breaking news
Thanuja Puttaswamy
-
ఎన్నిసార్లు అనుకున్నానో.. ఇన్నాళ్లకు కుదిరింది: రీతూ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్ ఉన్నారు. వాళ్లే రీతూ చౌదరి, తనూజ పుట్టస్వామి. తనపై మాటలదాడికి దిగినవారికి కౌంటర్స్ ఇవ్వడంలో రీతూ దిట్ట అయితే టాస్క్స్ ఆడటంలో, మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడంలో తనూజ దిట్ట. వీళ్లిద్దరి స్నేహం చూస్తుంటే ప్రేక్షకులకు భలే ముచ్చట వేసేది. ఫ్రెండ్‌తో ఎంజాయ్సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా బిగ్‌బాస్ హౌస్‌లో ఒకరికోసం ఒకరు నిలబడ్డారు. నిజమైన మిత్రులు అనిపించుకున్నారు. ఇకపోతే షో అయిపోయి కొన్ని నెలలు కావొస్తుండగా తాజాగా తొలిసారి ఈ మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ఫిబ్రవరి 16 రాత్రి షాపింగ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ లాగిస్తూ, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను రీతూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎన్నిసార్లు అనుకున్నామో!బిగ్‌బాస్ అయిపోయాక ఒకసారి బయటకు వెళ్లి ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ కాలక్షేపం చేయాలని షోలో ఉండగానే అనుకున్నాం. చాలాసార్లు ఇలాంటి ప్లాన్స్ వేసుకున్నాం. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. మేమిద్దరం కలుసుకున్నాం. నవ్వుకున్నాం, మనసారా మాట్లాడుకున్నాం, ఆనందంగా గడిపాం. ఇది నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) చదవండి: -
Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..
-
నరకం అనుభవిస్తున్నా.. దయచేసి వదిలేయండి: తనూజ
బిగ్‌బాస్ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన అయిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్‌పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్‌బాస్ 7 రన్నరప్ , నటి తనూజ పుట్టస్వామి.ఎవరి జీవితాల్లో వారు బిజీఈ మేరకు తనూజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం.పీఆర్ టీమ్ లేదుప్రతిదానికి పీఆర్(డబ్బులు పెట్టి ఒక టీమ్ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్ టీమ్ అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపై తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకర్ని టార్గెట్ చేశానని, ఒకర్ని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నరకం అనుభవిస్తున్నా..అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్‌ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా క్యారెక్టర్‌ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! గుండె నిండా బాధనన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయి. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్లను? ఎవరితో పంచుకోను? అందుకే.. మౌనాన్ని ఆశ్రయించాను. నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడదీసుకునేందుకు నిశ్శబ్ధంగా ఉంటున్నాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? మానసికంగా చిత్రవధఅసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్‌గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా చిత్రవధ చేస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవర్నీ కిందకు లాగాలనుకోవడం లేదు. డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. మరి ఇకమీదటైనా ఈ ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి!తనూజ వర్సెస్ కల్యాణ్బిగ్బాస్ 7 షోలో తనూజ, పవన్ కల్యాణ్ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని ఎప్పుడూ తగువులాడేవారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్‌ను విమర్శించేవాళ్లు! చివరకు కల్యాణ్ ట్రోఫీ గెలవడంతో తనూజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనూజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్ చేశారు.చదవండి: ఈ వారం ఓటీటీలో సంక్రాంతి సినిమాలు.. డోంట్ మిస్ -
తండ్రితో బిగ్‌బాస్ 'తనూజ'.. ఫోటో గిఫ్ట్‌తో సర్ప్రైజ్
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో తనూజ, కల్యాణ్ పడాల జోడీకి అభిమానులు భారీగానే ఉన్నారు. అందుకే వారిద్దరూ మరోసారి ఏదైనా ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా స్టార్‌మా ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. 'మా సంక్రాంతి వేడుక' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సందడి చేశారు. జనవరి 14న మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. తాజాగా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.తనూజకు ఫోటో గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదని, అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడరని ఆమె బాధ పడింది. బిగ్‌బాస్ ఫైనల్ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది. కానీ, ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ, ఆమె ఫ్యాన్స్ AI ఫోటోతో సర్ప్రైజ్ చేశారు. తనూజ తన తండ్రి పుట్టస్వామితో ఉన్న ఫోటోను చక్కగా ఫ్రేమ్ చేసి గిఫ్ట్‌గా ఫ్యాన్స్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. -
తొలిసారి ఒకే వేదికపై 'తనూజ, కల్యాణ్'.. వీడియో వైరల్
బిగ్‌బాస్ తెలుగు 9 విన్నర్ కల్యాణ్ పడాల, రన్నర్ తనూజ మరోసారి ఒక వేదికపై కలిశారు. ఈ సీజన్లో వీరిద్దరి ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.. హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇరువురి అభిమానులు మాత్రం బూతులతో రెచ్చిపోయారు. అయితే, ఈ సీజన్ ముగిసిన తర్వాత తనూజ ఎలాంటి ఈవెంట్లో కనిపించలేదు. తొలిసారిగా స్టార్‌మా కోసం 'మా సంక్రాంతి వేడుక' కార్యక్రమంలో పాల్గొంది. వీరద్దరూ కలిసి 'ఛాంపియన్' సినిమాలోని 'గిర గిర గింగిరాగిరే' అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమం జనవరి 14న మధ్యాహ్నం 12కు ప్రసారం కానుంది. ఈ క్రమంలో తాజాగా ప్రోమోను వదిలారు. దీంతో నెట్టింట వారిద్దరూ వైరల్ అవుతున్నారు. -
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.చిన్నారులతో సరదాగాఅందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.మధురమైన జ్ఞాపకంవాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్ -
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్‌బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
టాప్ 2లో నా పక్కన ఇమ్మూ... తనూజతో ఆ బాండ్ లేదు!
అగ్నిపరీక్షలో కల్యాణ్ అందరికీ నచ్చాడు. కానీ బిగ్‌బాస్ 9వ సీజన్ ప్రారంభంలో ఎవరికీ నచ్చలేదు. కారణం.. ఆట పక్కనపెట్టి అమ్మాయిలపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగార్జున కూడా అతడి తీరును ఎండగట్టాడు. ఇక ప్రియ, శ్రీజ ఎలిమినేషన్ తర్వాత కల్యాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్‌లా మారి అన్నీ చూసుకుంది తనూజ. అతడి కోసం గేమ్స్‌లో కలబడింది, నిలబడింది.కల్యాణ్ కోసం నిలబడ్డ తనూజటికెట్ టు ఫినాలేలో ఇమ్మాన్యుయేల్‌ను పక్కనపెట్టి కల్యాణ్‌కే సపోర్ట్ చేసింది. అతడినెవరైనా టార్గెట్ చేస్తే వాళ్లను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి మరీ కల్యాణ్ కోసం టవర్ గేమ్‌లో చేయి నొప్పిని లెక్కచేయకుండా కష్టపడి ఆడింది. చాలా గేమ్స్‌లో అతడికే ప్రాధాన్యత ఇచ్చింది. కేవలం టాస్కులపరంగానే కాకుండా మాటలతోనూ సపోర్ట్ చేసింది. అతడి గెలుపును తన విజయంలా భావించి ఎన్నోసార్లు సంతోషించింది.చివరి ప్రాధాన్యతబిగ్బాస్ ఫినాలే స్టేజీపై కూడా కల్యాణ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే ముందుగా ప్రియ, శ్రీజకు ప్రాధాన్యం ఇచ్చాడు. చివరగా తనూజ గురించి మాట్లాడుతూ.. కల్యాణ్గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించిందే తనూజ అని ఒప్పుకుంటున్నా అని అందరిముందు చెప్పాడు. కానీ, బిగ్‌బాస్ బజ్‌లో, బయట ఇంటర్వ్యూలలో మాత్రం మాట మార్చాడు. టాప్ 2లో ఇమ్మూ..బజ్‌లో మాట్లాడుతూ.. ఫైనల్స్‌లో స్టేజీపై నా పక్కన ఇమ్మూ అన్న ఉంటాడనుకున్నాను. తనకు ఎక్కువ ఓట్లు వస్తాయనుకున్నా.. అయినా ప్రేక్షకులు ఎవరివైపు ఉన్నారన్నది మనకు తెలిదు. తను నాలా ఆలోచిస్తాడు, నాకు, ఇమ్మూ అన్నకు మధ్య బాండింగ్ బాగుంటుంది. మళ్లీ తనూజ, నాకు మధ్య ఆ బాండింగ్ లేదు అన్నాడు. మరో ఇంటర్వ్యూలో.. తనూజ గేమ్ పరంగా సపోర్ట్ ఇవ్వలేదు, ఉట్టి మాటలతోనే సపోర్ట్ చేసిందన్నాడు.బాగానే డ్రామాలు చేస్తున్నావ్..ఇది చూసిన తనూజ అభిమానులు కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తనూజ నీ పక్కన లేకపోతే స్క్రీన్‌స్పేస్ కూడా దక్కేది కాదంటున్నారు. ఫ్రెండ్స్‌ను, నాన్న(భరణి)ని పక్కనపెట్టి మరీ నీకు కెప్టెన్సీ, టికెట్ టు ఫినాలేలో సపోర్ట్ చేస్తే కనీస కృతజ్ఞత లేదంటూ తిట్టిపోస్తున్నారు. క్రెడిట్ తనూజకు ఇవ్వొద్దని శ్రీజ ఏమైనా చెప్పిందా? అందుకే ఇలా మాట మార్చేశావా? అని అడుగుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన కల్యాణ్.. వెంటనే మెట్టు దిగొచ్చాడు. టికెట్ టు ఫినాలేలో తనూజ తనకోసం ఆడిందని చెప్పాడు. అయినప్పటికీ తనూజ ఫ్యాన్స్ శాంతించలేదు. ఒక్కోదగ్గర ఒక్కో మాట మాట్లాడుతూ బాగానే డ్రామాలు చేస్తున్నావ్.. అని మండిపడుతున్నారు. -
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్‌పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్‌లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్‌లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్‌పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్‌లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
బిగ్‌బాస్ ఓటమి తర్వాత తనూజ ఫస్ట్ పోస్ట్
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ హోరాహోరీగా జరిగింది. అసలు సిసలైన పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరిగింది. ఇద్దరికీ భారీగా ఓట్లు పడ్డాయి. చాలా తక్కువ పర్సంటేజ్‌తో తనూజ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓటమి తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టింది.అందులో ఏం రాసిందంటే..బిగ్‌బాస్ సీజన్‌కు 9కి థాంక్స్.. ఈ జర్నీ అంత ఈజీ కాదు. కానీ బిగ్‌బాస్ ఇంటి లోపల నేనెన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను, కిందపడ్డాను. తిరిగి లేచి నిల్చున్నాను. ప్రతిసారి బలంగా నిలబడ్డాను. ప్రతి టాస్కు నిజాయితీగా ఆడాను. నాకెదురైన సవాళ్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎంత కఠినంగా మారినా సరే నేను నాలాగే ఉన్నాను. మీ ప్రేమే నా నిశ్శబ్ధాన్ని శక్తిగా మార్చింది. అదే అతిపెద్దక్సెస్మీరు వేసిన ఓట్లే నా గొంతుకగా వినిపించాయి. మీరు నాపై పెట్టుకున్న నమ్మకమే అతి పెద్ద విజయం. ఈరోజు నేను బిగ్‌బాస్ హౌస్‌ను వీడానేమో కానీ.. దీనిద్వారా మీతో ఏర్పరుచుకున్న బంధాన్ని మాత్రం జీవితాంతం కొనసాగిస్తాను. ఇది ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ప్రారంభం. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. గుణపాఠం నేర్చుకున్నా..మీ ప్రేమాభిమానాలు చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ జర్నీలో నేను ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, ప్రేమను కూడబెట్టుకున్నాను. మీ ప్రతి ఓటు, మీ సపోర్ట్, నాకోసం చేసిన ప్రార్థనలు అన్నీ కూడా నాకెంతో విలువైనవి.నిజమైన ఫైటర్మీలో ఒకరిగా హౌస్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు మీ అందరినీ నా మనసులో నింపుకుని బయటకు వచ్చేశాను. బిగ్‌బాస్ 9కి ముగింపు పలుకుతున్నాను అని తనూజ (Thanuja Puattaswamy) రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు నిజమైన ఫైటర్‌వి అని కొనియాడుతున్నారు. నీ జర్నీతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేశావు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Thanuja Puttaswamy (@thanuja_puttaswamy_) -
లేడీ సెలబ్రిటీలు తస్మాత్ జాగ్రత్త.. మీ గతి కూడా ఇంతే!
అనుకుంటే అయిపోద్ది సామీ అంటుంటారు. అనుకోవడమే కాదు, గెలుపు కోసం అలుపెరగకుండా కష్టపడినా సరే లేడీ కంటెస్టెంట్లు విన్నర్ కాలేకపోతున్నారు. తెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు ఇదే తంతు. పోనీ విన్నర్ క్వాలిటీస్ ఉన్న బలమైన కంటెస్టెంట్లు రాలేదా? అంటే అది తప్పుమాటే అవుతుంది.గీతామాధురి, శ్రీముఖి, తనూజ.. వీళ్లంతా బలంగా నిలబడ్డవాళ్లే.. గొంతెత్తి ప్రశ్నించినవాళ్లే! గెలుపు కోసం నిరంతరం శ్రమించినవాళ్లే! కానీ ఏం లాభం? విజయం వాకిటవరకు వచ్చి వెనక్కు వెళ్లిపోతున్నారు, కాదు కాదు ప్రేక్షకులే వాళ్లను కర్కశంగా వెనక్కు పంపించేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాబోయే సీజన్స్‌లో అయినా బిగ్‌బాస్ ట్రోఫీని ఒక మహిళ గెలుస్తుందా? అన్న సందేహం తలెత్తక మానదు.సింపతీకే ఓటుతెలుగు బిగ్‌బాస్ మొదటి సీజన్లో కామెడీతో నవ్వించి, టాస్కులతో అదరగొట్టి చలాకీగా, హుషారుగా కనిపించిన హరితేజ సెకండ్ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి సీజన్లో గాత్ర మాధుర్యంతో మెప్పించింది గీతామాధురి. అంతేనా.. చాలా మెచ్యూర్డ్‌గా, బ్యాలెన్స్డ్గా ఆడుతూ కౌశల్‌కు గట్టి పోటీనిచ్చింది. ప్రేక్షకులు ఆమె మాటతీరుకు మురిసిపోయారు.. కానీ ట్రోఫీ ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. సింపతీ, సెంటిమెంట్‌తో కొట్టిన కౌశల్‌కు టైటిల్ కట్టబెట్టారు. దీంతో గీతా రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది.పోరాడినా ఫలితం దక్కలేదుమూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టగానే విన్నర్ నడిచొస్తుందనుకున్నారు. బిగ్‌బాస్ కోసం ఆమె చేతిపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. బయట ఎంత చలాకీగా ఉందో.. హౌస్‌లోనూ అంతే చలాకీగా ఉంది. కామెడీ చేస్తూ టాస్కులు ఆడుతూ తనవల్ల అయినంతవరకు పోరాడింది. అయినా జనాలకు ఆమెను గెలిపించబుద్ధి కాలేదు. సింగర్ రాహుల్ ట్రోఫీ గెలవగా శ్రీముఖి రన్నరప్ స్థానానికి పరిమితమైంది.ఇన్నాళ్లకు సరైన కంటెస్టెంట్!ఆ తర్వాత ట్రోఫీని గెలిచేంత బలమైన కంటెస్టెంట్లు ఎవరూ హౌస్‌కి రాలేదు. దాదాపు ఆరు సీజన్ల తర్వాత మళ్లీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అడుగుపెట్టింది. తనే తనూజ పుట్టస్వామి. అందంతో పాటు తెలివి ఆమె సొంతం. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు ప్రేక్షకులకు గుండెలో గుడి కట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా వీరి వల్లే ఇక్కడున్నానని పదేపదే నొక్కి చెప్పింది. తెలుగు ప్రేక్షకులను తన సెకండ్ ఫ్యామిలీగా భావించింది.ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..మొదటి రోజు నుంచే మాస్క్ లేకుండా తను తనలాగే ఉంది. కోపం, చిరాకు, అసహనం, బాధ, కన్నీళ్లు, అలక.. అన్నీ చూపించింది. వేటినీ దాచుకోలేదు. బంధాలకు పెద్దపీట వేసింది. అదే సమయంలో అబ్బాయిలకు ఎక్కువ చనువు ఇవ్వకుండా హద్దుల్లో పెట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా పద్ధతైన సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపించింది. ఏ ఆటైనా ఆడతానని ముందుకు వచ్చింది. సీజన్ విజయానికి కారకురాలుఓడినా సరే గెలిచేవరకు శ్రమించింది. డబుల్ ఫేస్ లేకుండా అద్దంలా స్వచ్ఛంగా తనేంటో చూపించింది. మాస్టర్‌మైండ్‌తో ఆటను తిప్పింది. తెలుగు బిగ్‌బాస్ 9 విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. తను లేకపోతే ఈ సీజనే లేదు అన్నంతగా ప్రభావితం చేసింది. అయినా తనను విజయం వరించలేదు. ఇది తనూజ అభిమానులకే కాదు, ఎంతోమంది నెటిజన్లకు సైతం నచ్చలేదు. సీజన్ 9ను తన భుజాలపై మోసిన తనూజకు అన్యాయం జరిగిందంటున్నారు. లేడీ సెలబ్రిటీలు జాగ్రత్తఅమ్మాయిలను విజేతగా చూడటం మన జనాలకు నచ్చదా? ఇంకేం చేస్తే వారిని గెలిపిస్తారు? అసలు ఇంతకంటే ఇంకేం చేయగలరు? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇకముందు రాబోయే లేడీ సెలబ్రిటీలను సైతం హెచ్చరిస్తున్నారు. టీఆర్పీ కోసం మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ట్రోఫీ మాత్రం ఇవ్వరని.. అది దృష్టిలో పెట్టుకుని షోకి రావాలా? వద్దా? అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్తున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ (ఓటీటీ సీజన్లో బిందుమాధవి గెలిచింది) మినహా తొమ్మిది సీజన్లలో ఒక్క లేడీ విన్నర్ లేకపోవడం నిజంగా విచారకరమే! -
కల్యాణ్ పడాల విజయంలో 'లేడీ క్వీన్'
బిగ్‌బాస్ సీజన్-9 గ్రాండ్ ఫైనల్లో తనూజ, కల్యాణ్‌లు చరిత్ర తిరగ రాశారు. ఫైనల్ వరకు చేరుకున్న వారిద్దరూ హౌస్‌లో మంచి బాండింగ్‌తో ఉంటూనే రేసులో ఉన్నారు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ విజేతగా నిలవడం గొప్ప విషయమేనని చెప్పాలి. సీజన్-7లో కూడా శివాజీ, పల్లవి ప్రశాంత్‌లు కూడా ఇలాంటి బాండింగ్‌నే కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ విజయంలో శివాజీ పాత్ర ఎంత కీలకమో తెలిసిందే.. అయితే, కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా అంతే రేంజ్లో ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇదే పాయింట్‌ను కల్యాణ్ కూడా స్టేజీపైనే ఒప్పుకున్నాడు. తన గెలుపులో ఆత్మవిశ్వాసం నింపిన వారిలో ఫస్ట్ ప్రియ, సెకండ్ శ్రీజ ఉంటారని చెబుతూ.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లేడీ క్వీన్ తనూజకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పడం విశేషం. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ ఇలా చెప్పాడు. ' ఈ స్టేజ్ మీద నుంచి చెప్తున్నా ఒకానొక సందర్భంలో కల్యాణ్ గాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పంపించింది తనూజానే.. నేను ఒప్పుకుంటా అది.." అంటూ క్లారిటీ ఇచ్చాడు.బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా చాలామంది ఇదే మాట చెప్పడం విశేషం. బిగ్‌బాస్ సీజన్-7లో కూడా ఇలాంటి మ్యాజిక్‌నే జరిగింది. పల్లవి ప్రశాంత్ కోసం శివాజీ చాలా బలంగా నిలిచారు. తను 2వ రన్నర్‌గా నిలిచినప్పటికీ ఎలాంటి బాధను చూపలేదు. హౌస్‌లో ప్రతిచోట పల్లవి ప్రశాంత్ కోసం స్టాండ్ తీసుకుంటూ తన గెలుపు కోసం రోడ్ క్లియర్ చేశారు. ఫైనల్‌గా అమర్‌దీప్‌కు ట్రోఫీ అందుతుందని అందరూ అనుకుంటే శివాజీ గేమ్ స్ట్రాటజీ వల్ల ప్రశాంత్ సులువుగా విన్నర్ అయిపోయాడు. అయితే, ఈ సీజన్లో కూడా తనూజ వరుసగా పదివారాల పాటు టాప్‌లో ఉంది. 11వ వారం నుంచి ఒక్కసారిగా కల్యాణ్ రేసులోకి వచ్చేశాడు. అందుకు కారణం తనూజానే అని తను కూడా పలుమార్లు చెప్పాడు. తన గెలుపు కోసం తనూజ ఇచ్చిన సలహాలు చాలా వున్నాయని కల్యాణ్ ఒప్పుకోవడం విశేషం.#KalyanPadala acknowledging his Sisters- Priya SrijaMentor- ThanujaThis is who he isHe never forgets to show gratitude ❤️❣️Thanks Kalyan for proving the Haters that we supported right person#BiggBossTelugu9pic.twitter.com/lMkB9P4qO1— Jeeva S (@JeevaS4853) December 21, 2025 -
బిగ్‌బాస్-9 విజేతగా కల్యాణ్.. ట్రోఫీతో ఎక్స్ కంటెస్టెంట్స్ (ఫోటోలు)
-
ఇది సార్ తనూజ బ్రాండు! ఎంత సంపాదించిందంటే?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న ముఖం తనూజ పుట్టస్వామి. సీరియల్ నటిగా అందరికీ తను సుపరిచితురాలే! ఆమె హౌస్‌లో అడుగుపెట్టినప్పుడే విన్నర్ కదిలిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అరుపులు, కేకలు, ఏడుపులు చూసి ఈమేంట్రా బాబూ ఇలా ఉందని తల పట్టుకున్నారు. రానురానూ అవన్నీ తన ఎమోషన్స్ అని, తను నటించకుండా తనలాగే ఉందని జనాలు పసిగట్టారు. మనింటి అమ్మాయిఇంట్లో అమ్మలా వండిపెట్టడం, అక్కలా ఆజమాయిషీ చేయడం, చెల్లిలా అల్లరి చేయడం, అన్నింట్లో తానే ఆడతానంటూ ముందుకు రావడం, అలగడం.. ఇవన్నీ జనాలకు కనెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ సెన్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఎప్పుడూ పద్ధతిగానే కనిపించేది. కొన్నిసార్లు మోడ్రన్ దుస్తులు వేసుకున్నా ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. అబ్బాయిలను హద్దుల్లో ఉంచుతుంది.ఫ్రెండ్ కోసం స్టాండ్అతి చనువుకు, లవ్ ట్రాక్‌కు ఛాన్సివ్వలేదు. అదే సమయంలో సెలబ్రిటీ అన్న గర్వం చూపించకుండా అందరితో ఇట్టే కలిసిపోయింది. స్నేహితుడిగా భావించిన కల్యాణ్ క్యారెక్టర్‌ను వక్రీకరించినప్పుడు అండగా నిలబడింది. తానే తప్పూ చేయలేదని అడ్డంగా వాదించింది. ఫ్రెండ్ రీతూని సేవ్ చేసి తనకు అండగా నిల్చుంది. ఇలా తను ఇష్టపడేవారికి తోడుగా ఉంది. తనలో ఉన్న ఓ గొప్ప లక్షణం. ఎంతటి శత్రువునైనా మిత్రువుని చేసుకుంటుంది. శత్రువు కూడా మిత్రువే!వైల్డ్‌కార్డ్‌గా వచ్చిన మాధురి, ఆయేషా.. తనూజపై నిప్పులు చెరిగి తొక్కేయాలని చూశారు. కానీ చివరకు తనూజ చేతిలో మాధురి పూర్తిగా బెండ్ అయిపోయింది. ఆయేషా ఫ్రెండ్ అయిపోయింది. భరణి నాన్నతో బంధం, మధ్యలో దివ్య రాక.. గొడవలు, దూరం.. వీటన్నింటివల్ల నలిగిపోయినా తిరిగి నిలదొక్కుకుంది.గెలిచేవరకు పోరాటంఅవసరమైనప్పుడు తనూజ అందరి సపోర్ట్ తీసుకున్న మాట వాస్తవం. కానీ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మిగతావారి సపోర్ట్ తీసుకున్నారు. అయితే తనూజనే ఎక్కువ హైలైట్ చేశారు.. షో మొదలైనప్పటినుంచి తనూజ చుట్టూనే గేమ్ అంతా సాగిందని బిగ్‌బాసే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆమె ఎన్నోసార్లు మైండ్ గేమ్ ఆడింది. ఇమ్మాన్యుయేల్‌తో సమానంగా ఈ సీజన్‌ను తన భుజాలపై మోసింది. చాలా టాస్కుల్లో చివరి వరకు వచ్చి ఓడిపోయేది. అయినా గెలిచేవరకు పోరాడతా అన్న కసితో ముందడుగు వేసేది. పారితోషికం ఎంత?ఎవరితో గొడవలు జరిగినా సరే.. వాళ్ల గురించి చెడుగా మాట్లాడటం.. వెనకాల గోతులు తవ్వడమనే పనులు ఏరోజూ చేయలేదు. కానీ తనపై సోషల్ మీడియాలో ఎక్కడలేని నెగెటివిటీ.. ఫలితంగా టాప్ 2లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పోరాడి ఓడినా తలెత్తుకుని సగర్వంగా బయటకు వచ్చింది. తనూజ వారానికి రూ.2.50 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 వెనకేసింది.చదవండి: తెలుగు బిగ్‌బాస్‌లో చరిత్ర సృష్టించిన కల్యాణ్ -
బిగ్‌బాస్-9 ఫైనల్.. విన్నర్‌గా కల్యాణ్ పడాల
బిగ్‌బాస్‌లో 105 రోజుల రణరంగం.. చివరి అంకానికి చేరింది. ఈరోజు ముగింపు దశకు వచ్చేసింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలోపు బిగ్‌బాస్ తెలుగు 9 ట్రోఫీ విజేత ఎవరు అనేది తేలిపోతుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉన్నారు. వీరిలో విజేత ఎవరు..? సూటుకేసు తీసుకునేది ఎవరు..? అనేది తేలిపోతుంది. అయితే, తనూజ- కల్యాణ్‌లలో ఎవరో ఒకరు విజేతగా నిలవనున్నారని తెలిసిందే.. -
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.బిగ్‌బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
బిగ్‌బాస్ షో.. వంద రోజుల యుద్ధానికి తెర దించే సమయం ఆసన్నమైంది. ఫైనల్ ఓటింగ్స్ నిన్నటితో ముగిశాయి. ఈసారి కామనర్ గెలుస్తాడా? లేదా తనూజ గెలిచి లేడీ విన్నర్‌గా చరిత్ర సృష్టించనుందా? ఆన్లైన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఓటింగ్ ట్రెండ్ ఎటువైపు బలంగా ఉంది ఓసారి చూసేద్దాం..టాప్ 5 ఫైనలిస్టులుతెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలైనప్పుడు విన్నర్ మెటీరియల్‌లా ఒక్కరూ కనిపించడం లేదని జనాలే అనుకున్నారు. అలాంటి సమయంలో తనూజ తన రియల్ ఎమోషన్స్ చూపిస్తూ.. కసిగా గేమ్ ఆడుతూ విన్నర్ రేసులో ముందుకొచ్చింది. కమెడియన్‌గా నవ్విస్తూనే, టాస్కుల్లో దులిపేస్తూ నేనున్నానంటూ ముందుకు దూసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. కామనర్‌గా వచ్చిన కల్యాణ్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అది సరిపోదుమొన్నటిదాకా రీతూతో గొడవ వల్ల కనిపించకుండా పోయిన డిమాన్ పవన్ ఫైనల్ వీక్‌లో మాత్రం తన టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. కానీ కప్పు గెలిచేందుకు ఇది సరిపోదు. గేమ్స్ అందరూ ఆడతారు.. కానీ ఆడించడం తెలిసుండాలి... స్కోప్ లేని దగ్గర కూడా కంటెంట్ క్రియేట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది సంజనా. అలా ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె టాప్ 5లో చివరి స్థానంతోనే సరిపెట్టుకోనుంది.ఓట్లు గుద్దిపడేసిన అభిమానులుటాప్ 5లో ఉన్న ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్లుగా హౌస్‌లో కష్టపడ్డారు. వారికోసం బయట అభిమానులు కూడా బీభత్సంగానే కష్టపడ్డారు. మిస్డ్ కాల్స్, హాట్‌స్టార్‌లో ఓటింగ్‌తో దుమ్ము లేపారు. గత సీజన్స్ కంటే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వారం ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా సంజనా చివరి స్థానంలోనే ఉంది. పవన్‌కు పెరిగిన ఓటింగ్మూడు, నాలుగు స్థానాలు మాత్రం మారుతూ వచ్చాయి. పవన్‌లో హుషారు చూసి అతడికి ఓట్లు గుద్దిపడేశారు. దీంతో అప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న ఇమ్మూ సడన్‌గా నాలుగో స్థానానికి పడిపోయాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి ఇమ్మూ మళ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకినట్లు వినికిడి. అసలు సిసలైన విన్నర్ పోటీ తనూజ, కల్యాణ్ మధ్యే జరుగుతోంది. వీళ్లిద్దరికీ హోరాహోరీగా ఓట్లు నమోదయ్యాయి.ఈ ఇద్దరి మధ్యే పోటీఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో తనూజకు భారీగా ఓట్లు పడగా.. తర్వాత కల్యాణ్‌కు సడన్‌గా ఓటింగ్ రేంజ్ పెరిగిందంటున్నారు. దీంతో ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్, మరొకరు రన్నర్‌గా నిలవనున్నారు. ప్రతి సీజన్లో విన్నర్, రన్నర్ మధ్య గొడవలు జరిగాయి. కానీ, ఈ సీజన్లో మాత్రమే ఇద్దరూ కలిసికట్టుగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉన్నారు. వైరం పెట్టుకోకుండా ముందుకు సాగారు.తనూజపై అక్కసువాళ్లిద్దరూ బాగానే ఉన్నా.. వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో బద్ధ శత్రువుల్లా కొట్టుకున్నారు. ఇక ఆడవారికి ఆడవాళ్లే శత్రువు అన్నట్లు తనూజపై చివరి వారంలో కొందరు సెలబ్రిటీలు విషం కక్కారు. అది కూడా ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా పోల్స్‌లో కల్యాణ్ గెలిచే ఆస్కారం ఉందంటున్నారు. కొన్ని పోల్స్ మాత్రమే తనూజ గెలుపు తథ్యమని చెప్తున్నాయి. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు!ఓటింగ్‌లో కూడా కల్యాణ్ బుల్లెట్ స్పీడ్‌లో దూసుకెళ్లాడని టాక్! మరి ఇదే నిజమై కల్యాణ్ కప్పు గెలుస్తాడా? లేదా తనూజ కోరుకున్నట్లుగా టైటిల్ ఆమె వశమవుతుందా? అనేది రేపటి గ్రాండ్ ఫినాలేలో చూడాలి! ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు లెక్కలు తారుమారు కూడా అవొచ్చు! -
నా భార్య 4 రోజులు తినకుండా ఏడ్చింది: సుమన్
బిగ్‌బాస్ హౌస్‌లో సుమన్‌ను ఇష్టపడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకుల దగ్గర నుంచి హౌస్మేట్స్ వరకు అందరికీ అతడంటే ఇష్టమే! తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నవ్విస్తాడు. సూటిగా సుత్తిలేకుండా మాట్లాడే అతడి వైఖరికి అందరూ ఫిదా అవుతారు. కాకపోతే ఆటలో పెద్దగా సత్తా చూపించకపోయేసరికి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ వీక్‌లో సుమన్ కోసం అతడి భార్య ఇంట్లోకి వచ్చింది. వచ్చీరావడమే తనూజకు దూరంగా ఉండమని చెప్పింది. మాట మార్చేసిన సుమన్ఇది ఎపిసోడ్‌లోనూ టెలికాస్ట్ అయింది. కానీ, ఇప్పుడేమో తన భార్య అలా అనలేదని మాట మార్చేశాడు సుమన్. తనూజకు దూరంగా ఉండమని మీ భార్య ఎందుకు చెప్పింది? అని ఓ విలేకరి అడిగాడు. ఆ ప్రశ్నకు సుమన్ స్పందిస్తూ.. దూరంగా ఉండమని చెప్పలేదు. తనూజవాళ్లు బాగా ఆడుతున్నారు. మీరింకా బాగా ఆడండి అని చెప్పిందంతే! అంతే తప్ప జాగ్రత్త అని చెప్పలేదు. 4 రోజులు ఏడుస్తూనే..మీరు బాగా ఆడుతున్నారు, ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టి వాళ్లలా ఆడమని నా భార్య సలహా ఇచ్చింది. అది బయటకు తప్పుగా వెళ్లింది. దానివల్ల ఆమె నాలుగురోజులపాటు తినకుండా ఏడుస్తూ కూర్చుంది. నేను తప్పుగా ఏం చెప్పాను? అని చాలా బాధపడింది అన్నాడు. ఈ కామెంట్స్ విన్న జనాలు.. ఎపిసోడ్లో అందరం చూశాం.. ఎందుకు కవర్ చేయాలని చూస్తున్నావ్? ఆమెది ఏ తప్పూ లేకపోతే ఎందుకు ఏడవడం? అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: పిల్లాడికి అబద్ధం చెప్పి బిగ్‌బాస్‌కు.. ఏడ్చేసిన సంజనా -
సీజన్ అంతా తనూజ చుట్టూనే.. బిగ్‌బాసే ఒప్పుకున్నాడు!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ మరో మూడు రోజుల్లో ముగియనుంది. టాప్ 5లో చోటు కోసం అలుపెరగని పోరాటం చేసిన హౌస్మేట్స్ దిల్ ఖుష్ చేసేందుకు జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ ఏవీ అయిపోయింది. తనూజ, పవన్ జర్నీ వీడియోలను ప్లే చేస్తూ భారీ ఎలివేషన్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ విశేషాలను గురువారం (డిసెంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...నటనపై ప్రశంసలుముందుగా తనూజ టాలెంట్‌ను వర్ణించాడు బిగ్‌బాస్. తెరపై మీ నటన, మీరు పలికించిన భావాలతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని వారింట్లో కూతురిగా మార్చారు. గొప్ప నటిగా పాత్రల్లో మీరు పరకాయ ప్రవేశం చేసే తీరుకు అది నిదర్శనం. కానీ, బిగ్‌బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. నటనకు ఆస్కారం లేని చోటు.. మనుషుల్ని ఎలాంటి పరదా లేకుండా చూపించే వేదిక. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని టాప్ 5లో నిల్చుని మీరెంత చిచ్చరపిడుగో నిరూపించారు.గేమ్ అంతా మీ చుట్టూనే..నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మీ తత్వం.. అందరితో కలిసి అల్లరిచేసే విధానం మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయినవారు లేదా కలబడ్డవారు. భావోద్వేగాల గని మీరు. మనుషుల్ని మీవైపు తిప్పుకోవడంలో, ఆటను మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి మీరు. నిందలతో నొచ్చుకున్న మనసుఈ రణరంగంలో ఎంతమంది బలమైన, తెలివైన యోధులున్నా ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి మీరు. వంటగది నుంచే ఇంటిని గెలిచినతీరు ఆటలో ఎంత బలమైనవారో స్పష్టం చేస్తుంది. రీల్, రియల్ పర్సనాలిటీతో అందరినీ ప్రేమలో పడేలా చేశారు. బంధాలను, బాధ్యతలను సమంగా మోశారు. కేవలం బంధాల పునాదులపై ఆటాడుతారని, అందరి మద్దతు కోసం పాకులాడతారని నిందించినప్పుడు మీ మనసెంతగానో నొచ్చుకుంది. అది మీ వ్యక్తిత్వంబంధాలకు అతీతులెవరూ లేరని మీకనిపించింది. నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్నా మనసును రాయి చేసుకుని అవసరమైనప్పుడు అది పక్కనపెట్టి ఆట ముందుకు తీసుకెళ్లారు. చిన్న విషయానికి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం.. కదనరంగంలో విరుచుకుపడే శివంగిలాంటి ధీరత్వం.. కత్తికి రెండువైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. జర్నీ వీడియోమిగతా వారి ఆట టాస్కులో మాత్రమే బయటకు వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఈ ఇంట్లో, ప్రేక్షకుల మదిలో ఓ కుటుంబసభ్యురాలిగా మారి అందరి ప్రేమను పొందిన విధానమే తనూజను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. ఎన్నో భావాలతో, బంధాలతో నిండిన మీ ప్రయాణం ఓసారి చూద్దాం.. అంటూ జర్నీ వీడియో ప్లే చేశారు.షాకైన తనూజఅందులో భరణితో నాన్న బంధాన్ని చూపించారు. అలాగే కల్యాణ్‌తో స్నేహాన్ని లవ్‌ట్రాక్ అన్న లెవల్లో చూపించారు. ఇదంతా చూశాక తనూజ సంతోషం పట్టలేకపోయింది. ఇదంతా ఒక కలలా ఉంది. ఎక్కడో పుట్టిపెరిగిన నన్ను ఇక్కడ నిలబడేలా చేసిన నా ఆడియన్స్‌కు థాంక్యూ అంటూ స్టేజీని ముద్దాడింది. కల్యాణ్‌తో.. వీడియో మొత్తం మనిద్దరిదే ఉందిరా, షాకైపోయానంది. అది తాను ముందే ఊహించానన్నాడు ఇమ్మాన్యుయేల్. తర్వాత పవన్ జర్నీ వీడియో ప్లే చేశారు. -
చిచ్చర పిడుగు తనూజ.. భారీ ఎలివేషన్ ఇచ్చిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ తెలుగు 9 సోషల్‌మీడియాలో ట్రెండిగ్ టాపిక్.. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యుయేల్, పవన్, సంజనలు ఉన్నారు. ఈ క్రమంలో వారి జర్నీ వీడియోలను బిగ్‌బాస్ చూపిస్తున్నారు. ముందుగా ఇమ్మన్యుయేల్ ప్రయాణాన్ని చూపించిన బిగ్‌బాస్.. గురువారం ఎపిసోడ్లో తనూజ గురించి జర్నీ ఉంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ టీమ్ వదిలింది.బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకున్న తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనూజ కన్నీళ్లు పెట్టుకున్నా, నవ్వినా సరే నటిస్తుంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. అయితే, అలాంటి విమర్శలు చేసినవారికి సమాధానంగా బిగ్‌బాస్ ప్రోమో ఉంది. బిగ్‌బాస్ ఇల్లు నటనకు ఎలాంటి ఆస్కారం లేని చోటు అంటూ క్లారిటీ ఇచ్చారు. కత్తికి రెండువైపులా పదునైన వ్యక్తిత్వంతో హౌస్‌లో కొనసాగారంటూ పేర్కొన్నారు.. క్లిష్టపరిస్థితిలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని చిచ్చరపిడుగులా టాప్-5లో చేరారని భారీ ఎలివేషన్ ఇచ్చారు. -
నవ్వులపాలైన చోటే పవన్‌కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది. ఏ గేమ్ ఇచ్చినా ఈజీగా గెలిచేస్తున్నాడు.. అందరితో సరదాగా కలిసిపోయి జోకులేస్తున్నాడు. మంగళవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్‌లోనూ అదే జరిగింది. ఆ విశేషాలు ఓసారి చూసేద్దాం..అదరగొట్టేసిన పవన్బిగ్బాస్ బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పవన్‌ను పక్కకు తప్పించి మిగతా అందరూ గేమ్ ఆడారు. ఈ ఆటలో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఎక్కువ గేమ్స్ గెలిచిన పవన్‌ను హౌస్మేట్స్ ప్లేయర్ ఆఫ్ ది డేగా ప్రకటించారు. దీంతో అతడి అన్న వీడియో మెసేజ్ వచ్చింది. అగ్నిపరీక్షలో నిన్ను చూసి ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పాడు. ఆ మాటలు విని పవన్ ఉప్పొంగిపోయాడు.తనూజ గెలుపుమరుసటి రోజు పిక్ ద బోన్ అనే గేమ్ ఇచ్చాడు. ఇందులోనూ మళ్లీ పవనే గెలిచాడు. దీంతో అతడికి మళ్లీ ఓ స్టార్ వచ్చింది. అంతేకాకుండా.. మటన్ ఫ్రాంకీ పంపడంతో పవన్ ఆవురావురుమని ఆరగించాడు. అనంతరం బిగ్‌బాస్ టవర్ గేమ్ పెట్టాడు. ఈ ఆటలో ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరిలో తనూజ గెలిచి ఓ స్టార్ అందుకుంది. అలాగే తనకోసం బిగ్‌బాస్ పంపిన డ్రైఫ్రూట్ రబిడీని ఆరగించింది.తనూజకు చెల్లి పెళ్లి ఫోటోఅనంతరం ధమాకా కిక్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో ఈ టాస్క్‌లోనే ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా కింద పడిపోయాడు పవన్. అప్పుడందరూ పగలబడి నవ్వారు. కానీ, ఈసారి మాత్రం అందరికంటే ఎక్కువ హైట్‌లో (ఏడున్నర అడుగులు) తన చెప్పును కాలితో అతికించి శెభాష్ అనిపించుకున్నాడు. ఒక స్టార్, తందూరీ చికెన్ గెలుపొందాడు. తర్వాత ప్లేయర్ ఆఫ్ ద డేగా తనూజను ప్రకటించారు. దీంతో ఆమెకు ఇంటినుంచి చెల్లి పెళ్లి ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో తనూజను కూడా ఎడిట్ చేసి పెట్టారు. అది చూడగానే తనూజ కుటుంబాన్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. -
స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్ చేశాడా ?
బిగ్‌బాస్ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్లో నామినేషన్లు లేవు కాబట్టి బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.ఈ సీజన్ బిగ్‌బాస్ విన్నర్ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి. అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్ జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే ఇచ్చింది అన్నాడు.తనూజపై కల్యాణ్ ప్రేమతనూజ, కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్షిప్ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్ అన్నాడు. అయితే, ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలేకామనర్గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కల్యాణ్ మదర్ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగిపోయింది. ఎంతలా అంటే తనూజ కోసం కప్ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్ అడిగితే.. వెంటనే కల్యాణ్ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. -
నా కుటుంబం కన్నా తెలుగు ప్రేక్షకుల ప్రేమే ఎక్కువ!: తనూజ
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ చివరి వారం సరదాగా, భావోద్వేగంగా సాగిపోతుంది. చిన్న చిన్న టాస్కులిస్తుంటాడు బిగ్‌బాస్. అలాగే వారి జర్నీ వీడియోలు వేసి ఏడిపించేస్తాడు. తాజాగా బిగ్‌బాస్ జర్నీ అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పమని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు.ఒక్కవారంలో అంతా అయిపోయిందా?అందులో ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. బయట ఎన్ని కామెడీ షోలు చేయలేదు? సింపుల్‌గా నవ్వించేయొచ్చు అనుకున్నాను. కానీ వచ్చిన మొదటివారమే మర్యాద మనీష్‌తో కామెడీ గురించి ఒక పెద్ద గొడవ జరిగింది. ఇన్నాళ్లు కష్టపడి కట్టుకున్న కోట ఒక్కవారంలో కూలిపోయిందా? అని నిద్రపట్టలేదు. ఆ సమయంలో మా మమ్మీ (సంజనా) పరిచయమైంది. ఊరికనే ఏడ్చేస్తానని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది అన్నాడు.ఏడ్చేసిన డిమాన్ పవన్డిమాన్ పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వచ్చేముందు కెరీర్లో స్ట్రగుల్ అవుతున్నాను. అమ్మానాన్నను సరిగా చూసుకోలేకపోతున్నాను. అన్న, నాన్నపై ఆధారపడుతున్నాను అని చాలాసార్లు ఏడ్చాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనూజ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ కన్నా తెలుగు ప్రేక్షకులే ఎక్కువ ప్రేమను పంచారు. ఉన్నదాంట్లో సంతోషంగా గడపాలని ఇక్కడకు వచ్చాకే నేర్చుకున్నాను అంది.టాప్ 5 ఎమోషనల్కల్యాణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అంటే కావాలనిపించే కష్టం. భోజనం, నిద్ర, మనుషులు ఏదీ కరెక్ట్‌గా ఉండదు. అయినా ఇది మనకు కావాలనిపిస్తుంది అన్నాడు. అలా అందరూ బిగ్‌బాస్ జర్నీని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యారు. -
మనసులు గెలిచిన తనూజ.. విన్నర్ అవడం ఖాయం!
ప్రతి సీజన్లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..బుర్ర ఉపయోగించిన భరణిలీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇమ్మూ గెలుపుతర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు. చివరి గేమ్‌లో తనూజ విజయంఅలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది. తనూజతో డీల్చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజమీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు. -
సెకండ్ ఫైనలిస్ట్‌గా తనూజ.. కానీ ఓ ట్విస్ట్!
బిగ్‌బాస్ హౌస్‌లో సెకండ్ ఫైనలిస్ట్ కోసం పోటీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సెకండ్ ఫైనలిస్ట్ పోటీలో భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, సంజనా మిగిలారు. తాజా ప్రోమోలో తక్కువ పాయింట్లతో చివర్లో ఉన్న భరణి ఆటలో నుంచి అవుట్ అయిపోయాడు.భరణి కంటతడిదీంతో కన్నీళ్లు పెట్టుకున్న భరణి.. తన దగ్గరున్న పాయింట్స్ సగం తనూజకు ఇచ్చేశాడు. చివరకు ఇమ్మూ, తనూజ, సంజనా ఆడారు. వీరికి పెట్టిన పలు గేమ్స్‌లో చివరకు తనూజ గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తనూజ తాను డైరెక్ట్‌గా ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.తనూజ గొప్ప నిర్ణయంప్రేక్షకుల ఓట్ల ప్రకారమే తాను ముందుకు సాగుతానంది. ఈ వారం జనాలు తనను సేవ్ చేస్తేనే ఫైనల్స్‌కు వెళ్తానని, ఇమ్యూనిటీ వద్దని తిరస్కరించిందని సమాచారం. ఇదే నిజమైతే తనూజకు నేటి ఎపిసోడ్ మరింత ప్లస్ అవడం ఖాయం. కాకపోతే ఈ సెకండ్ ఫైనలిస్ట్ అనే అవకాశం భరణి, సంజనాలలో ఒకరికి వచ్చుంటే వారికి ఎంతో ఉపయోగపడేది. చదవండి: నీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్ -
మీ ఏడుపు ఫేక్.. ప్రేక్షకుల కామెంట్స్‌తో తనూజ షాక్!
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న సుమన్ ఆటలో అవుట్ అయ్యాడు. అతడి దగ్గరున్న రూ.1 లక్షలో సగం, తన స్కోర్‌లో సగం ఎవరికైనా పంచొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు. ఆయనకు వెంటనే భరణి పేరు తట్టింది.. కానీ, భరణి మాత్రం సంజనాకు ఇవ్వమని సలహా ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో గురువారం (డిసెంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణిని సైడ్ చేశారుఅలా సుమన్ ఇచ్చిన పాయింట్ల దెబ్బకు సంజనా లీడర్ బోర్డులో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక తర్వాత గేమ్‌లో మెజారిటీ ఇంటిసభ్యులు కలిసి భరణిని పక్కనపెట్టి గేమ్ ఆడారు. అలా జోకర్ గేమ్‌లో ఇమ్మూ, సంజనా గెలవగా మిగతావాళ్లు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయారు. లీడర్ బోర్డులో చివర్లో ఉన్న పవన్.. తన దగ్గరున్న రూ.1,50,000 అలాగే 150 పాయింట్లలో సగం ఒకరికి ఇచ్చి ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు బిగ్‌బాస్. మళ్లీ భరణి టార్గెట్అతడు తన పాయింట్స్ అన్నీ తనూజకు ఇవ్వడంతో ఆమె లీడర్ బోర్డులో టాప్‌లో నిలిచింది. ఇక నెక్స్ట్ గేమ్‌లో ఒకర్ని తీసేయాలని బిగ్‌బాస్ చెప్పగానే మెజారిటీ ఇంటిసభ్యులు మళ్లీ భరణిని తీసేశారు. మిగిలిన సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్ బ్యాలెన్స్ గేమ్ ఆడారు. ఈ ఆటలో ఇమ్మూ గెలవగా తనూజ, సంజనా తర్వాతి స్థానాల్లో వచ్చారు.ఓట్ అప్పీల్అయితే లీడర్ బోర్డులో మాత్రం తనూజ ఫస్ట్ ర్యాంక్‌లో ఉండగా.. ఇమ్మూ సెకండ్, సంజనా మూడో స్థానంలో ఉన్నారు. దీంతో బిగ్‌బాస్ ఓట్ అప్పీల్ కోసం తనూజతో పాటు ఇంకెవరు ముందుకు రావాలనే నిర్ణయాన్ని తనూజ చేతిలో పెట్టాడు. అలా తనూజ.. సంజనాను ఎంచుకుంది. వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ప్రేక్షకులను కలుసుకున్నారు. ప్రేక్షకులు తనూజకే ఓటేయడంతో ఆమె ఓట్ అప్పీల్ చేసుకుంది. తెలిసో తెలియక తప్పు చేసుంటే క్షమించమని కోరింది. మీ ఏడుపు ఫేక్తర్వాత జనాలడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీ ఏడుపు నిజమనిపించదు, ఫేక్ అని ఓ వ్యక్తి అనగా.. నేను కావాలని ఎమోషనల్ అవను, అది దానంతటదే వస్తుంది, ఇక్కడ ఏదీ ఫేక్‌గా ఉండదు అని చెప్పింది. భరణి నాన్న.. వైల్డ్‌కార్డ్స్ వచ్చాక భరణి సర్ ఎందుకయ్యారు? అన్న ప్రశ్నకు తనూజ.. మా మధ్య అనుబంధం ఇప్పటికీ అలాగే ఉంది. సింపతీకాకపోతే మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు ఆ నాన్న అనే పిలుపు చూసేవారికి సింపతీగా కనిపిస్తోంది. ఆయనకు ఎటువంటి ఇబ్బంది రావొద్దనే నాన్న అనే పిలుపును పక్కనపెట్టాను అని క్లారిటీ ఇచ్చింది. ఇమ్మాన్యుయేల్‌ను ముఖం మీదే ఫ్రెండ్ కాదని ఎలా అంటావని నిలదీశాడో వ్యక్తి. దానికి తనూజ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలింది. వాడికి సపోర్ట్ చేయలేదా? అని రివర్స్‌లో అంటే.. మీరెక్కడ చేశారు మేడమ్? మీరే అందరి సపోర్ట్ తీసుకుంటారు అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ మాటకు తనూజ ముఖం వాడిపోయింది. -
తనూజకు కల్యాణ్ ఫుల్ సపోర్ట్.. అయినా టాప్‌లో భరణి
బిగ్‌బాస్ 9 సీజన్ దాదాపు చివరకొచ్చేసింది. మరో పదిరోజులు మాత్రమే మిగిలున్నాయి. నేపథ్యంలో ఉండాల్సినంతా డ్రామా కనిపించట్లేదు. పైపెచ్చు టాప్ కంటెస్టెంట్స్ మధ్య పోటీ ఉండాల్సింది పోయి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇదే కాస్త చిత్రంగా అనిపిస్తుంది. తాజా ఎపిసోడ్లో అయితే తనూజకు కల్యాణ్ ఫుల్ సరెండర్ అయిపోయాడు. ఇంతకీ బుధవారం ఏమేం జరిగింది?కల్యాణ్ తొలి ఫైనలిస్ట్ అయిపోయాడు. దీంతో రెండో ఫైనలిస్ట్ రేసులో తదుపరి గేమ్ ఆడకుండా ఒకరిని తప్పించాలని బిగ్‌బాస్ చెప్పడంతో హౌస్ మెజారిటీ ప్రకారం సంజన తప్పుకొంది. తర్వాత మిగిలున్న ఐదుగురికి 'పట్టుకో పట్టుకో' అనే పోటీ పెట్టారు. ఇందులో భాగంగా సంచాలక్స్ కల్యాణ్, సంజన వేసే బంతుల్ని.. జంబో ప్యాంట్స్ వేసుకున్న పోటీదారులు పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తనూజకు కల్యాణ్ ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. 10లో 7 బంతులు ఆమెకే వేయడం విశేషం. మరోవైపు సుమన్ పక్కనే నిలబడ్డ భరణి.. అతడి బంతుల్ని పట్టేసుకున్నాడు. అన్నా అది నా బల్ అని సుమన్ అంటున్నా గానీ భరణి సైలెంట్‌గానే ఉండిపోయాడు. ఈ పోటీలో తనూజ తొలి స్థానం దక్కించుకోగా భరణి, పవన్, ఇమ్మూ, సుమన్ మిగతా స్థానాల్లో నిలిచారు.గేమ్ తర్వాత తనూజ-కల్యాణ్ గురించి భరణి-సంజన మాట్లాడుకున్నారు. మరి అంత దారుణంగా.. కూర్చో అంటే కూర్చుంటున్నాడు నిలబడు అంటే నిలబడుతున్నాడు.. నేను రిలేషన్‌ని తప్పుబట్టను.. వాళ్లిద్దరూ ఎందుకో పాపం.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం కానీ తనూజ మరీ ఓవర్ కమాండ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు అని భరణి అన్నాడు. బాల్ టాస్క్ తర్వాత లీడర్ బోర్డ్‌లో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ టాప్-2లో ఉన్నారు. దీంతో ఈసారి ఇద్దరిని తర్వాత గేమ్ నుంచి తప్పించాలని బిగ్‌బాస్ పుల్ల పెట్టాడు. అలా కాసేపు హౌస్మేట్స్ తర్జన భర్జన తర్వాత వీళ్లిద్దరినీ తప్పించారు.తర్వాత 'పట్టు వదలకు' అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా పజిల్ పూర్తి చేసి, రోల్ అవుతున్న తాడుని పట్టుకోవాల్సి ఉంటుంది. తొలి స్థానంలో నిలిచిన వాళ్లకు 100 పాయింట్లు వస్తాయని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ గేమ్‌లో తనూజ, సంజన.. త్వరగానే పజిల్ పూర్తి చేశారు గానీ తాడుని ఎక్కువసేపు పట్టుకోలేక కింద పడేశారు. ఇక్కడే తెలివి చూపించిన భరణి.. ఆలస్యంగా పజిల్ పూర్తి చేసి తాడు చివరలో ఉండగా వెళ్లి, కాసేపు దాన్ని పట్టుకుని టాస్క్ పూర్తి చేశాడు. 100 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. సుమన్ అయితే ఈ టాస్క్ పూర్తి చేయలేకపోయాడు.పట్టు వదలకు టాస్క్ పూర్తి చేసిన భరణి(230).. ఒకేసారి 100 పాయింట్లు రావడంతో లీడర్ బోర్డ్‌లో టాప్‌లోకి వచ్చేశాడు. తర్వాత తనూజ (220), ఇమ్మాన్యుయేల్ (170), డీమన్ పవన్ (150), సంజన (140), సుమన్ (100) వరసగా నిలిచారు. ఇక టాప్-2లో నిలిచిన భరణి, తనూజలో ఒకరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమని చెప్పగా.. హౌస్‌లోకి వచ్చిన ఆడియెన్స్, తనూజ పేరు చెప్పారు. దీంతో ఈమె ఓటు అప్పీలు చేసుకుంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. -
'బిగ్‌బాస్'ను తాకిన కులం, ప్రాంతపు రంగు
బిగ్‌బాస్ గేమ్ అంటేనే అందులోని కంటెస్టెంట్స్‌కు చాలా స్ట్రాటజీలు ఉంటాయి. కొందరైతే ముందుగానే బిగ్‌బాస్ టీమ్‌తో డీల్ సెట్ చేసుకుంటారు. తను ఎన్నివారాలు ఉండాలో దానికి తగినట్టు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. కానీ, కొందరు మాత్రం తమ పీఆర్ టీమ్స్‌తో ప్రేక్షకులను ముందుగా రెచ్చగొడతారు. ఆపై కులం, మతం, ప్రాంతం పేరుతో తమ కంటెస్టెంట్స్ కోసం నెట్టింట ట్రోలింగ్‌కు దిగుతారు. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదవ సీజన్లో కూడా అదే జరగుతోంది. టాప్ 2పై ట్రోలింగ్కన్నడ అమ్మాయి అంటూ తనూజపై తీవ్రమైన ట్రోలింగ్ కొనసాగుతుంది. మరోవైపు కల్యాణ్ మా కులపోడు అంటూ కొందరు భుజాన ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతడి పీఆర్ టీమ్ దానిని వైరల్ చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణ్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. దీంతో కుల, ప్రాంతీయ జాడ్యం బిగ్‌బాస్‌ను కూడా తాకింది. కల్యాణ్ మా కులపోడు అంటూ ఇప్పటికే తన సామాజిక వర్గం పెద్దలు రంగంలోకి దిగారు. వేరేవాాళ్లను తొక్కితేనే..అతనిపై కామన్ మ్యాన్, ఆర్మీ మ్యాన్, తెలుగు వాడు అంటూ పీఆర్ టీమ్స్ వైరల్ చేస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో కూడా అదే ఫార్ములా పాటిస్తున్నారు.కమ్యూనిటీ పేరెత్తితే ఏమైంది?బిగ్‌బాస్ టైటిల్ రేసులో కల్యాణ్, తనూజ ఉన్నారు. ఆమె కన్నడ అమ్మాయి కావడంతో తన భాష, ప్రాంతం గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక గేమ్ అనే సోయి కూడా చాలామందికి లేదు. ఇక్కడ ప్రాంత, కుల, భాషాభేదాలు అవసరం లేదు. ఆటను ఆటగా చూడాలనే ఆలోచన ఎవరికీ లేదు. గతంలో మెహబూబ్ కూడా కమ్యూనిటీ వోటింగు చర్చకు తెరలేపాడు. లాస్ట్‌కు తనే ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు.ఐపీఎల్లో ఇలాంటివేం లేదేఇక్కడ కన్నడ, తెలుగు అనే ప్రాంతీయతతో పనేంటి..? ఐపీఎల్ మాదిరి బిగ్‌బాస్ కూడా ఒక గేమ్‌లా అనుకోవడమే బెటర్. ఐపీఎల్లో నగరాల పేర్లతో టీమ్స్ ఉన్నాయి. అనేక దేశాల నుంచి క్రికెటర్లు ఆయా జట్టులో ఉన్నారు. అక్కడ మనం ప్రాంతం, దేశం, కులం, భాష అనే తేడా లేకుండా చూస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలాంటి అభిప్రాయం రాదేమో..గత సీజన్ల నుంచి ఇదే ట్రోలింగ్ఇక్కడ చెప్పుకోవాల్సింది మరొక పాయింట్ ఉంది. కన్నడ, కన్నడ అంటూ తనూజ గేమ్‌ను టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా యష్మి, శోభా శెట్టి, ప్రేరణ, నిఖిల్, పృథ్వి వంటి వారు కూడా ఇదే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. వీళ్లందరూ కూడా చక్కగా తెలుగు మట్లాడుతారు. వాళ్లు అవకాశాలు అందిపుచ్చుకుని నటించేది, ఆధారపడి జీవిస్తుంది తెలుగు గడ్డపైనే.. వారికి ఆధారం కూడా తెలుగు సీరియళ్లే.. వాళ్లందరూ ఇదే విషయం పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. గేమ్ పక్కట్టి..కానీ, సోషల్‌మీడియాలో ఆవేశం, దూకుడు, పిచ్చి కూతలతో పీఆర్ టీమ్స్ వారిని ట్రోలింగ్ చేస్తున్నాయి. గత సీజన్లో శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లను స్టార్‌మా బ్యాచ్ అని ముద్రవేసి శివాజీ టార్గెట్ చేశారు. బయట తన పీఆర్ టీమ్ ఆటతో పనిలేకుండా ఆ గ్రూప్‌పై ఇలాంటి ఎదురుదాడితోనే విరుచుకుపడింది. పీఆర్ టీమ్‌లకు గేమ్‌తో పనిలేదు. ఇదేం బాగోలేదుకేవలం ఆడవాళ్లను అవమానించేందుకే ఉన్నామనేలా సెకనుకొక కామెంట్‌తో రెచ్చిపోతున్నారు. తమ కంటెస్టెంట్లో పాజిటివ్‌ను వెతుక్కుని హైలైట్ చేసుకోవడానికి బదులు అవతలివారిని నెగెటివ్ చేయడంపైనే స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. కానీ, ఇలా కుల, ప్రాంతీయ బేధాలు తీసుకురావడం ఏమాత్రం సబబు కాదని బిగ్‌బాస్ ఆడియన్స్ ఫీలవుతున్నారు. View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) Mana Telaga Caste vadu kabatti Kalyan ki votes veyyandi ani beg chesukuntunnaru Caste Card use chesi ...🤮🤮Matladuthundhi Telaga Community President anta 👇👇#BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/RIwmqK9pga— Arachakame (@Arachakame) December 7, 2025 -
ఎంత దారుణం.. తనూజ ఏది చెప్తే అది చేస్తున్నాడు: భరణి
ఇమ్యూనిటీ + ఓట్ అప్పీల్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లో టాస్కులు జరుగుతున్నాయి. లీడర్ బోర్డులో మొదటి స్థానంలో నిలబడి ప్రభంజనం సృష్టించిన ఇమ్మాన్యుయేల్ అందరికంటే మొదటగా ఓట్ అప్పీల్ గెలిచాడు. ఇప్పుడు మరో ఓట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.బాల్ గేమ్అందులో సంజనా, కల్యాణ్ సంచాలకులుగా ఉండగా మిగతావారు గేమ్స్ ఆడారు. సంచాలకులు విసిరే బాల్స్‌ను తమ జంబో బ్యాగుల్లో పడేలా చూసుకోవాలి. ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు సమాచారం. ఈ గేమ్ అయిపోయాక భరణి.. సుమన్‌తో మాట్లాడుతూ.. ఎంత దారుణం.. తనూజ కూర్చో అంటే (కల్యాణ్) కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు. భరణిపై సెటైర్స్తనూజ ఎక్కువ కమాండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది అని ఫీలయ్యాడు. ఈ ప్రోమో కింద కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. దివ్య మిమ్మల్ని కమాండ్ చేసినప్పుడు ఏమైపోయారు? అని భరణిపై సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్లో తనూజ ఓట్ అప్పీల్ గెలిచినట్లు భోగట్టా! చదవండి: ఇమ్మాన్యుయేల్ ప్రభంజనం.. టాప్5లో ఉంచమని రిక్వెస్ట్ -
టార్గెట్ 'తనూజ'.. బిగ్‌బాస్ ఇదేం 'ట్రై యాంగిల్'
బిగ్‌బాస్ తెలుగు 9 చివరిదశకు చేరుకుంది. నేడు జరగనున్న ఎలిమినేషన్ తర్వాత టాప్-5లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తేలనుంది. అయితే, శనివారం జరిగిన ఎపిసోడ్ గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తనూజను కావాలనే బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని స్టార్ మా విడుదల చేస్తున్న ప్రోమోల కింద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, బిగ్‌బాస్ టీమ్ వాటిని కూడా హైడ్ చేయడం లేదా తొలగించడం చేస్తున్నట్లు స్క్రీన్ షాట్స్ కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.ట్రై యాంగిల్ (త్రిభుజాకారం)తో రచ్చబిగ్బాస్ గేమ్‌లో భాగంగా ట్రై యాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువును ఒకే వరుసలో ఉంచాలని, అవన్నీ ఒకే సైజ్‌లో ఉండాలని రూల్ పెట్టారు. అయితే, రీతూ ఎంచుకున్న వస్తువు ట్రై యాంగిల్లో లేదని మొదట తనూజ పాయింట్ పెడుతుంది. దీంతో అదే గేమ్‌లో రీతూతో తలపడి ఓడిపోయిన భరణి ఫైర్ అయిపోతాడు. కానీ, తనూజ ఎక్కడా కూడా నోరు జారలేదు. తన సందేహం మాత్రమే చెప్పింది. అదే బిగ్‌బాస్‌కు నచ్చినట్లు లేదు.బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తున్న నెటిజన్లుట్రై యాంగిల్ (త్రిభుజాకారం) పాయింట్ గురించి ఈ శనివారం ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కూడా మాట్లాడారు. అయితే, తనూజను టార్గెట్ చేస్తూ బిగ్‌బాస్ టీమ్ రంగంలోకి దిగిందని ఆరోపణలు వస్తున్నాయి. తనూజ తప్పులేకున్నా సరే నాగార్జున చేత అనేక మాటలు అనిపించి బిగ్‌బాస్ టీమ్ రెచ్చిపోయిందని అంటున్నారు. గ్రూప్ గేమ్ ఆడిన ఇమ్ము, కల్యాణ్‌ల గురించి నాగ్ ప్రశ్నించలేదు. రింగ్ దాచేసిన రీతూను ఒక్కమాట కూడా అనలేదు. కానీ, తనూజ తప్పులు లేకున్నా సరే ఆమెను బిగ్‌బాస్ టార్గెట్ చేశారని పోస్టులు చేశారు. దీంతో తనూజ పేరు ఏకంగా ట్రెడింగ్‌లోకి వచ్చేసింది. ట్రై యాంగిల్‌ను తప్పుగా రెడీ చేశారని నాగార్జునే చెప్పారు. అలాంటప్పుడు తనూజను తిట్టడం ఎందుకు అంటూ నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కూడా భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ రివ్యూవర్లు కూడా తనూజను కావాలనే టార్గెట్ చేస్తున్నారని చెప్పడం విశేషం. ఒక టాస్క్‌లో కల్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటే .. చాలా ఎమోషనల్ అయ్యావ్ ఎందుకు అని నాగార్జున ప్రశ్నిస్తారు. మరి తనూజ కన్నీళ్లు పెట్టుకుంటే అదేదో చాలాతప్పు అన్నట్లుగా నాగార్జున అనడం ఎందుకు అంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. తనూజ చేసిన చిన్నచిన్న తప్పులను వెతికి మరి బిగ్‌బాస్ టీమ్ టార్గెట్ చేస్తుందని అంటున్నారు. చివరకు ప్రోమోలలో కూడా తనూజను తప్పుగా చూపిస్తారని, ఎపిసోడ్స్‌లో చూస్తే ఏమీ ఉండదని అంటున్నారు. ఇదంతా కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ గేమ్ ఆడుతున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. Even reviewer fraternity who worked day&night to pull down #ThanujaPuttaswamy is now talking about how she is being targeted by #BiggBossTelugu9 team to help their blue eyed boy #KalyanPadala Audience are watching & they will stand for Thanuja pic.twitter.com/t8myeDDwEC— VMR (@VMR199507) December 6, 2025Biggboss reviewer on How biggboss targeting Thanuja 🤷🙏#BiggBossTelugu9 #BiggBoss9Telugu #Thanuja #demonpavan #KalyanPadala #Reethu #bharani #SumanShetty #sanjana #Emmanuel pic.twitter.com/caO9luSpU7— Common Man (@commonmanfromTG) December 7, 2025https://x.com/phantom242628/status/1994974214286389755?s=20adi reddy about targeted negative promos on Thanuja by bb team finally he addressed it #thanuja #ThanujaPuttaswamy #BiggBossTelugu9 pic.twitter.com/vE0AjCeL0l— phantom (@phantom242628) November 30, 2025We are also seeing how much more bullying you will do. Tanuja is an example of how difficult it is for a woman to rise up in our India.#BiggBossTelugu9 #Thanuja🥹🥹🥹🥹🥹🥹🥹🥹🥹pic.twitter.com/LGr0XnARS0— karthi (@karthi129867) December 6, 2025 -
పెళ్లి చేసుకున్న తనూజ చెల్లి.. ఫోటో వైరల్
ఇంట్లో పెళ్లంటే ఆ హడావుడి మామూలుగా ఉండవు. అందులోనూ ప్రాణంగా ప్రేమించే చెల్లి పెళ్లంటే ఆ సందడి వేరే లెవల్లో ఉంటుంది. కానీ, ఈ పండగ వాతావరణాన్ని తనూజ మిస్ అయింది. తెలుగు బిగ్‌బాస్ 9లో అడుగుపెట్టిన తనూజ ఎంతోకాలం ఉండననుకుంది. ఇంట్లోవాళ్లు కూడా వెంటనే వచ్చేస్తుందిలే అని పంపించారు. తీరా తన గేమ్‌తో విన్నింగ్ రేస్‌లో ఉంది. 13 వారాలుగా టాప్ ఓటింగ్‌తో దుమ్ము లేపుతోంది.పెళ్లికూతురుకి ఆశీర్వాదంఅయితే కుటుంబాన్ని మాత్రం చాలానే మిస్ అవుతోంది. తను కెప్టెన్ అయినవారమే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చారు. అలా తనూజ కోసం ఆమె చెల్లి పూజ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తనూజకు కన్నీళ్లాగలేదు. వరుసకు చెల్లే అయినా తల్లిలా తనూజకు ఏడవద్దని సలహా ఇచ్చింది. 'ఓపక్క పెళ్లి పనులు.. మరోపక్క నువ్వు ఇక్కడ షోలో ఏడుస్తుంటే అక్కడ అమ్మ, అక్క ఏడుస్తున్నారు. నా పెళ్లి విషయం మర్చిపోయింది.వాళ్లని హ్యాండిల్ చేయలేకపోతున్నా.. నా పెళ్లికి కొద్దిరోజులే సమయం ఉంది. అన్నీ హ్యాండిల్ చేయాలి. ప్లీజ్, నువ్వు ఏడవకు' అని బతిమాలింది. 'నువ్వు ఒక్కసారి ఏడిస్తే అమ్మ రెండురోజులు ఏడుస్తుంది. నా పెళ్లి విషయం కూడా మర్చిపోయింది. ప్రతిరోజు బిగ్‌బాస్, రీల్స్ చూస్తుంది.. నువ్వేం చేస్తావో తెలీదు, విన్ అవ్వాలి. నేను ఏది కొన్నా ఫస్ట్ ఫోటో నీకు పెట్టేదాన్ని.. అది మిస్ అవుతున్నా.. అని భావోద్వేగానికి లోనైంది.శుభలేఖలో తనూజ పేరుతర్వాత గార్డెన్ ఏరియాలో చెల్లెల్ని తన చేతులతో పెళ్లికూతుర్ని చేసి ఆశీర్వదించింది. శుభలేఖలో తన పేరు చూసుకుని తనూజ మురిసిపోయింది. తన పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ గిఫ్ట్‌గా కావాలని చెప్పింది. అందుకోసం తనూజ కూడా బాగానే కష్టపడుతోంది. నవంబర్ 23 నాటి ఎపిసోడ్లో తన చెల్లి పెళ్లి జరిగిందన్న తనూజ.. నాగార్జునతో కొత్తజంటకు ఆశీర్వాదాలు ఇప్పించింది.పూజ పెళ్లి వీడియోఅలా నవంబర్ చివరి వారంలో తనూజ చెల్లి పూజ పెళ్లి జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు పూజకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద శుభకార్యంలో అక్క లేకపోవడం ఎంతైనా తీరని లోటే అని అభిప్రాయపడుతున్నారు.చదవండి: మనస్సాక్షి లేదా? ప్రజల బాధను అవమానిస్తారా? నటి ఫైర్ -
తనూజకు క్లాస్ పీకిన నాగ్.. వాళ్లు ట్రోఫీకి అనర్హులు!
టికెట్ టు ఫినాలేలో కంటెస్టెంట్లు చేసిన తప్పొప్పులను నాగార్జున ఎత్తిచూపాడు. ఇమ్మాన్యుయేల్ తాడు వదిలేయడం వీడియో వేసి చూపించాడు. అలాగే భరణి ట్రయాంగిల్ గోల గురించి చర్చించాడు. అనవసరమైన గొడవ మొదలుపెట్టిందే తనూజ అని క్లాస్ పీకాడు. అలాగే పవన్ ఓడిపోయిన ప్లాంకుల టాస్కు గురించి మాట్లాడుతూ.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రవర్తించావు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో టికెట్ టు ఫినాలే గెలుస్తానని చెప్పి ఓడిపోయావ్ అని సెటైర్లు వేశాడు. మరి తర్వాతేం జరిగిందో శనివారం (డిసెంబర్ 6వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సుమన్ అనర్హుడుబిగ్బాస్ ట్రోఫీకి తామెందుకు అర్హులో హౌస్మేట్స్ చెప్పాలన్నాడు. మొదటగా సుమన్.. గేమ్ బాగా ఆడుతున్నాను, ఆ మేరకు ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్నాడు. ఆయనకు కప్పు గెలిచే అర్హత లేదని సంజనా, ఇమ్మాన్యుయేల్, రీతూ, పవన్ అభిప్రాయపడ్డారు. తనూజ, భరణి, కల్యాణ్ మాత్రం ఆయనకు గెలిచే అర్హత ఉందన్నారు. ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. జనాలను ఎంటర్టైన్ చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. ఏ సీజన్లోనూ కమెడియన్ గెలవలేదు. ఈ సీజన్లో నేను గెలవాలనుకుంటున్నా అని చెప్పాడు. ఆయన మాటలతో హౌస్మేట్స్ అందరూ ఏకీభవించారు. వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదుతర్వాత భరణి.. నాకు దెబ్బలు తగిలినా సరే ఎక్కడా తగ్గకుండా ఆడాను. కంటెంట్ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న పవన్‌ను ఓడించాను. కచ్చితంగా కప్పుకు అర్హుడినే అన్నాడు. రీతూ, పవన్ మినహా మిగతా అందరూ ఆయన మాటలతో ఏకీభవించారు. సంజనా.. నేను మాస్క్ వేసుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడాను. చూసిందే మాట్లాడాను. నిజాయితీగా ఉన్నాను అని చెప్పగా సుమన్, భరణి, పవన్ ఆమెకు కప్పు గెలిచే అర్హత లేదని భావించారు.కల్యాణ్‌కు ఫుల్ సపోర్ట్పవన్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ నా ఇల్లు అనుకున్నాను. ఏ పని చెప్పినా అన్నీ చేశాను. ఎక్కడా మాట తప్పలేదు. బంధాల వల్ల గేమ్ తగ్గిపోతుందని తెలిసినా నేనెలా ఉన్నానో అలాగే ఉన్నాను. అన్ని టాస్కుల్లోనూ బాగానే ఆడాను అని చెప్పుకొచ్చాడు. అతడికి రీతూ, ఇమ్మాన్యుయేల్, కల్యాణ్ మాత్రమే సపోర్ట్ చేశారు. అనంతరం కల్యాణ్ మాట్లాడుతూ.. డిసిప్లేన్, డిటర్మినేషన్, డెడికేషన్.. ఈ మూడింటితోపాటు కమిట్మెంట్తో ఆడాను.లేడీ విన్నర్అందరితో బాగున్నా.. జెన్యూన్‌గా ఆడా.. ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పగా అందరూ ఇతడు అర్హుడనే తలూపారు. తనూజ మాట్లాడుతూ.. నాకు కుటుంబం, వర్క్ ప్లేస్ తప్ప మిగతాది తెలియదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నానంటే ఇప్పటికీ ఓ కలలా ఉంది. ఎక్కడా ఫేక్‌గా ఉండకుండా జెన్యూన్‌గా ఉన్నాను. నావల్ల అయినంతవరకు ఆడాను. లేడీ విన్నర్ అవ్వాలని, అది నేనే అవాలనుకుంటున్నా అని చెప్పింది. అందరూ ఆమె చెప్పింది కరెక్టేనన్నారు.ముగ్గురికే కప్పు గెలిచే అర్హతరీతూ మాట్లాడుతూ.. ప్రతి గేమ్‌లో ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నాకు ఏదనిపిస్తే అది చేశాను. గెలిచినా, ఓడినా.. ఎలా అయినా ఫైనల్స్‌లో ఉండాలన్న కసితోనే ఆడాను. ఏదో ఒకటి చేసి ముందుకెళ్లాలన్న తపనతోనే ఉన్నాను అని పేర్కొంది. సుమన్, భరణి తప్ప మిగతా అందరూ ఆమెకు అర్హత ఉందని ఓటేశారు. మొత్తానికి ఈ ఓటింగ్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ మాత్రమే అర్హులంటూ వారికి పూర్తిస్థాయిలో ఓట్లు పడ్డాయి.చదవండి: బిగ్‌బాస్ 9 షాకింగ్ ఎలిమినేషన్.. రీతూ అవుట్ -
#BiggBossTelugu9 ట్రెండింగ్‌లో 'తనూజ' (ఫోటోలు)
-
ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్.. ట్రోఫీకి దూరం.. తనూజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
బిగ్‌బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. వరుస గేమ్స్‌లలో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కల్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. మూడోవారం డేంజర్ జోన్లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలు భరించాడు. అదే అమ్మాయి కల్యాణ్ గెలుపులో మూలస్థంభంగా నిలబడింది. కల్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టు మాత్రమే తిరుగుతున్నాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కల్యాణ్ రెండుసార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ పైనలిస్ట్‌గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ, టికెట్ టూ ఫినాలే కల్యాణ్‌కు దక్కడం పెద్ద మైనస్ కానుంది. ఈ విజయం ఫైనల్ కప్‌కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది.భరణి, రీతూల మాటల యుద్ధంబిగ్బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచేందుకు కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, భరణి గట్టిగానే ఫైట్ చేశారు. అయితే, రీతూ చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపుతుంది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరుస్తాడు. ఆపై రీతూతో పెద్దగొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలా ఎదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో భరణి వాదన కరెక్ట్‌గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్ట్‌గానే ఉంది. కానీ, టాస్క్‌లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ (త్రిభూజాకారం) వస్తువును కావాలనే బిగ్‌బాస్ టీమ్ అలా డిజైన్ చేసిందా... పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సిందే. అయితే, ఈ టాస్క్‌లకు ఎలాంటి సంబంధం లేని కల్యాణ్‌ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కల్యాణ్‌తో కూడా గొడవ జరుగుతుంది.విన్నర్‌కు కల్యాణ్ దూరంకల్యాణ్కు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచే అర్హత వంద శాతం ఉంది... అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టిపోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కల్యాణ్ విన్నర్ అవడం చాలా కష్టమనే చెప్పవచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకుని బిగ్‌బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అనిపిస్తుంది. రీతూ, కల్యాణ్‌ల మధ్య జరిగిన చివరి టాస్క్ కల్యాణ్‌ను గెలిపించేందుకే బిగ్‌బాస్ ఇచ్చాడనిపిస్తుంది. అతనొక ఆర్మీ సైనికుడు కావాలనే పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లు తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్క్ అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన కల్యాన్ మరో రెండు వారాలు ఓటింగ్‌లో కనిపించడు. ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్‌లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేసులో మాత్రమే కల్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేసులో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్‌గా కల్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కల్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్‌బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టూ ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్‌బాస్ ట్రోఫీ గెలవలేదన్నది గమనార్హం. -
కల్యాణ్ కోసం తనూజ.. తొక్క, తోటకూర అంటూ 'రీతూ' ఫైర్
బిగ్‌బాస్ సీజన్-9 ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ముగ్గురు బరిలో ఉన్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరనేది తేలిపోతుంది. అయితే, ఈ ముగ్గురికి కట్టు! నిలబెట్టు అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. బ్రిక్స్‌తో వారు ఒక టవర్‌ను పేర్చి.. పడిపోకుండా దానిని కాపాడుకోవాలి. ఇదే సమయంలో బాల్స్‌తో ఇతర కంటెస్టెంట్స్ దాడి చేస్తుంటారు. సీజన్-7లో అమరదీప్ ఇదే టాస్క్‌తో బాగా వైరల్ అయ్యాడు. హౌస్మేట్స్ అందరూ అమర్‌ని టార్గెట్ చేయడంతో రేయ్ వద్దురా ప్లీజ్ అంటూ వేడుకుంటాడు. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అదే జరిగింది. కానీ, ఇక్కడ తనూజ, సుమన్ మాత్రమే రీతూ టవర్‌ను టార్గెట్ చేశారు.'కట్టు నిలబెట్టు' టాస్క్‌కు సంచాలక్‌గా సంజనా ఉంటుంది. రీతూ కోసం డీమాన్ పవన్ ఒక్కడే నిలబడ్డాడు. అయితే, తను సైడ్ నుంచి కల్యాణ్ టవర్‌ను కూల్చేందుకు బాల్స్ విసురుతూ ఉంటాడు. దీంతో తనూజ ఫైర్ అవుతుంది. కల్యాణ్‌ను ఎవరు టార్గెట్ చేస్తారో వాళ్లని తాను టార్గెట్ చేస్తానంటూ రీతూ టవర్‌పై బాల్స్ విసురుతుంది. దీంతో రీతూ కూడా తనూజపై భగ్గుమంటుంది. తొక్క, తోటకూర అంటూ తనూజపై రీతూ విరుచుకుపడుతుంది. అయితే, డీమాన్ దూకుడుగా బాల్స్ విసురుతున్న క్రమంలో లైన్ దాటుతాడు. దీంతో అతను డిస్‌క్వాలిఫైడ్ అవుతాడు. ఇంకేముంది రీతూ టవర్‌ను సులభంగా కూల్చేశారు. -
సుమన్ చేతిలో ఓటమి.. తనూజకు ఏడుపే దిక్కు!
టికెట్ టు ఫినాలే ఎలాగైనా కొట్టాల్సిందే అన్న కసితో ఆడుతున్నారు హౌస్మేట్స్. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్, తనూజ గేమ్స్ గెలిచి అందరికంటే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా తనూజ సుమన్‌తో పోటీపడింది. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. ఇది బ్యాలెన్స్ గేమ్. తనూజకు సపోర్ట్ చేయని భరణిహౌస్మేట్స్ ఎవరిని రేసులో నుంచి తొలగించాలనుకుంటారో వారి ట్యాప్ తిప్పి ట్యాంకులో నీళ్లు నింపాల్సి ఉంటుంది. కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ.. తనూజకు సపోర్ట్ చేయగా భరణి, పవన్.. సుమన్‌కు మద్దతిచ్చారు. ఈ గేమ్‌లో తనూజపై సుమన్ పైచేయి సాధించాడు. దీంతో తనూజ టికెట్ టు ఫినాలే రేసులో లేకుండా పోయింది. రేసు నుంచి అవుట్‌ఈ ఓటమిని తట్టుకోలేక తనూజ ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఇక మరో గేమ్‌లో డిమాన్ పవన్ గెలవగా.. భరణితో తలపడినట్లు తెలుస్తోంది. ఈ ఆటలో భరణి గెలిచి పవన్‌ను రేసు నుంచి తప్పించాడని తెలుస్తోంది. ఇలా మలుపులు తిరుగుతూ పోతున్న ఈ ఆటలో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ (Bigg Boss Telugu 9) అవుతారో చూడాలి! చదవండి: రీతూ పరువు తీసిన బిగ్‌బాస్ -
రీతూ పరువు పాయే.. దుమ్ము దులిపేసిన ఇమ్మూ, తనూజ
ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలిస్తున్నానన్నాడు బిగ్‌బాస్. రణరంగంలో ఎవరెక్కువ గడులు (బాక్స్‌లు) గెల్చుకుంటే వారే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. ఈ క్రమంలోనే హౌస్‌లో కొన్ని గేమ్స్ జరిగాయి. అందులో ఎవరు గెలిచారో మంగళవారం (డిసెంబర్ 2వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ ఒకటే గొడవకంటెస్టెంట్లందరూ చదరంగంలాంటి బాక్స్‌లో ఒక్కో కలర్ ఎంచుకున్నారు. చివరకు ఆ బాక్స్‌లో ఎవరి కలర్ ఎక్కువ ఆక్రమించుకుంటుందో ఆ కంటెస్టెంట్లే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పారు. ఫస్ట్ గేమ్‌లో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్ ఆడతారని తనూజ ప్రకటించింది. అందుకు రీతూ ఒప్పుకోలేదు. ఫస్ట్ గేమ్ నేనే ఆడతానని వాదించింది. దీంతో పవన్ తప్పని పరిస్థితిలో వెనకడుగు వేశాడు.పరువు పాయేఅలా ఇమ్మూ, కల్యాణ్, రీతూ.. మొదటి గేమ్ కనుక్కోండి చూద్దాం ఆడారు. మెదడుకు పదును పెట్టే ఈ గేమ్‌లో రీతూ ఒక్క పాయింట్ కూడా గెలవలేకపోయింది.. ఆడతా.. ఆడతానంటూ దూకుడు చూపించి మరీ బొక్కబోర్లా పడింది. ఆమె పరిస్థితి చూసిన బిగ్‌బాస్ తనకసలు లెక్కలు వచ్చా? రావా? అని టెస్ట్ చేసేందుకు రెండో ఎక్కం చెప్పమన్నాడు. దీనికి ఆలోచించుకుంటూనే సెకండ్ టేబుల్ కరెక్ట్‌గా చెప్పింది. ఈ గేమ్‌లో అంతో ఇంతో కల్యాణ్ నాలుగు పాయింట్లు గెలిచాడు. ఇమ్మూ ఆరు పాయింట్లతో ఈ రౌండ్ విజేతగా నిలిచాడు. సంజనా ఔట్తర్వాత ఇమ్మాన్యుయేల్, సంజనా (Sanjana Galrani)తో బాల్స్ గేమ్ ఆడి గెలిచాడు. ఆటలో ఓడిపోయినందుకు సంజనా బోరుమని ఏడ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే రేసు నుంచి సంజనా వైదొలిగింది. తర్వాత పూల గేమ్‌లో భరణి, తనూజ, డిమాన్ పవన్ తలపడ్డారు. ఫిజికల్ అవుతున్నావ్, ఫిజికల్ అవుతున్నావ్ అని తనూజ పదేపదే అనేసరికి పవన్ కాస్త సైలెంట్ అయిపోయాడు. అలా తెలివిగా ఈ ఆటలో తనూజ గెలిచింది. తర్వాతి తన గేమ్ కోసం సుమన్ శెట్టిని ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో చూడాలి! -
బిగ్‌బాస్‌కే ఆర్డరేసిన తనూజ.. భరణిఫైర్..
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని సరదా టాస్కులు, ప్రమోషనల్ టాస్కులుంటాయి. అవి ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదో ఫ్లోలో సరదాగా ఆడుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ కూడా గొడవపడొచ్చని తాజా ప్రోమోతో రుజువైంది. ప్రోమోలో చూపించినదాని ప్రకారం.. భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్ ఒక టీమ్ అయితే రీతూ, తనూజ, కల్యాణ్ మరో టీమ్‌గా విడిపోయారు. బిగ్‌బాస్‌కే ఆర్డర్భరణి టీమ్‌లో ఉన్న దివ్య ఈ గేమ్‌కు సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ ఆటలో భరణి టీమ్ గెలవగా తనూజ టీమ్ ఓడిపోయింది. అది తనూజ జీర్ణించుకోలేకపోయింది. ఈ సీజన్ మొత్తం దివ్యనే సంచాలకురాలిగా పెట్టండి అని బిగ్‌బాస్‌కే ఆర్డరేసింది. అది చూసి చిరాకుపడ్డ భరణి.. రూల్స్ నీకు ఒక్కదానికే తెలిసినట్లు మాట్లాడతావేంటి? అని అసహనం వ్యక్తం చేశాడు.తనూజపై భరణి ఫైర్అప్పటికీ తనూజ (Thanuja Puttaswamy) తగ్గకపోయేసరికి.. నేను ఊరికే లొడలొడా వాగను.. అవసరమైనప్పుడు కచ్చితంగా మాట్లాడతా అన్నాడు. వాగుడు, పిచ్చి మాటలు అని మీరనకండి.. అంటూ భరణితో అడ్డంగా వాదించింది తనూజ. ఇది చూసిన జనాలు.. ఇక్కడ కూడా గొడవేంట్రా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్‌బాస్9: ఈసారి లేడీ విన్నర్? లేదా కల్యాణ్ గెలుస్తాడా?
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్లో ఫస్ట్ నుంచి బోలెడంత పాపులారిటీ ఉన్న వ్యక్తి తనూజ. అందుకే అందరికంటే ముందుగా ఈమె విన్నింగ్ రేసులోకి వచ్చింది. మిగతా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మరి నిజంగా వార్ వన్‌సైడ్ అయిందా? తనూజయే గెలుస్తుందా స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.తనూజ చుట్టూ బిగ్‌బాస్ 9ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కానెక్టయిన వ్యక్తి తనూజ (Thanuja Puttaswamy). గేమ్స్ తనవరకు వస్తే బాగానే ఆడుతుంది. తన తప్పు ఉందని ఎవరైనా అంటే గట్టిగా వాదిస్తుంది. షో మొదటి నుంచి ఇప్పటివరకు చూస్తే గేమ్ అంతా తనచుట్టూనే ఎక్కువగా తిరిగింది. కాకపోతే తనపై తనకు నమ్మకం తక్కువ. బలమైన ఓటింగ్అన్నింటికీ సపోర్టింగ్ గేమ్ కావాలనుకుంటుంది. అలాగైతే ఈజీగా గెలిచేస్తానని తన అభిప్రాయం. కానీ వీకెండ్లో మాత్రం తనకెవరూ సపోర్ట్ చేయడంలేదని అవలీలగా అబద్ధం చెప్తుంది. ఇలా రెండు నాలుకల మాటలు తనకు వ్యతిరేకత తీసుకొచ్చాయి. అయినప్పటికీ తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో (ఓటీటీ సీజన్ మినహా) తొలి లేడీ విన్నర్ అయ్యే అవకాశాలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి. తనకు అభిమానులతో పాటు సీరియల్ ప్రేక్షకుల ఓటింగ్ ఆ రేంజ్లో ఉంది.నెక్స్ట్ పవన్ కల్యాణ్ పడాలమొదట్లో కల్యాణ్ (Pawan Kalyan Padala) ఎందుకున్నాడు? అని జనాలే విమర్శించారు. అమ్మాయిలను అదోలా చూస్తూ ఛాన్స్ దొరికితే వారి చేయి పట్టుకుంటూ కాస్త తేడాగా ప్రవర్తించాడు. కానీ, నాగ్ ఎప్పుడైతే చేతులు పిసకడం ఆపేయ్ అని ముఖం పట్టుకుని అన్నాడో అప్పుడే తన పంథా మార్చుకున్నాడు. కల్యాణ్ అంటే ఏంటో చూపించాడు. గేమ్సై్ బాగా ఆడాడు. కాకపోతే నామినేషన్స్ తీసుకునేవాడు కాడు. ఇది టాప్ 5కి సరిపోతుంది. గెలుపుకు కాదు. ఇక్కడ అతడి ఫ్యాన్స్ జవాన్ అన్న కార్డు ఉపయోగించారు. మరో పల్లవి ప్రశాంత్జై జవాన్ అంటూ కల్యాణ్‌ను ఆకాశానికెత్తారు. ఏడో సీజన్లో రైతు బిడ్డ అనే ఏకైక సింపతీ కార్డుతో పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. ఇప్పుడదే విధంగా సైనికుడు అనే కార్డుతో కల్యాణ్ టైటిల్ ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే అతడి పీఆర్ స్ట్రాటజీలు ఆ రేంజ్లో ఉన్నాయి. జై జవాన్ జై కిసాన్ అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ నినాదాలు మొదలుపెట్టారు.మంచోడే కానీ ఎక్కువ హైప్కల్యాణ్కు యాక్టింగ్ అంటే ఇష్టం.. ఇక్కడ అవకాశాలు వస్తే సైనిక వృత్తిని వదిలేస్తా అని అతడు ఓపెన్‌గా చెప్పినాస సరే ఓ సైనికా.. అంటూ పాటలు, మీమ్స్‌తో కావాల్సినదానికంటే ఎక్కువ హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఓటింగ్‌లోనూ తనూజతో పోటీపడే స్థాయికి చేరుకున్నాడు. పైగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఈ మధ్య కల్యాణ్‌ను పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకుంది. ఇదంతా చూస్తుంటే బిగ్‌బాస్ అతడిని గెలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.మిగిలింది ఇమ్మాన్యుయేల్ఇమ్మాన్యుయేల్ (Emmanuel) ఆల్‌రౌండర్. గేమ్స్ వచ్చాయంటే ప్రాణం పెట్టి ఆడతాడు. మిగతా సమయాల్లో కడుపుబ్బా నవ్విస్తాడు. కానీ, గెలవాలంటే ఇది సరిపోదు. భయపడకుండా ఆడాలి. అది ఇమ్మూకి లేదు. నామినేషన్స్ అంటే భయం. ఎవరైనా నామినేట్ చేస్తే నిలువెల్లా వణికిపోతాడు. దాదాపు 10 వారాలపాటు నామినేషన్స్‌లోకి రాకపోవడం మైనస్ అయింది. కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడటం కూడా జనాల్లో కాస్త నెగెటివిటీ తీసుకొచ్చింది. అయినప్పటికీ అతడికి కూడా మంచి ఓట్లే పడుతున్నాయి. సూట్‌కేస్ తీసుకోవడం మేలుకానీ, గెలవాలంటే ఇది సరిపోదు. ఓట్ల సంఖ్య మరింత పుంజుకోవాలి. ఒకవేళ ఫైనల్లో తన స్థానం టాప్ 3 అని తెలిస్తే మాత్రం అతడు లక్షలు ఉన్న సూట్‌కేస్ తీసుకోవడమే ఉత్తమం. తన కష్టానికి ప్రతిఫలంగా ఆ డబ్బయినా పనికొస్తుంది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ 9కు శుభం కార్డు పడనుంది. మరి ఈ లోపు ఓటింగ్‌ను తారుమారు చేసేలా ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమో చూడాలి!చదవండి: బిగ్‌బాస్9 : చివరి కెప్టెన్‌గా కల్యాణ్? పవన్ ఓడించి మరీ.. -
ప్రేరణ ఎంట్రీ.. ధైర్యంగా ముందుకొచ్చి బొక్కబోర్లా పడ్డ తనూజ
Bigg Boss Telugu 9: ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్లాక హౌస్మేట్స్ ముఖాలు వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతున్నాయి. ఈవారం చివరి కెప్టెన్సీని చేజిక్కించుకునేందుకు అందరూ తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ అవడానికి మాజీ కంటెస్టెంట్లతో గేమ్ ఆడి గెలవాలి. అలా ప్రియాంకతో కలిసి గేమ్ ఆడి కల్యాణ్ గెలిచి కంటెండర్ అయ్యాడు. గౌతమ్‌తో ఆడి భరణి ఓడిపోయాడు.తనూజ అవుట్తాజాగా ప్రేరణ.. తనూజతో గేమ్ ఆడింది. ఈమేరకు ఓప్రోమో వదిలారు. మీరు టఫ్ ప్లేయర్.. మీతో ఆడాలని ఉంది అని చెప్పింది తనూజ. ఇద్దరూ గేమ్‌లో బాగా కష్టపడ్డారు. కానీ చివరకు ప్రేరణ తనూజను ఓడించినట్లు తెలుస్తోంది. దీంతో తనూజ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయింది. హౌస్‌లోకి మానస్, యావర్, శోభాశెట్టి వంటి సెలబ్రిటీలు కూడా రానున్నారు. వీరితో కంటెస్టెంట్లు గేమ్ ఆడి గెలిచిన డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ కెప్టెన్సీ కంటెండర్లు అయినట్లు తెలస్తోంది. వీరి వీరిలో ఎవరు కెప్టెన్ అన్నది చూడాలి! చదవండి: గంటకు ఎంత? అని చీప్ కామెంట్స్: నటి -
తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్ వైరల్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్లో భరణితో తనూజ, దివ్యల బాండింగ్ బాగా వైరల్ అయింది. ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు. తనూజతో భరణి క్లోజ్‌గా మాట్లాడితే చాలు దివ్యకు కోపం వచ్చేస్తుంది. తనూజ కాలికి నూనె రాసినప్పుడు, ఆమె కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ తనూజ మీద దివ్య ఫైర్ అవుతూనే ఉంది. దీంతో గేమ్ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు. భరణి విషయంలో ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.తనూజ, భరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు. 'తనూజ- భరణిల మధ్య మంచి బాండింగ్ ఉంది. ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది. వారిద్దరిపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటూ చాలా బాగున్నాయి.. వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది. తనూజ గేమ్ కూడా నాకు బాగా నచ్చింది. అయితే, ఫ్యామిలీ వారంలో హౌస్‌లోకి నేనే వెళ్లాల్సింది. కానీ, నా అన్న కూతురు వెళ్లింది. ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని. కానీ, దివ్య, తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. దివ్య కూడా భరణి పట్ల మంచి అభిమానం చూపుతుంది. అయితే, ఆమె కాస్త గట్టిగా, డిమాండ్ చేసినట్లు భరణితో మాట్లడటం.. ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్‌గా మాట్లాడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు. అంతేకానీ దివ్యతో ఎలాంటి సమస్య లేదు. దివ్య, భరణిలను ట్రోల్ చేసే వారు కాస్త ఆపండి. కానీ, తనూజ ఎప్పుడు కూడా భరణిని డిమాండ్ చేస్తూ మాట్లాడలేదు. తను చాలా క్యూట్‌గా అన్నయ్యతో మాట్లాడుతుంది.' అని ఆరతి పేర్కొంది. -
ఇదేమైనా చిన్నపిల్లల ఆటనా?: తనూజను నామినేట్ చేసిన భరణి
మండే వచ్చిందంటే నామినేషన్స్ పండగ. గొడవలు, అరుపులు, కేకలతో బిగ్‌బాస్ హౌస్ దద్దరిల్లుతుంది. గత వారం తనూజ, దివ్య ఎంతలా అరుచుకున్నారో అందరం చూశాం. మరి ఈ వారం ఎవరి మధ్య వార్ జరగనుందో చూడాలి! 12వ వారం నామినేషన్స్‌కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. 12వ వారం నామినేషన్స్ఈసారి నామినేషన్స్ రెండు లెవల్స్‌లో ఉంటుందన్నాడు బిగ్‌బాస్. మొదటగా ప్రైవేట్ నామినేషన్స్ జరుగుతాయన్నాడు. అలా ప్రతి ఒక్కరూ ఫేస్ టు ఫేస్ కాకుండా ప్రైవేట్‌గా నామినేట్ చేశారు. అలా ఇమ్మాన్యుయేల్.. పవన్‌ను, కల్యాణ్.. సుమన్‌ను, పవన్.. కల్యాణ్‌ను నామినేట్ చేశారు. 'ఇద్దరి గొడవల్లో తనూజ మళ్లీ నన్ను లాగింది. ఇదేదో చిన్నపిల్లల ఆటలా అయిపోతుంది. నామినేషన్స్‌లో ఎవరంటే?ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ మెచ్యూర్డ్‌గా ప్రవర్తించట్లేదు' అంటూ భరణి.. తనూజను నామినేట్ చేశాడు. నావైపు నిల్చుంటారని కోరుకున్నప్పుడు ఆయన లేరు. అది నా గేమ్‌ను ఎఫెక్ట్ చేసిందంటూ దివ్య.. భరణిని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ రీతూ తప్ప మిగతా 8 మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇమ్మూ బలవంతం.. ఫలించిన బిగ్‌బాస్ స్కెచ్ -
ఇమ్మూపై ఒత్తిడి.. దివ్య సేఫ్.. హర్టయిన తనూజ
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) భలే తెలివైనోడు.. ఇమ్మాన్యుయేల్‌తో కావాలని పవరాస్త్ర వాడించి ఎలిమినేషన్ రద్దు చేశాడు. తర్వాత మాత్రం ఒకరు వెళ్లిపోతే నీకు పోటీ తగ్గేది కదా అని నాగార్జునతో డైలాగులు కొట్టించాడు. మరి సండే ఎపిసోడ్(నవంబర్ 23)లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారో చూసేద్దాం..సుమన్ కోసం పిల్లలుసుమన్ శెట్టి కోసం అతడి పిల్లలిద్దరూ వచ్చారు. వాళ్లను చూడగానే సుమన్‌కు కళ్లలో నీళ్లు తిరిగాయి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చి.. గేమ్ బాగా ఆడాలని సుమన్‌కు సూచించాడు. సుమన్, ఇమ్మూ, తనూజా, భరణి, కళ్యాణ్‌ను టాప్ 5లో వరుసగా పెట్టారు. తర్వాత సంజన కోసం ఆమె తల్లి, మేనల్లుడు వచ్చారు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించకుండా సొంతంగా ఆడు, ఎక్కువ కంప్లైంట్స్ చేయొద్దని సలహా ఇచ్చారు. సంజన, ఇమ్మూ, కల్యాణ్, తనూజ, సుమన్‌ను టాప్ 5లో పెట్టారు.రీతూ కోసం అఖిలతర్వాత రీతూ కోసం ఆమె సోదరుడితో పాటు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ వచ్చారు. నెగెటివిటీ అంతా పోయి పాజిటివిటీతో బయటకు వస్తున్నావ్ అని అఖిల్ చెప్పడంతో రీతూ ఎగిరి గంతేసింది. రీతూ, తనూజా, కళ్యాణ్, ఇమ్మూ, డిమాన్ పవన్‌ను టాప్ 5లో పెట్టారు. అనంతరం తనూజ కోసం ముద్దమందారం సీరియల్ యాక్టర్స్ పవన్ సాయి, హరిత వచ్చారు. వాళ్లను చూడగానే తనూజ ఏడ్చేసింది. మనీష్‌కు కౌంటర్పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. నువ్వు ఎక్కడో పైనున్నావని అర్థం.. నిన్ను చూసి గర్వపడుతున్నాం అంది హరిత. అలాగే కొన్ని వారాల క్రితం మనీష్ వచ్చి.. ముద్దుముద్దు మాటలు చెప్పి చెవిలో మందారపూలు పెడుతున్నారు అని చెప్పిన డైలాగ్‌కు ఇప్పుడు కౌంటరిచ్చింది. ముద్దు మాటలతో మందారం చెవిలో పెడుతుందన్నారు. నీ చెవిలో పూలు పెట్టేవాళ్లు నీ చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్త.. ఆ పూలను మాల కట్టి వికసించేలా చేయాలి అని హరిత అంది.దివ్యను కాపాడేందుకు స్కెచ్డిమాన్ పవన్ (Demon Pavan) కోసం ఆయన తండ్రి, స్నేహితుడు స్టేజీపైకి వచ్చారు. నాకు నీతి, నిజాయితీగా ఉండటమే వచ్చు.. నా కొడుక్కి అదే నేర్పించా అన్నాడు తండ్రి. డెమోన్, ఇమ్ము, సంజన, తనూజా, రీతూను టాప్ 5లో పెట్టారు. అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో దివ్య, సంజన మిగిలారు. ఇమ్మాన్యుయేల్ పవరాస్త్ర వాడితే ఈ వారం ఎలిమినేషన్ ఉండదన్నాడు నాగ్.నో ఎలిమినేషన్ఆ పవరాస్త్రకు ఉన్న శక్తి ఈవారంతో నిర్వీర్యం అయిపోతుందన్నాడు. దీంతో ఇమ్మూ పవరాస్త్ర వాడగా నో ఎలిమినేషన్ ప్రకటించాడు నాగ్. అనంతరం దివ్యకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలిపాడు. దివ్య బతికిపోడంతో తనూజ ఫీలైనట్లు కనిపించింది. పవరాస్త్ర ఇప్పుడెందుకు వాడావు? తర్వాత ఫినాలే సమయంలో వాడుకోవచ్చుగా అంది. ఆల్రెడీ నాగ్.. దాన్ని తర్వాతి వారం నుంచి వాడేందుకు వీల్లేదన్నాడు. అయినా తనూజ అలాంటి కామెంట్ చేసిందంటే దివ్య సేవ్ చేసినందుకు కాస్త హర్ట్ అయినట్లే కనిపిస్తోంది!చదవండి: సిక్స్ ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్ -
అది నా పిల్లరా..: ముద్ద మందారం హీరో
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) కంటెస్టెంట్ల కోసం వీకెండ్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు సెలబ్రిటీలు వచ్చేస్తున్నారు. నిన్న భరణి కోసం నాగబాబు రాగా, నేడు తనూజ కోసం ముద్దమందారం సీరియల్ స్టార్స్ స్టేజీపైకి వచ్చేశారు. సుమన్ కోసం కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.లేడీ సింగంసీరియల్ నటి హరితను చూడగానే తనూజ చాలా మిస్ అయ్యానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అటు హరిత కూడా ఎమోషనలైంది. ముద్దమందారం హీరో పవన్.. తనూజను లేడీ సింగంగా అభివర్ణించాడు. తర్వాత అర్జున్ రెడ్డి ఫోటో ఉన్న కార్డ్‌ను బయటకు తీశాడు. దీంతో నాగ్.. ఆ సినిమాలోని ఓ డైలాగ్ చెప్పమన్నాడు. అందుకు పవన్.. అది నా పిల్ల అని చెప్పాడు. నాన్నగారు జాగ్రత్తగా చూసుకోండి అని భరణికి సలహా ఇచ్చాడు.ఎమోషనల్ ప్రోమోనాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు. నిన్ను కప్పుతో చూడాలని ఆయన కోరుకుంటున్నారు అని హరిత చెప్పగానే తనూజ భావోద్వేగానికి లోనైంది. ఈ ప్రోమో చూసిన తనూజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నింటికన్నా.. అది నా పిల్ల అనే డైలాగ్ బాగా హైలైట్ అయిందంటున్నారు. మరి దానికి కల్యాణ్ ఎలా ఫీలవుతున్నాడో? ఏంటో! చదవండి: ఈ వారం నో ఎలిమినేషన్.. దివ్యను కాపాడేందుకే! -
