తండ్రితో బిగ్‌బాస్‌ 'తనూజ'.. ఫోటో గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ | Bigg Boss Thanuja Puttaswamy Photo With her father gift from Fans | Sakshi
Sakshi News home page

తండ్రితో బిగ్‌బాస్‌ 'తనూజ'.. ఫోటో గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌

Jan 10 2026 7:21 PM | Updated on Jan 10 2026 7:39 PM

Bigg Boss Thanuja Puttaswamy Photo With her father gift from Fans

తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌లో తనూజ, కల్యాణ్‌ పడాల జోడీకి అభిమానులు భారీగానే ఉన్నారు. అందుకే వారిద్దరూ మరోసారి ఏదైనా ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.  ఈ క్రమంలోనే సంక్రాంతి సందర్భంగా స్టార్‌మా ఒక ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. 'మా సంక్రాంతి వేడుక' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సందడి చేశారు. జనవరి 14న మధ్యాహ్నం 12గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. తాజాగా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

తనూజకు ఫోటో గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌
'ముద్దమందారం' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇదే తనకు తొలి సీరియల్‌. తను ఇండస్ట్రీలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదని, అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడరని ఆమె బాధ పడింది. బిగ్‌బాస్‌ ఫైనల్‌ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది. కానీ, ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా రివీల్‌ చేయలేదు. కానీ, ఆమె ఫ్యాన్స్‌ AI ఫోటోతో సర్‌ప్రైజ్‌ చేశారు. తనూజ తన తండ్రి పుట్టస్వామితో ఉన్న ఫోటోను చక్కగా ఫ్రేమ్‌ చేసి గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement