ఈ సీజన్‌లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్ 2వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
రీతూ ఒకటే గొడవ
కంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పారు. ఫస్ట్ గేమ్‌లో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్ గేమ్ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.

పరువు పాయే
అలా ఇమ్మూ, కల్యాణ్, రీతూ.. మొదటి గేమ్ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్ టేబుల్ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్ విజేతగా నిలిచాడు.
సంజనా ఔట్
తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజనా (Sanjana Galrani)తో బాల్స్ గేమ్ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్ పవన్ తలపడ్డారు. ఫిజికల్ అవుతున్నావ్, ఫిజికల్ అవుతున్నావ్ అని తనూజ పదేపదే అనేసరికి పవన్ కాస్త సైలెంట్ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్ కోసం సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లోనూ తనూజయే గెలిచినట్లు తెలుస్తోంది.


