌స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్‌షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్‌షేక్' గురుంచి పైక్రాఫ్ట్‌కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్‌కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్‌కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్‌కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్‌లో, ఫుట్‌బాల్‌లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్‌ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్‌గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్‌గా భారత్‌కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్‌తో షేక్‌హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్‌లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్‌లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్‌తో ఆడం, మ్యాచ్‌లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్‌లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్‌బాల్‌లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్‌హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్‌లో లేదు. ఇది పూర్తిగా గుడ్‌విల్‌తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్‌హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
హ్యాండ్ షేక్ వివాదం.. భారత్‌కు ఫైన్ పడుతుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఆసియాకప్-2025 గ్రూపు-ఎలో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్‌ను 7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్‌షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసన తెలిపింది.టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తి అయ్యేంతవరకు పాక్ ఆటగాళ్లను టీమిండియా కనీసం పట్టించుకోలేదు. గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఆటగాళ్లు ఒకరొకరు పలకరించుకునేవారు. కానీ ఈసారి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మైదానంలోకి వచ్చామా, గెలిచి వెళ్లామా అన్నట్లు భారత జట్టు తమ వైఖరిని కనబరిచింది.తొలుత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. కనీసం అతడి ముఖం కూడా చూడకుండా సూర్య డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. ఇదంతా ముందుస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది.ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెసింగ్‌రూమ్ వైపు వెళ్లగా.. సహాయక సిబ్బంది తలుపు మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ టీమ్ అసహననానికి లోనైంది. ఫలితంగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీని సల్మాన్ ఆఘా బహిష్కరించాడు. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గోన్న పాక్ హెడ్ కోచ్ మైక్ హసన్ భారత ఆటగాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు బాధ కలిగించందని చెప్పుకొచ్చాడు.ఈ హ్యాండ్ షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం స్పందించింది. "భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పట్ల జట్టు మేనేజర్ నవీద్ చీమా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం. నిరసనలో భాగంగా తమ కెప్టెన్‌ను పోస్టు మ్యాచ్ సెర్మనీకి పంపలేదని" పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ హ్యాండ్ షేక్ వివాదంపై ఏసీసీకి, ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు పీసీబీ సిద్దమైనట్లు సమాచారం. అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకుపోతే యూఏఈతో తమ తదుపరి మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరిస్తోంది.ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా? అసలు రూల్స్ ఏమి చెబుతున్నాయి? అన్న విషయాలను ఓసారి తెలుసుకుందాం. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి?ఆసియాకప్‌ను ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నప్పటికి.. ఈ టోర్నీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు పూర్తి అధికారం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గోనే జట్లు, ఆటగాళ్లకు ఐసీసీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ఐసీసీ ఎల్లప్పుడూ క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది.ఆటగాళ్లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. కానీ మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలనే నిబంధన ఐసీసీ రూల్స్ బుక్‌లో ఎక్కడా లేదు. షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిహ్నంగా మాత్రమే పరిగణిస్తారు. అదేమి ఖచ్చితమైన రూల్ కాదు. కరచాలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ రూల్ బుక్ ముందు మాటలో ఆటగాళ్లు.. సహచరులను, మ్యాచ్ అధికారులను, అంపైర్లను గౌరవించడం గురుంచి ఉంటుంది. అంతే తప్ప షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నేరమని ఐసీసీ తమ రూల్స్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.ఒకవేళ ఆటగాళ్లతో దురుసగా ప్రవర్తించి కరచాలనం చేయకపోతే దాన్ని ఐసీసీ నేరంగా పరిగణిస్తోంది. కానీ ఈ సందర్భంలో టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థులను ఏ మాత్రం రెచ్చ గొట్టేలా ప్రవర్తించలేదు. దీంతో భారత జట్టుకు ఐసీసీ ఎటువంటి జరిమానా విధించే అవకాశం లేదు.బీసీసీఐ స్పందన ఇదే..ఈ విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. "మీకు ఏదైనా సందేహం ఉంటే ఒక్కసారి రూల్ బుక్‌ను చదవండి. అందులో ఎక్కడ కూడా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వాలని ప్రత్యేకంగా ఏమీలేదు. అది కేవలం మర్యాదపూర్వకమైన సంజ్ఞ మాత్రమే. షేక్ హ్యాండ్స్ ఇవ్వాలా లేదా అన్నది వారి సొంత నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ప్రత్యేకంగా చట్టం ఏమీ లేదు. కాబట్టి ఇండియన్ క్రికెట్ టీమ్ ప్రత్యర్థి జట్టుతో కరచాలనం చేయకపోయిన అదేమి పెద్ద నేరం కాదు" అని సదరు అధికారి పీటీఐతో పేర్కొన్నారు. -
ఐసీసీకి పాక్ బెదిరింపులు.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోకపోతే..!
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయ గీతానికి బదులు 'జిలేబీ బేబీ' పాట ప్లే చేశారు. ఇది ఓ రకమైన గందరగోళాన్ని సృష్టించింది.టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ సారధి సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. భారత ఆటగాళ్లు తమ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ నిరాకరించడాన్ని పాక్ క్రికెట్ బోర్డు చాలా సీరియస్‌గా తీసుకుంది.ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లి భారత ఆటగాళ్లపై, మ్యాచ్ రిఫరి ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని, వారికి పైక్రాఫ్ట్ వంత పాడాడని ఆరోపిస్తుంది.యూఏఈతో తదుపరి మ్యాచ్ సమయానికి (సెప్టెంబర్ 17) తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ఐసీసీకి ధమ్కీ ఇచ్చింది. పీసీబీ బహిష్కరణ బెదిరింపుతో షేక్ హ్యాండ్ ఉదంతం తీవ్ర రూపం దాల్చినట్లైంది.భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించడమే కాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనకు కూడా పాల్పడిందని పీసీబీ గగ్గోలు పెడుతుంది. తాజాగా యూఏఈతో మ్యాచ్ రద్దు చేసుకుంటామని కొత్త పాట మొదలుపెట్టింది.మొత్తంగా ఈ వివాదం ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోనని క్రీడాభిమానులు భయపడుతున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ముదురుతున్న IND-PAK 'షేక్ హ్యాండ్' వివాదం
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.పైక్రాఫ్ట్‌కు ఏం సంబంధం..?నిన్నటి భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్‌గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది. టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్‌పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్మన్షిప్”గా అభివర్ణించాడు.మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. -
ఐసీసీ చారిత్రక నిర్ణయం
మహిళల క్రికెట్ అభివృద్ధి దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. 13వ మహిళల వన్డే వరల్డ్ కప్ (2025) కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పూర్తిగా మహిళా అధికారులనే నియమించడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా కీలకపాత్ర పోషించారు. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో కీలక ఘట్టమని ఆయన అన్నారు.ఓవరాల్‌గా చూస్తే అందరూ మహిళా అధికారులే ఉన్న నాలుగో గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 2022 కామన్వెల్త్ క్రీడలు, తాజాగా జరిగిన రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో మ్యాచ్ అధికారులంతా మహిళలే.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 కోసం ఎంపిక చేసిన మ్యాచ్ రిఫరీలు- ట్రూడీ ఆండర్సన్, - షాండ్రే ఫ్రిట్జ్ - జి.ఎస్. లక్ష్మి - మిచెల్ పెరెరాఅంపైర్లు- లారెన్ ఏజెన్బ్యాగ్ - కాండేస్ లా బోర్డే - కిమ్ కాటన్ - సారా డాంబనేవనా - షతిరా జకీర్ జెసీ - కెరిన్ క్లాస్టే - జనని ఎన్ - నిమాలి పెరెరా - క్లేర్ పోలోసాక్ - వృందా రాథీ - సూ రెడ్‌ఫెర్న్ - ఎలోయిస్ షెరిడన్ - గాయత్రి వేణుగోపాలన్ - జాక్వెలిన్ విలియమ్స్కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశాలే తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. -
టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీకి డేట్స్ ఫిక్స్..! వివరాలు ఇవే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2026కు తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈఎస్పీఎన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2026కు ముందే ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ మార్య్కూ ఈవెంట్‌కు శ్రీలంక, భారత్‌లోని మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే సదరు రిపోర్ట్ ప్రకారం.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ఫైన్లైజ్ చేయలేదంట.కానీ ఫైనల్ మ్యాచ్‌కు వేదికలగా ఆహ్మదాబాద్, కొలంబోలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకుంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తుది పోరు జరిగే అవకాశముంది.ఫార్మాట్ ఇదే..ఇక టీ20 వరల్డ్‌కప్-2026 ఫార్మాట్ విషయానికి వస్తే.. గత ఎడిషన్ మాదిరిగానే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం జట్లను నాలుగు గ్రూపులగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ స్టేజిలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతోంది.లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు ఆర్హత సాధిస్తాయి. సూపర్-8 రౌండ్లో టాప్ 4 జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. ఆ తర్వాత సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ఈ ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం 15 జట్లు తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఆఫ్రికన్, ఆసియా, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి ఆర్హత సాధించనున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్‌గా చరిత్ర -
సౌతాఫ్రికాకు భారీ షాకిచ్చిన ఐసీసీ.. పాపం పుండు మీద కారంలా!
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు సౌతాఫ్రికాకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రొటిస్ జట్టుకు భారీ జరిమానా విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌తో పర్యటిస్తోంది.ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లో బవుమా బృందం అద్భుత విజయాలు సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఆఖరిదైన నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం సఫారీలకు ఘోర పరాభవం ఎదురైంది.రూట్, బెతెల్ శతకాలుఇంగ్లండ్ చేతిలో ఏకంగా 342 పరుగుల తేడాతో బవుమా బృందం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. సౌతాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ జేమీ స్మిత్ (62) శుభారంభం అందించగా వన్‌డౌన్ బ్యాటర్ జో రూట్ (Joe Root- 100), జేకబ్ బెతెల్ (110) దానిని కొనసాగించారు.బట్లర్ మెరుపు హాఫ్ సెంచరీరూట్, బెతెల్ శతకాలతో చెలరేగగా.. ఆఖర్లో జోస్ బట్లర్ (Jos Buttler) అజేయ మెరుపు అర్ధ శతకం (32 బంతుల్లో 62) సాధించాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి ఏకంగా 414 పరుగులు సాధించింది. ప్రొటిస్ బౌలర్లలో కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.పేకమేడలా కుప్పకూలిందిఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి ఐడెన్ మార్క్రమ్ (0), రియాన్ రికెల్టన్ (1), వియాన్ ముల్దర్ (0), మాథ్యూ బ్రీట్జ్కే (4), ట్రిస్టన్ స్టబ్స్ (10), డెవాల్డ్ బ్రెవిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.డౌన్ ఆర్డర్లో కార్బిన్ బాష్ 20 పరుగులతో సౌతాఫ్రికా టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేశవ్ మహరాజ్ 17 పరుగులు చేయగలిగాడు. నండ్రీ బర్గర్ 2 పరుగులతో అజేయంగా నిలవడగా.. కెప్టెన్ తెంబా బవుమా ఆబ్సంట్ హర్ట్‌గా ఉన్నాడు. దీంతో 20.5 ఓవర్లలో కేవలం 72 పరుగులు చేసి సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ చేతిలో 342 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. వన్డేల్లో ఏ జట్టుకైనా పరుగుల తేడా పరంగా ఇదే అతి భారీ ఓటమి. అలా సఫారీలు ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ మూడు, బ్రేడన్ కార్స్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.భారీ జరిమానా.. కారణం ఇదేఇదిలా ఉంటే.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున సౌతాఫ్రికా కెప్టెన్ బవుమాతో పాటు జట్టుకు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలలో ఒకరైన టీమిండియా మాజీ పేసర్ శ్రీనాథ్ జవగళ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక సారథి బవుమా తమ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ లేకుండానే ఐదు శాతం జరిమానా ఖరారైంది.చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
వన్డే వరల్డ్‌కప్‌కు టిక్కెట్లు విడుదల.. కేవలం రూ. 100 మాత్రమే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్-2025కు రంగం సిద్దమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను ఐసీసీ వెల్లడించింది. తాజాగా ఈ వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ఐదు నగరాల్లో జరగనుంది. భారత్‌లోని గౌహతి, ఇండోర్, నవీ ముంబై, విశాఖపట్నం నాలుగు వేదికలు కాగా.. శ్రీలంకలోని కొలంబోని ప్రేమదాస స్టేడియం 11 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది.ఐసీసీ కీలక నిర్ణయం..అయితే అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియం రప్పించేందుకు అన్ని లీగ్ మ్యాచ్‌ల టిక్కెట్ల ధరను ఐసీసీ కేవలం రూ. 100 రూపాయలగా నిర్ణయించింది. మొదటి దశ టిక్కెట్ల అమ్మకాలు గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యాయి.అయితే ఫస్ట్ ఫేజ్‌లో కేవలం కేవలం గూగుల్ పే వినియోగదారులు మాత్రమే బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు గూగల్ గ్లోబల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఇక రెండో దశ సెప్టెంబర్ 9న భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెకెండ్ ఫేజ్‌లో టిక్కెట్లు మొత్తం అందరికి అందుబాటులో ఉంటాయి.కాగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే పాకిస్తాన్-భారత్ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా విడుదల చేయలేదు. ఈ మ్యాచ్‌తో పాటు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్, ఆస్ట్రేలియా vs శ్రీలంక టిక్కెట్లను కూడా ఇంకా అందుబాటులో ఉంచలేదు.కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 30ను గౌహతి వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనున్నారు. ఈ ఆరంభ వేడుకల్లో స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ సందడి చేయనుంది. వరల్డ్‌కప్ టిక్కెట్లు ఇంత తక్కువ ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.చదవండి: గంభీర్, సెహ్వాగ్, భజ్జీ.. అంతా బాధితులే: ధోనిపై మరోసారి యువీ తండ్రి ఫైర్ -
నిబంధన ఉల్లంఘించిన శ్రీలంక.. గెలిచిన ఆనందం ఎంతో సేపు లేకుండా..!
రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వేను వారి సొంత దేశంలో ఓడించి (2-0తో) విజయానందంలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నిన్న (ఆగస్ట్ 31) జరిగిన రెండో వన్డేలో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ లంక జట్టుకు జరిమానా విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత సమయంలో తమ కోటా 50 ఓవర్లు పూర్తి చేయలేకపోయింది (ఓ ఓవర్ వెనుకపడింది). ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ కిందికి వస్తుంది. దీంతో శ్రీలంక జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధించారు. ఐసీసీ విధించిన ఈ పెనాల్టీని లంక కెప్టెన్ అసలంక స్వీకరించాడు. దీంతో అతను తదుపరి విచారణ నుంచి మినహాయింపు పొందాడు.కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను జింబాబ్వే 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో జింబాబ్వే క్లీన్ స్వీప్ అయినా మంచి మార్కులే కొట్టేసింది. తమ కంటే చాలా రెట్లు పటిష్టమైన శ్రీలంకకు జింబాబ్వే ఆటగాళ్లు ముచ్చెమటలు పట్టించారు. రెండు మ్యాచ్‌ల్లో దాదాపుగా ఓడించినంత పని చేశారు. రెండు వన్డేల్లో శ్రీలంక అతి కష్టం మీద చివరి ఓవర్లో బయటపడింది.నిన్న జరిగిన రెండో వన్డేలో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్ మూడో బంతికి గెలుపునందుకుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ పథుమ్ నిస్సంక (136 బంతుల్లో 122; 16 ఫోర్లు) అద్భుతమైన శతకంతో, కెప్టెన్ అసలంక (61 బంతుల్లో 71; 7 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కదంతొక్కినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం పోరాడాల్సి వచ్చింది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అంత సులువుగా ఓటమిని ఒప్పుకోలేదు.అంతకుముందు తొలి వన్డేలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ జింబాబ్వే 291 పరుగుల వద్ద ఆగిపోయింది. చివరి ఓవర్ ముందు వరకు పోరాడిన సికందర్ రజా (92) లక్ష్యానికి 10 పరుగుల దూరంలో ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. లంక బౌలర్ మధుష్క చివరి ఓవర్ తొలి మూడు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మ్యాచ్‌ను జింబాబ్వే చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. మధుష్క చివరి ఓవర్లో చెలరేగకపోయుంటే జింబాబ్వేనే మ్యాచ్ గెలిచేది. -
తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం.. సౌతాఫ్రికా ఆటగాడిపై ఫిర్యాదు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అరంగేట్రం స్పిన్నర్ ప్రేనేలన్ సుబ్రాయెన్ (Prenelan Subrayen) బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రాయెన్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ అఫీషియల్స్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కుడి చేతి వాటం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన సుబ్రాయెన్ బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంది. అతడి యాక్షన్ ఐసీసీ నియమాలకు విరుద్దమేమో అని మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుబ్రాయెన్ ఐసీసీ పర్యవేక్షణలో ఓ పరీక్షను (బౌలింగ్ శైలి) ఎదుర్కోవాల్సి ఉంది.సుబ్రాయెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. తన కోటా 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆసీస్‌ను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయెన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం31 ఏళ్ల సుబ్రాయెన్ గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు (ఒకే ఇన్నింగ్స్‌లో) తీసి పర్వాలేదనిపించాడు. సుబ్రాయెన్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. లేట్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్రాయెన్ రెండో మ్యాచ్‌తోనే వివాదంలో చిక్కుకున్నాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్ చిట్ ఇస్తేనే అతడు ఆసీస్‌తో రెండో వన్డే ఆడగలడు. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
ఆసీస్ ప్లేయర్‌కు అక్షింతలు
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.ఏం జరిగిందంటే..?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్ ఫీల్డ్‌తో పాటు ఓవర్ త్రో చేయడంతో జంపా సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్ మైక్‌ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
తప్పు సరిదిద్దుకున్న ఐసీసీ.. రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లి
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఘోర తప్పిదం జరిగింది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండు, నాలుగు స్థానాల్లో ఉండిన టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-100లో కూడా కనబడలేదు. ఈ ఇద్దరి పేర్లు ఆకస్మికంగా మాయం కావడంపై సోషల్‌మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తుండగా ఐసీసీ స్పందించింది.సాంకేతిక లోపం కారణంగా రోహిత్, కోహ్లి పేర్లు ర్యాంకింగ్స్‌లో కనబడలేదని వివరణ ఇచ్చింది. తప్పును సరి దిద్దుకుంటూ వారిద్దరి పేర్లను తిరిగి ర్యాంకింగ్స్ జాబితాలో చేర్చింది. అప్డేట్ చేసిన తర్వాత రోహిత్, కోహ్లి తమ పాత ర్యాంకులైన రెండు, నాలుగు స్థానాలను తిరిగి దక్కించుకున్నారు.రోహిత్, కోహ్లి వన్డే ర్యాంకింగ్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంతో వారి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ర్యాంకింగ్స్‌లో కనపడకపోయే సరికి రోహిత్, కోహ్లి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించారని ప్రచారం జరిగింది. అయితే సాంకేతిక లోపం కారణంగా తప్పిదం జరిగిందని తెలిసి రోహిత్, కోహ్లి అభిమానుల మనసులు కుదుటపడ్డాయి.కాగా, సాంకేతిక లోపం కారణంగా తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరిన్ని తప్పిదాలు దొర్లాయి. రోహిత్, కోహ్లి పేర్లు మాయమైపోవడంతో పాటు పలువురు రిటైరైన ఆటగాళ్ల పేర్లు జాబితాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్, స్టీవ్ టికోలో, అలెక్స్ ఓబండ, థామస్ ఒడోయో, అన్షీ రథ్ లాంటి పేర్లు ఉన్నాయి. తప్పిదాన్ని గుర్తించిన తర్వాత ఐసీసీ వీరి పేర్లను తొలగించింది.సవరించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లి, డారిల్ మిచెల్, చరిత్ అసలంక, హ్యారీ టెక్టార్, శ్రేయస్ అయ్యర్, ఇబ్రహీం జద్రాన్, కుసాల్ మెండిస్ టాప్-10లో ఉన్నారు. -
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
బ్రిస్బేన్: భారత్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో స్పిన్ సవాలు ఎదురవడం ఖాయమని ఆ్రస్టేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ పేర్కొంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్‌కప్ టైటిల్ గెలుచుకున్న ఆ్రస్టేలియా జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అదే తీవ్రత కొనసాగించాలని భావిస్తున్నట్లు హీలీ వెల్లడించింది. భారత మహిళల ‘ఎ’ జట్టుతో మూడో వన్డేలో హీలీ అజేయ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హీలీ మాట్లాడుతూ... భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడించింది. ‘భారత్ ‘ఎ’ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరల్డ్‌కప్‌లో మాకు మరింత స్పిన్ సవాలు ఎదురుకానుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కీలకం’ అని హీలీ పేర్కొంది. ఆ్రస్టేలియా ‘ఎ’తో వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు తరఫున రాధ యాదవ్, మిన్ను మణి, తనూజ కన్వర్, ప్రేమ రావత్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హీలీ... రెండో వన్డేలో 91 పరుగులతో సెంచరీ చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన సిరీస్ చివరి వన్డేలో 85 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 137 పరుగులు చేసి ఫామ్ చాటుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హీలీ సత్తాచాటడం ఆ్రస్టేలియా జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు కోచ్ డాన్ మార్‡్ష అన్నాడు. ‘భారత్‌లో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీకి ముందు అలీసాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. భారత ‘ఎ’ జట్టుతో టి20, వన్డే సిరీస్‌లతో హీలీ చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి వన్డేలో సాధించిన అజేయ శతకం మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మార్‡్ష పేర్కొన్నాడు. -
అండర్–19 వరల్డ్‌కప్‌నకు అమెరికా
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్–19 పురుషుల ప్రపంచకప్‌నకు అమెరికా జట్టు అర్హత సాధించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నమెంట్‌కు అమెరికా... చివరిదైన 16వ జట్టుగా ఎంపికైంది. ఇటీవలి కాలంలో సీనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న అమెరికా... ఇప్పుడు జూనియర్ స్థాయిలోనూ సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది. 2024లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న టాప్–10 జట్లు నేరుగా ఈ సారి బరిలోకి దిగనుండగా... ఆతిథ్య హోదాలో జింబాబ్వే వరల్డ్‌కప్ ఆడనుంది. మిగిలిన ఐదు జట్లను వేర్వేరు క్వాలిఫయింగ్ ఈవెంట్ల ద్వారా ఎంపిక చేశారు. తాజాగా అమెరికా అర్హత టోర్నీలో అదరగొట్టింది. బెర్ముడా, అర్జెంటీనా, కెనడాపై విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలుండగానే వరల్డ్‌కప్ బెర్త్ పట్టేసింది. జార్జియా వేదికగా డబుల్ రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అర్జున్ మహేశ్ సారథ్యంలోని అమెరికా జట్టు చివరి మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కెనడాపై విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. 2026 అండర్–19 పురుషుల ప్రపంచకప్‌లో పాల్గొననున్న జట్లు జింబాబ్వే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, అమెరికా. -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు జీతాలు కట్!?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అదేవిధంగా ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో పాక్ తొమ్మిదింట ఓటమి పాలైంది.టీ20ల్లో మెన్ ఇన్ గ్రీన్ కాస్త ఫర్వాలేదన్పించింది. 14 మ్యాచ్‌లు ఆడి ఏడింట గెలుపొందింది. అయితే పాక్ జట్టు ప్రదర్శన పట్ల ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ పాకిస్తాన్ రిపోర్ట్ ప్రకారం.. ఆటగాళ్లు తీసుకునే జీతాలపై పీసీబీ కోతకు సిద్దమైనట్లు సమాచారం.కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్లకు ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూలో మూడు శాతం వాటాను బోనస్‌గా ఇస్తోంది. వచ్చే ఏడాది నుంచి మూడు శాతం వాటాపై కోత విధించాలని పీసీబీ భావిస్తుందంట.కాగా రెండేళ్ల క్రితం కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఐసీసీ ఆదాయంలో తమకు వాటా ఇవ్వాలని పీసీబీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మూడు శాతం వాటాను ఆటగాళ్లకు ఇస్తూ పీసీబీ వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా జట్టు పరిస్థితి దిగజారిపోవడంతో పీసీబీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్దమైంది. అంతేకాకుండా ఇప్పటిలో ఆటగాళ్ల జీతాలను కూడా పెంచే యోచనలో పీసీబీ లేనట్లు తెలుస్తోంది.పాకిస్తాన్ ఆటగాళ్ల జీతాలు ఎంతంటే?అయితే ప్రస్తుతం పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్న ఆటగాళ్లకు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు లభించంనుంది. అంటే భారత కరెన్సీలో సంవత్సరానికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు దక్కనుంది. అదేవిధంగా ఐసీసీ వాటా నుంచి 2.07 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఏ-గ్రేడ్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.2 కోట్ల పైగా అందనుంది. కేటగిరీ బీలో ఉన్న ఆటగాళ్లకు ఐసీసీ వాటా నుంచి 3 మిలియన్లు, పీసీబీ నుంచి 1.5 మిలియన్లు లభిస్తాయి. మొత్తంగా ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు భారత కరెన్సీ ప్రకారం రూ.13 కోట్లపైగా దక్కనుంది. కేటగిరి సీ లోని ఆటగాళ్లకు మొత్తంగా 7 లక్షలు లభించనుంది. -
మ్యాచ్ ఫిక్సింగ్ యత్నం.. శ్రీలంక క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం
శ్రీలంక మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సాలియా సమన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై ఐదేళ్ల 5 ఏళ్ల నిషేధాన్నిఐసీసీ విధించింది. అబుదాబి టీ10 లీగ్ 2021లో మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేందుకు సమన్ ప్రయత్నాలు చేసినట్లు అప్పటిలో ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిపై సెప్టెంబర్ 13, 2023న ఐసీసీ తాత్కాలిక నిషేధం విధించబడింది. అయితే ఇప్పుడు ఆ కేసులో అతడిని ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ దోషిగా తేల్చింది. దీంతో తొలుత విధించిన తేదీ నుంచే అతడి నిషేదం అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.అంటే అతడు మరో మూడున్నరేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ ఆడేందుకు వీలులేదు. అతడిపై ఈసీబీ కోడ్‌లోని ఆర్టికల్స్ 2.1.1, 2.1.3, 2.1.4 కింద అభియోగాలు మోపబడ్డాయి. మ్యాచ్‌లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, గిప్ట్‌లు ఇస్తామని ఆశచూపడం వంటివి ఈ ఆర్టికల్స్ ఉల్లంఘనకు కిందకు వస్తాయి.సమన్ తన దేశీయ కెరీర్లో 101 ఫస్ట్-క్లాస్, 77 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు. అతడి పేరిట 231 ఫస్ట్‌క్లాస్ వికెట్లు ఉన్నాయి. అదేవిధంగా 101 మ్యాచ్‌ల్లో 3,662 పరుగులు చేశాడు. కాగా ఇదే కేసులో బంగ్లాదేశ్ క్రికెటర్ నసీర్ హుస్సేన్‌పై కూడా ఐసీసీ అభియోగాలు మోపింది. అతడు ఇటీవలే తన రెండేళ్ల నిషేదాన్ని పూర్తి చేసకుని తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు.చదవండి: గిల్‌కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా -
Aus vs SA: వేలు చూపిస్తూ ఓవరాక్షన్.. సౌతాఫ్రికా స్టార్‌కు షాకిచ్చిన ఐసీసీ
సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాకిచ్చింది. మంగళవారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తమ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనించనందుకు బాష్‌కు ఓ డీమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కర్బిన్ బాష్ అద్బుతమైన బంతితో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఔట్ చేసిన అనందంలో బాష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. బాష్ డ్వార్షుయిస్ వైపు వేలు చూపిస్తూ ఆడింది చాలు ఇక వెళ్లు అన్నట్లు సైగ చేశాడు.దీంతో అతడు ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘనకు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్‌ను ఔట్ చేసినప్పుడు బౌలర్లు సదరు బ్యాటర్‌ను కించపరిచే లేదా దుర్భలాషలడడం వంటి ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు కిందకు వస్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 53 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సఫారీలు సమం చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20కె యిర్న్స్ వేదికగా ఆగస్టు 16న జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్ గడ్డపై వేటకు సిద్దమవుతున్న కింగ్ కోహ్లి.. -
టిమ్ డేవిడ్‌కు షాక్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 (5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్, జులై 28) సందర్భంగా అతను అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ ఐసీసీ ఆగ్రహించి, అతని మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది.ఆ మ్యాచ్‌లో డేవిడ్ అంపైర్ నిర్ణయం (వైడ్ బాల్ విషయంలో) పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐసీసీ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్ అతను వైడ్‌గా భావించిన బంతిని ఫెయిర్ బాల్‌గా ప్రకటించడంతో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చేతులను చాచి చూపిస్తూ వైడ్‌గా ప్రకటించాలని అంపైర్‌ను ఆదేశించాడు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రవర్తన దురుసుగా ఉందని ఐసీసీ భావించింది. డేవిడ్ క్రీడా స్పూర్తిని మరచి ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతనిని తదుపరి విచారణ నుంచి మినహాయించారు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ 30 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆ సిరీస్‌లో డేవిడ్ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో 37 బంతుల్లో శతక్కొట్టి ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. డేవిడ్ ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతూ కూడా సత్తా చాటాడు. పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. -
వరుస ఓటములతో చితికిపోయిన విండీస్‌కు మరో షాక్
స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలతో విసిగి వేసారిపోయిన వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది. ఆ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోగా రెండు ఓవర్లు వెనుకపడ్డారు. దీంతో ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ విండీస్ ఆటగాళ్లందరికీ జరిమానా విధించింది. ఈ జరిమానాను విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని మ్యాచ్ రిఫరీ అన్నాడు.నాలుగో టీ20లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసినా ఘోర పరాజయం ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 31, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్ తలో 28, హోల్డర్ 21 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, ఆరోన్ హార్డీ, బార్ట్లెట్, అబాట్ తలో 2 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ (47), ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకపడటంతో 19.2 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. విండీస్ బౌలర్లలో బ్లేడ్స్ 3, హోల్డర్, షెపర్డ్, అకీల్ హొసేన్ తలో వికెట్ తీశారు.కాగా, 5 మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో విండీస్‌కు ఏది కలిసి రావడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు టీ20ల్లో ఓటమిపాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 0-4తో సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు టెస్ట్ సిరీస్‌లోనూ విండీస్‌ది ఇదే పరిస్థితి. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ను కూడా విండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లలో విండీస్ ఇప్పటివరకు ఒక్క గెలుపుకు కూడా నోచుకోలేదు. -
అమెరికా క్రికెట్ జట్టుకు ఐసీసీ అవార్డు
సింగపూర్: గతేడాది జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అమెరికా జట్టుకు అవార్డు దక్కింది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన అమెరికా జట్టు... ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను ఇంటిబాట పట్టించడంతో పాటు కెనడాపై ఘనవిజయం సాధించి ‘సూపర్–8’ దశకు చేరింది. ఈ ప్రదర్శనతో అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెరగగా... తాజాగా దీనికి ‘ఐసీసీ అసోసియేట్ మెంబర్స్ పురుషుల టీమ్ పెర్ఫార్మెన్స్’ అవార్డు దక్కింది. ఐసీసీ చైర్మన్ జై షా చేతుల మీదుగా యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) క్రికెట్ చైర్మన్ వేణు కుమార్ రెడ్డి పిసికె, సీఈఓ జొనాథన్ అట్కిన్సన్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. నల్లగొండకు చెందిన వేణు పిసికె 1998లో ఐటీ నిపుణుడిగా అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు అమెరికాలో క్రికెట్ ఆటకు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గత ఆరేళ్లుగా అమెరికాలో క్రికెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఇక అమెరికాతోపాటు 2024లో ఆయా అసోసియేట్ జట్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 8 దేశాలకు ఐసీసీ అవార్డులు ప్రకటించింది. అమెరికాతో పాటు... భూటాన్, నేపాల్, ఇండోనేసియా, నమీబియా, స్కాట్లాండ్, టాంజానియా, వనూతు ఉన్నాయి. మొదట 15 దేశాలను పురస్కారాల కోసం షార్ట్‌లిస్ట్ చేయగా... వాటిలో ఎనిమిది దేశాలు అవార్డులు గెలుచుకున్నాయి. నమీబియాలో క్రికెట్ వృద్ధికి గానూ ఆ దేశ బోర్డుకు ‘ఐసీసీ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం లభించింది. మహిళల విభాగంలో ఈ అవార్డును రెండు దేశాలు పంచుకున్నాయి. భూటాన్ క్రికెట్ కౌన్సిల్, వనూతు క్రికెట్ సంఘానికి ఉమ్మడిగా ఈ పురస్కారం దక్కింది. నేపాల్ క్రికెట్ సంఘానికి ‘ఐసీసీ డిజిటల్ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల్లో ఆటకు మరింత ప్రచారం చేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. ‘ఐసీసీ డెవలప్మెంట్ అవార్డులు ప్రకటించడం ఆనందంగా ఉంది. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో పురస్కార విజేతలు విశేష కృషి చేశారు’ అని ఐసీసీ అధ్యక్షుడు జై షా వెల్లడించారు. -
ICC: చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీకి గ్రీన్ సిగ్నల్!
దాదాపు దశాబ్దం క్రితం రద్దయిన చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ (Champions League T20)ని మళ్లీ ప్రారంభించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యోచిస్తోంది. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకుకొత్తగా ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. సింగపూర్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో చాంపియన్స్ లీగ్‌పై వచ్చిన ప్రతిపాదనకు అన్ని బోర్డులూ మద్దతు పలికినట్లు సమాచారం.అందుకే పక్కన పెట్టారుకాగా వేర్వేరు దేశాలకు చెందిన క్లబ్ టీమ్‌లు బరిలోకి దిగుతూ 2009–2014 మధ్య నిర్వహించిన ఈ టోర్నీని పలు కారణాలతో రద్దు చేశారు. ఐపీఎల్‌లాంటి టోర్నీలతో పోలిస్తే ప్రేక్షకాదరణ చాలా తక్కువగా ఉండటంతో పాటు వాణిజ్యపరంగా కూడా సరైన స్పందన లభించకపోవడంతో లీగ్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది.అంత ఈజీ ఏం కాదుఅయితే ఇప్పుడు కూడా దీనిని నిర్వహించడం అంత సులువు కాకపోవచ్చు. టీ20 స్టార్ ఆటగాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు జట్ల తరఫున ఆడుతున్నారు. చాంపియన్స్ లీగ్ జరిగితే వారు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తారనే విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు.మరోవైపు టెస్టు క్రికెట్‌ను రెండు వేర్వేరు స్థాయిల్లో (2 టియర్ సిస్టం) నిర్వహించాలనే ఆలోచనతో ఉన్న ఐసీసీ దీనిపై సాధ్యాసాధ్యాల కోసం ప్రత్యేకంగా వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీకి ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా నాయకత్వం వహిస్తారు. చాంపియన్స్ లీగ్ టీ20 (2009-2014) విజేతల జాబితా ఇదే👉2009- న్యూ సౌత్ వేల్స్ బ్లూస్- కెప్టెన్ సైమన్ కటిచ్ (బిగ్‌బాష్ లీగ్)👉2010- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్)👉2011- ముంబై ఇండియన్స్- కెప్టెన్ హర్భజన్ సింగ్(ఐపీఎల్)👉2012- సిడ్నీ సిక్సర్స్- కెప్టెన్ బ్రాడ్ హాడిన్ (బిగ్‌బాష్ లీగ్)👉2013- ముంబై ఇండియన్స్- కెప్టెన్ రోహిత్ శర్మ (ఐపీఎల్)👉2014- చెన్నై సూపర్ కింగ్స్- కెప్టెన్ ఎంఎస్ ధోని (ఐపీఎల్).చదవండి: IND vs ENG: కరుణ్‌పై వేటు.. అతడి అరంగేట్రం?.. తుదిజట్టు ఇదే! -
ఇంగ్లండ్‌లోనే తర్వాతి మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్
సింగపూర్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ మ్యాచ్‌ను వరుసగా ఇంగ్లండ్ గడ్డపైనే నిర్వహించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం మరోసారి దానికే ఓటు వేసింది. వచ్చే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఇంగ్లండ్‌లోనే జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. 2027, 2029, 2031లకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకే ఆతిథ్య హక్కులు కట్టబెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఫైనల్స్ (2021–సౌతాంప్టన్, 2023–ఓవల్, 2025–లార్డ్స్) సమర్థ నిర్వహణే అందుకు కారణమని వెల్లడించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ జరిగే జూన్ నెలలో ఇతర క్రికెట్ దేశాలతో పోలిస్తే ఒక్క ఇంగ్లండ్‌లోనే ఆటకు అంతరాయం కలిగించని, సరైన వాతావరణం ఉండటం ప్రధాన కారణం. పైగా తుది పోరులో ఎవరు తలపడినా... టెస్టు క్రికెట్ అభిమానులైన అక్కడి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై మ్యాచ్‌లకు ఆదరించడం కూడా ఐసీసీ నిర్ణయానికి కారణమైంది. ఐసీసీ సమావేశంలో రెండు కొత్త జట్లకు అసోసియేట్ సభ్యులుగా అవకాశం కల్పించారు. తిమోర్ లెస్టె, జాంబియా క్రికెట్ జట్లు ఇప్పుడు ఐసీసీలో భాగమయ్యాయి. దాంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 110కి చేరింది. -
BCCI: క్రికెట్ ఒక్కటేనా?.. అదో పెద్ద సామ్రాజ్యం! ఆర్థిక వనరులు ఇవే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వరల్డ్‌లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గడించింది. తాజాగా బీసీసీఐ మరోసారి సంపద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.ఐపీఎల్ బంగారు బాతు..భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో వచ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వచ్చాయి.అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు బ్రాడ్‌కాస్టింగ్) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.భారత్ అంతర్జాతీయ పర్యటనలో టికెట్ అమ్మకాలు, స్పాన్సర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అదనంగా బీసీసీఐకి లభించాయి. స్టేడియంలో ప్రకటనలు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భారత క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం సమకూరింది.వెయ్యి కోట్ల పైగా వడ్డీ..భారత క్రికెట్ బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్‌లో ఉన్నాయి. దీని వల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది.బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్‌లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్‌లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్, మార్కెటింగ్) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా? -
ICC: ర్యాంకింగ్‌తో ఖరారు చేస్తారా?.. క్వాలిఫయింగ్ టోర్నీ ఉంటుందా?
లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో క్రికెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, నిబంధనలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం సింగపూర్‌లో జరిగింది. విశ్వక్రీడల్లో క్రికెట్ కోసం ఐసీసీ వర్కింగ్ గ్రూప్ (ICC Working Group)ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. ఈ గ్రూప్ సిఫార్సులతోనే ఒలింపిక్స్‌లో క్రికెట్ క్రీడ నియమావళిని ఖరారు చేయాలని ఐసీసీ భావిస్తోంది. శుక్రవారం జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ (సీఈసీ) సమావేశంలో ప్రధానంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుపైనే చర్చ జరిగింది. ఒలింపిక్స్ కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పటికీ చాన్నాళ్లుగా ఇది పెండింగ్‌లో పడింది. ఇక ఇప్పుడు వేగవంతం చేయాల్సిన అవసరం వచ్చిందని పలువురు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఈసీ, క్రికెట్ బోర్డులు... ఈ రెండింటి నుంచి సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్ బృందానికి పలు బాధ్యతలు అప్పగిస్తారు. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత పద్ధతిని ఖరారు చేయడం, ఐసీసీ వర్గాలు, సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వర్కింగ్ గ్రూప్ పని చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. విశ్వక్రీడల కోసం ర్యాంకింగ్‌తో జట్లను ఖరారు చేయాలా లేదంటే క్వాలిఫయింగ్ టోర్నీని నిర్వహించడం ద్వారా జట్లను ఒలింపిక్స్‌కు పంపించాలా అన్న అంశాన్ని వర్కింగ్ గ్రూప్‌కే వదిలేయాలని ఐసీసీ చైర్మన్ జై షా సూచించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడే ఆటగాళ్ల కనీస వయస్సును 15 ఏళ్లుగా ఉంటేనే మంచిదని ఐసీసీ కమిటీ ఇదివరకే సిఫార్సు చేసింది. ఐసీసీ నూతన సీఈఓ సంజోగ్ గుప్తాకూడా 15 ఏళ్ల వయసు ప్రామాణికమేనని బలపరిచారు. ఐసీసీ ఉన్నతస్థాయి సమావేశంలో జై షా, సంజోగ్ సహా పలువురు ఐసీసీ బోర్డు కమిటీల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టీమిండియా ఓపెనర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్‌కు కూడా
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ ప్రతిక రావల్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ భారీ షాకిచ్చింది. ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో తమ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ప్రతిక రావల్‌కు జరిమానా విధించింది. ఆమె మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ఓ డెమెరిట్ పాయింట్ కూడా ఆమె ఖాతాలో చేరింది.అసలేమి జరిగిందంటే?సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ప్రతిక 36 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. అయితే భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్బుతమైన బంతితో రావల్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో సహనం కోల్పోయిన రావల్ తన భుజంతో ఎక్లెస్టోన్‌ను ఢీకొట్టింది. అంతేకాకుండా ఇంగ్లీష్ పేసర్ లారెన్ ఫైలర్తో కూడా రావల్ దురుసగా ప్రవర్తించింది.దీంతో లెవల్-1 నేరంగా పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. 24 ఏళ్ల రావల్‌కు ఊహించని షాకిచ్చింది. మరోవైపు స్లోఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుపై కూడా ఐసీసీ జరిమానా వేసింది. నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(62 నాటౌట్) ప్లేయర్‌గా ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 19న లార్డ్స్ వేదికగా జరగనుంది.చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్‌ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్‌గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్‌గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్‌తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి' -
ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
తాజాగా ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించి, గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసినందుకు గానూ ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 10 శాతం కోత విధించడంతో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లను కట్ చేసింది. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీస్ సభ్యుడు రిచీ రిచర్డ్సన్ ఇంగ్లండ్‌పై చర్యలకు ఆదేశించాడు.నిర్దేశిత సమయంలోపు ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడిందని రిచర్డ్సన్ తెలిపాడు. స్లో ఓవర్ రేట్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నాడు. స్లో ఓవర్ రేట్ నిబంధన ఉల్లంఘన కింద ఒక్కో ఓవర్‌కు 5 శాతం మ్యాచ్ ఫీజ్ కోత ఉంటుందని గుర్తు చేశాడు.దీని అదనంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు ఓ రేటింగ్ పాయింట్ కోత ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నేరాన్ని అంగీకరించడంతో పాటు ప్రతిపాదిత శిక్షను స్వీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేదని రిచర్డ్సన్ ప్రకటించాడు.కాగా, లార్డ్స్ టెస్ట్‌లో (మూడవది) భారత్ ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక బోల్తా పడింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. టెయిలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడినా టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జులై 23 నుంచి ప్రారంభం కానుంది. -
మళ్లీ టాప్–10లోకి షఫాలీ వర్మ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో తిరిగి టాప్–10లోకి దూసుకొచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 176 పరుగులతో మెరిసిన షఫాలీ... ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకి 655 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు చేరింది. ఫామ్‌లో లేని కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరమైన షఫాలీ పునరాగమనంలో ఇంగ్లండ్‌పై 158.56 స్ట్రయిక్‌రేట్‌తో ఆకట్టుకుంది. దాని ఫలితంగానే ర్యాంకింగ్స్‌లో ముందంజ వేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధాన (767 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది. బెత్ మూనీ (794 పాయింట్లు; ఆ్రస్టేలియా), హీలీ మాథ్యూస్ (774 పాయింట్లు; వెస్టిండీస్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు కోల్పోయి 14వ ర్యాంక్‌కు పరిమితం కాగా... కెపె్టన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 15వ స్థానంలో కొనసాగుతోంది. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ (732 పాయిట్లు) ఒక స్థానం కోల్పోయి 3వ ర్యాంక్‌లో ఉండగా... రాధా యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 15వ ర్యాంక్‌కు చేరింది. పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాదీ బౌలర్ అరుంధతి రెడ్డి నాలుగు స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌లో నిలిచింది. -
IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఈ మేర జరిమానా వేసింది. అంతేకాదు.. సిరాజ్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతచేసింది.సమంగా..కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా భారత్ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. మొదటి రెండింటిలో తలా ఓ టెస్టు గెలిచి ఇరుజట్లు ప్రస్తుతం 1-1తో సమంగా న్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది.టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆదివారం నాటి నాలుగోరోజు ఆటలో భాగంగా 192 పరుగులకు ఆలౌట్ అయి.. టీమిండియాకు 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది.కీలక వికెట్లు కూల్చిన సిరాజ్ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్.. ఇంగ్లిష్ జట్టు ఓపెనర్ బెన్ డకెట్ (12)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ (4) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చి.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. అయితే, డకెట్‌ను అవుట్ చేసిన సమయంలో సిరాజ్ సంబరాన్ని పట్టలేక అత్యుత్సాహం ప్రదర్శించాడు. డకెట్ భుజాన్ని రాసుకుంటూ వెళ్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు.THE AGGRESSION FROM DSP SIRAJ AFTER DISMISSING DUCKETT. 🥶pic.twitter.com/AehUlhE29t— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2025 అలా అయితే ఓ మ్యాచ్ నిషేధం!ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 నిబంధనను సిరాజ్ ఉల్లంఘించినట్లయింది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాటర్ అవుటైనపుడు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, వారితో అనుచిత రీతిలో ప్రవర్తించడం నేరం. ఇందుకు ప్రతిగా అత్యుత్సాహం ప్రదర్శించిన బౌలర్‌కు తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ ఇదే జరిగింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ.. గడిచిన 24 నెలలకాలంలో సిరాజ్ రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడినందుకు గానూ ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఓ డీమెరిట్ పాయింట్‌కు మరొకటి జతచేసింది.ఒకవేళ 24 నెలల కాలంలో ఓ ప్లేయర్ ఖాతాలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు గనుక చేరినట్లయితే అతడిపై మ్యాచ్ నిషేధం పడుతుంది. ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 135 దూరంలో నిలిచింది. చదవండి: Divorce: సైనా అలా.. పారుపల్లి కశ్యప్ ఇలా!.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్ -
టి20 ప్రపంచకప్ టోర్నీకి ఇటలీ అర్హత
ద హేగ్ (నెదర్లాండ్స్): మీరు చదువుతున్నది నిజమే... క్రికెట్ క్రీడలో ఇటలీ జట్టు ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీకి యూరోప్ జోన్ నుంచి ఇటలీతోపాటు నెదర్లాండ్స్ జట్లు అర్హత పొందాయి. ఫుట్‌బాల్‌లో ఇటలీకి ఘనమైన రికార్డు ఉంది. మూడుసార్లు ప్రపంచకప్‌ను సాధించడంతోపాటు రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఏ స్థాయి క్రికెట్లో అయినా ఇటలీ జట్టు వరల్డ్‌కప్ బెర్తు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్న 25వ జట్టుగా ఇటలీ నిలిచింది. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ 9 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయినప్పటికీ... గ్రూప్‌లో 4 మ్యాచ్‌లాడిన ఇటలీ 2 విజయాలు, 1 పరాజయం, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 5 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ముందంజ వేసింది. గతంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో ఇటలీపై గెలిచిన నెదర్లాండ్స్ 6 పాయింట్లతో దర్జాగా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. తద్వారా గత నాలుగు టి20 ప్రపంచకప్‌లలో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు ఈసారి మెగా టోర్నీ ఆడే అవకాశం కోల్పోయింది. చివరి లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ జట్టు జెర్సీ జట్టు చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడింది. దీంతో పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమై వరల్డ్‌కప్‌నకు దూరమైంది. -
‘టాప్’ ర్యాంక్‌కు చేరువగా దీప్తి శర్మ
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న భారత స్పిన్నర్ దీప్తి శర్మ... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరువైంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ ఒక స్థానం పురోగతి సాధించి రెండో ర్యాంక్‌కు చేరుకుంది. గత ఆరేళ్లగా టాప్–10లో కొనసాగుతున్న దీప్తి తన కెరీర్లో తొలిసారి టాప్ ర్యాంక్ అందుకునేందుకు దగ్గరగా వచ్చింది. ప్రస్తుతం దీప్తి ఖాతాలో 738 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 746 పాయింట్లతో పాకిస్తాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ నంబర్‌వన్ స్థానంలో ఉంది. ఇంగ్లండ్‌తో మరో రెండు టి20లు జరగాల్సి ఉన్న నేపథ్యంలో దీప్తి శర్మ విశేషంగా రాణిస్తే తదుపరి ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను అందుకునే అవకాశముంది. ‘హండ్రెడ్’ టోర్నీకి దూరం వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నీ నుంచి దీప్తి శర్మ వైదొలిగింది. వర్క్‌లోడ్ మేనేజ్మెంట్, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. దీప్తి వైదొలిగిన నేపథ్యంలో ఈసారి ‘హండ్రెడ్’ టోర్నీలో భారత ప్రాతినిధ్యం ఉండటంలేదు. గత సీజన్ ఫైనల్లో దీప్తి శర్మ చివరి ఓవర్లో కొట్టిన సిక్స్‌తో లండన్ స్పిరిట్స్ జట్టు తొలిసారి ‘హండ్రెడ్’ ట్రోఫీని సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్లో లండన్ స్పిరిట్స్ జట్టు దీప్తి శర్మకు 36 వేల పౌండ్లు చెల్లించింది. -
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో పెను విషాదం
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ అంతర్జాతీయ అంపైర్ బిస్మిల్లా జన్ షిన్వారీ 41 ఏళ్ల యుక్త వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రమైన అనారోగ్యం కారణంగా షిన్వారీ మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జులై 8) ప్రకటించింది. ఏసీబీ షిన్వారీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ క్రికెట్ గొప్ప సేవకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేస్తూ.. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.ACB's Condolence and Sympathy MessageACB’s leadership, staff, and entire AfghanAtalan family are deeply shocked and saddened by the demise of Bismillah Jan Shinwari (1984 - 2025), a respected member of Afghanistan’s elite umpiring panel.It is with deep sorrow that we share… pic.twitter.com/BiZrTOLe6m— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 20251984 మార్చిలో జన్మించిన షిన్వారీ 2017 డిసెంబర్లో అంతర్జాతీయ అంపైరింగ్ అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 మ్యాచ్‌లో అతను చివరి సారి అంపైరింగ్ చేశాడు. షిన్వారీ తన కెరీర్లో 60 అంతర్జాతీయ మ్యాచ్‌లకు (34 వన్డేలు, 26 టీ20లు) అంపైర్‌గా వ్యవహరించాడు. షిన్వారీ తన అంపైరింగ్ జర్నీని ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభించాడు.బాంబు పేలుళ్ల నుంచి బయటపడి..!షిన్వారీ 2020 అక్టోబర్‌లో నగర్హర్ ఫ్రావిన్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లను బయటపడ్డాడు. ప్రాథమిక నివేదికల్లో షిన్వారీ మరియు అతని కుటుంబ సభ్యులు చాలా మంది మృతి చెందారని వార్తలు వచ్చాయి. అయితే అతనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చనిపోలేదని నిర్ధారించాడు. -
ఐసీసీ సీఈఓగా సంజోగ్ గుప్తా
దుబాయ్: భారత మీడియా మొఘల్ సంజోగ్ గుప్తా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమితులయ్యారు. ఈ ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆ్రస్టేలియాకు చెందిన జెఫ్ అలర్డైస్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీగానే ఉండటంతో సంజోగ్ గుప్తాతో భర్తీ చేశారు. జియోస్టార్ నెట్‌వర్క్‌కు సీఈఓగా వ్యవహరించిన సంజోగ్‌కు మీడియా రంగంలో విశేషానుభవం ఉంది. దీంతో పాటు భారత్‌కే చెందిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఉండటం కూడా అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాలు చక్కబెట్టే పదవిని చేపట్టేందుకు కలిసొచ్చింది. అంతమాత్రాన పూర్తిగా జై షా చలవే అనలేం. ఎందుకంటే ఏళ్ల తరబడి మీడియా రంగంలో ఆయన విశేష కృషి చేశారు. అందువల్లేనేమో 2500 పైచిలుకు దరఖాస్తు చేసుకుంటే సంజోగ్నే సీఈఓ పదవి వరించింది. ఐసీసీలోని శాశ్వత, అనుబంధ సభ్యులైన 25 దేశాల నుంచి వేల సంఖ్యలో ఈ పదవి కోసం పోటీపడ్డారు. అనుభవం, పనితీరు ఆధారంగా ఒక్కో దేశం నుంచి 12 మంది చొప్పున తుది జాబితాకు ఖరారు చేయగా ఇందులో సంజోగ్ గుప్తా అర్హుడని ఐసీసీ కమిటీ భావించింది. ఈ నామినేషన్ల కమిటీలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చైర్మన్ రిచర్డ్ థాంప్సన్, లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్లా, భారత బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సిఫార్సు మేరకే ఐసీసీ చైర్మన్ జై షా... సంజోగ్‌ను కొత్త సీఈఓగా నియమించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా వచ్చి... ఈ జనవరిలో పదవి నుంచి వైదొలిగిన అలర్డైస్ వారసుడిగా సంజోగ్ గుప్తా త్వరలోనే పదవీ బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్ తర్వాత రెండో ప్రాధాన్య పదవి సీఈఓ. దీంతో ఈ రెండు కీలకమైన పదవుల్లో భారతీయులే కొలువుదీరడం విశేషం. జై షా భారత హోం మంత్రి అమిత్ షా తనయుడు. కానీ గుప్తా మాత్రం ఢిల్లీలోని ద ట్రైబ్యున్ పత్రికలో ఓ సాధారణ స్పోర్ట్స్ జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి మీడియా మొఘల్‌గా ఎదిగాడు. 2010లో స్టార్ ఇండియా (ప్రస్తుత జియో స్టార్)లో సహాయ ఉపాధ్యక్షుడిగా చేరిన సంజోగ్ తన నేర్పు, నైపుణ్యం, అంకితభావం, నిబద్ధతతో అంచెలంచెలుగా ఎదిగారు. కంటెంట్, ప్రొగ్రామింగ్, వ్యూహారచనతో ఓ చానెల్ నెట్‌వర్క్‌ను విస్తరించారు. మొదటి పదేళ్లు ఐపీఎల్ ‘సోనీ’ నెట్‌వర్క్‌లో ప్రసారమైంది. తర్వాత కోట్లు గుమ్మరించి ఐపీఎల్ సహా, ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ (ఐఎస్ఎల్) సహా ఎన్నో ప్రీమియర్ లీగ్‌ను, గ్రాండ్‌స్లామ్ టోర్నీల ప్రసార హక్కుల్ని స్టార్ హస్తగతమయ్యేలా చేశారు. రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నెట్వర్క్ డిస్నీ స్టార్‌ను సొంతం చేసుకోవడంతో రిలయన్స్ యాజమాన్యం గతేడాది సంజోగ్ గుప్తాను సీఈఓగా నియమించింది. ఇప్పుడైతే ఏకంగా ఐసీసీలో ఏడో సీఈఓగా అంతర్జాతీయ క్రికెట్‌ను వ్యవహారాలను చక్కబెట్టే పనిలో పడతారు.7 ఐసీసీ సీఈఓగా నియమితుడైన ఏడో వ్యక్తి సంజోగ్ గుప్తా. గతంలో డేవిడ్ రిచర్డ్స్ (1993–2001), మాల్కం స్పీడ్ (2001–2008), హరూన్ లోర్గాట్ (2008–2012), డేవిడ్ రిచర్డ్సన్ (2012–2019), మనూ సాహ్ని (2019–2021), జెఫ్ అలర్డైస్ (2021–2025) ఈ బాధ్యతలు నిర్వర్తించారు. -
తొలి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్‌కు భారీ షాక్
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్ పాయింట్‌తో పాటు జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూన్ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్ వేదికగా విండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. హోల్డ్‌స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్‌స్టాక్ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్‌స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు.విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో హోల్డ్‌స్టాక్ అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్ అని చూపించినా హోల్డ్‌స్టాక్ ఔట్‌గా ప్రకటించాడు. హోప్, ఛేజ్ ఔట్ కావడం ఈ మ్యాచ్‌లో విండీస్‌పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్‌కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. -
ఓవర్లు కాదు...ఇకపై బంతుల లెక్క!
దుబాయ్: వర్షం కారణంగా టి20 మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చినప్పుడు ఎన్ని ఓవర్లు పవర్‌ప్లే ఉండాలనే విషయంపై ప్రతీసారి గందరగోళం ఎదురవుతోంది. ఒక టి20 ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే 6 ఓవర్లు కాగా... ఇన్నింగ్స్‌లో ఓవర్ల సంఖ్య తగ్గగానే దాని ప్రకారం లెక్కగట్టి పవర్‌ప్లే ఓవర్ల సంఖ్యను నిర్ణయించేవారు. అయితే ఒక్కో బంతి ఎంతో కీలకంగా మారి మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే టి20ల్లో ఇది సరైంది కాదని చర్చ జరిగింది. దాంతో టి20 పవర్‌ప్లే విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పు చేసింది. ఇది జూలై నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఇకపై కచ్చితత్వం కోసం ఓవర్లు కాకుండా బంతులను పవర్‌ప్లే కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు 5 ఓవర్ల మ్యాచ్ అయితే 1.3 ఓవర్ల పవర్‌ప్లేనే ఉండాలి. కానీ దానిని దగ్గరి ఓవర్‌కు సవరించి ఇప్పటి వరకు పవర్‌ప్లే 2 ఓవర్లుగా ఇస్తున్నారు. కానీ ఇకపై ఇది మారనుంది. మున్ముందు 5 ఓవర్లో మ్యాచ్ అయితే సరిగ్గా 1.3 ఓవర్లే పవర్‌ప్లే ఉంటుంది. ఇదే తరహాలో 6 ఓవర్లు (1.5), 7 ఓవర్లు (2.1), 9 ఓవర్లు (2.4)...ఇలా 19 ఓవర్ల (5.4) వరకు ఎన్ని బంతులు అనే విషయంపై ఐసీసీ పూర్తి స్పష్టతనిచ్చింది. ఓవర్ మధ్యలో పవర్‌ప్లే ముగియడం వల్ల ఎవరికీ సమస్య ఎదురు కాదని ఐసీసీ అభిప్రాయపడింది. పవర్‌ప్లే ముగియగానే అంపైర్లు సిగ్నల్ ఇస్తారని...దాని ప్రకారం ఫీల్డర్లను పెట్టుకోవచ్చని పేర్కొంది. వైడ్ నిబంధనలోనూ మార్పు... వన్డేలు, టి20ల్లో ‘వైడ్’ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. లెగ్‌సైడ్ బంతి వెళితే చాలు దానిని అంపైర్లు ‘వైడ్’గా ప్రకటిస్తున్నారు. షాట్ ఆడే క్రమంలో బ్యాటర్ పక్కకు జరిగినా దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇకపై బౌలర్లకు కాస్త సడలింపు ఉండేలా కొత్త నిబంధనను తీసుకొచ్చారు. దీని ప్రకారం ‘బంతిని విడుదల చేసే సమయంలో బ్యాటర్ కాలు ఎక్కడ ఉందని విషయాన్ని కూడా వైడ్‌ను ప్రకటించే విషయంలో పరిగణనలోకి తీసుకుంటాం. బంతి బౌలర్ చేతిని వీడాక షాట్ ఆడేందుకు బ్యాటర్ ఆఫ్‌సైడ్‌కు జరిగినా సరే దీనిని అంపైర్లు దీనిని దృష్టిలో పెట్టుకుంటారు’ అని ఐసీసీ వెల్లడించింది. ఇది బౌలర్లకు కాస్త ఊరటనిస్తుందని, అందుకే దీని కోసం సిఫారసు చేసినట్లు ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు, మాజీ పేసర్ షాన్ పొలాక్ చెప్పారు.కన్కషన్ సబ్‌స్టిట్యూట్ పేరు చెప్పాలి...పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా కన్కషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో ఐసీసీ కొత్త మార్పు తెచ్చింది. ఇకపై ప్రతీ మాయ్చ్కు ముందు ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’ పేరును కూడా జట్లు వెల్లడించాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు తమకు అవసరమైన ఆటగాడిని పంపకుండా ఈ నిబంధనతో అడ్డుకోవచ్చు. కన్‌కషన్‌తో బయటకు వెళ్లిన ఆటగాడు కనీసం వారం రోజుల విరామం తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగాలి. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి, వారి సౌకర్యం కోసం అని ఐసీసీ పేర్కొంది. అయితే కన్కషన్ పేరుతో ఒక మ్యాచ్ నుంచి హఠాత్తుగా తప్పుకొని వెంటనే తర్వాతి మ్యాచ్ కోసం సిద్ధమయ్యే ఆటగాళ్లను నిలువరించడం కూడా కొత్త నిబంధనకు ఒక కారణం. మరోవైపు మ్యాచ్ మొదలైన తర్వాత ఏ ఆటగాడికైనా తీవ్ర గాయం అయితే ఆ జట్టు పది మందితోనే మ్యాచ్‌లో కొనసాగేది. ఇకపై అలా జరిగితే అదే తరహా మరో ఆటగాడిని పూర్తి స్థాయిలో తుది జట్టులోకి తీసుకొని ఆడించవచ్చు. అయితే ఈ నిబంధనను ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కాకుండా దేశవాళీ క్రికెట్లోనే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానున్నారు. -
అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రూల్స్
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వర్షం లేదా ఇతరత్రా కారణాలతో చేత ఓవర్లు కుదించబడిన మ్యాచ్‌ల్లో పవర్‌ప్లే నిబంధనలు మారనున్నాయి. ఇప్పటివరకు కుదించబడిన మ్యాచ్‌ల్లో పవర్‌ప్లే ఓవర్లు రౌండ్ ఫిగర్‌గా ఉండేవి. ఉదాహరణకు 8 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో మూడు ఓవర్ల పవర్‌ప్లే ఉండేది. కొత్త నిబంధన ప్రకారం ఇది (పవర్‌ప్లే) 2.2 ఓవర్లకే మార్చబడింది. సవరించిన నిబంధనల ప్రకారం పవర్‌ప్లేలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు జూలై నుంచి అమల్లోకి రానున్నాయి.కుదించబడిన టీ20 మ్యాచ్‌ల్లో ఓవర్ల వారీగా పవర్‌ప్లే వివరాలు...5 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 1.3 ఓవర్లు ఉంటుంది.6 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 1.5 ఓవర్లు ఉంటుంది.7 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 2.1 ఓవర్లు ఉంటుంది.8 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 2.2 ఓవర్లు ఉంటుంది.9 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 2.4 ఓవర్లు ఉంటుంది.10 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 3 ఓవర్లు ఉంటుంది.11 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 3.2 ఓవర్లు ఉంటుంది.12 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 3.4 ఓవర్లు ఉంటుంది.13 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 3.5 ఓవర్లు ఉంటుంది.14 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 4.1 ఓవర్లు ఉంటుంది.15 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 4.3 ఓవర్లు ఉంటుంది.16 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 4.5 ఓవర్లు ఉంటుంది.17 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 5.1 ఓవర్లు ఉంటుంది.18 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 5.2 ఓవర్లు ఉంటుంది.19 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్‌లో పవర్‌ప్లే 5.4 ఓవర్లు ఉంటుంది.ఇదిలా ఉంటే, ఐసీసీ టెస్ట్ క్రికెట్లోనూ పలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టంది. స్లో ఓవర్‌రేట్‌ను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్‌ను ప్రారంభించాలి. మైదానంలో 0 నుంచి 60 వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫీల్డింగ్ జట్టుకు రెండుసార్లు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి కూడా ఆలస్యం చేస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా లభిస్తాయి.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2025-27) నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది.అలాగే షార్ట్ రన్ విషయంలో ఐసీసీ రూల్స్‌ను సవరించింది. బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ‘షార్ట్ రన్’కు పాల్పడితే... స్ట్రయిక్‌లో ఎవరు ఉండాలనే నిర్ణయం ఫీల్డింగ్ జట్టు సారథి తీసుకునే అవకాశం కల్పించింది. ఆటను మరింత జనరంజకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. -
ఔట్ చేసిన ఆనందంలో ఓవరాక్షన్.. కట్ చేస్తే! భారీ షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారీ షాకిచ్చింది. బార్బోడస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో తన చర్యలకు గాను ఐసీసీ జరిమానా విధించింది. మొదటి రోజు ఆటలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను ఔట్ చేసిన ఆనందంలో సీల్స్ దురుస ప్రవర్తన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ప్యాట్ కమ్మిన్స్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కమ్మిన్స్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కమ్మిన్స్‌ను సీల్స్ అద్బుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో సీల్స్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి.ఈ విండీస్ స్పీడ్ స్టార్ కమ్మిన్స్ వైపు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపో అంటూ సీరియస్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు మేరకు సీల్స్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ చర్యలు దిగారు. ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు. సీల్స్ సైతం తన తప్పిదాన్ని అంగీకరించాడు."నా బౌలింగ్‌లో కమ్మిన్స్ రెండు భారీ షాట్లు కొట్టినందుకు, అతనికి డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ ఉందో చూపించాను. అంతే తప్ప అందులో ఇంకేమి లేదు" అని సీల్స్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో జైడన్ సీల్స్ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటివరకు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు.రసవత్తరంగా బార్బోడస్ టెస్టుఇక బార్బోడస్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లకు విజయవకాశాలు సమంగా ఉన్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.క్రీజులో ట్రావిస్ హెడ్(13), వెబ్‌స్టెర్(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలింది.చదవండి: WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్.. ఓటమి తప్పదా? -
టెస్టుల్లో 'స్టాప్ క్లాక్'
దుబాయ్: టెస్టు క్రికెట్లో జాప్యాన్ని తగ్గించి మరింత రసవత్తరంగా మార్చే దిశగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. సుదీర్ఘ ఫార్మాట్లో ‘స్లో ఓవర్‌రేట్’ను నియంత్రించేందుకు ఐసీసీ ‘స్టాప్ క్లాక్’ పద్ధతిని ప్రవేశ పెట్టింది. 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్లో ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య ఒక టెస్టు మ్యాచ్ పూర్తికాగా... ప్రస్తుతం రెండో టెస్టు జరుగుతోంది. మరోవైపు ఆ్రస్టేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో సైతం ఈ కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో పాటు బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ‘షార్ట్ రన్’కు పాల్పడితే... స్ట్రయిక్‌లో ఎవరు ఉండాలనే నిర్ణయం ఫీల్డింగ్ జట్టు సారథి తీసుకునే అవకాశం కల్పించింది. ఆటను మరింత జనరంజకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. » ‘స్లో ఓవర్‌రేట్’ను అరికట్టేందుకు బోర్డు నడుం బిగించింది. ఓవర్‌కు ఓవర్‌కు మధ్య వ్యవధిని 60 సెకన్లకు పరిమితం చేసింది. » టెస్టు మ్యాచ్‌లో ఒక ఓవర్ ముగిసిన అనంతరం మైదానంలోని ‘స్టాప్ క్లాక్’లో కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. 60 సెకన్లలో తదుపరి ఓవర్ తొలి బంతి పడాల్సి ఉంటుంది. » నిర్ణీత సమయంలో ఓవర్ ప్రారంభం కాకపోతే... అంపైర్లు హెచ్చరిస్తారు. » బౌలింగ్ చేస్తున్న జట్టు రెండు సార్లకు మించి అంప్లైర్ల హెచ్చరికలు పొందితే... బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులు కేటాయిస్తారు. » ఒక ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిస్తే హెచ్చరికలను తిరిగి ఒకటి నుంచి లెక్కిస్తారు. » బంతి ఆకారం మారిందని అంపైర్లు గుర్తిస్తే ఏ సమయంలోనైనా బాల్‌ను మార్చవచ్చు. » ఫీల్డ్ అంపైర్ ‘అవుట్’ అని ఇచ్చిన నిర్ణయంపై రెండో సమీక్ష జరిగితే... ఆ నిర్ణయంలో స్పష్టత రాకుంటే దాన్ని అవుట్‌గానే పరిగణించనున్నారు. ఉదాహరణకు... ఒక బ్యాటర్ క్యాచ్ అవుటైన సందర్భంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని బ్యాటర్ సవాలు చేసి బంతి ప్యాడ్లను తాకినట్లు రీప్లేల్లో చూపించి నాటౌట్‌గా నిర్ణయిస్తే... టీవీ అంపైర్ ఎల్బీని పరిశీలిస్తాడు. ఈ సందర్భంలో డిఫాల్ట్ నిర్ణయం ‘అవుట్’గానే ఉంటుంది. బాల్ ట్రాకింగ్ విధానంలో పరిశీలించిన అనంతరం ‘అంపైర్ కాల్’ చూపిస్తే బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. » ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్‌కు పాల్పడితే... అదనపు ప్రయోజనం పొందాలనే లక్ష్యంతోనే ఇలా చేసినట్లు అంపైర్లు భావిస్తే... ఫీల్డింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా అందివ్వనున్నారు. దీంతో పాటు తదుపరి బంతికి ఎవరు స్ట్రయిక్ తీసుకోవాలనే అంశం కూడా నిర్ణయించే అధికారం ఫీల్డింగ్ జట్టు కెపె్టన్‌కు కల్పిస్తారు. -
‘పట్టుదలతో కట్టిపడేశాడు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రస్తుత అధ్యక్షుడు, గతంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షాపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. 2019 నుంచి 2022 వరకు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో జై షా బోర్డు కార్యదర్శిగా పనిచేశాడు. వీరిద్దరి మధ్య చక్కటి అనుబంధం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న జై షా నిజాయితీ, పట్టుదల తనను ఎంతో ఆకట్టుకున్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ‘అప్పగించిన పనులు పూర్తి చేయడంలో జై షా చాలా ప్రత్యేకం. అతడు భారత క్రికెట్ అభివృద్ధికి సహకరించాడు. రాజకీయ నేపథ్యం నుంచి రావడంతో అతడి నిర్ణయాల్లో మొండితనం, ఓరకమైన దృఢత్వం ఉంటుందని ఆశించా. కానీ అందుకు భిన్నమైన తీరుతో నిజాయితీ, పట్టుదలతో ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ ఆట గురించే ఆలోచిస్తాడు. దీన్ని మరింత మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టొచ్చా అని మార్గాలు వెతుకుతుంటాడు’ అని గంగూలీ అన్నాడు. కోవిడ్–19 వంటి క్లిష్ట సమయంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన గంగూలీ, జై షా ఆటగాళ్ల సంరక్షణ కోసం ఎన్నోచర్యలు చేపట్టారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు ఆగిపోయిన దశలోనూ ‘బయోబబుల్’ వంటి ప్రత్యేక ఏర్పాట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్ వంటి టోర్నీలను నిర్వహించారు. 2022లో పదవీకాలం ముగియడంతో గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా... గతేడాది వరకు కార్యదర్శిగా కొనసాగిన 36 ఏళ్ల జై షా... 2024 నవంబర్‌లో ఐసీసీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. తద్వారా పిన్న వయసులో ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచాడు. ‘2019లో తొలిసారి అతడిని కలిశాను. గుజరాత్ క్రికెట్ సంఘంలో పనిచేసి వచ్చాడు. చిన్నపిల్లవాడిలా కనిపించాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలిచేవాడు. ఏ సమయంలో అయినా సంప్రదించగానే స్పందించేవాడు. అతడికి ఆటపై స్పష్టమైన అభిప్రాయాలు, అవగాహన ఉంది. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉన్నత లక్ష్యం అతని ఎదుగుదలకు సహకరించింది. అనుభవంతో మరింత రాటుదేలాడు. ఇప్పుడు క్రికెట్లో అత్యున్నత పదవైన ఐసీసీ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్నాడు. నిజాయితీగా పనులు పూర్తి చేస్తాడు. ఇప్పటికీ అతడితో మంచి అనుబంధం కొనసాగుతోంది’ అని గంగూలీ వివరించాడు. -
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ..
