సుధీర్‌బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘జటాధర’ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ అయింది. సుధీర్‌బాబు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం అతని కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నలిచిపోయింది.
సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జటాధర’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్‌లో(amazon prime video) స్ట్రీమింగ్ అవుతుంది. ధన పిశాచి కాన్సెప్ట్‌తో సాగిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం.

‘జటాధర’ కథేంటి..?
శివ(సుధీర్ బాబు) దెయ్యాలు ఉన్నాయని నమ్మని ఓ ఘోస్ట్ హంటర్. సైన్స్‌ని మాత్రమే నమ్ముతూ.. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరిగిన చోటికి వెళ్లి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులకు(ఝాన్సీ, రాజీవ్ కనకాల) ఈ విషయం తెలియదు. ఓ రోజు ప్రముఖ ఘోస్ట్ హంటర్ మణిశర్మ(అవసరాల శ్రీనివాస్) అసిస్టెంట్ అంకిత్ అనుమానాస్పదంగా మరణించడంతో.. శివ రుద్రారం అనే గ్రామానికి వెళ్తాడు. ఈ విషయం అతని తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతారు. ఆ గ్రామానికి వెళ్లకూడదంటూ శివ గతం గురించి చెబుతారు.
శివ గతం ఏంటి? రుద్రారం గ్రామానికి, అతనికి ఉన్న సంబంధం ఏంటి? ధన పిశాచి(సోనాక్షి సిన్హా) ఆ గ్రామంలోనే ఎందుకు తిష్ట వేసింది? ధన పిశాచి వల్ల శివ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఏంటి? తన పేరెంట్స్ ఆత్మలకు శాంతి కలిగించేందుకు శివ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ సినిమాలో శిల్పా శిరోద్కర్ పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

జియోహాట్‌స్టార్‌లో 'డీయస్ ఈరే'
మలాయళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ నటించిన 'డీయస్ ఈరే' అనే హారర్ చిత్రం కూడా డిసెంబర్ 5న ఓటీటీలోకి వచ్చేసింది. 'భూతకాలం', 'భ్రమయుగం' తదితర మూవీస్‌తో ప్రేక్షకుల్ని భయపెట్టిన రాహుల్ సదాశివన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబరు 31న మలయాళంలో, నవంబరు 7న తెలుగు వెర్షన్.. థియేటర్లలో రిలీజైంది. ఓవరాల్‌గా రూ.80 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. జియోహాట్‌స్టార్‌లో(jiohotstar) తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. మీరు హారర్ మూవీ లవర్స్ అయితే గనుక దీన్ని అస్సలు మిస్ చేయొద్దు. చిల్ మూమెంట్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉంటాయి.