తనూజ వల్ల సుమన్ బలి.. పవన్‌పై చిన్నచూపు?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో పదకొండోవారం కెప్టెన్ రీతూ అన్న విషయం ఈపాటకే బయటకు వచ్చేసింది. అయినప్పటికీ అదేదో సస్పెన్స్ అన్నట్లుగా సాగదీస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ వేయనేలేదు. ఈరోజు ఎపిసోడ్లో సుమన్, రీతూ కెప్టెన్సీ కోసం ఎలా పోటీపడ్డారో చూపించనున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో వదిలారు.బోల్తా కొట్టిన సుమన్ఇందులో సుమన్ చకచకా ఆడేశాడు. చివర్లో ఓ బోర్డు సెట్ చేస్తుంటే సంచాలక్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. పర్లేదు, వెళ్లు వెళ్లంటూ పంపించేసింది. అలా ఫస్ట్ సుమన్ కెప్టెన్ అని రాసున్న జెండా ఎగరేశాడు. కొద్ది క్షణాల తేడాతో రీతూ జెండా ఎగరేసింది. అయితే సుమన్ చివరి బోర్డ్ సరిగా పెట్టలేదని డిమాన్ పవన్ ప్రశ్న లేవనెత్తాడు. అది దగ్గరుండి మరీ చూపించాడు. సైలెంట్ అయిన తనూజదాంతో తనూజ.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్? నువ్వేంటి చెప్పేది? అని పవన్‌ను తీసిపడేసింది. ఇంతలో కల్యాణ్.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డ్ వదిలేశాడని వాదించాడు. దీంతో తనూజ సైలెంట్ అయిపోయింది. తనూజ చేసిన ఆగం పని వల్ల సుమన్ బలైపోయాడు. రీతూ కెప్టెన్ అయింది. చదవండి: సీజన్లో పెద్ద లొల్లి.. సీరియల్ స్టార్ వర్సెస్ సింపతీ స్టార్ -
ఏయ్, నువ్వేం పొడిచావ్? సీజన్లోనే పెద్ద లొల్లి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లోకి చివరగా ఇమ్మాన్యుయేల్ తల్లి వచ్చింది. నేను వద్దనుకున్న కొడుకే ఈరోజు నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చాడని తెగ మురిసిపోయింది. కొడుక్కి ప్రేమగా గోరుముద్దలు తినిపించింది. మరి ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 21వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూకి డబుల్ ధమాకాఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు బిగ్‌బాస్ డబుల్ బొనాంజా ఇచ్చాడు. తల్లిని బయటకు పంపించేశాక ప్రియురాలు పంపిన లేఖ, ఎంగేజ్మెంట్ రింగ్‌ను ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఇది చూసి ఇమ్మూ తెగ సంబరపడిపోయాడు. తర్వాత ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ జరిగింది. ముందుగా కెప్టెన్సీకి అనర్హులు అనుకున్నవారిని గేమ్‌లో నుంచి తీసేయాలన్నాడు. దాంతో మొదటగా దివ్య.. తనూజ పేరు చెప్పింది. పర్సనల్ అటాక్ఆల్రెడీ రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చింది. మళ్లీ ఇంకో వారం ఇమ్యూనిటీ అవసరం లేదంటూ తనూజను తీసేసింది. అది తనూజకు నచ్చలేదు. ఎందుకు నా మీద పడి ఏడుస్తున్నావ్? అంటూ ఒంటికాలిపై లేచింది. దివ్య కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. బయట రివ్యూలు సరిపోవన్నట్లు ఇక్కడికి వచ్చి చేస్తున్నావ్.. నువ్వే సింపథీ స్టార్ అంటూ తనూజ మరింత అగ్గిరాజేసింది.గేమ్ కోసం వాడుకోనునీలాగా మనుషుల్ని గేమ్ కోసం వాడుకోను అని దివ్య.. ఒక మనిషి ఇష్టం లేదంటున్నా వెంటపడుతున్నావ్.. అని తనూజ మధ్యలో భరణిని లాగారు. దాంతో ఆయన మధ్యలో నన్ను లాగొద్దని చెప్పానుగా అని అసహనం వ్యక్తం చేశాడు. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు.. నేను నీకంటే బెటర్‌గా ఆడా.. అందరిదగ్గరికెళ్లి కెప్టెన్సీ అడుక్కోలేదు.. నిన్ను భరించలేక నన్ను గతంలో కెప్టెన్ చేశారు. నువ్వేం పొడిచింది లేదు. సీరియల్ స్టార్ అంటూ దివ్య తనూజను ఏకిపారేసింది. చివరకు ఆ ఇద్దరుఅలా వీరి గొడవతో హౌస్‌ను తగలబెట్టేసినంత పని చేశారు. దివ్య తర్వాత మెజారిటీ ఇంటిసభ్యులు తనూజను కెప్టెన్‌గా వద్దన్నారు. దీంతో ఆమె గేమ్‌లో లేకుండా పోయింది. అయితే హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్స్‌గా విభజించే బాధ్యతను తనూజకు అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో ఆమె పవన్, కల్యాణ్, రీతూ, సుమన్‌ను బ్లూ టీమ్‌గా మిగిలినవారిని రెడ్ టీమ్‌గా విభజించింది. వీరికి ఓ మాన్స్టర్ గేమ్ ఇచ్చాడు. ఇందులో చివరకు సుమన్, రీతూ మిగిలారు. అయితే రీతూ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. -
నీలాగా గేమ్ కోసం వాడుకోను.. తనూజపై రెచ్చిపోయిన దివ్య
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో దివ్యకు తనూజ అంటే ఏమూలనో కోపం, ద్వేషం, అసూయ ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో తనూజ కాలికి వాపు వచ్చిందని భరణి ప్రేమగా ఆయింట్మెంట్ పూసి మసాజ్ చేశాడు. అది దివ్య తట్టుకోలేకపోయింది. మీ ఆరోగ్యమే బాగోలేదు. చేయి నొప్పి ఉన్నప్పుడు సేవలు చేయడం అవసరమా? అని అరిచింది. ఎవరో ఒకరు చేస్తారుగా.. మీరెందుకు చేయడం అని తిట్టేసింది.తనూజపై అక్కసుపోనీ నిజంగా తనకు భరణిపై అంత కేరింగ్ ఉందా? అంటే.. పోయినవారం బీబీ రాజ్యం గేమ్‌లో భరణితో మసాజ్ చేయించుకుంది. మరి అప్పుడు భరణి నొప్పి గుర్తురాలేదా? అన్నది తనకే తెలియాలి. ఇప్పుడు తనూజ (Thanuja Puttaswamy)పై కోపాన్ని మరోసారి బయటపెట్టింది. ఈమేరకు ఓ ప్రోమో రిలీజైంది. కెప్టెన్సీకి అనర్హులు అనుకుంటున్నవారిని రేసు నుంచి తప్పించాలన్నాడు బిగ్‌బాస్. ఒంటికాలిపై లేచిన తనూజదీంతో దివ్య.. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. ఆల్రెడీ కెప్టెన్‌గా ఈ వారం ఇమ్యూనిటీ పొందావ్. మళ్లీ అది నీకు అవసరం లేదు అని తనూజను తీసేసింది. దాంతో తనూజ.. నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా.. ఎవరూ నా చేతిలో పెట్టలేదు. నీకు నేనే కనిపిస్తున్నానా? వేరేవాళ్లు కనిపించట్లేదా? అని ప్రశ్నించింది. నువ్వు అరిస్తే నేను ఇంకా గట్టిగా అరుస్తా.. 100% నేను కరెక్ట్ ఆన్సరిచ్చా అని దివ్య సమర్థించుకుంది.గేమ్ కోసం వాడుకోనుబానే చెప్పుకున్నావ్ పో.. అని తనూజ వెక్కిరించడంతో దివ్యకు బీపీ లేచింది. నువ్వెవరు పో అనడానికి? రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వేలు చూపించి మాట్లాడింది. అయినా వెనక్కు తగ్గని తనూజ.. ప్రతిదానికి నామీద పడి ఏడుస్తావ్ అని వెటకారం చేసింది. గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు.. నీలాగా అందర్నీ గేమ్ కోసం వాడుకోను అని దివ్య అంది. అలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. నోరుందని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. చదవండి: ఏడవద్దు డాడీ, హీరోగా బయటకు రా: ఇమ్మాన్యుయేల్ -
బిగ్‌బాస్ ఫ్యామిలీ వీక్: తనూజతో తగ్గించండి.. సుమన్‌కి భార్య సలహా
బిగ్‌బాస్ షోలో మిగతా అన్ని వారాలు ఎలా ఉన్నాసరే ఫ్యామిలీ వీక్ అంటే మాత్రం అటు హౌస్మేట్స్, ఇటు ప్రేక్షకులకు బోలెడంత ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ వారమంతా అందరూ ఒక్కటైపోతారు. ఈసారి కూడా ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అంతకంటే ముందు సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగ్గా.. దివ్య, పవన్, భరణి, ఇమ్ము, సంజనా, కల్యాణ్ నామినేట్ అయ్యారు. రీతూ కూడా అయ్యింది కానీ కెప్టెన్ తనూజ వల్ల ఆమె సేవ్ అయిపోయింది.ఈసారి ఫ్యామిలీ వీక్ నేరుగా మొదలుపెట్టేయకుండా బిగ్‌బాస్.. చిక్కుముడి అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓ ఫ్రేమ్‌కి గజిబిజిగా కట్టున్న తాడుని విప్పి, ఒంటికి చుట్టుకుని.. చివరలో దాన్ని విప్పి మాగ్నెటిక్ బోర్డులో ఉన్న టైమ్ కార్డ్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాంబ్ ఉన్న కారణంగా సంజనకు ఈసారి ఛాన్స్ లేదు. దీంతో ఆమెని ఈ టాస్క్ కోసం సంచాలక్‌గా పెట్టారు. కెప్టెన్ కావడంతో తనూజకు నేరుగా టైమ్ తీసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇవ్వడంతో 60 నిమిషాల టైమ్ కార్డ్ తీసుకుంది. తర్వాత పోటీ జరిగింది. ఇమ్మాన్యుయేల్ 45, పవన్ 30, కల్యాణ్ 20, దివ్య 20, సుమన్ 15, రీతూ 15, భరణి 15 నిమిషాల కార్డ్స్ తీసుకున్నారు.(ఇదీ చదవండి: నయనతార బర్త్ డే.. గిఫ్ట్‌గా ఖరీదైన రోల్స్ రాయిస్)తొలుత సుమన్ శెట్టికి అవకాశమొచ్చింది. 16వ పెళ్లిరోజు అని చెప్పి భార్య లాస్య నుంచి లెటర్ వచ్చింది. అలానే ఓ స్పెషల్ కోట్ కూడా వచ్చింది. దీంతో సుమన్ రెడీ కాగానే.. భార్య లాస్య లోపలికి వచ్చింది. చాలారోజుల తర్వాత కలిసేసరికి సుమన్, భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేశాడు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చివరలో లాస్య.. 'టాప్-5లో ఉండాలి. గెలిస్తే ఇంకా హ్యాపీ. తనూజతో తగ్గించండి. హైప్లో ఉండేవాళ్లని దగ్గర చేసుకుంటుంది. ఏడవద్దు' అని చెప్పి వెళ్లిపోయింది.సుమన్ భార్య వెళ్లిపోయిన కాసేపటి తర్వాత తనూజ ఫ్యామిలీ నుంచి వచ్చారు. చెల్లితో పాటు అక్క కూతురు శ్రేష్ఠ హౌస్‌లోకి వచ్చింది. చెల్లి పూజ లోపలికి రాగానే.. పెళ్లి కూతురు పూజ అని చెబుతూ హౌస్మేట్స్ అందరికీ తనూజ తన చెల్లిని పరిచయం చేసింది. తనే చెల్లి, కానీ నాకు అమ్మ లాంటిది అని కూడా అందరితో చెప్పింది. ఇద్దరూ సెపరేట్‌గా వెళ్లి మాట్లాడుకున్నారు. 'ఎక్కువగా బాధపడకు, ఏడవుకు. అను, అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. నా పెళ్లికి కొన్నిరోజులే ఉంది. నువ్వు గేమ్ ఆడేదంతా ఫెర్ఫెక్ట్గా ఉంది. నువ్వే చేస్తావో నాకు తెలీదు నువ్వే గెలవాలి. నా పెళ్లికి బిగ్‌బాస్ టైటిల్ కావాలి' అని పూజ, తనూజకి మంచి బూస్టప్ ఇచ్చింది. చివరికు పూజని పెళ్లి కూతురిని చేసి, ఆమెని హౌస్ నుంచి పంపించారు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'రాధేశ్యామ్' దర్శకుడి ఇంట్లో విషాదం) -
బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ'
బిగ్‌బాస్ 9 తెలుగులో ఈ వారం మొత్తం సందడిగా కనిపించనుంది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో ఎమోషన్స్‌తో పాటు సంతోష క్షణాలు కనిపిస్తాయి. సుమారు 70రోజుల తర్వాత తమ కుటుంబ సభ్యులను చూస్తుండటంతో అందరూ భావోద్వేగానికి లోనవుతారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా ఫస్ట్ ఎంట్రీ తనూజ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ టీమ్ ప్రోమో వదిలింది.తనూజ చెల్లి పూజ బిగ్‌బాస్‌లోకి వచ్చింది. తనను చూడగానే ఒక్కసారిగా తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. కొద్దిరోజుల్లోనే తన పెళ్లి ఉందంటూ పూజను అందరికీ పరిచయం చేస్తుంది. తనూజ బిగ్‌బాస్‌లో ఉండటం వల్ల పెళ్లికి వెళ్లడం కుదరదు. దీంతో ఆమె మరింత ఎమోషనల్ అయిపోయింది. హౌస్‌లోనే పసుపు, కుంకుమతో పాటు బొట్టు పెట్టి ఆపై కొన్ని గాజులు, బట్టలు తన చెల్లి ఒడిలో పెడుతుంది. అక్కగా ఆశీర్వదించగా పూజ కూడా తనూజ కాళ్లకు నమష్కారం చేస్తుంది. తనూజ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. అక్క అనూజ లాయర్ కాగా.. చెల్లి పూజ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనూజకు ఇప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె కూతురు కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. -
సంజన కోసం రీతూ త్యాగం.. ఇలాగైతే తనూజ గెలవడం కష్టమే!
వారాలు గడిచేకొద్దీ ఎవరైనా తమను తాము సాన పెట్టుకుని ముందుకెళ్తారు. కానీ, తనూజ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది. చీటికిమాటికి నోరు పారేసుకుంటూ గొడవపడుతూ చికాకు పుట్టిస్తోంది. తనూజ నా బలహీనత అని ఇమ్మూ శనివారం ఎపిసోడ్లో చెప్పినందుకు అతడ్ని చెడుగుడు ఆడేసుకుంది. మరోవైపు రీతూ ఫేవరెట్ హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చేసరికి తను గాల్లో తేలిపోయింది. హౌస్‌లో ఇంకా ఏం జరిగిందో ఆదివారం (నవంబర్ 16వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...ఇమ్మూతో గొడవనీకు, నాకు మధ్య ఏ బాండింగ్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. నేనెలా నీకు బలహీనత అవుతాను అంటూ తనూజ (Thanuja Puttaswamy) ఇమ్మూని నిలదీసింది. అందుకతడు.. నువ్వేదైనా అంటే పర్సనల్‌గా ఫీలవుతా.. అది నా వీక్నెస్ అన్నాడు. అక్కడే ఉన్న రీతూ కూడా.. మేము బయట చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. కాకపోతే నాకంటే వాడికి నువ్వే ఎక్కువని చెప్పాడు అంది. అప్పటికీ తనూజ తగ్గలేదు. నన్ను చెడ్డదానిగా చిత్రీకరించకుమూడు వారాల తర్వాత మేము మామూలుగా కూర్చుని మాట్లాడుకుందే లేదంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు వ్యవహరించింది. నాకైతే ఆ బాండ్ ఉంది అని ఇమ్మూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇంకా ఏదో మాట్లాడుతుంటే.. నన్ను బ్యాడ్ చేయకు.. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా.. నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తున్నట్లు, నా మీద ప్రేమ చూపిస్తున్నట్లు చేయకు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా పేరు తేకు అని ఫైర్ అయింది. తనూజకు నాగ్ సలహాసారీ, నీ పేరు ఇంకెప్పుడూ తీసుకోను అని ఇమ్మూ అంటే థాంక్యూ, పాయింట్ ఉంటే నామినేట్ చేయ్ అని సవాలు విసిరింది. ఈ గొడవంతా విన్న నాగార్జున.. అవతలి వారి అభిప్రాయాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నావ్? వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, కానీ, సాగదీయకు అని సలహా ఇచ్చాడు. తర్వాత నాగ్ తనయుడు, హీరో నాగచైతన్య స్టేజీపైకి వచ్చాడు. రీతూ గెలిస్తేనే ఆఫర్ఈ మధ్యే హైదరాబాద్ రేసింగ్ టీమ్ కొనుగోలు చేశానంటూ తన టీమ్ అందర్నీ పరిచయం చేశాడు. ఇక చైతో రైడ్ అనగానే హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానంది రీతూ. ఇప్పుడెందుకు? గెలిచిరా.. అప్పుడు రైడ్‌కు తీసుకెళ్తానన్నాడు చై. చివరగా దివ్యను సేవ్ చేసి గౌరవ్ (Gaurav Gupta) ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి గౌరవ్‌ను సేవ్ చేసి దివ్యను ఎలిమినేట్ చేయొచ్చన్నాడు నాగ్.గౌరవ్ ఎలిమినేట్కానీ, తనూజ ప్రేక్షకుల ఓట్లకు గౌరవం ఇస్తున్నానంటూ తన దగ్గరున్న పవర్ వాడలేదు. దీంతో చిట్టచివరి ఫైర్ స్ట్రామ్ గౌరవ్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తండ్రి షర్ట్ కోసం సంజనా చీరల్ని పంపించేసిన రీతూ యూటర్న్ తీసుకుంది. సంజనాకు చీరల్ని పంపించండి, నేను షర్ట్ వెనక్కు ఇచ్చేస్తానంది. అందుకు నాగ్ ఒప్పుకోవడంతో ఆమెకు చీరలు రానున్నాయి.చదవండి: గౌరవ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించాడంటే? -
నేను చచ్చిపోతా.. నన్ను పంపించేయండి.. వెక్కెక్కి ఏడ్చిన సంజనా
Bigg Boss Telugu 9: ఫైర్ స్ట్రామ్స్ అంటూ ఆరుగారు వైల్డ్‌కార్డ్స్‌ను హౌస్‌లోకి తెచ్చారు. వచ్చినవాళ్లందరూ వరుసగా ఎలిమినేషన్ బండెక్కి ఇంటికి వెళ్లిపోయారు. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ ఎలిమినేట్ అవగా ఈరోజు గౌరవ్‌ను పంపించేయనున్నారు. దీంతో ఫైర్ స్ట్రామ్ కాస్తా ఫెయిల్ స్ట్రామ్‌గా మిగిలిపోయింది. మరి శనివారం (నవంబర్ 15వ) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చూసేద్దాం..పవన్‌కు క్లీన్ చిట్బీబీ రాజ్యం అనే గేమ్‌లో రాణి దివ్య ఆదేశాల మేరకు పవన్.. తనూజను కాస్త తోసినట్లు చేశాడు. ఆమాత్రం దానికే తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ పెద్ద నింద వేసింది. ఊరుకుంటే ఎత్తుకునేవాడివేమో అంటూ నానామాటలంది. దానిపై నాగ్ కాస్త సున్నితంగానే తనూజకు క్లాస్ పీకాడు. ఇక్కడ ఆడ,మగ తేడా లేదు. రాణి ఆదేశాలను పవన్ పాటించాడు తప్ప అతడు ఏ తప్పూ చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చాడు.సంజనాపై బిగ్ బాంబ్ఇక హౌస్‌లో రెండు బిగ్బాంబ్స్ వేశాడు నాగ్. ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాగా రెండోది చెప్పేముందు ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో మీకు సపోర్ట్‌గా ఉన్నదెవరు? మీ ఆటను ముంచుతోందెవరు? అనేది చెప్పాలన్నాడు. మెజారిటీ ఇంటిసభ్యులు సంజనా (Sanjana Galrani) వల్లే ఆట చెడిపోతుంది అని అభిప్రాయపడ్డారు. దాంతో రెండో బిగ్ బాంబ్ సంజన మీద పడుతుందని నాగ్ అన్నాడు. తీరా ఆ బాంబ్‌లో ఉన్నది మరేంటో కాదు, నో ఫ్యామిలీ వీక్.గుక్కపెట్టి ఏడ్చిన సంజనాఇప్పటికే చంటిపిల్లలకు దూరంగా ఉన్న సంజనా.. రాత్రిళ్లు దుప్పటి కప్పుకుని ఏడుస్తున్నా రోజంతా మాత్రం చలాకీగానే ఉంటోంది. ఫ్యామిలీ వీక్‌లో పిల్లలు వస్తారన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటిది తన కోసం ఎవరూ రారని అనడంతో గుక్కపెట్టి ఏడ్చింది. నేను ఇంటికెళ్లిపోతాను సర్.. నా వల్లకాదు, నేను చచ్చిపోతా.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను. ఇంక నావల్ల కాదు. నేనిక్కడ ఉండలేను అంటూ వెక్కెక్కి ఏడ్చింది.నన్ను ఇంటికి పంపించేయండి సార్ఇంట్లో మెజారిటీ హౌస్మేట్స్ నీవల్లే వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. వేరేవాళ్ల పేరు వచ్చుంటే ఆ బాంబ్ ఇంకొకరిపై పడేది. ఇది బిగ్‌బాస్ నిర్ణయం అన్నాడు నాగ్. ఇంతలో కల్యాణ్, భరణి.. సంజనా కోసం తమ ఫ్యామిలీ వీక్ త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, అందుకు నాగ్ ఒప్పుకోలేదు. బాధను భరించలేకపోయిన సంజనా.. నన్ను ఇంటికి పంపించేయండి సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు అని బతిమాలుకుంది. అప్పటికీ నాగ్ మనసు కరగలేదు. నిఖిల్ ఎలిమినేట్అయితే నిజంగా ఫ్యామిలీ వీక్ లేకుండా పోయే ఛాన్సే లేదు. గతంలో కూడా తేజకు ఫ్యామిలీ వీక్ లేదన్నారు. కట్ చేస్తే చివర్లో అతడి తల్లిని పంపారు. ఇప్పుడు కూడా అలాగే చివర్లో సంజనా ఫ్యామిలీని పంపించి మరింత ఎమోషన్స్ రాబట్టి టీఆర్పీ దండుకునే ప్లాన్ చేస్తున్నారు. ఎపిసోడ్ చివర్లో నిఖిల్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. వారమంతా బాగానే కష్టపడ్డా సరే, ఇలా ఎలిమినేట్ చేశారేంటని నిఖిల్ షాక్ అయ్యాడు. అయినా చేసేదేం లేక సెలవు తీసుకుని బయటకు వచ్చేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9.. నిఖిల్ పారితోషికం ఎంతో తెలుసా? -
కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యంలో మహారాజుగా ఉన్న నిఖిల్, రాణులైన తనూజ, రీతూలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఇందులో తనూజ గెలిచి కెప్టెన్ అయింది. అది కూడా సరిగ్గా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడం విశేషం! మరి తర్వాత హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్ 14వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నన్నెందుకు ఎత్తుకోలేదు?తనూజ కెప్టెన్ అవగానే భరణి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకుని తిప్పారు. అది చూసిన దివ్య.. నేను కెప్టెన్ అయినప్పుడు నన్నెందుకు ఎత్తుకోలేదని ప్రశ్నించింది. దానికి సమాదానం చెప్పలేక భరణి నీళ్లు నమిలాడు. తర్వాత హౌస్మేట్స్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ వారి చిన్నప్పటి ఫోటోలను పంపించాడు బిగ్‌బాస్. వాటిని చూసిన వెంటనే తనూజ ఎమోషనలైంది. అది గమనించిన కల్యాణ్.. ఏడవకు తనూజ అని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తే.. ఆవిడ మాత్రం చిటపటలాడింది.చస్తా.. ఏడుస్తా..నువ్వు ఏదైనా అడిగినప్పుడు నన్ను పూర్తిగా సమాధానం చెప్పనివ్వు అని మండిపడింది. నువ్వు ఆన్సర్ చెప్పట్లేదు, ఏడుస్తున్నావ్.. ఏడుపు ఆపేయ్ అనడం తప్పా? అని కల్యాణ్ (Pawan Kalyan Padala) అడిగాడు. ఇదే నీలో ఉన్న వరస్ట్ పార్ట్.. ఏదైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పనివ్వు. నేను ఏడుస్తానా? చస్తానా? నీకు అనవసరం.. లేకపోతే వదిలెయ్ నన్ను అని చిరాకుపడింది.గుక్కపెట్టి ఏడ్చిన కల్యాణ్తర్వాత కల్యాణ్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటో చూసి ఎమోషనలయ్యాడు. నేను పుట్టినప్పుడు నాన్నకు బిజినెస్‌లో అంతా కలిసొచ్చింది. కొన్నేళ్లకు వాళ్ల ఫ్రెండ్స్ వల్ల జీరోకు వచ్చేశాడు. నన్ను ఫస్ట్ క్లాస్‌లోనే అత్తయ్య దగ్గరకు పంపారు. తర్వాత హాస్టల్లో వేశారు. అమ్మానాన్నతో కలిసి తిరిగింది గుర్తు లేదు. వాళ్లు నా పక్కన లేరని బాధుండేది. నేనేం చేశానని ఇలా దూరం పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. హాస్టల్ వార్డెన్ దగ్గర ప్రతి ఆదివారం వారి నుంచి ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. ఏడిపించేసిన ఇమ్మూకానీ నెలకోసారి మాత్రమే ఫోన్ వచ్చేది. నా 23 ఏళ్లలో నేను నాలుగేళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్‌కి తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. మా ఇంట్లో తినడానికి తిండి ఉండేది కాదు. మాది పాక ఇల్లు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దన్నాడట. అమ్మమ్మ మాత్రం.. పుట్టబోయే వాడి వల్ల మీ జీవితం మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పుడు తిండి లేక అమ్మ పొలం దగ్గర మట్టి బుక్కేది. నా జీవితంలో సూపర్ హీరోచిన్నప్పటినుంచే అన్న, నేను పొలం పనులు, పత్తి ఏరడం, సిమెంట్ పని.. ఇలా చాలా చేశాం. ఎంతో కష్టపడ్డాం. నా జీవితంలో మా అన్నే సూపర్ హీరో. ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు అని అందరూ అనడంతో వాడు ఫీలైపోయేవాడు. కానీ, కచ్చితంగా ఒకరోజు డైరెక్టర్ అవుతాడు అంటూ ఏడ్చేశాడు. అంతా అమ్మ వల్లే..తనూజకు అక్కతో దిగిన ఫోటో వచ్చింది. ఆమె మాట్లాడుతూ.. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం.. ముగ్గురు ఆడపిల్లలంటే కష్టమే.. పెళ్లి చేసేయండి అని కొందరు నాన్నతో అనేవాళ్లు. నాన్న కూడా భయపడి వీళ్లను చదివించొద్దు, పెళ్లి చేసేద్దామన్నారు. కానీ, అమ్మ.. మా కోసం నాన్నకు దూరంగా ఉన్నా పర్లేదని హైదరాబాద్ వచ్చేసింది. నువ్వు చేయగలవు, ముందుకెళ్లు అని వెన్నుతట్టి ప్రోత్సహించింది. రౌడీగా దివ్యతర్వాత అమ్మానాన్న కలిసిపోయారనుకోండి. అయినా అమ్మ వల్లే నేనిక్కడ ఉన్నాను అంటూ తనూజ హ్యాపీగా ఫీలైంది. డిమాన్ పవన్.. చెస్ ఛాంపియన్‌గా మెడల్ అందుకున్న ఫోటో చూసి మురిసిపోయాడు. దివ్యకు చిన్నప్పుడు గుండుతో రౌడీగా రెడీ చేసినప్పటి ఫోటో వచ్చింది. రీతూ.. తన చిన్నప్పటి ఫోటో చూపిస్తూ భరణిలా విలన్ అవుతానంది. సుమన్‌కు చైల్డ్‌హుడ్ ఫోటో అందింది. కానీ గౌరవ్, సంజనా, భరణి, నిఖిల్ ఫోటో స్టోరీలను మాత్రం చూపించలేదు.చదవండి: తనూజకు భారీ ఓట్లు.. సీక్రెట్ ఇదే! -
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9) మొదలై దాదాపు 10 వారాలు కావస్తోంది. మాటకు మాట, ఆటకు ఆట అంటూ గేమ్స్ ఆడుతున్న కంటెస్టెంట్లకు ఇంటి మీద బెంగ మొదలై చాలారోజులే అవుతోంది. ఆ బెంగతోనే కదా.. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు వారి చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో అందించి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.లవ్యూ అమ్మా: తనూజవాటిని చూసి మురిసిపోయిన కంటెస్టెంట్లు వాటి వెనకాల కథను చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. మొదటగా తనూజ మాట్లాడుతూ.. నా లైఫ్‌లో బెస్ట్ సూపర్ హీరో అమ్మ. నావల్ల కాదని వెనకడుగు వేసినప్పుడు.. నీవల్ల సాధ్యమవుతుంది అంటూ నన్ను ముందుకు నడిపించింది. నీవల్లే ఇక్కడున్నా సావిత్రి. లవ్యూ మమ్మీ అని ఎమోషనలైంది.తినడానికి తిండి లేక మట్టిఇక ఇమ్మాన్యుయేల్ (Emmanuel)కు తన అన్నతో దిగిన ఫోటో వచ్చింది. అది చూసిన ఇమ్మూ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మా అమ్మకు నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో తినడానికి తిండి లేదంటా! తిండి లేక అమ్మ మట్టి తినేది.. మా అన్న, నేను చిన్నప్పటినుంచి కష్టపడ్డాం. మేము చేయని పనంటూ లేదు. నా జీవితానికి మా అన్నే హీరో. చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన కల్యాణ్చిన్నప్పటినుంచి మరో నాన్నలా పెంచాడు. 20 మూటలు మోయాలంటే వాడు 15 మోసి, నన్ను 5 మాత్రమే మోయనిచ్చేవాడు అని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కల్యాణ్.. అమ్మానాన్నతో తిరిగింది గుర్తు లేదు. చిన్నప్పుడు ఏదీ అంత తెలిసేది కాదు. హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రతి ఆదివారం ఫోన్ కోసం వార్డెన్ దగ్గర కూర్చునేవాడిని. కొన్ని నెలలవరకు ఫోన్ వచ్చేది కాదంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మరి మిగతావారి స్టోరీలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కల్యాణ్‌ను ఓడించి.. ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా -
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట.. అయితే, అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్‌ను పెట్టుకుంటారు. అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు. హౌస్‌లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్‌లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే.తనూజ కోసం రూ. 100 కోట్లుబిగ్బాస్లో పది వారాలుగా తనూజ టాప్‌లో ఉంది. సోషల్‌మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి. కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే... మరికొందరు మాత్రం తనకు బిగ్‌బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు. దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట. ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్లలో అవకాశాలు కల్పిస్తారు. అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు.తనూజ ఓట్ల సీక్రెట్ ఇదేఅన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ 'ముద్దమందారం..' 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది. ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది. సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు. దీంతో బిగ్‌బాస్‌లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది. ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా ఈ సీజన్లో బలమైన కంటెస్ట్ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది. ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది. ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే.. కానీ, అతను కూడా తనూజతో బాగా క్లోజ్‌గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు. ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్‌లో దూసుకుపోతుంది. పీఆర్ టీమ్ కారణంగానే బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట.. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు. కానీ, వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు. -
Thanuja: కల్యాణ్‌ను ఓడించి ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్‌గా.
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) రాజ్యానికి వారెవ్వా చెఫ్ వచ్చి అందరికీ కడుపునిండా భోజనం పెట్టాడు. అయితే రాజుల- రాణిల కోసం ప్రత్యేకమైన వంటకాలను పట్టుకొచ్చాడు. ఇదేదో కల్యాణ్ కోరిక(చికెన్, మటన్ తినాలనుందన్న కోరిక)ను నెరవేర్చేందుకే ఆయన్ను హౌస్‌లోకి తీసుకొచ్చినట్లుగా ఉంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (నవంబర్ 13వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం...రాజావారి విందు భోజనంరాజులు కల్యాణ్ (Pawan Kalyan Padala), నిఖిల్, రాణి రీతూ కోసం మాస్టర్ చెఫ్ సంజయ్ అసిస్టెంట్ ప్రణవ్ నాన్‌వెజ్ వంటకాలు సిద్ధం చేశాడు. ఆకలి మీదున్న పులుల్లా వాటిని ఈ ముగ్గురూ ఆవురావురుమని ఆరగించారు. తర్వాత కమాండర్స్ తనూజ, డిమాన్ పవన్, దివ్య, సంజనకు వడ్డించారు. ప్రజలుగా ఉన్న సుమన్, భరణి, ఇమ్మాన్యుయేల్, భరణిలను పనోళ్లుగానే చూశారు. అందుకే వారిని కింద కూర్చోబెట్టి కేవలం శాఖాహార భోజనం మాత్రమే వడ్డించారు.కల్యాణ్‌ను ఓడించిన తనూజతర్వాత బిగ్‌బాస్.. రాజు, రాణిలకు చివరగా ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రాజు కల్యాణ్‌తో కమాండర్ తనూజ (Thanuja Puttaswamy) పోటీపడింది. ఈ గేమ్‌లో చురుకుగా, చకచకా ఆడి తనూజ గెలిచింది. అలా కల్యాణ్‌ను రాజు స్థానంలో నుంచి కిందకు దింపి తను రాణిగా మారిపోయింది. బిగ్‌బాస్ రాజ్యానికి మహారాణి అవడమే కాకుండా ఏకంగా పదోవారం కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. ప్రతిసారి కెప్టెన్సీ చేతిదాకా వచ్చినట్లే వచ్చి చేజారిపోయేది. ఈసారి ఏకంగా ఫ్యామిలీ వీక్‌లో కెప్టెన్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.చదవండి: నాతో నటించేందుకు ఎవరూ ముందుకు రాలేదు: హీరో -
ఉమెన్ కార్డ్ తీసిన తనూజ.. డీమాన్ పవన్ తప్పు చేశాడా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఎలాంటి కొత్తదనం లేదు. రణరంగం అంటూ ఊదరగొట్టారు. కానీ, కంటెస్టెంట్స్ పేలవమైన ఆటతీరుతో ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తున్నారు. ఇప్పటికే 66 రోజులు పూర్తి అయింది. బుధవారం ఎపిసోడ్లో కాస్త నవ్వులతో పాటు నామామాత్రపు టాస్క్‌లు పెట్టి ముగించేశాడు. బీబీ రాజ్యం అంటూ జరుగుతున్న టాస్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. మహారాణులుగా దివ్య-రీతూల కాంట్రవర్సీతో పాటు వారిద్దరూ కలిసి పదేపదే సుమన్ శెట్టి, భరణి, ఇమ్మానుయేల్‌ని టార్గెట్ చేసి ఆటాడుకున్నారనిపిస్తుంది. కమాండర్లుగా ఉన్న డీమాన్ పవన్-తనూజ మధ్య జరిగిన గొడవ మాత్రమే వివాదంగా మారింది.బిగ్‌బాస్ సీజన్-9 ప్రారంభం నుంచే తనూజ కాస్త హైలెట్ అవుతూ వస్తుంది. బుధవావరం ఎపిసోడ్లో డీమాన్ పవన్- తనూజ మధ్య జరిగిన గొడవ కూడా కంటెంట్ క్రియేట్ కోసం చేసినట్లు అనిపిస్తుంది. డిమాన్ పవన్ తప్పు అయితే ఎంతమాత్రం లేదు, కానీ అంత చిన్న విషయానికి తనూజ ఎందుకు రచ్చ చేసిందనేది ప్రేక్షకులకు కూడా అర్థం కాలేదు. కేవలం కంటెంట్ కోసమే ఆమె ఇలా చేసిందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే వెంటనే వారిద్దరూ మళ్లీ కలిసిపోయారు. మహారాజు-మహారాణుల పాత్రలో ఉన్న కళ్యాణ్, దివ్య, రీతూ కలిసి తనూజను ఆటపట్టించాలనుకుంటారు. ఈ క్రమంలో కిచెన్ దగ్గరికొచ్చి కమాండర్ తనూజని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టమని డీమాన్-నిఖిల్‌లకి చెప్పారు.దీంతో తనూజని ముందుగు నడవాలంటూ ఆమె భుజం మీద డీమాన్ పవన్ టచ్ చేశాడు. ఈ సమయంలో తనూజ ఫైర్ అయింది. చెయ్యి వేస్తున్నావేంట్రా.. అంటూ నో ఉమెన్ హ్యాండ్లింగ్.. అని ఫైర్ అయింది. ఇది రాణి ఆర్డర్ అని నిఖిల్ చెప్తాడు. అయితే, ఇలా హ్యాండిల్ చేస్తారేంటని తనూజ మళ్లీ అడుగుతుంది. అబ్బాయిల దగ్గర ప్రవర్థిస్తున్నట్లు చేస్తున్నారని తనూజ అంటుంది. కాదు కమాండర్స్లా చేస్తున్నారని రాణి పాత్రలో ఉన్న దివ్య కౌంటర్ ఇస్తుంది. మీ భుజాన్ని మాత్రమే పట్టుకున్నారు కదా అందులో ఏంటి తప్పు అని దివ్య కామెంట్ చేసింది. అయితే, తనూజ బాధ పడిందని డిమాన్ పవన్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కావాలని నెట్టలేదని చెప్తాడు. అయితే, తనను చాలా ఫోర్స్‌గా తోసేశావ్ అంటూ తనూజ చెబుతుంది. తాను చాలా హర్ట్ అయ్యానని. ఒక ఫ్రెండ్‌గా చెప్పవచ్చు కదా అంటుంది. కొంత సమయం పాటు ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. కానీ, ఎపిసోడ్ ప్రకారం ఇందులో ఎక్కువగా తప్పు తనూజదే కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రీతూను గతంలో తోయడం వల్ల నాగార్జున ఇప్పటికే అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తనూజ కూడా మరోసారి అదేవిధంగా డీమాన్ పవన్‌ను చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా తనూజతో పాటు ఇతర ఏ కంటెస్టెంట్‌తో కూడా డీమాన్ పవన్ చెత్తగా ప్రవర్తించలేదు. అందుకే కామనర్‌గా వచ్చినప్పటికీ ఆటలో కొనసాగుతున్నాడు.ప్రజలకి మరోసారి కమాండర్లు అయ్యేందుకు బిగ్‌బాస్ ఛాన్స్ కల్పించాడు. కమాండర్లు నిఖిల్, పవన్‌లతో ప్రజలు గౌరవ్, భరణి పోటీ పడ్డారు. ఈ రెండు టీమ్స్ మధ్య 'నిలబెట్టు పడగొట్టు' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. అయితే, ఇందులో డీమాన్-నిఖిల్ బాగా ఆడారు. మరోవైపు గౌరవ్ కూడా పర్వాలేదనిపించాడు. కానీ భరణి పూర్తిగా ఫెయిల్ కావడంతో ప్రజలు జట్టు ఓడిపోయింది. కేవలం భరణి వల్ల ఈ టాస్క్‌లో ఓడిపోవడంతో గౌరవ్ తట్టుకోలేకపోయాడు. పదేపదే కెమెరా ముందుకు వచ్చి భరణి ఆట వల్ల నష్టం జరిగిందంటూ వాపోయాడు. ఫైనల్‌గా నిఖిల్- పవన్‌లు కమాండర్స్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరో రౌండ్లో నిఖిల్ సత్తా చాటి రాజుగా ప్రమోషన్ పొందాడు. రాణిగా ఉన్న దివ్యను ఓడించాడు. దీంతో ఆమె కమాండర్‌గా మిగిలిపోయింది. బుధవారం ఎపిసోడ్లో ఎక్కువగా నవ్వులు పూయించారని చెప్పాలి. -
రీతూ మళ్లీ తొండాట? నోటికొచ్చినట్లు వాగితే కుదరదంటూ కల్యాణ్ వార్నింగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ బీబీ రాజ్యంగా మారిపోయింది. ఈ రాజ్యంలో కల్యాణ్ రాజయితే, దివ్య, రీతూ మహారాణులు. వీళ్లు నలుగురు కమాండర్లను సెలక్ట్ చేసుకుంటే మిగతావాళ్లు ప్రజలుగా ఉంటారు. మరి ఎవర్ని కమాండర్లుగా తీసుకున్నారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో మంగళవారం (నవంబర్ 11వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..వాళ్లదే రాజ్యంబీబీ రాజ్యంలో బిగ్‌బాస్‌కు బుద్ధి పుట్టినప్పుడల్లా గేమ్స్ పెడుతూ ఉంటాడు. వారం ముగిసేసరికి రాజు, రాణులు, కమాండర్స్, ప్రజలు.. వీరిలో ఒక్కరికే ఇమ్యూనిటీ గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. మొదటగా మహారాజు, రాణులతో చర్చించి తనూజ, సంజనా, పవన్, నిఖిల్‌ను కమాండర్లుగా ఎంచుకున్నారు. మిగిలిన భరణి, ఇమ్మాన్యుయేల్, సుమన్, గౌరవ్ ప్రజలుగా మిగిలిపోయారు. ఈ ప్రజలే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది.రీతూ తొండాటమహారాణిగా ఆసీనురాలైన దివ్య.. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా భరణితో తలకు మసాజ్ చేయించుకుంది. తర్వాత కమాండర్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌కు రీతూ (Rithu Chowdary) సంచాలకురాలిగా వ్యవహరించింది. అయితే తను గతంలో చేసిన తప్పే మళ్లీ చేసింది. పవన్ ఔట్ అయినా సరే, కాలేదంటూ అతడిని గేమ్ ఆడించింది. ఈ క్రమంలో సంజనా, తనూజ.. రీతూపై ఎగబడ్డారు. అయినా ఆమె అస్సలు లెక్కచేయలేదు. చివరకు ఈ గేమ్‌లో సంజనా ఓడిపోయింది.కష్టపడ్డ సుమన్కమాండర్స్ నలుగురిలో ఓడిపోయిన సంజనా (Sanjana Galrani) తన పోస్టు కాపాడుకోవాలంటే ప్రజల్లో ఒకరితో తలపడి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమన్‌ను ఎంచుకుంది. ఈ ఇద్దరికీ కాటన్ డబ్బాలతో టవర్ కట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. సుమన్‌కు మరీ ఎక్కువ ఎత్తులో డబ్బాలు పెట్టడమనేది తన హైట్‌కు కష్టమైన విషయమే! అయినప్పటికీ సంజనాకు గట్టి పోటీనిస్తూ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు. బజర్ మోగే సమయానికి సంజన-సుమన్ ఇద్దరి టవర్ ఒకే ఎత్తులో ఉంది. కాకపోతే సంజనా టవర్ నిటారుగా, పర్ఫెక్ట్గా ఉంది కనుక తనే గెలిచింది అని కల్యాణ్ ప్రకటించాడు. అందుకు తనూజ ఒప్పుకోలేదు.కల్యాణ్‌ను తిట్టిపోసిన తనూజటవర్ ఎలా ఉన్నా పర్లేదన్నారు కదా.. చివరి బాక్స్ సుమనే ముందు పెట్టాడుగా అని తనూజ, దివ్యలు నోరేసుకుని పడిపోయారు. అయినప్పటికీ కల్యాణ్ తన నిర్ణయంపై నిలబడి ఉన్నాడు. అప్పటికీ తనూజ ఒప్పుకోలేదు. ఇదంతా నువ్వు ముందు చెప్పాల్సింది. నచ్చినట్లు చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తానంటే ఎలా కుదురుతుంది? చెప్పిన మాట మీద లేవు.. గేమ్ స్టార్ట్ అయ్యేముందు ఒకటి చెప్పావ్, అయిపోయాక ఒకటి చెప్తున్నావ్.. సంచాలక్‌గా ఫెయిల్ అని అరించింది. ఆ మాటతో ఆగ్రహించిన కల్యాణ్.. నోటికొచ్చినట్లు వాగితే బాగోదంటూ బాక్సుల్ని ఒక్కదెబ్బతో గుద్ది పడేసి తన కోపాన్ని తీర్చుకున్నాడు.చదవండి: నాగార్జున కుటుంబంపై మరోసారి స్పందించిన కొండా సురేఖ -
బిగ్‌బాస్ చరిత్రలో రికార్డుకెక్కిన ఇమ్మూ.. వార్నింగ్ ఇచ్చిన నాగ్
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ముద్దుబిడ్డ తనూజ అంటున్నారు కానీ ఆమెకంటే ఎక్కువ హింట్లు, సూచనలు ఇమ్మాన్యుయేల్‌కు ఇస్తున్నారు. తన ఆట ఎలా ఉందో ప్రతిసారి ఆడియన్స్‌తో చెప్పిస్తున్నారు. ఈసారేకంగా నామినేషన్స్‌లోకి రావడం లేదు, ఇలాగైతే కష్టమని ఏకంగా నాగార్జునే అనడం గమనార్హం. ఇంతకూ హౌస్‌లో ఏం జరిగిందో నవంబర్ 9వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఇద్దరికీ సమాన ఓట్లుట్రోఫీకి ఎవరు దగ్గర్లో ఉన్నారు? ఎగ్జిట్‌కు ఎవరు దగ్గర్లో ఉన్నారో చెప్పాలన్నాడు నాగ్ (Nagarjuna Akkineni). ఐదురు హౌస్మేట్స్ తనూజను, మరో ఐదుగురు ఇమ్మాన్యుయేల్‌ను ట్రోఫీకి దగ్గర్లో పెట్టారు. సంజన.. డిమాన్ పవన్‌కి ట్రోఫీ గెలిచే అర్హత ఉందని చెప్పింది. ఇమ్మూ.. కల్యాణ్‌కు గెలిచే అర్హత ఉందన్నాడు. ఎగ్జిట్ విషయంలో అయితే మెజారిటీగా ఎనిమిది మంది సాయి వెళ్లిపోతాడని ముందే గెస్ చేశారు.దివ్యకు వాయింపులుఇక గతవారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు నాగ్. దివ్య స్ట్రాటజీ కరెక్ట్.. కానీ, ఒకరి గెలుపు కోసం కష్టపడాలి తప్ప ఒకరి ఓటమి కోసం కాదని చెప్పాడు. తనూజను తీయను అని తనకు, కల్యాణ్‌కు మాటిచ్చి దాన్ని తప్పితే నీ క్రెడిటిబులిటీ పోతుందని హెచ్చరించాడు. రెబల్‌గా దివ్య.. తనను ఆటలో నుంచి తీసేస్తే కల్యాణ్ ఫైట్ చేయడం మానేసి పకపక నవ్వడం.. అది కరెక్టే అని నాగార్జున చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.ఇమ్మూని హెచ్చరించిన నాగ్ఇక బిగ్‌బాస్ చరిత్రలో ఇన్నివారాలు (తొమ్మిది వారాలు) నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే.. అని ఇమ్మాన్యుయేల్‌తో అన్నాడు. అదే నాకూ భయమేస్తుంది సార్, నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తోంది. ఎవరికో ఒకరికి షిఫ్ట్ అయిపోయుంటారేమో, త్వరలోనే వస్తా.. నాకోసం వెయిట్ చేయండి అని ఇమ్మూ వేడుకున్నాడు. 10 వారాలు నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే.. అప్పటికే ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా.. అంటూ నామినేషన్స్‌లోకి రమ్మని వార్నింగ్ ఇస్తూనే డైరెక్ట్‌గా హింటిచ్చాడు.పవర్ వాడేందుకు ఒప్పుకోని తనూజఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో భరణి, సాయి మిగిలారు. వీరిలో సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నీ దగ్గరున్న పవర్ ఉపయోగించి సాయిని సేవ్ చేయొచ్చు, అప్పుడు భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పాడు. అందుకు తనూజ ఒప్పుకోకపోవడంతో సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడు స్టేజీపైకి వచ్చి హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సుమన్ కరెక్ట్ అని, భరణి, రీతూ, దివ్య రాంగ్ అని పేర్కొన్నాడు.చదవండి: అందువల్లే సాయి ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు అయింది భరణి పరిస్థితి. దివ్య.. తనూజ గొడవపడి అసలు సంబంధమే లేని భరణిని మధ్యలోకి లాగారు. నాతో మాట్లాడొద్దని తనూజ.. మీ పేరొచ్చినప్పుడు మాట్లాడలేరా? స్టాండ్ తీసుకోవడం నేర్చుకోండి అని దివ్య.. భరణిపై ప్రతాపం చూపించారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (నవంబర్7వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..తడబడిన సాయికెప్టెన్సీ కంటెండర్స్‌ను సెలక్ట్ చేసిన బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9).. వారిలో ఎవర్ని సైడ్ చేయాలి? ఎవర్ని ముందుకు తీసుకెళ్లాలన్న బాధ్యతను హౌస్మేట్స్ చేతిలో పెట్టాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో కంటెండర్కు సపోర్ట్‌గా నిలబడ్డారు. రాము.. తనూజకు సపోర్ట్ చేస్తానని ఇచ్చిన మాట కోసం భరణిని తీసేశాడు. సాయి శ్రీనివాస్ దివ్యను తీసేయబోతే.. నిన్ను కాపాడుకుంటూ వచ్చా, నన్నే తీస్తున్నావా? అని ధమ్కీ ఇచ్చింది.చివరకు ముగ్గురుదెబ్బకు జడుసుకున్న సాయి (Sreenivasa Sayee).. రీతూ పేరెత్తాడు. నేనేం చేశానని ఆమె ఉగ్రరూపం ఎత్తడంతో సుమన్ పేరు ప్రస్తావించాడు. వాళ్లిద్దరూ నోరేసుకుని పడిపోయారని నామీదకు వచ్చావా? అని సుమన్ ఆగ్రహించాడు. దీంతో సాయి మళ్లీ తను మొదట చెప్పినట్లుగా దివ్యను గేమ్‌లో అవుట్ చేశాడు. నిఖిల్.. సుమన్‌ను తీశాడు. అలా చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్.. ముగ్గురు మిగిలారు. సరిగ్గా ఇప్పుడే దివ్య చక్రం తప్పింది. టార్గెట్ తనూజతనూజ, రీతూ ఉంటే.. రీతూనే తీస్తానన్న ఆమె సడన్‌గా మనసు మార్చుకుని తనూజను సైడ్ చేసింది. అది తట్టుకోలేకపోయిన తనూజ.. మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేశావ్.. భరణిగారి వల్లే తీసేశావ్ అని ఆగ్రహించింది. మధ్యలో నా పేరెందుకొచ్చిందని భరణి షాకై చూశాడు. తనూజను తీసేయవనే ఆ కుర్చీ ఇచ్చానని కల్యాణ్ అంటే.. ఆమె ఉంటే ఇమ్మూకి గెలుపు కష్టమవుతుందనే తనూజను తీసేశానని దివ్య బదులిచ్చింది.దివ్యపై భరణి ఉగ్రరూపంమీ పర్సనల్స్ బయట పెట్టుకో, హౌస్‌లో కాదని ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పి ఆవేశంగా లోపలకు వెళ్లిన తనూజ గుక్కపెట్టి ఏడ్చింది. ఆమె మాటలు విన్నారా? ఇప్పుడు హ్యాపీయా? నా గేమ్‌లో మీ పేరెందుకు వచ్చింది? ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోండి అని అందరి ముందే భరణిపై అరిచింది. కాసేపటికి ఒంటరిగా ఉన్న భరణి దగ్గరకు వెళ్లి మాట్లాడొచ్చా? అని అడిగింది. ఆయన కోపంగా ఉన్నాడని అర్థమై ఎందుకంత కోపంగా చూస్తున్నారు? అరిచినందుకు సారీ చెప్దామని వచ్చానంది. ఏం మాట్లాడాలి? నామీద అరవడం ఫస్ట్ టైమా? నువ్వేదో అంటావ్.. తనేదో అంటుంది. ఇలాగైతే నేను ఊరుకోనుమధ్యలో నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి? అవసరమైతే తనతో తర్వాత మాట్లాడతా కదా.. అని భరణి సీరియస్ అయ్యాడు. దీంతో ఆమె సారీ చెప్పి కెప్టెన్ రూమ్‌లోకి వెళ్లిపోయింది. మా మమ్మీడాడీని చూస్తే కూడా నాకు భయమయలేదు. ఆయన కళ్లలో అంత కోపం చూశాను.. నాకు ఆయన అన్నయ్యే కావచ్చు.. కానీ, అది బయటకెళ్లాక చూసుకుంటానిక.. ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని ఇమ్మాన్యుయేల్‌తో అంది. తర్వాత రీతూ, ఇమ్మాన్యుయేల్‌కు ఓ గేమ్ పెట్టగా అందులో ఇమ్మూ గెలిచి మరోసారి కెప్టెన్ అయ్యాడు. దివ్య ఎత్తుగడ వల్ల తనూజకు జనాల్లో సింపతీ రావడం ఖాయం. ఈ ఎపిసోడ్‌తో తనూజ కప్పు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.చదవండి: హౌస్‌లో ఎందుకున్నట్లు? రామును ఎలిమినేట్ చేయాల్సిందే! -
దివ్య ఇచ్చిన షాక్‌తో బోరుమని ఏడ్చిన తనూజ.. ఎంతో కష్టపడ్డానంటూ..