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఊహించని షాకిచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అంపైర్‌తో వాగ్వదం దిగినందుకు గానూ పంత్‌కు ఓ డిమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.అసలేమి జరిగిందంటే?ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లో బంతిని మార్చమని ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్పై పంత్ ఒత్తిడి తీసుకొచ్చాడు. బంతి కండీషన్ బాగోలేదని కొత్త బంతిని తీసుకురావాలని పంత్ సూచించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు బంతిని పరిశీలించి, మార్చాల్సిన అవసరంలేదంటూ అదే బాల్‌ను తిరిగి పంత్‌కు ఇచ్చాడు.ఈ క్రమంలో సహనం కోల్పోయిన పంత్.. బంతిని నేలకేసి బలంగా కొట్టాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్కు ఫిర్యాదు చేశారు. పంత్ కూడా తన తప్పును అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే పంత్‌పై ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఈ చర్యలు తీసుకున్నారు.శతక్కొట్టిన పంత్..కాగా ఈ మ్యాచ్‌లో పంత్ సెంచరీలు మోత మోగించాడు. రెండో ఇన్నింగ్స్‌లలోనూ శతకాలు బాది సంచలనం సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. కాగా తొలి టెస్టులో విజయంపై భారత్ కన్నేసింది.ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఆటలో ఎవరు మెరుగ్గా రాణిస్తే వారిదే విజయం.చదవండి: రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం ఇదే! -
ICC: శుబ్‌మన్ గిల్‌కు జరిమానా?!.. కారణం?
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రయాణంలో తొలి ప్రయత్నంలోనే శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా శతకంతో సత్తా చాటి తన విలువను చాటుకున్నాడు. తద్వారా టెస్టు సారథిగా అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు.అజేయ శతకంలీడ్స్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. విరాట్ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి 175 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 127 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటికి పదహారు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.ఇక మరో సెంచరీ వీరుడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101)తో కలిసి 129 పరుగులు జోడించిన గిల్.. వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో కలిసి 138 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆటలో టీమిండియా 85 ఓవర్లు ఆడి మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించింది. గిల్ 127, పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నారు. చిక్కుల్లో పడే అవకాశంకాగా ఇంగ్లండ్‌తో మొదటి టెస్టు మొదటి రోజు ఆటలో భారత జట్టు ప్రదర్శన పట్ల సచిన్ టెండుల్కర్ వంటి దిగ్గజాలు హర్షం వ్యక్తం చేశారు. గిల్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌ను కొనియాడుతున్నారు. అంతాబాగానే ఉన్నా గిల్ చేసిన ఓ పని వల్ల అతడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు నలుపు రంగు సాక్సులు వేసుకున్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్లేయర్ క్లాతింగ్- ఎక్విప్మెంట్ నిబంధన (క్లాజ్ 19.45)ల ప్రకారం.. టెస్టు మ్యాచ్‌లో ఆటగాడు ధరించే సాక్సులు తెలుపు, గోధుమ లేదా లేత బూడిద రంగులో మాత్రమే ఉండాలి.జరిమానా?ఈ నేపథ్యంలో డ్రెస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా గిల్‌కు జరిమానా పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. కాగా ఐసీసీలోని ఈ నిబంధనల ప్రకారం.. లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డట్లు తేలితే ఫైన్ తప్పదు. అయితే, గిల్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని రిఫరీ భావిస్తే అతడు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు.కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. కేఎల్ రాహుల్ (42) ఓ మోస్తరుగా రాణించగా.. అరంగేట్ర బ్యాటర్ సాయి సుదర్శన్ మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇక జైసూ, గిల్ శతకాలతో చెలరేగగా.. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్‌పై మాజీ కెప్టెన్ ఫైర్ -
కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ జెండాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..
ఐసీసీ పురుషుల ప్రపంచకప్ 2023 సందర్భంగా కోకాకోలా ఇండియా రీసైకిల్డ్ పెట్ ఇండియా జెండాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జెండా ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో చోటుదక్కించుకుంది. రీసైకిల్డ్ మెటీరియల్ వినూత్న ఆవిష్కరణ కేటగిరీలో ఈ గుర్తింపు దక్కించుకుంది. ఈ మేరకు కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవయాని రాణా మాట్లాడుతూ.."ఈ ఆవిష్కరణకు సహకరించిన ‘గో రివైజ్’, ఐసీసీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. రీసైక్లింగ్ వ్యర్థాలను విలువైన వనరులుగా ఎలా మార్చవచ్చో చెప్పేందుకు ఈ జెండా నిదర్శనం. ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు అనేది మా పురురోగతని పునరుద్ఘాటించేలా గర్వపడే క్షణం". అని అన్నారు. ఇక గో రివైజ్ వ్యవస్థాపకుడు యష్ శర్మ ఇది పర్యావరణ బాధ్యతపై శక్తిమంతమైన స్ప్రుహని అందిస్తోంది. కాగా, కోకాకోలా ఇండియా మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ఈ జెండాను ఇలా వినూత్నంగా రూపొందించారు. దీన్ని 11వేల పోస్ట్-కన్స్యూమర్ PET బాటిళ్లతో రూపొందించారు. ఈ జెండాని భారత్‌లో ఆడే ప్రతి ప్రపంచకప్ మ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలో సగర్వంగా ప్రదర్శిస్తున్నారు నిర్వాహకులు. అంతేగాదు అక్టోబర్ 5, 2023 ప్రారంభమైన ఈ పురుషుల ప్రపంచకప్ టోర్నమెంట్.. నవంబర్ 19 వరకు మొత్తం 19 స్టేడియంలలో సుమారు వెయ్యిమందికి పైగా వాలంటీర్లు రీసైకిల్డ్ పెట్ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టి జాకెట్లను ధరించి, ప్రేక్షకులకు స్టేడియంను క్లీన్‌గా చూసుకోవడంపై అవగాహన కల్పించడం విశేషం.(చదవండి: ఆ టీచర్ పాఠాలు చెప్పే తీరే వెరేలెవెల్..! ఎవ్వరైనా ఫిదా అవ్సాల్సిందే) -
ఐసీసీ కీలక నిర్ణయం.. నాలుగు రోజుల టెస్టులకు రెడీ?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027-29 సైకిల్లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ సిద్దమైంది. చిన్న దేశాలకు చెందిన క్రికెట్ జట్లు ఎక్కువ టెస్టులు ఆడటానికి, నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది గార్డియన్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.అయితే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్లకు ఆ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. గత వారం లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ సమయంలో ఈ విషయంపై ఐసీసీ చైర్మెన్ జై షా చర్చలు జరిపినట్లు సమాచారం. తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో నాలుగు రోజుల మ్యాచ్‌ను ప్రవేశపెట్టేందుకు జైషా తన మద్దతు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా 2017లోనే ద్వైపాక్షికంగా నిర్వహించే సిరీస్‌లకు నాలుగు రోజుల టెస్టుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది. గత నెలలో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, జింబాబ్వే మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. అంతకుముందు 2019, 2023లో ఐర్లాండ్‌తోనూ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ తలపడింది.ఇక 2025–27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మంగళవారం(జూన్ 17) నుంచి ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. అయితే ప్రస్తుత సైకిల్‌ను 5 రోజుల ఫార్మాట్లోనే ముగించనున్నారు. 2025-27 సైకిల్లో మొత్తంగా 27 టెస్టు మ్యాచ్ సిరీస్‌లు జరగనున్నాయి.ఇందులో 17 సిరీస్‌లు రెండేసి మ్యాచ్‌లు చొప్పున జరగనున్నాయి. ఓవరాల్‌గా 9 దేశాల క్రికెట్ జట్లు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ప్రస్తుత సైకిల్లో ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఒకదానితో ఒకటి ఐదు టెస్ట్ సిరీస్‌లు ఆడనున్నాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
వన్డే వరల్డ్‌కప్ ఫిక్చర్స్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫిక్చర్స్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక మ్యాచ్ మాత్రం భారత్‌లోనే జరుగనుంది.టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (సెప్టెంబర్ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.పాకిస్తాన్ మ్యాచ్‌లు కొలొంబోలో ఎందుకు..?ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.🚨 SCHEDULE OF WOMEN's ODI WORLD CUP 2025 🚨 pic.twitter.com/n1nB6iYi14— Johns. (@CricCrazyJohns) June 16, 2025భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ దశతో భారత్ మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. దాని షెడ్యూల్ కింది విధంగా ఉంది.మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 5—భారత్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 9—భారత్ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 19—భారత్ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 23—భారత్ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3 -
‘అలా క్యాచ్ పడితే నాటౌట్’
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పులు చేసింది. వన్డేల్లో రెండు బంతుల వినియోగం, కన్కషన్ సబ్‌స్టిట్యూట్, బౌండరీ లైన్ వద్ద పట్టే క్యాచ్‌లు వివాదాస్పదం కాకుండా ఉండేదుకు ఐసీసీ క్రికెట్ కమిటీ సిఫార్సుల మేరకు సవరణలు తీసుకొచ్చింది.టెస్టు, వన్డే, టి20 మూడు ఫార్మాట్లలోనూ ఈ కొత్త సవరణ నిబంధనలు త్వరలోనే అమలు కానున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ నెల 17 నుంచే టెస్టు క్రికెట్లో ఇవి అమలవుతాయి. వచ్చే నెల 2 నుంచి వన్డేల్లో, 10 నుంచి టి20 క్రికెట్లో మారిన నిబంధనల్ని అమలు చేయనున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు కొత్త బంతులు యథాతథం కానీ... ఇప్పుడు వన్డే క్రికెట్లో బౌలింగ్ జట్టుకు రెండు కొత్త బంతుల్ని ఒకేసారి ఇస్తున్నారు. ఒక ఎండ్ నుంచి ఒక బౌలర్, మరో ఎండ్ నుంచి ఇంకో బౌలర్ రెండు వేర్వేరు కొత్త బంతుల్ని వినియోగిస్తున్నారు. ఇకపై ఇలా ఉండదు. రెండు కొత్త బంతుల్ని ఒకేసారి ఇచి్చనప్పటికీ చెరో ఎండ్ నుంచి ఉపయోగించడం కుదరదు. రెండు ఎండ్ల నుంచి కూడా 1 నుంచి 34 ఓవర్ల వరకు ఒక కొత్త బంతిని, 35 నుంచి 50వ ఓవర్ వరకు రెండో కొత్త బంతిని వాడాల్సివుంటుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణంతో 25 ఓవర్లలోపు కుదించిన మ్యాచ్‌లు జరిగితే మాత్రం ఒక ఇన్నింగ్స్ ముగిసేవరకు ఒకే కొత్త బంతిని ఇస్తారు. దీనివల్ల బంతి, బ్యాట్‌కు మధ్య సమతూకం పాటించినట్లవుతుందని ఐసీసీ కమిటీ తెలిపింది. ఎవరు వీడితే... అదే తరహా ఆటగాడే బరిలోకి కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఇన్నాళ్లు ఎవరిని పడితే వారిని మైదానంలోకి దించేవారు. మరీ ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్ పరిస్థితులకు తగిన ఆటగాడిని వ్యూహాత్మకంగా మోహరించేవారు. ఇది ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందికరంగా మారేది. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో నాలుగో టి20 సందర్భంగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే కన్కషన్ అయ్యాడు. అయితే అప్పటికే బ్యాటింగ్ ముగియడంతో భారత్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణాను బరిలోకి దించింది. అతను (3/33) మ్యాచ్‌ను గెలిపించే స్పెల్‌తో అదరగొట్టాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు దీనిని మార్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఇక మీదట ఎవరు గాయంతో అచేతన స్థితికి గురైతే కన్కషన్ సబ్‌స్టిట్యూట్ ఆ స్థాయి ఆటగాడిని బరిలోకి దించాలి. అంటే బ్యాటర్ కన్కషన్ అయితే మరో బ్యాటర్‌నే మైదానంలో ఆడించాలి. అలాగే వికెట్ కీపర్, పేసర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్... ఇలా ఎవరు గాయపడితే అదే తరహా ఆటగాడే ఆడాలి. దీనికి సంబంధించి టాస్కు ముందు తుది జట్టు వివరాలు ఇచ్చేటపుడే వికెట్ కీపర్, బ్యాటర్, సీమర్, స్పిన్నర్, ఆల్‌రౌండర్లతో కూడిన జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. బౌండరీ ఆవల పదేపదే తచ్చాడితే ‘క్యాచ్’ కాదు! బ్యాటర్ భారీ సిక్సర్లకు ప్రయత్నించినపుడు బౌండరీ లైన్ వద్ద గాల్లోకి లేచి బంతిని లైన్‌కు ఇవతలే విసిరేసిన ఫీల్డర్ మళ్లీ బౌండరీ లైన్ లోపలికి వచ్చి క్యాచ్‌గా అందుకునేవాడు. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదు. అయితే కొన్ని అరుదైన సందర్భాల్లో ఫీల్డర్ బంతిని గాల్లోకి విసిరే ప్రయత్నంలో విఫలమవుతాడు. ఫీల్డర్ బౌండరీ లైన్ అవతల కాలు మోపాక కూడా మరోమారు గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి పంపి... తిరిగొచ్చి క్యాచ్ అందుకోవడం ఇకపై క్యాచ్ కాదు అవుట్ కాదు. ఈ వివాదాస్పద క్యాచ్‌లపై కమిటీ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్స్.. బీసీసీఐ ఆశలపై నీళ్లు చల్లిన ఐసీసీ?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్‌కు ఆతిథ్యమివ్వాలని భావిస్తున్న బీసీసీఐ ఆశలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నీళ్లు చల్లే సూచనలు కన్పిస్తున్నాయి. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే వచ్చే మూడు సీజన్ల ఫైనల్ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్‌కే కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.దీనిపై వచ్చే నెలలో సింగపూర్‌లో జరిగే వార్షిక సమావేశం అనంతరం ఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే 2027, 2029, 2031 ఫైనల్స్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనుంది. 2021లో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లోని సౌతాంప్టాన్ వేదికగా జరిగింది.ఆ తర్వాత రెండు సీజన్ల ఫైనల్స్‌కు లండన్‌లోని ఓవల్ మైదానం, లార్డ్స్ వేదికలు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఐసీసీ ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్‌కే కట్టబెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గ్లోబల్ బ్రాడ్కాస్టర్స్కు అనువగా ఉండడం, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రేక్షకులు ఎక్కువగా టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం వంటి ఆంశాలు ఐసీసీని ప్రభావితం చేసినట్లు సమాచారం.ప్రస్తుతం లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు విశేష ప్రేక్షక ఆదరణ లభించింది. మొదటి మూడు రోజుల్లో 75,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ విజయానికి అంత్యంత చేరువైంది.చదవండి: WTC Final 2025: చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్‌గా -
టీమిండియా జాక్‌పాట్.. పాపం పాకిస్థాన్!
