కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ అందర్నీ తనవైపు తిప్పుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకలోకాన్ని మెప్పించిన ఈ బ్యూటీ తర్వాత మాత్రం ఆ క్రేజ్‌ను కాపాడుకోలేకపోయింది. అలా తెలుగు తెరకు నెమ్మదిగా దూరమైంది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది.
సెలక్టివ్‌గా ముందుకెళ్తున్నా!
ఇటీవలే మహారాణి వెబ్ సిరీస్ నాలుగో సీజన్‌లో కనువిందు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకుల దృష్టి కోణం నుంచి ఆలోచించే కథలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్తోంది. ఇంకా మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నాను. అలా అని వచ్చిన అవకాశాలన్నింటికీ ఓకే చెప్పడం లేదు. చాలా సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటున్నాను.
భయం లేదు
అందుకే జనాలకు నాపై ఓ నమ్మకం ఉంది. అంత జాగ్రత్తగా పాత్రలు సెలక్ట్ చేసుకుంటున్నాను. కానీ, భవిష్యత్తులో నా ఎంపిక తప్పవొచ్చేమో! చెప్పలేం. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్తాను. ప్రయోగాలు చేయడానికి నాకేమాత్రం భయం లేదు. కానీ, అవకాశాలకు నో చెప్పడానికి మాత్రం అస్సలు భయపడను.
అవన్నీ రిజెక్ట్
నిజం చెప్పాలంటే నాకు వచ్చే 10 ప్రాజెక్టుల్లో తొమ్మింటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాను. దానివల్ల నేను ఆరు నెలలు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మరేం పర్లేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నా జీవితంలో పెద్దగా ఖర్చులంటూ ఏమీ ఉండవు. పెద్దగా పార్టీలకు కూడా వెళ్లను. కాబట్టి ఇదంతా నాకు పెద్ద విషయమే కాదు అని శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) చెప్పుకొచ్చింది.
చదవండి: శంకర్ సినిమాలో హీరో సూర్య