కెప్టెన్సీ ఎవరు కాదనుకుంటారు? అందరూ కోరుకునేదే, అందరికీ బాగా కావాల్సిందే! బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతోంది. అయితే కంటెండర్లకు డైరెక్ట్‌గా గేమ్ పెట్టకుండా.. హౌస్మేట్స్ సాయంతో గెలిచే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్‌లో చివరకు రీతూ, తనూజ, ఇమ్మాన్యుయేల్ మాత్రమే మిగిలారు. ఏ హౌస్‌మేట్ అయితే రైలెక్కి కూర్చుంటాడో అతడు ఒకర్ని రేసు నుంచి తీసేయొచ్చు. మోసం చేసిన దివ్య?అలా ఒక్క కుర్చీ కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. కల్యాణ్ చేతిలో కుర్చీ ఉంటే.. నేను చెప్పేది విను అంటూ అతడికి నచ్చజెప్పి కుర్చీలో కూర్చుంది దివ్య. నా సపోర్ట్ ఇమ్మాన్యుయేల్‌కు అని చెప్తూ.. తనూజను గేమ్‌లో అవుట్ చేసింది. అది విని షాకైన తనూజ.. నీకు కొంచెమైనా ఉందా? వ్యక్తిగత కారణాలతో ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నావ్? అని కోప్పడింది. తనూజను ఎలిమినేట్ చేయవు అన్నందుకే కల్యాణ్ నీకు కుర్చీ ఇచ్చాడని గుర్తు చేసింది. చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లుఇంతలో కల్యాణ్ కూడా మధ్యలో కలగజేసుకుంటూ.. నీ నుంచి లాక్కోవడం నాకు పెద్ద విషయమే కాదు, నిన్ను నమ్మి ఇచ్చానని తలపట్టుకున్నాడు. మళ్లీ కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన బాధలో ఉన్న తనూజ.. నాతో మాట్లాడకు, నీకేమైన పర్సనల్స్ ఉంటే హౌస్ బయట పెట్టుకో అని దివ్యకు చెప్పి, ఆ వెంటనే బోరుమని ఏడ్చేసింది. కెప్టెన్ అవాలని చాలా కష్టపడ్డానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. భరణి వచ్చి ఓదారుస్తుంటే కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడూ మాట్లాడొద్దు అని వేడుకుంది. ఇక చివర్లో రీతూ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ! -
దెయ్యాలకే దడ పుట్టించిన రీతూ.. గేమ్ గెలిచింది మాత్రం!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్ కొన్నిసార్లు దెయ్యాలకొంపలానూ మారిపోతుంటుంది. ఏమాటకామాట.. దెయ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది సోహైల్! భయమనేది మా ఇంటావంటా లేదన్నట్లుగా బిల్డప్ ఇచ్చి చీకటి గదిలోకి వెళ్లాడు. తీరా అక్కడ చిన్న వెలుతురు లేకపోగా వింత శబ్ధాలు, ఫ్లాష్ లైట్లలో దెయ్యం ఆకారాలు చూసి మామూలుగా జడుసుకోలేదు. ఇప్పుడదే టాస్క్ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లోనూ రిపీట్ అవుతోంది.ఆడపులి..ఈ మేరకు ప్రోమో కూడా వదిలారు. తనూజ భయంభయంగానే ఆ గదిలోకి వెళ్లి తనకిచ్చిన టాస్క్ పూర్తి చేసింది. తర్వాత రీతూ వంతు వచ్చింది. లోపల జాగ్రత్త.. అని సంజనా ధైర్యం చెప్తుంటే.. ఆడపులి ఇక్కడ అని బిల్డప్ ఇచ్చింది. తీరా లోపలకు వెళ్లాక ఆ దెయ్యం కాళ్లు పట్టుకోవడమే తక్కువ అన్నట్లుగా మారింది. ఇలా చేస్తే నేను బయటకు పోతా.. అన్న ప్లీజ్.. ప్లీజ్.. అంటూ వేడుకుంటూనే ఉంది. చివర్లో మాత్రం దెయ్యంలా ఓ నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు దెయ్యాలే జడుసుకుని పారిపోవడం ఖాయం! ఈ గేమ్‌లో తనూజ గెలిచినట్లు తెలుస్తోంది. ఇక సుమన్, దివ్య ఎవరికీ అనుమానం రాకుండా సీక్రెట్ టాస్కులు పూర్తి చేస్తున్నారు. మరి చివరకు ఎవరు కెప్టెన్సీ కంటెండర్లవుతారో చూడాలి! చదవండి: బండ్ల గణేశ్ సెటైర్లు.. కౌంటరిచ్చిన అల్లు అరవింద్ -
భరణిపై భగ్గుమన్న తనూజ.. బంధాలకు గుడ్‌బై
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి దివ్వెల మాధురి ఎలిమినేషన్ అయిపోయాక సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొత్తం తనూజ చుట్టే నడిచిందని చెప్పవచ్చు. తనూజపై దివ్య,భరణి, ఇమ్మాన్యేయల్, సాయి శ్రీనివాస్‌లు మాటలతో ఎదురుదాడికి దిగారు. సోమవారం జరిగిన ఎపిసోడ్ మొత్తం తనూజ చుట్టే జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు. టెడ్డీ బేర్ల టాస్క్ పేరుతో రేసులో చివరగా చేరిన సభ్యులకు నామినేషన్ బాధ్యత ఇచ్చారు. మొదటి రౌండ్లో సంజన నామినేట్ అయితే.. తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధంతో హౌస్ హీటెక్కింది. అయితే.. తనూజ వల్లనే తాను హౌస్ నుంచి బయటకు వెళ్లానని, ఆమె ఒక్కసారి కూడా తనను సేవ్ చేయలేదని భరణి ఫైర్ అయ్యాడు.మొదటి రౌండ్లోనే అందరికంటే చివరిగా సంజన ఉండటంతో తనకు నామినేషన్ చేసే ఛాన్స్ దక్కింది. అయితే, సంజనకి తన ఫొటో ఉన్న టెడ్డీయే రావడంతో బిగ్‌బాస్ ఆదేశాల మేరకు మరోకరితో స్వాప్ చేయాలని సంచాలక్ దివ్యకు అధికారం ఇస్తాడు. దీంతో రీతూతో స్వాప్ చేసే అవకాశం దివ్య ఇస్తుంది. ఇక్కడ సంజన, రీతూ ఇద్దరూ వాదించుకోవాలి. ఫైనల్‌గా ఎవరి వాదన బలంగా ఉంటే వారిని సంచాలక్ సేవ్ చేస్తారు. బలహీనంగా ఉన్న వారిని నామినేట్ చేస్తారు. అలా ఇద్దరి వాదనలో రీతూ పాయింట్లు చాలా బలంగా ఉన్నాయని అనిపిస్తుంది. సంజన వేసిన కౌంటర్లకు రీతూ చెప్పిన సమాధానాలు బాగానే ఉన్నాయి. దీంతో సంజనని నామినేట్ చేసి.. రీతూని సేవ్ చేసింది దివ్య.తనూజ-భరణి బంధం కట్ తరువాతి రౌండ్లో తనూజ, భరణి మధ్య మాటల యుద్ధం మొదలైంది. భరణి మాట్లాడుతూ.. 'తనూజ వల్ల నేనే హౌస్ నుంచి బయటకు వెళ్లాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను సేవ్ చేయలేదు' అని ఫైర్ అయ్యాడు. ఇన్నిరోజులు నాన్న-కూతురు బాండింగ్‌లో ఉన్న వారిద్దిరూ తమలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు ఎక్కువ అర్హులో వాదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు తనూజ కోసం మూడుసార్లు సపోర్ట్‌గా టాస్క్‌లలో నిలబడ్డానని భరణి అంటారు. దీంతో తనూజ కూడా గట్టిగానే వాదించింది. అవన్నీ సపోర్టింగ్ టాస్క్‌లు కాబట్టే నిలబడ్డారని చెప్పుకొచ్చింది. తనూజ బలమైన పాయింట్లతో భరణిని చిక్కుల్లో పడేసింది. ఇప్పటికీ నీ గేమ్ కూడా మరోకరు ఆడుతున్నారంటూ ఫైర్ అయింది. ఇక ఇద్దరి వాదనలు విన్న తర్వాత దివ్య కూడా ఏం చేయలేకపోయింది. తనూజ కౌంటర్స్ బలంగా ఉండటంతో తప్పనిసరిగా భరణిని నామినేట్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత భరణి కాస్త రియాలిటీలోకి వచ్చినట్లు ఉన్నాడు. తనూజ, దివ్యల దగ్గరికి వెళ్లి ఇక నుంచి మీరిద్దరూ నా గురించి మాట్లాడకండి. మీ ఆట మీరు ఆడుకోండి అంటూ తమ బంధం ఇంతటితో ముగిసిందని స్పష్టంగా చెప్పేశాడు.పెళ్లి కూతురులా తనూజ.. ఇమ్మాన్యుయేల్ కౌంటర్స్తర్వాతి నామినేషన్లో కూడా ఇమ్మాన్యుయేల్‌తో తనూజ పోటీ పడాల్సి వచ్చింది. తన నామినేషన్ తనూజ అంటూ ఇమ్ము ఫైర్ అయ్యాడు. తనూజ సేఫ్ గేమ్ ఆడుతోందని అతను గట్టిగానే ఆరోపించాడు. అయితే, ఇమ్ము ప్రశ్నలకు తనూజ సరైన సమాధానం చెప్పలేకపోయింది. కానీ, ఈసారి కూడా సంచాలకులు తనూజని నామినేట్ చేయలేదు. అయితే, నామినేషన్ చేసే ఛాన్స్ తనూజకి రావడంతో తను కూడా ఇమ్మాన్యుయేల్‌ని నామినేట్ చేసింది. ఇమ్ము చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని.. సపోర్ట్ చేస్తున్నా అనే పేరుతో ఒక ముసుగు వేసుకుని సేఫ్ ఆడుతున్నాడని తనూజ చెబుతుంది. అయితే, ఇమ్ము కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇచ్చాడు. నువ్వు బెడ్డు టాస్కులో చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చుంటే మేము సపోర్ట్ చేశామని గుర్తు చేశాడు. అసులు నువ్వు టాప్-5లోకి ఎలా వచ్చావ్ ఆ గేమ్‌లో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని ఇమ్ము అన్నాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు గట్టిగానే మాటలతో రెచ్చిపోయారు. మరోవైపు రాము, కళ్యాణ్‌ని నామినేట్ చేశాడు. ఫైనల్‌గా సంచాలక్‌గా ఉన్న డీమాన్.. కళ్యాణ్‌ని నామినేట్ చేసి ఇమ్ముని సేవ్ చేస్తాడు.దివ్య- తనూజ మాటల యుద్ధంచివర్లో బిగ్ బాస్ ఒక సరప్రైజ్ ఇస్తాడు. కెప్టెన్ దివ్యకు ప్రత్యేక అధికారం ఇస్తూ.. ఇప్పటివరకు నామినేట్ కానివారిలో ఒకరిని నామినేట్ చేయాలని కోరుతాడు. దాంతో తనూజను నామినేట్ చేస్తున్నట్లు దివ్య చెప్పింది. ఇక్కడ కూడా భరణి పేరుతో డ్రామ నడిచింది. భరణి, తనూజల బాండ్ దివ్య బ్రేక్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు. అలాంటి ఆరోపణలు రావడానికి కారణం నువ్వే (తనూజ) అంటూ దివ్య నామినేట్ చేసింది. దానికి తనూజ కూడా బలంగానే కౌంటర్ ఇస్తుంది. నేను ఆయన్ని (భరణి) నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావ్ అంటూ ఫైర్ అయింది. ఆపై వెంటనే దివ్య కూడా మరో పంచ్ విసురుతుంది. తనూజ ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుంటుంది అంటూ ప్రతి టాస్క్‌లో సింపతీ కోసం చూస్తుందని తనూజపై కామెంట్ చేసింది. ఇలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్దమే నడిచింది. ఫైనల్‌గా 9వ వారం నామినేషన్స్‌లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. -
విడిపోనున్న తండ్రీకూతురు.. తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణి
మాధురి వెళ్లిపోయింది.. ఇంక హౌస్‌లో గొడవలు జరుగుతాయో, లేవో? అని నిరాశపడ్డ బిగ్బాస్ప్రియులకు పండగలాంటి వార్త. ఈరోజు నామినేషన్స్‌లో లెక్కలేనన్ని గొడవలు జరగనున్నాయి. కానీ, అన్నీ తనూజ చుట్టే తిరిగేట్లు కనిపిస్తోంది. తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఇమ్మాన్యుయేల్, తనూజ వర్సెస్ దివ్య.. ఇలా నేటి నామినేషన్స్ జరగనున్నాయి.తనూజ వర్సెస్ ఇమ్మూతాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంది తనూజ. అందుకు ఇమ్మూ మాట్లాడుతూ.. నావల్ల అయినంతవరకు సపోర్ట్ అని మోయగలుగుతాను. భుజాలు నొప్పి వస్తున్నాయి, చచ్చిపోయేలా ఉన్నాను అన్నప్పుడు దింపేస్తాను అన్నాడు. అంత బరువుగా ఉన్నప్పుడు భుజాన ఎక్కించుకోకు అంది తనూజ. అందుకే దింపేశానని ఇమ్మూ.. ఇలా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకున్నారు. ఏవైనా ఉంటే బయట చూసుకోండిభరణి.. తనూజ నన్నే టాస్కులోనూ సేవ్ చేయలేదు. నేను తనను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను. తనకన్నా బాగా ఆడాను అని తెలిపాడు. అది సపోర్టింగ్ గేమ్ కాబట్టి సపోర్ట్ చేశారని సులువుగా తేల్చేసింది తనూజ. అక్కడితో ఆగకుండా.. మాటమాటకీ ఇమ్మాన్యుయేల్, దివ్య మధ్యలో వస్తే తనూజ మాట్లాడేందుకు స్పేస్ ఎక్కడుంది? ఏదైనా పాయింట్ మాట్లాడితే అది మీ పర్సనల్ అంటున్నారు. పర్సనల్స్ ఏవైనా ఉంటే బయట పెట్టుకోండి, హౌస్‌లో కాదు అని అరిచేసింది.తనూజ ఎలిమినేట్ అవ్వాలన్న భరణిఏదైతే బాండింగ్ వల్ల నేను బయటకు వెళ్లొచ్చానో.. తను కూడా ఒకసారి బయటకు వెళ్లొస్తే పరిస్థితి అర్థం అవుతుంది.. తను వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను అని భరణి ఒక్క ముక్కలో తేల్చేశాడు. మొత్తానికి కలిసిమెలిసుండే తండ్రీకూతుళ్లు ఈరోజు భారీస్థాయిలోనే గొడవపడేట్లు కనిపిస్తోంది. చదవండి: నేనే హీరోయిన్ అన్నారు.. ఇంత మోసం చేస్తారనుకోలేదు! -
తనూజ కాళ్లు పట్టుకున్న రాము.. ఎలిమినేషన్‌తో మాధురి కంటతడి
సరిపోదా శనివారం అన్నట్లు నాగార్జున.. తనూజకు ఒక్కదానికే స్పెషల్‌గా సండేరోజు క్లాస్ పీకారు. దాన్ని క్లాస్ పీకడం అని కూడా అనరు. ఎక్కువగా కోప్పడకు, చెప్పే విధానం మార్చుకో, సహనంగా ఉండటానికి ప్రయత్నించు అని తనూజను బుజ్జగించినట్లే ఉంది. ఎలిమినేషన్‌ను మలుపు తిప్పే అస్త్రం తనూజ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని వాడకుండా భద్రంగా కాపాడుకుంది. మరి ఆదివారం (నవంబర్ 2వ) ఎపిసోడ్లో ఏం జరిగాయో చూసేద్దాం..పర్ఫామెన్స్ ఇరగదీశారుది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక, దీక్షిత్ శెట్టి బిగ్‌బాస్ షోకి వచ్చారు. వీళ్ల ఎదుటే హౌస్‌మేట్స్‌తో కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించారు. వాళ్ల యాక్టింగ్ చూసి రష్మిక కొన్నిసార్లు నోరెళ్లబెట్టేసింది. యాక్టింగ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇమ్మాన్యుయేల్ ఎగరేసుకుపోయాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్న అందరినీ నాగార్జున సేవ్ చేసుకుంటూ రాగా చివరకు గౌరవ్, మాధురి మిగిలారు. గౌరవ్, మాధురి.. ఇద్దర్నీ గేటు బయటకు తీసుకొచ్చాక హౌస్‌మేట్స్‌తో ఓ విషయం చెప్పాడు నాగ్. కాళ్లు పట్టుకున్న రాముఓట్ల పరంగా మాధురి చిట్టచివరి స్థానంలో ఉందన్నాడు. అయితే తనూజ దగ్గరున్న గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ ఎలిమినేట్ అవుతాడని వెల్లడించాడు. అప్పటికే గౌరవ్‌ను నామినేట్ చేసి కుంగిపోతున్న రాము.. అతడ్ని కాపాడమని తనూజ కాళ్లావేళ్లా పడ్డాడు. చివరకు తనూజ గోల్డెన్ బజర్ ఉపయోగించకపోయేసరికి మాధురి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించి గౌరవ్‌ను ఇంట్లోకి పంపారు. ఈ సంతోషం పట్టలేక రాము.. తనూజ కాళ్లు మొక్కడం గమనార్హం. మాధురి సంతోషంగానే బయటకు వచ్చేసింది.నా బంగారం తనూజ: మాధురిఎలిమినేట్ అవుతారనుకున్నారా? అని నాగ్ అడగ్గా.. బయటకు రావాలనే కోరుకున్నా.. ఎందుకంటే నవంబర్ 4న మా ఆయన బర్త్‌డే సార్.. అంటూ మాధురి అసలు విషయం చెప్పింది. తన ఏవీ చూసుకుని లైఫ్‌లాంగ్ మెమొరీ అని ఎమోషనలైంది. ముగ్గురికి గులాబీలు, ముగ్గురికి ముళ్లు ఇవ్వమని మాధురికి టాస్క్ ఇచ్చారు. మొదటి గులాబీ.. నా బంగారం తనూజకి ఇస్తా.. తను చాలా స్వీట్, నేను బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్‌తో ఆడుతుంది, సీరియల్ యాక్టింగ్ చేస్తుందన్నారు. అంతా అబద్ధం, తను తనలాగే ఉంది అని కంటతడి పెట్టుకుంది. డిమాన్ పవన్, పవన్ కల్యాణ్‌కు సైతం రోజాలు ఇచ్చింది.100%ఫేక్ముళ్ల గురించి అడగ్గానే మొదటిది భరణికి ఇస్తానంది. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే అది భరణి గారే.. హౌస్‌లో ఉండటానికి తనకు అర్హత లేదు అని కుండబద్ధలు కొట్టి చెప్పింది. దివ్య కూడా అంతే.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. వాళ్ల గొంతు కూడా తనే అయిపోతుంది. అవి తగ్గించుకుని ఆడితే బెటర్ అని పేర్కొంది. వెళ్లిపోయేముందు.. తనూజ, నేనొక్కటే కోరుకుంటున్నా.. నువ్వు స్ట్రాంగ్‌గా, నవ్వుతూ ఉండాలి. విన్నర్‌గా చూడాలి.. నువ్వు గెలిస్తే నేను గెలిచినట్లే అని చెప్పి వీడ్కోలు తీసుకుంది.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'మాధురి' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్ -
శ్రీజ ఎలిమినేట్, కొత్త కెప్టెన్‌గా దివ్య.. గోడమీద పిల్లిలా భరణి!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9)లో రీఎంట్రీ ఇచ్చిన భరణి, శ్రీజలలో ఆడియన్స్ భరణికే ఓట్లు గుద్దిపడేశారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి నిష్క్రమించింది. పర్మినెంట్ హౌస్‌మేట్ అయిన భరణికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు. అదేంటో శుక్రవారం (అక్టోబర్ 31వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి..భరణి చేతిలో పవర్ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయమని భరణి (Bharani Shankar)కి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అతడు ఈ వారం తనకు సపోర్ట్ చేసినవారికే ఛాన్స్ ఇస్తానన్నాడు. మాధురి మాత్రం అమ్మాయిలందరికీ ఛాన్స్ ఇవ్వమంది. భరణి మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ అవలేని వారికే ఛాన్స్ ఇస్తానంటూ.. అతడి పేరుతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌ను సెలక్ట్ చేశాడు. రీతూను సెలక్ట్ చేయకపోవడంతో ఆమె కాస్త హర్టయింది.తనూజ వర్సెస్ కల్యాణ్రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజ (Thanuja Puttaswamy).. బెండకాయలు పాడైపోయేలా ఉన్నాయని, వాటితో కూర వండాలంది. చపాతీలోకి బెండకాయ బాగోదు, ఆలూ కుర్మా కావాలని కల్యాణ్ అడిగాడు. అడిగినవన్నీ చేసిపెట్టేందుకు సర్వెంట్లం కాదు, అన్నిట్లో వేలు పెట్టకు.. అంటూ కల్యాణ్‌పై రెచ్చిపోయింది తనూజ. అతడు కూడా వెనక్కు తగ్గలేదు. అన్నీ నీకు నచ్చినట్లే చేయాలంటే కుదరదంటూ కౌంటరిచ్చాడు. ఇలా కాసేపు వీరిద్దరూ గొడవపడ్డారు. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లకు డీజే టాస్క్ పెట్టాడు. డీజే డ్యాన్స్ఈ టాస్కులో భాగంగా పాటలు ప్లే అవుతూ ఉంటే ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి. వారికి సపోర్ట్ చేసేవారు మరో ప్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ ఆగే సమయానికి ఎవరి ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువమంది సపోర్టర్స్ ఉంటే వారే గెలిచినట్లు. రాము సంచాలక్‌గా వ్యవహరించాడు. ఎలాగో అందరూ ఊహించినట్లే నిఖిల్, సాయికి ఎవరూ పెద్దగా సపోర్ట్ చేయలేదు. భరణిని కూడా లైట్ తీసుకున్నారు. దివ్య, తనూజకు మాత్రం పోటాపోటీగా మద్దతు పలికారు. బొమ్మలా నిల్చున్న భరణిదీంతో వీళ్లిద్దరూ రెండో రౌండ్లో పాల్గొన్నారు. అయితే ఈ రౌండ్ ప్రారంభమవడానికి ముందే దివ్య తెలివిగా.. భరణికి సపోర్ట్ చేసేవారి దగ్గరికెళ్లి సాయం చేయమని అడిగింది. దీంతో రాము, సుమన్, సంజన.. ఇలా చాలామంది ఆమెకు మాటిచ్చి ఆ మాటపై నిలబడ్డారు. రెండో రౌండ్లో తనూజ కోసం మాధురి, రీతూ, డిమాన్, కల్యాణ్ నిలబడ్డారు. దివ్య కోసం ఇమ్మూ, గౌరవ్, సుమన్, సాయి, సంజన నిల్చున్నారు. ఒక్క ఓటు తేడాతో దివ్య గెలిచి కెప్టెన్ అయింది. ఈ గేమ్‌లో భరణి.. ఎటూ తేల్చుకోలేక మధ్యలో నిలబడి సినిమా చూడటం విశేషం!కెప్టెన్‌గా దివ్యతనూజ.. గతవారం కూడా టాప్ 2దాకా వచ్చి కెప్టెన్సీ చేజార్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడంతో తనకు దుఃఖం ఆగలేదు. రీతూ ఓదారుస్తుంటే మాధురి మాత్రం తన దుమ్ము దులిపేసింది. అందరినీ నమ్ము.. అది ఏడిస్తేనే బాగుంటుంది. ఏడవినవ్వవే.. ఎంత దారుణం.. నాన్న నాన్న అని వెళ్లిపట్టుకో అంటూ ఫైర్ అయింది. తనూజ మాత్రం ఏడుస్తూనే.. ఇప్పుడైనా నమ్ముతావా? నా గేమ్ నేను ఆడుతున్నా.. మాటలకు వస్తారు, కానీ సపోర్ట్ చేయరు అంటూ బాధపడింది. అందరినీ బతిమాలుకోవడం అలవాటైన రీతూ.. అదే పని చేసి రేషన్ మేనేజర్ పోస్ట్ దక్కించుకుంది. ఈ మధ్య అరుపులు, ఆజమాయిషీతో ఓవర్ చేస్తున్న దివ్య.. కెప్టెన్‌గా ఎలా ఉంటుందో చూడాలి!చదవండి: ప్రపంచకప్ ఫైనల్.. టీమిండియా కోసం నటి ఆండ్రియా గిఫ్ట్ -
మాధురితో గుంజీలు తీయించిన మహానుభావుడు.. కల్యాణ్‌తో తనూజ లొల్లి
హౌస్‌లో ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేసుకుంటోంది దివ్వెల మాధురి (Divvala Madhuri). తనకు ఎదురు తిరిగినవారిని మాటల ప్రవాహంతోనే దడదడలాడిస్తోంది. ఆమె నోట్లో నోరు పెట్టడమంటే సింహం బోనులో వెళ్లి కూర్చోవడమే అవుఉతంది! అలాంటి మాధురిని పిల్లిని చేశాడో కంటెస్టెంట్. అతడెవరో కాదు, కామెడీ కింగ్, టాస్కుల వీరుడు ఇమ్మాన్యుయేల్..మాధురితో గుంజీలు తీయించిన ఇమ్మూమాధురి సైలెంట్ అయిపోయిందంటే ఏదో తప్పు చేసే ఉంటుంది. లేకపోతే పిల్లిలా ఎందుకు మారిపోతుంది! ఈరోజు రిలీజ్ చేసిన ప్రోమోలో ఆమె తప్పుల్ని, ఆమెకిచ్చిన పనిష్మెంట్స్ను చూచాయగా చూపించారు. అందులో ఆమె పొద్దెక్కినా కూడా నిద్రపోతోంది. దీంతో కుక్కలు మొరిగాయి. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ఆమెతో 20 గుంజీలు తీయించాడు. అయినా మాధురికి నిద్ర ఆగితే కదా.. మళ్లీ కునుకు తీస్తూనే ఉంది. దీంతో ఆమెతో పచ్చిమిర్చి తినిపించాడు.మరీ ఓవర్ చేస్తున్నారుఇక మరో ప్రోమోలో తనూజ, పవన్ గొడవపడ్డారు. రాత్రి బెండకాయ వద్దని పవన్.. నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు, నువ్వెవరు చెప్పడానికి.. నీలాగా ఎవరూ చేయట్లేదు అని ఒంటికాలిపై లేచింది. అటు దివ్య కూడా కాఫీ విషయంలో రీతూపై అరిచింది. ఈ గొడవలు చూస్తున్న జనాలు.. భరణి నాన్న వచ్చాక వీళ్లిద్దరూ మరీ ఓవర్ చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అసలు తనూజను రేషన్ మేనేజర్‌గా తీసేయండ్రా బాబూ అని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు -
బిగ్‌బాస్ తనూజపై యష్మి, శ్రీ సత్య ట్రోలింగ్ (వీడియో)
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 ఇప్పటికే 50రోజులు పూర్తి చేసుకుంది. దీంతో సీజన్ విజేత ఎవరు అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు లేడీ కంటెండర్ ఎవరూ విన్నర్ కాలేదు. కానీ, ఓటీటీ సీజన్లో బిందు మాధవి మాత్రమే విజేతగా నిలిచింది. అయితే, ఈసారి కన్నడ బ్యూటీ తనూజ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి పలు ఓటింగ్ వేదికలలో తనే టాప్‌లో ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిలో తనూజ బెటర్ అంటూ చాలామంది బిగ్‌బాస్ ఫాలోవర్స్ చెప్పడం విశేషం. ఎమోషన్స్, టాస్కులు, ఎక్స్ప్రెషన్స్, ఇతరులతో కన్విన్సింగ్‌గా మాట్లాడటం వంటి అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె ఆట తీరు నచ్చని వారి నుంచి నెగెటివ్ కూడా సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. ఇలా రెండు కోణాల్లో తనూజ విన్నింగ్పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా బిగ్‌బాస్ టీమ్ కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, ఈ కామెంట్లు ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాయి. విన్నింగ్ రేసులో ఉన్న వారితో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతిసారి చూసిందే.తనూజపై ట్రోలింగ్‌కు దిగిన యష్మి, శ్రీ సత్యతాజాగా తనూజపై పాత కంటెస్టెంట్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఒక వీడియోను తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ యష్మి గౌడ, సీజన్-6లో పాల్గొన్న శ్రీ సత్య స్విమ్మింగ్ ఫూల్లో ఉంటూ తనూజపై పరోక్షంగా ట్రోలింగ్‌కు దిగారు. వారిద్దరూ తనూజను టార్గెట్ చేస్తున్నారని రెగ్యూలర్‌గా బిగ్‌బాస్ చూసే వాళ్లకు సులభంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా మర్యాద మనీష్ హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో కల్యాణ్‌ను నామినేట్ చేసి హెచ్చరిస్తాడు. 'ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు' అంటూ పరోక్షంగా తనూజతో జాగ్రత్త అనేలా హింట్ ఇస్తాడు. ఇప్పుడు ఇదే పాయింట్‌తో యష్మి గౌడ ఇలా ట్రోలింగ్ మొదలు పెట్టింది. 'అరేయ్.. ఏంట్రా నువ్వు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నావ్.. నాకు దెబ్బలు తగిలాయి ఫ్రెండ్స్.. ఇదీ (శ్రీ సత్య) ముద్దు ముద్దు మాటలు చెప్పి నా చెవిలో మందార పువ్వులు పెడుతుంది.' అంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో క్రియేట్ చేసి వదిలారు. గతంలో కూడా ఆమె పరోక్షంగా తనూజపై పోస్టులు పెట్టింది. కేవలం పీఆర్ టీమ్ వల్లే తన ఆట కొనసాగుతుంది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇలా ఏకంగా వీడియో షేర్ చేసింది.S7 #Nikhil mida Soniya vachi blame Veste Enjoy chesav ga niku #Thanuja la stand teeskune ammayi lu endku Nachutaru le #Yashmi 👎🏼😡. Cheap #BiggBossTelugu9 https://t.co/WOcl6esgvl— k®!t|=|i v€®m@ (@Priyaskp77777) October 30, 2025 View this post on Instagram A post shared by Y A S H M I G O W D A (@yashmigowda) -
ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
సెకండ్ ఛాన్స్ కోసం భరణి, శ్రీజ బిగ్‌బాస్ హౌస్‌లో పోటీపడుతున్నారు. వీరిలో ఒక్కరికే స్థానం ఉంటుందన్న బిగ్‌బాస్.. రకరకాల టాస్కులిచ్చాడు. అందులో భరణి గాయాలపాలై ఆస్పత్రికి కూడా వెళ్లొచ్చాడు. అటు రేషన్ మేనేజర్‌గా ఉన్న తనూజకు గొడవలు తప్పడం లేదు. ఏకంగా రాజు (మాధురి)తో కూడా గొడవ జరిగింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో బుధవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..ఫెయిలైన సంచాలకులుశ్రీజ- భరణి కోసం మొదటగా కట్టు- పడగొట్టు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భరణి, ఇమ్మాన్యుయేల్‌ను ఒక్కటే కట్టడి చేసి శెభాష్ అనిపించుకున్నాడు డిమాన్ పవన్. కానీ, అతడి కష్టాన్ని ప్రేక్షకులకు కనిపించకుండా ఎపిసోడ్లో సరిగా వేయనేలేదు. ఫస్ట్ రౌండ్లో శ్రీజ గెలిచిందని కల్యాణ్.. కాదు, భరణి గెలిచాడని సుమన్ వాదించారు. దీంతో బిగ్‌బాస్.. ఈ ఇద్దర్నీ సంచాలకులిగా తప్పించాడు. కొత్త సంచాలక్ మాధురి.. శ్రీజ గెలిచినట్లు ప్రకటించింది.మాధురి వర్సెస్ తనూజరెండో రౌండ్లో భరణి (Bharani Shankar) గాయాలపాలవడంతో పాటు ఎవరూ గెలవలేదు. భరణిని ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ హౌస్‌లోకి పంపించారు. ఇక కిచెన్‌లో గొడవ మొదలైంది. చపాతీలు లావుగా వస్తున్నాయని తనూజ అంది. పక్కనే చపాతీ చేస్తున్న మాధురి.. మేమేమీ హోటల్ సర్వర్లము కాము.. మాకు రాదు అంటూ అక్కడ పడేసి వెళ్లిపోయింది. మేము కూడా హోటల్లో పని చేసి రాలేదు, అయినా పని చేస్తున్నాం. రాకపోతే చెప్పండి, వేరేవాళ్లు చేసుకుంటారని తనూజ కౌంటరిచ్చింది.అన్నంపై అలిగిన సంజనాతగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో.. ప్రేమకి తగ్గుతున్నా.. నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు. నేను మాటలు పడటానికి రాలేదు. మీకు సపోర్ట్‌గా ఉంటే బాగుంటుంది. న్యాయం వైపుంటే నచ్చదు అంటూ మాధురి (Divvala Madhuri) సెటైర్లు వేసింది. మీరు టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లకండి.. నాన్నను సేవ్ చేయమని అడిగానా? అంటూ తనూజ వాదించగా కాసేపు గొడవ జరిగింది. అటు అన్నం కొద్దిగానే ఉండటంతో.. అన్నం పెట్టుకునేముందు చెప్పాలిగా అని తనూజ సంజనాను ప్రశ్నించింది. దీంతో ఆమె తినే ప్లేటు మీద నుంచి అలిగి వెళ్లిపోయింది. అందుకే మాధురిపై కోపం లేదుమరోవైపు రీతూ-పవన్‌ల గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్స్ రోజు మాధురి.. నీకోసం నన్ను అన్ని మాటలు అంటుంటే ఎందుకు స్పందించలేదు? ఎందుకు కోపం రాలేదు? అని గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉండేసరికి డిమాన్ పవన్‌కు తిక్క రేగింది. ఆమెను అక్కా అని పిలుస్తున్నా, అందుకే కోపం రాలేదన్నాడు. దీంతో రీతూ మరింత అరిచింది. ఆవేశంలో పవన్ ఓ మాట జారాడు. ఇక చాలు, గుడ్‌బై అని రీతూ అక్కడినుంచి వెళ్లబోతుంటే పవన్ తనను తోసేశాడు.మాధురికి రీతూ తల్లి ఫోన్ఈ గొడవలతో పిచ్చెక్కిపోతున్న మాధురి.. పవన్‌తో ఒక్కమాట అడుగుతా.. మీది హెల్తీ రిలేషన్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు నాకు ఫోన్ చేస్తారా? నీతో మాట్లాడుతుంటే ఆమె తల్లి ఏడుస్తుందని నాకు చెప్తారా? నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే సారీ అనేసింది. ఆ తర్వాత కూడా వీళ్లు గొడవపడటం.. కాసేపటికి రీతూ ఎప్పటిలాగే డిమాన్‌కు తినిపించడం జరిగిపోయింది. ఇదంతా వాళ్లకెలా ఉందోకానీ, చూసేవారికి మాత్రం తల బొప్పికడుతోంది.చదవండి: కల్కి క్రెడిట్ నుంచి దీపికా పదుకొనే పేరు తొలగింపు -
వదిలించుకుందామన్నా వదలరుగా! హౌస్‌లో శ్రీజ, భరణి రీఎంట్రీ!