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే ఈసారి విజేతకు రెండింతల ఎక్కువ ప్రైజ్‌మనీ దక్కుతుంది. టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రైజ్‌మనీని భారీగా పెంచింది ఐసీసీ.డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచే జట్టుకు ఈసారి 3.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 30.8 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతమవుతుంది. రన్నరప్‌కు 2.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17.9 కోట్లు) నగదు బహుమతి అందుతుంది. హ్యాట్రిక్ ఫైనల్ మిస్సయి 3వ స్థానంలో నిలిచిన టీమిండియా కూడా భారీగానే ప్రైజ్‌మనీ అందుకోబోతోంది. మూడో స్థానంలో నిలిచినప్పటికీ గత రెండు ఎడిషన్ల విజేతల కంటే ఎక్కువ సొమ్మును భారత్ దక్కించుకోబోంది. 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12.34 కోట్లు) నగదు బహుమతి పొందనుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10.26 కోట్లు) ప్రైజ్‌మనీ వస్తుంది.పాపం పాకిస్థాన్!పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రానురాను మరింత దయనీయంగా తయారవుతోంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025లో పాక్ టీమ్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్ కన్నా తక్కువ మొత్తం ఆ జట్టుకు దక్కుతుంది. బంగ్లాదేశ్ 7.2 లక్షల డాలర్లు (దాదాపు రూ. 6.16 కోట్లు), వెస్టిండీస్ 6.1 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.21 కోట్లు) నగదు బహుమతిగా అందుకోనున్నాయి. పాకిస్థాన్‌కు దాదాపు 4.1 కోట్ల రూపాయల (4.8 లక్షల డాలర్లు) నగదు మాత్రమే దక్కనుంది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ 7, వెస్టిండీస్ 8 స్థానాల్లో నిలవగా, పాకిస్థాన్ చివరిదైన 9వ స్థానంలో ఉంది.డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్, శ్రీలంక ఐదారు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.21 కోట్లు), శ్రీలంక 8.4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు) నగదు బహుమతి అందుకుంటాయి. కాగా, 2019-21లో న్యూజిలాండ్, 2021-23లో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఇండియాపైనే గెలవడం గమనార్హం.డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మనీ వివరాలు1. విజేత: రూ. 30.8 కోట్లు2. రన్నరప్: రూ. 17.9 కోట్లు3. ఇండియా: రూ. 12.34 కోట్లు4. న్యూజిలాండ్: రూ. 10.26 కోట్లు5. ఇంగ్లండ్: రూ. 8.21 కోట్లు6. శ్రీలంక: రూ. 7.18 కోట్లు7. బంగ్లాదేశ్: రూ. 6.16 కోట్లు8. వెస్టిండీస్: రూ. 5.21 కోట్లు9. పాకిస్థాన్: రూ.4.1 కోట్లుచదవండి: అమ్మకానికి ఆర్సీబీ..?, ఆందోళనలో ఫ్యాన్స్.. -
వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ అక్కడే..!
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 2) విడుదల చేసింది. ఈ టోర్నీకి సంబంధించిన వేదికలు, తేదీలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి. 2025 ICC Women's Cricket World Cup schedule 𝐑𝐄𝐕𝐄𝐀𝐋𝐄𝐃!Read more ➡ https://t.co/myj2Gfamkv pic.twitter.com/zl3IYWC2e6— ICC (@ICC) June 2, 2025ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు. భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు. భారత్, పాక్ మధ్య తాజా పరిస్థితుల (ఆపరేషన్ సిందూర్ తర్వాత) నేపథ్యంలో పాక్ జట్టు మన దేశంలో మ్యాచ్‌లు ఆడతామన్న భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు.కాగా, ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరులో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత ప్రత్యర్థి క్వాలిఫయర్ పోటీల ద్వారా నిర్ణయించబడుతుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే. -
నిబంధనల అతిక్రమణ.. వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ
మే 29న ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వెస్టిండీస్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ ఆ జట్టు ఆటగాళ్లకు జరిమానా విధించింది. ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘణ స్లో ఓవర్ రేట్ పరిధిలోకి వస్తుంది. ఆ మ్యాచ్‌లో విండీస్ అదనపు సమయం ముగిసినా తమ కోటా ఓవర్లు (50) పూర్తి చేయలేకపోయింది. ఓ ఓవర్ వెనకపడింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో విండీస్ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐదు శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించాడు. ఈ జరిమానాను విండీస్ జట్టు సభ్యులు సవాలు చేయకుండా స్వీకరించారు. సాధారణంగా నిర్ణీత సమయంలోగా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోతే ఓవర్‌కు ఐదు శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధిస్తారు.ఇదిలా ఉంటే, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్ జట్టు మే 29న తొలి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 238 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (60), జో రూట్ (57), హ్యారీ బ్రూక్ (58), జేకబ్ బేతెల్ (82) అర్ద సెంచరీలతో చెలరేగగా.. జేమీ స్మిత్ (37), జోస్ బట్లర్ (37), విల్ జాక్స్ (39) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 4, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 26.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్ తలో 3, ఆదిల్ రషీద్ 2, బ్రైడన్ కార్స్, జేకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో 11వ నంబర్ ఆటగాడు జేడెన్ సీల్స్ (29 నాటౌట్) టాప్ స్కోరర్‌గా కాగా.. షాయ్ హోప్ (25), కీసీ కార్టీ (22) 20కి పైగా పరుగులు చేశారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇవాళ (జూన్ 1) రెండో వన్డే జరుగుతుంది. -
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్
దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షషిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌ను పర్యవేక్షించే అధికారుల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. భారత జట్టు మాజీ పేస్ బౌలర్, అనుభవజ్ఞుడైన జవగళ్ శ్రీనాథ్‌కు గొప్ప గౌరవం లభించింది. జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లండన్‌లోని విఖ్యాత లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా, తొలిసారి తుది పోరుకు చేరిన దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోరుకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తాడని ఐసీసీ తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ గాఫెనె (న్యూజిలాండ్)... టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటెల్‌బొరో (ఇంగ్లండ్)... ఫోర్త్ అంపైర్‌గా నితిన్ మీనన్ (భారత్) పేర్లను ఐసీసీ ఖరారు చేసింది. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్ గుర్తింపు పొందనున్నాడు. 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోనూ ఇల్లింగ్‌వర్త్ అంపైర్‌గా వ్యవహరించాడు. -
భారత్‌లో WTC ఫైనల్-2027!.. ఐసీసీ నిర్ణయం?
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 (WTC) ఫైనల్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందా?.. అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాల నుంచి అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మెగా మ్యాచ్‌ను నిర్వహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.మేము నిర్వహిస్తాంగత నెలలో జింబాబ్వే వేదికగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌కు భారత్ తరఫున అరుణ్ ధుమాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో చర్చల్లో భాగంగా డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణ పట్ల బీసీసీఐకి ఆసక్తి ఉందన్న విషయాన్ని ఆయన ఐసీసీ అధికారులకు చెప్పినట్లు ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది.కాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఆరంభించారు. ఇప్పటికి ఈ ఐసీసీ టోర్నీకి సంబంధించి మూడు సీజన్లు (2019-2021, 2021-23, 2023-25)ముగిశాయి. ఇందులో తొలి రెండు ఎడిషన్లలో టీమిండియా ఫైనల్‌కు వెళ్లింది.ఈసారి అదీ లేదుఅయితే, 2021 టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో.. అదే విధంగా 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2023-25 సీజన్లో మాత్రం భారత జట్టు ఫైనల్‌కు చేరలేకపోయింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణం.మూడూ ఇంగ్లండ్లోనేఈ క్రమంలో టీమిండియాపై పైచేయి సాధించిన ఆస్ట్రేలియా- సౌతాఫ్రికాతో కలిసి డబ్ల్యూటీసీ-2025 ఫైనల్‌కు చేరింది. ఇక ఇప్పటి వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లన్నింటికీ ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది.సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్లో 2021, ది ఓవల్ మైదానంలో 2023 ఫైనల్‌ను నిర్వహించారు. ఈసారి ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆసీస్- ప్రొటిస్ జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. ఈ మెగా మ్యాచ్ తర్వాత టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది.ఈ నేపథ్యంలో ఈసారి భారత్ ఫైనల్ చేరితే తాము ఆ మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ఐసీసీకి తెలియజేసినట్లు సమాచారం. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 బిడ్‌కు సంబంధించి భారత్ తమ ఆసక్తిని తెలియజేసింది.అరుణ్ సింగ్ ధుమాల్ బీసీసీఐ తరఫున ఐసీసీ ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా.. బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు. కాబట్టి భారత్‌కు ఈ బిడ్ దక్కే అవకాశం ఉంది’’ అని ది గార్డియన్ పేర్కొంది.ఐసీసీ నిర్ణయం ఏమిటి?డబ్ల్యూటీసీ ఫైనల్-2027 వేదికను భారత్‌కు తరలించే విషయంలో ఐసీసీ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీమిండియా ఈ మెగా మ్యాచ్‌కు అర్హత సాధిస్తే ఫర్వాలేదు.. అలా కాని పక్షంలో భారత్‌లో ఈ మ్యాచ్‌కు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించదని ఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదే ఇంగ్లండ్‌లో అయితే.. వేసవిలో కౌంటీలతో పాటు ఈ మెగా పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు స్టేడియానికి తరలివస్తారనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఇంగ్లండ్‌నే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సరైన వేదికగా ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈసారి టీమిండియా ఫైనల్‌కు చేరకపోవడంతో ఇంగ్లండ్ బోర్డుకు టికెట్ల రూపేణా వచ్చే ఆదాయం భారీగా తగ్గినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు రూ. 45 కోట్లు మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నష్టపోయినట్లు కథనాలు వచ్చాయి.చదవండి: IPL 2025: మిగిలిన మ్యాచ్‌లు మేము నిర్వహిస్తాం: బీసీసీఐకి ఆఫర్! -
ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా -
లార్డ్స్‌లో మరో ఫైనల్
దుబాయ్: సుప్రసిద్ధ క్రికెట్ మైదానం ‘లార్డ్స్’ మరో విశ్వవిజేతను తేల్చనుంది. వచ్చే ఏడాది జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ లార్డ్స్‌లో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. 12 జట్లు పాల్గొనే మహిళల మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జూన్ 12న మొదలై జూలై 5వ తేదీన జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. టోర్నీలో మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. ఓల్డ్ ట్రాఫోర్డ్, హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్, ద ఓవల్, హ్యాంప్‌షైర్ బౌల్, బ్రిస్టల్ కౌంటీ ఇలా ఆరు వేదికల్లో లీగ్, సహా సెమీఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. కానీ గ్రాండ్ ఫైనల్ మాత్రం విఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ వెల్లడించింది. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పూర్తి షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఇంగ్లండ్‌లో ప్రేక్షకులు ప్రపంచకప్‌కు బ్రహ్మరథం పడతారని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు. ‘ఉత్కంఠ భరితంగా సాగిన 2017 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ నాకు ఇంకా గుర్తుంది. మెరుపుల టి20 మెగా ఈవెంట్ మరింత ఆసక్తిగా సాగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మేం ఇక టోర్నీ ఏర్పాట్లపై నిమగ్నమవుతాం. రోమాంఛకరమైన క్రికెట్ ఆట లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ (2028)లో మరో దశకు చేరుతుంది’ అని అన్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్ మాట్లాడుతూ మొత్తం ఏడు వేదికల్లో మహిళల టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ టోర్నీలో భారత్, మాజీ చాంపియన్ ఆ్రస్టేలియా, డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక ఈ ఎనిమిది జట్లు ఇదివరకే అర్హత సంపాదించాయి. మిగతా నాలుగు జట్లు మాత్రం ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధిస్తాయి. లార్డ్స్‌లో 2017లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచే స్థితిలో కనిపించిన మిథాలీ రాజ్ బృందం అనూహ్యంగా 9 పరుగుల తేడాతో ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. పురుషుల క్రికెట్ స్థాయి ఉత్కంఠకు ఏమాత్రం తీసిపోని ఈ ఫైనల్‌కు రికార్డు స్థాయిలో టీవీ ప్రేక్షకులు తిలకించారు. అప్పటి నుంచి అమ్మాయిల క్రికెట్‌పై ఆసక్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మెల్బోర్న్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్‌ను 86,174 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించారు. తదనంతరం కేప్‌టౌన్ (2023), దుబాయ్ (2024)లలో జరిగిన మెగా ఈవెంట్లకు టికెట్లన్నీ ముందస్తుగానే ‘సోల్డ్ అవుట్’ అయ్యాయి. -
మ్యాచ్ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించడం కుర్చీలో కూర్చున్నంత సులువు కాదని, సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయని ఇటీవలే రిటైరైన మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన 14 ఏళ్ల కెరీర్లో బాల్ టాంపరింగ్, భద్రతా సవాళ్లు క్లిష్టమైనవని చెప్పుకొచ్చారు. ఆ్రస్టేలియాకు చెందిన మాజీ ఓపెనర్, 64 ఏళ్ల బూన్ పురుషుల క్రికెట్లో 87 టెస్టులు, 183 వన్డేలు, 112 టి20లకు... మహిళల క్రికెట్లో ఏడు టి20లకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. అచ్చం క్రికెటర్లలాగానే కెరీర్‌కు టాటా చెప్పినా... కోచ్, మెంటార్లుగా ఆటతో అనుబంధాన్ని కొనసాగించినట్లే, ఈ వెటరన్ ఆస్ట్రేలియన్ కూడా రిఫరీగా రిటైర్మెంట్ ప్రకటించినా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) డైరెక్టర్‌గా బంధాన్ని కొనసాగించనున్నారు. ‘రిఫరీ పనంటే అంతా సులువు కాదు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు మాకు ఎదురవుతాయి. చాలా సార్లు బాల్ టాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించడంలో పడిన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఢాకా (బంగ్లాదేశ్), క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) వేదికల్లో జరిగిన మ్యాచ్‌కు సరిగ్గా ఇలాంటి కఠిన పరిస్థితుల్నే ఎదర్కొన్నాను. కొన్ని చోట్ల భద్రతా సవాళ్లు తప్పలేదు. ఏదేమైనా... బిజీ క్రికెట్ పెరిగినా... జెంటిల్మెన్ క్రికెట్ స్థాయి పెంచేందుకే రిఫరీ నిర్ణయాలుంటాయి. 14 ఏళ్ల రిఫరీ కెరీర్లో సాఫల్యాలు చూసుకుంటే సంతోషంగా ఉంటుంది’ అని 396 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన బూన్ వివరించారు. జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆట ప్రతిష్టను పెంచుతూనే సుదీర్ఘ సేవలందించిన బూన్‌ను ఐసీసీ చైర్మన్ జై షా ప్రశంసిస్తూ ఆయన సేవల్ని కొనియాడారు. రిఫరీ కాకముందు క్రికెటర్‌గా బూన్ ఆ్రస్టేలియా తరఫున 107 టెస్టులు ఆడి 7422 పరుగులు, 181 వన్డేలు ఆడి 5964 పరుగులు సాధించారు. -
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో కోడ్ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్ వెనుక పడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేట్లో ప్రతి ఓవర్‌కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయంఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.రాణా ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. -
పొమోనాలో 2028 ఒలింపిక్స్ క్రికెట్ పోటీలు
దుబాయ్: 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల వేదిక ఖరారైంది. 128 సంవత్సరాల విరామం అనంతరం విశ్వక్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుండగా... ఈ పోటీలను దక్షిణ కాలిఫోర్నియాలోని పొమోనా నగరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా వివరాలు వెల్లడించారు. టి20 ఫార్మాట్లో పురుషుల విభాగంలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ భారత్... మహిళల విభాగంలో ప్రస్తుత చాంపియన్ న్యూజిలాండ్ జట్లతో కూడిన పోస్టర్‌ను ఐసీసీ తమ సామాజిక మాధ్యమాల్లో జత చేసింది.1900 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ పోటీలు నిర్వహించగా... ఈసారి లాస్ ఏంజెలిస్ వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఆరేసి జట్లు పాల్గొంటాయి. ఒలింపిక్స్ ప్రధాన వేదిక లాస్ ఏంజెలిస్‌కు పొమోనా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పొమోనాలో జరగనున్న పోటీలతో ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయనుంది. విశ్వక్రీడల్లో క్రికెట్‌ను భాగం చేయడంతో ఆటకు మరింత ఆదరణ దక్కనుంది. టి20 ఫార్మాట్ ద్వారా ఇది విశ్వవ్యాప్తమై మరింత మంది అభిమానుల ఆదరణ దక్కించుకుంటుంది’ అని జై షా పేర్కొన్నాడు. 2023లో ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 141వ సమావేశంలో... విశ్వక్రీడల్లో క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 2010, 2014, 2023 ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టి20 క్రికెట్ పోటీలు నిర్వహించగా... 2022 బరి్మంగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. -
ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ పునర్నియామకం
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పునర్నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆదివారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు.2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021లో తొలిసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాటి నుంచి గంగూలీ ఈ పదవిలో కొనసాగుతున్నారు. 52 ఏళ్ల గంగూలీ భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుండి ఈ పదవిని స్వీకరించారు. కుంబ్లే గరిష్టంగా అనుమతించబడిన మూడు మూడు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేశారు. గంగూలీ, లక్ష్మణ్‌లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబడిన కమిటీలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ ఐకాన్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్ట్ మరియు వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు.మహిళల క్రికెట్ కమిటీ విషయానికొస్తే.. న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్‌బెల్ ఛైర్ పర్సన్‌గా ఎంపిక కాగా, ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా ఫోలెట్సి మోసేకి ఇతర సభ్యులుగా ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్అఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల భవితవ్యంపై ఐసీసీ కీలక చర్య తీసుకుంది. తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత తీవ్రంగా ప్రభావితమైన ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెట్‌కు పునరుజ్జీవనం కలిగించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.తాలిబన్ పరిపాలనలో మహిళలు క్రీడల్లో పాల్గొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి వారితో పాటు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే ఆఫ్ఘనిస్తాన్ యువతులకు మద్దతుగా ఐసీసీ ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఆఫ్ఘన్ మహిళా క్రికెట్‌కు మద్దతు నిధిని ప్రారంభిస్తున్న విషయాన్ని ఐసీసీ అధ్యక్షుడు జై షా ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. -
ఇకపై వన్డేల్లో ఒకటే బంతి!
