2026 టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. మెగా టోర్నీ స్ట్రీమింగ్ నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఆర్దిక సమస్యల కారణంగా హాట్‌స్టార్ ఈ డీల్‌ను వదులుకోనున్నట్లు సమాచారం.
జియో హాట్‌స్టార్ భారత్‌లో స్ట్రీమింగ్ హక్కుల కోసం నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని ఐసీసీతో కుదుర్చుకుంది. ఇంకా రెండేళ్లు మిగిలుండగానే హాట్‌స్టార్ ఈ డీల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఐసీసీకి అధికారిక సమాచారం కూడా ఇచ్చినట్లు జాతీయ మీడియా చెబుతుంది.
హాట్‌స్టార్ అధికారికంగా తప్పుకుంటే ఈ రెండేళ్లు స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు సోనీ పిక్చర్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
కాగా, జియో హాట్‌స్టార్ స్పోర్ట్స్ కాంట్రాక్టుల కారణంగా గత రెండేళ్లుగా భారీ నష్టాలను చవి చూస్తున్నట్లు తెలుస్తుంది. భారత ప్రభుత్వం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో ప్రకటనదారులు కరువు కావడం ఇందుకు ఓ కారణంగా తెలుస్తుంది.
దీని వల్ల $840 మిలియన్ లోటు ఏర్పడిందని అంచనా. దీనికి తోడు డాలర్ రేటు కూడా పెరగడం హాట్‌స్టార్‌పై అదనపు భారం పడేలా చేసిందని సమాచారం.
ఒకవేళ హాట్‌స్టార్ వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి తప్పుకుంటే భారతలో క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లులు పడటం ఖాయం. మెగా టోర్నీలో మ్యాచ్‌లు వీక్షించేందుకు డబ్బులు చెల్లించి కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, 2026 టీ20 వరల్డ్‌కప్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగునున్న విషయం తెలిసిందే.


