టికెట్ టు ఫినాలే ఎలాగైనా కొట్టాల్సిందే అన్న కసితో ఆడుతున్నారు హౌస్‌మేట్స్. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ గేమ్స్ గెలిచి అందరికంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తనూజ సుమన్‌తో పోటీపడింది. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇది బ్యాలెన్స్ గేమ్.
తనూజకు సపోర్ట్ చేయని భరణి
హౌస్‌మేట్స్ ఎవరిని రేసులో నుంచి తొలగించాలనుకుంటారో వారి ట్యాప్ తిప్పి ట్యాంకులో నీళ్లు నింపాల్సి ఉంటుంది. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ.. తనూజకు సపోర్ట్ చేయగా భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ఈ గేమ్‌లో తనూజపై సుమన్ పైచేయి సాధించాడు. దీంతో తనూజ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయింది.
రేసు నుంచి అవుట్
ఈ ఓటమిని తట్టుకోలేక తనూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక మరో గేమ్‌లో డిమాన్ పవన్ గెలవగా.. భరణితో తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భరణి గెలిచి పవన్‌ను రేసు నుంచి తప్పించాడని తెలుస్తోంది. ఇలా మలుపులు తిరుగుతూ పోతున్న ఈ ఆటలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ (Bigg Boss Telugu 9) అవుతారో చూడాలి!
చదవండి: రీతూ పరువు తీసిన బిగ్‌బాస్