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఒకర్ని నామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే! అలాగే తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే పవర్ కూడా ఇస్తున్నారు. మరి ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారు? రీఎంట్రీ కోసం ఎవరు రేసులో ఉన్నారో మంగళవారం (అక్టోబర్ 29వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..భరణి రాకతో ఆనందభాష్పాలుభరణి (Bharani Shankar) హౌస్‌లో అడుగుపెట్టగానే దివ్య పరుగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. మిస్ అయ్యా నాన్నా అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్లను కాస్త పక్కకు వదిలించుకున్న భరణి.. బాడీ షేమింగ్ చేయడం తప్పంటూ సంజనాకు ఓ కత్తి పొడిచాడు. రెండో కత్తి నాక్కావాలి, మీ ముందే చెప్పాలని మీరొచ్చే వరకు వెయిట్ చేశా.. అని దివ్య డిమాండ్ చేసింది. కానీ భరణి తనను పట్టించుకోకుండా నిఖిల్‌కు ఇవ్వడంతో దివ్య ముఖం మాడ్చుకుంది.దివ్యను పట్టించుకోని భరణినిఖిల్.. కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ను గేమ్ మీకోసం వదిలేయమని అడుక్కోవడం నచ్చలేదని తనూజను నామినేట్ చేశాడు. భరణి వెళ్లిపోతూ తనూజతో.. బాండ్స్ వల్లే ఇప్పుడిలా బాధపడుతున్నావ్, బాండ్స్ కలుపుకోకు అని సలహా ఇచ్చింది. నా వల్లే మీరు వెళ్లానంటున్నారని తనూజ ఏడవడంతో ఛ, అలా ఏం కాదని సముదాయించి వెళ్లిపోయాడు. ఈ బంధాల జోలికి వెళ్లకూడదనుకున్నాడో, ఏమో కానీ.. దివ్యను అస్సలు పట్టించుకోలేదు. దీంతో ఆమె బాగానే హర్ట్ అయింది.నామినేషన్స్‌లో ఎనిమిది మందిశ్రష్టి.. డిమాన్ పవన్ (Demon Pavan)ను నామినేట్ చేసి, ఎనిమిదోవారం కల్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, మాధురి, తనూజ, గౌరవ్, రాము నామినేషన్స్‌లో ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని భరణిని తల్చుకుని దివ్య ఏడ్చేసింది. తర్వాతి రోజు భరణి, శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టారు. వీరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో ఉంటారన్నాడు బిగ్‌బాస్.రీఎంట్రీ.. ఒక్కరికే ఛాన్స్ఇక దివ్య.. భరణిని పక్కకు తీసుకెళ్లి.. నా నామినేషన్ ఎవరనుకుంటున్నారు? తనూజ అని బాంబు పేల్చింది. మొత్తానికి భరణి.. బంధాలకు దూరంగా ఉందామనుకున్నా అటు వాళ్లు వదిలేరా లేరు. ఇక శ్రీజ, భరణి కోసం హౌస్మేట్స్ గేమ్ ఆడనున్నారు. అలాగే వీరిలో ఎవరు హౌస్‌లో ఉండాలనేది ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయనున్నారు. మరెవరు రీఎంట్రీ ఇస్తారో చూడాలి!చదవండి: సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్ -
శ్రీజ ప్లాన్ ఇదే.. అందుకే కల్యాణ్, తనూజలపై ఫైర్
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటికే అర్ధ సెంచరీ కొట్టేసింది. అక్టోబర్ 27న సోమవారం నామినేషన్ ప్రక్రియ మంచి బజ్తోనే మొదలైంది. సాధారణంగా హౌస్మేట్స్ ఒకరినొకరు నామినేట్ చేసుకునే విధానానికి బిగ్‌బాస్ ఫుల్స్టాప్ పెట్టేశాడు. ఈసారి నామినేట్ చేసే హక్కును ఎలిమినేట్ అయిన సభ్యులకు బిగ్‌బాస్ ఇచ్చారు. దీంతో ప్రియా శెట్టి, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేశారు. వీరిలో దమ్ము శ్రీజ ప్రధానంగా హైలైట్ అయింది. కల్యాణ్, తనూజ, మాధురిని టార్గెట్ చేసి హౌస్‌లోకి దిగింది.సంజనపై ప్రియ ఫైర్నామినేషన్ ప్రక్రియ ప్రియాశెట్టితో మొదలైంది. దివ్యను రోడ్డు రోలర్ అని కామెంట్ చేసిన సంజనపై ఆమె భగ్గుమంది. సీజన్ ప్రారంభంలో కనిపించనంత నిజాయితీగా ఇప్పుడు లేరంటూనే కాస్త మాటలు అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. తర్వాత హౌస్‌లోకి మర్యాద మనీష్ ఎంట్రీ ఇచ్చాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి ఇమ్మాన్యుయేల్ను్ మోసం చేశావ్ అంటూ కల్యాణ్‌ను నామినేట్ చేశాడు. కల్యాణ్ చేసిన పని ఒక నమ్మకద్రోహంగా మిగిలిపోయిందని మండిపడ్డారు.ఫ్లోరా షైనీ ఎంట్రీతోనే రీతూ చౌదరిని నామినేట్ చేస్తూ.. ఎదురుదాడికి దిగింది. రీతూ కేవలం ఫేక్ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నావ్ అంటూ మొదట కల్యాణ్ ఆ తర్వాత పవన్‌లతో గేమ్ ఆడుతుందని తెలిపింది. కనీసం పవన్‌తో కూడా రీతూ నిజాయితీగా లేదని కామెంట్ చేసింది. రీతూ ఎపిసోడ్ కాగానే సుమన్ శెట్టికి నామినేట్ చేసే అవకాశం ఇచ్చింది. సంజనను నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి తన పాయింట్స్ చెప్పాడు. కెప్టెన్‌ని కూడా సంజన గౌరవించదు. తన మాట తీరు బాగాలేదు అంటూ నామినేట్ చేస్తాడు. దీంతో ఈ హౌస్‌లోనే చెత్త కెప్టెన్ సుమన్ శెట్టి అని ఆమె ఫైర్ అయింది.మాధురిని టార్గెట్ చేసిన శ్రీజబిగ్బాస్లోకి శ్రీజ ఎంట్రీనే పక్కా ప్లాన్‌తో వెళ్లింది. మొదట కావాలనే మాధురిని గెలికింది. ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ మీ పేరు మాధురినా.. మాస్ మాధురినా లేదా రాజు గారా అంటూ ఎటకారం మొదలుపెట్టింది. మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదని పంచ్‌లు వేసింది. మళ్లీ పేరు తెలీదని అంటారు కదా అని పాత గొడవని గుర్తుచేసింది. బయటికెళ్లిన తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాను ఎవరూ కూడా చెప్పలేదు. ఆమె నాకు కూడా ఆమె తెలీదు నీకెలా తెలుస్తుందని చాలామంది చెప్పారని ఎటకారం మొదలపెట్టింది. అయితే, అదే సమయంలో మాధురి కూడా తగ్గలేదు. నువ్వు కూడా ఎవరో నాకు ఇంత వరకూ తెలీదు అంటూ చెప్పింది.కల్యాణ్, తనూజలపై టార్గెట్..పక్కా ప్లాన్‌తో శ్రీజశ్రీజ నామినేట్ చేసింది కల్యాణ్‌ను మాత్రమే.. కానీ, ఆమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పక్కాగా తన స్ట్రాటజీతో ఆట మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఫస్ట్ మాధురిని ఆ తర్వాత తనూజపై ఎదురుదాడికి దిగింది. శ్రీజ రీఎంట్రీ ఇచ్చాక తనకు కల్యాణ్ పోటీ రావచ్చని ఇలా తన ఇమేజ్ను తగ్గించేలా స్కెచ్ వేసి దెబ్బ కొట్టింది. అలా ప్రస్తుతం టాప్‌లో ఉన్న కల్యాణ్, తనూజలను టార్గెట్ చేసి బరిలోకి దిగేందుకు తను ప్లాన్ అమలు చేసింది. ఇదే సమయంలో మాధురి పట్ల సోషల్‌మీడియాలో నెగటివిటీతో పాటు ఎక్కువగా ట్రోల్స్ కూడా జరుగుతుంటాయి. అలా ఆమెను ద్వేషించే వారి ఓట్లను కూడా తనవైపు తిప్పుకునే ప్లాన్ వేసినట్లు అర్థం అవుతుంది. ఇలా గట్టిగానే తన రీఎంట్రీకి శ్రీజ ప్లాన్ చేసుకుందని తెలుస్తోంది. అయితే, ఇక్కడ శ్రీజ నామినేషన్ పాయింట్లు ప్రతీది కూడా ఒక బుల్లెట్లా దూసుకుపోయాయి. వాటిలో ఒక్కదానికి కూడా కల్యాణ్ సమాధానం చెప్పలేకపోయాడు. తనూజ, మాధురి కూడా శ్రీజ వేసిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ఆమె ప్లాన్ విజయవంతమైంది.కల్యాణ్,తనూజలను ఇరికించిన శ్రీజనువ్వు అమ్మాయిల పిచ్చోడివా..? అంటూ కల్యాణ్‌ను శ్రీజ నామినేట్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నా సరిగ్గా ఎదిరించలేకపోయావ్.. అలాంటి కామెంట్లు చేసినా సరే లైట్ ఎందుకు తీసుకున్నావ్ కల్యాణ్.. ఎందుకు నోరుమూసుకొని కూర్చున్నావ్ అంటూ సరైన పాయింట్లే పట్టింది. వాటికి కల్యాణ్ సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. మరోవైపు తనూజను కూడా శ్రీజ గట్టిగానే టార్గెట్ చేసింది. ఇక్కడికి ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఇంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీ గురించి తప్పుగా మాట్లాడారు. రెండుడు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ ఎవరైతే కామెంట్ చేశారో అదే పర్సన్‌తో మీరు తిరుగుతున్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికే వెళ్లి రాజు రాజు అంటూ బాండింగ్ పెంచుకున్నారు. ఏంటో నాకు నిజంగా అర్థం కాలేదని శ్రీజ పేర్కొంది. ఇలా కల్యాణ్, తనూజల ఇమేజ్ను తగ్గించాలనే పక్కా ప్లాన్‌తో ఇరికించేసింది. తన రీ ఎంట్రీ ఆట బలంగా ఉండాలంటే ఇలాంటి స్ట్రాటజీ వేయడంలో తప్పులేదు. -
కల్యాణ్‌ను అంతమాట అనేసిందేంటి? ఆ ఐదుగుర్ని చెత్తబుట్టలో పడేసిన రమ్య
జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..తప్పు చేసినా తనూజయే విన్నర్గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.రమ్య ఎలిమినేట్ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు. కల్యాణ్ పరువు తీసిన రమ్యముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.రీతూపై బిగ్బాంబ్తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.చదవండి: బైసన్ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు -
బాడీ షేమింగ్, తిట్లు.. ఇదేం బుద్ధి? సంజన, మాధురికి గడ్డిపెట్టిన నాగ్
తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం మైనస్‌గా మారనుంది.తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్లో ఏడు వారాలు గడిచాయి. రానురాను కంటెస్టెంట్లు రాటుదేలతారనుకుంటే మరీ వరస్ట్‌గా తయారవుతున్నారు. సంజనా నోటికి హద్దే లేకుండా పోయింది. తొక్కిపడేస్తా, నేలకేసి కొడతా అంటూ మాధురి మరీ నీచంగా మాట్లాడుతోంది. వీళ్లకు సరైన కోటింగ్ ఇచ్చాడు నాగార్జున. మరి ఇంకా ఏమేం జరిగాయో శనివారం (అక్టోబర్ 25వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రాజాతో రీప్లేస్ చేశావా?ఇమ్మాన్యుయేల్.. కల్యాణ్‌తో తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేయించాలనుకున్నాడు. అది నేరుగా చెప్పకుండా ఏదేదో వాగాడు. ఈ టాపిక్‌ను నాగ్ ప్రస్తావిస్తూ అది సేఫ్ గేమ్, డైరెక్ట్‌గా నువ్వు చేయొచ్చుగా? అని ఇమ్మాన్యుయేల్‌కు క్లాస్ పీకాడు. తనూజ-మాధురిని బంధాల గురించి అడిగాడు. నాన్నని రాజాతో రీప్లేస్ చేశావా? అని నిలదీశాడు. అందుకు తనూజ.. మాది ఫేక్ బాండ్ కాదు సర్. నేను ఆవిడపై అరిచేస్తున్నా, తిట్టేస్తున్నా.. కానీ ఆవిడ నాతో ఎక్కువ కనెక్ట్ అయ్యారు. తోసేసినా వెళ్లనంటోందివచ్చినప్పుడు నాన్న నాన్న అని నాపై చాలా చెప్పారు.. మరిప్పుడెందుకు క్లోజ్ అవుతున్నారు? ఇది నాకు నెగెటివ్ అవుతుంని చెప్పినా ఆవిడ ఒప్పుకోలేదు. నీతో జెన్యూన్‌గా ఉన్నా.. నువ్వు తోసేసినా వెళ్లనని నాతో అంది సార్. ఒకవేళ నాకంటే ముందే నువ్వు ఎలిమినేట్ అయితే నేను హ్యాపీగా ఫీలవుతా అని కూడా చెప్పాను అని పేర్కొంది. మాధురికి క్లాస్ఇక తనూజ-సాయి మాట్లాడుతుంటే మధ్యలో రాము వచ్చి కూర్చోగా.. తనూజ చిరాకుతో మాటలనేసి వెళ్లిపోయిన వీడియో వేసి క్లాస్ పీకాడు. అయితే అది మాకు అలవాటే అని రాము అనడం గమనార్హం. ఇక దివ్యను రోడ్ రోలర్, లావు అని మాటలనడం, సంజ్ఞలు చేయడం తప్పని సంజనాకు క్లాస్ పీకాడు. రీతూపై మాటలు తూలిన మాధురికి కూడా క్లాస్ పడింది. గేమ్‌లో రీతూ.. తన డబ్బులన్నీ పవన్‌కు ఇవ్వడం.. కంటెండర్‌షిప్ కోసం తనను సైడ్ చేయడం జీర్ణించుకోలేకపోయింది. అది కడుపులో పెట్టుకుని రీతూను నానామాటలంది. బయట తోపు.. ఇక్కడ కాదు!బయట ఇలా చేసుంటే నేలకేసి తొక్కుతా.. నీ బిహేవియర్ బాలేదు, నీ నోరే చెత్త.. ఇలా చాలానే వాగింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. మీరు బయట తోపైతే బయట చూసుకోండి. బిగ్‌బాస్ హౌస్‌లో కాదు అని కాస్త సాఫ్ట్‌గానే హెచ్చరించాడు. ఇక ఈ ఎపిసోడ్లో ఫేక్ బాండ్స్, ఇన్సెక్యూర్.. అంటూ ఎక్కువ బోర్డులు మాధురి మెడలోనే పడ్డాయి. దీంతో ఆమెకు ఓ పనిష్మెంట్ ఇవ్వనున్నారు. అది డైరెక్ట్ నామినేషన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో కల్యాణ్‌ను మాత్రమే సేవ్ చేశారు. సేవ్ అయితే ఏదో చెప్తానన్నావ్.. అని నాగార్జున కూపీ లాగే ప్రయత్నం చేశాడు. కానీ కల్యాణ్ మెలికలు తిరుగుతూ తర్వాత చెప్తానంటూ దాటేశాడు.చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి పచ్చళ్ల పాప ఎలిమినేట్! -
ఆయేషాకు టైఫాయిడ్, డెంగ్యూ.. తనూజ కోసం వెక్కెక్కి ఏడ్చిన కల్యాణ్!
Bigg Boss Telugu 9లో అనుకున్నదే జరిగింది. హౌస్ నుంచి ఆయేషా వెళ్లిపోయింది. మరోవైపు తనూజకు ఫెవికిక్లా అతుక్కుపోయింది మాధురి. తనకోసం రమ్యతో సైతం గొడవపడింది. తనూజనే ముఖ్యం అంటూ ఏదో నిజమైన అమ్మలా ఫీలైపోయింది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో శుక్రవారం (అక్టోబర్ 24వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..రీతూ కంటెండర్.. తట్టుకోలేకపోయిన మాధురివాంటెడ్ పేట టాస్క్‌లో సంజనాని పోలీసులకు పట్టించినందుకు తనూజ (Thanuja Puttaswamy) కెప్టెన్సీ కంటెండర్ అయింది. మాస్క్ మాధురి కటౌట్‌పై కిల్ అని రాసినందుకు రీతూ కూడా కంటెండర్ అయంది. కానీ, దీన్ని జీర్ణించుకోలేక రీతూపై విషం ఏదో ఒకరకంగా కక్కుతూనే ఉంది. డబ్బులు ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్లు నిఖిల్, కల్యాణ్, దివ్య, ఇమ్మాన్యుయేల్ సైతం కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఈ గేమ్‌లో చివరి వరకు తనూజ, ఇమ్మూ మిగలగా.. ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు.స్పృహ తప్పిన తనూజ.. ఏడ్చేసిన కల్యాణ్కెప్టెన్సీ చేజారడంతో తనూజ ఎమోషనల్ అయింది. సడన్‌గా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను డాక్టర్ రూమ్‌కు తీసుకెళ్లారు. తనూజను అలా చూసి ఇమ్మూ, కల్యాణ్ (Pawan Kalyan Padala) తెగ ఏడ్చేశారు. కల్యాణ్ అయితే.. తనూజకు ఏదో అయిపోయినట్లు వెక్కెక్కి ఏడ్చాడు. అది చూసిన మాధురి.. హే, నువ్వెందుకు ఏడుస్తున్నావ్? జనాలు చూస్తే నవ్వుతారు. తను వీక్నెస్తో కళ్లు తిరిగి పడిపోతే నీకెందుకు ఏడుపొస్తుంది.. ఛీఛీ అని చీవాట్లు పెట్టింది.సేవ్ అయితే ఒకటి చెప్తా!అర్ధరాత్రి తనూజ.. ఎందుకు ఏడ్చావ్? అని కల్యాణ్‌ను అడిగింది. అందుకతడు ఓడిపోయినందుకు ఏడ్చానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అది ఉట్టి అబద్ధం అని తెలిసిన తనూజ.. నిజం చెప్పు, ఎందుకు ఏడ్చావ్? అని మరోసారి నిలదీసింది. దీంతో అతడు అది నేను చెప్పలేను.. సర్లే బజ్జో.. నేను సేవ్ అయితే నీకొకటి చెప్తా అంటూ నిద్రపోతున్న తనూజతో అన్నాడు. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయేషాను మెడికల్ రూమ్‌కు పిలిచారు. టైఫాయిడ్‌తో పాటు, డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకో ఛాన్స్ఇక బిగ్‌బాస్.. మీ అనారోగ్యం దృష్ట్యా చికిత్స అవసరం. అలాగే ఇతర హౌస్మేట్స్ ఆరోగ్య భద్రత కూడా అవసరమే! అందుకే మిమ్మల్ని హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నా అన్నాడు. అప్పుడు ఆయేషా.. నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ బిగ్‌బాస్.. ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ ఇస్తారనే నమ్మకంతో వెళ్తున్నా.. అంటూ వీడ్కోలు చెప్పింది. ఇక వెళ్లేముందు తనూజతో.. జాగ్రత్త.. మళ్లీ ఫేక్దాంట్లో పడొద్దు. ఇదొక్కటే చెప్తున్నా అంటూ పిచ్చి లవ్ట్రాకులు వద్దని హెచ్చరించి వెళ్లిపోయింది.చదవండి: కమల్-రజనీ మూవీ.. సౌందర్య, శృతి హాసన్ ఏమన్నారంటే? -
కళ్లు తిరిగి పడిపోయిన తనూజ.. ఆరుగురి రీఎంట్రీ !
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే ఇప్పటికే అందిన లీకుల ప్రకారం ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో సర్కిల్లో టోపీ పెట్టారు. బజర్ మోగినప్పుడు టోపీని చేజిక్కించుకున్న వ్యక్తి.. కెప్టెన్సీ రేసులో లేనివాళ్లకు ఇవ్వాలి. వారు కెప్టెన్‌గా ఎవర్ని చూడొద్దనుకుంటున్నారో వారిని రేసు నుంచి తప్పించాలి. కెప్టెన్సీ గేమ్అలా నిఖిల్ పోటీ పడి.. టోపిని గెలిచి గౌరవ్ చేతిలో పెట్టాడు. దీంతో గౌరవ్.. కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎలిమినేట్ చేశాడు. ఇమ్మాన్యుయేల్.. సంజనాకు టోపీ ఇవ్వగా ఆమె దివ్యను ఎలిమినేట్ చేసింది. మరో రెండు మాధురికి ఇవ్వగా ఆమె నిఖిల్‌ను సైడ్ చేసింది. అలా చివరకు ఇమ్మాన్యుయేల్, తనూజ మిగలగా.. ఇమ్మూ గెలిచాడు. అయితే చివర్లో తనూజ కళ్లు తిరిగి పడిపోయినట్లు కనిపిస్తోంది. అటు ఆయేషా.. ఇప్పుడు తనూజ?నీళ్లు కొట్టి లేపినా ఆమె కళ్లు తెరవకపోయేసరికి హౌస్మేట్స్ కాస్త కంగారుపడ్డారు. అయితే అలిసిపోయి అలా పడిపోయింది తప్ప భయపడాల్సిందేమీ లేదు. మరోవైపు ఆయేషా కూడా డీహైడ్రేషన్‌కు గురైంది. దీనివల్ల టాస్కుల్లోనూ పాల్గొనలేకపోతోంది. ఆమెకు టైఫాయిడ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే తనను షో నుంచి పంపించేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి.రీఎంట్రీ?హౌస్‌మేట్స్‌తో కొన్ని టాస్కులాడించేందుకు లేదా, నామినేట్ చేయడానికి.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నారని ఓ వార్త వైరలవుతోంది. దాదాపు నామినేట్ చేసేందుకే వస్తారు! అలా వచ్చినప్పుడు ఒకరిద్దరు హౌస్‌లోనే పాగా వేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఏంటి? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. చదవండి: సంజనా కోసం త్యాగం.. మళ్లీ సాధించిన ఇమ్మాన్యుయేల్ -
బిగ్‌బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్లో ప్రస్తుతానికి తనూజ టాప్‌లో దూసుకుపోతుంది. ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది. అయితే, తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్‌బాస్‌లో ఆమె టాప్‌లో ఉండటంతో ఈ సీరియల్‌కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో దూసుకుపోతుంది.తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే, సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్‌గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. కానీ, ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా '6-5=2'లో దక్కింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ 'అందాల రాక్షసి'లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది. మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. తనూజ దెబ్బతో 27 మిలియన్లు దాటేసిందిబిగ్బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్‌తో ఉన్న ఈ పాట.. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది. బిగ్‌బాస్‌లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్‌ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది. తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది. తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్గా ఆడుతుంది. తనలో ఎమోషన్స్‌తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది. మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు. కన్నడిగ అయినా సరే.., తెలుగులోనే చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్‌లో ఉంది. -
తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
నామినేషన్స్ అయిపోయినా కంటెస్టెంట్ల కోపతాపాలు మాత్రం తగ్గలేదు. సంజనా.. కల్యాణ్‌పై, తనూజ.. ఇమ్మాన్యుయేల్‌పై బుసలు కొడుతూనే ఉన్నారు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో అక్టోబర్ 21వ ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నామినేషన్స్ లొల్లితనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేస్తా.. ఈ మాట అన్నందుకే నామినేషన్ చేసే పవర్‌ను కల్యాణ్‌కు ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే అది ఇమ్మూ మెడకే చుట్టుకుంది. అతడు తనూజకు బదులుగా ఇమ్మూ తల్లి సంజనాను నామినేట్ చేశాడు. నమ్మించి మోసం చేశాడంటూ ఇమ్మూ గొడవపడ్డాడు. రమ్య ఆల్రెడీ తనూజను నామినేట్ చేసింది. నాకు ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదు అని కల్యాణ్ వివరణ ఇచ్చాడు.తనూజను ఎప్పుడో వదిలేశా!అప్పటికీ అసహనంతో ఊగిపోతున్న ఇమ్మూ (Emmanuel).. సరే, ఈ వారం గమనించు, తను జెన్యూన్‌గా ఉందో, లేదో! అని తనూజ గురించి అన్నాడు. అందుకు కల్యాణ్ ఇచ్చిన ఆన్సర్‌కు దిమ్మ తిరగాల్సిందే! నేను ఎప్పుడో వదిలేశా అన్నా.. తన(తనూజ)ను పట్టించుకోవట్లేదు! అన్నాడు. ఈ వారం కూడా తను సేఫ్ గేమ్ ఆడితే తర్వాతి వారం నామినేట్ చేస్తానని మాధురితో చెప్పాడు కల్యాణ్.ఇమ్మాన్యుయేల్‌పై రంకెలేసిన తనూజమరోవైపు తనూజ.. అరుస్తూనే ఉంది. తల్లీ కొడుకులైన సంజనా, ఇమ్మాన్యుయేల్‌పై చిందులు తొక్కింది. తనూజను బుజ్జగించబోతే మాధురిపైనా అరిచేయడం గమనార్హం! ఆయేషా.. గౌరవ్‌తో రాత్రిపూట ముచ్చట్లాడింది. రమ్య హౌస్‌లోకి వచ్చేటప్పుడే తనూజను ఎలిమినేట్ చేయాలని బలంగా డిసైడ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయ్యేవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంది. తన ఫోకస్ అంతా ఒక్కదగ్గరే ఉందని అభిప్రాయపడింది.దొంగలుగా హౌస్మేట్స్బిగ్బాస్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ మాధురి, సంజనా సైలెన్సర్ అంటూ టీమ్ లీడర్స్‌ను ప్రకటించాడు. గేమ్స్ ముగిసే సమయానికి ఎవరి గ్యాంగ్‌లో ఎక్కువమంది ఉంటే వారు కంటెండర్స్ అవుతారన్నాడు. మొదటి గేమ్‌లో మాధురి టీమ్ గెలిచింది. ఓడిపోయిన సంజనాను స్విమ్మింగ్ పూల్‌లో ముంచేశారు.చదవండి: టాప్ హీరోకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు! -
తనూజ, ఇమ్మాన్యేయల్కు గొడవ పెట్టిన కల్యాణ్
బిగ్‌బాస్ 44వ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. సోమవారం జరిగిన నామినేషన్స్‌లో కల్యాణ్ చేసిన పనికి తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య గొడవ మొదలైంది. ఇదంత మంగళవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ కానుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను బెలూన్ టాస్క్‌ల పేరుతో ఇమ్ము, అయేషా చేతిలో బిగ్‌బాస్ పెట్టడం. అందులో వారిద్దరూ గెలుచుకున్న టికెట్లు తమకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. వాళ్లు వెళ్లి నామినేషన్స్ చేయవచ్చు. అయితే, ఒక టికెట్ కల్యాణ్‌కు ఇస్తాడు ఇమ్ము. అతను సంజనాను నామినేట్ చేయడంతో ఇమ్ము ఆశ్చర్యపోతాడు. కల్యాణ్.. నువ్వు నాకు నామినేషన్ చేస్తానని చెప్పిన పేరు ఒకటి.. ఇప్పుడు చేసిందొకటి. ఇదేంటి అంటూ గొడవకు దిగుతాడు. తనూజను నామినేట్ చేస్తానని చెప్పి నా వద్ద టికెట్ తీసుకున్నావ్.. ఇలా మాట తప్పుతావని అసలు ఊహించలేదంటూ మాట్లాడుతాడు. తనూజను నేను కూడా నామినేట్ చేయాలని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చి చేస్తానని చెప్పడంతో నేను నిన్ను నమ్మి నామినేషన్ టికెట్ ఇచ్చానంటూ కల్యాణ్‌పై ఫైర్ అవుతాడు.తనూజ, ఇమ్మాన్యేయల్ మధ్య చిచ్చుబిగ్బాస్ సీజన్ ప్రారంభం నుంచి ఇమ్ము, కల్యాణ్‌తో తనూజ బాగానే క్లోజ్ ఉంది. ఇప్పుడు తనను నామినేషన్ చేసేందుకు ఇలా వారిద్దరూ పోటీ పడటం తనకు నచ్చలేదు. ఇది చాలా మోసం అంటూ తాజాగా విడుదలైన ప్రోమోలో దివ్యతో చెబుతుంది. ఐదు నామినేషన్స్ టికెట్లు గెలుచుకున్న ఇమ్ము ఒకటి కూడా తన వద్ద ఉంచుకోకుండా చాలా సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నం చేశాడు. అదేదో ఒక టికెట్ తనే ఉపయోగించి తనూజను నామినేషన్ చేసి ఉంటే ఇమ్ముకు పాజిటివ్ వచ్చేది. ఇలా సేఫ్‌గా కల్యాణ్‌తో ఆట నడిపించే ప్రయత్నం చేసి చెడ్డపేరు తెచ్చుకున్నాడు.తనూజ, ఇమ్ము మధ్య వార్ మొదలైనట్లు తాజాగా విడుదలైన ప్రోమోలో కనిపిస్తుంది. నేను ఎవరినీ కేర్ చేయనంటూ ఇమ్ముతో తనూజ అంటుంది. అంతే రేంజ్లో ఇమ్ము కూడా సమాధానం ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కోసం నేను సపోర్ట్ చేశాననే బాధ నాలో ఉందని ఇమ్ము అనడం.. ఆపై తనూజ కూడా ఆటలో ఎవరు ఎవరి కోసం నిలబడరని చెప్పడం. దానికి ఇమ్ము కూడా చిన్నపిల్లోడిలా అప్పుడు నీ కోసం ఇది చేశాను.. అది చేశాను అని చెబుతూ పాత విషయాలు తెరపైకి తీసుకొచ్చాడు. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం చాలా ఫైర్గానే ఉంది. -
నీ ఏజ్‌కు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్
బిగ్‌బాస్ హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత బాండింగ్స్ గురించి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఈ క్రమంలో హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరూ చాలా అలెర్ట్ అయిపోయారు. దీంతో 7వ వారం నామినేషన్స్‌లో బిగ్ వార్ కొనసాగింది. ఎలిమినేషన్ ప్రక్రియలో తనూజ -రమ్య మధ్య జరిగిన వార్తో పాటు రీతూ- ఆయేషాల మధ్య నడిచన మాటల ఫైర్ కూడా బాగానే పేలింది. ఎలిమినేషన్ రౌండ్లో ఇచ్చిన మాట తప్పావంటూ కల్యాణ్‌పై ఇమ్మాన్యేయల్ చేసిన కామెంట్లు ఆసక్తిగానే ఉన్నాయి. ఇలా ఈ వారం బిగ్ఫైట్తోనే మొదలైంది.రీతూ- ఆయేషాలో ఫైర్ బ్రాండ్ ఎవరుఆయేషా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదు వారాల పాటు షో చూసి గేమ్‌లోకి దిగింది. రీతూ, తనూజలనే టార్గెట్ పెట్టుకుని వచ్చినట్లు అర్ధం అవుతుంది. తానొక ఫైర్ బ్రాండ్ అనే రీతిలో ఆట మొదలు పెట్టింది. అయితే, ఈ వారం నామినేషన్లో రీతూ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులను మెప్పించలేదు. కేవలం లవ్‌లు ఆడేందుకే హౌస్‌లోకి వచ్చావని పదేపదే రీతూను టార్గెట్ చేస్తూ ఆయేషా మాట్లాడింది. ఇదంతా బయటున్న ప్రేక్షకులకు కూడా తెలిసిందే. మళ్లీ అదే పాయింట్‌తో నామినేషన్ చేయడం ఆయేషా చేసిన రాంగ్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రీతూ పట్ల చాలా దారుణమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే, రీతూ కూడా ఏంతమాత్రం తగ్గలేదు. కౌంటర్‌కు ధీటుగానే సమాధానం చెప్పకుంటూ పోయింది. రీతూ కేవలం లవ్ ట్రాక్‌తో మాత్రమే గేమ్ అడుతుందని చెప్పడవం చాలా రాంగ్.. గతంలో ఆమె చాలా బలంగా టాస్క్‌లు ఆడింది. అమ్మాయిల్లో శ్రీజ తర్వాత అంత గట్టిగా గేమ్స్ ఆడే సత్తా తనకు మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే. వీరిద్దరి మధ్య జరిగిన వార్‌లో రీతూనే ఫైర్ బ్రాండ్‌గా నిలిచిందని చెప్పవచ్చు.వయసుకు తగ్గట్లు ఉన్నావా.. రమ్యపై తనూజ ఫైర్నామినేషన్స్ ప్రక్రియలో మొదట తనూజను టార్గెట్ చేస్తూ రమ్య హీట్ పెంచింది. తనూజ టాప్‌లో ఉందని హైపర్ ఆది కూడా హింట్ ఇచ్చేశాడు. దీంతో ఆమెను టార్గెట్ చేస్తే కాస్త గేమ్ ట్రాక్‌లోకి వచ్చేస్తామనే ప్లాన్‌లో రమ్య ఉంది. అయితే, ఆట చూసే బరిలోకి దిగిన రమ్య పసలేని పాయింట్లతో తనూజను నామినేట్ చేసింది. తనూజ గురించి గత ఐదు వారాలుగా వస్తున్న వాటినే లేవనెత్తి మాట్లాడటం ఆపై తన గురించి బ్యాక్‌బిచ్చింగ్ చేయడం రమ్యకు నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయి.నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకూ ఒక్క టాస్క్ కూడా ఆడలేదు.. మరోకరి సాయంతో మాత్రమే నిలబడుతున్నావ్ అంటూ తనూజ గురించి రమ్య అంటుంది. కేవలం బాండిగ్స్ కోసం మాత్రమే వచ్చావని, వాటి వల్లే ఇంట్లో ఉంటున్నావని కామెంట్స్ చేసింది. నువ్వు ఇంకా ముసుగులోనే ఉన్నావ్.. దాని నుంచి బయటికిరా.. ఫుల్ డ్రామా క్వీన్‌లా నటిస్తున్నావ్.. అంతా ఫేక్ అంటూ గట్టిగానే రమ్య మాట్లాడింది. తనూజ కూడా అంతే రేంజ్లో సమాధానం ఇచ్చింది.నువ్వు నా మాస్క్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ముందు నీ మాస్క్ నువ్వు చూసుకో.. కన్ఫెషన్ రూమ్‌లో నువ్వు ఏం అనిపించుకున్నావో అందరికీ తెలుసు. కాస్త వయసుకు తగినట్లు మాట్లాడు. ఫస్ట్ బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడటం ఆపేయ్. అంటూ తనూజ ఫైర్ అయింది. అప్పుడు రమ్య కూడా.. అవును, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదంటూ మాటలు తూలింది. అలా ఇద్దరూ హౌస్‌లో హీట్ పెంచేశారు.రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాట్లాడిన నువ్వు బ్యాక్ బిచ్చింగ్ గురించి మాట్లాడుతున్నావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది. ఇది బిగ్బాస్లా లేదు లవర్స్ పార్క్‌లా ఉంది అన్నావ్.. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో.. ఒకరికి మంట పెట్టాలని ఇంకొకరికి కోపం తెప్పించేలా మాట్లాడటానికే ఇక్కడికి వచ్చావా అంటూ రమ్యపై తనూజ ఫైర్ అయింది.తనూజకు సరైన సమాధానం చెప్పలేక పర్సనల్ అటాక్ చేసేందేకు రమ్య దిగింది. నువ్వు జెలస్ రాణివి.. ఫేక్ పిల్లవి.. ఒకరు వెళ్లిపోయారు ఇంకొకర్ని వెతుక్కోనే పనిలో ఉంటావ్ .. అంటూ రమ్య వేసిన కౌంటర్‌కు తనూజ కూడా గట్టిగానే తిరిగిచ్చేసింది. ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా.. ఒక్కోసారి రెండు చేతుల క్లాప్ నుంచి వచ్చే శబ్ధం కన్నా ఒక్క చేతితో వేసే విజిల్ గట్టిగా వినిపిస్తుందంటూ.. విజిల్ వేసి మరీ తనూజ బదులిచ్చింది .చెయ్ వెయ్ రా.. కల్యాణ్తనూజ- కల్యాణ్ గురించి రమ్య చేసిన బ్యాక్బిచ్చింగ్కు తనూజ ఓపెన్‌గానే సమాధానం ఇచ్చింది. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి.. వెనుకచాటు మాటలు ఎందుకంటూ రమ్యను ప్రశ్నించింది. నామినేషన్ టైమ్‌లోనే కళ్యాణ్ దగ్గరికెళ్లి.. ఒరేయ్ ఒకసారి నా భుజం మీద చెయ్ వెయ్ రా.. లాస్ట్ టైమ్ నువ్వు హ్యాండ్ వేయడానికి వస్తే ఛీ తియ్ అని అన్నాను. ఇప్పుడు వేయరా చూద్దాం. ఏమైనా జరగని అంటూ తన తల మీద చెయ్ పెట్టమని కూడా తనూజ కోరుతుంది. ఈ సీన్ బాగా వైరల్ అయింది. తనూజకు బాగా కలిసొచ్చేలా ఈ ఎపిసోడ్ ఉంది. ఫైనల్‌గా ఈ వారం నామినేషన్లో తనూజ, రమ్య, కల్యాణ్, రాము, దివ్య, రాము, సంజన, శ్రీనివాస్ సాయి ఉన్నారు. -
నాన్న అందుకే వెనకబడ్డాడు! ఆకాశానికెత్తి పాతాళంలో పడేశారు!