న్యూఢిల్లీ: బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలను మార్చి ఆటలో బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానమైన ప్రాధాన్యత కల్పించడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో మార్పులు... పురుషుల అండర్–19 ప్రపంచకప్ పోటీలను 50 ఓవర్ల నుంచి 20 ఓవర్లకు తగ్గించడం ఇలాంటి పలు అంశాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం జింబాబ్వే రాజధాని హరారే వేదికగా ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండగా... ఇందులో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వన్డే క్రికెట్ బ్యాటర్లకు అనుకూలంగా ఉందనే దీర్ఘకాలిక ఆందోళనను పరిష్కరించే దిశగా... 50 ఓవర్ల ఫార్మాట్లో రెండు బంతుల నియమాన్ని మార్చే అవకాశాలున్నాయి. దశాబ్ద కాలంగా రెండు కొత్త బంతుల విధానం కొనసాగుతుండగా... భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ వన్డేల్లో ఒకే బంతిని ఉపయోగించాలని సిఫార్సు చేసింది. ఆటలో పోటీతత్వం పెంపొందించేందుకు ఇది సహాయపడనుంది. ‘ఐసీసీ సమావేశంలో మూడు నిబంధనలపై చర్చ జరగనుంది. వన్డేల్లో ఒకే బంతి వినియోగం, టెస్టు క్రికెట్లో టైమర్‌ను ప్రవేశ పెట్టడం, పురుషుల అండర్–19 ప్రపంచకప్‌ను టి20 ఫార్మాట్లో నిర్వహించడంపై చర్చించే అవకాశం ఉంది’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. టెస్టు క్రికెట్లో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య విరామాన్ని ఇకపై 60 సెకన్లకే పరిమతం చేయడంతో పాటు... రోజుకు 90 ఓవర్లు పూర్తి చేసే దిశగా మరింత పకడ్బందీ నిబంధనలను రూపొందించనున్నారు. 2026లో జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న పురుషుల అండర్–19 వరల్డ్‌కప్‌ను టి20 ఫార్మాట్లో నిర్వహించే దిశగా చర్చ జరగనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంలోనూ మార్పులు!ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో 2025–27 సర్కిల్ ప్రారంభం కానుంది. రగ్బీ తరహాలో... ప్రత్యర్థుల బలం ఆధారంగా విజయాలకు పాయింట్లు కేటాయించడంతో పాటు స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు, విదేశాల్లో గెలిచిన మ్యాచ్‌లకు మధ్య వ్యత్యాసం తీసుకొచ్చే చాన్స్ ఉంది. అలాగే గెలుపు అంతరాన్ని బట్టి బోనస్ పాయింట్లను కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలిన క్రీడా పాలకమండలి యోచిస్తోంది. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సర్కిల్లో టెస్టు మ్యాచ్ విజయానికి 12 పాయింట్లు, ‘టై’కు 6 పాయింట్లు, ‘డ్రా’కు 4 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కువ టెస్టు సిరీస్‌లు ఆడే ప్రధాన జట్లైన భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు పాయింట్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. 2023–25 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్లతో సిరీస్‌లు ఆడకుండానే తుదిపోరుకు అర్హత సాధించింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్ విజయాలతో పాటు టీమిండియాతో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ముందంజ వేసింది. ఇక ‘స్లో ఓవర్ రేట్’ జరిమానా విషయంలోనూ దృష్టి సారించే అవకాశం ఉంది. 2023–25 సర్కిల్లో స్లో ఓవర్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టు 22 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా 41.5 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. స్లో ఓవర్‌రేట్‌ను పక్కన పెడితే ఇంగ్లండ్ విజయాల శాతం 51.5గా ఉండేది. అప్పుడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత పట్టికలో ఇంగ్లండ్ మూడో స్థానంలో నిలిచేది. టెస్టు క్రికెట్‌ను రెండంచెలుగా విభజించాలనే అంశంపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సుదీర్ఘ ఫార్మాట్ ఆడే ప్రధాన జట్లను ఒక గ్రూప్‌గా... మిగిలిన జట్లను మరో గ్రూప్‌గా విభజించి మ్యాచ్‌లు నిర్వహించాలని చాన్నాళ్లుగా యోచిస్తున్నప్పటికీ... అది ఇప్పట్లో జరిగే పనిలా లేదు. -
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్‌కు భారీ షాక్! -
పాకిస్తాన్‌కు గట్టి షాకిచ్చిన ఐసీసీ.. పది రోజుల్లో ఇది మూడోసారి
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం అత్యంత గడ్డు దశను ఎదుర్కొంటోంది. ఇంటా.. బయటా వరుస పరాజయాలు.. చెత్త ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటోంది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో పాక్ తేలిపోయిన విషయం తెలిసిందే.స్లో ఓవర్ రేటుఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సల్మాన్ ఆఘా కెప్టెన్సీలో కివీస్ చేతిలో 4-1తో సిరీస్ కోల్పోయిన పాక్ జట్టు.. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. అంతేకాదు.. రెండు వన్డేల్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) ఆగ్రహానికి గురై.. జరిమానాల పాలైంది.ఐదు శాతం మేర కోతఇక ఇటీవల ముగిసిన మూడో వన్డేలోనూ ఇదే తప్పును పునరావృతం చేయడంతో ఐసీసీ మరోసారి పాకిస్తాన్ జట్టుకు పనిష్మెంట్ ఇచ్చింది. జట్టు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో పర్యాటక జట్టు వరుసగా మూడోసారి ఇదే తప్పిదానికి పాల్పడింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం మేర కోత విధిస్తున్నాం’’ అని పేర్కొంది. దీంతో కివీస్ దేశ పర్యటనలో వరుసగా మూడోసారి పాక్ జట్టుకు ఫైన్ పడింది.కనీసం సెమీస్ కూడా చేరుకుండానేకాగా వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్లలో కనీసం సెమీస్ కూడా చేరుకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా బాబర్ ఆజంను తప్పించి.. అతడి స్థానంలో రిజ్వాన్‌కు పగ్గాలు అప్పగించింది పాక్ బోర్డు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనలో వరుస వన్డే సిరీస్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చినట్లే కనబడింది.వరుస ఓటములుఅయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్ కోల్పోయిన రిజ్వాన్ బృందం.. మెగా వన్డే టోర్నీలోనూ వైఫల్యం కొనసాగించింది. డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో వరుస ఓటములతో ఈ మేర పరాభవం పాలైంది.ఈ క్రమంలో మార్చి 16- ఏప్రిల్ 5 వరకు న్యూజిలాండ్‌లో పర్యటించి ఐదు టీ20లు, మూడు వన్డేలు (మార్చి 29, ఏప్రిల్ 2, ఏప్రిల్ 5) ఆడి.. ఇక్కడా చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు, ఆటగాళ్ల తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టించారంటూ మండిపడుతున్నారు. చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్‌గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
పాక్ క్రికెట్ జట్టుకు మరోసారి జరిమానా
పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింది. ఫలితంగా ఆ జట్టుకు భారీ జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న పాక్ క్రికెట్ జట్టు నిన్న (ఏప్రిల్ 2) జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత సమయం పూర్తయ్యే లోపు ఓ ఓవర్ వెనుకపడింది.ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఓ జట్టు నిర్ణీత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయని పక్షంలో ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోత విధిస్తారు. ఈ మ్యాచ్‌లో పాక్ నిర్ణీత సమయంలోపు ఓ ఓవర్ వెనుకపడింది. ఫలితంగా ఆ జట్టులోని ప్రతి ఆటగాడి మ్యాచ్ ఫీజ్‌లో ఐదు శాతం కోత విధించారు.అంతకుముందు తొలి వన్డేలోనూ పాక్ స్లో ఓవర్ రేట్ తప్పిదం చేసింది. ఆ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా రెండు ఓవర్లు తక్కువ వేసింది. ఫలితంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో పది శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ విషయంలో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ శిక్షను అంగీకరించడంతో ఐసీసీ ఎలాంటి విచారణ నిర్వహించలేదు. స్లో ఓవర్‌రేట్‌తో బౌలింగ్ చేసిన రెండు వన్డేల్లో పాక్ ఘోర పరాజయాలు ఎదుర్కొని 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది. నామమాత్రపు మూడు వన్డే ఏప్రిల్ 5న మౌంట్ మాంగనూయ్‌లో జరుగనుంది.వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా పాక్ 1-4 తేడాతో కోల్పోయింది. ఈ న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో పాక్ ఒకే ఒక మ్యాచ్ (మూడో టీ20) గెలిచింది. -
షకీబ్‌కు బిగ్ రిలీఫ్.. బౌలింగ్‌కు లైన్ క్లియర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, మేటి ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు మళ్లీ బౌలింగ్ చేసేందుకు అనుమతి లభించింది. అతని బౌలింగ్ శైలితీరు నియమాలకు లోబడే ఉందని, సందేహాస్పదంగా లేదని సమీక్ష అనంతరం తేలింది. అయితే తన బౌలింగ్ యాక్షన్‌ను ఎక్కడ సమీక్షించారనే విషయాన్ని షకీబ్ వెల్లడించలేదు.ఇప్పటికే టెస్టులకు, అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికిన షకీబ్ వన్డే ఫార్మాట్లో, ఫ్రాంచైజీ లీగ్‌లలో బౌలింగ్ చేసేందుకు మార్గం సుగమం అయింది. గత ఏడాది అక్టోబర్ కాన్పూర్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టు తర్వాత షకీబ్ మళ్లీ బరిలోకి దిగలేదు. గత డిసెంబర్లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో సర్రే జట్టు తరఫున మ్యాచ్ ఆడిన సమయంలో షకీబ్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉండటంతో అతడు బౌలింగ్‌పై నిషేధం విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన షకీబ్ త్వరలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశముంది.చదవండి: ఐపీఎల్లో ‘సలైవా’ వాడవచ్చు! -
పాకిస్తాన్ ఆల్‌రౌండర్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్ షాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత విధించింది. అంతేకాదు.. క్రమశిక్షణ అంశంలో అతడి ఖాతాలో మూడు డిమెరిట్ పాయింట్లు జత చేసింది.ఇందుకు సంబంధించి ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఖుష్దిల్ షా వ్యవహరించిన తీరుకు ఈ మేర కఠిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లింది.32 పరుగులతో టాప్ స్కోరర్గాఈ క్రమంలో మార్చి 16న కివీస్- పాక్ మధ్య తొలి టీ20 జరిగింది. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. పాకిస్తాన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చాంపియన్స్ ట్రోఫీ తాలుకు వైఫల్యాన్ని కొనసాగిస్తూ పాక్ 91 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఖుష్దిల్ షా 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక సల్మాన్ ఆఘా బృందం విధించిన 92 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఊదేసింది. ఇదిలా ఉంటే.. ఖుష్దిల్ షా తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తించాడు.అతడిని బలంగా ఢీకొట్టాడుపాక్ ఎనిమిదో ఇన్నింగ్స్‌లో కివీస్ యువ పేసర్ జకారీ ఫౌల్క్స్ బౌలింగ్‌లో వికెట్ల మధ్య పరుగులు తీసే క్రమంలో ఖుష్దిల్ షా.. ఫౌల్క్స్‌ను బలంగా ఢీకొట్టాడు. ఆ సమయంలో అతడు నిర్లక్ష్యపూరితంగా, దురుసుగా ప్రవర్తించినట్లు స్పష్టంగా కనిపించింది.ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలకు పూనుకున్న ఐసీసీ.. ఖుష్దిల్ షాకు గట్టి పనిష్మెంట్ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.12 సూచిస్తున్న నిబంధనను ఖుష్దిల్ ఉల్లంఘించాడు.అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లను, సిబ్బంది, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు.. ఎవరినైనా సరే అనుచిత రీతిలో వారికి ఇబ్బంది కలిగించేలా తాకితే కఠిన చర్యలు ఉంటాయి. అందుకు తగ్గట్లుగా ఖుష్దిల్పై చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఐసీసీ ప్రకటనలో పేర్కొంది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మూడు డీమెరిట్ పాయింట్లు చేర్చింది. తప్పును అంగీకరించిన ఆల్రౌండర్గత 24 నెలల కాలంలో ఇదే ఖుష్దిల్ మొదటి తప్పు కాబట్టి.. ఇంతటితో సరిపెట్టింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లు వేన్ నైట్స్, సామ్ నొగస్కి, థర్డ్ అంపైర్ కిమ్ కాటన్, ఫోర్త్ అంపైర్ క్రిస్ బ్రౌన్ ఫిర్యాదు ఆధారంగా ఈ మేర ఐసీసీ చర్యలు తీసుకుంది. ఖుష్దిల్ సైతం తన తప్పును అంగీకరించాడు. కాగా 30 ఏళ్ల ఖుష్దిల్ షా లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం గల బ్యాటర్. 2019లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు 15 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 328, 376 పరుగులు చేయడంతో పాటు.. నాలుగు, మూడు వికెట్లు తీశాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ అతడే.. మూడు ఫార్మాట్లలోనూ బెస్ట్: కోహ్లి -
రోహిత్... పైపైకి!
దుబాయ్: టీమిండియా కెప్టెన్ ఫైనల్లో చక్కటి ఇన్నింగ్స్‌తో భారత జట్టుకు మూడోసారి ట్రోఫీ దక్కడంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో అర్ధశతకంతో ఆకట్టుకున్న రోహిత్ రెండు ర్యాంక్‌లు మెరుగు పర్చుకొని 756 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.భారత యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (784 పాయింట్లు) ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... టాప్–10లో మొత్తం నలుగురు భారత ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో 218 పరుగులు చేసి ఆకట్టుకున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (736 పాయింట్లు) ఒక స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌లో నిలవగా... మిడిలార్డర్లో కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (704 పాయింట్లు) 8వ ర్యాంక్‌లో స్థిరంగా కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 14 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరగా... డారిల్ మిషెల్ ఒక స్థానం మెరుగు పర్చుకొని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (650 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి భారత్ తరఫున అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌లో నిలిచాడు. రవీంద్ర జడేజా (616 పాయింట్లు) కూడా మూడు స్థానాలు మెరుగు పరుచుకొని పదో ర్యాంక్‌కు చేరాడు. న్యూజిలాండ్ సారథి సాంట్నర్ (657 పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరగా... శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తీక్షణ (680 పాయింట్లు) ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా (10వ ర్యాంక్) ఒక్కడే టాప్–10లో కొనసాగుతున్నాడు. -
ఐసీసీ బీసీసీఐ ఆడమన్నట్టల్లా ఆడుతుంది.. విండీస్ దిగ్గజ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది. భారత్ దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్‌లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్‌కు దుబాయ్‌కు వెళ్లిందని గుర్తు చేశాడు. ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్‌లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు. ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు. అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు. బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్‌లను గెలిచింది. 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది. కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్‌మీడియా వేదికగా ఆరోపించాడు. అయితే ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్లో కూడా గెలిచేదని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చింది. -
వైట్ జాకెట్స్... ఈ ‘చాంపియన్స్’కే ఎందుకు!
దుబాయ్: వన్డే ప్రపంచకప్, టి20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)... అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల చాంపియన్లు అవతరిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మాత్రం ‘చాంపియన్స్ ట్రోఫీ’ విజేతలకు మాత్రమే ప్రత్యేకమైన తెలుపురంగు జాకెట్లను అందజేస్తుంది. జెంటిల్మెన్ క్రికెట్లో దర్పానికి, గొప్ప గౌరవానికి ప్రతీకగా ట్రోఫీతో పాటు జాకెట్లను ఇస్తారు. విన్నింగ్ టీమ్ సభ్యులందరూ ఈ వైట్ జాకెట్లు (white jackets) ధరించే బహుమతి ప్రదానోత్సవ వేడుకలో తెగ హంగామా చేస్తారు. 1998లో బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో నాకౌట్ టోర్నీగా మొదలైన ఈ ఈవెంట్‌ను మినీ ప్రపంచకప్‌గా అభివర్ణించేవారు. ఇక వైట్ జాకెట్ల హంగు, వేదికపై ఆర్భాటం మాత్రం 2009లో మొదలైంది. ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బబితా ఈ వైట్ జాకెట్ల రూపకర్త. మనకిది సాధారణ వైట్ సూట్లాగే కనిపిస్తుంది. కానీ ఇది ఎంతో ప్రత్యేకమైన ఇటాలియన్ వూల్‌తో తయారైంది. వినూత్న టెక్చ్సర్, స్ట్రిప్‌లు, బంగారు వర్ణ ఎంబ్రాయిడింగ్ వర్క్ చాంపియన్స్ ట్రోఫీ లోగోతో ఆ జాకెట్లకు మరిన్ని వన్నెలద్దారు డిజైనర్లు. పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చిన తాజా టోర్నీకి సంబంధించిన ఈ ప్రత్యేకమైన జాకెట్లను ఆ దేశ దిగ్గజం, మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అత్యుత్తమ టోర్నీకి నిదర్శనం. క్రికెట్ గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసింది. ఆరంభం నుంచి విశేషాదరణ చూరగొంది’ అని అన్నాడు.చదవండి: రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
ఆస్ట్రేలియా స్పిన్నర్‌కు బిగ్ రిలీఫ్..
