టికెట్ టు ఫినాలే రేస్‌లో ఒక్కొక్కరూ అవుట్ అవుతూ రాగా చివరకు భరణి, సుమన్, పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ మిగిలారు. మరి వీరిలో ఎవరు గేమ్స్‌లో పాల్గొన్నారు. ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? అనేది గురువారం (డిసెంబర్ 4వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
కల్యాణ్ విన్నర్
మొదటగా కలర్ గేమ్ ఛాలెంజ్‌లో భరణి, రీతూ, కల్యాణ్ ఆడారు. ఈ ఆటలో రీతూ గెలిచింది. అయితే రీతూ పూసిన పసుపు కలర్ ఎక్కువగా ఉన్నప్పటికీ తనూజ.. రెడ్ కలర్ ఎక్కువగా ఉదంటూ కల్యాణ్‌ను విన్నర్‌గా ప్రకటించింది. అతడు తన ప్రత్యర్థిగా సుమన్‌ను ఎంచుకున్నాడు. వీరికి వస్తువులు పగలగొట్టే గేమ్ ఇచ్చారు. త్రాసులో ఎవరి వస్తువులు ఎక్కువ బరువుంటే వారే గెలిచినట్లు!
టార్గెట్ భరణి
ఈ ఆటలో కల్యాణ్ గెలవడంతో సుమన్ రేసు నుంచి అవుట్ అయ్యాడు. ఇమ్మూ, రీతూ, కల్యాణ్.. కలిసి భరణిని టార్గెట్ చేశారు. ఇమ్మూ, కల్యాణ్.. రీతూను గెలిపించి.. ఆమె భరణితో పోటీపడేలా ప్లాన్ చేశారు. వీళ్ల ప్లాన్ తిప్పికొట్టేందుకు బిగ్‌బాస్ బ్యాలెన్స్ గేమ్ ఇచ్చాడు. అయినా బిగ్‌బాస్‌నే బురిడీ కొట్టించారిద్దరూ. ఈ గేమ్‌లో కల్యాణ్, ఇమ్మూ, రీతూ స్టిక్స్ పట్టుకుంటే దానిపై హౌస్‌మేట్స్ కాయిన్స్ పెట్టాల్సి ఉంటుంది.
ఫస్ట్ ఫైనలిస్ట్ అతడేనా?
ఇమ్మూ, కల్యాణ్ ముందుగా అనుకున్నట్లుగానే ఓడిపోవడంతో రీతూ గెలిచింది. రీతూ.. భరణిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. వీరికి ట్రయాంగిల్- స్క్వేర్ అంటూ ఓ గేమ్ పెట్టారు. సంజనా సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రీతూ గెలిచింది. అయితే తనూజ మాత్రం.. రీతూ పెట్టిన ఓ ట్రయాంగిల్ సరిగా లేదని చెప్తుండగా ఎపిసోడ్ ముగిసింది. అదే నిజమైతే భరణికి అన్యాయం జరిగినట్లే!