నాన్న ఎందుకో వెనకబడ్డాడు. బంధాల మధ్యలో చిక్కుకుని బయటకు రాలేక అవస్థ పడ్డాడు. కూతురు, తమ్ముడు, సోదరుడు, స్నేహితుడు.. ఇలాంటి బంధాల్లో కూరుకుని నిండా మునిగిపోయాడు. బిగ్‌బాస్ ఆటను మర్చిపోయి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకున్నాడు. అదే ఆయన ఎలిమినేషన్‌కు తొలి, చివరి కారణం! తన కోసం తగ్గిన భరణిబిగ్బాస్ షో (Bigg Boss Telugu 9) ప్రారభమైన మొదటివారం భరణి మాటతీరు చాలామందికి నచ్చింది. తర్వాతి వారం ఆటతీరు నచ్చింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనూజ.. నాన్న, నాన్న అంటూ వెనకపడటంతో ఆమె కోసం కొన్నిచోట్ల తగ్గాల్సి వచ్చింది. నాన్న.. నాకోసం నిలబడతాడు, నాకోసం ఏదైనా చేస్తాడు అంటూ గంపెడాశలు పెట్టుకున్న తనూజ కోసం కొన్నిసార్లు ఆటలో వెనకడుగు వేయాల్సి వచ్చింది. అటు రాము రాథోడ్‌ను కొడుకులా దగ్గరకు తీసుకున్నాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కెప్టెన్ కూడా చేశాడు.టాప్ 1 అని..కానీ, అదే సమయంలో రీతూకు సైతం సాయం చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేనందుకు నానామాటలు పడ్డాడు. ఇంతలో అగ్నిపరీక్ష నుంచి వైల్డ్‌కార్డ్‌గా సరాసరి హౌస్‌లోకి వచ్చింది దివ్య. వచ్చీరావడంతోనే భరణి (Bharani Shankar)ని నెం.1 స్థానంలో నిలబెట్టింది. అందరూ తనే టాప్ 1 అని పైకి లేపేసరికి పొంగిపోయాడు. దివ్యను ఇంకో కూతురిగా చూసుకున్నాడు. తనకు ఎదురొచ్చినవారు ఎలిమినేట్ అవుతున్నారంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఆ పని చేసుంటే..కానీ, రోజురోజుకీ తన గ్రాఫ్ పడిపోతుందని అర్థం చేసుకోలేకపోయాడు. బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, గేమ్ ఆడండి అని నాగార్జున పదేపదే హెచ్చరించినా దాన్ని పెడచెవిన పెట్టాడు. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా భరణి గేమ్ ఆడుంటే ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. కానీ బంధాలతో నోరు కట్టేసుకున్నాడు, తనకు తానే ఓ బందీ అయిపోయాడు. దీనికి తోడు భరణికి భుజం నొప్పి కూడా ఉంది. ఎలాగో వైల్డ్ కార్డ్స్ వచ్చారు కాబట్టి, ఇక అతడితో పని లేదని భావించిన ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేశారు.చదవండి: బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి! -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్..
నిన్నటి ప్రోమోలో మాధురికి చీవాట్లు పెట్టాడు నాగార్జున (Nagarjuna Akkineni). కానీ ఎపిసోడ్లో మాత్రం ఆమెను బుజ్జగిస్తూ.. ఏకంగా రేషన్ మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చేశాడు. అటు పవన్ కల్యాణ్- తనూజలకు బయట ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 18వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..నా బుజ్జి తమ్ముడు(Bigg Boss Telugu 9)నాగార్జున ఎక్కువగా వైల్డ్కార్డులతోనే మాట్లాడాడు. తమిళ బిగ్‌బాస్ బాగుందా? ఇక్కడ బాగుందా? అని అడగ్గా ఆయేషా.. తమిళ్ కంటే ఇక్కడే బాగుంది అని నవ్వింది. పచ్చళ్ల పాప రమ్యను సైతం హౌస్ బాగుందా? అని అడగ్గా చాలా బాగుందని మెలికలు తిరిగిపోయింది. బాగుందా? లేదంటే చాలా బాగున్నాడా? అని పంచ్ వేశాడు నాగ్. దీంతో రమ్య వెంటనే.. డిమాన్ పవన్ నా బుజ్జి తమ్ముడు సార్ అని తడుముకోకుండా చెప్పేసరికి హౌస్మేట్స్ షాకైపోయారు.మాధురి పవర్ పాయే..వైల్డ్‌కార్డ్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేముందు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చారు కదా.. దానికి వాళ్లు అర్హులా? కాదా? అని ఆడియన్స్‌తో ఓటింగ్ వేయించాడు నాగ్. ముందుగా మాధురి వంతు వచ్చింది. ఆమెకు సంజనా డప్పు కొడితే దివ్య మాత్రం.. ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమనేది పెద్ద పవర్.. దానికి ఈమె అర్హురాలు కాదని అభిప్రాయపడింది. ఆడియన్స్‌కు దివ్య మాటకే జై కొట్టారు. 88% మంది మాధురిని తప్పుపట్టారు. దీంతో ఆమెకున్న స్పెషల్ పవర్ పీకేశాడు నాగ్.మాధురి.. 200% కరెక్ట్అలాగే మాధురి.. పవన్ కల్యాణ్‌తో గొడవపడిన క్లిప్పింగ్ చూపించి.. మాట్లాడిన విషయంలో తప్పులేదు.. మాట్లాడిన తీరులో తప్పుందని, దాన్ని సరిచేసుకోవాలన్నాడు. రాత్రి లైట్లు ఆఫ్ చేశాక గుసగుసలు పెట్టొద్దన్నావ్. నువ్వు 200% కరెక్ట్.. నీ స్థానంలో నేనున్నా అదే చేస్తా.. కానీ చెప్పే విధానం మార్చుకోవాలని సముదాయించాడు. ఇప్పటివరకు కమాండింగే తెలుసు.. కానీ బతిమాలడం తెలీదు.. సరే ఇకపై నేర్చుకుంటానంది మాధురి. కల్యాణ్-తనూజల బంధంపై అందరూ ఏమనుకుంటున్నారు? ఏంటనేది వీడియోలతో వారికి క్లారిటీ వచ్చేలా చేశాడు నాగ్.కన్ఫ్యూజన్లో పవన్- రీతూఅయితే తనూజకు అప్పటికే ఓ క్లారిటీ ఉంది. కల్యాణ్ చిన్నపిల్లోడు సర్ అనేసింది. అటు అతడు కూడా జనరేషన్ గ్యాప్ ఉందని చెప్పాడు. కల్యాణ్‌ను అమ్మాయిల పిచ్చి అనడం తప్పని రమ్యను హెచ్చరించాడు. ఇక డిమాన్- పవన్‌ల బంధంపై వారికే సరిగా క్లారిటీ లేకుండా పోయింది. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకుని ఆటపై ఫోకస్ చేయమన్నాడు నాగ్. అలా ఈ ఎపిసోడ్లో మాధురి, నిఖిల్ పవర్ పోగా.. రమ్య, ఆయేషా, శ్రీనివాస్ సాయిల పవర్ మాత్రం అలాగే ఉంది. చివర్లో ఇమ్మాన్యుయేల్‌కు కళ్లు నెత్తికెక్కాయి, పొగరు పెరిగిపోయిందంటూ కాసేపు ఆడుకున్న నాగ్ చివరకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనకు ఫుడ్ పార్టీ ఉంటుందన్నాడు. అనంతరం మాధురిని కొత్త రేషన్ మేనేజర్ చేశాడు.చదవండి: బిగ్‌బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్ -
తనూజ ప్లాన్ బయటపెట్టిన ఆయేషా.. ప్లేటు తిప్పిన ఇమ్ము!
వైల్డ్ కార్డ్స్ రావడం ఏమో గానీ బిగ్‌బాస్ తెలుగు షోలో కాస్త జోష్ వచ్చింది. మాధురి, రమ్య తదితరుల గురించి సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. వీళ్లతో పాటు వచ్చిన లేడీ వైల్డ్ కార్డ్ ఆయేషా.. నామినేషన్స్‌లో ప్రతాపం చూపించేసింది. తనూజని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయింది. అంతా బాగానే ఉంది గానీ ఇమ్మాన్యుయేల్ ప్లేటు తిప్పేయడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ 37వ రోజు అసలేం జరిగింది?సగం నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ ఆగింది. అక్కడనుంచే మంగళవారం(అక్టోబరు 14) ఎపిసోడ్ మొదలైంది. ఈసారి పైనుంచి పడిన పట్టుకున్న మాధురి.. దాన్ని రీతూ చౌదరికి ఇచ్చింది. సమయమొచ్చినప్పుడు అండగా ఉంటానని మాట తప్పినందుకు భరణిని, తర్వాత దివ్యని నామినేట్ చేసింది. దీంతో రీతూ-దివ్య మధ్య చాలాసేపు వాదన నడిచింది. టైమ్ వచ్చినప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అని చెప్పి కౌంటర్ ఇచ్చింది. నన్ను టార్గెట్ చేసినోళ్లు వెళ్లిపోతున్నారు. కానీ వాళ్లని నేను ఎప్పుడు టార్గెట్ చేయలేదు అని భరణి సీరియస్ అయిపోయాడు. చివరకు మాధురి.. దివ్యని నామినేట్ చేసింది.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోయిన్.. ఇదేం పాడు పని?)ఈసారి బంతి గౌరవ్‌కి దొరికింది. దీంతో సంజనకు దాన్ని అందించాడు. నా ఆరోగ్యం బాగోలేదు. మీకు కనిపించలేదా? అంటూ గతవారం సంచాలక్‌గా చేసిన రాముని, తర్వాత భరణిని నామినేట్ చేసింది. ఎప్పటిలానే రాము పెద్దగా ఏం మాట్లాడలేదు. భరణి మాత్రం సంజనపై సీరియస్ అయిపోయాడు. మీరు గూండాలు అనడం సరికాదు, సంజనని వెంటనే బయటకు పంపు అనే మాట అని ఉంటే ఇప్పుడే వాకౌట్ చేస్తా అని భరణి శపథం చేశాడు. అంతా అయిన తర్వాత గౌరవ్.. భరణి పేరు ఫిక్స్ చేశాడు. తర్వాత కూడా గౌరవ్ బంతిని పట్టుకున్నాడు. కానీ అడగటంతో ఆయేషాకి ఇచ్చేశాడు.ఆయేషా.. బంతిని తీసుకెళ్లి సుమన్ శెట్టికి ఇచ్చింది. అతడేమో తనూజ, సంజనని నామినేట్ చేశాడు. దీంతో ఆయేషా అందుకుంది. నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది. నీకున్న బాండింగ్స్ వల్ల ఫేవరిజం జరుగుతోంది. నీ వల్ల భరణి గేమ్ పాడవుతోందనిపిస్తోంది. స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ అది అక్కర్లేదు. బాయ్ ఫ్రెండో నాన్నో ఉంటే ఫైనల్ వరకు వచ్చేస్తాం అన్నట్లు ఉంది అని కల్యాణ్, భరణితో బాండింగ్ గుర్తుచేస్తూ తనూజని ఆయేషా టార్గెట్ చేసింది. దీంతో తనూజ కూడా రెచ్చిపోయింది. నువ్వు కూడా ఇంతకుముందు బాల్ కోసం సపోర్ట్ అడిగావ్‌గా అని బయటపెట్టింది. చివరకు నా టార్గెట్ నువ్వే అని తనూజని ఆయేషా నామినేట్ చేసింది. కెప్టెన్ కల్యాణ్.. తన పవర్ ఉపయోగించి రాముని నామినేట్ చేశాడు.మొత్తంగా ఈ వారం రాము, తనూజ, భరణి, దివ్య, సుమన్ శెట్టి, పవన్ నామినేషన్స్‌లో నిలిచారు. సరే దీని గురించి పక్కనబెడితే మొన్నటివరకు తనూజతో తిరిగిన ఇమ్మాన్యుయేల్.. ఆయేషా ఈసారి తనూజని టార్గెట్ చేసిన తర్వాత ప్లేటు తిప్పేశాడు. తనూజ vs ఆయేషా గొడవ జరుగుతున్నప్పుడు చప్పట్లు కొట్టాడు. అంతా అయిపోయిన తర్వాత 'సూపర్‌గా చెప్పావ్' అని ఆయేషాతో అన్నాడు. ఇదంతా చూస్తుంటే హౌసులో ఈ వారమంతా వాడీవేడీగా ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: పవన్ గురించి ప్రశ్న.. 'వద్దు' అని కిరణ్ అబ్బవరం) -
వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్‌గా కల్యాణ్.. గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ
తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్ కల్యాణ్. అతడిని సేఫ్ జోన్లో పడేయడంతో పాటు కెప్టెన్ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్ 10వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..పూల్ టాస్క్కల్యాణ్ (Pawan Kalyan Padala)ను ఎందుకు సేఫ్ జోన్లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్ చివరి ఛాన్స్‌గా పూల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజసేఫ్ జోన్లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్, రాము, దివ్య, భరణి, తనూజ (Thanuja Puttaswamy)లకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్ కావాలన్నది డిసైడ్ చేయమని డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజకెప్టెన్సీ బ్యాండ్ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్ ప్లేయర్ అన్న దివ్యతో బ్యాండ్ కట్టించుకుని కాలర్ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్ అవ్వాల్సిన తను.. డేంజర్ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.చదవండి: కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్: స్టార్ డైరెక్టర్ -
ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు
ఇమ్యూనిటీ కోసం గేమ్స్ పెడితే ఇమ్మాన్యుయేల్ గెలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. రాము కెప్టెన్ కాబట్టి దర్జాగా ఉన్నాడు. మిగిలినవారందరికీ గేమ్స్ పెట్టకుండా ఖాళీగా వదిలేస్తే రియాలిటీ షోను కాస్త ఫ్యామిలీ సీరియల్ డ్రామాగా మార్చేలా ఉన్నారని బిగ్‌బాస్‌కు భయం పట్టుకుంది. అమ్మ, నాన్న, అన్న, కొడుకు ఇలా ఏవేవో బంధుత్వాలు కలిపేసుకుని అక్కడే ఆగిపోయారు. అందుకే వీళ్లకు కొన్ని గేమ్స్ పెట్టారు. మరి హౌస్‌లో నిన్న (అక్టోబర్ 9న) ఏం జరిగిందో చూసేద్దాం..కూతుర్ని బుజ్జగించిన నాన్నతనూజ నాన్న (భరణి)పై అలక బూనింది. దీంతో అతడు కూతుర్ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా ఈ హౌస్‌లో నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కాసేపు మాట్లాడాడు. ఇంతలో బిగ్‌బాస్ నాచోరే నాచోరే అని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో కల్యాణ్ గెలిచాడు. తర్వాతి స్థానాల్లో దివ్య, డిమాన్, సుమన్ ఉన్నారు. సంజనా టీమ్‌కు ఒక్క పాయింట్ కూడా రాలేదు. లీడర్ బోర్డ్‌లో మొదటి స్థానంలో ఉన్న దివ్య- భరణికి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నావల్ల కాదు: సంజనాపట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఫ్లోరా- సంజనా, శ్రీజ- సుమన్‌లలో నుంచి ఒక జట్టును రేసు నుంచి తొలగించవచ్చన్నాడు. దీంతో వాళ్లు ఫ్లోరా- సంజనాను తీసేశారు. తన కష్టమంతా వృథా కావడంతో సంజనా తట్టుకోలేకపోయింది. ఒంటరి కూర్చుని ఏడ్చేసింది. ఫిజికల్ టాస్కులు ఉంటాయని నాకు తెలీదు. అబ్బాయిల శరీరంపై నుంచి ఎలా దూకాలి బిగ్‌బాస్? నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగైతే నేనుండలేను, ఇంటికెళ్లిపోతాను. తనూజ గెలుపు.. ఏడ్చేసిన రీతూసుమన్ శెట్టిపై నేనెలా దూకాలి? అమ్మాయిలతో అయితే పర్లేదు కానీ, అబ్బాయిలతో ఎలా? ఇలాగైతే నన్ను ఇంటికి పంపించండి అని ఏడ్చింది. తర్వాత పిరమిడ్ కట్టు-పాయింట్స్ పట్టు గేమ్‌లో తనూజ- కల్యాణ్ గెలిచారు. ఈ గేమ్‌లో డిమాన్- రీతూ నాలుగో స్థానంలో నిలబడ్డారు. గేమ్ నీ వల్లే పోయిందన్నట్లుగా డిమాన్ చిరాకుపడటంతో రీతూ ఏడ్చింది. ఇక ఇంతటితో గేమ్స్ పూర్తయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. లీడర్ బోర్డ్‌లో దివ్య- భరణి ఫస్ట్ ప్లేస్‌లో , తనూజ- పవన్ కల్యాణ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు.తనూజ త్యాగంమొదటి స్థానంలో ఉన్నవారు డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్‌కి వెళ్లొచ్చన్నారు. రెండో ప్లేస్‌లో ఉన్న జట్టులో ఒక్కరికే సేఫ్ జోన్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు. సేఫ్ జోన్లో ఉంటానని కల్యాణ్ అనగానే తనూజ ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఇక్కడ శ్రీజ ప్లాన్ వర్కవుట్ అయింది. శ్రీజ- కల్యాణ్ ఒక టీమ్‌గా జత కడితే ఎవరో ఒకరు నష్టపోయే ఛాన్స్ ఉంటుందని ముందే ఆలోచించింది. అందుకనే ఇద్దరూ వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు కల్యాణ్ సేఫ్ జోన్లో ఎంటరయ్యాడు. ఇక కెప్టెన్ రాము, ఇమ్యూనిటీ గెలిచిన ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్య, కల్యాణ్ మాత్రమే ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలినవారంతా డేంజర్ జోన్లో ఉన్నారు.చదవండి: అందుకే బిగ్‌బాస్ ఇంటికి తాళం.. ఒకరోజు గ్యాప్‌తో మళ్లీ షురూ -
ప్రపోజ్ చేసిన కల్యాణ్.. కానీ చివరకు వరస్ట్ ఆటగాడిగా
బిగ్‌బాస్ షో ప్రేమ, రిలేషన్ లాంటి వాటికి పెట్టింది పేరు. ప్రతి సీజన్లోనూ ఏదో ఓ జంట తెగ కెమిస్ట్రీ పండించేస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాంటి జంటలు కనిపిస్తున్నాయి. అయితే కొన్నిరోజుల ముందు వరకు ట్రయాంగిల్ ప్రేమకథ కనిపించింది. కానీ ఇప్పుడు రెండు జంటల మధ్య సరదా ముచ్చట్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఎపిసోడ్లో జంటల్లో ఒకటైన తనూజ-కల్యాణ్ 'ప్రపోజల్' కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి ఈ విషయంపై దృష్టి పెట్టడం వల్లో ఏమో గానీ చివరకొచ్చేసరికి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్‌గా మిగిలాడు. ఇంతకీ 31వ రోజు ఏమేం జరిగింది?హౌస్మేట్స్ ఇమ్యూనిటీ సాధించేందుకు బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్లో పట్టు వదలకు, బెలూన్ టాస్క్ పోటీలు పెట్టారు. బుధవారం నేరుగా గేమ్స్ కాకుండా కాసింత డ్రామా నడిచింది. ఉదయం లేచిన తర్వాత బయట అలా తిరుగుతూ ఇమ్మూ, తనుజ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. నేను నీ బ్రదర్‌గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ అంటూ తనూజతో ఇమ్మూ... సినిమా డైలాగ్స్ కొట్టాడు. దీంతో నీ వయసెంత అని తనూజ అడిగింది. నీ కన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని ఇమ్మూ చెప్పాడు. ఫర్లేదు ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తానని తనూజ పంచ్ వేసింది. చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని, నాకెందుకు అని ఇమ్మూ.. కల్యాణ్ వైపు చూసి ఫన్ చేసేశాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌కి తాళం.. గంటల్లోనే మూసేసిన అధికారులు)కాసేపటి తర్వాత తనూజతో డిస్కషన్ పెట్టిన కల్యాణ్.. ఏదైనా ఛాన్స్ ఉంది, నాలాంటోడు అయితే నీకు ఓకేనా? అని నేరుగా ప్రపోజల్ పెట్టేశాడు. దీంతో తనూజ.. అందుకే నిన్ను పిల్లాడు అనేది అని నవ్వుకుంది. ఏ పరిస్థితుల్లోనైనా కూల్, కామ్‌గా డీల్ చేసే పర్సన్.. ఒకరు వంద మాటలు మాట్లాడినా ఒకే మాటలో దాన్ని ఫసక్ చేసి, ఆ టాపిక్‌ని తెగ్గొట్టే సత్తా, అన్నింటినీ మించి నా మైండ్ సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తి అంటే నాకు ఇష్టం అని తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో తనూజ చెప్పింది. దీంతో కల్యాణ్ సైలెంట్ అయిపోయాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఇమ్మూ-రీతూ చౌదరి కౌంటర్స్ వేసి నవ్వుకున్నారు.మళ్లీ గేమ్స్ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. 'మ్యాచ్ ఇట్ విన్ ఇట్' అనే టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా జట్టు సభ్యుల్లోని ఒకరు.. యాక్టివిటీ ఏరియాలోని మ్యూజియంకు వెళ్లి అక్కడున్న వస్తువుల్ని గమనించి.. మళ్లీ లివింగ్ ఏరియాకు వచ్చి బోర్డుపై దాని బొమ్మ గీస్తారు. జట్టులోని మరో సభ్యుడు.. ఆ వస్తువు లేదా బొమ్మ ఏంటని సరిగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ పోటీలోని తొలి రౌండ్లో దివ్య-భరణి గెలిచారు. తర్వాత వరస రౌండ్లలో ఫ్లోరా-సంజన, శ్రీజ-సుమన్, రీతూ-పవన్ గెలిచారు. తనూజ-కల్యాణ్ జోడీ మాత్రం ఓడిపోయారు. తనూజ బొమ్మలు బాగానే వేసినప్పటికీ కల్యాణ్ వాటిని గుర్తుపట్టలేకపోయాడు.దీని తర్వాత 'హోల్డ్ ఇట్ లాంగ్' అనే మరో టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా కేటాయించిన ఫ్లాట్‌ఫామ్ రెండు వైపుల నిలబడి, తాళ్లతో ఉన్న హ్యాండిల్స్‌తో ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచి పట్టుకోవాలి. టాస్క్ ముగిసేవరకు ఏ జట్టు.. ఫ్లాట్‌ఫామ్‌ని గాలిలో ఉంచగలుగుతారో వాళ్లు గెలిచినట్లు. అయితే ఈ గేమ్‌లోనూ కల్యాణ్-తనూజ ఓడిపోయారు. లెక్క ప్రకారం పవన్-రీతూతో పాటు వీళ్లు చాలాసేపు ఉన్నారు. కానీ కల్యాణ్.. మాట్లాడి తనూజని డిస్టర్బ్ చేశాడు. దీంతో ఓడిపోయారు. తర్వాత తనూజ.. కల్యాణ్‌పై గట్టిగా అరిచేసింది. కళ్యాణ్ ఫోకస్ ఉండాల్సింది దానిపైన కద కళ్యాణ్.. నా ముఖం మీద కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది అని గట్టిగానే ఇచ్చేసింది. లీడర్ బోర్డ్‌లో పవన్-రీతూ (190 పాయింట్స్), సంజన-ఫ్లోరా (180), దివ్య-భరణి (180), తనూజ-కల్యాణ్ (110), శ్రీజ-సుమన్ శెట్టి(90) వరస స్థానాల్లో నిలిచారు. ఇక డేంజర్ జోన్లో కల్యాణ్, శ్రీజ, సుమన్ నిలిచారు. అందరూ కలిసి కల్యాణ్.. వరస్ట్ ప్లేయర్ అని డిసైడ్ చేశారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. స్టార్ హీరోని మళ్లీ బతికించారు) -
నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు.. కోపంతో ఊగిపోయిన దివ్య
బిగ్‌బాస్ 9 (Bigg Boss Telugu 9) నుంచి ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, మాస్క్ మ్యాన్ హరీశ్.. వరుసగా షోకి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు ఐదో వికెట్ కోసం నామినేషన్స్ మొదలయ్యాయి. ఈ మేరకు ఓ ప్రోమో వదిలారు. కెప్టెన్ రాము మినహా అందరూ నామినేట్ అయినట్లు ప్రకటించాడు. కానీ ఇక్కడే ఓ అవకాశం కల్పించాడు. ఇమ్యూనిటీ దక్కించుకుని ఈ గండం గట్టెక్కవచ్చని తెలిపాడు. బలమున్నోడిదే గెలుపుఅందుకోసం ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఓ పెద్ద బెడ్‌ను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. నామినేట్ అయినవాళ్లంతా ఆ బెడ్ ఎక్కి.. ఒక్కొక్కరిని కిందకు తోసేస్తూ ఉండాలి. బెడ్‌పై చివరివరకు ఉన్నవారికి ఇమ్యూనిటీ అందుతుంది. మొదట అందరూ కలిసి ఫ్లోరాను, తర్వాత సంజనాను తోసేసినట్లు తెలుస్తోంది. సుమన్, డిమాన్ పవన్‌ను కూడా తోసేశారు. దివ్యను తీసేయడానికి వస్తుంటే ఆమె తిరగబడింది. ఏ కారణంతో తీసేస్తున్నారని నిలదీసింది. ఎవరికీ ఏం పాయింట్ లేదని ఇమ్మాన్యుయేల్ కూల్‌గా ఆన్సరిచ్చాడు. నిలదీసిన దివ్యదాంతో దివ్యకు మరింత తిక్కరేగింది. ఈ రౌండ్లో నేనే దొరికానా? ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్పులు పోతాయి, మీ బాండ్లు పోతాయి.. అని ఆవేశంతో ఊగిపోయింది. దీంతో శ్రీజ.. ధైర్యం, దమ్ము అనే పదాలు అనవసరంగా వాడుతున్నావని కౌంటరిచ్చింది. భరణి అన్న నిన్ను తోసేయడానికి రాలేదు.. అంటే స్నేహం కోసం ఆగిపోయాడా? అని నిలదీసింది. అలా గొడవలు, తోసుకోవడాలతోనే ఈ గేమ్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఫ్లోరా, సుమన్, డిమాన్ పవన్, సంజనా, తనూజ, రీతూ చౌదరి, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇది ఐదో నెల సీమంతం.. మళ్లీ గ్రాండ్‌గా జరుపుకుంటా!: శివజ్యోతి -
జడుసుకున్న దివ్య.. రీతూ ఓవరాక్షన్! ఆ ముగ్గురు మాస్క్‌తోనే..
Bigg Boss Telugu 9: సండే ఎపిసోడ్ అంటే ఆటపాటలతోనే సాగిపోతోంది. కానీ ఈ సీజన్లో హుషారుగా డ్యాన్సులే చేయడం లేదు. ఇక ఫిజికల్ టాస్కుల్లో తోపులనిపించుకునే డిమాన్ పవన్, పవన్ కల్యాణ్ మైండ్ గేమ్‌లో చాలా వీక్ అని ఇట్టే తేలిపోయింది. హరీశ్ ఎలిమినేషన్‌తో ఇద్దరు షాక్‌లో ఉన్నారు. ఇంకా ఏం జరిగిందో నేటి (అక్టోబర్ 5వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..సరదా గేమ్స్నాగార్జున (Nagarjuna Akkineni) ఫస్ట్ హౌస్‌మేట్స్‌తో కొన్ని గేమ్స్ ఆడించాడు. కొందరికి ఫిజికల్ గేమ్, మరికొందరికి మైండ్ గేమ్, ఇంకొందరికి ఇమిటేట్ చేయమని టాస్క్.. ఇలా రకరకాల పనులు అప్పగించాడు. పవన్, కల్యాణ్ ఇద్దరూ మైండ్ గేమ్స్‌లో వీక్ అని చెప్పకనే చెప్పారు. రీతూ.. తనకు బలం బాగానే ఉందని నిరూపించింది. ఇక ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వస్తున్న నాగ్.. రీతూ చౌదరి సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఏడ్చేసిన రీతూఅయితే ఎలిమినేట్ అవుతానని ఊహించిందో, ఏమో కానీ రీతూ (Rithu Chowdary) ఒక్కసారిగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు చూసి నాగ్ సైతం షాకయ్యాడు. దీంతో తనవి ఆనంద భాష్పాలు అంటూనే ఐ లవ్యూ సర్ అంది. ఇన్ని సీజన్స్ చేశాను.. ఇటువంటి రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపోయాడు నాగ్. రీతూ ఏడుపు కాస్త ఓవరాక్షన్లాగే కనిపించింది. చివర్లో హరీశ్, దివ్య మిగిలారు. వీరిలో హరీశ్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించాడు. వైల్డ్ కార్డ్‌గా వచ్చాను, పంపించేస్తారేమో అని భయంతో ఉన్న దివ్యకు తను సేఫ్ అని తెలియగానే అప్పటిదాకా ఉన్న భయం అంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. శ్రీజకు తుత్తర ఎక్కువేఇక హరీశ్ (Mask Man Harish) వెళ్లిపోయే ముందు హౌస్‌లో మాస్క్ వేసుకున్న వారి బండారం బయటపెట్టాడు. ఇమ్మాన్యుయేల్, భరణి, డిమాన్ పవన్.. ముగ్గురూ మాస్క్ వేసుకున్నారని, ఒరిజినాలిటీ, శక్తి సామర్థ్యాలు ఇంకా బయటకు రావాలని చెప్పాడు. శ్రీజ, తనూజ, పవన్ కల్యాణ్ మాస్క్ వేసుకోలేదన్నాడు. శ్రీజకు తుత్తరెక్కువే.. 10 సెకన్లు ముందే ఉంటుంది. ముందూవెనక ఆలోచించకుండా టకటకా మాట్లాడుతుంది. కానీ కొన్నిసార్లు బుల్లెట్‌లాంటి పాయింట్స్ పెడుతుంది. రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయ్కల్యాణ్.. అగ్నిపరీక్షలో నేను నాన్న అని పిలిచింది ఒక్కర్నే.. తను తనలా ఉన్నారని నమ్ముతున్నా.. కొంచెం ఆ రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా బాగా ఆడగలరు. తనూజ.. ఆమెలో నన్ను నేను చూసుకుంటా.. మా ఇద్దరి ఫేస్ సీరియస్‌గా ఉన్నట్లు ఉంటుంది, కానీ మనసులో ఏం ఉండదు. కాకపోతే ముక్కుమీద కోపం ఎక్కువ. అందుకే అసహనం, చిరాకు కనిపిస్తుంది. రిలేషన్స్ దాంట్లో పడిపోతే గేమ్‌పై ఫోకస్, క్లారిటీ మిస్ అవుతాం అని సలహాలు, సూచనలు ఇచ్చి హరీశ్ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: ఆ కారణం వల్లే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్! రెమ్యునరేషన్ ఎంతంటే?