ఆ్రస్టేలియా స్పిన్నర్ మాథ్యూ కూనెమన్ బౌలింగ్ శైలి... నిబంధనలకు అనుగుణంగానే ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. గత నెలలో శ్రీలంకతో రెండో టెస్టు సందర్భంగా కూనెమన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు అందగా... బ్రిస్బేన్ వేదికగా ఐసీసీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది.వీటిలో అతడు నిబంధనలకు లోబడే బంతులు వేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ కొనసాగించవచ్చని ఐసీసీ వెల్లడించింది. ‘కూనెమన్ బౌలింగ్ శైలి చట్టబద్ధంగానే ఉంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయవచ్చు’ అని ఐసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.దీంతో 28 ఏళ్ల కూనెమన్ బౌలింగ్ యాక్షన్‌పై కమ్ముకున్న నీలినీడలు వీడిపోయాయి. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 16 వికెట్లు పడగొట్టిన కూనెమన్... ఆస్ట్రేలియా సిరీస్ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ పరీక్ష సమయంలో క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) కూనెమన్కు పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుండగా... మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు కూనెమన్ అందుబాటులో ఉండనున్నాడు.చదవండి: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మరోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్ -
టీమిండియాపై SRH కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
-
శుబ్‌మన్ గిల్ ‘టాప్’ ర్యాంక్ పటిష్టం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ 817 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అజేయ సెంచరీ (101 నాటౌట్) చేసిన ఈ పంజాబ్ బ్యాటర్ పాకిస్తాన్‌తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్ ఖాతాలో 21 రేటింగ్ పాయింట్లు చేరాయి. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్ ఆజమ్ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్‌లో, కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. -
CT IND Vs PAK: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. కరాచీ వేదికగా కివీస్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు పాక్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో పాక్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.దీంతో కొత్త రూల్స్ ప్రకారం.. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాక్ 30-యార్డ్ సర్కిల్లో అదనపు ఫీల్డర్‌తో ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టుపైన పడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఫిర్యాదు మెరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తమ తప్పిదాన్ని రిజ్వాన్ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ కేవలం ఫైన్‌తోనే సరిపెట్టాడు.తొలి మ్యాచ్‌లో చిత్తు..కాగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 321 పరుగుల లక్ష్య చేధనలో పాక్ జట్టు 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్ష్బ్యాటర్లలో ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఓ రూర్క్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.జమాన్ దూరం..కాగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని ఇమామ్ ఉల్ హక్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్‌తో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్‌గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్‌తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్‌కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్‌లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్‌లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్‌లూ దుబాయ్‌లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్‌కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్‌లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్‌లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్‌పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్‌ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్‌లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్‌తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్‌లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్‌ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్‌ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్‌పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్‌వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్‌లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్‌లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్‌లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్‌గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్‌లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్‌ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్‌లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్‌లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్‌లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్‌ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్‌లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్‌లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్‌లో ప్రధానం కాగా...బౌలింగ్‌లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
మన ‘చాంపియన్స్’ కసరత్తు షురూ
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు. ప్రాక్టీస్‌లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్‌లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్‌కు ఉపక్రమించాడు.బ్యాటర్లు నెట్స్‌లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్‌పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్‌కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్‌లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు. -
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) వార్మప్ మ్యాచ్‌ల (Warm Up Matches) షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) ఇవాళ (ఫిబ్రవరి 13) ప్రకటించింది. ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీల మధ్యలో ఈ వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మాత్రమే ఈ వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. బిజీ షెడ్యూల్ దృష్ట్యా భారత్ వార్మప్ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ మూడు టీమ్‌లను ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరిగే మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ నేతృత్వంలోనే పాకిస్తాన్ షహీన్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 16న జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఫిబ్రవరి 17న కరాచీలో జరిగే మ్యాచ్‌లో ముహమ్మద్ హురైరా నేతృత్వంలోని పాకిస్తాన్ షాహీన్స్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అదే రోజు దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో మొహమ్మద్ హరీస్ సారథ్యంలోని పాకిస్తాన్ షాహీన్స్ న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటుంది. ఈ నాలుగు వార్మప్ మ్యాచ్‌లు డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అసలు మ్యాచ్‌లు ఫిబ్రవరి 19న మొదలవుతాయి. ఈ మెగా టోర్నీ పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరుగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.వార్మప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్లు:v ఆఫ్ఘనిస్తాన్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్ - షాదాబ్ ఖాన్ (కెప్టెన్), అబ్దుల్ ఫసీ, అరాఫత్ మిన్హాస్, హుస్సేన్ తలత్, జహందాద్ ఖాన్, కాషిఫ్ అలీ, మొహ్సిన్ రియాజ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్ ఖాన్, ముహమ్మద్ అఖ్లక్, ముహమ్మద్ ఇమ్రాన్ రంధవా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్v దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ - మొహమ్మద్ హురైరా (కెప్టెన్), అమద్ బట్, ఫైసల్ అక్రమ్, హసన్ నవాజ్, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షెహజాద్, మాజ్ సదాకత్, మెహ్రాన్ ముంతాజ్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, సాద్ ఖాన్v బంగ్లాదేశ్, ICC అకాడమీ, దుబాయ్ - మొహమ్మద్ హారిస్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్ సమద్, అలీ రజా, అజాన్ అవైస్, మహ్మద్ వసీమ్ జూనియర్, ముబాసిర్ ఖాన్, మూసా ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సుఫియాన్ మొకిమ్, ఉసామా మీర్. -
శ్రీలంకలో విజృంభించిన ఆసీస్ స్పిన్నర్‌పై ఫిర్యాదు
సిడ్నీ: శ్రీలంక పర్యటనలో విజృంభించిన ఆ్రస్టేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ (Australia Left Arm Spinner) మ్యాట్ కునేమన్ (Matthew Kuhnemann) బౌలింగ్ శైలిపై (Bowling Action) సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా కునేమన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు లోబడి లేదని అంపైర్లు సందేహాలు లేవనెత్తడంతో... ఆసీస్ స్పిన్నర్ బయోమెకానికల్ పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత మ్యాచ్ అధికారుల కునేమన్ బౌలింగ్ అంశాన్ని ఆ్రస్టేలియా జట్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో మా ప్లేయర్‌కు పూర్తి మద్దతు ఇస్తాం’ అని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2017లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన కునేమన్... ఆ్రస్టేలియా జాతీయ జట్టు తరఫున ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడి 25 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శ్రీలంతో సిరీస్‌లో 28 ఏళ్ల కునేమన్ 17.18 సగటుతో 16 వికెట్లు తీశాడు. కునేమన్ బౌలింగ్‌పై ఫిర్యాదు అందడం ఇదే తొలిసారి అని సీఏ వెల్లడించింది. ఈ నెల ఆఖర్లో బ్రిస్బేన్‌లో కునేమన్ బయోమెట్రిక్ పరీక్ష చేయించుకోనున్నాడు. అనంతరం ఫలితాలను విశ్లేషణ కోసం ఐసీసీకి పంపనున్నారు. ఒకవేళ కునేమన్ ఈ పరీక్షలో విఫలమైతే అతడిపై సస్పెన్షన్ వేటు పడగనుంది. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మరో తొమ్మిది రోజుల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు కరాచీ వేదికగా తలపడనున్నాయి. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.కాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంపైర్ల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌కు సంబంధించిన అంపైర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా వ్యవహరించన్నాడు.టీవీ అంపైర్‌గా జోయెల్ విల్సన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక ఫిబ్రవరి 23న జరగనున్న భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు పాల్ రీఫిల్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్ ఫీల్డ్ అంపైర్లగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్ అంపైర్‌గా మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ వ్యవహరించనున్నారు.ఐరెన్ లెగ్ అంపైర్ లేడు..అయితే భారత్ ఆడే గ్రూపు స్టేజి మ్యాచ్‌ల అంపైర్ జాబితాలో ఐరెన్ లెగ్ రిచర్డ్ కెటిల్‌బరో లేకపోవడం అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అతడు అంపైర్‌గా టీమిండియా అభిమానులు భావిస్తుంటారు. ముఖ్యంగా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో చాలా సార్లు అది రుజువైంది. 2014 నుంచి అతడు అంపైర్‌గా ఉన్న ఏ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించలేదు.అంపైర్ల పూర్తి జాబితాపాకిస్థాన్ vsన్యూజిలాండ్, ఫిబ్రవరి 19 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్టీవీ అంపైర్: జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్: అలెక్స్ వార్ఫ్, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్బంగ్లాదేశ్ vs భారత్, ఫిబ్రవరి 20 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, పాల్ రీఫిల్టీవీ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్: మైఖేల్ గోఫ్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 21 - కరాచీఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, రోడ్నీ టక్కర్టీవీ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, ఫోర్త్ అంపైర్: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 22 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: జోయెల్ విల్సన్, క్రిస్ గఫానీటీవీ అంపైర్: కుమార్ ధర్మసేన, ఫోర్త్ అంపైర్: అహ్సన్ రజా, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్పాకిస్థాన్ v భారత్, ఫిబ్రవరి 23 - దుబాయ్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: పాల్ రీఫిల్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ టీవీ అంపైర్: మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్: అడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీ: డేవిడ్ బూన్ బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, ఫిబ్రవరి 24 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: అహ్సన్ రజా, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: రోడ్నీ టక్కర్, ఫోర్త్ అంపైర్: జోయెల్ విల్సన్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఫిబ్రవరి 25 – రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీటీవీ అంపైర్: అలెక్స్ వార్ఫ్, ఫోర్త్ అంపైర్: కుమార్ ధర్మసేన, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, ఫిబ్రవరి 26 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, జోయెల్ విల్సన్టీవీ అంపైర్: అహ్సన్ రజా, ఫోర్త్ అంపైర్: రోడ్నీ టక్కర్, మ్యాచ్ రిఫరీ: రంజన్ మదుగల్లెపాకిస్థాన్ vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 27 - రావల్పిండిఆన్-ఫీల్డ్ అంపైర్లు: మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్స్టాక్టీవీ అంపైర్: పాల్ రీఫిల్, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిఫరీ: డేవిడ్ బూన్ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, ఫిబ్రవరి 28 - లాహోర్ఆన్-ఫీల్డ్ అంపైర్లు: అలెక్స్ వార్ఫ్, కుమార్ ధర్మసేనటీవీ అంపైర్: క్రిస్ గఫానీ, ఫోర్త్ అంపైర్: రిచర్డ్ కెటిల్‌బరో, మ్యాచ్ రిఫరీ: ఆండ్రూ పైక్రాఫ్ట్ -
IPL 2025: IPL కప్ మనదేనా?
-
ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నీ'లో త్రిష
అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి సాధించిన భారత జట్టులోని పలువురు ప్లేయర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్‌లో చోటు దక్కింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నికీ ప్రసాద్ నేతృత్వంలోని భారత అమ్మాయిల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన తెలంగాణ స్టార్ ఓపెనర్ గొంగడి త్రిష సహా మొత్తం నలుగురు భారత క్రికెటర్లకు ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో స్థానం లభించింది. త్రిష ఓపెనింగ్ భాగస్వామి కమలిని, లెఫ్టార్మ్ స్పిన్ ద్వయం వైష్ణవి శర్మ, ఆయుశి శుక్లాలు కూడా ఐసీసీ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హార్డ్ హిట్టర్ త్రిష ఈ టోర్నీ చరిత్రలోనే తొలి సెంచరీ సహా 309 పరుగులు చేసింది. లెగ్‌స్పిన్‌తో 7 వికెట్లను కూడా పడగొట్టింది. ఆమెతో జోడీగా దిగిన కమలిని 143 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కమలిని (50 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. భారత స్పిన్నర్లలో ఆయుశి 14 వికెట్లను చేజిక్కించుకోగా, వైష్ణవి 17 వికెట్లతో టోర్నీలోనే అగ్రస్థానంలో ఉంది. మలేసియాపై ‘హ్యాట్రిక్’తో ఆమె (5/5) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీ: కైలా రేనెకె (కెప్టెన్; దక్షిణాఫ్రికా), జెమ్మా బోతా (దక్షిణాఫ్రికా), త్రిష, కమలిని, ఆయుశి శుక్లా, వైష్ణవి శర్మ (భారత్), డేవినా పెరిన్, కేటీ జోన్స్ (ఇంగ్లండ్), కావొంహె బ్రే (ఆ్రస్టేలియా), చమొది ప్రబొద (శ్రీలంక), పూజ మహతో (నేపాల్), 12వ ప్లేయర్: ఎన్‌తబిసెంగ్ నిని (దక్షిణాఫ్రికా).చదవండి: అదరగొడుతున్న ‘అభి’ -
సచిన్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్‌కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్‌లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్‌లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్‌ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
మిథాలీ అడుగు జాడల్లోనే...
కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష... తన ప్రదర్శనపై దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్రభావం ఉందని వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా స్కాట్లాండ్తో ‘సూపర్ సిక్స్’ పోరులో 59 బంతులాడి అజేయంగా 110 పరుగులు చేసిన త్రిష... ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలో హైదరాబాదీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను చూసి నేర్చుకున్నానని వెల్లడించింది. 2023 మహిళల అండర్–19 ప్రపంచకప్‌తో పాటు, గతేడాది అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన త్రిష... తాజా సెంచరీని తండ్రి రామిరెడ్డికి అంకితమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ‘మిథాలీ రాజ్‌ను చూస్తూ పెరిగాను. ఆమె ఇన్నింగ్స్‌ను నిర్మించే తీరు నాకెంతో ఇష్టం. నేను కూడా అలాగే చేయాలని ఎప్పటి నుంచో అనుకునే దాన్ని. నా ఆదర్శ క్రికెటర్ మిథాలీ. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలనుకున్నా. మొత్తానికి అది స్కాట్లాండ్పై సాధ్యపడింది. తొలుత బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతా. అప్పుడే మొత్తం 20 ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసేందుకు వీలుంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడంతో ఆ అవకాశం దక్కింది. క్రీజులో ఉన్నప్పుడు వ్యక్తిగత స్కోరును పట్టించుకోను. సహచరులు సంబరాలు చేసుకునేంత వరకు సెంచరీ పూర్తి చేసుకున్నానని గుర్తించలేదు.చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సెంచరీని ఆయనకే అంకితమిస్తున్నా. అమ్మానాన్న సహకారం లేకుంటే ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు’అని త్రిష వెల్లడించింది. తాజా ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న త్రిష... వరుసగా రెండో సారి కప్పు ముద్దాడడమే తమ లక్ష్యమని పేర్కొంది. -
పాక్ ఎఫెక్ట్..? ఐసీసీ సీఈవో అలార్డీస్ రాజీనామా
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ముందర అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవో సీఈవో జెఫ్ అలార్డీస్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఇందుకు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అలార్డీస్ రాజీనామాకు ఒక కారణమని ఐసీసీ సభ్యుడొకరు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాక్‌లో కాకుండా.. దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 57 ఏళ్ల అలార్డీస్ 2012లో జనరల్ మేనేజర్‌గా ఐసీసీలో చేరాడు. 2021 నవంబరులో ఐసీసీ సీఈవోగా నియమితుడయ్యారు. మరోవైపు ఆయన తప్పుకోవడానికి గల కారణాలు ఐసీసీ పేర్కొనలేదు. అయితే సీఈవోగా అలార్డీస్ అంకితభావంతో పనిచేశాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. తదుపరి సీఈవో ఎంపిక ప్రక్రియను ఐసీసీ ప్రారంభించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టు పాక్‌లో కరాచీ, రావల్పిండిలో మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే అక్కడి స్టేడియాలు ఇంకా నిర్మాణంలోనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రతిష్టాత్మక ట్రోఫీ నిర్వహణకు పాక్ రెడీనేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు పాక్ ఎంపికపై ఐసీసీ పైనా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో అలార్డీస్ ఇప్పుడు తప్పుకోవడం గమనార్హం.మరోవైపు.. ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ & మీడియా హెడ్ క్లెయిర్ ఫర్లోంగ్‌లు వ్యక్తిగత కారణాలు చూపుతూ తమ తమ పదవుల నుంచి వైదొలిగారు. -
అరుదైన గౌరవంగా భావిస్తున్నాను.. ఈ అవార్డు వారికి అంకితం: బుమ్రా
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) 2024 సంవత్సరానికి గాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది అద్బుతమైన ప్రదర్శన చేసినందుకు బుమ్రాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరిచింది. 2024 ఏడాదిలో బుమ్రా 13 టెస్టులు ఆడి ఏకంగా 71 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఒక ఏడాది కాలంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు. అంతేకాకుండా గతేడాది అత్యధిక టెస్టు వికెట్లు తీసింది కూడా బుమ్రానే కావడం గమనార్హం.తద్వారా జో రూట్ (ఇంగ్లండ్), కమిందు మెండిస్ (శ్రీలంక), హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్)లను వెనక్కినెట్టి మరి బుమ్రా ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక అవార్డుకు ఎంపికైన తర్వాత తొలిసారి బుమ్రా స్పందించాడు. ఐసీసీ ప్రతిష్టాత్మకు అవార్డు తనకు వరించడం చాలా సంతోషంగా ఉందని జస్ప్రీత్ తెలిపాడు."ఐసీసీ పురుషుల టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక కావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. టెస్ట్ క్రికెట్ ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉండే ఫార్మాట్. అటువంటి ఫార్మాట్లో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం నాకు చాలా ప్రత్యేకం.ఈ అవార్డును నాకు మద్దతుగా నిలిచిన నా సహచరులు, కోచ్‌లు, అభిమానులకు అంకితమివ్వాలనుకుంటున్నారు. వీరిందరి సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈ నూతన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాను" అని బుమ్రా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తొలి భారత్ ఫాస్ట్ బౌలర్ బుమ్రానే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ అవార్డు అందుకున్న ఆరో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) ఈ అవార్డు అందుకున్నారు. మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 2024 ఏడాదికి గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకుంది.చదవండి: #Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ? -
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా బుమ్రా


